పరిచయం

నాలుగు ఉత్తమమైన సత్యాలు

బుద్ధుడు భారతదేశంలో సుమారు 2500 సంవత్సరాల క్రితం జీవించాడు. తన శిష్యులకు భిన్నమైన స్వభావాలు, సామర్థ్యాలు ఉ౦డడ౦తో, అతను ప్రతి ఒక్కరికి అర్థ౦ అయ్యేలా వాళ్లకు సరిపోయే వ్యక్తిగతమైన శైలిలో బోధి౦చాడు. కానీ అతను ప్రతి ఒక్కరికి బోధించిన మొదటి విషయం ఏమిటంటే, జ్ఞానోదయం పొందే ప్రక్రియలో ఉన్న అతని ప్రాథమిక అంతర్దృష్టి: అతను వాటిని బోధించాడు మరియు వాటిని "నాలుగు ఉత్తమమైన సత్యాలు" అని పిలుస్తాడు. జీవితానికి సంబంధించిన ఈ నాలుగు నిజాలు సాధారణ ప్రజలు చూడలేరు, కానీ నిజాన్ని సరిగ్గా అర్ధం చేసుకున్న వారే(ఆర్యులు) వాటిని చూడగలరు. క్లుప్తంగా చెప్పాలంటే, ఈ నాలుగు సత్యాలు ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం ఇస్తాయి:

  • ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అనుభవించే నిజమైన బాధలు మరియు సమస్యలు ఏమిటి?
  • అవి ఎందుకని వస్తాయి?
  • నిజంగా ఈ సమస్యల నుంచి బయటపడటం, అవి మళ్లీ రాకుండా చెయ్యడం సాధ్యమేనా?
  • ఇది బాధలకు గల కారణాలను పోగొడుతుంది దానికి సహాయపడే అవగాహన ఏమిటి?

ఈ ప్రశ్నలకు సమాధానాలు బుద్ధుడు తన జీవితాంతం లోతుగా బోధించిన దాని ప్రాథమిక నిర్మాణం యొక్క బోధనలు, వీటినే ఇతను ముందుగా బోధించాడు.

ఈ నాలుగు ఉత్తమమైన సత్యాలను మనం పరిశీలిస్తే అవి ఒంటరిగా ఏమీ ఉండవు. అవి ఒక బేసిస్ ను అనుసరిస్తాయి మరియు వాటిని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు అవి మనల్ని ఒక లక్ష్యానికి తీసుకెళ్తాయి. సింపుల్ గా చెప్పాలంటే, ఈ నాలుగు సత్యాలకు - ఈ నాలుగు జీవిత సత్యాలకు - ఆధారం రియాలిటీనే.

బౌద్ధమతాన్ని మనం ఒక పదంలో సంక్షిప్తీకరించాలనుకుంటే, బౌద్ధ గురువు అయిన నా స్నేహితుడు ఒకడు చెప్పినట్లు, ఆ ఒక్క పదం "రియలిజం" సరిపోతుంది.

మనం రియాలిటీని చూడగలిగితే, అసాధ్యమైన మరియు అవాస్తవమైనదాన్ని అంచనా వెయ్యకుండా దాన్ని అర్థం చేసుకోగలిగితే మరియు అంగీకరించగలిగితే, జీవితంలో మన సమస్యాత్మక పరిస్థితులను నిజమైన మార్గాల్లో మనం ఎదుర్కోగలుగుతాము.

కాబట్టి, రియాలిటీపై బోధనలు ఈ నాలుగు సత్యాలకు ఆధారం. అయితే, రియాలిటీ అనేది వస్తువులు ఎలా ఉన్నాయి మరియు అవి జీవితంలో ఎలా పనిచేస్తాయి అనే వివిధ స్థాయిలను కలిగి ఉంటుంది. బుద్ధుడు వీటన్నిటి గురించి బోధించాడు.

మూడు విలువైన రత్నాలు

బాధలను, సమస్యలను అధిగమించడానికి మన జీవితంలో ఏ దిశను నిర్దేశించాలో ఈ నాలుగు ఉత్తమమైన సత్యాల నుంచి మనకు అంతా స్పష్టమవుతుంది. ఈ దిశను బౌద్ధమత పరిభాషలో "మూడు విలువైన రత్నాలు" లేదా "మూడు ఆశ్రయ రత్నాలు" అని పిలువబడుతుంది - బుద్ధుడు, ధర్మం, సంఘం. ప్రతి దానికి అనేక స్థాయుల అర్థాలు ఉన్నాయి, కానీ లోతైన స్థాయిలో, అవి వీటిని సూచిస్తాయి:

  • ధర్మం – మన సమస్యల నుంచి, వాటి కారణాలను వదిలించుకోవడానికి, వాటి నుంచి శాశ్వతంగా విముక్తి కలిగించే సంపూర్ణ అవగాహనను పొందడం కోసం మనం పెట్టుకున్న లక్ష్యం.
  • బుద్ధులు - ఆ లక్ష్యాన్ని పూర్తిగా సాధించి, దాన్ని మనం ఎలా సాధించాలో అని బోధించేవారు.
  • సంఘం - ఈ బోధలను అనుసరిస్తూ, లక్ష్యాన్ని కొంతవరకు చేరుకున్నవారు, కానీ పూర్తిగా కాదు.

17 మంది నలంద గురువులకు ఒక ప్రార్థన

ప్రాచీన భారతదేశంలోని గొప్ప బౌద్ధమత మఠానికి చెందిన 17 మంది గొప్ప బౌద్ధమత గురువుల ప్రేరణ కోసం దలైలామా గారు చాలా అందమైన గ్రంథాన్ని రాశారు. దీన్ని నలంద అని పిలిచేవారు మరియు సుమారు వెయ్యి సంవత్సరాల పాటు ఇది కొనసాగింది. ఒక మఠం లాగా నడిచే ఈ విశ్వవిద్యాలయం ఆనాటి రోజుల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయం మరియు ఇది భారతీయ బౌద్ధ సంప్రదాయం యొక్క గొప్ప గురువులను తయారు చేసింది. దలైలామా గారు ఈ 17 మంది అత్యంత ప్రసిద్ధ గురువులకు ఒక ప్రార్థన రూపంలో ఈ గ్రంథాన్ని రాశారు: "మీ అడుగుజాడల్లో నడవడానికి నన్ను ప్రేరేపించండి" అని. వ్యక్తిగత అభ్యర్థన యొక్క ఈ శ్లోకాల తరువాత, వారందరినీ ఉద్దేశించి మరెన్నో సాధారణ శ్లోకాలతో ఆయన రాశారు.

