Arrow left ఇంతకముందుది
ఏమిటి...
ఆర్టికల్ 20 యొక్క 20

బౌద్ధమతం మరియు పరిణామక్రమం

Study buddhism dino 1 1

డార్విన్ పరిణామ సిద్ధాంతం సహజ ఎంపిక ప్రక్రియ మరియు కాలక్రమేణా జాతుల జీవ శరీరాలు ఎలా మారుతాయో చెప్తుంది. ది ఆరిజిన్ ఆఫ్ ది స్పీసిస్ అనే తన వర్క్ లో వివరించిన ఈ విషయం ఆ సమయంలో మత విద్వేషంగా పరిగణించబడింది, ఎందుకంటే సర్వ శక్తిమంతుడైన దేవుడు ఒక స్థిరమైన ప్రపంచాన్ని మరియు అందులోని అన్ని జీవురాశులను సృష్టించాడనే ఆలోచనకు ఈ సిద్ధాంతం విరుద్ధంగా ఉండింది. ఈ రోజుకీ ఈ పరిణామ సిద్ధాంతం కొన్ని మతాలలో అంగీకరించబడలేదు, ఈ సాధారణ ఆలోచనకు విరుద్ధమైన ఎలాంటి విషయం బౌద్ధమత బోధనలలో లేదు. నిజానికి, బౌద్ధులకు, ఈ సిద్ధాంతం బుద్ధుని బోధనలతో పూర్తిగా ఆధారితంగా సరితూగుతుంది. ధర్మం యొక్క నాలుగు లక్షణాలలో మొదటిది: అశాశ్వతం, సృష్టివాదం కాదు. అనేక కారణాలు మరియు పరిస్థితుల ఆధారంగా ఈ నిజాలు నిరంతరం ఉద్భవిస్తున్నాయి మరియు పరిణామం చెందుతున్నాయి,  మానవులు మరియు జంతువులు ఈ స్థిరత్వం యొక్క గొప్ప ప్రవాహంలో భాగం కాకపోతే నిజంగానే ఒక వింత అనే అనుకోవాలి. 

కాలం మరియు పరిణామం గురించి బౌద్ధ ఆలోచనలు డార్విన్ ఆలోచనకు సరిగ్గా అనుగుణంగా ఉన్నాయని దీని అర్థం కాదు. డార్విన్ సిద్ధాంతం జీవ, భౌతిక విషయాలపై దృష్టి కేంద్రీకరిస్తుంది, జీవరాశులు మరింత సంక్లిష్టంగా మారుతున్న కొద్దీ అవగాహనను పెంచుకోవాలనే ఆలోచన ఉన్నప్పటికీ, అట్టడుగు జీవరాశుల నుంచి బుద్ధుని పూర్తి జ్ఞానోదయం వరకు అవగాహన యొక్క పరిణామం వర్ణనలతో ఇది బుద్ధుడి టీచింగ్స్ లాగా లోతుగా వివరించదు.

ఇంకా, డార్విన్ పరిణామం క్రమంగా మరియు స్థిరమైన "మెరుగుదలను” కలిగి ఉంది - అంటే, జీవులు క్రమంగా మరియు సానుకూలంగా వాటి మనుగడకు మరియు సంతానాన్ని ఉత్పత్తి చేయగల సామర్థ్యానికి తగినట్టుగా రూపాంతరం చెందుతాయి. బౌద్ధమతం ఏ జీవి అయినా వివిధ రూపాల్లో పునర్జన్మ పొందవచ్చని బోధిస్తుంది, మరియు ఈ ప్రక్రియ లీనియర్ ఇంప్రూవ్మెంట్ కి సంబంధించింది కాదు. కర్మ, కారణాలు మరియు పరిస్థితులను బట్టి వ్యక్తిగత జీవులు మరియు అన్ని జాతులు రూపాంతరం చెందుతాయి. అందువల్ల, వివరాలు వేరుగా ఉన్నప్పటికీ, పరిణామ సూత్రం ఈ రెండు వ్యవస్థలలో కనిపిస్తుంది.

