శాక్యముని బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత చేసిన మొదటి బోధనలో నాలుగు ఉత్తమమైన సత్యాల గురించి బోధించాడు. ఈ నాలుగింటిని ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఉపయోగించుకోవడానికి రియాలిటీ (రెండు సత్యాలు) యొక్క బౌద్ధమత విధానం యొక్క జ్ఞానం మరియు ఎనాలిసిస్ మరియు అంతిమ గమ్యాలకు చేరుకునే మార్గాల (మూడు విలువైన రత్నాలు) గురించి స్పష్టమైన అవగాహన ఎలా అవసరమో అతను తన జీవితాంతం బోధిస్తూ నిరూపిస్తూనే ఉన్నాడు. ఒక సంక్షిప్త శ్లోకంలో దలైలామా గారు ఈ ముఖ్యమైన అంశాల మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని చెప్తారు. ఈ శ్లోకం యొక్క ఎనాలిసిస్ ముఖ్యమైన బౌద్ధమత బోధనలను కలిపి వాటిని ఎలా నేర్చుకోవాలో మరియు గణనీయమైన నిర్ధారణలకు ఎలా చేరుకోవాలో చూపిస్తుంది.