Image%201

సింపుల్ గా చెప్పాలంటే, బోధిసత్వుడు అంటే తెలివైన మరియు దయగల వ్యక్తి, అతను మిగతావాళ్లందరిని ప్రేమిస్తాడు. నిజానికి, బయట చాలా తెలివైన, మరియు దయగల వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ నుంచి బోధిసత్వుడిని భిన్నంగా చూపించేది ఏమిటి? ముందుగా, బోధిసత్వులు ఇతరులకు మంచి జరగాలని కోరుకోవడమే కాకుండా, ఇతరుల బాధలను తొలగించడానికి సహాయపడే అనేక నైపుణ్యమైన పద్ధతులను వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళు నిజానికి అందరికి సహాయం చేయడానికి అవిశ్రాంతంగా పనిచేస్తారు. బోధిసత్వులు అన్ని సమస్యల యొక్క లోతైన మూలాన్ని అర్థం చేసుకుని మళ్ళీ అటువంటి సమస్యలు రాకుండా ఉండటానికి ఈ మూలాన్ని అంతం చెయ్యడం కుదురుతుందని నమ్ముతారు. ఈ జ్ఞానం, లక్ష్యమే బోధిసత్వుని కరుణను అంత శక్తిమంతం చేస్తుంది.

బోధిసత్వ అనే పదం రెండు సంస్కృత పదాల నుంచి వచ్చింది: "బోధి", అంటే "జ్ఞానోదయం", మరియు "సత్వ" అంటే "ఉనికి". ప్రారంభ బౌద్ధమత బోధనలలో, బుద్ధ శాక్యమునికి తన జ్ఞానోదయానికి ముందు అతనిని పిలవడానికి "బోధిసత్వ" అనే పదాన్ని వాడారు. ఉదాహరణకు బుద్ధుని గత జన్మల కథల్లో ఆయనను బోధిసత్వుడిగా వర్ణిస్తారు. ఈ విధంగా, అసంఖ్యాకమైన జీవితాల పునరుద్ధరణ కోసం నమ్మశక్యం కాని కృషిని, శక్తిని వెచ్చించిన బుద్ధుని లాగా, బోధిసత్వుడు సమస్త ప్రాణులకు ప్రయోజనం చేకూర్చడానికి జ్ఞానోదయం వైపు ప్రయాణం చేసే వ్యక్తి అని అర్ధం. వారు దీన్ని ఎందుకు చేస్తారంటే వారికి ఇంకా చాలా పరిమితులు ఉన్నాయని వాళ్ళు గ్రహిస్తారు. ఇతరులకు సహాయం చేయడానికి వారికి అనేక మార్గాలు తెలిసినప్పటికీ, ప్రతి వ్యక్తికి ఏ పద్ధతి బాగా సరిపోతుందో వాళ్ళు పూర్తిగా చూడలేరు. ఈ విషయం బుద్ధుడికి మాత్రమే తెలుసు. కాబట్టి, ఇతరులకు వీలైనంత సహాయం చేస్తూనే, వాళ్ళు బుద్ధుడిగా మారడానికి బాగా కష్టపడుతున్నారు.

సకల ప్రాణుల విముక్తి కోసం కృషి చేస్తామని బోధిసత్వులు ప్రతిజ్ఞ చేస్తారు. కాబట్టి, వారి అంతిమ లక్ష్యం కేవలం తాము జ్ఞానోదయాన్ని పొందడం మాత్రమే కాకుండా, సమస్త జీవులు జ్ఞానోదయాన్ని అందించడం. వారి గొప్ప కరుణ కారణంగా, ఇతరులకు సహాయం చేయడానికి వారు తమ స్వంత జ్ఞానోదయంతో వాళ్ళు ఆధ్యాత్మిక మార్గదర్శకులుగా మరియు సంరక్షకులుగా గౌరవించబడతారు.

