నాలుగు ఉత్తమమైన సత్యాలు: వివరణ

13:23
ప్రతి ఒక్కరూ వారి జీవితాలలో సమస్యలను మరియు దుఃఖాన్ని అనుభవిస్తారు; మరియు చరిత్ర అంతటా, ఈ దుఃఖాన్ని ఎదుర్కోవటానికి వివిధ పద్ధతులు ప్రతిపాదించబడ్డాయి. నేటి ప్రపంచంలో, ఇంటర్నెట్ అనేక ఫిలాసఫీలను తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇక్కడ మనం 2,500 సంవత్సరాల క్రితం బుద్ధుడు చెప్పిన ప్రత్యేక విధానాన్ని పరిశీలిస్తాము. అసలు మనం ఎందుకు బాధపడుతున్నాము మరియు మన జీవితంలో శాంతి మరియు ఆనందాన్ని ఎలా పొందవచ్చు అని.

పరిచయం

ముందు బౌద్ధమతాన్ని చూసినప్పుడు, అందులోని నాలుగు ఉత్తమమైన సత్యాలను తెలుసుకోవడం మంచిది. ఇది కూడా సముచితమే, ఎందుకంటే బుద్ధుడు కూడా ఇదే పద్ధతిలో బోధించడం ప్రారంభించాడు. బుద్ధుని కాలంలో, అప్పటికే అనేక మత మరియు ఫిలాసఫికల్ వ్యవస్థలు ఉన్నాయి. ఇప్పుడు, మనం చాలా విస్తృతమైన ఆధ్యాత్మిక బోధనలను చూడగలుతున్నాము. కాబట్టి, బౌద్ధమతం విషయానికి వచ్చినప్పుడు, బౌద్ధమత విధానం యొక్క ప్రత్యేకత ఏమిటో గుర్తించడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం. సహజంగా, బౌద్ధమతం అనేక సాధారణ బోధనలను ఇతర మత బోధనలతో పంచుకుంటుంది: దయగల, ప్రేమ గల వ్యక్తిగా ఉండటం, ఎవరికీ హాని కలిగించకుండా ఉండటానికి ప్రయత్నించడం లాంటివి. దాదాపు ప్రతి మతం మరియు ఫిలాసఫీలో మనం ఈ విషయాలను చూడవచ్చు. వాటి గురించి తెలుసుకోవడానికి బౌద్ధమతంలో వెతకాల్సిన అవసరం లేదు, అయినా కానీ బౌద్ధమతం దయ, ప్రేమ మరియు కరుణను అభివృద్ధి చేసే పద్ధతులలో చాలా సమృద్ధిగా ఉంది. బౌద్ధ బోధనలలో వేటినైనా మనం అంగీకరించినా అంగీకరించకపోయినా ఈ పద్ధతుల నుంచి మనం ప్రయోజనం పొందవచ్చు.

"బౌద్ధమతానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి?" అని అడిగితే, మనం నాలుగు ఉత్తమమైన సత్యాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. వీటి చర్చలో కూడా, ఇతర వ్యవస్థలతో మనకు చాలా సారూప్యత కనిపిస్తుంది.

మనకు "ఉత్తమమైన సత్యం" అనే పదం ఉంది, కానీ ఇది ఒక విచిత్రమైన అనువాదం. "ఉత్తమమైన" అనే పదం మధ్యయుగ కులీన వర్గాన్ని సూచించవచ్చు, కానీ ఇది నిజానికి బాగా జ్ఞానం పొందిన వారిని సూచిస్తుంది. ఈ విధంగా నాలుగు ఉత్తమమైన సత్యాలు వాస్తవికతను భావరహితంగా చూసిన వారు సత్యంగా భావించే నాలుగు నిజాలు. ఈ నాలుగు సత్యాలు నిజమే అయినా చాలా మందికి అవి అర్థం కావు, ఎక్కువ మందికి వాటి గురించి తెలియదు కూడా.

మొదటి ఉత్తమమైన సత్యం

మొదటి నిజమైన వాస్తవాన్ని సాధారణంగా "బాధ" అని పిలుస్తారు. మన జీవితాలు బాధలతో నిండి ఉన్నాయని, మనం సాధారణ ఆనందంగా భావించే దానిలో కూడా అనేక సమస్యలు ఉన్నాయని బుద్ధుడు చెప్పాడు. "బాధ" అని అనువదించబడిన పదం సంస్కృతంలో "దుఃఖ" నుంచి వచ్చింది. మనకు సుఖ, సుఖం, దుఃఖ, దుఃఖం ఉన్నాయి. భాషా పరంగా, అనేది ఒక స్థలం మరియు దుః అనేది అసంతృప్తిని లేదా అసహ్యాన్ని సూచించే పదం. "చెడు" లాంటి తీర్పు పదాలను మనం ఉపయోగించకూడదు, కానీ అది దాన్నే సూచిస్తుంది. మన మానసిక చోటుని, సాధారణంగా మన జీవితాల స్వభావాన్ని ప్రస్తావిస్తూ ఇందులో ఏదో లోపం ఉందని దుఃఖ సూచిస్తుంది. ఇది ఒక చెడు పరిస్థితి.