ఆ ముగింపు శ్లోకాలలో ఒకదాని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. రియాలిటీ (రెండు సత్యాలు), నాలుగు ఉత్తమమైన సత్యాలు మరియు ఆశ్రయం యొక్క మూడు రత్నాల గురించి నేను వివరించిన వాటిని ఇది సంక్షిప్తీకరించింది. ఆశ్రయం అంటే ఈ మూడు సూచించిన దారిలో వెళితే బాధలు, సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోగలగటం.

ఆ శ్లోకం ఇలా ఉంటుంది:

పునాది అయిన ఈ రెండు సత్యాల అర్థాన్ని తెలుసుకోవడం ద్వారా, అందులో సమస్త జీవరాశులు ఉంటాయి,

"ఇమిడి" అంటే ఉనికి ఎలా ఉంది, మరియు అన్నీ ఎలా పనిచేస్తాయి అని. మరో మాటలో చెప్పాలంటే, రియాలిటీని తెలుసుకోవడం.

ఈ నాలుగు సత్యాల ద్వారా మనం ఎలా మన నియంత్రణలో లేని రిపీట్ అయ్యే పునర్జన్మ లోకి ఎలా ప్రవేశిస్తామో లేదా దాన్ని తిప్పికొట్టగలమో మనకు ఖచ్చితంగా తెలుసు.

రియాలిటీని అర్థం చేసుకుంటే ఈ నాలుగు సత్యాల ద్వారా మన సమస్యలను ఎలా పరిష్కరిస్తామో, వాటి నుంచి ఎలా బయటపడవచ్చో మనం అర్థం చేసుకోవచ్చు.

సరైన జ్ఞానంతో ఈ మూడు సూత్రాలు నిజమే అనే మన నమ్మకం దృఢంగా మారుతుంది.

ఈ మూడు సూత్రాలు మనం సాధించగల నిజమైన లక్ష్యం దిశగా రూపొందించబడ్డాయని గుర్తుంచుకోండి - అంటే మన సమస్యలన్నింటినీ పూర్తిగా వదిలించుకుని అవి మళ్ళీ రాకుండా చేసుకోగలము.

మీరు ఈ బౌద్ధమత మార్గాన్ని పాటించాలనుకుంటే, మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటారు. ఆ లక్ష్యాన్ని సాధించడం కుదురుతుందని మీకు ఎలా తెలుసు? ఇది కేవలం కల్పితమేనా? ఇది మంచి కథనా లేక అసలైన నిజమా? చాలా మంది కేవలం విశ్వాసం ఆధారంగా లక్ష్యసాధన కోసం కృషి చేస్తారు: "మా గురువు అలా చెప్పారు. అందుకే నేను నమ్మాలనుకుంటున్నాను, కాబట్టి నేను నమ్ముతున్నాను" అని.

ఇది చాలా మందికి పనిచేస్తుంది, కానీ ఇది ఎప్పుడూ అభ్యాసం యొక్క అత్యంత స్థిరమైన మార్గం కాదు. ఎక్కువ రోజుల పాటు ప్రాక్టీస్ చేసిన తర్వాత, ఎప్పుడూ జరిగేది ఏమిటంటే, నేను ఏమి చేస్తున్నాను అని మీరు ప్రశ్నించడం ప్రారంభిస్తారు. ఇలా ఎందుకంటే మీరు ఇప్పటికీ కోపం, అనుబంధం, స్వార్థం మరియు మిగతా భావాలను అనుభవిస్తారు - నిజంగా ఇబ్బందిని కలిగించే వాటిని వదిలించుకోవడం చాలా కష్టం. కాబట్టి, ప్రోగ్రెస్ చాలా నెమ్మదిగా ఉంటుంది. కానీ ప్రోగ్రెస్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదని మీరు గ్రహించాలి: అది ఎప్పుడూ మారుతూ ఉంటుంది. కొన్ని రోజులు బాగుంటుంది, కొన్ని రోజులు బాగుండదు. మీరు కేవలం విశ్వాసం పరంగా బౌద్ధమత పద్ధతులను ఆచరిస్తుంటే, మీరు నిరుత్సాహ పడవచ్చు ఎందుకంటే మీకు ఏమీ సాధిస్తున్నట్లు అనిపించదు. అప్పుడు మీరు ఇలా ప్రశ్నిస్తారు, "అవును, ఈ లక్ష్యాన్ని సాధించడం నిజంగా సాధ్యమేనా?" అని.

అందుకనే ఈ శ్లోకం "సరైన జ్ఞానం ద్వారా వచ్చింది" అని చెబుతుంది. మరో మాటలో చెప్పాలంటే, మీరు నిజంగా అర్థం చేసుకున్నప్పుడు - లాజిక్ మరియు రీజన్ ఆధారంగా - లక్ష్యం నిజంగానే ఉందని మరియు దాన్ని సాధించడం నిజంగా సాధ్యమేనని, అప్పుడు లక్ష్యం గురించి మీ నమ్మకం, దాన్ని సాధించే సాధనాలు మరియు నిజంగా దాన్ని సాధించిన వ్యక్తులు ఉన్నారని చాలా దృఢంగా చెప్తుంది. ఈ విషయాలు ఏదో ఒక పవిత్ర గ్రంథంలో రాసి ఉన్నాయని కాకుండా నిజమే అని మీరు నమ్ముతారు. ఈ రెండు సత్యాలు నిజం కాబట్టి అవి నిజమని మీరు నమ్ముతారు, మరియు నాలుగు సత్యాలు మరియు మూడు ఆశ్రయాలు వాస్తవికత ఆధారంగా లాజిక్ ని అనుసరిస్తాయి.

మోక్షానికి దారితీసే మార్గపు ఈ మూలాన్ని నా మనస్సులో నాటడానికి నన్ను ప్రేరేపించండి.

మీరు ఒక విత్తనాన్ని నాటుతారు, కానీ ఇక్కడ మీరు విత్తనాన్ని కాకుండా ఒక "మూలాన్ని" నాటుతున్నారు. ఈ పదాల ఎంపిక రెండు సత్యాలు, నాలుగు సత్యాలు మరియు మూడు ఆశ్రయాల నిర్మాణం పూర్తి బౌద్ధ ఆధ్యాత్మిక మార్గానికి మూలం అని సూచిస్తుంది, ఎందుకంటే ప్రతిదీ దాన్నే అనుసరిస్తుంది. ఈ మూలాన్ని మీ మనస్సులో బలంగా నాటుకుంటే, మీ ప్రాక్టీస్ అంతా నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది. మీరు ఏమి చేస్తున్నారో మీరు అర్థం చేసుకుంటారు, లక్ష్యాన్ని సాధించడం సాధ్యమని మీరు అర్థం చేసుకుంటారు మరియు ఆ లక్ష్యం ఏమిటో కూడా మీరు అర్థం అవుతుంది.

