నైతిక విలువలు అనేవి మంచి అలవాట్లతో కూడిన వ్యవస్థ, ఇది సంతోషకరమైన జీవితాన్ని పొందటానికి మన ప్రవర్తనను రూపొందిస్తాయి. నైతికతతో, మనం నిజాయితీగా జీవిస్తాము, ఇది మన చుట్టూ ఉన్నవారితో నమ్మకం మరియు స్నేహాన్ని బలపరుస్తుంది. సంతోషానికి నైతిక విలువలే కీలకం.
బౌద్ధమతంలో నైతికత
బౌద్ధమతంలో, నైతికత అనేది విచక్షణ అవగాహనపై ఆధారపడి ఉంటుంది: శాశ్వత ఆనందాన్ని కలిగించేది మరియు ఎక్కువ సమస్యలకు తెచ్చిపెట్టే వాటి మధ్య తేడాను గుర్తించడానికి మనం మన తెలివితేటలను ఉపయోగిస్తాము. ఇది కొన్ని నియమాలను గుడ్డిగా పాటించడం కాదు, నైతిక విలువలను అనుసరించడం లాజికల్ గా అర్ధాన్ని ఇస్తుందని నమ్మే విధంగా ఉంటుంది.
మన గురించి మనం నిజంగా శ్రద్ధగా ఆలోచిస్తే, మనం ఎలా ప్రవర్తిస్తామనే దాని గురించి తెలివైన నిర్ణయాలు తీసుకోవడంలో అర్ధం ఉంటుంది. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు మరియు దానికి అందరూ అర్హులే. ఆ లిస్ట్ లో మనం కూడా ఉన్నాము. తక్కువ ఆత్మగౌరవం ఉండటం నైతిక నిర్లక్ష్య వైఖరికి దారితీస్తుంది, సొంత-విలువ యొక్క భావన గౌరవానికి దారితీస్తుంది. ఆత్మగౌరవంతో, మనపై మనకు అంత ఎక్కువ గౌరవం ఉంటుంది, అనైతికంగా వ్యవహరించడానికి మనం ఎప్పుడూ ముందుండము: ఇది మనకు సరైనదిగా అనిపించదు.
తేనెటీగ తేనెను సేకరించడం వల్ల పువ్వు యొక్క రంగు మరియు సువాసనకు ఎటువంటి హాని జరగదు; కాబట్టి, జ్ఞానులు ఈ లోకం గుండా కదులుతారా. - ధర్మపాదం: పువ్వులు, శ్లోకం 49
"ఏదొకటిలే" అనే ఆలోచనా విధానం ఒంటరితనం మరియు నిరాశ భావనలకు మాత్రమే దారితీస్తుంది. నైతిక భావంతో, అటువంటి ఆలోచనను మనం తీసివేస్తాము. మనం నమ్మకమైన, స్థిరమైన స్నేహాన్ని పెంపొందిస్తాము. ఇవే సంతోషకరమైన మరియు విజయవంతమైన జీవితాన్ని గడపడానికి ఆధారం.
రీజనింగ్ ఆధారంగా నైతిక విలువలు మరియు ప్రతిజ్ఞలు
బౌద్ధమత అభ్యాసం ఇంగిత జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. ఇతరుల పట్ల మనం స్వార్ధం, కోపం, అహంకారంతో ఉంటే, అప్పుడు మన౦ ఒక ప్రశాంతమైన, స౦తోషకరమైన జీవితాన్ని ఎలా ఆశి౦చగల౦?
బౌద్ధమతంలో, ఒకరు వివిధ స్థాయిల్లో ప్రతిజ్ఞలు చేసుకోవచ్చు. ఉదాహరణకు, టిబెటన్ సంప్రదాయంలో పూర్తిగా నియమిత సన్యాసులు పాటించవలసినవి 253 ప్రతిజ్ఞలు ఉన్నాయి. చాలా మంది సాధారణ బౌద్దులు ఈ క్రింది "ఐదు సాధారణ ఉపదేశాలను" తీసుకుంటారు:
- జీవులను చంపడం మానుకోవాలి.
- ఇవ్వని వాటిని తీసుకోకుండా ఉండాలి.
