నాలుగు ఉత్తమమైన సత్యాలకు అనుగుణంగా నిర్మాణాత్మకమైన లామ్-రిమ్

నాలుగు అసలైన నిజాలు

బుద్ధ శాక్యముని తన జ్ఞానోదయాన్ని పొందిన తర్వాత, అటువంటి స్థితిని మనం కూడా సాధించడానికి వివిధ పద్ధతులను బోధించాడు. ఇందులోని ప్రాథమిక పద్ధతి, నివారణ చర్యలను తీసుకోవడం, మరో మాటలో చెప్పాలంటే, ధర్మాన్ని ఆచరించడం. ముందు, (1) ప్రతి ఒక్కరూ ఎదుర్కునే నిజమైన సమస్యలు ఉంటాయి. వీటికి (2) నిజమైన కారణాలు ఉంటాయి. ఏదేమైనా, (3) ఈ సమస్యలను వాటి కారణాలను ఆపడం ద్వారా వాటి యొక్క నిజమైన ముగింపును మనం సాధించవచ్చు మరియు ఈ నిజమైన ముగింపుని తీసుకురావడానికి, మనం (4) నిజమైన మానసిక మార్గాలను అభివృద్ధి చేసుకోవాలి.

ప్రాథమిక స్థాయి

ఈ నాలుగు అసలైన సత్యాలను (నాలుగు ఉత్తమమైన సత్యాలు) వివిధ స్థాయిలలో అర్థం చేసుకోవచ్చు. ప్రాథమిక దశలో, పునర్జన్మ యొక్క అధ్వాన్నమైన స్థితిలో మళ్ళీ జన్మించడం యొక్క నిజమైన సమస్యలు ఉన్నాయి. మన౦ ఒక విపరీతమైన బాధలో ఉన్నప్పుడు, విపరీతమైన అనారోగ్యాన్ని, ఆకలిని, దప్పికను అనుభవి౦చినప్పుడు, లేదా ఎప్పుడూ బాధలో మునిగితేలుతు౦టే, మన ఆధ్యాత్మిక వికాసానికి ఎలాంటి సమయ౦ గానీ, అవకాశ౦ గానీ ఉ౦డదు. ఎందుకంటే మన మనసులు తీవ్రమైన సమస్యలతో నిండిపోతాయి.

దీనికి అసలైన కారణం విధ్వంసకరంగా వ్యవహరించడమే. బుద్ధుడు బోధించినట్లుగా, మనం నొప్పిని లేదా బాధను సృష్టిస్తే, ఆ బాధను మనమే అనుభవించాలి. మరోవైపు, మనం నిర్మాణాత్మకంగా పనిచేస్తే, మనం ఆనందాన్ని పొందుతాము, చివరికి ఈ ఆనందాన్ని మనమే అనుభవిస్తాము. కాబట్టి, ఆ తీవ్రమైన సమస్యల యొక్క నిజమైన ముగింపును మనం సాధించాలనుకుంటే, నెగెటివ్ లేదా విధ్వంసక పనుల నుంచి మనల్ని మనం నియంత్రించుకునే నిజమైన మార్గాన్ని అనుసరించాలి.

ముందుగా, మనకు ఒక విలువైన జీవితం ఉందని గ్రహించాలి. ప్రస్తుతం మనకు ఆధ్యాత్మికంగా ఎదగడానికి, మరియు అభివృద్ధి చెందడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు, మనం నిర్బంధ శిబిరాల్లో లేము లేదా తీవ్రమైన కరువుతో బాధపడటం లేదు. అయితే, ఈ అవకాశాలు శాశ్వతంగా ఉండవు, ఎందుకంటే మనమందరం ఖచ్చితంగా చనిపోతాము మరియు ఈ విలువైన మానవ జీవితం ముగిసిపోతుంది. ఇది ఎప్పుడు జరుగుతుందో మనం ఖచ్చితంగా చెప్పలేము. ఏ క్షణంలోనైనా మనల్ని ఒక ట్రక్కు వచ్చి ఢీ కొట్టవచ్చు. ఇప్పుడు మనం చనిపోతే, మనం మన జీవితకాలంలో చెడుగా ప్రవర్తించి ఉంటే, ఇది భవిష్యత్తులో ఇంకా దారుణమైన స్థితికి కారణమవుతుంది. మనం సృష్టించిన బాధను, నొప్పిని మళ్ళీ మనమే అనుభవించాల్సిన పరిస్థితుల్లో తిరిగి పుట్టవచ్చు. కాబట్టి, ఈ భవిష్యత్తును చూసి, దీని నుంచి ఏదైనా దారి ఉందా లేదా అని మనం వెతుకుతాము.