బౌద్ధమతంలో ఇది చాలా ముఖ్యమైన విధానం అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మనం ఒక ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించబోతున్నట్లయితే, అది వాస్తవికమైనదని నమ్మడం చాలా ముఖ్యం. ఇది మనం భావోద్వేగం నుండి ఆకర్షించబడిన ఒక రకమైన ఆదర్శవాద కల్పన కాదు, కానీ ఇది ఖచ్చితంగా అసాధ్యమైనది. మన ఆధ్యాత్మిక జీవితంలో మన౦ చేస్తున్నది వాస్తవికమైనదని మన౦ నమ్మితే, దానిలో ఒక ఆరోగ్యకరమైన భావోద్వేగాన్ని మనం ఉ౦చవచ్చు. మనకు ఆ రెండింటి మధ్య ఒక బ్యాలెన్స్ అవసరం: అవగాహన మరియు కరుణ, ఉత్సాహం, సహనం లాంటి ఆరోగ్యకరమైన భావోద్వేగాలు.

రెండు సత్యాలు

రిలేటివ్, మరియు సంప్రదాయ సత్యం

ఈ రెండు సత్యాల అర్థాన్ని తెలుసుకోవడం ద్వారా, అదే పునాది, అన్నీ ఇమిడి ఉండే మార్గం,

శ్లోకంలోని మొదటి లైన్ రెండు సత్యాల గురించి మాట్లాడుతుంది: "సాపేక్ష సత్యం" లేదా "సాంప్రదాయిక సత్యం" మరియు "లోతైన సత్యం" - మరో మాటలో చెప్పాలంటే, ప్రతి దాని యొక్క వాస్తవికత గురించి రెండు నిజమైన సత్యాలు. ఒకటి బాగా పైపైన ఉంటుంది, మరొకటి లోతైన స్థాయిలో ఉంటుంది. ఈ రెండూ చెల్లుబాటు అవుతాయి కాని వేర్వేరు విధానాల నుంచి. ఈ రెండింటి గురించి అనేక ప్రదర్శనలు ఉన్నాయి, కానీ దలైలామా గారు సాధారణ ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగించేటప్పుడు ఎప్పుడూ ఉపయోగించే ఒక దాన్ని మనం తెలుసుకుందాం.

కారణం మరియు ప్రభావం

మనం అనుభవించే ప్రతి దానిలో సత్యం యొక్క స్థాయి ఏమిటి? అంటే మనం అనుభవించే ప్రతిదీ దాని ఇంతకుముందు కారణాలతో సంబంధంతో మాత్రమే జరుగుతోంది. మరో మాటలో చెప్పాలంటే, ప్రతిదీ కారణం మరియు ప్రభావంపై ఆధారపడి ఉంటుంది లేదా జరుగుతుంది. భౌతిక శాస్త్రం కూడా ఈ కారణ సూత్రాన్ని బోధిస్తుంది, కానీ బంతిని తన్నడం మరియు బంతి కదలడం మధ్య సంబంధం లాంటి భౌతిక ప్రభావాలకు సంబంధించి మాత్రమే. ఈ సంబంధం సాధారణ మెకానిక్స్, కారణం మరియు ప్రభావం గురించి ఉంటుంది.

ఏదైనా జరగడానికి కారణమయ్యే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు కారణాన్ని బాగా కష్టంగా వివరించవచ్చు. ఉదాహరణకు, మీరు ఆర్థిక సమస్యలు, గ్లోబల్ వార్మింగ్, ప్రాంతీయ యుద్ధాలు మొదలైన వాటిని పరిశీలిస్తే, అవి కేవలం ఒక కారణం నుంచే వచ్చినవి కావని మనకు తెలుస్తుంది. అవి కూడా ఏ కారణం నుంచీ వచ్చినవి కావు, అసంబద్ధమైన కారణాల వల్ల నుంచి కూడా వచ్చినవి కావు. దానికి బదులుగా, ఇటువంటి పరిస్థితులన్నీ అనేక విభిన్న అంశాలపై ఆధారపడి ఉంటాయి. వీటిలో ప్రస్తుతం ఏం జరుగుతోందని మాత్రమే కాకుండా, గతంలో ఏం జరిగిందో కూడా ఉంటుంది. ఇక్కడ ఈ దేశమైన ఉక్రెయిన్ లో లాగా, మీరు ప్రస్తుత పరిస్థితిని సోవియట్ గతం లేదా రెండవ ప్రపంచ యుద్ధం మరియు అన్నిటి నుండి వేరు చెయ్యలేరు. చరిత్ర అంతా సంభవించిన ప్రతి దాని పర్యవసానంగా నేడు ఆర్థిక మరియు పర్యావరణ పరిస్థితులు తలెత్తాయి. కాబట్టి, ఇప్పుడు జరుగుతున్నది కేవలం ఒక వ్యక్తి తప్పు లేదా జరిగిన ఒక సంఘటన వల్ల అని మీరు చెప్పలేరు. చాలా కారణాలు మరియు పరిస్థితుల మీద ఆధారపడి ఇవన్నీ జరుగుతాయి. ఇదే రియాలిటీ, అవునా కాదా?

లేదా సైకాలజీ పరంగా మీరు చూస్తే: మీకు కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే, అది కేవలం ఒక కారణం నుంచి వచ్చిందని మీరు  చెప్పలేరు. కుటుంబంలోని ప్రతి ఒక్కరు ఈ సమస్యకు ఏదొక రకంగా సహాయపడ్డారు. అదే విధంగా, ప్రతి ఒక్కరూ ప్రవర్తిస్తున్న తీరుకు పనిలో, పాఠశాలలో మరియు వారి స్నేహితుల మధ్య ఏమి జరుగుతుందో మీకు సంబంధం లేదని మీరు చెప్పలేరు. ప్రతిదీ ఏదొక ప్రభావం చూపుతుంది. అంతేకాక, కుటుంబ పరిస్థితి సమాజం మరియు దాని రాజకీయ, సామాజిక మరియు ఆర్థిక వ్యవస్థల నుంచి వేరుగా ఉండదు. ఇవన్నీ ఏదో ఒక రకంగా సమస్యలను ప్రభావితం చేస్తాయి.

ఇక్కడ, వాస్తవికత అనేది ప్రతిదీ ఒక దానితో ఒకటి ముడిపడి ఉంటుంది మరియు ప్రతి దాన్ని ప్రభావితం చేస్తుందనే నిజాన్ని సూచిస్తుంది. జరిగే ప్రతిదీ కారణాలు మరియు పరిస్థితుల యొక్క ఫలితంగా జరుగుతోంది. ఇదే రియాలిటీ.

