నాలుగు ఉత్తమమైన సత్యాల నుంచి, మూడు విలువైన రత్నాలు

రివ్యూ

దలైలామా గారు రాసిన ఈ ప్రత్యేక శ్లోకం గురించి మన చర్చను కొనసాగిస్తున్నాము, ఇది రెండు సత్యాలను అర్థం చేసుకోవడం నుంచి నాలుగు గొప్ప సత్యాలను అర్థం చేసుకోవడం నుంచి మూడు విలువైన రత్నాలపై విశ్వాసం కలిగి ఉండటం వరకు ఎలా వెళ్తుందో వివరిస్తుంది. విషయాలు నిజంగా ఎలా ఉంటాయో దాని గురించి రెండు సత్యాలు మాట్లాడతాయని మనం తెలుసుకున్నాము:

  • రిలేటివ్ లేదా సాంప్రదాయిక సత్యం; నిజానికి మనకు కనిపించే కారణాలు మరియు పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. ఈ లోకంలో అసలు అన్నీ ఎలా పని చేస్తున్నాయో తెలుసుకుంటే, మనం చూసేది ఇదే. కానీ దురదృష్టవశాత్తు, మనం సాధారణంగా విషయాలను ఈ విధంగా చూడము.
  • సత్యం యొక్క లోతైన స్థాయిలో, మన గందరగోళం వాటిపై రుద్దే అసాధ్యమైన మార్గాల్లో విషయాలు ఉండవు. ఉదాహరణకు, మనం వాటిని చూసినప్పుడు, ఏవైనా కారణాలు, పరిస్థితులు, భాగాలు లేదా మరేదైనా లేకుండా, వాటి స్వంత శక్తి ద్వారా ఉత్పన్నమవుతాయని మనం భావిస్తాము; కానీ ఇది అబద్ధం.

కాబట్టి, ఇదే పునాది.

రియాలిటీను సరిగ్గా చూడటంలో చుట్టూ ఉన్న గందరగోళం గురించి ఈ నాలుగు ఉత్తమమైన సత్యాలు మాట్లాడతాయి. రియాలిటీ గురించి మనం గందరగోళానికి గురైనప్పుడు, ఇది బాధకు ఒక కారణంగా పనిచేస్తుంది: కారణం రెండవ ఉత్తమమైన సత్యం మరియు బాధ మొదటిది. మరోవైపు, మనం రియాలిటీను సరిగ్గా చూడగలిగితే మరియు ఎప్పుడూ దానిపై దృష్టి పెట్టగలిగితే, మనకు మూడవ ఉత్తమ సత్యం లభిస్తుంది, ఇదే బాధల యొక్క నిజమైన ముగింపు. అవగాహన అనేది నిజమైన మార్గం, నాలుగవ ఉత్తమమైన సత్యం, ఇది నిజమైన ముగింపును తెస్తుంది.

రియాలిటీ గురించి మనం అస్పష్టంగా ఉన్నప్పుడు, మనం అజ్ఞానం మరియు గందరగోళం మీద వ్యవహరిస్తాము మరియు మన నియంత్రణలో లేని రిపీట్ అయ్యే పునర్జన్మను కొనసాగిస్తాము. ఈ అజ్ఞానాన్ని వదిలించుకుంటే, సంసార పునర్జన్మను మనం తిప్పికొట్టవచ్చు - లేదా దాని నుంచి బయటపడవచ్చు..

మూడు విలువైన రత్నాలు

ఇప్పుడు మనం పద్యంలోని మూడవ శ్లోకాన్ని చూద్దాం:

సరైన జ్ఞానంతో, మూడు శరణాలయాలు వాస్తవం అనే మన నమ్మకం దృఢంగా మారుతుంది.

మనం ఇదివరకే చూసినట్లుగా, మూడు శరణాలయాలు బుద్ధుడు, ధర్మం మరియు సంఘాన్ని సూచిస్తాయి. ఇవి సంస్కృత పదాలు. బుద్ధ శక్యముని మరియు ఇతర బౌద్దులందరూ జ్ఞానోదయం పొందినవారు మరియు దాన్ని ఎలా చెయ్యాలో మనకు నేర్పిస్తారు. ధర్మమే వారి బోధనలు. సంఘము బాగా గ్రహించబడిన సమాజము. ఇది ఒక స్థాయి అవగాహన, కానీ దానిలో లోతైన అర్థం కూడా ఉంది.

లోతైన అర్థంలో, ధర్మం నిజమైన విజయాలను సూచిస్తుంది - అంటే మూడవ మరియు నాలుగవ ఉత్తమమైన సత్యాల సాధన. మీకు గుర్తున్నట్లుగా, మూడవది బాధ మరియు దాని కారణాల యొక్క నిజమైన అడ్డంకి, మరియు ఇది దశలలో సంభవిస్తుంది. దాన్ని సంపూర్ణంగా పొందినప్పుడు, నియంత్రణలో లేని రిపీట్ అయ్యే పునర్జన్మ (సంసారం) నుంచి విముక్తిని పొందుతాము. కారణ, ఫలాల వివరాలన్నీ తెలుసుకోకుండా నిరోధించే కారణాలను వదిలించుకుని, ప్రతి ఒక్కరినీ ముక్తి వైపు ఎలా నడిపించాలో మనకు బాగా తెలిసినప్పుడు, మనం జ్ఞానవంతులైన బుద్ధులమవుతాము. నాలుగవ సత్యం ఏమిటంటే, ఈ నిజమైన అడ్డంకులను తీసుకువచ్చే అవగాహన మరియు ఆ నిజమైన అడ్డంకుల వల్ల సంభవించేది.

