ఆసియాలో బౌద్ధమత వ్యాప్తి

04:25
ఏ మిషనరీ ఉద్యమాన్ని అభివృద్ధి చెయ్యనప్పటికీ, బుద్ధుని బోధనలు శతాబ్దాల తరబడి అన్ని వైపులా వ్యాపించాయి: ముందుగా ఆగ్నేయ ఆసియా, తరువాత మధ్య ఆసియా అక్కడి నుంచి చైనా మరియు మిగిలిన తూర్పు ఆసియా, చివరికి టిబెట్ మరియు మధ్య ఆసియాలోని మిగతా ప్రాంతాలకు చేరాయి. విదేశీ వర్తకుల బౌద్ధమత విశ్వాసాల పట్ల స్థానిక ఆసక్తి కారణంగా ఎక్కువగా ఇది ఈ ప్రాంతాలలో సాధారణంగానే అభివృద్ధి చెందింది. కొన్నిసార్లు పాలకులు తమ ప్రజలకు నైతికతను తీసుకురావడానికి బౌద్ధ మతాన్ని స్వీకరించారు, కాని ఎవరూ బలవంతంగా ఈ మతంలోకి మారలేదు. బుద్ధుని సందేశాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో, ప్రజలు ఏది సహాయకారిగా ఉంటుందో ఎంచుకునే స్వేచ్ఛను పొందారు.

బుద్ధుని బోధనలు భారత ఉపఖండం అంతటా, అక్కడి నుంచి ఆసియా అంతటా శాంతియుతంగా వ్యాపించాయి. అది కొత్త సంస్కృతికి చేరుకున్నప్పుడల్లా, బౌద్ధమత పద్ధతులు మరియు శైలులు స్థానిక మనస్తత్వానికి అనుగుణంగా స్వేచ్ఛగా జ్ఞానం మరియు కరుణ యొక్క ముఖ్యమైన అంశాలతో రాజీపడకుండా మార్చబడ్డాయి. బౌద్ధమతం ఎప్పుడూ సర్వోన్నత అధిపతితో కూడిన మతపరమైన అధికార మతాన్ని అభివృద్ధి చెయ్యలేదు. దానికి బదులుగా, అది వ్యాపించిన ప్రతి దేశం దాని స్వంత రూపాలను, దాని స్వంత మత నిర్మాణాన్ని మరియు దాని స్వంత ఆధ్యాత్మిక మార్గాన్ని అభివృద్ధి చేసింది. ప్రస్తుతం వీళ్లల్లో అత్యంత ప్రసిద్ధుడు, అంతర్జాతీయంగా గౌరవనీయుడు టిబెట్ కు చెందిన దలైలామా గారు.

సంక్షిప్త చరిత్ర 

బౌద్ధమతంలో రెండు ప్రధాన భాగాలు ఉన్నాయి: వ్యక్తిగత మోక్షాన్ని నొక్కి చెప్పే శ్రావకాయనం (నిరాడంబరమైన దశ), మరియు ఇతరులకు ప్రయోజనం చేకూర్చడానికి సంపూర్ణ జ్ఞానోదయ బుద్ధుడిగా మారడానికి కృషి చేయడాన్ని నొక్కి చెప్పే మహాయానం (విస్తారమైన దశ). ఈ రెండింటి లోనూ అనేక ఉప విభాగాలు ఉన్నాయి. ప్రస్తుతం, మూడు ప్రధాన రూపాలు మాత్రమే ఆగ్నేయ ఆసియాలో ఒక శ్రావకాయన ఉప విభాగంలో ఉన్నాయి, వీటిని థెరవాడ అని పిలుస్తారు, మరియు రెండు మహాయాన విభాగాలు ఉన్నాయి, అవి చైనీస్ మరియు టిబెటన్ సంప్రదాయాలు.

  • క్రీ.పూ. 3 వ శతాబ్దంలో థెరవాడ సంప్రదాయం భారతదేశం నుంచి శ్రీలంక మరియు బర్మా (మయన్మార్) లకు వ్యాపించింది. అక్కడి నుంచి ఆగ్నేయ ఆసియాలోని మిగిలిన ప్రాంతాలకు (థాయ్ లాండ్, కంబోడియా, లావోస్) చేరుకుంది.
  • ఇతర శ్రావకాయన పాఠశాలలు ఆధునిక పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్, తూర్పు మరియు తీరప్రాంత ఇరాన్ మరియు మధ్య ఆసియాకు వ్యాపించాయి. మధ్య ఆసియా నుంచి, అవి క్రీ.శ 2 వ శతాబ్దంలో చైనాకు విస్తరించాయి. శ్రావకాయన యొక్క ఈ రూపాలు తర్వాత భారతదేశం నుంచి ఇదే మార్గంలో వచ్చిన మహాయాన అంశాలతో కలిశాయి, మహాయానం చివరికి చైనా మరియు మధ్య ఆసియాలోని చాలా ప్రాంతాలలో బౌద్ధమతం యొక్క ఆధిపత్య రూపంగా మారింది. మహాయాన యొక్క చైనీస్ రూపం ఆ తర్వాత కొరియా, జపాన్ మరియు వియత్నాంకు వ్యాపించింది.
  • టిబెటన్ మహాయాన సంప్రదాయం క్రీ.శ 7 వ శతాబ్దంలో ప్రారంభమైంది, ఇది భారతీయ బౌద్ధమతం యొక్క పూర్తి చారిత్రక అభివృద్ధిని వారసత్వంగా పొందింది. టిబెట్ నుంచి, ఇది హిమాలయ ప్రాంతాల అంతటా మరియు మంగోలియా, మధ్య ఆసియా మరియు రష్యాలోని అనేక ప్రాంతాలకు (బురియాటియా, కల్మికియా మరియు తువా) వ్యాపించింది.