భౌతిక వస్తువుల విషయంలోనూ, అలాగే ప్రపంచ సమస్యలు, కుటుంబ సమస్యల విషయంలోనూ ఇలా ఉంటే, వ్యక్తిగతంగా మనలో ప్రతి ఒక్కరితో వ్యక్తిగత స్థాయిలో ఎలా ఉంటుంది? సుఖదుఃఖాల మాటేమిటి? వాటికి కారణాలు ఉంటాయా? అవి కారణం లేకుండానే వస్తాయా? అన్నింటికీ మించి, కొన్నిసార్లు నేను సంతోషంగా ఉంటాను, ఇంకొన్ని సార్లు నేను సంతోషంగా ఉండను, అలా నేను తర్వాతి క్షణంలో ఎలా ఉంటానో తెలుసుకోవడానికి అస్సలు ఏ మార్గం లేదు. కాబట్టి, అది ఏ కారణం లేకుండానే జరుగుతోందా? లేక ప్రస్తుతం నేను చేస్తున్న పనిపైనే ఆధారపడి జరుగుతోందా? సరే, దానిలో ఏ అర్ధం లేదు, కదా? నేను ఒకే ఆహారాన్ని రెండు వేర్వేరు రోజులలో తినవచ్చు, మరియు ఒక రోజు నేను దానిని తినేటప్పుడు సంతోషంతో ఉండొచ్చు మరొక రోజు బాధలో ఉండవచ్చు, కాబట్టి ఇది తినే ఆహారం నుంచి రావడం లేదు. నేను ఎక్కువగా ఇష్టపడే వ్యక్తితో ఉండవచ్చు అయినా కానీ కొన్నిసార్లు సంతోషంగా, కొన్నిసార్లు అసంతృప్తిగా ఉండవచ్చు. నేను ధనవంతుడిని కావచ్చు మరియు నాతో అన్నీ బాగా జరుగుతాయి, అయినా కానీ నేను అసంతృప్తిలో ఉండవచ్చు.

ఇంతకీ ఈ సుఖదుఃఖాలు ఎక్కడి నుంచి వస్తాయి? కొన్నిసార్లు నేను సంతోషంగా, కొన్నిసార్లు అసంతృప్తిగా ఉండటానికి ఒక బటన్ నొక్కే ఎవరైనా పైన ఉండే వ్యక్తి వాటిని పంపుతున్నాడా? నన్ను క్షమించండి, నేను అభ్యంతరకరంగా మాట్లాడాలని అనుకోవడం లేదు. నేను దాన్ని ఒక సిల్లీ విపరీత స్థాయికి తీసుకెళ్తున్నాను. కానీ, మీరు అనుభవించే ప్రతిదీ - కదిలే భౌతిక వస్తువులు లేదా మీరు ప్రమాదవశాత్తు వేడి పొయ్యిని తాకినప్పుడు మీ చేయి కాలిపోవడం మరియు గాయపడటం లాంటివి - కారణం మరియు ప్రభావ నియమాలను అనుసరిస్తే, ఆనందం మరియు దుఃఖం కూడా అర్థం చేసుకోగలిగే కారణ సూత్రాలను అనుసరించాలి కదా? ఈ శ్లోకం నేపధ్యంలో సాపేక్ష సత్యం ప్రస్తావనలో వాస్తవికత గురించిన ప్రశ్న, ప్రధాన అంశం ఇదే. ఇది మన ప్రవర్తన మరియు దాని ఫలితంగా వచ్చే సంతోషం లేదా దుఃఖం యొక్క మన అనుభవాల మధ్య కారణ సంబంధం యొక్క రియాలిటీని సూచిస్తుంది.

కర్మ

ఇది మనల్ని ప్రాథమిక బౌద్ధ బోధన అయిన కర్మ దగ్గరకు తీసుకువస్తుంది. కర్మ అంటే ఏమిటి? ఇది అంత సులువైన విషయం కాదు. దీని గురించి అనేక వివరణలు మరియు చాలా అపార్థాలు ఉన్నాయి, కానీ ప్రాథమికంగా:

కర్మ అనేది మనం చేసే పని, మాటలు మరియు ఆలోచించే మార్గాలను నడిపించే మరియు వర్గీకరించే నిర్బంధతను సూచిస్తుంది.

మన ప్రవర్తన, అది వినాశకరమైనదైనా, నిర్మాణాత్మకమైనదైనా, లేదా తటస్థమైనదైనా, మీరు దాని గురించి ఆలోచిస్తే అదేమిటో అర్ధం అవుతుంది.

  • నాకు చిరాకుగా అనిపించి ఎవరి మీదైనా అరవాలని అనిపిస్తుంది, అప్పుడు అలా అరిచేస్తాను.
  • నేను ఎక్కువ ప్రొటెక్టివ్ గా ఉంటాను మరియు నా బాబు ఆరోగ్యంగా ఉందో లేదో చూడటానికి వెళ్తాను, ఆ తర్వాత అలాగే పదే పదే వెళ్లి చూస్తాను, అవసరమైన దానికంటే ఎక్కువ సార్ల ఇలా చేస్తాను.
  • నాకు ఆకలిగా అనిపించి ఏదొకటి తినడానికి రిఫ్రిజిరేటర్ దగ్గరకు వెళ్లాలని అనిపిస్తుంది, ఆ తర్వాత నేను బలవంతంగా అక్కడికి వెళ్తాను.

ఈ బలవంతం ఎక్కడి నుంచి వస్తుంది? మరియు, ఇది ఎక్కడికి దారితీస్తుంది? కర్మపై బోధనలు అడిగే ప్రశ్నలు ఇవే. బౌద్ధమత వివరణ ఏమిటంటే, మీరు బలవంతపు పద్ధతిలో వ్యవహరించినప్పుడు, మాట్లాడినప్పుడు లేదా ఆలోచించినప్పుడు, అది మీ మానసిక కొనసాగింపుపై సామర్థ్యాలను మరియు ధోరణులను పెంచుతుంది, అలా ఇది మీ అనుభవంలోని ప్రతి క్షణం కొనసాగుతుంది. వివిధ పరిస్థితుల ద్వారా ప్రేరేపించబడినప్పుడు, అవి ప్రవర్తన యొక్క నమూనాను రిపీట్ చెయ్యాలనే మీ భావనకు దారితీస్తాయి. ఆ ఫీలింగ్ ఆధారంగా, పనిని రిపీట్ చెయ్యడానికి నియంత్రణలో లేని మిమ్మల్ని ఆకర్షించే అడ్డు ఏర్పడుతుంది. ఈ అడ్డే అసలైన కర్మ.

