వ్యక్తిగత డొమైన్
శ్రద్ధ మరియు సొంత-అవగాహన
మన శరీరాన్ని మరియు దాని అనుభూతులను పట్టించుకోవడం
- మన శరీరంలో ఏమి జరుగుతుందో పట్టించుకోవడం.
- హైపర్ మరియు హైపో-ఉద్రేకం యొక్క స్థితిని గమనించడం (ఆందోళన, కోపం, బద్ధకం, నిరాశ మొదలైనవి).
- ఒక సమతుల్య శరీరం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడం.
మన భావోద్వేగాలు మరియు ఫీలింగ్స్ ను పట్టించుకోవడం
- బుద్ధిపూర్వకత లాంటి అభ్యాసాలతో మన మనస్సులపై దృష్టి పెట్టడం.
మనసుకు సంబంధించిన మ్యాప్ ను అనుసరించడం
- భావోద్వేగాలు, వాటి లక్షణాలు మరియు వాటికి దారితీసే మరియు ప్రోత్సహించే వాటిని గుర్తించగలగడం.
- వినాశకరమైన భావోద్వేగాలు నిర్వహించలేని భావోద్వేగ స్థితులుగా మారడానికి ముందు వాటిని ఎలా గుర్తించాలో మరియు ఎదుర్కోవాలో నేర్చుకోవడం.
సొంత-కరుణ
సందర్భాన్ని బట్టి భావోద్వేగాలను అర్థం చేసుకోవడం
- మన భావోద్వేగాలు మన విలువలు, అవసరాలు మరియు ఆకాంక్షలతో ఎలా సంబంధాన్ని కలిగి ఉన్నాయో తెలుసుకోవడానికి విమర్శనాత్మక ఆలోచనను ఉపయోగించడం.
- మన విలువను మెచ్చుకోవడం మరియు సొంత-విలువ మరియు అంతర్గత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం.
సొంత అంగీకారం
- మన పరిమితులు మరియు శక్తుల గురించి రియలిస్టిక్ ఆలోచనలను కలిగి ఉండటం.
- మనోధైర్యం, స్థితిస్థాపకత, వినయం మరియు ధైర్యాన్ని పెంపొందించుకోవడం.
- నిరాశ మరియు బాధలు అనేవి జీవితంలో సహజమైన భాగమే అని అర్థం చేసుకోవడం.
సొంత నియంత్రణ
వీటితో శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం (మన భౌతిక శరీరాలను చురుకైన, స్థితిస్థాపక మరియు సమతుల్య స్థితికి తీసుకురావడం):
- రిసోర్స్ లతో, ఇక్కడ మనం స్నేహితుడు, ఇష్టమైన ప్రదేశం లేదా ఆహ్లాదకరమైన జ్ఞాపకాలు లాంటి రిసోర్స్ లను యాక్సెస్ చేసుకుంటాము.
- గ్రౌండింగ్, మనకు సహాయం చేసి రక్షణ అనుభూతిని కలిగించే ఒక వస్తువుకు అతుక్కుపోవడం.
- యోగా, తై-చి, సంగీతం వినడం, డ్రాయింగ్ లేదా ధ్యానం లాంటి కార్యకలాపాలు.
అభిజ్ఞా మరియు ప్రేరణ నియంత్రణ
- మన దృష్టి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం, అలా మనం పరధ్యానంలో చిక్కుకోకుండా మన దృష్టిని నిలుపుకోగలుగుతాము.
భావోద్వేగాలను నావిగేట్ చెయ్యడం
- ఏ భావోద్వేగాలు సహాయపడతాయో మరియు ఏవి హానికరమో అని గుర్తించడానికి భావోద్వేగ విచక్షణను అభివృద్ధి చెయ్యడం.
- ఈ పని మనల్ని నియంత్రించడానికి బదులుగా మన భావోద్వేగ స్థితులను మనం నియంత్రించగలమనే ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం యొక్క భావనగా రూపాంతరం చెందడానికి అనుమతిస్తుంది.