బోధిసత్వుని యొక్క ఆచరణలు మరియు లక్షణాలు

బోధిసత్వులకు దాదాపు బుద్ధునికి ఉండే అనేక లక్షణాలు ఉన్నాయి. వారు వాటిని ఇంకా పెంపొందించుకుని జ్ఞానోదయానికి దగ్గరవుతారు మరియు ఇతరులకు మరింత ప్రయోజనం చేకూర్చడంలో సహాయపడతారు. బోధిసత్వులకు ఉన్న లక్షణాలలో ఇవి ఉన్నాయి:

  • కరుణ - బోధిసత్వులు సమస్త ప్రాణులను ఆరాధిస్తారు. మనలో చాలా మంది మనకే ప్రథమ స్థానం ఇస్తాం, కానీ బోధిసత్వులు ఇతరులను తమకంటే ముందు ఉంచుతారు. సమస్త జీవరాశులను తమ ముద్దుబిడ్డగా చూసుకునే తల్లి లాగా ఉంటారు. ఆ బిడ్డ అనారోగ్యానికి గురైనప్పుడు, తల్లి తమ బిడ్డ బాధను చూసి తట్టుకోలేక, ఏమి చెయ్యటానికి అయినా సిద్ధంగా ఉంటుంది. అదే విధంగా బోధిసత్వులు కూడా మనలో ఎవరన్నా బాధపడితే సహించలేరు. వారు అందరినీ సమానంగా చూసుకోవాలని కోరుకుంటారు, వారు తమకు వీలైనప్పుడల్లా సహాయం చేస్తూనే ఉంటారు. 
  • జ్ఞానం - బోధిసత్వులు ఏది సహాయకారిగా ఉంటుందో, ఏది హానికరమైనదో గుర్తించగలుగుతారు. వారు వాస్తవికతను ఊహల నుంచి వేరు చెయ్యగలరు. ఈ లోతైన అవగాహనలు ఇతరులను మోక్షం వైపు నడిపించడానికి వారికి సహాయపడతాయి.
  • నైపుణ్య మార్గాలు – బోధిసత్వులు ఇతరులకు ఎలా సహాయం చేయాలో తెలుసుకోవడంలో నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు. అలా చేయడానికి వాళ్ళు వివిధ పద్ధతులను ఉపయోగిస్తారు.
  • దయా గుణం- బోధిసత్వులు భౌతిక ఆస్తుల పరంగా, సమయం, శక్తి పరంగా దయను కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయడానికి వారు తమ వద్ద ఉన్న ప్రతిదాన్ని ఇచ్చెయ్యడానికి సిద్ధంగా ఉంటారు, మరియు వారు తమ ఆస్తులు లేదా విజయాలతో అనుబంధాన్ని పెంచుకోరు.
  • సహనం - బోధిసత్వులు తమతో, ఇతరులతో చాలా సహనంగా ఉంటారు. జ్ఞాన మార్గం సుదీర్ఘమైనదని వారు అర్థం చేసుకుంటారు, మరియు వారు ఇతరులకు వెంటనే సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు.
  • నైతిక ప్రవర్తన - బోధిసత్వులు నైతిక ప్రవర్తనకు కట్టుబడి ఉంటారు, అంటే వారు ఇతరులకు హాని కలిగించే పనులను చెయ్యకుండా, సమస్త జీవులకు ప్రయోజనకరమైన వాటినే చేస్తారు.
  • ధైర్యము - బోధిసత్వులు ధైర్యవంతులు, మరియు సాహసోపేతమైనవారు. ఇతరులకు సహాయం చేయడానికి అడ్డంకులను, సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. క్లిష్ట పరిస్థితులకు భయపడరు లేదా ఇతరులకు ప్రయోజనం చేకూర్చడానికి రిస్క్ తీసుకోవటానికి భయపడరు.
చైనాలోని 4వ శతాబ్దానికి చెందిన మైజిషాన్ గ్రోటోస్ కు చెందిన బోధిసత్వ విగ్రహాలు.

ప్రస్తుతం కార్యాచరణలో ఉన్న బోధిసత్వము 

బోధిసత్వానికి గొప్ప ఉదాహరణ పద్నాలుగవ దలైలామా గారు. అతను తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు నిర్విరామంగా, ఆగకుండా పనిచేస్తారు. అతను ప్రతిరోజూ తెల్లవారుజామున 3 గంటలకు చాలా సేపు ధ్యానంతో ప్రారంభిస్తారు మరియు తరువాత మిగిలిన సమయంలో ఇతరులను కలవడానికి మరియు సహాయం చేయడానికి కేటాయిస్తారు.

