సార్వత్రిక నైతిక విలువలతో శాంతిని ప్రమోట్ చెయ్యడం

Uv promoting peace

ఈ రోజు, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న యువత సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఇది ప్రస్తుత ప్రపంచంలో ఉన్న ఒక పెద్ద సంక్షోభం. దీనితో అసలు సమస్యలను ఎలా పరిష్కరించాలనే ప్రశ్న పుట్టుకొస్తుంది.

మతం పేరు మీద ఎన్నో యుద్ధాలు, గొడవలు, ఉగ్రవాద దాడులు జరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. గురువు దలైలామా గారు ఎక్కడికి వెళ్లినా ప్రజలు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, వైద్య నిపుణులు అందరూ అడిగే ఒకే ఒక ప్రశ్న: ఈ ప్రపంచంలో ఉన్న అసలు సమస్య ఏమిటి? అని. ఉగ్రవాదం, అవినీతి, లింగ వివక్ష, ధనిక మరియు పేదల మధ్య తేడా, ఆ తర్వాత యువతలోని మానసిక సమస్యలతో ఈ ప్రపంచం ఇంతటి సంక్షోభాన్ని ఎదుర్కుంటుంది. ఈ రోజు, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న యువకుల సంఖ్య బాగా పెరిగిపోయింది - ఇది ఒక పెద్ద సంక్షోభంగా మారిపోయింది. కాబట్టి, ఈ సమస్యలను మనం ఎలా పరిష్కరించగలం?

మానసిక ఆరోగ్య సమస్యల విషయంలో, ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి ఆధునిక విద్య ఉన్నా కూడా ఈ సమస్యలు ఇంకా ఎందుకు పెరుగుతున్నాయని మనం ప్రశ్నించుకోవాలి. అసలు సమస్య ఏమిటి? అది ఎలా వస్తుంది? గురువు గారిని ఎప్పుడూ అడిగే ప్రశ్న ఇదే. ఏ సంకోచం లేకుండా, గురువు గారు మన ఆధునిక విద్యావిధానంలో ఒక లూప్ హోల్ ఉందని చెప్పారు. ఆ లూప్ హోల్ ఏమిటంటే మన విద్యావిధానం ప్రధానంగా తెలివితేటలను పెంపొందించడానికే రూపొందించబడింది. ఒక క్లాసులో, టూ ప్లస్ టూ ఫోర్ కి సమానం అని చెబితే మనం పాస్ అయిపోతాం. మనకున్న అద్భుతమైన హృదయం, పరోపకార బుద్ధి, ఆకర్షణ శక్తితో టూ ప్లస్ టూ నాలుగు అయ్యి ఉండొచ్చు అని చెబితే మనం ఫెయిల్ అవుతాం. ఎవరూ మన హృదయాన్ని లెక్క చెయ్యరు! మెదడుకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.

దీనికి బాధ్యతను వహించాలి. కేవలం మెదడును పెంపొందించుకోవడం వల్ల ప్రపంచానికి ఆనందం లభిస్తుందని, మానవాళిలో నమ్మకం, ప్రేమ, కరుణ ఉంటాయని చెప్పలేము. ఆచరణాత్మక స్థాయిలో, మానవాళిని మంచి శాంతి మరియు సామరస్యం వైపు నడిపించడానికి చోదక శక్తి, ప్రేరణ ఏమిటి? అది హృదయం, మన మానవ హృదయం.

ఈ హృదయంతో రాజీపడకుండా ప్రపంచం అభివృద్ధి చెందాలంటే వివేకం కూడా అవసరం. వివేకం మరియు హృదయం కలిసి మెలిసి ఉండాలి. దీన్ని దృష్టిలో ఉంచుకుని నైతికతకు ప్రతీకగా సార్వత్రికమైనది కరుణ కలిగి ఉన్న హృదయం. దీన్ని ఎవరూ ఖండించలేరు. ఒకతను దేనిపైనా విశ్వాసం ఉంచుకోకపోయినా, మతస్థుడైనా, విద్యావంతుడైనా, నిరక్షరాస్యుడైనా ఫర్వాలేదు. ప్రతి ఒక్కరూ తమపై అభిమానం మరియు శ్రద్ధ చూపించే వ్యక్తిని దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడతారు. నైతికత యొక్క మూలం కరుణ అని గుర్తుంచుకోండి - ఇది ఇతరుల పట్ల ప్రేమ మరియు కరుణ.

మనం ఏమి చెయ్యగలం అనేది తర్వాతి ప్రశ్న. మనం దీన్ని ఎలా ప్రమోట్ చెయ్యగలం? ముందుగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంటర్స్ మనకు సహాయపడతాయి. ఉదాహరణకు ఢిల్లీలోని రామానుజన్ కాలేజీలోని ‘సెంటర్ ఫర్ ఎథిక్స్ అండ్ వాల్యూస్’ లో దలైలామా గారి ఆధ్వర్యంలో సార్వత్రిక నైతికతను పెంపొందించడానికి ఒక ప్రముఖమైన కార్యక్రమం నిర్వహించారు.

మిగతా వాళ్ళు మంచి దయగల వ్యక్తులుగా మారడానికి మన౦ ఏ విధంగా ప్రేరేపి౦చవచ్చో అని ఆలోచి౦చాలి. అది ఒక వ్యవస్థ రూపంలో కాకుండా ఓపెన్ గా, పరిశీలనతో, ఆప్యాయత రూపంలో ఉండాలి. మనం ఈ ప్రపంచంలో ఒక మంచి మార్పును తీసుకురాలేకపోవచ్చు, కానీ కనీసం మన చుట్టూ ఉన్న వాళ్ళను అయినా ప్రభావితం చెయ్యడానికి ప్రయత్నించవచ్చు, వాళ్ళు ఖచ్చితంగా మంచి దయతో ఉండగలరు, కానీ అలా చెయ్యాలని వాళ్ళకు తెలియలేకపోవచ్చు. మన౦ ఇతరులను ఎలా ప్రభావితం చెయ్యగలం? ప్రపంచాన్ని ప్రభావితం చెయ్యగల వ్యక్తులను మనం కలవలేకపోతే, వాళ్ళు ఎవరనే దానితో సంబంధం లేకుండా, ముఖ్యంగా యువతలో కనీసం కరుణ యొక్క ప్రాముఖ్యత గురించి మనం ఎలా ప్రచారం చెయ్యగలమో పరిశోధించాల్సిన అవసరం ఉంది. అన్నిటికి మించి, భవిష్యత్తుపై ఆశ నేటి యువతరంపైనే ఆధారపడి ఉంది.

Top