కాబట్టి, దానిలో చెడ్డది ఏమిటి? ముందుగా, మనము బాధ, దుఃఖము మరియు విచారము లాంటి తీవ్రమైన బాధలను అనుభవిస్తాము. ఇది మనమందరం అర్థం చేసుకోగల విషయం, మరియు ప్రతి ఒక్కరూ, జంతువులు కూడా దీనిని వదిలించుకోవాలని కోరుకుంటారు. బాధ, దుఃఖం ఒక అసంతృప్త పరిస్థితి అని, దాని నుంచి బయటపడటం మంచిదని బౌద్ధమతంలో ప్రత్యేకంగా ఏమీ చెప్పబడలేదు. రెండవ రకం బాధను మార్పు యొక్క బాధ అని పిలుస్తారు, ఇది మన సాధారణ, రోజువారీ ఆనందం గురించి వివరిస్తుంది. ఈ రకమైన సంతోషానికి అసలు సమస్య ఏమిటి? ఇక్కడి సమస్య ఏమిటంటే, ఇది ఎక్కువ కాలం ఉండదు; ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. మనం మామూలు ఆనందంగా భావించేది అసలు నిజమైన ఆనందం అయితే, ఇది మనకు ఎంత ఎక్కువగా ఉంటుందో మనం అంత సంతోషంగా ఉంటాం. కాబట్టి, చాక్లెట్ ను తినడం ద్వారా ఆనందాన్ని పొందితే, మనం ఎంత ఎక్కువ తింటే, మనం అంత సంతోషంగా ఉంటాము. ఇది నిజం కాదని మనకు తెలుసు! లేదా ఒక ప్రియమైన వ్యక్తి మీ చేతిని గంటల తరబడి తడుముకోవడాన్ని ఊహించుకోండి. ఆహ్లాదకరమైన అనుభూతి తొందర్లో బాధగా లేదా వింతగా అనిపించడం మొదలుపెడుతుంది. సాధారణ ఆనందం మారడమే దీనికి కారణం. నిజానికి, మనకు అది ఎప్పుడూ సరిపోదు; మనం దానితో ఎప్పుడూ సంతృప్తి చెందము. మనం ఎప్పుడూ ఎక్కువ చాక్లెట్ ను కోరుకుంటాము, బహుశా వెంటనే కాకపోయినా, కొంతసేపటి తర్వాత అయినా.

"నాకు ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదించడానికి నేను ఎంత తినాలి?" అని ఆలోచిస్తే అది ఆసక్తికరంగా ఉంటుంది. ఒక చిన్న బైట్ సరిపోతుంది, కానీ మనం ఎప్పుడూ ఇంకా ఎక్కువ తినాలనుకుంటాము. ఇప్పుడు, మన సాధారణ, ప్రాపంచిక ఆనందం యొక్క ఈ సమస్యను అధిగమించాలని కోరుకోవడం కూడా బౌద్ధమత లక్ష్యమేమీ కాదు. ప్రాపంచిక సుఖాలకు అతీతంగా శాశ్వత ఆనందంతో ఏదో ఒక స్వర్గాన్ని కనుగొనాలని బోధించే మతాలు ఎన్నో ఉన్నాయి.

మూడవ రకం బాధ ప్రత్యేకంగా బౌద్దులకు "సర్వ వ్యాప్త బాధ" అని పిలువబడుతుంది. దీన్ని మన "సర్వ వ్యాప్త సమస్య" అని కూడా పిలవవచ్చు. ఈ బాధ మనం అనుభవించే ప్రతి దానిలో వ్యాపించి, మన జీవితంలోని హెచ్చుతగ్గులకు నిజమైన ఆధారమైన పునర్జన్మను అనియంత్రితంగా తీసుకునే విధానాన్ని సూచిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే, మనకు ఉన్న మనస్సులు మరియు శరీరాల రకాలతో పదే పదే పునర్జన్మ పొందడం మొదటి రెండు రకాల బాధలకు ఆధారం. ఇది పునర్జన్మ అనే విషయాన్ని తీసుకొస్తుంది, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం.

నిజానికి, పునర్జన్మ గురించి బోధించే అనేక ఇతర భారతీయ ఫిలాసఫికల్ వ్యవస్థలు కూడా ఉన్నాయి, కాబట్టి, ఇది బుద్ధుడు చెప్పిన కొత్త విషయం ఏమీ కాదు. ఏదేమైనా, అతను పునర్జన్మ యొక్క పద్ధతిని ఆ సమయంలో వివరించిన ఇతర ఫిలాసఫీలు లేదా మతాల కంటే చాలా లోతుగా అర్థం చేసుకుని వివరించాడు. పునర్జన్మ ఎలా పనిచేస్తుందో, మన మనసులు, శరీరాలు ఈ బాధలు, దుఃఖం, ఆనందం వంటి ఒడిదుడుకులను ఎలా అనుభవిస్తాయో బుద్ధుడు చాలా బాగా వివరించాడు.

