బౌద్ధ అనుచరుడి జీవితంలో ఒక రోజు

Day%20in%20the%20life%20of%20a%20buddhist

మన రోజువారీ జీవితాన్ని ఎలా గడపాలో బౌద్ధ బోధనలు పుష్కలంగా సలహాలను అందిస్తాయి. ఈ క్రింది వాటిని చూడండి.

మనం నిద్రలేచినప్పుడు

మనం నిద్రలేవగానే, ఇంకా బతికే ఉన్నామని, ఒక కొత్త రోజును ప్రారంభించటానికి సిద్ధంగా ఉన్నామని ఆనందంతో మరియు కృతజ్ఞతతో ఉండాలి. మనం ఈ క్రింది వాటికి బలమైన ఉద్దేశంతో గుర్తుంచుకోవాలి:

  1. రోజును అర్థవంతంగా మార్చుకోవటానికి.
  2. మన కోసం మనం పనిచేయడానికి, మరియు ఇతరులకు సహాయం చేయడానికి మనకు ఉన్న ఈ అమూల్యమైన అవకాశాన్ని వృథా చేసుకోకుండా ఉండటానికి.

మనం పనికి వెళ్తున్నప్పుడు మనం మనసుని ఏకాగ్రతతో, ఉత్పాదకంగా ఉంచేందుకు ప్రయత్నిస్తాం. మన సహోద్యోగులపై సహనం కోల్పోకుండా మరియు కోపం తెచ్చుకోకుండా ఉంటాము. మనం అందరితో స్నేహంగా ఉంటాము, అర్థం లేని కబుర్లు మరియు గాసిప్ లతో మన పక్కన వాళ్ళ సమయాన్ని వృథా చేయము. మనం మన కుటుంబాన్ని చూసుకుంటూ, మన సహనాన్ని కోల్పోకుండా వారి శారీరక మరియు భావోద్వేగ అవసరాలను మంచి శ్రద్ధతో సాధ్యమైనంత ఉత్తమంగా తీర్చాలని నిశ్చయించుకుంటాము.

పొద్దున ధ్యానం

సాధారణంగా మనం బ్రేక్ ఫాస్ట్ కి ముందు కొంతసేపు ధ్యానం చేసుకోవచ్చు. ఒక ఐదు లేదా పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని, శ్వాసపై దృష్టి పెట్టి మనసుని కేంద్రీకరించవచ్చు.

మన జీవితాలు మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి జీవితాలతో ఎలా పెనవేసుకుపోయాయో మనం ఆలోచిస్తాం. వారు ఎలా భావిస్తారు మరియు ఎలా ప్రవర్తిస్తారు అనేది మనపై మరియు ఇతరులపై ఎంత ప్రభావం చూపుతుంది అని ఆలోచించి మనం ప్రేమ పట్ల ఒక మంచి అనుభూతిని సృష్టించుకుంటాము: "వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి," అలాగే కరుణతో: "వాళ్ళ జీవితాలలో విచారం మరియు ఎలాంటి సమస్యలు ఉండకుండా ఉండాలి" అని అనుకుంటాం. ఈ రోజు, మనం ఇతరులకు మనకు కుదిరినంత సహాయం చేయడానికి ప్రయత్నిస్తాము మరియు అలా కుదరకపోతే వాళ్లకు కనీసం ఎలాంటి హాని కలిగించకుండా ఉంటాము..

పగటిపూట ఏకాగ్రతతో ఉండటం

రోజంతా, మనం ఎలా ప్రవర్తిస్తున్నామో, ఎలా మాట్లాడుతున్నామో, ఎలా ఆలోచిస్తున్నామో మరియు ఎలా అనుభూతి చెందుతున్నామో బాగా గమనించడానికి ప్రయత్నిస్తాము. కోపం, దురాశ, అసూయ, అహంకారం వంటి బాధాకరమైన భావోద్వేగాలు మనలోకి రావటానికి ప్రయత్నిస్తే వాటిని గమనించడానికి ప్రయత్నిస్తాము. మనం స్వార్ధపూరితంగా లేదా సున్నితంగా లేదా జాలి మరియు పక్షపాతంతో ప్రవర్తిస్తున్నప్పుడు మనల్ని మనం గమనిస్తాము. సూక్ష్మ స్థాయిలో, మన గురించి, ఇతరుల గురించి మరియు సాధారణంగా అన్ని పరిస్థితుల గురించి అసంబద్ధమైన కథలను ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు తెలుసుకోవాలని మనం లక్ష్యంగా పెట్టుకుంటాం. ఆ పొడవాటి క్యూలో మనకు ఛాన్స్ ఎప్పటికీ రాదని, మనలాంటి వ్యక్తిని ఎవరూ ప్రేమించరని, మనం "దేనికి పనికిరామని" అనుకుంటూ ఉంటాము.