ఈ రెండూ ఆశ్రయాన్ని కల్పిస్తున్నాయి. ఆశ్రయం అనేది ఈ సందర్భంలో, ఇతరులకు సహాయపడటంలో మన అసమర్థతల నుంచి మరియు బాధల నుంచి మనల్ని రక్షిస్తుంది. మన౦ నిజమైన గమ్యాలను, నిజమైన మార్గాన్ని సాధిస్తే, మన౦ బాధను అనుభవి౦చడ౦ ను౦చి, ఇతరులకు ఎలా సహాయ౦ చెయ్యాలో తెలుసుకోలేకపోతా౦. అది మరెవరో సాధించారని కాదు, కాబట్టి మనల్ని మనం వారికి అప్పగించుకుని ఏదో ఒక విధంగా మాయాజాలంతో రక్షింపబడతాం.

"అబ్రహామిక్ మతాలు" అని పిలువబడేవి - జుడాయిజం, క్రైస్తవ మతం మరియు ఇస్లాం మతం - ఇవి చరిత్ర-ఆధారిత మతాలుగా పిలువబడతాయి. ప్రతి మతానికి ఒక చారిత్రక వ్యక్తి ఉంటాడు, అతను ఒక చారిత్రక సంఘటనలో, దేవుని నుంచి ఒక విధమైన ఆదేశాన్ని పొందుతాడు. ఆ తర్వాత వారు ఈ నిజాన్ని బయటపెడతారు, అదే ఆఖరిది. మోషే లేదా యేసు లేదా మహమ్మద్ చేసిన పనిని మనం చెయ్యలేము, మనం వారిపై విశ్వాసాన్ని కలిగి ఉండాలి, దాని ద్వారా మన బాధల నుంచి మనం రక్షింపబడతాము. దేవుడు మోషేకు పది ఆజ్ఞలు ఇవ్వడం, యేసు కొత్త నిబంధనను వెల్లడించడం లేదా మహమ్మద్ ఖురాన్‌ను వెల్లడించడం లాంటి ఈ చారిత్రాత్మక సంఘటన వ్యక్తులపై వ్యక్తిగతమైన విశ్వాసం లేదా వారు బోధించిన మరియు వెల్లడించిన వాటిపై విశ్వాసాన్ని ఇక్కడ విశ్వాసం సూచిస్తుంది. ఈ ముఖ్యమైన చారిత్రక సంఘటనలు ఈ మతాలకు కేంద్రంగా ఉన్నాయి.

హిందూ, బౌద్ధం మరియు జైన మతం లాంటి భారతీయ మతాలను "ధార్మిక మతాలు" అని చెప్పవచ్చు, ఇవి పూర్తిగా భిన్నమైనవి. బుద్ధుడు, లేదా కృష్ణుడు లేదా మహావీరుడు (జైన మత స్థాపకుడు) యొక్క చారిత్రక నిజం కేంద్ర సంఘటన కాదు. దానికి బదులుగా, మనమూ, మరియు ప్రతి ఒక్కరూ కూడా ఈ జీవుల మాదిరిగానే అదే స్థితిని పొందగలరు. బౌద్ధమత సందర్భంలో, మనమందరం ముక్తిని మరియు జ్ఞానోదయాన్ని పొందగలము, మరియు ఇతర ధార్మిక మతాలు కూడా ముక్తికి వారి స్వంత వివరణను అందిస్తాయి. ఇది మన పాశ్చాత్య, అబ్రహామిక్ మతాలు మరియు భారతీయ మతాల మధ్య ప్రాథమిక వ్యత్యాసాలలో ఒకటి.

ఈ మూడు ఆశ్రయాలను చూసినప్పుడు, మన అబ్రహామిక్ మతాల ప్రతిబింబం ద్వారా వాటిని చూడకుండా ఉండటం చాలా ముఖ్యం, వాటితో పాటే మనం కూడా పెరిగాం. బుద్ధుడు మాత్రమే జ్ఞానోదయం పొందాడని, ఆయనను నమ్మితే మనం రక్షింపబడతామని కాదు. సాధారణంగా నేను "ఆశ్రయం" అనే పదాన్ని పట్టించుకోను, ఎందుకంటే ఇది నిష్క్రియాత్మక రుచిని కలుగజేస్తుంది, మనం చేయాల్సిందల్లా "బుద్ధుడు, నన్ను రక్షించు!" అని వేడుకోవడమే అప్పుడు మనం రక్షించబడతాము. అది బౌద్ధమతం కాదు. "సురక్షిత దిశ" అనే పదాన్ని ఉపయోగించడానికి నేను ఇష్టపడతాను, ఇక్కడ బుద్ధుడు, ధర్మం మరియు సంఘం మనం వెళ్ళడానికి సురక్షితమైన దారిని సూచిస్తాయి, అక్కడ బుద్ధుడు మన కోసం సాధించినదాన్ని కూడా మనం సాధించవచ్చు. బుద్ధుడు మనల్ని మనం రక్షించుకోవడానికి ఒక మార్గాన్ని బోధించినప్పటికీ, మనమే దాన్ని ఆచరణలో పెట్టాలి. మన స్వంత సాధన కోసం మన స్వంత ప్రయత్నాలే, బాధల నుంచి మనల్ని రక్షించడానికి సహాయపడతాయి.