రెండవ ఉత్తమమైన సత్యం

రెండవ సత్యం మనం అనుభవించే ఈ దుఃఖానికి నిజమైన కారణాన్ని వివరిస్తుంది. ఈ సమయంలో మనం పునర్జన్మ గురించి వివరించాల్సిన అవసరం ఏమీ లేదు. దీనికి బదులుగా, బుద్ధుడు ఏమి వివరిస్తున్నాడో సరళమైన, లాజికల్ మార్గంలో అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించవచ్చు. మనం బాధ మరియు ఆనందం గురించి మాట్లాడుతాము, ఇవి కారణాల నుంచి వస్తాయి, కాని బుద్ధుడు "నిజమైన కారణాల" పట్ల ఆసక్తి చూపించడు. సంతోషం మరియు బాధ మనకు ప్రతిఫలంగా లేదా శిక్షగా వస్తాయని అనుకోవచ్చు, కాని బుద్ధుడు నిజమైన కారణాన్ని వినాశకరమైన మరియు నిర్మాణాత్మక ప్రవర్తనగా చెప్పాడు.

వినాశకరమైన ప్రవర్తన అంటే ఏమిటి? ఇది కేవలం హాని కలిగించడమేనా? మనం హాని కలిగించడం గురించి మాట్లాడినప్పుడు, అది ఇతరులకైనా హాని కలిగించవచ్చు లేదా మనకైనా హాని కలిగించవచ్చు. మన ప్రవర్తన ఇతరులపై ఎటువంటి ప్రభావాలను చూపిస్తుందో తెలుసుకోవడం చాలా కష్టం, అది హాని కలిగిస్తుందా లేదా సహాయపడుతుందా అని. ఉదాహరణకు, మనం ఒకరికి పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తే, అప్పుడు ఆ డబ్బును దొంగిలించాలనుకుని వేరొకరు అతనిని హత్య చేశారు అని అనుకుందాం. వారికి సహాయం చెయ్యడమే మన లక్ష్యం కావచ్చు. ఇది ఖచ్చితంగా మనకు వినాశనం కలిగించే ఒక రకమైన ప్రవర్తన. బుద్ధుడు చెప్పిన విధ్వంసక ప్రవర్తన అంటే ఇదే - ఇది వినాశనాన్ని కలిగించేది.

ఇదే సూచించేది, ఆలోచించేది, నటించడం లేదా కలవరపరిచే భావోద్వేగాల ప్రభావంతో మాట్లాడటం. ఇబ్బంది పెట్టే భావోద్వేగాలు మన మనశ్శాంతిని, సొంత నియంత్రణను కోల్పోయేలా చేస్తాయి. ఇది కోపం, దురాశ, మమకారం, అసూయ, అహంకారం మరియు అమాయకత్వాన్ని సూచిస్తుంది మరియు ఈ లిస్ట్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. మన ఆలోచన ఈ భావోద్వేగాలలో ఒకదానిలో చిక్కుకున్నప్పుడు, దాని ప్రభావంతో మనం మాట్లాడినప్పుడు లేదా వ్యవహరించినప్పుడు, అది మనకు అసంతృప్తిని కలిగిస్తుంది. ఇది వెంటనే జరగకపోవచ్చు, కానీ దీర్ఘకాలంలో, ఇది అసంతృప్తిని సృష్టిస్తుంది ఎందుకంటే ఇది అలాగే కొనసాగే ధోరణిని పెంచుతుంది.

మరోవైపు, మనకు నిర్మాణాత్మక ప్రవర్తన ఉంటుంది, ఇది ఈ కలవరపరిచే భావోద్వేగాల ప్రభావంతో కాకుండా ప్రేమ, కరుణ లేదా సహనం లాంటి సానుకూల భావోద్వేగాల ద్వారా ప్రేరేపించబడుతుంది.

నిర్మాణాత్మకంగా వ్యవహరించడం సంతోషాన్ని ఇస్తుంది. మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, మరియు మనం కూడా ప్రశాంతంగా ఉంటాము. మనం సాధారణంగా ఎక్కువ సొంత నియంత్రణను కలిగి ఉండవచ్చు, కాబట్టి మనం తెలివితక్కువగా వ్యవహరించము లేదా సమస్యలను కలిగించే తెలివితక్కువ విషయాలను మాట్లాడము. మళ్ళీ, దాని ప్రభావం తక్షణమే ఉండకపోవచ్చు, కానీ దీర్ఘకాలంలో, ఇది ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. అయితే, దాని వెనుక మనకు ఉన్న విధానం, ఇతరులకు ఉన్న విధానం, సాధారణంగా వాస్తవికత గురించి ఒక అమాయకత్వపు కోణం ఉంటుంది.

మన సాధారణ సంతోషం, దుఃఖం ఏదో ఒక వ్యక్తి ఇచ్చే బహుమతులు లేదా శిక్షలు కావు. ఇవి దాదాపు భౌతిక శాస్త్ర సూత్రాలను అనుసరిస్తాయి. ప్రవర్తన కారణం మరియు ప్రభావం ఏ ప్రాతిపదికపై ఆధారపడి ఉంటుంది? ముఖ్యంగా మన గురించి మన గందరగోళం మీదే ఉంటుంది. మనం ఇలా ఆలోచిస్తాము, "అవును, నేను చాలా ముఖ్యమైన వ్యక్తిని, నాకు నా మార్గం ఉండాలి. నేను సూపర్ మార్కెట్ లైన్ లో ముందుండాలి. నేనే ముందు ఉండాలి" అని. మనం ముందు అత్యాశతో ఉంటాము, కాబట్టి మన ముందున్న వారిపై మనకు కోపం వస్తుంది. ఎదురుగా ఉన్న వ్యక్తి చాలా నెమ్మదిగా ఉంటే, అక్కడ ఎక్కువ సమయం పట్టడం వల్ల మనం అసహనానికి గురవుతాం, అప్పుడు మన మనస్సు అతని గురించి అన్ని రకాల చెడు ఆలోచనలతో నిండిపోతుంది. మనం నిర్మాణాత్మకంగా వ్యవహరించినా కానీ అక్కడ 'నేను' అనే ఆలోచన వస్తుంది. ఉదాహరణకు, మన౦ ఇతరులకు సహాయ౦ చెయ్యవచ్చు, ఎ౦దుక౦టే వాళ్ళు మనల్ని ఇష్టపడాలని లేదా దానికి బదులుగా మన కోస౦ ఏదైనా చెయ్యాలని మన౦ కోరుకు౦టా౦. లేదా మనకు అది అవసరమనిపిస్తుంది. కనీసం అక్కడ మనం థ్యాంక్స్ చెప్పాలి!