విశ్వం యొక్క పరిణామం మరియు పెరుగుదల

శాస్త్రవేత్తల స్టడీ ప్రకారం, బిగ్ బ్యాంగ్ థియరీలో - 14 బిలియన్ సంవత్సరాల క్రితం సంభవించిన విశ్వం యొక్క భారీ, వేగవంతమైన విస్తరణ - కాలానికి ప్రారంభం. ఇది 4 బిలియన్ సంవత్సరాల క్రితం మన గ్రహం ఏర్పడటానికి పునాదిని సృష్టించింది. కాలక్రమేణా, హైడ్రోజన్ వాయువు వివిధ నక్షత్రాలు మరియు గ్రహాలుగా అభివృద్ధి చెందింది. మనం ఇప్పుడు భూమి అని పిలువబడే ఈ గ్రహంపై, ఏక కణ జీవులు పుట్టాయి. ఇవి నేడు మన చుట్టూ కనిపించే వివిధ అధునాతన జీవరాశుల లాగా రూపాంతరం చెందాయి. విశ్వం విస్తరించి పరిణామం చెందిన కోట్లాది సంవత్సరాల తర్వాత ఈ విశ్వం అంతమవుతుందని, అది ఎలా జరుగుతుందనే దానిపై వాళ్ళు అనేక విభిన్న సిద్ధాంతాలను ప్రతిపాదించారు.

బుద్ధుడు విశ్వం యొక్క పరిణామం మరియు చివరికి విచ్ఛిన్నం గురించి ప్రారంభ సూత్రం (పాలి: అగన్న సుట్ట) లో చర్చించాడు. అక్కడ, అతను మన గ్రహంపై పర్యావరణం యొక్క నిర్మాణం మరియు దాని నాశనం, అలాగే వివిధ జీవరాశుల ఆవిర్భావం మరియు వాటి అంతం, వివిధ సమాజాల అభివృద్ధి మరియు చివరికి వాటి మరణాలను కూడా పరిశీలిస్తాడు. అయితే, ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి మరియు బౌద్ధమతానికి మధ్య ఉన్న తేడా ఏమిటంటే, విశ్వం యొక్క పుట్టుక, స్థిరత్వం మరియు నశించడం అనేది అనేక చక్రాలలో ఒక భాగం మాత్రమేనని, కాలానికి ప్రారంభం లేదా అంతం లేదని బుద్ధుడు చెప్పడం. ఆ సూత్రం ఇలా చెప్తుంది:

చాలా కాలం గడిచాక, వశిష్టా, ఈ ప్రపంచం పుడుతుంది... కానీ చాలా కాలం తర్వాత ఈ ప్రపంచం పరిణామం చెందింది... ఆ కాలంలో, వశిష్ఠా, ఒకే ఒక నీటి సమూహం ఉంటుంది, అంతా చీకటిగా. చంద్రుడు, సూర్యుడు కనిపించరు, నక్షత్రరాశులు, నక్షత్రాలు కనిపించవు, రాత్రి పగలు కనిపించవు, నెలలు, పక్షం రోజులు కనిపించవు, ఋతువులు, సంవత్సరాలు కనిపించవు, మగ, ఆడ కనిపించరు. జీవులను (కేవలం) జీవులుగా వర్గీకరించబడతాయి...

ఇక్కడ, బుద్ధుడు జీవుల ప్రస్తావనతో పాటు ప్రపంచ వ్యవస్థల చక్రాల గురించి చాలా స్పష్టంగా మాట్లాడటం మనం చూడవచ్చు. ఆడ మగ తేడాలు ఎలా వస్తాయో, వివిధ వర్గాల ప్రజలతో సమాజాలు ఎలా అభివృద్ధి చెందుతాయో ఈ సూత్రం చెప్తుంది. అప్పుడు అందులోని పర్యావరణం, జీవులు ఎలా క్షీణించి కనుమరుగవుతాయో వివరిస్తుంది.

ఈ సూత్రంలో, ఆధారిత ఆవిర్భావం మరియు అశాశ్వతతపై బౌద్ధ బోధనల నుంచి, బిగ్ బ్యాంగ్ యొక్క శాస్త్రీయ సిద్ధాంతాలను లేదా ఈ విశ్వం అంతం గురించి వారి సిద్ధాంతాలను అంగీకరించడంలో ఎటువంటి వైరుధ్యం లేదని మనం చూడవచ్చు. 

శరీరాల పరిణామక్రమం

ఇప్పుడు, మనం జీవ శరీరాల పరిణామాన్ని మరింత లోతుగా పరిశీలిద్దాం. పరిణామ సిద్ధాంతంలో దీని గురించి స్పష్టంగా ఉంది - మనమందరం ఏక కణ జీవుల నుంచి వచ్చాము. డార్విన్ సిద్ధాంతం ప్రగతిశీల పరిణామాన్ని ప్రతిపాదిస్తుంది, దీనిలో జీవులు పై దిశగా పరిణామం చెందుతాయి - మరో మాటలో చెప్పాలంటే, మెరుగైన మార్గంలో మాత్రమే పరిణామం చెందే సహజ ధోరణిలో. ఇక్కడ, మనం భౌతిక ఆధారం గురించి మాత్రమే మాట్లాడుతున్నాము, ఎందుకంటే ఈ గ్రహం మీద ఉన్న భౌతిక జీవరాశులకు మరియు వాటిలో పునర్జన్మ పొందిన జీవుల మానసిక ప్రవర్తన మధ్య చాలా తేడా ఉంటుందని బౌద్ధమతం చెప్తుంది.

