మన రోజువారీ జీవితంలో నైతికత మరియు విలువలను ఉపయోగించడాన్ని "అప్లైడ్ నైతిక విలువలు" అని అంటారు. దీనికి ఆధునిక పదం "లైఫ్ ఎడ్యుకేషన్" కావచ్చు, ఇది వ్యక్తిగత నిరాశ మరియు సామాజిక అశాంతి రెండింటి యొక్క సవాళ్లకు సమాధానాన్ని ఇస్తుంది. వ్యక్తిగత స్థాయిలో, ఇది ఒకరి జీవితాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది, కానీ సామాజిక స్థాయిలో, పురోగతి మరియు అభివృద్ధికి అవసరమైన ఇతరులతో పాజిటివ్ సంబంధాలను ఎలా ఏర్పరచుకోవాలో నేర్చుకోవడానికి సహాయపడుతుంది. సార్వత్రిక నైతికత కీలక పాత్రను పోషిస్తుంది.
ఇలాంటి నైతిక విలువలు మనకు ఎక్కడ లభిస్తాయి? అరిస్టాటిల్ లేదా జాన్ ఎఫ్. కెన్నెడీ లాంటి లౌకిక మూలాల మనుషుల నుంచి మనం వాటిని పొందవచ్చు, వాళ్ళు "మీ దేశం మీ కోసం ఏమి చెయ్యగలదో అని కాకుండా, మీరు మీ దేశం కోసం ఏమి చెయ్యగలరో ఆలోచించండి" అని చెప్పారు. మనం అలాంటి మాటలను మతాల నుంచి కూడా పొందవచ్చు. మతాలు ప్రజలను విభజిస్తాయని కొందరు అంటున్నప్పటికీ, మతంలో రెండు విషయాలు ఉన్నాయని మనం గమనించాలి: ఒక మతం నుంచి ఇంకొక మతానికి వేరుగా ఉండే వేదాంత శాస్త్రం, మరియు అన్ని మతాలకు సాధారణంగా ఉండే నైతిక వ్యవస్థలు. వాటన్నిటి నుంచి మన జీవిత సూత్రాలను మనం పొందుతాము కాబట్టి, సార్వత్రిక అప్లైడ్ నైతిక విలువలను రూపొందించడంలో మతాలు కూడా ఒక పాత్రను పోషిస్తాయని నేను చెప్తాను.
మౌలానా వహీదుద్దీన్ ఖాన్ స్థాపించిన ‘సెంటర్ ఫర్ పీస్ అండ్ స్పిరిచ్యువాలిటీ’ లో, మౌలానా గారు గత పదిహేడేళ్లుగా వీకెండ్స్ లో క్లాస్ లను నడుపుతున్న అప్లైడ్ నైతికతకు ఆచరణాత్మక నమూనాను అభివృద్ధి చేశాము. ముందుగా వీటిని అనుసరించిన వేలాది మంది జీవిత అధ్యాపకులను మేము సిద్ధం చేసాము, ఆ తర్వాత వాళ్ళ గురించి ఇతరులకు చెప్పడానికి వెళ్ళాము, టీచర్స్ చెయ్యాల్సింది కూడా ఇదే. వాళ్ళు ముందు వీటిని అప్లై చేసుకోవాలి మరియు దాన్ని చెయ్యడం కొనసాగించాలి, ఇది ఒక జీవితకాల ప్రక్రియ. మనం మొదలుపెట్టి అలా చేస్తున్నప్పుడు, విద్యార్థులను కూడా వాటిని అప్లై చేసేలా సహాయపడాలి.
మేము అభివృద్ధి చేసినది ఒక పరిష్కారం. ఒక సమకాలీన ప్రపంచంలో శాంతిని ఎలా స్థాపించాలో నేను పరిశోధించాను, మరియు ప్రతి ఒక్కరిని శాంతి సంస్కృతి వైపు మార్చాల్సిన అవసరం ఉందని నేను గ్రహించాను. ఇది జరిగినప్పుడు, వాళ్ళు మేధోపరంగా అభివృద్ధి చెందుతారు, శాంతియుతంగా ఉంటారు మరియు సమాజంలో శాంతి, పురోగతి మరియు అభివృద్ధికి సహాయపడతారు. ఇది అంతర్జాతీయంగా దేశాలను అభివృద్ధి చేస్తుంది.
ఇంత వరకు, మేము ఒక వ్యక్తిత్వ వికాస కార్యక్రమాన్ని అభివృద్ధి చేశాము, దీని నుంచి నేను మూడు ప్రధాన సూత్రాలను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ సూత్రాలు లౌకిక మరియు మతపరమైన నైతికత రెండింటి నుంచి తీసుకోబడ్డాయి:
1. ఒక పాజిటివ్ ఆలోచన విధానం
మొదటిది పాజిటివ్ యాటిట్యూడ్ లేదా పాజిటివ్ మైండ్ సెట్. జైలులో ఇద్దరు వ్యక్తులు ఆ జైలు కిటికీలోంచి బయటకు చూస్తున్న కథ ఒకటి ఉంది. ఒకతను మట్టిని మాత్రమే చూస్తాడు, ఇంకొకడు నక్షత్రాలను చూస్తాడు. దీని అర్థం వేర్వేరు వ్యక్తులు ఒకే పరిస్థితిలో ఉన్నప్పుడు, మనం నెగెటివ్ గా ఉండి కేవలం మట్టిని మాత్రమే చూడొచ్చు, లేదా ఆ పరిస్థితి మనకు ఇచ్చే అవకాశాన్ని తీసుకోవచ్చు. మనం అభివృద్ధి చేసే ఎక్కువ అభిప్రాయాలు అవకాశాలను చూడటానికి మనకు అంతగా సహాయపడతాయి.