మనస్సు, మాటలు, శరీర సామర్థ్యాలు అపరిమితంగా, స్పష్టంగా ఉండేలా అన్ని పరిమితుల నుంచి తమను తాము తొలగించుకున్న వారే బుద్ధులు. కోపం, అనుబంధం లేదా మతోన్మాదం లాంటి ఇబ్బంది పెట్టే భావోద్వేగాలు లేదా వైఖరులకు వాళ్ళ మనస్సులు పరిమితం కావు. వాళ్ళు మానసిక నీరసం లేదా మానసిక ఇబ్బందులకు పరిమితం కాదు. మనస్సు యొక్క ఒక విషయంగా పరిగణించబడే వారి హృదయాలు స్వార్థం లేదా పక్షపాతంతో పరిమితం చెయ్యబడవు. ఉదాహరణకు, వారి మాటలు కమ్యూనికేట్ చేసే సామర్థ్యానికి మరియు వారి శరీరాలు శక్తికే పరిమితం కాదు. ఈ విధంగా, వారి మనస్సులు, వారి హృదయాలు, మాటలు మరియు శరీరాల గురించి ప్రతిదీ స్పష్టంగా ఉంటుంది. అంతేకాక, వాళ్ళు తమ శక్తినంతా గ్రహించారు కాబట్టి వాళ్ళు సాధ్యమైనంత అత్యున్నత స్థితికి ఎదగగలరు.

బుద్ధులు ఇలా చెయ్యడమే కాకుండా, దాన్ని ఎలా చెయ్యాలో కూడా చెప్పారు. ఇది తమ పరిమితులతో ఆగిపోకుండా ఉండటానికి నివారణ చర్యలు లేదా ధర్మాన్ని తీసుకోవడం ద్వారా, ఇది తమకు మరియు ఇతరులకు సమస్యలను సృష్టిస్తుంది. అటువంటి లక్ష్యాలను సాధించి, వాటి పట్ల బాగా ముందుకు సాగే వారి కమ్యూనిటీ కూడా ఉంటుంది, అదే సంఘం. అలాంటప్పుడు బుద్ధుడు, ధర్మం, సంఘంలోని మంచి గుణాలను గమనించి, మనకు ఇంకా సమస్యలు సృష్టించే దిశలో సాగుతున్న జీవితాన్ని అనుభవించాలని కోరుకోకుండా, బుద్ధుడు, ధర్మం, సంఘ మార్గంలో వెళితే ఇలాంటి సమస్యల నుంచి మనం తప్పించుకోవచ్చు.  మనం వాళ్ళ నుంచి జీవితంలో మన సురక్షితమైన దారిని పొందుతాము. ఆశ్రయం పొందడం అంటే ఇదే - మన జీవితాలకు ఒక సురక్షితమైన దారిని పొందడం.

కారణం మరియు ప్రభావం యొక్క నియమాలను అనుసరించడం ద్వారా నిజమైన సురక్షిత దారి అనేది ఒకటి సూచించబడుతుంది. కాబట్టి, భవిష్యత్తులో మనకు సమస్యలు రాకుండా ఉండాలంటే, చంపడం, దొంగతనం చెయ్యడం, అబద్ధం చెప్పడం మొదలైన వాటి నుంచి మనల్ని మనం నియంత్రించుకుని నెగెటివ్ గా ప్రవర్తించకుండా నిరోధించే అసలైన మార్గాన్ని అనుసరించాలి. అందువల్ల, మనం నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తాము. ఇది నాలుగు నిజాల యొక్క ప్రాథమిక అవగాహన స్థాయి.