నిజానికి, మీరు ఈ విషయాన్ని శారీరక స్థాయిలో కూడా వివరించవచ్చు: ఒక నిర్దిష్ట మార్గంలో పనిచేయడం నాడీ మార్గాన్ని నిర్మిస్తుంది మరియు దాన్ని బలోపేతం చేస్తుంది, అలా మీరు ప్రవర్తన యొక్క నమూనాను ఇంకా సులభంగా అనుసరిస్తారు. బౌద్ధమతం ఖచ్చితంగా ఈ భౌతిక ఆధారాన్ని తిరస్కరించదు; ఇది ఈ విషయాన్ని అనుభవ ఆలోచనా విధానం నుంచి పరిశీలిస్తుంది, కానీ ఇప్పటికీ కారణం మరియు ప్రభావానికి మరొక ఉదాహరణగా అనలైజ్ చేస్తుంది.

సుఖదుఃఖాల మాటేమిటి? బౌద్ధమతం కర్మ యొక్క కారణం, ప్రభావాల పరంగా కూడా వీటిని వివరిస్తుంది. మీరు అసంతృప్తిని అనుభవిస్తే, అది ఇబ్బంది పెట్టే భావోద్వేగాల ప్రభావంతో చేసిన మీ బలవంతపు విధ్వంసక ప్రవర్తన యొక్క దీర్ఘకాలిక ఫలితం. ఒకవేళ మీరు ఒక సాధారణ ఆనందాన్ని అనుభవిస్తే - ఇది కొనసాగని మరియు ఎప్పుడూ సంతృప్తి చెందని మంచి అనుభూతిని ఇస్తే - ఇది సహనం మరియు దయ లాంటి పాజిటివ్ భావోద్వేగాల ప్రభావంతో చేసిన నిర్మాణాత్మక ప్రవర్తన యొక్క దీర్ఘకాలిక ఫలితం. అయినప్పటికీ, ఇది ఇప్పటికీ బలవంతపు ప్రవర్తన, ఎందుకంటే ఇది మనం ఎలా ఉన్నాము అనే గందరగోళంతో కలిసిపోయి ఉంటుంది, బలవంతపు పని చేసేవాడు లేదా బలవంతపు పరిపూర్ణవాదిగా.

ఈ సాధారణ సంబంధాలను మనం ఎలా అర్థం చేసుకోవాలి? ముందుగా, నిర్మాణాత్మక మరియు విధ్వంసక ప్రవర్తన మధ్య తేడాను మనం అర్థం చేసుకోవాలి. ఈ రెండింటి మధ్య తేడా మీ ప్రవర్తన మరొకరిపై చూపే ప్రభావాన్ని బట్టి ఉండదు. ఉదాహరణకు, మీరు ఒకరిపై చాలా కోపంతో అతనిని మీరు కత్తితో పొడిచినట్లయితే, అది వినాశకరమైనది. మరోవైపు, ఒక చికిత్సకుడిగా, ప్రాణాలను కాపాడే ఆపరేషన్ చెయ్యడానికి మీరు ఎవరినైనా కత్తితో కోస్తే, అది నిర్మాణాత్మకమైనది. సహజంగా, ఒకరిపై కత్తిని ఉపయోగించే పని ఇక్కడ నిర్మాణాత్మకమైనదా లేదా వినాశకరమైనదా అని నిర్ణయించే అంశం కాదు. ఇది ప్రేరణపై ఆధారపడి ఉంటుంది: పని జరిగే మానసిక స్థితి మరియు ఆ పని ద్వారా మీరు చేరుకోవాలనుకుంటున్న లక్ష్యం.

కోపం, మమకారం, దురాశ, అమాయకత్వం, అసూయ, అహంకారం, స్వార్థం లాంటి ఇబ్బంది పెట్టే భావోద్వేగాలతో పని ప్రేరేపించబడితే, మీరు ఒక మంచి పని అనుకుని చేసినా అది వినాశకరమైనదే. ఉదాహరణకు, మీరు ఒక చెడు కోరికతో వారిని లైంగికంగా వేధించాలని అనుకుని ఎవరికైనా మంచి మసాజ్ ఇస్తే, మీరు చేసిన పని వినాశకరమైనదే. మరోవైపు, ఆ పని ఇలాంటి ఇబ్బంది పెట్టే వాటి నుంచి దూరంగా స్వేచ్ఛగా ఉంటే, ఆ పని అస్సలు బాగుండకపోయినా అది నిర్మాణాత్మకంగానే ఉంటుంది. ఉదాహరణకు, తల్లిద౦డ్రులుగా, మీరు మీ పిల్లలను వారి గదికి పంపుతారు, కోపంతో కాదు, అల్లరి చెయ్యకూడదని నేర్పి౦చడానికి ప్రేమ, మరియు శ్రద్ధతో అలా చేస్తారు. ఏదేమైనా, చాలా సందర్భాల్లో, నిర్మాణాత్మక పని అనేది ఇప్పటికీ తప్పనిసరే ఎందుకంటే మీ పని యొక్క నిజమైన భావాన్ని పొందడానికి అపస్మారక ప్రేరణతో కాలిపోయి ఉంటుంది - ఈ సందర్భంలో, మంచి తల్లిదండ్రులుగా.

అలాంటప్పుడు, ఇబ్బంది పెట్టే భావోద్వేగాల ఆధారంగా అసంతృప్తి మరియు విధ్వంసక ప్రవర్తన మధ్య కారణ సంబంధాన్ని మరియు సాపేక్షంగా ఇబ్బంది కలిగించే భావోద్వేగాలు లేని ఆనందం మరియు నిర్మాణాత్మక ప్రవర్తన మధ్య కారణ సంబంధాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాము? ఇది కేవలం ఒక ఆసక్తికరమైన ప్రశ్న మాత్రమే కాదు, ఇది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే బుద్ధుడు కర్మ, కలవరపరిచే భావోద్వేగాలు మరియు మనం ఎలా ఉన్నామనే దానిపై గందరగోళం మనకు ఎలా అనిపిస్తుందో కొన్ని కారణాలుగా వాటిని గుర్తించాడు. అసంతృప్తికి, తృప్తి లేని సాధారణ ఆనందానికి అవే కారణం. ఈ రెండు రకాల భావాల వల్ల కలిగే బాధల నుంచి విముక్తి పొందాలంటే ఈ రెండింటిని మనం దాటి వెళ్లాలి.