ఇలాంటి వాళ్లకు సహాయం చెయ్యడం మనకు సంతోషాన్ని కలిగించినప్పటికీ, నిజంగా ఇది అంత సౌకర్యవంతంగా ఉండదు. దీర్ఘకాలంలో మనం అనుభవించే ఈ ఆనందం ఎప్పటికీ నిలవదు. ఇది అసంతృప్తికరమైనదిగా మారుతుంది. ఇది మన జీవితమంతా, బౌద్ధమత ఆలోచన నుంచి, మన ఫ్యూచర్ జీవితాలలో కూడా కొనసాగుతుంది.

మనం దాన్ని దగ్గరగా పరిశీలిస్తే ప్రతి విషయంలోనూ గందరగోళం కనిపిస్తుంది. ఉదాహరణకు, మనం ఒకరిని బాగా ప్రేమించినప్పుడు, వారి మంచి లక్షణాలను పూర్తిగా పొగుడుతాము. అలాగే మనం ఎవరినైనా అస్సలు ఇష్టపడనప్పుడు, వారి నెగెటివ్ లక్షణాలను ఎక్కువగా చూపిస్తాము మరియు వారిలో మంచిని చూడలేము. మనం ఎంత ఎక్కువగా పరిశోధిస్తే, మనం అనుభవించే ప్రతి దానికీ నిరంతరం మన లోపల అంత గందరగోళం ఏర్పడుతుంది.

ఇంకా లోతుగా పరిశీలిస్తే, దీనికి ఆధారం మన పరిమితులే అని మనం చూడవచ్చు. ఈ మనసు మరియు శరీరంతో మనకు పరిమితులు అనేవి ఉంటాయి. మనం కళ్లు మూసుకుంటే ప్రపంచంలో ఎవరూ లేరని, నేను ఒక్కడినే ఉన్నానని అనిపిస్తుంది. మన బుర్రలో "నేను" అని అనిపించే ఈ స్వరం నా లోపల ఉంటుంది. ఇది చాలా వింతగా ఉంటుంది. ఏదేమైనా, మనం దానిని గుర్తిస్తాము ఎందుకంటే ఇది ఎప్పుడూ, "నేను ముందుకు వెళ్లాలి; నేను ఇది చెయ్యాలి" అని ఫిర్యాదు చేస్తుంది. ఇది ఎప్పుడూ ఆందోళనను కలిగిస్తుంది. మన తలలోని ఈ గొంతు ప్రత్యేకమైనది మరియు అందరి నుంచి దూరంగా ఉనికిలో ఉందని మనకు అనిపిస్తుంది ఎందుకంటే మనం కళ్ళు మూసుకున్నప్పుడు, "నేను" అనేది తప్ప ఇంకేమి ఉండదు.

ఇది చాలా గందరగోళమైన ఆలోచనా విధానం, ఎందుకంటే, స్పష్టంగా, మనం అందరి నుంచి స్వతంత్రంగా ఉనికిలో ఉండము; మరియు నిజంగా, ఎవరి గురించి ప్రత్యేకంగా ఏమీ ఉండదు. మనం మనుషులం. గడ్డ కట్టే అంటార్కిటికాలోని లక్ష పెంగ్విన్లు కలిసి ఉన్నాయని ఊహించుకోండి: ఒకదాని కంటే మరొక దానిలో ప్రత్యేకమైన విషయం ఏమిటి? నిజానికి అవన్నీ ఒకటే. మనం కూడా అంతే. పెంగ్విన్లకు, మానవులందరూ ఒకేలా కనిపిస్తారు! ఏదేమైనా, "నేను అందరి కంటే చాలా ప్రత్యేకమైన మరియు స్వతంత్రంగా ఉన్నాను" అనే ఆలోచనతో మనకంటూ ఒక మార్గం ఉండాలి, అలా ఉండకపోతే మనకు కోపం వస్తుంది.

ప్రాథమికంగా, మన మనస్సు మరియు శరీరం యొక్క హార్డ్‌వేర్ ఈ గందరగోళానికి అనుకూలంగా ఉంటుంది. ఇది వింతగా అనిపించవచ్చు, కానీ మనం ప్రధానంగా మన కళ్లతో ప్రపంచాన్ని చూసి అనుభవిస్తాము. నా వెనుక ఏముందో నేను చూడలేను. కనిపించేదాన్ని మాత్రమే నేను చూడగలను; నా ముందుకి ఏం వస్తుందో, లేదా తర్వాత ఏం వస్తుందో  నేను చూడలేను. ఇది చాలా పరిమితం. ఆపై వయసు పెరగడంతో మనకు వినికిడి సరిగ్గా ఉండదు. ఎవరో ఏదో చెబుతారు, మనం దాన్ని సరిగ్గా వినము, వారు ఇంకేదో చెప్పారని భావించి మనకు కోపం వస్తుంది. తలచుకుంటే చాలా దయనీయంగా ఉంటుంది.