- అనుచిత లైంగిక ప్రవర్తనకు దూరంగా ఉండాలి.
- అబద్ధాలు చెప్పడం మానుకోవాలి.
- మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి.
వీటిని బౌద్ధ అభ్యాసకులు స్వచ్ఛందంగా తీసుకొని అలాంటి ఆచరణకు అనువైన విధంగా జీవిస్తారు. ఈ నియమాలు మనల్ని సరైన దిశలో ఉంచడానికి సహాయపడతాయి మరియు సంతోషకరమైన, విజయవంతమైన జీవితాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కారణాలను సృష్టిస్తాయి.
ఒక విజయవంతమైన జీవితానికి కావాల్సిన నైతిక విలువలు
మనకు అపారమైన భౌతిక సంపద, శక్తి ఉంటే అదే ఒక విజయవంతమైన జీవితం అని కొందరు అనుకుంటారు. మనం అలాంటి వాటిని సాధించినా కానీ, మనం ఎప్పుడూ పూర్తిగా తృప్తి చెందము. మనకు వాటిని కోల్పోతామనే భయం ఎప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా ఇతరుల నుంచి మనం ఎక్కువగా ఏవైనా పొందితే శత్రువులు కూడా మనకు అలాగే ఏర్పడతారు. మనల్ని ఎవరూ ఇష్టపడరని జీవితం ఒక విజయవంతమైన జీవితం అని ఎవరూ చెప్పలేరు. విజయవంతమైన జీవితం అనేది మనం చాలా మంది స్నేహితులను సృష్టించుకుని వాళ్ళు మనతో ఉన్నప్పుడు సంతోషంగా ఉండటం. అప్పుడు మన దగ్గర ఎంత డబ్బు, అధికారం ఉన్నా ఏమీ తేడా ఉండదు: ఎందుకంటే మనకు ఏమి జరిగినా మనకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు.
నైతిక మార్గదర్శకాలు సంతోషానికి దారితీసే ప్రవర్తనలు మరియు సమస్యలను సృష్టించే వాటిని వివరిస్తాయి. మనం నిజాయితీగా ఉన్నప్పుడు మరియు ఇతరులకు సంతోషాన్ని పంచాలని అనుకున్నప్పుడు, ప్రజలు వారిని మనం ఎలాంటి మోసం కానీ బెదిరించడం కానీ దోపిడీ లాంటివి చెయ్యమని నమ్ముతారు. ఈ నమ్మకం మనం కలిసే ప్రతి ఒక్కరితో మన స్నేహానికి పునాదిలా పనిచేస్తుంది. అప్పుడు వాళ్ళు ఎలాంటి భయాన్ని పెట్టుకోకుండా మనతో రిలాక్స్ గా మరియు సంతోషంగా ఉంటారు. మనం కూడా అలాగే సంతోషంగా ఉంటాం. మనం వారి దగ్గరకు వచ్చినప్పుడల్లా ఇతరులు జాగ్రత్తగా ఉండాలని లేదా భయంతో వణికిపోవాలని ఎవరు కోరుకుంటారు? అందరూ చిరునవ్వుతో స్వాగతం పలకాలనే కోరుకుంటారు.
మనుషులు సామాజిక జీవులు: మనుగడ సాగించడానికి మనకు ఇతరుల సహాయం ఖచ్చితంగా అవసరం. మనం నిస్సహాయంగా అప్పుడే పుట్టిన శిశువులుగా మరియు నర్సింగ్ హోమ్ లలో బలహీనమైన వృద్ధులుగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, మన జీవితమంతా మనకు ఇతరుల సహాయం మరియు సంరక్షణ అవసరం ఉంటుంది. ప్రేమ పూర్వక స్నేహం నుంచి మనకు దొరికే భావోద్వేగ సహాయం ఒక సంతృప్తికరమైన జీవితాన్ని సృష్టిస్తుంది. ఒక బలమైన నైతిక భావం మనం కలిసే ప్రతి ఒక్కరితో స్నేహపూర్వక సంబంధాలను ఏర్పరచుకోవడానికి వీలు కల్పిస్తుంది.