దీని గురించి ఆలోచిద్దాం. ఉదాహరణకు, మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు లేదా ఆలోచిస్తున్నప్పుడు లేదా కోపంతో ఉన్నప్పుడు, మీరు ప్రశాంతంగా ఉన్నారా? మీ శక్తి ప్రశాంతంగా ఉందా? లేదు కదా, ఇది అస్సలు ప్రశాంతంగా ఉండదు; అది రెచ్చిపోతూ ఉంటుంది. అలాంటి సమయాల్లో మీరు సంతోషంగా ఉన్నారా? కోపాన్ని లేదా ఇతర బాధాకరమైన వాటిని అనుభవిస్తున్నప్పుడు వాళ్ళు సంతోషంగా ఉన్నారని చెబుతారని నేను అనుకోను. అదే విధంగా, మీరు అత్యాశలో ఉన్నప్పుడు మీ శక్తిని గమనిస్తే, మీరు ప్రశాంతంగా ఉండరు; మీకు కావలసింది దొరకదని భయపడుతుంటారు. మీరు ఒకరితో మంచి అనుబంధాన్ని కలిగి ఉండి వారిని బాగా మిస్ అవుతుంటే, అప్పుడు కూడా ప్రశాంతంగా ఉండలేరు; మీ శక్తి చాలా డిస్టర్బ్ అవుతుంది. మీకు కోపం, దురాశ, స్వార్థం లాంటివి లేనప్పుడు, మీరు దయతో ఉండటానికి ప్రయత్నిస్తున్నప్పుడు, మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, మీ శక్తి సున్నితంగా ఉంటుంది, కదా? మీరు ప్రాథమికంగా సంతోషంగా ఉంటారు, అయితే ఇది ఆనందం యొక్క చిన్నపాటి స్థాయి కావచ్చు, నాటకీయంగా ఏమీ ఉండదు. మీరు బలవంతపు "మంచి చేసే వ్యక్తి" అయినప్పటికీ ప్రతి దాన్ని పరిపూర్ణంగా చేయాలనుకుంటే, మీ శక్తి ఇంకా రిలాక్స్ గా అవుతుంది మరియు మీరు కోపంతో ఉన్నప్పటి కంటే మంచి పనులు చెయ్యడంలో మీరు సంతోషంగా ఉంటారు. నిజానికి, ఏదైనా మంచి పనిని చేస్తున్నప్పుడు మీరు తప్పు చేస్తారని లేదా దానికి తగిన వారు కాదని భయపడితే, అప్పుడు మీరు ఖచ్చితంగా అలాంటి ఆలోచనలతో ప్రశాంతంగా ఉండలేరు.

ఇక్కడ గమనించదగిన విషయం ఏమిటంటే, మీ పని అయిపోయిన తర్వాత కూడా ఈ అసంతృప్తి లేదా చిన్నపాటి ఆనందం కొద్ది సేపు ఉంటుంది. మీరు వేరే పని చేస్తున్నప్పుడు కూడా మీరు అనుభూతి చెందేది మీరు ఇంతకు ముందు చేసిన పని ద్వారా ఇది ప్రభావితమవుతుందని సూచిస్తుంది. బుద్ధుడు కర్మకు, మీరు అనుభవించే సంతోషం లేదా దుఃఖానికి మధ్య ఉన్న సంబంధం గురించి మాట్లాడినప్పుడు, అతను ప్రధానంగా ఏదో ఒక పని తర్వాత మనం అనుభూతి చెందే దాని గురించి మాట్లాడలేదు. అతను దీర్ఘకాలిక ఫలితాల గురించి మాట్లాడారు. ఏదేమైనా, మన బలవంతపు భావోద్వేగ ప్రవర్తనకు మరియు మన శరీరంలో మన శక్తి విధానానికి మధ్య సంబంధం గురించి ఆలోచించినప్పుడు మనం అతని అభిప్రాయాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టవచ్చు.

కాబట్టి, మనం అనుభవించే ప్రతి దానికి సంబంధించిన రిలేటివ్ సత్యం ఏమిటంటే, ప్రతిదీ మన సాధారణ మానసిక స్థితితో సహా కారణాలు మరియు పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది మరియు మనం ఏమి చేయాలనుకుంటున్నాం అనేది మాత్రమే కాదు, మనం సంతోషంగా ఉన్నామా లేదా అసంతృప్తిగా ఉన్నామా అనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. ఇది వాస్తవికత యొక్క ఒక అంశం - శ్లోకంలోని లైన్ దాన్ని పునాది అని పిలుస్తుంది, అన్ని విషయాలు ఇమిడి ఉండే విధానం - ప్రతిదీ ఉనికిలో ఉండే, పనిచేసే మరియు జరిగే విధానం.

లోతైన సత్యం

ప్రతి దాని గురించి రెండవ సత్యం లోతైన స్థాయిలో దృష్టి పెడుతుంది. మన ఆలోచనల అంచనాల కారణంగా విషయాలు అసాధ్యమైన మార్గాల్లో ఉనికిలో ఉన్నట్లు మరియు పనిచేస్తున్నట్లు అనిపించినప్పటికీ, అవి ఉనికిలో ఉన్నట్లు కనిపించే అసాధ్యమైన మార్గాలు రియాలిటీకి అనుగుణంగా ఉండవు.

మన అంచనాలకు అనుగుణమైన ఏదీ కనిపెట్టబడని ఆ పూర్తి లోపాన్ని "శూన్యత" అని పిలుస్తారు, దీన్ని ఎక్కువగా "ఖాళీ రూపం" అని అనువదిస్తారు.

అలవాటైన గందరగోళం నుంచి మన మనస్సులు ప్రొజెక్ట్ చేసే అసాధ్యమైన మార్గాలలో అనేక స్థాయుల సూక్ష్మత ఉన్నప్పటికీ, అత్యంత సాధారణ స్థాయిలో దానితో ఈ లోతైన సత్యంతో పనిచేయడం ప్రారంభించవచ్చు: ఈ విషయాలు అసాధ్యమైన మార్గాల్లో ఉండవు. అవి అలా ఎలా ఉంటాయి? రియాలిటీ ఏమిటంటే, మన అయోమయ మనస్సులు ప్రొజెక్ట్ చేసే అసాధ్యమైన అసంబద్ధతకు అనుగుణంగా ఏమీ ఉండదు. ఇది పూర్తిగా అసలు ఉండదు, అలాంటిదేమీ ఉండదు.

ఒక క్లాసిక్ ఉదాహరణను తీసుకోండి: ఒక పిల్లవాడు మంచం క్రింద ఒక రాక్షసుడు ఉన్నాడని అనుకుంటాడు. నిజానికి, ఆ మంచం క్రింద ఒక పిల్లి ఉంటుంది, కానీ పిల్లవాడు పిల్లిని రాక్షసుడిలా అనుకుంటాడు. అప్పుడు ఆ పిల్లవాడు అక్కడ నిజంగా ఒక రాక్షసుడు ఉన్నాడని నమ్ముతాడు కాబట్టి, దానిలో ఏ అర్ధం లేకపోయినా, ఆ పిల్లవాడు చాలా భయపడతాడు. కాబట్టి, ఈ అర్ధం లేని విషయం పిల్లలపై ప్రభావం చూపుతుంది, కానీ ఇది ఖచ్చితంగా ఆ పిల్లిని ఒక నిజమైన రాక్షసుడిగా మార్చదు, ఎందుకంటే రాక్షసులు అనేవి ఏమీ లేవు. శూన్యత అనేది, పిల్లల ఫాంటసీలో ఉండే ఆ రాక్షసుడు అస్సలు లేకపోవడం. అక్కడ రాక్షసుడు అస్సలు లేడు, ఎప్పటికీ ఉండడు. కానీ ఈ ఆలోచనను పక్కన పెడితే, ఆ మంచం కింద ఒక పిల్లి ఉంటుంది; అక్కడ ఏమీ లేదని కాదు కదా.