ఈ రకమైన శరీరం మరియు మనస్సుతో మనం నిరంతరం పునర్జన్మను పొందడం మన యొక్క సర్వవ్యాప్త సమస్య, ఇది ఈ గందరగోళాన్ని కొనసాగిస్తుంది. ఈ గందరగోళం ఆధారంగా, మనం వినాశకరంగా లేదా ఒక సాధారణ నిర్మాణాత్మక మార్గంలో ప్రవర్తిస్తాము, మరియు ఇదే మనం అనుభవించే దుఃఖాన్ని మరియు సాధారణ ఆనందాన్ని ఉత్పత్తి చేస్తుంది.

మనం ఇంకా లోతుగా ఆలోచిస్తే, ఇది సంక్లిష్టంగా మారుతుంది మరియు ఇప్పుడే దానిలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ గందరగోళమే ఈ నియంత్రణలో లేని రిపీట్ అయ్యే పునర్జన్మను నడిపిస్తుంది. ఇదే మన సమస్యలకు అసలైన కారణం. ఈ గందరగోళం, లేదా తెలియకపోవడం "అజ్ఞానం" అని అనువదించబడుతుంది. నేను ఈ పదాన్ని ఉపయోగించడానికి ఇష్టపడను, ఎందుకంటే ఇది మనం మూర్ఖులమని సూచిస్తుంది; కానీ ఇది అసలైన సమస్య కాదు, మరియు ఇది మనం కోరుకునేది కూడా కాదు. అజ్ఞానం అంటే మనం ఏమిటో, అసలు జరిగేది ఏమిటో మనకు తెలియదు అని అర్థం. ఇది వాస్తవికతకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నప్పుడు, మనం అత్యంత ముఖ్యమైన వ్యక్తి - విశ్వం యొక్క కేంద్రం అని అనుకోవడం సరైనది కాదు. వాస్తవం ఏంటంటే మనమంతా కలిసి ఉన్నాం. మనం మూర్ఖులమని కాదు, కానీ మన శరీరాలు మరియు మనస్సులు మనకు నచ్చినట్టే ఆలోచిస్తాయి.

అందుకే వాటిని మనం "ఉత్తమమైన సత్యాలు" అని పిలుస్తాము. వాస్తవికతను చూసే వారు దాన్ని ఇతరులు చూసే విధానానికి వేరేగా చూస్తారు. మన గందరగోళం మరియు మన దగ్గర ఉన్న అంచనాలు వాస్తవానికి అనుగుణంగా ఉన్నాయని మనం నిజంగా నమ్ముతున్నాము. మనం నిజానికి దాని గురించి ఆలోచించము, ఎందుకంటే మనం "నేను చాలా ముఖ్యమైన వాడిని, నాకు నా దారి ఉండాలి, మరియు ప్రతి ఒక్కరూ నన్ను ప్రేమించాలి" అని అనుకుంటాము. లేదా "అందరూ నన్ను ద్వేషించాలి, నేను మంచివాడిని కాదు" అని కొందరు అనుకుంటారు. నాణానికి వేరే వైపు ఉన్నట్లుగా ఇది ఉంటుంది. ఇదే అసలు కారణం.

మూడవ ఉత్తమమైన సత్యం

మూడవ సత్యాన్ని మనం "నిజమైన అడ్డంకులు" అని పిలుస్తాము. ఇది సాధారణంగా "నిజమైన ముగింపు" అని కూడా అనువదించబడుతుంది మరియు ఇది ఈ గందరగోళాన్ని ఆపడానికి మరియు వదిలించుకోవడానికి సాధ్యమయ్యే నిజాన్ని సూచిస్తుంది, అలా ఇది మళ్లీ జరగకూడదు అని ఉంటుంది. అసలు కారణమైన గందరగోళాన్ని మనం వదిలించుకుంటే నిజమైన సమస్యలు, ఒడిదుడుకులు, నియంత్రణ లేకుండా జరిగే పునర్జన్మకు మనం దూరంగా ఉండవచ్చు. ఇలా చేస్తే మనకు "ముక్తి" అనేది లభిస్తుంది. ఈ సంస్కృత పదాలను మీకు తెలుసని నేను అనుకుంటున్నాను, నియంత్రణలో లేని పునర్జన్మ కోసం "సంసార", మోక్షం కోసం "నిర్వాణ" ఉంటుంది.

బుద్ధుని కాలంలో సంసారం యొక్క విముక్తి గురించి మాట్లాడే ఇతర భారతీయ వ్యవస్థలు ఉన్నాయి. ఇది భారతదేశంలో ఒక సాధారణ విషయం. అయితే, ఈ ఇతర వ్యవస్థలు అసలు కారణాన్ని గుర్తించడంలో తగినంత లోతుగా వెళ్లలేదని బుద్ధుడు గమనించాడు. నియంత్రణ లేకుండా పునరావృతమయ్యే ఈ సమస్యల నుంచి మీరు విముక్తిని పొందవచ్చు. ఉదాహరణకు మీ మనస్సు ఖాళీగా ఉన్న ఏదో ఒక స్వర్గలోకంలో జన్మించడం, కానీ ఇది ఎక్కువ రోజులు ఉండదు. ఈ ఇతర వ్యవస్థలతో మనకు నిజమైన విముక్తి లభించదు.