ధర్మ రత్నం

మనం లోతైన ధర్మ రత్నం లేదా ఆభరణం గురించి మాట్లాడినప్పుడు, లేదా మీరు దాన్ని ఎలా పిలవాలనుకున్నా, ఇది ఒక అరుదైన మరియు విలువైన విషయం, ఇది టిబెటన్లు రత్నాన్ని అనువదించిన రెండు అక్షరాల అర్ధం. మనం నిజమైన అడ్డంకుల యొక్క స్థితి గురించి మాట్లాడుతున్నాము మరియు వాటిని తీసుకువచ్చే మరియు వాటి నుండి ఫలితాన్నిచ్చే నిజమైన మనస్సులను సాధించడం గురించి మాట్లాడుతున్నాము. మనం సాధించుకోవాల్సిన విషయాలు ఇవి, కాబట్టి అవి సాధించగలిగేవని మనం నమ్మకం పెట్టుకోవాలి. ఈ రెండు సత్యాలు, మరియు నాలుగు సత్యాల గురించి మనం చర్చించడం వల్ల ముక్తి, జ్ఞానోదయం వంటి విషయాలు ఉన్నాయని, వాటిని మనమే సాధించగలమని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.

బుద్ధ రత్నం

ముక్తిని, ఆ తర్వాత జ్ఞానోదయాన్ని సంపూర్ణంగా పొందిన వారే బుద్ధులు. ఇందులో బుద్ధ శాక్యముని మాత్రమే కాదు, అనేక మంది ఇతర బుద్ధులు కూడా ఉన్నారు. ఆ స్థితిని మనం సాధించే మార్గాన్ని వారు కూడా బోధించారు. వాళ్ళు మనకు రెండు విధాలుగా బోధిస్తారు: వారి బోధనలతో, మరియు వారి ఉదాహరణతో, అవగాహన మరియు సాక్షాత్కారాల ఆధారంగా. ఇది ఒక ముఖ్యమైన విషయం, ఎందుకంటే మౌఖిక బోధనలలో మాత్రమే కాకుండా, మనం బోధిస్తున్నదానికి సజీవ ఉదాహరణగా ఉండటం కూడా నేర్చుకోవడానికి సహాయపడుతుందని ఇది నిరూపిస్తుంది. ధర్మం అనేది ఒక సామాన్య బోధన కాదు, దీన్ని ప్రజలు మరియు మనం నిజంగా ప్రతిబింబించగల ఒక విషయం.

సంఘ రత్నం

ఆర్య సంఘమైన ఈ మూడవ రత్నం మనకు ఎందుకు అవసరమని కొందరు అనుకోవచ్చు. నిజానికి బుద్ధుడు, మరియు ధర్మం సరిపోతాయా? సన్యాసులు మరియు సన్యాసినులు సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, నిజమైన సంఘ రత్నం అది కాదు. విగ్రహాలు, పెయింటింగ్స్ బుద్ధులను, పుస్తకాలు కేవలం ధర్మాన్ని ప్రతిబింబించేలా ఉన్నాయి. బుద్ధుడు, ధర్మం మరియు సంఘానికి ప్రాతినిధ్యం వహించే విషయంగా, ఈ విగ్రహాలు, పుస్తకాలు, సన్యాసులు మరియు సన్యాసినులు మనకు గౌరవాన్ని చూపించడంలో దృష్టి పెడతారు, ఎందుకంటే ఎక్కువ నైరూప్య విషయాలకు గౌరవం చూపించడం అంత సులభం కాదు. వాటన్నిటికీ ఒక లోతైన అర్థం ఉంటుంది.

సంఘ రత్నం చాలా ముఖ్యమైనది. సంఘము అంటే ఆర్యులను, లేదా రెండు సత్యాలపై ఆధారపడిన నాలుగు ఉత్తమమైన సత్యాలను భావరహితంగా చూసిన వారిని సూచిస్తుంది. వాళ్ళు వీటిని విషయాలుగా నేర్చుకోక పోవడం వల్ల, వారు కొంతవరకు నిజమైన అడ్డంకులను మరియు కొంతవరకు నిజమైన మనస్సులను సాధించారు, కానీ పూర్తిగా కాదు. వెళ్లే ముందు ఇంకా అభివృద్ధి చెందిన ఆర్యులు ఈ రెండింటిలో ఎక్కువ వాటిని సాధిస్తారు, చివరికి వారు ముక్తి, మరియు జ్ఞానోదయాన్ని పొందుతారు. మహోన్నత సత్యాలను ఆర్య సత్యాలుగా నిర్వచిస్తారు - ఆర్యులు అంటే వీళ్ళే - రియాలిటీ యొక్క భావన లేకుండా జ్ఞానం ఉన్నవారు - సత్యంగా చూసే వాళ్ళు. ఇది మనకు ఇలా చెబుతుంది:

  • వీటన్నిటినీ గ్రహించి నిజమైన గమ్యాన్ని, నిజమైన మార్గాన్ని పొందేది బుద్ధులు మాత్రమే కాదు. కానీ, ఇది ఒక క్రమక్రమమైన ప్రక్రియ.
  • మోక్షం లేదా జ్ఞానోదయాన్ని పొందడానికి ముందే, మనం నిజమైన బాధల యొక్క వివిధ కోణాలను వదిలించుకోవడం ప్రారంభిస్తాము, ఎందుకంటే వాటి నిజమైన కారణాల యొక్క వివిధ స్థాయిలను ఎలాగో వదిలించుకుంటున్నాము కాబట్టి.

ముక్తి మరియు జ్ఞానోదయం అనేవి క్రమక్రమమైన ప్రక్రియలు, ఇవి మనం బుద్ధుడు లేదా ముక్తి జీవిగా మారడానికి చాలా కాలం ముందు ప్రారంభమవుతాయి. ఆర్యులు బుద్ధులతో ఎప్పుడూ సంబంధం కలిగి ఉంటారు ఎందుకంటే వారికి ఇప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నాయి మరియు వారిలో కొంతమంది ఇప్పటికీ నియంత్రణలో లేని రిపీట్ అయ్యే పునర్జన్మ నుంచి పూర్తిగా విముక్తి పొందలేదు, కానీ వారు కొంత వరకు దాని నుంచి విముక్తి పొందారు. ఈ విధంగా, వాళ్లతో సంబంధాన్ని కలిగి ఉండటం కొంచెం సులభం.