మధ్యంతర స్థాయి

మధ్యంతర స్థాయిలో, మనం ఏ రకమైన పరిస్థితిలో తిరిగి జన్మించినప్పటికీ, మనం పుట్టడం, అనారోగ్యానికి గురికావడం, వృద్ధాప్యం మరియు చనిపోవడం లాంటి అన్ని నిజమైన సమస్యలను అనుభవిస్తాము. మనం కోరుకున్నది పొందడానికి ప్రయత్నించినా అది లభించకపోవడం, మనకు ఇష్టం లేనిది జరగడం లాంటి సమస్యలు ఉంటాయి. ఎప్పుడూ ఇతరులతో కష్టమైన సంబంధాలను కలిగి ఉండటంలో నియంత్రణలో లేని రిపీట్ అయ్యే సమస్యలు మనకు ఉంటాయి. వీటికి అసలైన కారణం రియాలిటీ గురించి మనకు అవగాహన లేకపోవడమే – మనం ఎవరు, మనం ఎలా ఉనికిలో ఉన్నాం అని. దాని వల్ల, మనం అహాన్ని పొందుతాము, కానీ దాని గురించి మనకు ఒక అభద్రతా భావం ఉంటుంది. దాని వల్ల, అటువంటి గుర్తింపులను సమర్థించడానికి లేదా ధృవీకరించడానికి, మన మనస్సులు అనుబంధం, కోపం, అమాయకత్వం, గర్వం, అసూయ, నిర్ణయం తీసుకోలేని ఆలోచనలు లాంటి ఇబ్బంది పెట్టే భావోద్వేగాలు మరియు వైఖరులతో నిండిపోతాయి. వీటి ఆధారంగా, వివిధ ప్రేరణలు లేదా కర్మలు మన మనస్సులోకి వస్తాయి, అవి హఠాత్తు ప్రవర్తన రూపంలో పనిచేస్తాయి. ఉదాహరణకు, సాధ్యమైనంత ఎక్కువ సంపద, వస్తువులు లేదా స్నేహితులను కూడబెట్టడానికి ప్రయత్నించడం ద్వారా లేదా మనకు నచ్చని ప్రతి దాన్ని మరియు ఎవరినైనా వదిలించుకోవడానికి లేదా నాశనం చెయ్యడానికి ప్రయత్నించడం ద్వారా మన గుర్తింపులను ఇంకా సురక్షితంగా మార్చే ప్రయత్నంలో మనం దీన్ని చేస్తాము. ఒకరినొకరు అరుచుకోవడం లేదా క్రూరంగా ప్రవర్తించడం లాంటి ప్రవర్తనలు మనకు నిజమైన సమస్యలను కలిగిస్తాయి.

ఈ సమస్యలకు నిజమైన ముగింపు తీసుకురావాలంటే మనం ఒక నిజమైన మార్గాన్ని అనుసరించాలి. ముందుగా, మనం సరైన ప్రేరణను పెంపొందించుకోవాలి, ఇది మన సమస్యల నుంచి విముక్తి పొందాలనే బలమైన సంకల్పంలా ఉంటుంది, దీన్నే కొన్నిసార్లు త్యాగం అని పిలుస్తారు. దీన్ని ప్రేరణగా తీసుకొని, రియాలిటీ లేదా శూన్యతను చూడగల విచక్షణా అవగాహనను మనం పెంపొందించుకోవాలి. అటువంటి జ్ఞానాన్ని పొందడానికి, మనకు ఏకాగ్రత అవసరం, మరియు మన మనస్సులపై అటువంటి నియంత్రణను కలిగి ఉండటానికి, మన శరీరాలు మరియు మాటల యొక్క కార్యాచరణలను మనం నియంత్రించగలగాలి. కాబట్టి, మనకు నైతిక సొంత క్రమశిక్షణ ఉండాలి. ఉన్నత నైతిక సొంత-క్రమశిక్షణ, ఏకాగ్రత మరియు వివేకం అనే మూడు ఉన్నత శిక్షణ యొక్క ఈ మార్గాన్ని అనుసరించడం ద్వారా శూన్యతను గ్రహించడానికి మనం విచక్షణాత్మక అవగాహనను పొందవచ్చు: ఉనికిలో ఉన్న అన్ని అసాధ్య మార్గాలు పూర్తిగా లేకపోవడం లాగా.

ఎందుకంటే, మనకు రియాలిటీ గురించి తెలియదు, మరియు మనం ఎవరు, ఈ ప్రపంచంలో మనం ఎలా ఉన్నాము అనే దాని గురించి గందరగోళానికి గురవుతాము. ప్రతిదీ దృఢంగా మరియు స్వతంత్రంగా ఉండటం లాంటి అసాధ్యమైన మార్గాల్లో ఉనికిని మనం గ్రహిస్తాము. అయితే, అంత ఊహాజనిత అసాధ్యమైన రీతిలో ఏదీ ఉండదు. అసాధ్యమైన రీతిలో ప్రతిదీ ఉనికిలో ఉండదు. అయితే, అసలు ఏదీ ఉండదని దీని అర్థం కాదు. కానీ, ఉనికిలో ఉన్న ప్రతిదీ ఏదొక దాని మీద ఆధారపడి ఉత్పన్నమయ్యే పద్ధతిలో ఉంటుంది, ప్రతిదీ కారణాలు మరియు పరిస్థితులపై, భాగాలపై లేదా మనస్సుతో సంబంధం మరియు మానసిక లేబులింగ్ ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. అటువంటి నిజమైన అవగాహన మరియు సాక్షాత్కార మార్గం ద్వారా, భావోద్వేగాలను ఇబ్బంది పెడుతున్న మానసిక అస్పష్టతలను లేదా మానసిక అడ్డంకులను మనం అధిగమించి ముక్తిని పొందవచ్చు. ఇది ఈ నాలుగు నిజమైన సత్యాల యొక్క మధ్యంతర స్థాయి అవగాహన.

