What%20is%20buddhist%20practice

బౌద్ధమతంలో ప్రధాన విషయం మన స్వంత లోపాలను అధిగమించుకుని మన సానుకూల సామర్థ్యాన్ని గ్రహించడం. లోపాలలో స్పష్టత లేకపోవడంతో మరియు భావోద్వేగ అసమతుల్యత వల్ల మన జీవితం గురించి మనకు గందరగోళం మొదలవుతుంది. దాని వల్ల, కోపం, దురాశ మరియు అమాయకత్వం వంటి ఇబ్బంది పెట్టే భావోద్వేగాలతో మనం ప్రవర్తిస్తాము. మన పాజిటివ్ సామర్థ్యాలలో స్పష్టంగా కమ్యూనికేట్ చేయడం, వాస్తవికతను అర్థం చేసుకోవడం, ఇతరులతో సహానుభూతిగా ఉండటం మరియు మనల్ని మనం మెరుగుపరచుకోవడం ఉంటాయి.

బౌద్ధ అభ్యాసం యొక్క ప్రారంభంలో మన మనస్సులను శాంతపరచడం మరియు బుద్ధిపూర్వకంగా ఉండటం, అంటే మనం ఎలా ప్రవర్తిస్తున్నామో మరియు ఇతరులతో ఎలా మాట్లాడుతున్నామో, ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఎలా ఆలోచిస్తున్నాం అనే దాని గురించి ఉంటుంది. మనం వాటిని గమనించి వాటిని అలాగే వదిలేయకూడదు. మన౦ జాగ్రత్తగా ఉన్నప్పుడే, ఏది నిర్మాణాత్మకమైనది, మరియు ఏది వినాశకమైనది అనే తేడాను మనం చూడగలం. ఇది సొంత-ఆందోళన కాదు: మనం వాస్తవానికి ఇతరుల పట్ల మరింత శ్రద్ధతో ఓపెన్ అవుతాము.

మన ఆత్మపరిశీలన మరియు స్వీయ అవగాహన యొక్క ఉద్దేశ్యం మన సమస్యలకు కారణాలను కనిపెట్టడం. బయటి కారణాలు మరియు వ్యక్తులు ఖచ్చితంగా మనకు కష్టాలు తెచ్చే పరిస్థితులను అందిస్తాయి - కాని బౌద్ధ విధానం ప్రకారం వాటికి సంబంధించిన అసలైన కారణాలను గుర్తించడానికి మరియు దీని కోసం పనిచేయడానికి మన మనస్సులను ఉపయోగించాలి. మన మానసిక అలవాట్లు, అలాగే మన పాజిటివ్ మరియు నెగెటివ్ భావోద్వేగాలు మనం జీవితాన్ని అనుభవించే విధానాన్ని ప్రభావితం చేస్తాయి.

మనం పని నుంచి ఒత్తిడి, నిరాశ, ఆందోళన, ఒంటరితనం మరియు అభద్రతను అనుభవిస్తున్నప్పుడు, వాటిని ఎదుర్కోవడంలో మన ఇబ్బందులు మన మానసిక మరియు భావోద్వేగ స్థితుల నుంచి వస్తాయి, సమస్యల నుంచి కాకుండా. జీవితంలో నిరంతర సవాళ్లను ఎదుర్కోవటానికి ఉత్తమ మార్గం మన మనస్సులను శాంత పరచుకుని భావోద్వేగ సమతుల్యత మరియు మనస్సు యొక్క స్పష్టతను పొందడం.

మనల్ని బాధలు, మరియు ఇబ్బందులకు గురిచేసే భావోద్వేగాలు, వైఖరులు, ప్రవర్తనల పట్ల శ్రద్ధ వహించిన తర్వాత, వాటికి పరిష్కారాలను అన్వయించుకోవచ్చు.

వాస్తవికత మరియు మనస్సు యొక్క పనితీరు గురించి స్పష్టమైన అవగాహనతో ఒక రకమైన భావోద్వేగ పరిశుభ్రతను మనం అలవరచుకోవాలి. - 14వ దలైలామా

మనమందరం మన శారీరక పరిశుభ్రత గురించి ఆలోచిస్తాము, అలాగే మన మానసిక స్థితిని కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. భావోద్వేగ పరిశుభ్రతను పెంపొందించడానికి, మనం మూడు విషయాలను గుర్తుంచుకోవాలి: మన కలత చెందుతున్న మానసిక స్థితికి నివారణలను గుర్తుంచుకోవాలి, అవసరమైనప్పుడు వాటిని వాడటం గుర్తుంచుకోవాలి మరియు వాటిని నిర్వహించడం కూడా గుర్తుంచుకోవాలి.