మన౦ ఎవరితోనైనా ఇష్టపూర్వక౦గా ప్రవర్తి౦చడ౦, మాట్లాడడ౦ లేదా ఆలోచి౦చడ౦ చేసినప్పుడు, మన౦ మరో స్థాయి పూర్తి ఏకాగ్రతతో ఉంటాము. మనం ఏదైనా చేసే ముందు లేదా చెప్పే ముందు అది మనల్ని బాధపెట్టకూడదని మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తాము. మనం అప్పటికే ఆ పనిని చేసి ఉంటే, మనం చేసే ముందు లేదా ఏదొకటి చెడుగా చెప్పే ముందు వెంటనే ఆగిపోతాము. మనం ఒక నెగెటివ్ థింకింగ్ చక్రంలో మనల్ని మనం చూసుకున్నప్పుడు కూడా అలాగే చేస్తాము. ఈ మానసిక మరియు భావోద్వేగ అవాంతరాలను శాంత పరచడానికి మరియు ఎదుర్కోవటానికి మనం విరుగుడులను వెతుక్కుంటాము మరియు మన ప్రశాంతతను తిరిగి పొందే వరకు వాటిని వర్తింపజేస్తాము.

మనలో చాలా మంది గుర్తించగల ఒక ఉదాహరణ ఏమిటంటే, పనిలో లేదా ఇంట్లో మనల్ని ఎవరైనా ఏదైనా అన్నా లేదా నిజంగా మనకు చికాకు కలిగించే పని ఏదైనా చేసినా, అప్పుడు:

  1. అరిస్తే మనకు ఉపయోగం ఉండదని గుర్తుంచుకోండి మరియు మనం రోజూ ఉదయం చేస్తున్నట్లే శ్వాసపై దృష్టి పెట్టి శాంతంగా ఉండటానికి ప్రయత్నించండి.
  2. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారని, అసంతృప్తిగా ఉండటానికి ఇష్టపడరని గుర్తుంచుకోండి. కానీ అందరూ ఇబ్బందులకు గురవుతూ సమస్యలను తీసుకువచ్చే పనులను చేస్తూ ఉంటారు.
  3. వారు సంతోషంగా ఉండాలని, మరియు వాళ్ళ సంతోషానికి కారణాలు ఉండాలని కోరుకోండి.
  4. వారు మీ సలహాను తీసుకునేలా ఉంటే వారి ప్రవర్తన యొక్క నెగెటివ్ ప్రభావాలను వాళ్లకు చెప్పి వాటి నుంచి దూరంగా ఉండమని చెప్పండి.
  5. వారు మీకు పూర్తిగా స్పందించకపోతే, మౌనంగా ఉండి ఆ సంఘటనను సహనం యొక్క ఒక పాఠంగా తీసుకోండి. అయినా కానీ వాళ్ళకు ఏదో ఒక ఇబ్బందిని పోగొట్టే అవకాశం ఉంటే మనం ఊరికే చూస్తూ ఉండిపోకూడదు.

ముఖ్యంగా మనం కంట్రోల్ చెయ్యాల్సిన విషయం ఏమిటంటే ఇతరులు మనల్ని విమర్శించినప్పుడు రక్షణాత్మకంగా ఉండటం. వాళ్ళు చెప్పింది సరైనదా కాదా అని తెలుసుకుని మనం ప్రశాంతంగా ఉండి నిజాయితీగా మనల్ని మనం పరిశీలించుకోవచ్చు - మరియు అలా ఉండగలిగితే మనం వాళ్లకు క్షమాపణ చెప్పి మన ప్రవర్తనను సరిదిద్దుకోగలం. ఒకవేళ వాళ్ళు చెప్పింది అర్థంపర్థం లేకపోతే, అది ముఖ్యం కాకపోతే దాన్ని వదిలేయొచ్చు. అది ఒక ముఖ్యమైన సమస్యకు సంబంధించితే, మనం వారి చెడు ఆలోచనను ఎటువంటి సంకోచం లేకుండా ఎత్తి చూపించవచ్చు.

సాయంత్రపు ధ్యానం

మనం రాత్రి నిద్రపోయే ముందు, మన శ్వాస మీద దృష్టి పెట్టి పగటి కార్యకలాపాల నుండి శాంతపరచడానికి ఇంకొక చిన్నపాటి ధ్యానం చేసుకోవచ్చు. మనం ఆ రోజు జరిగిన సంఘటనలను గుర్తు తెచ్చుకుని వాటిని ఎలా డీల్ చేశామో ఆలోచిస్తాము. మనం మన సహనాన్ని కోల్పోయామా, లేక మూర్ఖంగా ఏమైనా మాట్లాడామా? అని. అలా చేస్తే, మనల్ని మనం నియంత్రణ చేసుకోలేకపోయినందుకు చింతిస్తాం, ఇకపై ఎటువంటి అపరాధ భావన లేకుండా, రేపు ఇంకా బాగా ఉండాలని నిశ్చయించుకుంటాం. మనం కొన్ని పరిస్థితులను తెలివిగా మరియు దయతో వ్యవహరించామని తెలుసుకుంటాము. మనం ఆ దిశగా మరింత ముందుకు సాగాలని అనుకుంటాము. ఆ తర్వాత మనం నిద్రపోతాం, రేపటి కోసం ఎదురు చూస్తూ, మన పని మనం చేసుకుంటూ, ఇతరులకు సహాయం చేస్తూ ఉంటాం. మన అమూల్యమైన జీవితాలను ఇంత అర్థవంతంగా మార్చుకుంటున్నందుకు మనం నిజంగా సంతోషిస్తాం.

Top