అధునాతన స్థాయి

అధునాతన స్థాయిలో, సమస్యలను మనం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ అనుభవిస్తారు అని మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి, ఈ స్థాయిలో, ప్రతి ఒక్కరూ ఎదుర్కునే సమస్యలే నిజమైన సమస్యలు. ఇంకా చెప్పాలంటే, పక్క వాళ్ళ సమస్యలను పోగొట్టడానికి మనం సహాయం చెయ్యలేకపోవడం. ఈ సమస్యలకు అసలైన కారణం మన గురించి మాత్రమే ఆలోచించే మన స్వార్థం, మరియు ఇతరులను పట్టించుకోకపోవడం. అప్పుడు, ఇతరులకు ప్రయోజనం చేకూర్చే అన్ని నైపుణ్య మార్గాలను తెలుసుకోకుండా నిరోధించే మానసిక అస్పష్టతలు లేదా మానసిక అడ్డంకులు కూడా ఉంటాయి. మరో మాటలో చెప్పాలంటే, అస్పష్టతలు మన సర్వజ్ఞానాన్ని నిరోధిస్తాయి. మన సమస్యల నుంచి విముక్తి పొంది, అంతకు మించి బుద్ధుని స్థితిని సాధించడం, దీనిలో మన పరిమితులన్నింటినీ అధిగమించి, సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరికీ ప్రయోజనం అందేలా మన శక్తిని గ్రహించడం దీనికి నిజమైన ముగింపు.

దీనికి దారితీసే నిజమైన మార్గం, మొదటిది, బోధిచిత్త యొక్క ప్రేరణను అభివృద్ధి చేసుకోవడం. దీని అర్ధం మన హృదయాలను ఇతరులందరి కోసం తెరవడం మరియు రెండవది జ్ఞానోదయం పొందడం. దీని అర్ధం అందరికీ ప్రయోజనం అందేలా బుద్ధుని స్థితి యొక్క ప్రేరణను పెంపొందించడం. దీన్ని మన ప్రేరణగా తీసుకొని, మనం దీర్ఘకాలిక ఆలోచనలను లేదా పరిపూర్ణతలను అభివృద్ధి చేసుకుని ఆచరిస్తాము, ఇవన్నీ శ్రద్ధగల ప్రేమ మరియు కరుణతో కూడిన సానుభూతిపై ఆధారపడి ఉంటాయి. ఇవి ఉదారత, సొంత క్రమశిక్షణ, సహనశీలత, ఆనందకరమైన పట్టుదల, మానసిక స్థిరత్వం (ఏకాగ్రత), విచక్షణా అవగాహన (వివేకం) వైఖరులు. దూరదృష్టితో కూడిన విచక్షణతో, మన ఇబ్బంది పెట్టే భావోద్వేగాలను అధిగమించడానికి మరియు ముక్తిని పొందడానికి మనం చూడాల్సిన రియాలిటీ లేదా శూన్యతను చూస్తాము. ఏదేమైనా, స్వేచ్ఛగా ఉండాలనే సంకల్పం కంటే మన ప్రేరణగా బోధిచిత్త చాలా బలంగా ఉంటుంది కాబట్టి, ఆ అవగాహనకు ఎక్కువ శక్తి ఉంటుంది.

మన సమస్యల నుంచి విముక్తి పొందాలనే సంకల్పం మాత్రమే మనకు ఉంటే, ఇది రియాలిటీను అర్థం చేసుకోవడానికి పరిమిత శక్తిని అందిస్తుంది. ఏదేమైనా, రియాలిటీను చూడటానికి మన ప్రేరణ, దానికి తోడు, ప్రతి ఒక్కరికీ ప్రయోజనం అందించగలగడం అయితే, ఇది ఇంకా ఎక్కువ శక్తిని జోడిస్తుంది. అందువల్ల, మన అవగాహన రెండు స్థాయిల అస్పష్టతను తగ్గించగలదు, భావోద్వేగాలను ఇబ్బంది పెట్టే అస్పష్టతలను మాత్రమే కాదు, సర్వజ్ఞానాన్ని నిరోధించే వాటిని కూడా తగ్గించవచ్చు.