అంచెలంచెలుగా మనం కూడా వాళ్ళు వెళ్లిన సురక్షితమైన దిశలో వెళితే ముక్తి, జ్ఞానోదయం అనే అంతిమ లక్ష్యాలను చేరుకోగలమని ఆర్య సంఘం ప్రోత్సాహాన్ని, ప్రేరణను ఇస్తుంది. మనం అంత దూరం వెళ్లలేకపోయినా, ప్రస్తుతానికి, మనల్ని మనం కొంతవరకు బాధల నుంచి విముక్తి చేసుకోగలుగుతాము, ఎందుకంటే బాధను కలిగించే అజ్ఞానం నుంచి మనల్ని మనం విముక్తి చేసుకుంటాము. రియాలిటీపై మనం ఎంతవరకు పూర్తిగా దృష్టి పెట్టగలం అనేది ముఖ్యం. మీరు ఇప్పటికీ ఆర్య అయితే, మీరు ఎప్పటికీ ఏకాగ్రతతో ఉండలేరు, కానీ మీరు బుద్ధుడు అయితే అలా ఉండగలరు.

మోక్షం, జ్ఞానోదయం రెండూ ఒకేలా ఉండవు. నియంత్రణలో లేని రిపీట్ అయ్యే పునర్జన్మల నుంచి విముక్తి పొందినప్పుడు, అంటే మనం అర్హతలు, విముక్త జీవులు అయినప్పుడు. జ్ఞానోదయం అంటే మనం భావోద్వేగ అస్పష్టతల నుంచి విముక్తి పొందినప్పుడు - కలవరపరిచే భావోద్వేగాలు మరియు మనం ఎలా ఉన్నామో తెలియకపోవడం - మనం అభిజ్ఞా అస్పష్టతల నుంచి కూడా విముక్తి పొందుతాము - అనే అజ్ఞానం యొక్క నిరంతర అలవాటు.

మరో మాటలో చెప్పాలంటే, అసాధ్యమైన వాటి యొక్క అంచనాలను నమ్మడంలో మన అలవాట్ల కారణంగా - మన మానసిక కార్యకలాపాలు అంచనాలను చేస్తూనే ఉంటాయి మరియు అవి వాస్తవికతకు అనుగుణంగా ఉన్నాయని మనం నమ్ముతాము. వీటి నుంచి, ఇబ్బంది పెట్టే భావోద్వేగాలు మనకు లభిస్తాయి. ఈ మోసపూరిత రూపాలు వాస్తవికతకు అనుగుణంగా ఉన్నాయని నమ్మడం మానేసినప్పుడు మనకు మోక్షం లభిస్తుంది. ఇదంతా చెత్త అని మనం అర్థం చేసుకున్నాము, మరియు విషయాలు ఇలా కనిపించినప్పటికీ, అవి నిజానికి అలా ఉండవు. మన అవగాహన ఇప్పటికీ పరిమితంగానే ఉంటుంది మరియు వస్తువులను పరిమితంగా ఉన్నట్లే చూస్తాము, కానీ అవి నిజంగా అలా ఉండవని మనకు తెలుసు.

పరమాణు భౌతికశాస్త్రంలో చాలా సరళమైన స్థాయిలో కూడా మనకు పరమాణువులు, బల క్షేత్రాలు ఉన్నాయి, కానీ ఏ వస్తువు చుట్టూ కూడా ఘన రేఖ ఉండదు, "రేఖ యొక్క ఈ వైపు, వస్తువు ఉంది. ఆ వైపు ఉండదు." పరిస్థితులు కనిపించినంత దృఢంగా ఉండవు. మనం ఈ మోసపూరిత రూపాలు పొందడానికి కారణమయ్యే అభిజ్ఞా అస్పష్టతలను వదిలించుకుంటే, మనస్సు వాటిని వదిలేసి జ్ఞానోదయాన్ని పొందుతుంది. మనం జ్ఞానోదయం పొందినప్పుడు, అన్నింటి యొక్క పరస్పర సంబంధాన్ని ఒకే సమయంలో చూస్తాము. ఇది ఇతరులను వారి స్వంత విముక్తి మరియు జ్ఞానోదయం వైపు నడిపించే అత్యంత నైపుణ్యమైన మార్గాన్ని చూడటానికి అనుమతిస్తుంది.

మనం ఆర్యుల గురించి మాట్లాడేటప్పుడు, జ్ఞానోదయాన్ని లక్ష్యంగా చేసుకున్న భోధిసత్వ ఆర్యుల గురించి మాత్రమే మాట్లాడటం లేదు. ముక్తిని మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్న ఆర్యుల గురించి కూడా మనం మాట్లాడుతున్నాం. మూడు రత్నాల గురించి మనం సురక్షితమైన దిశ సందర్భంలో మాట్లాడినప్పుడు, కేవలం మోక్షం కోసం లేదా మోక్షం మరియు జ్ఞానోదయం రెండింటిని లక్ష్యంగా చేసుకునే వారి గురించి మాట్లాడుతున్నాము, జ్ఞానోదయాన్ని లక్ష్యంగా చేసుకున్న భోధిసత్వుల గురించి మాత్రమే కాదు.