ఒకప్పుడు డైనోసార్లు మన గ్రహం మీద సంచరిస్తూ ఉండేవి కానీ ఇప్పుడు అవి అంతరించిపోయాయి. ఇప్పుడు మనం ఆ డైనోసార్లుగా ఎందుకు పునర్జన్మను పొందలేకపోతున్నాం? శాస్త్రీయ సిద్ధాంతాల ప్రకారం, సుమారు 66 మిలియన్ సంవత్సరాల క్రితం, ఒక విపత్తు డైనోసార్ల వినాశనానికి కారణమైంది, కానీ క్షీరదాలు (మన మానుషుల లాగా), తరువాత పుట్టాయి. డార్విన్ సిద్ధాంతం ప్రకారం డైనోసార్లు "అత్యంత దృఢమైన జాతులలో మనుగడ" సాగించలేకపోయాయి, అందువల్ల అవి అంతం అయిపోయాయి.

ఒక బౌద్ధమత అనుచరుడి ఆలోచనా విధానం నుంచి చూస్తే కర్మ శక్తులు, సామర్థ్యాలు పెరగడానికి సరైన పరిస్థితులు అందుబాటులో ఉండాలి. డైనోసార్ గా పునర్జన్మ పొందే అవకాశం మనకు ఈ భూమి మీద ప్రస్తుతానికి అయితే లేదు. దీనికి బదులుగా, పునర్జన్మ కోసం మనకు అనేక ఇతర భౌతిక జీవరాశులు అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా కాలక్రమేణా మార్పులకు లోనవుతూ ఉన్నాయి. ఎందుకంటే, ప్రస్తుతం మన విశ్వంలోని వేరొక చోట ఏదో ఒక గ్రహంపై డైనోసార్లు ఉన్నట్లయితే, అక్కడ మనం ఒక డైనోసార్ గా పునర్జన్మ పొందవచ్చని బౌద్ధమతం అంగీకరిస్తుంది!

శాస్త్రవేత్తలతో దలైలామా గారు జరిపిన ఒక చర్చలో కంప్యూటర్లు జీవం ఉన్న వాటిగా మారగలవా అని ప్రశ్నించారు. కంప్యూటర్లకు ఏదో ఒక రోజు మనసు వస్తుందా? అని. ఒక కంప్యూటర్ లేదా రోబోట్ మానసిక కొనసాగింపుకు ఆధారమైనంత అధునాతన స్థితికి చేరుకుంటే, మానసిక కొనసాగింపు దాని జీవితానికి భౌతిక ప్రాతిపదికగా పూర్తిగా జీవం లేని యంత్రంతో కనెక్ట్ కాకపోవడానికి ఎటువంటి కారణం లేదని ఆయన ఆసక్తికరంగా సమాధానమిచ్చారు.

ఈ విషయం కంప్యూటర్ అంటే మనసు అని చెప్పటం లేదు. కంప్యూటర్ లో కృత్రిమంగా మనం ఒక మనసును సృష్టించుకోవచ్చని చెప్పడం లేదు. ఏదేమైనా, ఒక కంప్యూటర్ తగినంత అధునాతనమైతే, మానసిక కొనసాగింపు దానితో కనెక్ట్ అవుతుంది మరియు దానిని అది భౌతిక రూపంగా తీసుకుంటుంది. ఇది డార్విన్ దాని కన్నా చాలా దూరమైన ఆలోచన!

బుద్ధుడు పరిణామక్రమం గురించి ఎందుకు ఎక్కువగా వివరించలేదు?

బౌద్ధులు బుద్ధుడిని సర్వజ్ఞుడిగా చూస్తే – అతను సంపూర్ణ జ్ఞానోదయం పొందాడు, అతనికి అన్నీ తెలుసు అని అంటారు. అలాంటప్పుడు అతను విశ్వం యొక్క పనితీరును మరియు జీవుల పరిణామాన్ని మరింత వివరంగా ఎందుకు చర్చించలేదు లేదా వెల్లడించలేదు? అని మనకు ఆలోచన వస్తుంది.