ఒక సారి గురువు గారు చాలా దూరం ప్రయాణం చేసి స్పితికి వచ్చారు. అప్పటికే చాలా రోజులుగా ఆయన బోధిస్తూ వచ్చారు. అప్పటికే ఆయన గొంతు పోయింది. ఆయనను ఇంకా కష్టపెట్టడం ఇష్టంలేక, నేను కూర్చొని ఓం మణి పద్మే హమ్ అనే కరుణ మంత్రాన్ని ప్రేక్షకులకు చెప్పమని కోరాను, దానికి ఆయన అంగీకరించారు. కానీ ఆ బోధన ప్రారంభమైన తర్వాత, నేను దీనిని తేలికగా తీసుకోమని కోరినప్పటికీ, అతను బాగా నిమగ్నమయి ఎవరి సమయాన్ని వృధా చేయకుండా బోధించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఆ తర్వాత అతను దాదాపు 3 గంటల పాటు నిరంతరాయంగా ‘అన్ని మంచి గుణాల ఫౌండేషన్స్’ గురించి బోధించారు, ఈ సమయంలో అతని గొంతు నయం అయ్యింది.

టీచింగ్ అయిపోయిన తర్వాత, నేను అతన్ని తన గదికి తీసుకువెళ్ళాను, అప్పుడు అతను తన బయటి దుస్తులు విప్పి సోఫాలో పడుకున్నారు, అతను చాలా అలసిపోయానని నేను ఇక వెళ్లవచ్చని చెప్పారు. కానీ నాకు అతని ముఖంలో ఎలాంటి అలసట కనిపించలేదు. నిజానికి, పూర్తి శక్తితో నిండిన ముఖాన్ని మాత్రమే నేను చూశాను. 80 ఏళ్ల వయసున్న ఏ సామాన్యుడు కూడా ఇలా పనిచేయలేడని అప్పుడు నాకు అనిపించింది. దలైలామా గారు నిజంగా అద్భుతం!

దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటా అని నేను ఆశ్చర్యపోయాను. అది ఇంకేమిటో కాదు - కరుణ. ఇతరులను బాధల నుండి శాశ్వతంగా బయటపడేలా చెయ్యటానికి అతను అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. మనం 4 లేదా 5 గంటలు వీడియో గేమ్స్ ఆడి అలసిపోవచ్చు, కానీ అతను అలసిపోకుండా ఇతరులకు సహాయం చేయడం మాత్రమే ప్రయోజనకరంగా ఉంటుందని అనుకుంటారు. బోధి సత్వ లక్షణాలైన కరుణ, జ్ఞానం, ధైర్యసాహసాలు మొదలైన వాటిని గమనిస్తే భగవంతుని పవిత్రత ఒకటే అని నిస్సందేహంగా మనం స్పష్టంగా చూడవచ్చు.

సారాంశం

బోధిసత్వులు శక్తివంతమైన మరియు దయగల మార్గదర్శకులు, వారు జ్ఞాన మార్గంలో తమ అనుచరులకు సహాయం చేస్తారు. వారు తమ నిస్వార్థమైన పనులు మరియు బోధనల ద్వారా బౌద్ధులకు ఆదర్శంగా నిలుస్తారు మరియు అదే లక్షణాలను మనలో పెంపొందించుకునేలా ప్రేరేపిస్తారు. అలాగే, బోధిసత్వులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలియన్ల మంది బౌద్ధుల ఆధ్యాత్మిక జీవితాలలో గణనీయమైన పాత్రను పోషిస్తూ ఉన్నారు. వారి స్వంత జీవితంలో ఎక్కువ జ్ఞానం మరియు కరుణను పొందాలనుకునే వారికి ప్రేరణను మరియు మార్గదర్శకత్వాన్ని అందిస్తారు.

బయట, ఎవరైనా బోధిసత్వుడా కాదా అని చెప్పడానికి ఎలాంటి గుర్తు లేదు, కానీ మనలో ప్రతి ఒక్కరూ బోధిసత్వుడిగా మారవచ్చు. సమస్త జీవరాశులకు సహాయం చేయాలనే లక్ష్యంతో మనం బుద్ధునిగా మారడానికి కృషి చేస్తుంటే మనం బోధిసత్వులం అయినట్టు. ఇతరులకు సహాయం చేయాలనే కోరిక మాత్రమే కాదు, మన సమయాన్ని, శక్తిని సమస్త ప్రాణుల కోసం వెచ్చించే సామర్థ్యం ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. మనం నిజంగా ఇతరులకు సహాయం చెయ్యాలని అనుకుంటే ముందుగా మనం ఒక బోధిసత్వుడిగా మారాలి, ఆ తర్వాత బుద్ధుడిగా మారడానికి కృషి చేయాలి. జీవితాన్ని మరింత అర్థవంతంగా మార్చేది ఇంకేదీ లేదు.

Top