మూడు రత్నాలపై గట్టి నమ్మకాన్ని పెంపొందించుకోవడం

సంసారంలో మనం ఎలా చిక్కుకుపోయామో, దాని నుంచి ఎలా బయటపడవచ్చో రెండు సత్యాలు, నాలుగు సత్యాలను అర్థం చేసుకుంటే, లోతైన ధర్మ రత్నం నిజంగా ఉందని, అది నిజమేనని మనం గట్టిగా నమ్ముతాం. అసాధ్యమైన దాని గురించి మన మోసపూరిత రూపాలను తీసుకువచ్చే గందరగోళం మన మానసిక పనుల సహజ లక్షణం కాదని మనం అర్థం చేసుకున్నాము. ఎందుకు? ఎందుకంటే మనం అజ్ఞానానికి పూర్తి విరుద్ధంగా దృష్టి పెట్టినప్పుడు దాని నుంచి బయటపడవచ్చు.

మరో మాటలో చెప్పాలంటే, విషయాలు ఎలా ఉన్నాయో రెండు సత్యాల అవగాహనపై మీరు దృష్టి పెట్టినప్పుడు, మీకు మోసపూరిత రూపాలు ఉండవు మరియు మీరు ఖచ్చితంగా వాటిని విశ్వసించరు. మీరు ఈ అవగాహన, నిజమైన మార్గంపై పూర్తిగా దృష్టి పెట్టగలిగితే, అప్పుడు మీరు నిజమైన అడ్డంకులను సాధిస్తారు, మరియు ఇది లాజిక్ సహాయం తీసుకుంటుంది. ఇది రియాలిటీకి అనుగుణంగా ఉంటుందని మీరుకంఫర్మ్ చెయ్యవచ్చు మరియు ఇది ఈ ప్రభావాన్ని ఇస్తుంది. మీకు ఇకపై దుఃఖం మరియు సాధారణ ఆనందం యొక్క బాధలు ఉండవు మరియు మీకు నియంత్రణలో లేని రిపీట్ అయ్యే సమస్యలు కూడా ఉండవు.

మీరు అభ్యంతరం వ్యక్తం చేసి, "సరే, మీరు ఎప్పుడూ అజ్ఞానంపై దృష్టి పెడితే, మీకు అవగాహన ఉండదు" అని చెప్పవచ్చు. రియాలిటీకి అనుగుణంగా లేని అజ్ఞానంతో దృష్టి పెట్టడం లేదా రియాలిటీకి అనుగుణంగా ఉండే అవగాహనపై దృష్టి పెట్టడంలో ఏది మంచిది?

మనం దీన్ని విశ్లేషిస్తే, అజ్ఞానానికి ఎక్కువగా సహాయపడేది ఏదీ కనిపించదు, అయితే లాజిక్ సరైన అవగాహనను అందిస్తుంది. విషయాలు కారణాలు మరియు పరిస్థితుల నుంచి వస్తాయి, మరియు అవి వాటికవే స్వంతంగా ఉనికిలోకి రావు. దానికి తోడుగా, మనం సరైన అవగాహన మీద దృష్టి పెడితే, అది దాని ప్రభావాన్ని ఉత్పత్తి చేస్తుంది: మనం ఇకపై బాధను లేదా సంసార పునర్జన్మను అనుభవించము.

ఇది మనల్ని మళ్ళీ నాలుగు ఉత్తమమైన సత్యాలకు తీసుకెళ్తుంది. మనం దేనిని లక్ష్యంగా పెట్టుకున్నాము? మనం ఎప్పుడూ, ఎప్పటికీ బాధలలోని ఉండాలని అనుకుంటున్నామా? అలా చేస్తే, మన౦ అజ్ఞాన౦పై దృష్టి పెడతాం అప్పుడు మన౦ బాధపడతా౦; అంతే సింపుల్. మీకు స్వాగతం! కానీ బౌద్ధమత ఆధ్యాత్మిక మార్గం యొక్క లక్ష్యం అయిన వాటన్నిటి నుంచి మీరు విముక్తి పొందాలనుకుంటే, మీరు వాస్తవికత ఆధారంగా అవగాహనతో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పూర్తిగా స్పష్టమవుతుంది.

ఆశ్రయం అనే అంశాన్ని సమీపించే ఈ మార్గం సరైన జ్ఞానం నుంచి తీసుకురాబడుతుంది, అప్పుడు మూడు శరణాలయాల వాస్తవం అనే మన నమ్మకం దృఢంగా మారుతుంది. ఈ దిశలో వెళితే, మనం బాధల నుంచి విముక్తి పొందుతామని ఇంక మనం అనుకోము, ఎందుకంటే "మా గురువు అలా చెప్పాడు!" అని మనకు నమ్మకం ఉంటుంది. ఇది చెల్లుబాటు అయ్యే జ్ఞానంపై, అస్పష్టమైన అవగాహన మరియు లాజిక్ పై ఆధారపడి ఉంటుంది.

చెల్లుబాటు అయ్యే జ్ఞానాన్ని కలిగి ఉండటానికి రెండు మార్గాలు ఉన్నాయి - లాజిక్ ద్వారా లేదా సింపుల్ అవగాహన ద్వారా అంచనా వెయ్యడం, ఇది చూడటం, వినడం లేదా భావాత్మకంగా అనుభవించడం లాంటిది. ఈ రెండవదానితో, సమస్య ఏమిటంటే, మీ కోసం దాన్ని అనుభవించడానికి మీరు చాలా అభివృద్ధి చెంది ఉండాలి, కాబట్టి మీరు మీ చెల్లుబాటు అయ్యే జ్ఞానానికి ప్రాతిపదికను ఊహతో ప్రారంభించాలి.

ఆధ్యాత్మిక మార్గంలో ప్రోగ్రెస్

ఇప్పుడు, మనకు నాలుగవ లైన్ ఉంది:

ముక్తికి దారితీసే మార్గం మనస్సు యొక్క ఈ మూలాన్ని తీసుకోవడానికి నన్ను ప్రేరేపించండి.