అలవాట్లలో, వస్తువులు నిజంగా మనకు కనిపించే విధంగానే ఉన్నాయని మనం ఊహించుకుంటాము. మన కళ్ల ముందు ఏముందో, ప్రస్తుతం మనం ఏం ఫీలవుతున్నామో అనేది మాత్రమే మనకు తెలుసు. ఉదాహరణకు, నేను ఇప్పుడు అసంతృప్తిగా ఉండవచ్చు, మరియు అది ఏ కారణం లేకుండా దానికదే వచ్చినట్లు అనిపించవచ్చు. నేను కేవలం అసంతృప్తిగానే ఉన్నాను. ఎందుకో నాకు తెలియదు. నాకు బోర్ గా అనిపిస్తుంది. నాకు సిగ్గుగా అనిపిస్తోంది; నేను అసంతృప్తిగా ఉన్నాను మరియు ఇది నాకు మరియు నాతో ఉన్న వ్యక్తులకు సంబంధించినదిగా అనిపించదు. అకస్మాత్తుగా, నాకు వింతగా అనిపిస్తుంది; నేను అసంతృప్తిగా అవుతాను. నటించాల్సిన అవసరం లేదు. ఇది తక్కువ స్థాయి అసంతృప్తి భావన కావచ్చు. కాబట్టి ఇది ఎలా వచ్చింది? ఏ కారణం లేదని ఇక్కడ తెలుస్తోంది. కానీ అది అసాధ్యం. అది రియాలిటీకి అనుగుణంగా లేదు. ఇది ఒక లోతైన సత్యం.

సాంప్రదాయిక, రిలేటివ్ సత్యం ఏమిటంటే, నా అసంతృప్తి లేదా ఆనందంతో సహా ప్రతిదీ కారణం మరియు ప్రభావం యొక్క ప్రక్రియ నుండి వస్తుంది. అయినా అదే రియాలిటీ, కాని నాకు అది అలా కనిపించడం లేదు. నాకు తోచినది ఏ కారణం లేకుండా ఎక్కడి నుంచో వచ్చినట్లు అనిపిస్తుంది. లోతైన సత్యం ఏమిటంటే, ఇది నాకు ఎలా కనిపిస్తుందో రియాలిటీకి అనుగుణంగా లేదు - ఇది అసాధ్యమైనదిగా ఉంది. ఆలోచిస్తే అది నిజంగా చాలా లోతైనది.

నేను ఇంకొక ఉదాహరణను చెబుతాను. నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడనుకోండి, అతను అప్పుడప్పుడు నా మీద అరుస్తాడు అనుకోండి. మా మధ్య ఒక అద్భుతమైన సంబంధం ఉంది, కానీ ఒక్కసారిగా, నా స్నేహితుడు ఏదో కోపంలో నా మీద అరిచేశాడు. ఇది నాకు ఎలా అనిపిస్తుంది? "నేనంటే నీకింక ఇష్టం లేదు" అని అనిపిస్తుంది. I నేను బాగా బాధ పడ్డాను, ఎందుకంటే నా కళ్ళ ముందు కనిపించేది అంతా నా స్నేహితుడు నాపై అరవడం మాత్రమే మరియు నేను అతన్ని పూర్తిగా ఆ ఆలోచనతోనే చూస్తాను అంతేకానీ ఇంకేమీ లేదు. కానీ ఆ అంచనా రియాలిటీకి సరైనదిగా ఉండదు. ఆ అరుపులు దేని నుంచీ రాలేదు, మా చిరకాల స్నేహంలో ఇది కేవలం ఒక సంఘటన మాత్రమే. బహుశా మీకు కూడా ఇలా జరిగి ఉండవచ్చు.

ఇక్కడ ఏమి జరుగుతుంది అంటే, మన స్నేహితుడితో మనకు ఉన్న సంబంధం యొక్క ఆలోచనను మనం కోల్పోతాము - మనం ఈ వ్యక్తితో ఉన్న అన్ని జ్ఞాపకాలు మరియు కబుర్లు. కానీ అదొక్కటే కాదు; మనం పెద్ద చిత్రాన్ని కూడా మర్చిపోతాము. మన స్నేహితుడి జీవితంలో మనం మాత్రమే లేము మరియు అతని జీవితంలో మన స్నేహం మాత్రమే ఉండదు. మన స్నేహితుడికి నాతో పాటు వేరే పూర్తి జీవితం ఉంది మరియు ఇది అతను ఎలా భావిస్తాడో మరియు ఎలా ప్రవర్తిస్తాడో కూడా ప్రభావితం చేస్తుంది. బహుశా అతనికి పనిలో ఒక కష్టమైన రోజు గడవచ్చు లేదా అతని తల్లిదండ్రులతో ఏదైనా సమస్య ఉండవచ్చు మరియు ఇది నా స్నేహితుడిని చెడ్డ మూడ్ లో ఉంచి అతను నాపై అరిచేలా చేసి ఉండవచ్చు. లోతైన సత్యం ఏమిటంటే, నేను ఊహించినది అసాధ్యమైనది: అతను నాపై అరవడం పూర్తిగా రియాలిటీ కాదు, మా మిగిలిన స్నేహం యొక్క సందర్భం మరియు అతని జీవితంలో మిగిలిన విషయాలతో సంబంధం లేకుండా. స్వతంత్రంగా ఉన్న సంఘటనల రూపానికి సంబంధించిన అసలైన రియాలిటీ ఉనికిలో ఉండదు, అలాంటిదేమీ లేదు. అటువంటి జీవన విధానం పూర్తిగా లేకపోవడాన్ని సంస్కృతంలో "శూన్యత" అని పిలుస్తారు, ఇది సున్నా అనే పదానికి సమానమైన పదం.

ఈ రెండు సత్యాల దృష్టిలో, వస్తువులు ఒకదానికొకటి విడివిడిగా లేనప్పుడు, ఒకదానికొకటి స్వతంత్రంగా ఉన్నప్పుడు, కారణం మరియు ప్రభావం పనిచేస్తాయి. ఎందుకంటే కారణం మరియు ప్రభావం ఒక దానితో ఒకటి రిలేటివ్ ఆధారపడి మాత్రమే ఉంటాయి. ఒక కారణం నుంచి సంభావ్య ప్రభావం ఉంటే తప్ప అది ఉనికిలో ఉండదు. ఏదైనా ఒక ప్రభావాన్ని చూపలేనప్పుడు, అది దేనికైనా ఒక కారణంగా ఎలా ఉనికిలో ఉంటుంది? కాబట్టి, వస్తువుల రిలేటివ్ సత్యం, అంటే వాటి కారణ సంబంధాలు, ప్రతి దాని యొక్క లోతైన సత్యంతో మాత్రమే పనిచెయ్యగలవు: అన్నింటి నుంచి విడదీయబడే అసాధ్యమైన మార్గంలో ఏదీ ఉండదు.

