సంతోషం అనేది దీర్ఘకాలిక శ్రేయస్సు, మనశ్శాంతి మరియు మన జీవితాలతో సంతృప్తి యొక్క భావన - మనమందరం ఎల్లప్పుడూ దీనినే కోరుకుంటూ ఉంటాం. మనకు అది కొంచెం దక్కినా కానీ, అది అలాగే ఉండిపోవాలని కోరుకుంటాము.
ప్రజలు తరచుగా సంతృప్తిని ఆనందంతో పోలుస్తూ ఉంటారు. మనం మంచి ఆహారం తినడం, ఖరీదైన దుస్తులు ధరించడం, ఎప్పుడూ సరదాగా ఉండడం సంతోషం అని అనుకుంటాం. కానీ అది కాదు. మన అవసరాలు, కోరికలన్నీ తీర్చుకుంటే మనం సంతోషంగా ఉంటాం అని కూడా అనుకుంటాం. కానీ నిజానికి, మన గురించి మాత్రమే మనం ఆందోళన చెందడం ఒంటరితనం మరియు నిరాశకు దారితీస్తుంది.
మన ఆలోచనలు మరియు భావోద్వేగాలతో ఒంటరిగా ఉండటం కొన్నిసార్లు అసౌకర్యంగా అనిపిస్తుంది. కాబట్టి సంగీతం, కంప్యూటర్ గేమ్స్, ఆహారం, శృంగారం మరియు కెరీర్ లో పరధ్యానాన్ని వెతుక్కుంటాము. కానీ ఇది నిజంగా మనల్ని ఇతరులతో కనెక్ట్ చెయ్యదు, లేదా నిజమైన ఆనందాన్ని ఇవ్వదు.
ఇతరులతో హ్యాపీగా, కనెక్ట్ అవ్వాలని అనుకుంటూ తరచూ సోషల్ మీడియాను ఆశ్రయిస్తాం. మన సెల్ఫీలలో లైక్ లు లేదా స్నేహితుడి నుంచి వచ్చిన మెసేజ్ లలో మనం స్వల్పకాలిక ఆనందాన్ని పొందుతాం, కానీ ఇది మనకు ఇంకా ఏదో కావాలనేలా చేస్తుంది. మనం అలాగే ఆత్రుతగా ఎదురు చూస్తూ మన ఫోన్లను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటాము, కానీ మనకు ఎన్ని లైకులు మరియు మెసేజ్ లు వచ్చినా, ఏదో ఒక విధంగా ఇతరులతో తక్కువగా కనెక్ట్ అవుతాము.
ఇతరులకు సహాయం చెయ్యడమే నిజమైన సంతోషానికి గొప్ప సోర్స్ అని బుద్ధుడు చెప్పాడు: మనం ఇతరుల మంచి మరియు సంతోషం కోసం చిత్తశుద్ధితో పట్టించుకున్నప్పుడు, మన హృదయాలు మంచిగా ఇతరులతో కనెక్ట్ అవుతాయి. అప్పుడు మనమే నిజమైన శ్రేయస్సు యొక్క భావాన్ని అనుభవిస్తాము. మనం శారీరకంగా కూడా మెరుగ్గా ఫీల్ అవుతాం. ఇతరుల సంతోషం గురించి ఆందోళన చెందుతూ, వారికి సాధ్యమైనంత వరకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాము మరియు వారికి హాని కలిగించే ఏ పనిని చెయ్యకుండా ఉంటాము. ఇది మంచి నమ్మకమైన స్నేహాన్ని సృష్టిస్తుంది. ఇది మన జీవితాలను మరింత అర్ధవంతంగా తయారు చేస్తుంది. కుటుంబం మరియు స్నేహితుల భావోద్వేగ సహాయంతో, మన జీవితంలో ఏ కష్టం వచ్చినా దానిని మనం మెరుగ్గా ఎదుర్కొగలుగుతాము.
మనం నిజంగా ఇతరుల సంతోషాన్ని పట్టించుకునే ముందు, మన గురించి మనం ఆలోచించాలి. మన కోసం మనం సంతోషాన్ని కోరుకోకపోతే, పక్కన వాళ్లు సంతోషంగా ఉండాలని మనం ఎలా కోరుకోగలం? బౌద్ధమతంలో, ఆనందం యొక్క కోరిక విశ్వవ్యాప్తంగా సమ్మిళితమై ఉంటుంది.
సంతోషం అనేది అంతర్గత శాంతిపై ఆధారపడి ఉంటుంది, ఇది మంచి హృదయానికి సంబంధించినది. - 14వ దలైలామా
నేటి ప్రపంచంపై ఎటువంటి ప్రభావాన్ని చూపడానికి మనం పూర్తిగా శక్తిహీనులం అని అనుకోవడం సులభమే. కాబట్టి మనం ఇలా అనుకోవచ్చు, "ఏమి జరిగినా. నాకు ఎందుకులే?" అని. కానీ నిజం ఏమిటంటే, మనకు తెలియని వాళ్ళ సంక్షేమం గురించి ఆలోచించి వారికి సహాయం చేయడానికి నిజంగా ప్రయత్నించవచ్చు. ఒక చిన్న చిరునవ్వు లేదా చెక్ అవుట్ లైన్లో ఒకరిని మనకంటే ముందుకు వెళ్ళనిచ్చే పని కూడా మనకు ఒక మార్పు తెచ్చాము అనే అనుభూతిని కలిగిస్తుంది. ఇది మనకు సొంత-విలువ యొక్క భావాన్ని ఇస్తుంది. మన దగ్గర ఇవ్వడానికి ఏదో ఒకటి ఉంది అనే ఇలాంటి విషయం మంచి అనుభూతిని కలిగిస్తుంది. అప్పుడు మనతో మనం మరియు మన జీవితంతో పూర్తి సంతోషంగా ఉంటాం.
మనల్ని ఇతరులతో కనెక్ట్ చేసేది ఏమిటంటే, మనం బాగుపడి మన సొంత సంతోషం గురించి ఆలోచించకుండా, ఎదుటి వారి సంతోషం గురించి మరియు వారికి మనం ఎలా సహాయం చేయగలమో అనే దాని గురించి ఆలోచించడం. ఇది సింపుల్ గా సొంత-శ్రద్ధ మరియు ఇతరుల శ్రేయస్సు పట్ల చిత్తశుద్ధితో కూడిన ఆందోళనకు దారితీస్తుంది.
మనుషులమైన మనం సామాజిక జంతువులం: మనం ఇతరులతో అనుబంధాలను పెంచుకున్నప్పుడు మాత్రమే అభివృద్ధి చెందగలం. కాబట్టి, స౦తోషకరమైన జీవితాన్ని గడపడానికి ఇతరుల పట్ల దయ, శ్రద్ధ, కరుణ అనేవి మన౦ పెంపొందించుకోవాలి.