మనం ముక్తి మార్గం గురించి మాట్లాడినప్పుడు, దాన్ని అనేక విధాలుగా ప్రదర్శించవచ్చు, వాటిలో ఒకటి ప్రేరణ యొక్క మూడు పరిధులు, దీనిని సాధారణంగా టిబెటన్ పదం "లామ్-రిమ్" (గ్రేడెడ్ దశలు) అని పిలుస్తారు. ఈ గ్రేడెడ్ దశలు మూడు ప్రగతిశీల లక్ష్యాలు:

  • మొదటి అవకాశం అధ్వాన్నమైన పునర్జన్మలను నివారించడం మరియు మంచి పునర్జన్మలను పొందడం గురించి ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గంలో కొనసాగడానికి అనువైన పరిస్థితులు ఉన్నందుకు చాలా తక్కువ బాధతో మంచి పునర్జన్మలను పొందాలని మనం కోరుకుంటాము. బొద్దింకగా మనం పునర్జన్మను పొందితే ఆధ్యాత్మిక వికాసం పరంగా మనం చేయగలిగింది ఏమీ ఉండదు. అధ్వాన్నమైన పునర్జన్మలను నివారించడానికి, కారణం మరియు ప్రభావం అయిన సాపేక్ష సత్యం గురించి ఉన్న మన గందరగోళాన్ని వదిలించుకోవాలి. అధ్వాన్నమైన పునర్జన్మలకు ప్రధాన కారణం వినాశకరమైన ప్రవర్తన, మరియు మన చర్యల పర్యవసానాల గురించి మనకు తెలియకపోవడం వల్ల లేదా అవి మనకు సంతోషాన్ని కలిగిస్తాయని మనం అనుకోవడం వల్ల మనం వినాశకరమైన విధంగా ప్రవర్తిస్తాము.
  • మూడు రకాల బాధల నుంచి విముక్తిని లక్ష్యంగా చేసుకోవడమే మధ్యంతర పరిధి - దుఃఖం, మన సాధారణ ఆనందం మరియు ఈ రెండింటికి ఆధారం, ఇది మన నియంత్రణలో లేని రిపీట్ అయ్యే పునర్జన్మ. అలా చెయ్యాలంటే శూన్యతను అర్థం చేసుకుని లోతైన సత్యం గురించి మన గందరగోళాన్ని వదిలించుకోవాలి. నిజానికి, మనం ఎప్పుడూ నాలుగు గొప్ప సత్యాలను అర్థం చేసుకోవాలి. వీటన్నింటిపై ఒకేసారి దృష్టి పెట్టడం చాలా కష్టం, కాబట్టి మనం ఇంకా ముందుకు వెళ్లాలి.
  • బుద్ధుని జ్ఞానోదయ స్థితిని పొందడం, అలా మనం ఇతరులకు సాధ్యమైనంత మంచి మార్గాల్లో సహాయం చెయ్యడమే అధునాతన పరిధి. లోతైన సత్యంపై దృష్టి కేంద్రీకరిస్తూనే, సాపేక్ష సత్యాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటాం. బుద్ధుడు మాత్రమే రెండు సత్యాలపై ఒకేసారి దృష్టి కేంద్రీకరించగలడు.

ఈ వాక్యాన్ని మనం లోతుగా పరిశీలిస్తే, "రెండు సత్యాల నుంచి, నాలుగు సత్యాలు; నాలుగు సత్యాల నుంచి, మూడు శరణాలయాల," ఇది పై మూడు పరిధులకు మరియు ఈ లక్ష్యాలకు దారితీసే ప్రాక్టీస్ లకు మూలం. ఇది మూలం, మూలం విత్తనం కాదని చెబుతుంది. మొక్కకు స్థిరత్వాన్ని, బలాన్ని ఇచ్చేదే మూలం. ఈ మూడు లక్ష్యాలను సాధించగలమని, అవి ఉన్నాయని, వాటిని మనమే సాధించగలమని లాజిక్ ఆధారంగా మనం నమ్మితే, అది ఆ లక్ష్యం వైపు పూర్తి ఆధ్యాత్మిక మార్గానికి సహాయపడే స్టెబిలిటీని ఇస్తుంది.

ఆధ్యాత్మిక గురువుతో ఆరోగ్యకరమైన సంబంధమే ఈ మూడు స్కోప్ ల మూలం అని ఇతర ప్రెజెంటేషన్లు చెబుతున్నాయి, మరియు ప్రాథమికంగా అన్ని లామ్-రిమ్ గ్రంథాలలో మీరు దీన్నే తెలుసుకుంటారు. ఈ ఆరోగ్యకరమైన సంబంధం మొత్తం ఆధ్యాత్మిక మార్గానికి మూలం, మనం గురువు నుంచి ప్రేరణను పొందుతాము, మరియు ఈ ప్రేరణే మన లక్ష్యాల వైపు వెళ్ళడానికి మనకు బలాన్ని మరియు శక్తిని ఇస్తుంది.