బుద్ధుడు నిజమైన అడ్డంకుల గురించి బోధించాడు, మరియు ఈ గందరగోళాన్ని వదిలించుకోవడం నిజంగా సాధ్యమేనని మరియు నమ్మకంగా ఉండటం చాలా ముఖ్యం అని, అప్పుడే అవి మళ్ళీ రావని చెప్పాడు. లేకపోతే, మీరు దానిని వదిలించుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తారు? గందరగోళాన్ని మంచి కోసం ఆపడం గురించి మీరు పట్టించుకోకపోతే, మీరు కూడా ఇంక నోరు మూసుకుని ఆ పరిస్థితిని అంగీకరించి దాన్ని ఉత్తమంగా ఉపయోగించవచ్చు. చాలా చికిత్సలు దీన్ని వారి చివరి లక్ష్యంగా పెట్టుకుని ఉండవచ్చు: దానితో జీవించడం నేర్చుకోండి లేదా ఒక మాత్రను వేసుకోండి!

నాలుగవ ఉత్తమమైన సత్యం

నాలుగవ సత్యాన్ని సాధారణంగా "సత్య మార్గం" అని అనువదిస్తారు మరియు ఇది మూడవ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. అది మనం అభివృద్ధి చెందితే ముక్తికి దారితీసే మార్గంగా మారే ఒక మానసిక స్థితిని సూచిస్తుంది. మనం దీనిని "మనస్సుకి మార్గం" అని కూడా పిలుస్తాము, కానీ ఈ పదాన్ని ఇతర భాషల్లోకి అనువదించడం కష్టం.

మన మనస్సులు పూర్తిగా చెత్తను ప్రొజెక్ట్ చేస్తాయి. కానీ ఈ చెత్త అంచనాకు స్థాయిలు కూడా ఉన్నాయి. తీవ్రమైనది స్కిజోఫ్రెనియా లేదా పారనోయా, ఇక్కడ ప్రతి ఒక్కరూ మనకు వ్యతిరేకంగా ఉన్నారని నిజంగా భావిస్తాము. ఇది తక్కువ తీవ్రతగా కూడా ఉండవచ్చు, "ఇది నేను చూసిన చాక్లెట్ కేక్ యొక్క అత్యంత అద్భుతమైన ముక్క; నేను దాన్ని తింటే, అది నిజంగా నాకు సంతోషాన్ని ఇస్తుంది" అని. బుకారెస్ట్ కు వెళ్ళే విమానంలో నేను దీనిని అనుభవించాను, అక్కడ నేను వియన్నాలో ఆగాను. "అవును, వియన్నా ఆపిల్ స్ట్రూడెల్ ప్రపంచంలోనే ఉత్తమమైనది" అని నేను అనుకున్నాను. నేను ఒక ముక్కను ఆర్డర్ చేశాను, అది ఏం బాగోలేదు. అది ఎలా ఉండాలనే దానిపై నా అంచనాలు అవాస్తవం. ఆపిల్ స్ట్రూడెల్ ఇలానే ఉండాలి అని అది నా మనస్సు నుంచి వచ్చిన అంచనా కాదు; కానీ స్ట్రూడెల్ ఎలా ఉండాలో, అది నాకు నిజంగా సంతోషాన్ని కలిగించే అత్యంత అద్భుతమైన విషయంగా నా మనస్సు నుంచి ప్రొజెక్ట్ చేయబడింది.

అదే విధంగా నేను ఉన్నాను, మీరు ఉన్నారు. బౌద్ధమతం మనం లేమని చెప్పడం లేదు. నిజంగా ఉన్న దానికి ఏమాత్రం పొంతన లేని ఒక మార్గాన్ని వాస్తవికతపై ప్రొజెక్ట్ చేస్తున్నామని మాత్రమే ఇది చెప్తుంది. వస్తువులు తమంతట తామే స్వతంత్రంగా ఉంటాయనే భావన మనకు నిజంగా ఉంది, ఇది ఉనికిలో అసాధ్యమైనది. విషయాలు కారణాలు మరియు పరిస్థితుల నుంచి ఉత్పన్నమవుతాయి మరియు అవి ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. అయితే, ఇది మనకు కనిపించదు; మన కళ్ల ముందు ఉన్న దాన్ని మాత్రమే మనం చూస్తాం. ఉదాహరణకు, మనం ఎవరినైనా కలవాలి అనుకున్నప్పుడు వాళ్ళు కనిపించరు. అవతలి వ్యక్తి సరైన వాడు కాదని, ఎప్పుడూ మనల్ని నిరాశపరుస్తాడని, ఇక మనల్ని ఇష్టపడటం లేదని మనకు అనిపిస్తుంది. ట్రాఫిక్, ఆఫీసులో ఎక్కువ పని లేదా అతని జీవితంలో ఉండే వాటితో సంబంధం లేకుండా అతను ఫ్రీ గానే ఉన్నాడని మనం అనుకుంటాము. కానీ ప్రతిదీ కారణాలు మరియు పరిస్థితుల నుంచి వస్తుంది కాబట్టి, వారి వైపు నుంచి, అతను అంత చెడ్డ వ్యక్తి అవ్వడం అసాధ్యం. అయినప్పటికీ, మన మనస్సులు ఈ ఆలోచనను ఉంచుకుని దానిపైనే వేలాడతాయి. అలా కోపాన్ని, వినాశకరమైన భావోద్వేగాన్ని సృష్టిస్తాయి. ఆ తర్వాత వాళ్లను మనం మళ్ళీ చూసినప్పుడు, మనం అరుస్తుంటాం. వీటన్నిటిలోనూ మనమే చాలా చెడ్డగా, అసంతృప్తిగా ఉన్నాం కదా?