సామాజిక డొమైన్
వ్యక్తిగత అవగాహన
మన సామాజిక రియాలిటీను పట్టించుకోవడం
- మనం సామాజిక జీవులమని అర్థం చేసుకోవడం.
- మన జీవితాల్లో ఇతరులు ఎలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారో అన్వేషించడం.
ఇతరులతో మన పరస్పర రియాలిటీను పట్టించుకోవడం
- మనలాగే ఇతరులకు కూడా భావోద్వేగ జీవితాలు ఉన్నాయని అర్థం చేసుకోవడం.
- మన కోరికలు, అవసరాలు మరియు భయాల లాగా అందరికి ఒకేలా ఉన్నాయని తెలుసుకోవడం.
- ఈ కోరికలు, అవసరాలు మరియు భయాలు ఒక వ్యక్తి నుంచి వేరొక వ్యక్తికి మారుతూ ఉంటాయనే నిజాన్ని గౌరవించడం.
వైవిధ్యం మరియు తేడాను అభినందించడం
- మనందరికీ మనల్ని మార్చే ప్రత్యేకమైన జీవిత అనుభవాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం.
- విభేదాలు మనల్ని విడదీయడం కంటే ఒకటిగా చెయ్యగలవని అర్థం చేసుకోవడం.
ఇతరుల పట్ల జాలి
సందర్భాన్ని బట్టి ఇతరుల భావాలు మరియు ఫీలింగ్స్ ను అర్థం చేసుకోవడం
- ఇతరుల పనులు భావోద్వేగాల ద్వారా ప్రేరేపించబడతాయని అర్థం చేసుకోవడం, ఇది మన లోపలి అవసరాల నుంచి వస్తుంది.
- కోపం మరియు తీర్పుతో కాకుండా కరుణతో ప్రజలు చేసే పనులకు ప్రతిస్పందించడం.
దయ మరియు కరుణను మెచ్చుకోవడం మరియు పెంపొందించుకోవడం
- కరుణ అంటే ఏమిటి మరియు ఏది కాదు అని తెలుసుకోవడం.
- కరుణను ప్రయోజనకరమైనదిగా భావించి, దాన్ని పెంపొందించుకోవాలని అనుకోవడం.
ఇతర నైతిక స్వభావాలను మెచ్చుకోవడం మరియు పెంపొందించుకోవడం
- కేవలం భౌతిక ఆస్తులు మాత్రమే మన అవసరాలన్నీ తీర్చలేవని తెలుసుకోవడం.
- మన జీవితాలకు ఉపయోగపడే ఇతర అంతర్గత లక్షణాలను అన్వేషించడం.
- సొంత-కేంద్రీకృత వైఖరి యొక్క నష్టాలను తెలుసుకోవడం.
- ఇతరుల పట్ల సహానుభూతి మరియు క్షమాగుణాన్ని పెంపొందించుకోవడం.
సంబంధ నైపుణ్యాలు
సానుభూతితో వినడం
- ఓపెన్ మైండ్ తో ఇతరులు చెప్పేది వినడం.
- "లోతుగా వినడం" లాంటి వాటిని ప్రాక్టీస్ చెయ్యడం, ఇక్కడ మనం ఇతరులు చెప్పేదాన్ని ఏమీ అనకుండా లేదా తీర్పు ఇవ్వకుండా వినడం.
నైపుణ్యంతో కూడిన సంభాషణ
- మనకు మరియు ఇతరులకు ఉత్పాదక మరియు సాధికారత కలిగించే విధంగా సంభాషించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం.
- స్నేహితులతో విషయాలను చర్చించడం మరియు సాధారణంగా మనం వ్యతిరేకించే వైపు మాట్లాడడం.
ఇతరులకు సహాయం చెయ్యడం
- సమాజ సేవ, స్వచ్ఛంద సేవ మరియు యాదృచ్ఛిక దయాగుణ పనులలో పాల్గొనడం.
గొడవల పరివర్తన
- గొడవలను విజయవంతంగా నావిగేట్ చెయ్యడం నేర్చుకోవడం.