ఉదాహరణకు, విషపూరిత పాము కాటులను ఎలా నయం చెయ్యాలనే దాని గురించి ఒక వైద్య ఉపన్యాసం ఉందనుకోండి. డాక్టర్ అవ్వడానికి మాత్రమే ఉన్న ఒక విద్యార్థి హాజరై, బాగా డబ్బు సంపాదించి, తన ఆర్థిక సమస్యలను అధిగమించాలని అనుకుంటే, అతను కొంత శక్తితో మాత్రమే ఈ ఉపన్యాసాన్ని వింటాడు. అయితే, పాము కాటుకు గురైన బిడ్డ యొక్క తల్లి ఆ తరగతి గదిలోకి వెళ్తే, తన బిడ్డ నయం అవ్వాలనే తీవ్రమైన ఆందోళనతో తను ఆ పాము కాటును బాగా తీవ్రతతో ఎలా నయం చెయ్యాలో నేర్చుకోవాలని అనుకుంటుంది. అదే విధంగా, రియాలిటీను అర్థం చేసుకోవడం వెనుక మనకు బోధిచిత్త ప్రేరణ ఉన్నప్పుడు, ఇది దానికి ఇంకా బలమైన శక్తిని జోడిస్తుంది, అలా మన అవగాహన మన మానసిక అస్పష్టతలన్నింటినీ తొలగించగలదు.

ఈ రకమైన పద్ధతి ఆ ప్రక్రియను మరియు జ్ఞానాన్ని కలిపే మనస్సు యొక్క మార్గాన్ని కలిగి ఉంటుంది. అయితే, ఇక్కడ అవి సూత్ర స్థాయిలో, రెండూ ఒకే సమయంలో జరగవు. దీనికి బదులుగా, ఇది ప్రతి ఒక్కటి వేరొక సందర్భంలో జరుగుతుంది. అందువల్ల, మన హృదయాలను ఇతరులందరి కోసం తెరవడం మరియు వారికి ప్రయోజనం చేకూర్చడానికి జ్ఞానోదయాన్ని సాధించే పద్ధతి మనకు జ్ఞానం లేదా రియాలిటీను అర్థం చేసుకునే సందర్భంలో ఉంటుంది మరియు దీనికి విరుద్ధంగా ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే, మన హృదయాలు ఇతరులందరి కోసం తెరవడం అనేది సందర్భం మీద ఆధారపడి ఉంటుంది లేదా మన మనస్సులు రియాలిటీను విస్తరిస్తాయి. మన మనస్సులు రియాలిటీ కోసం తెరుచుకున్నప్పుడు, మన హృదయాల సందర్భంలోనే అలా జరుగుతాయి. ఈ విధంగా, ఒకటి ఇంకొక దాని నేపధ్యంలో ఉంటుంది, మరియు మనం బుద్ధులుగా మారే వరకు, రెండూ ఒకే మనస్సులో ఒకేసారి ఉండలేవు.

ఈ పద్ధతితో మన మానసిక అస్పష్టతలను తొలగించుకోవడానికి చాలా సమయం పడుతుంది. దీనికి మూడు లెక్కలేనన్ని ఇయాన్లు అవసరం, లెక్కలేనన్ని అనేది అతిపెద్ద పరిమిత సంఖ్య, ఇది 10 తరువాత 60 సున్నాలతో ఉంటుంది. దాన్ని మనం జిలియన్ అని అంటాం. ఇది చాలా సుదీర్ఘమైన సమయం మరియు మన పరిమితులను అధిగమించడానికి మరియు వారికి ఉత్తమంగా ప్రయోజనం అందించగల మన సామర్థ్యాన్ని గ్రహించడానికి ఇతరులు మన కోసం ఇంత సమయం వేచి ఉండలేరు. ఇక్కడే తంత్రం అనేది వస్తుంది. తంత్రం అనేది బుద్ధుని స్థితిని చేరుకోవడానికి - సాధ్యమైనంత త్వరగా ఇతరులకు ప్రయోజనం అందించడానికి ప్రవేశపెట్టబడిన ఒక మహాయాన లేదా విశాల మనస్సు కలిగిన అభ్యాసం. ఇది నాలుగు నిజమైన సత్యాల గురించి మనం చర్చించిన అన్ని పద్ధతులపై ఆధారపడి ఉంటుంది.

Top