కాబట్టి, మనం ఉనికిలో ఉన్నాము, కానీ మనం ఉనికిలో ఉన్నాము అని అనుకునే విధానం - ప్రతి ఒక్కరి నుంచి ప్రత్యేకమైనది మరియు స్వతంత్రమైనది - ఇది పూర్తి అంచనాలో ఉంటుంది. ఇది ఒక చెత్త. ఇది నిజమైన దేన్నీ సూచించదు. దీన్ని బౌద్ధమతంలో "శూన్యత" అని పిలుస్తాము, దీన్ని తరచుగా "శూన్యం" అని అనువదిస్తాము. సంస్కృతంలో, ఈ పదం "సున్నా" తో సమానంగా ఉంటుంది మరియు దీనికి "ఏమీ లేదు" అని అర్థం వస్తుంది, అంటే నిజానికి ఏదీ లేదు అని. ఒక అద్భుత కథలో తెల్ల గుర్రంపై ఒక కొత్త భాగస్వామి పరిపూర్ణ యువరాజు లేదా యువరాణి అని మనం ఊహించుకున్నప్పుడు - అది అసాధ్యమైనది. అలాంటి వారు ఎవరూ ఉండరు, కానీ మనం ఎప్పుడూ వాళ్ళ కోసమే వెతుకుతున్నాము. అప్పుడు ఆ వ్యక్తి మన అంచనాకు అనుగుణంగా ఉండకపోతే, మనం నిరాశ చెందుతాము. అది అసాధ్యం అయినప్పటికీ మనం వేరే వాళ్ళ కోసం చూస్తాము.

అందువల్ల, ఇదంతా చెత్త అని, మన అంచనాలకు అనుగుణంగా ఏదీ నిజం కాదని అర్థం చేసుకోవడమే మనస్సు యొక్క నిజమైన మార్గం. మనం నిజమైన కారణాన్ని పరిశీలిస్తే, మన అంచనాలు నిజమైన దానికి అనుగుణంగా ఉన్నాయని నమ్మడం వల్ల బాధ కలుగుతుంది. అది దేనికి పొంతన లేదని లోతుగా అర్థం చేసుకోవడమే నిజమైన మార్గం. ఫాంటసీ మరియు రియాలిటీ యొక్క మన అంచనాలు పరస్పరం ప్రత్యేకమైనవి. నేను మళ్లీ రిపీట్ చేస్తాను - గందరగోళం ఏమిటంటే, ఒక ఆలోచన నిజమైన దానికి అనుగుణంగా ఉందని భావించడం, మరియు అటువంటిది లేదని చూడటం సరైన అవగాహన. సింపుల్ గా చెప్పాలంటే, ఏదో ఒకటి ఉంది లేదా లేదు అని అనుకోవడం. ఇది అవును లేదా కాదు అని; రెండూ ఒకేసారి సరైనవని మనం అనుకోలేము.

ఇప్పుడు మన౦ మనకు బలమైన దాన్ని విశ్లేషి౦చవచ్చు: "అవును" లేదా "కాదు" అని. మనం దానిని లాజిక్ తో పరిశీలిస్తే, అది స్పష్టంగా "లేదు" అని తెలుస్తుంది, ఎందుకంటే "అవును" లాజిక్ తో నిలబడదు. నేను కళ్లు మూసుకుంటే మిగతా వాళ్ళు ఉండకుండా పోతారా? కాదు, అలా జరగదు. నేను ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిని కాబట్టి నేను ఎప్పుడూ నా దారిని కలిగి ఉండటం సరైన విషయమేనా? కాదు, ఆలా జరగడం కష్టం. మనం ఎంతగా పరిశోధిస్తే, మన తలలోపల ఉన్న ఈ చిన్న "నన్ను" అని ప్రశ్నించడం ప్రారంభిస్తాము. మీరు మెదడును విశ్లేషించడం మొదలుపెడితే, మన తల లోపల మాట్లాడి నిర్ణయాలు తీసుకునే "నేను" అనేది మెదడులో ఎక్కడ ఉంటుంది? అసలేం జరుగుతోంది? విశ్లేషించిన తర్వాత, మనం "నేను" అని పిలవడానికి ఏమీ దొరకలేదు. నిజమే, నేను పనిచేస్తాను, నేను పనులు చేస్తాను, నేను మాట్లాడతాను. దీన్ని మనం ఖండించడం లేదు. మనం తిరస్కరిస్తున్నది ఏమిటంటే, ఈ దృఢమైన "నేను" అనే స్వంత మార్గాన్ని కలిగి ఉండటం, ఎందుకంటే అలాంటి దేనికి లాజిక్ సహాయం చెయ్యదు. కారణం మరియు పరిశోధన ద్వారా, అటువంటిదేమీ లేదని మనం తెలుసుకోగలము, కాబట్టి అది నిజమైన దానికి అనుగుణంగా ఉంటుందనే మన గందరగోళానికి ఏదీ సపోర్ట్ చెయ్యదు.