- బయటి శాంతికి పునాది అయిన అంతర్గత శాంతిని పెంపొందించుకోవడం.
గ్లోబల్ డొమైన్
పరస్పర ఆధారాన్ని మెచ్చుకోవడం
పరస్పర ఆధారిత వ్యవస్థలను అర్థం చేసుకోవడం
- పరస్పర ఆధారాన్ని అర్థం చేసుకోవడం అనేది ఒక ప్రకృతి నియమం మరియు ఈ మానవ జీవితం యొక్క ప్రాథమిక రియాలిటీ.
- ఇతరులు లేకుండా మనం బతకలేమని తెలుసుకోవడం.
ఒక వ్యవస్థ విషయంలో ఉండే వ్యక్తులు
- ఇతరుల పట్ల నిజమైన కృతజ్ఞతా భావాన్ని చూపించడం.
- ఇతరుల జీవితాలను బాగుచేసే మన సామర్ధ్యం గురించి లోతైన అవగాహనను పెంపొందించుకోవడం.
- విస్తృత శ్రేయస్సును నిర్ధారించే పనులు చెయ్యాలనే ఆకాంక్షను పెంపొందించడం.
సామాన్య సమానత్వాన్ని గుర్తించడం
అందరి ప్రాథమిక సమానత్వాన్ని మెచ్చుకోవడం
- సంతోషాన్ని కోరుకోవడంలో మరియు బాధపడకూడదని కోరుకోవడంలో అన్ని చోట్లా మనుషులు ప్రాథమికంగా సమానమని గ్రహించడం.
- మన "గ్రూప్" బయట ఉన్నవారిని చేర్చుకోవడానికి మన సహానుభూతి యొక్క పరిధిని విస్తరించడం.
వ్యవస్థలు శ్రేయస్సు ద్వారా ఎలా ప్రభావితమవుతాయో మెచ్చుకోవడం
- పాజిటివ్ విలువలను ప్రోత్సహించడం ద్వారా లేదా సమస్యాత్మక నమ్మకాలు మరియు అసమానతలను శాశ్వతం చెయ్యడం ద్వారా మనపై ప్రభావం చూపించే సాంస్కృతిక, రాజకీయ మరియు సామాజిక వ్యవస్థలను అనలైజ్ చెయ్యడం.
సమాజం మరియు ప్రపంచ అనుసంధానం
సమాజం మరియు ప్రపంచంలో పాజిటివ్ మార్పును కలిగించే మన సామర్థ్యం
- మనకు పరిమితులు ఉన్నప్పటికీ, గొప్ప సామర్థ్యం కూడా ఉందని అర్థం చేసుకోవడం.
- చిన్న వ్యక్తిగత మార్పులు పెద్ద ప్రపంచ మార్పులకు సహాయపడతాయని తెలుసుకోవడం.
సమాజం మరియు ప్రపంచ పరిష్కారాలలో నిమగ్నం కావడం
- మనం నివసిస్తున్న వ్యవస్థలు మరియు వాటి సంక్లిష్టతను తెలుసుకోవడం.
- మనం చేసే పనుల యొక్క స్వల్ప మరియు దీర్ఘకాలిక పర్యవసానాలను అంచనా వెయ్యడం.
- నెగెటివ్ భావోద్వేగాలు మరియు పక్షపాతం యొక్క ప్రభావాన్ని తగ్గించడం.
- ఓపెన్ మైండెడ్, సహకరాత్మక మరియు మేధోపరంగా వినయపూర్వక వైఖరిని పెంపొందించడం.
- ఏదైనా నిర్దిష్ట పని యొక్క లాభనష్టాలను పరిగణనలోకి తీసుకోవడం.
మీరు దీని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే, SEE లెర్నింగ్ ఫ్రేమ్ వర్క్ యొక్క పూర్తి వెర్షన్ ను చదవండి మరియు సెంటర్ ఫర్ కంటంప్లేటివ్ సైన్స్ మరియు కంపాషన్-బేస్డ్ ఎథిక్స్ యొక్క మిగతా ప్రోగ్రామ్ ల గురించి తెలుసుకోండి.