దీనికి తోడుగా, క్రీ.శ 2 వ శతాబ్దం నుంచి, మహాయాన బౌద్ధం యొక్క భారతీయ రూపాలు వియత్నాం, కంబోడియా, మలేషియా, సుమత్రా మరియు జావాలకు, మరియు భారతదేశం నుంచి దక్షిణ చైనాకు సముద్ర వాణిజ్య మార్గంలో వ్యాపించాయి. అవేవీ ఇప్పుడు లేవు.

బౌద్ధమతం ఎలా వ్యాపించింది

ఆసియా అంతటా బౌద్ధమతం యొక్క విస్తరణ శాంతియుతంగా మరియు అనేక విధాలుగా జరిగింది. శాక్యముని బుద్ధుడు ఒక ట్రావెలింగ్ టీచర్ గా, సమీప రాజ్యాలలో స్వీకరించే మరియు ఆసక్తి ఉన్నవారితో తన అంతర్దృష్టులను పంచుకుంటూ, ఒక ఉదాహరణగా నిలిచాడు. తన సన్యాసులను ప్రజల్లోకి వెళ్లి తన బోధనలను వివరించమని ఆదేశించాడు. తన స్వంత మతాన్ని స్థాపించడానికి అక్కడి ప్రజల స్వంత మతాన్ని విడిచిపెట్టి కొత్త మతానికి మారమని అతను ఎవ్వరిని అడగలేదు. బుద్ధుని లక్ష్యం వాస్తవికతపై అవగాహన లేకపోవడం వల్ల ఇతరులు తమ కోసం సృష్టించుకుంటున్న అసంతృప్తి మరియు బాధలను అధిగమించడానికి సహాయపడటం మాత్రమే. ఆ తర్వాతి తరాల అనుచరులకు అతని ఉదాహరణ నుంచి  ప్రేరణ పొంది, వారి జీవితాలకు ఉపయోగపడే అతని పద్ధతులను ఇతరులతో పంచుకున్నారు. ఇప్పుడు "బౌద్ధమతం" అని పిలువబడేది ఈ విధంగా విస్తృతంగా వ్యాపించింది.

కొన్నిసార్లు, ఈ ప్రాసెస్ సాధారణంగానే అభివృద్ధి చెందింది. ఉదాహరణకు, బౌద్ధ వర్తకులు వివిధ దేశాలను సందర్శించి అక్కడే స్థిరపడినప్పుడు, స్థానిక ప్రజలలోని కొంతమంది సహజంగానే ఈ విదేశీయుల నమ్మకాలపై ఆసక్తిని పెంచుకున్నారు, ఎలాగైతే ఇండోనేషియా మరియు మలేషియాలో ఇస్లాం పరిచయం అయ్యిందో. ఈ ప్రాసెస్ మధ్య ఆసియాలోని సిల్క్ మార్గం వెంబడి ఉన్న ఒయాసిస్ రాష్ట్రాలలో బౌద్ధమతంతో కూడా జరిగింది, సాధారణ యుగానికి ముందు మరియు తర్వాత రెండు శతాబ్దాలలో. స్థానిక పాలకులు మరియు వారి ప్రజలు ఈ భారతీయ మతం గురించి బాగా తెలుసుకుని, వారి వ్యాపారుల స్వంత ప్రాంతాల నుంచి సన్యాసులను సలహాదారులుగా లేదా ఉపాధ్యాయులుగా ఆహ్వానించారు, చివరికి, చాలా మంది బౌద్ధమతాన్ని స్వీకరించారు. క్రీస్తుపూర్వం 2 వ శతాబ్దం తర్వాత గ్రీకులు వంటి జయించే ప్రజలను ప్రస్తుత మధ్య పాకిస్తాన్‌లోని గాంధార బౌద్ధమత సమాజంలో నెమ్మదిగా సాంస్కృతిక సమ్మేళనం చేయడం ద్వారా మరొక సేంద్రీయ పద్ధతి జరిగింది.