మళ్ళీ, మన౦ ఆధ్యాత్మిక మార్గ౦లో స్థిరమైన రీతిలో ఎలా కొనసాగవచ్చనే దానిపై మనకు రెండు వైవిధ్యాలు కనిపిస్తాయి:

  • మన ఆధ్యాత్మిక బోధకులతో మనకున్న స౦బ౦ధ౦ ను౦చి వచ్చే బలాన్ని, ప్రేరణను ఉపయోగి౦చడ౦ ఒక మార్గ౦. దాని ఆధారంగా, మనం ఒక లాజిక్ లైన్ ని ఉపయోగిస్తాము: "నా ఉపాధ్యాయుడు సరైన సమాచారానికి ఒక సోర్స్. కాబట్టి జ్ఞానోదయం పొందడం సాధ్యమేనని మా గురువుగారు చెప్పిన విషయం సరైనదే. మా టీచర్ అలా ఊరికే ఎందుకు చెప్తాడు" అని. కాబట్టి, ఇక్కడ ఒక రకమైన లాజిక్ ఉంది. కానీ చాలా మంది దీన్ని భావోద్వేగ స్థాయిలో ఎక్కువగా అనుభవిస్తారు, ఇక్కడ ఉపాధ్యాయుడు మనల్ని మానసికంగా బాగా ప్రేరేపిస్తాడు, ఇది ఆ మార్గంలో వెళ్ళడానికి మనకు ఎక్కువ బలాన్ని ఇస్తుంది. ఇది బోధిచిత్తను అభివృద్ధి చేసే రెండు మార్గాలలో మొదటి దాన్ని పోలి ఉంటుంది. దీనితో, మనం రిలేటివ్ బోధిచిత్తను అభివృద్ధి చేసి ప్రారంభిస్తాము, అక్కడ మనం ఇతరులకు సహాయం చేయడానికి ముందుకు వస్తాము మరియు అక్కడ నుంచి, అది సాధ్యమనే విశ్వాసం ఆధారంగా జ్ఞానోదయం పొందడానికి ఆకర్షితులమవుతాము. ఆ తర్వాతే అది సాధ్యమేనని లాజిక్ ద్వారా మనకు నమ్మకం కలుగుతుంది.
  • మరోవైపు, మనం ముందుగా లోతైన బోధిచిత్తను అభివృద్ధి చేసే అభ్యాస పద్ధతిని ఆలోచించినప్పుడు, శ్లోకంలో వివరించిన విధంగా శూన్యతపై మనకు నమ్మకం ఏర్పడుతుంది. ముందు, దీన్ని సాధించడం సాధ్యమేనని మనం నమ్ముతాము, ఆపై మేము జ్ఞానోదయం కోసం మన హృదయాలను విస్తరించడం కోసం పనిచేస్తాము.

ఈ రెండూ ఆధ్యాత్మిక మార్గాన్ని చేరుకోవడానికి సరైన మార్గాలు, మరియు ఇది మన స్వంత పరిధి లేదా సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. చాలా పదునైన సామర్థ్యాలు మరియు తెలివితేటలు ఉన్నవారు తార్కిక ప్రదర్శనపై ఆధారపడటానికి వారి వ్యక్తిత్వానికి మరింత అనుకూలంగా ఉంటారని, అంత తెలివైన వారు భావోద్వేగ స్థాయిలో ఎక్కువ పని చేస్తారని గ్రంథాలలో వివరించబడింది. ఈ రెండవ గ్రూప్ కోసం, గురువు నుంచి ప్రేరణ, ప్రేమ మరియు కరుణ పరంగా అభివృద్ధి చెందిన భావోద్వేగాలపై ఆధారపడటం బాగా  పనిచేస్తుంది.

అనేక విధాలలో, రెండు విధానాలను బ్యాలెన్స్ చెయ్యడం మంచిదని నేను అనుకుంటున్నాను. వీటన్నింటికీ మూడవ, భక్తి కోణాన్ని మనం జోడించవచ్చు. ఎన్నో సంవత్సరాలుగా అభ్యాసకులు నిమగ్నమైన ఆచారాలకు హాజరు కావడం మరియు నిర్వహించడం ద్వారా కొంతమంది జ్ఞానోదయ మార్గాన్ని అనుసరించడానికి ప్రేరణ పొందుతారు. బౌద్ధ మార్గాన్ని ఒక నిర్దిష్ట శైలిలో చేరుకోవడం మనకు బాగా సౌకర్యవంతంగా ఉంటుందని దాన్ని చేరుకోవడానికి ఇతర మార్గాలను మనం విడిచిపెట్టకూడదు. మనల్ని, మన సామర్థ్యాన్ని పూర్తిగా అభివృద్ధి చేసుకోవాలంటే ఈ మూడు విధానాలను బ్యాలెన్స్ చేసుకోవాలి.

దలైలామా చేసిన ప్రత్యేక ప్రార్థనలో ఈ ప్రత్యేక శ్లోకం యొక్క ప్రాథమిక ప్రదర్శన ఇది. మా గురువు గారు ఎప్పుడూ చెప్పినట్లే, మీరు ఆవుకు పాలు పట్టినట్లే, ఈ చిన్న శ్లోకాల నుండి మీరు చాలా అర్థాన్ని పొందవచ్చు.

ప్రశ్నలు మరియు సమాధానాలు

నాలుగు ఉత్తమమైన సత్యాల ఆచరణాత్మక ఉపయోగం

నా స్నేహితుడు ఎప్పుడూ ఆందోళన చెందుతుంటే, ఏమీ కాదని విషయాలను అంత సీరియస్ గా తీసుకోవద్దని నేను అతనికి చెప్పగలను. ఇది మనకు మరియు ఇతరులకు మనం ఇవ్వగల ధైర్యం. కానీ నేను స్వార్థపరుడిగా ఉన్నప్పుడు మరియు నేను ఇతరులతో వ్యవహరిస్తున్నప్పుడు, నా స్వార్ధపు మనస్సు యొక్క ప్రతిబింబం ఎక్కడ ఉందో మరియు రియాలిటీ ఎక్కడ ఉందో పరిశీలించడం మర్చిపోకుండా ఉండటానికి నేను ఏదైనా మంత్రం లేదా రిమైండర్ ను ఉపయోగించాలా?