ఈ విధంగా రెండు సత్యాలు ఒకదానికొకటి సహాయం చేసుకుంటాయి అనేది, శ్లోకంలో చెప్పినట్లుగా, పునాది, ప్రతిదీ ఇమిడి ఉంటుంది. "పునాది" అనేది తరువాతి వరుసలో వచ్చే దానికి కూడా సూచిస్తుంది. రియాలిటీను, అంటే రెండు సత్యాలను చూడటం ఆధారంగానే బుద్ధుడు నాలుగు సత్యాలను అర్థం చేసుకున్నాడు.

ప్రశ్నలు

నిజమైన రియాలిటీని అనుభవించడం

మీకు తప్పు భావనలు లేని చోట ప్రత్యక్షంగా నిజమైన రియాలిటీని అనుభవించడం సాధ్యమేనా? లేక అసాధ్యమా?

లేదు, ఇది సాధ్యమే. మన మానసిక పనులలో ప్రతిదీ అసాధ్యమైన మార్గాల్లో ఉన్నట్లుగా అనిపించినప్పటికీ, అవి రియాలిటీకి అనుగుణంగా లేనందుకు, ఆ ఇబ్బందులకు కారణమయ్యే వాటిని వదిలించుకోవడం సాధ్యమవుతుంది. ఎందుకంటే రియాలిటీ అనేది ఉంటుంది మరియు దాన్ని తప్పు పట్టడం మానసిక కార్యాచరణ యొక్క ప్రాథమిక స్వభావంలో భాగం కాదు. మానసిక పనులు ఎటువంటి అంచనాలు లేదా తప్పు పట్టకుండా పనిచెయ్యడం సాధ్యమవుతుంది.

దాని ఆధారంగా, మన మానసిక పనులు రియాలిటీని తప్పు పట్టినప్పుడు, అది మనకు సమస్యలను, బాధను మరియు అసంతృప్తిని కలిగిస్తుందని మనం అర్థం చేసుకుంటాము. కానీ ఆ తేడాను మన మనస్సులు ప్రొజెక్ట్ చెయ్యకుండా ఆపడం సాధ్యమే కాబట్టి, ఇకపై మనకు సమస్యలు రాకుండా ఉంటాయి. మన మనస్సులు ఈ లక్ష్యాన్ని చేరుకోగలవని మనం అర్థం చేసుకున్న తర్వాత, ఈ బాధను నివారించడానికి మన జీవితంలో ఉంచడానికి దీన్ని ఒక సురక్షితమైన దిశగా మనం పొందాలి. ఈ సురక్షితమైన దిశే మన "ఆశ్రయం" అని పిలువబడుతుంది. కానీ ఈ లక్ష్యాన్ని సాధించడం నిజంగా సాధ్యమేనని నమ్మితేనే మనం చేరుకోగలం. నేను చెప్పినవన్నీ రియాలిటీ మరియు దాన్ని గ్రహించే మన సామర్థ్యంపై ఆధారపడి ఉన్నాయని గ్రహించడం నుంచి మనకు ఈ నమ్మకం వస్తుంది.

కానీ మానసిక అడ్డంకులను అధిగమించడానికి రియాలిటీతో మనల్ని మనం పరిచయం చేసుకోవడానికి చాలా సుదీర్ఘ శిక్షణ అవసరం. ఇక్కడే ధ్యానం వస్తుంది. ఈ సందర్భంలో, ధ్యానం అనేది రియాలిటీను ఒక ప్రయోజనకరమైన అలవాటుగా చూడటం ద్వారా రియాలిటీతో మనల్ని మనం పరిచయం చేసుకోవడానికి ఒక శిక్షణ. మీరు ఆ అలవాటును పెంపొందించుకుంటే, మీరు ఎవరినైనా కలిసినప్పుడల్లా, వారు మీ కళ్ళ ముందు కనిపించే విధంగా కాకుండా వేరేలా చూడగలుగుతారు. దానికి బదులుగా, వారు ఒకప్పుడు బేబీగా ఉన్నారని, వారికి బాల్యం మరియు అడల్ట్ జీవితం ఉందని మరియు అనేక విషయాలు వారి జీవితాంతం వారిని ప్రభావితం చేశాయని మీరు తెలుసుకుంటారు. మరియు వాళ్ళు ఇంకా పెద్ద వాళ్లవుతారు మరియు మరిన్ని విషయాలచే ప్రభావితమవుతారు. ఈ విధంగా, మీరు వ్యక్తి యొక్క జీవితంలోని  రియాలిటీను చూస్తారు మరియు దానిలో జరిగిన ప్రతిదీ ఒక దానితో ఒకటి సంబంధం కలిగి ఉందని తెలుసుకుంటారు. వ్యక్తి యొక్క రియాలిటీను మీ కళ్ళ ముందు ఒక స్టిల్ ఫొటోలా స్వల్ప దృష్టితో చూడటం కంటే ఇంకా ప్రయోజనకరమైన మరియు వాస్తవిక మార్గంలో సంభాషించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

కానీ అందుకు మిమ్మల్ని మీరు శిక్షణ ఇచ్చుకోవాలి. నిస్సందేహంగా వారి జీవితం మరియు దాని ప్రభావాల యొక్క అన్ని వివరాలు మీకు తెలియదు, కానీ అది ముఖ్యం కాదు. ఈ వ్యక్తికి అనేక ప్రభావాలతో కూడిన చరిత్ర ఉందని మరియు భవిష్యత్తు ఉంటుందని తెలుసుకోవడం ఆ వ్యక్తి యొక్క రియాలిటీని మీకు అర్ధం అయ్యేలా చేస్తుంది. కాబట్టి, మీరు ఒక బేబీని చూస్తే, ఉదాహరణకు, మీరు ఆ బేబీని అలాగే చూడరు; ఇక్కడ ఒక సంభావ్య అడల్ట్ ఉన్నాడని, మరియు నేను ఇప్పుడు చేసే ప్రతిదీ ఈ బేబీ ఎలా అడల్ట్ అవుతాడో దాన్ని ప్రభావితం చేస్తుందని తెలుసుకోవాలి. మీరు పూర్తి చిత్రాన్ని చూస్తారు. మీరు రియాలిటీతో టచ్ లో ఉంటారు.

Top