సాధారణంగా బుద్ధుడు బోధించిన ప్రతిదీ మనల్ని ముక్తి, జ్ఞాన మార్గంలో నడిపించే లక్ష్యంతో ఉంటుంది. అందువల్ల, విశ్వం మరియు దానిలోని జీవులు గడిపే విస్తారమైన చక్రాలను వర్ణించడంలో అతని ఉద్దేశ్యం ప్రజలు ఇప్పుడు ఉన్న విలువైన మానవ పునర్జన్మ యొక్క అరుదైనతను గ్రహించడంలో సహాయపడటం. దాని అరుదైనతనాన్ని, దాన్ని మళ్ళీ పొందడ౦లోని కష్టాన్ని గుర్తి౦చడ౦ ద్వారా, ప్రజలు తమ ప్రస్తుత జీవితాన్ని సద్వినియోగ౦ చేసుకొని ఈ ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధి౦చే౦దుకు కృషి చేయడానికి ప్రేరేపి౦చబడతారు. బుద్ధుడు మనకు విశ్వశాస్త్రం లేదా ఖగోళ భౌతిక శాస్త్రాన్ని బోధించడానికి ఈ లోకానికి రాలేదు.

ఆ లక్ష్యానికి సంబంధం లేని అంశాల గురించి ఆలోచించడం అనేది సమయం, శక్తిని వృథా చేయడమే అవుతుంది. ముఖ్యంగా మన మనస్సులు గందరగోళంతో నిండినప్పుడు, మనల్ని ఇబ్బంది పెట్టే భావోద్వేగాలతో వస్తున్నప్పుడు, విశ్వం గురించి మరియు దానిలో ఉన్న సున్నితమైన జీవుల సంఖ్య గురించి ఆలోచించడం - మన విముక్తి లక్ష్యం మరియు ఇతరులకు సహాయం చేసే సామర్థ్యం నుండి మనల్ని పక్కదారి పట్టిస్తుంది. అలా ఆలోచిస్తే మనం మరిన్ని ఇబ్బందులలో మునిగిపోయే అవకాశం ఉంటుంది.

ఈ విషయాన్ని వివరించే బుద్ధుని జీవితంలో అనేక కథలు ఉన్నాయి. ఉదాహరణకు, ఈ విశ్వం శాశ్వతమా కాదా, మరణానంతరం ఆత్మ ఉనికిలో ఉంటుందా లేదా అని బుద్ధుడిని అడిగారు. వీటన్నిటిలో బుద్ధుడు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. చివరికి బుద్ధుడు ఇలా మాట్లాడుతూ, ప్రజలు ఇప్పటికే వీటన్నిటి గురించి అయోమయంలో ఉన్నారు. అలాంటప్పుడు నేను ఏమి చెప్పినా మీకు వీటి గురించి మరింత గందరగోళాన్ని తెచ్చిపెడుతుంది. మారని, సృష్టించబడిన ఆత్మ అనేదే లేనప్పుడు, అటువంటి ఆత్మల సంఖ్య పరిమితమా లేదా అనంతమా అని ప్రశ్నించడంలో అర్థం ఏమిటి?

ఇది ఒక గొప్ప బోధన. అన్నింటికీ మించి, విశ్వం యొక్క పరిమాణాన్ని లేదా అందులోని జీవుల సంఖ్యను తెలుసుకోవడం - అవి ఎలా ఉన్నాయనే దాని గురించి మనకు సరైన సమాచారం ఉన్నా లేకపోయినా - మన బాధలను మరియు సమస్యలను అధిగమించడానికి అది మనకు సహాయపడుతోందా?  ఇది ఇతర జీవులకు ప్రయోజనాన్ని అందించడానికి సహాయపడుతోందా? మనకు ఉన్న ఈ అమూల్యమైన జీవితాన్ని వృధా చేస్తూ ఇలాంటి ప్రశ్నలను పరిష్కరించే లోపే మనం చనిపోతామని బుద్ధుడు చెప్పాడు. ఇటువంటి ఊహలు, సరదాగా అనిపించినా, నిజానికి మనకు సహాయపడవు. మన ప్రస్తుత పరిస్థితి యొక్క వాస్తవికతను గుర్తించి మనకు ఉన్న అరుదైన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం. మనం సంసారంలో ఉన్నాం, ఇప్పుడు విలువైన మానవ శరీరం మరియు మనస్సును కలిగి ఉన్నామని మనం అర్థం చేసుకోవడం ద్వారా, బాధలను దాటుకుని ఇతరులందరికీ సహాయం చేయడానికి వాటిని ఉపయోగించవచ్చు. పూర్తి జ్ఞానోదయాన్ని అందించే పద్ధతులను మనం అభ్యసించవచ్చు. ఒకసారి మనం ఆ స్థాయికి చేరుకుంటే ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు దొరుకుతాయి!

Top