2. పాజిటివ్ ప్రవర్తన
రెండవది పాజిటివ్ ప్రవర్తన. అన్ని మతాల్లోనూ నైతిక విలువలకు ఒక గోల్డెన్ రూల్ ఉంటుంది. క్రైస్తవ మతంలో, "ఇతరులు మీకు ఎలా చెయ్యాలనుకుంటారో మీరు కూడా అలాగే చెయ్యండి" అని ఉంటుంది. అంటే మనం ఇతరుల నుంచి ఎలాంటి ప్రవర్తనను ఆశిస్తామో మనకు తెలుసు. మనకు చాలా నైతిక నియమాలు నేర్పాల్సిన అవసరం లేదు, కానీ ఇతరులు మన పట్ల మనం ఎలా ప్రవర్తించాలని కోరుకుంటున్నామో అదే విధంగా మనం వాళ్ళతో ప్రవర్తించాలి. మనం ఇతరులకు ఇవ్వడం ప్రారంభిస్తాము మరియు ఆ ఇవ్వడంలో, మనం కూడా ఏదొకటి పొందుతామని తెలుసుకుంటాము. మన హక్కులు, మన మానవత్వం – అన్నీ మనకు లభిస్తాయి.
3. శాంతి మరియు అహింస
నా పరిశోధన ప్రకారం అన్ని నైతిక విలువల సారాంశాన్ని ప్రశాంతతగా చెప్పవచ్చు. ఇది శ్రేయోభిలాషులు, గౌరవం మరియు క్షమాగుణం లాంటి అన్ని పాజిటివ్ జీవిత సూత్రాలకు ఒక గొడుగు లాంటిది. ఈ విధంగా, అవన్నీ శాంతి మరియు అహింస గొడుగు కిందకు వస్తాయి. ఈ సూత్రాలను ఉపయోగించి, వాటిని మన రోజువారీ జీవితంలో అప్లై చేసుకున్నప్పుడు, మనం ప్రోగ్రెస్ చెందడమే కాకుండా, సమాజంలోని ప్రోగ్రెస్ కు సహాయపడవచ్చు.
విద్యార్థులతో పాటు టీచర్లు ఇలాంటి ప్రోగ్రామ్ లు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని నా అభిప్రాయం. రామానుజన్ కాలేజ్ ఇప్పటికే ఈ ప్రోగ్రామ్ లను వారి టీచర్లు మరియు విద్యార్థులకు ఇవ్వడానికి అనుమతించింది, ఇది చాలా విజయవంతమైంది. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి, ‘సెంటర్ ఫర్ పీస్ అండ్ స్పిరిచ్యువాలిటీ’ మా "వి, ది లివింగ్" కోర్సు లాంటి పాఠశాలల కోసం కోర్సులను డెవలప్ చేసింది, ఇందులో కోర్సు పుస్తకాలు, రిసెర్చ్ మెటీరియల్స్ మరియు 1-12 తరగతులకు టీచర్స్ మెటీరియల్స్ ఉన్నాయి. కాలేజీలు మరియు క్యాంపస్ ల కోసం, మేము "కల్చర్ ఆఫ్ పీస్" కోర్సును అభివృద్ధి చేశాము, దీన్ని రామానుజన్ కాలేజీలకు ప్రవేశపెట్టాలని అనుకుంటున్నాము. ఆఫ్-క్యాంపస్ వ్యక్తులు మరియు సంస్థల కోసం, మేము "గుడ్ లైఫ్ ప్రోగ్రామ్" ను అభివృద్ధి చేస్తున్నాము. ఈ కార్యక్రమాల ద్వారా వీటిని ప్రపంచంలోకి తీసుకెళ్లాలని అనుకుంటున్నాము. భారతదేశం అంతటా కేంద్రాలను ఏర్పాటు చేశాము. అంతర్జాతీయంగా వాటిని ఆన్‌లైన్లో ఉంచుతున్నాము, అలా అక్కడి మా కేంద్రాలు మరియు లైఫ్ ఎడ్యుకేటర్లు వీటిని అందరికి చేర్చగలరు. లైఫ్ ఎడ్యుకేటర్లు లేదా నైతిక వేత్తలను అభివృద్ధి చేసే దిశగా ఇది ఒక చిన్న అడుగు అని నేను ఆశిస్తున్నాను. ఈ విధంగా, మనం మేధోపరంగా అభివృద్ధి చెంది పురోగతి మరియు అభివృద్ధికి సహాయపడవచ్చు.