మనం ఈ అసాధ్యమైన మార్గంలో ఉన్నామని అనుకోవడం వల్ల ఫలితం ఏమిటి? మనల్ని మనం దుర్భరం చేసుకుంటాం! అలాంటి ఉనికి లేదని అనుకోవడం వల్ల ఫలితం ఏమిటి? ఈ సమస్యలన్నిటి నుంచి మనల్ని మనం విముక్తి చేసుకుంటాం. "అలాంటిదేమీ లేదు, ఇది చెత్త" అని నేను అనుకుంటున్నప్పుడు, అదే సమయంలో ఇది నిజమైన దానికి అనుగుణంగా ఉందని భావించడం అసాధ్యం. సరైన అవగాహన తప్పు అవగాహనను అధిగమించగలదు. ఎప్పుడూ సరైన అవగాహనపై దృష్టి పెట్టగలిగితే, ఈ గందరగోళం మళ్లీ రాదు.

ఇక్కడ కూడా, వాస్తవికతను సరిగ్గా అర్థం చేసుకోవడం అపార్థాలను తీసెయ్యగలదని మరియు బాధ, పునర్జన్మ నుంచి విముక్తి కలిగిస్తుందని చెప్పిన బుద్ధుని బోధన ప్రత్యేకమైనది కాదు. మిగతా భారతీయ వ్యవస్థలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. వాస్తవికత గురించి సూక్ష్మమైన స్థాయి గందరగోళాన్ని శాశ్వతంగా తొలగించగల నిర్దిష్ట అవగాహన ప్రత్యేకమైనది అని. ధ్యానంతో పరిపూర్ణ ఏకాగ్రతను సాధించడానికి, మన మనస్సులో ఈ సరైన అవగాహనను పెంపొందించడానికి మరియు గందరగోళానికి నిజమైన ముగింపును పొందడానికి, బుద్ధుడు అన్ని భారతీయ సంప్రదాయాలతో సమానంగా పంచుకున్న పద్ధతులను ఉపయోగించాడు. వాటి ద్వారా, మనము బాధల యొక్క నిజమైన కారణాన్ని ఆపివెయ్యగలము.

వాస్తవికతపై సరైన అవగాహనతో ఉండటానికి, విధ్వంసక భావోద్వేగాలన్నింటినీ తగ్గించడానికి బలాన్ని ఇచ్చేది ప్రేరణ. ఇక్కడే ప్రేమ, జాలి మొదలైనవి వస్తాయి. మనమందరం ఒక దానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నామని మరియు ఆనందాన్ని కోరుకోవడంలో ప్రతి ఒక్కరూ మనలాగే ఉన్నారని మనం చూస్తాము, వారికి పూర్తిగా సహాయం చెయ్యడానికి మన గందరగోళాన్ని వదిలించుకోవాలి.

ఇది నాలుగు ఉత్తమమైన సత్యాల యొక్క బేసిక్ వివరణ. వీటిని ఇంకా లోతుగా అర్థం చేసుకోవడానికి, మనస్సు మరియు కర్మ గురించి, బౌద్ధ అవగాహన గురించి మనం ఇంకా కొంచెం తెలుసుకోవాల్సి ఉంటుంది.

సారాంశం

బౌద్ధమతం అనేక ఇతర ప్రధాన మత మరియు తాత్విక వ్యవస్థలతో చాలా సారూప్యతను పంచుకున్నప్పటికీ, బుద్ధుని మొదటి బోధన అయిన ఈ నాలుగు ఉత్తమమైన సత్యాలు, మన ఉనికి, మనం అనుభవించే బాధలు మరియు మన సమస్యలను ఎలా అధిగమించవచ్చో బాగా వివరిస్తాయి.

బుద్ధుడిని తరచుగా వైద్యుడితో పోలుస్తారు. ప్రతి చోటా జీవులు అనుభవించే అనేక బాధలను బుద్ధుడు ఎత్తి చూపినట్లుగా, మనం అనారోగ్యంతో ఉన్నామని ఒక వైద్యుడు కూడా అలానే నిర్ధారిస్తాడు. బుద్ధుడు సూచించినట్లుగానే ఒక వైద్యుడు మన అనారోగ్యానికి కారణాన్ని అన్వేషిస్తాడు, మన జీవితంలో ఈ గందరగోళమే మన జీవనంలో బాధలకు అసలైన కారణం అని. అప్పుడు వాళ్ళు మనం నయం కాగలమా లేదా అని చెబుతారు, ఆ తర్వాత మనకు మందులను ఇస్తారు. అదే విధంగా బుద్ధుడు నిజమైన అడ్డంకులను, వాటిని దాటే మార్గాలను బోధించాడు. చివరికి, ఈ బాధను అధిగమించాలంటే, మందు తీసుకోవడం లేదా అతని మార్గంలో నడవడమే ఆఖరి దశ.

Top