ఈ నివారణలను గుర్తుంచుకోవడానికి, మనం ఇలా చెయ్యాలి:

  • మనం ముందు అవి ఏమిటో తెలుసుకోవాలి
  • మనం వాటిని సరిగ్గా అర్థం చేసుకునే వరకు, వాటిని ఎలా అన్వయించాలో తెలుసుకునే వరకు మరియు అవి పనిచేస్తాయని నమ్మే వరకు వాటిని పరిశీలించాలి.
  • వాటిని బాగా అర్ధం చేసుకోవడానికి వాటిని ధ్యానంలో ఉపయోగించడం ప్రాక్టీస్ చెయ్యాలి.

మన కోసం మనం డాక్టర్ల లాగా ఉండాలి: మన వ్యాధులను నిర్ధారించడం, వాటి కారణాలను అర్థం చేసుకోవడం, వాటికి నివారణలు ఏమిటో మరియు వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడంతో పాటు వాటిని అప్లై చెయ్యటం ప్రాక్టీస్ చెయ్యాలి.

మనకు దీర్ఘకాలికంగా అనారోగ్యంగా ఉన్నప్పుడు, ఇంకేదైనా మార్పులు చేయడానికి ముందు జీవనశైలి మార్పు యొక్క ప్రయోజనాలను నమ్మాలి. చాలా మంది ప్రజలు పోషకాహారం మరియు వ్యాయామ శిక్షణ యొక్క లోతైన అధ్యయనంతో ప్రారంభించరు, కానీ ముందుగా ఆహారం మరియు వ్యాయామ దినచర్యను ప్రయత్నిస్తారు. వాళ్ళు ప్రారంభించే ముందు వారికి బోధన ఎంతో అవసరం, కానీ వాళ్ళు కొన్ని ప్రయోజనకరమైన ఫలితాలను అనుభవించిన తర్వాత మాత్రమే అలా చెయ్యడానికి ప్రేరేపించబడతారు.

భావోద్వేగ ఆరోగ్యం పొందడానికి మనం చేసే ప్రయత్నాలలో కూడా ఇదే ప్రక్రియ ఉంటుంది. మన బుద్ధిపూర్వక శిక్షణ నుంచి శ్రేయస్సు యొక్క రుచిని పొందిన తర్వాత, మన జీవన నాణ్యతను మెరుగుపరచడానికి మరియు ఇతరులకు సహాయం చేయడానికి బౌద్ధ అభ్యాసాల గురించి తెలుసుకోవడానికి ప్రేరణ మరియు ఆసక్తిని అభివృద్ధి చేయడం సులభం.

బుద్ధుడు ఒకప్పుడు మనలాగే ఉండేవాడు - జీవితంలో కష్టాలను ఎదుర్కుంటూ ఉండే ఒక సాధారణ వ్యక్తిలా. మనందరిలాగే ఆయన కూడా తన జీవితాన్ని, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జీవితాన్ని మెరుగుపరచుకోవాలని అనుకున్నాడు. మనచుట్టూ ఏం జరిగినా ప్రశాంతంగా, బుద్ధితో, భావోద్వేగాలను అదుపులో ఉంచుకునే శక్తి, సామర్థ్యాలు మనలో ఉన్నాయని తన ఆత్మపరిశీలన ద్వారా తెలుసుకున్నాడు.

దీనినే దలైలామా గారు "భావోద్వేగ పరిశుభ్రత" అని పిలవడానికి ఇష్టపడతారు. ఇదే సంస్కృతి మరియు మతం యొక్క సరిహద్దులను మార్చేస్తుంది, ఎందుకంటే ఇది మనమందరం కోరుకునేదాన్ని ఇస్తుంది: అదే ఎలాంటి సమస్యలు లేని సంతోషకరమైన మరియు శాంతియుత జీవితం.

Top