తరచుగా, ఈ వ్యాప్తి ప్రధానంగా బౌద్ధమతాన్ని స్వీకరించిన మరియు మద్దతు ఇచ్చిన ఒక శక్తివంతమైన రాజు యొక్క ప్రభావానికి కారణమైంది. ఉదాహరణకు, క్రీస్తుపూర్వం 3 వ శతాబ్దం మధ్యలో, అశోక రాజు యొక్క వ్యక్తిగత ఆమోదంతో బౌద్ధమతం ఉత్తర భారతదేశం అంతటా వ్యాపించింది. ఈ గొప్ప సామ్రాజ్య నిర్మాత తన పౌరులను బౌద్ధ విశ్వాసాన్ని స్వీకరించమని బలవంతం చేయలేదు, కానీ తన రాజ్యం అంతటా ఇనుప స్తంభాలపై చెక్కిన శాసనాలను పోస్ట్ చేసి తన ప్రజలను నైతిక జీవితాన్ని గడపమని ప్రేరేపించాడు. ఈ సూత్రాలను తనే స్వయంగా అనుసరించడం ద్వారా, అతను బుద్ధుని బోధనలను స్వీకరించడానికి ఇతరులను ప్రేరేపించాడు.

అశోక రాజు కూడా సుదూర దేశాలకు మిషన్లను పంపి తన రాజ్యం బయట మత మార్పిడి చేశాడు, కొన్నిసార్లు శ్రీలంక రాజు దేవనాంపియా తిస్సా వంటి విదేశీ పాలకుల ఆహ్వానం మేరకు సహాయం చేశాడు. మరి కొన్నిసార్లు తన సొంత చొరవతో సన్యాసులను రాయబారులుగా పంపేవాడు. సందర్శించే సన్యాసులు మతం మారమని ఇతరులపై ఒత్తిడి చేయరు, కానీ బుద్ధుని బోధనలను వాళ్ళకు చెప్పి తమనే ఏది కావాలో  ఎంచుకోవడానికి అనుమతిని ఇచ్చారు. దక్షిణ భారతదేశం మరియు దక్షిణ బర్మా వంటి ప్రదేశాలలో బౌద్ధమతం ఊపందుకుంది, అయితే మధ్య ఆసియాలోని గ్రీకు కాలనీలలో, ఎక్కువగా ప్రభావం కనపడలేదు.

16 వ శతాబ్దపు మంగోల్ చక్రవర్తి అల్తాన్ ఖాన్ లాంటి ఇతర మత రాజులు బౌద్ధ గురువులను తమ రాజ్యానికి ఆహ్వానించారు. వారి ప్రజలను ఏకం చెయ్యడానికి మరియు వారి పాలనను స్థిరీకరించడంలో సహాయపడటానికి బౌద్ధమతాన్ని వారి అధికారిక మతంగా ప్రకటించారు. ఈ ప్రక్రియలో, వారు బౌద్ధేతర, మరియు స్థానిక మతాల యొక్క కొన్ని ఆచారాలను నిషేధించి ఉండవచ్చు మరియు వాటిని అనుసరించిన వారిని కూడా హింసించి ఉండవచ్చు, కాని ఈ అరుదైన భారీ ప్లాన్ లు ఎక్కువగా రాజకీయ ప్రేరేపితమైనవి. అటువంటి ప్రతిష్టాత్మక పాలకులు ఇప్పటికీ బౌద్ధ విశ్వాసాలు లేదా ఆరాధన పద్ధతులను పాటించమని ఎవరినీ బలవంతం చెయ్యలేదు. ఇది పూర్తిగా మత విశ్వాసం లాంటి దానిలో ఒక భాగం కాదు.

సారాంశం

శాక్యముని బుద్ధుడు తన బోధనలను గుడ్డిగా అనుసరించవద్దని, వాటిని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే పాటించమని ప్రజలకు చెప్పాడు. ఉత్సాహపూరిత మిషనరీల బలవంతం లేదా రాజ ఆజ్ఞతో ప్రజలు బుద్ధుని బోధనలను అంగీకరించలేదు. 17 వ శతాబ్దం ప్రారంభంలో, నైజీ టోయిన్ తూర్పు మంగోల్ నోమాడ్ లకు వారు గుర్తుంచుకునే ప్రతి వచనానికి పశువులను సమర్పించడం ద్వారా బౌద్ధమతాన్ని అనుసరించడానికి లంచం ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఆ నోమాడ్ వాళ్ళు అధికారులకు కంప్లైంట్ చెయ్యగా, అతిగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని శిక్షించి బహిష్కరించారు.

చాలా విధాలుగా, బౌద్ధమతం ఆసియా అంతటా శాంతియుతంగా వ్యాపించగలిగింది. ప్రేమ, కరుణ మరియు జ్ఞానం యొక్క సందేశాన్ని తీసుకెళ్లింది, అదే సమయంలో వివిధ ప్రజల అవసరాలు మరియు స్వభావాలకు అనుగుణంగా ఉంది.

Top