గొప్ప టిబెటన్ గురువు సోంగ్ ఖాపా ప్రకారం, శూన్యతపై మనం భావనాత్మకంగా దృష్టి పెట్టినప్పుడు తప్ప, మన మానసిక కార్యకలాపాలు అసాధ్యమైన మార్గాలను సూచిస్తాయి. ఇది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఆ లోతైన ధ్యానంలో తప్ప మన అనుభవంలోని ప్రతి క్షణాన్నీ ఖండించేది.

మనల్ని మోసం చేసే రూపాలను పునర్నిర్మించడానికి సహాయపడేవి అనేక విషయాలు ఉన్నాయి. ఫాంటసీ యొక్క "బెలూన్ ను పాప్ చేయడం" సహాయపడే ఒక ఆలోచన, కానీ ఇది ద్వంద్వ పద్ధతిలో చెయ్యాల్సి ఉంటుంది, ఎందుకంటే, ఇక్కడ ఒక పిన్ మరియు అక్కడ ఒక పెద్ద బెలూన్ ఉన్న "నేను" ఉండదు, మరియు "నేను" వెళ్లి బెలూన్ ను పాప్ చెయ్యడం. కేవలం ఆ బెలూన్ - వస్తువులు ఎలా ఉన్నాయో అతిశయోక్తి - అలా పైకి లేస్తుంది. ఈ మోసపూరితమైన రూపం "మీరు చాలా భయంకరమైన వారు" లేదా "నేను ఉన్న ఈ పరిస్థితి చాలా భయంకరమైనది" అవ్వొచ్చు మరియు మనం దాన్ని అన్ని కారణాలు మరియు పరిస్థితుల నేపధ్యంలో చూడము మరియు ఇలాంటి దాన్ని అనుభవించే ప్రతి ఒక్క దాని నేపధ్యంలో చూడము. అప్పుడు మనం "పాపం!" అని అనుకుంటాము. ఇదంతా జరుగుతుందని మనం ఊహించుకుంటాం.

మరొక చిత్రం తెరిచిన పుస్తకం లాంటిది, ఒక పేజీ "పాపం నేను దీనితో బాధపడుతున్నాను" అని, మరియు ఇంకొకటి మనం హ్యాండిల్ చెయ్యలేని ఒక భయంకరమైన పరిస్థితి. ఇదొక భయంకరమైన కల్పిత గాథ లాంటిది. పుస్తకం ముగిసిపోయిన మానసిక ప్రతిబింబం మనకు ఉంటుంది, మరియు అదే అద్భుత కథ యొక్క ముగింపు. ఇంకా పదాలను ఉపయోగించడానికి, ద్వంద్వ వాదాన్ని మూసే పుస్తకంగా దీన్ని చూస్తాము!

మీకు మంత్రం కావాలంటే, మనకు కనిపించే దాన్ని చెత్త అని గుర్తుంచుకోవడానికి "చెత్త" అని చెప్పవచ్చు. ఇక్కడి ముఖ్యమైన సమస్య ఏమిటంటే మనం దీన్ని గుర్తుంచుకోవాలి. మనకు చాలా అవసరమైన సమయం మనం ఇబ్బందులను అనుభవిస్తున్నప్పుడే. టిబెటన్లు ఉపయోగించిన ఉదాహరణ ఏమిటంటే, మీరు ఏదైనా తప్పు చేసినట్లు ఆరోపించబడినప్పుడు ఆ భావన, మరియు "నేను అలా చేయలేదు! నేను అబద్ధం చెప్తున్నానని, లేదా దొంగనని మీ ఉద్దేశమా?!" అనే బలమైన భావన వస్తుంది.

బౌద్ధమతానికి, మరియు ఇతర ధార్మిక మతాలకు మధ్య తేడా

ఇతర ధార్మిక మతాలు ఉన్నాయని, ప్రతి ఒక్క దానిలో సమస్యలు ఉన్నాయని, ఆ సమస్యల విముక్తి కూడా ఉందని మీరు చెప్పారు. నిజానికి, ప్రతి మతం వారి పద్ధతులు ఉత్తమమైనవని చెబుతుంది, కాబట్టి ఈ కోణం నుంచి బౌద్ధమతం ప్రత్యేకమైనదని మీరు వివరించగలరా?

మీరు చెప్పింది కరెక్టే. హిందూమతం, బౌద్ధమతం, జైన మతాలు అన్నీ నియంత్రణలో లేని రిపీట్ అయ్యే పునర్జన్మ నుంచి విముక్తి పొందడం గురించి మాట్లాడతాయి మరియు విముక్తి స్థితి ఎలా ఉంటుందో వివరిస్తాయి. రియాలిటీను అర్థం చేసుకోవడం, రియాలిటీను వర్ణించడం ద్వారానే ముక్తిని పొందే మార్గం అని ప్రతి ఒక్కరూ చెబుతుంటారు. ఈ విధంగా బౌద్ధమతం పూర్తిగా భారతీయ మతం నేపధ్యంలో ఉంది. బౌద్ధమతం యొక్క ప్రత్యేకత ఏమిటంటే అందులోని నాలుగు ఉత్తమమైన సత్యాలు. బౌద్ధమతం వీటిని బోధిస్తుంది:

  • ఇతరులు బాధ అంటే ఏమిటో వివరించవచ్చు, కాని బుద్ధుడు నిజమైన బాధ గురించి మాట్లాడాడు;
  • ఒక విధమైన అజ్ఞానమే బాధకు కారణమని ఇతరులు అనవచ్చు, కాని బుద్ధుడు లోతైన అజ్ఞానం, నిజమైన కారణం గురించి చెప్పాడు.
  • ఇతర ధార్మిక మతాలు ఏది నిజమైన ఆగిపోతుందని భావిస్తాయో, అది శాశ్వతంగా ఉండదు, లేదా పూర్తిగా స్వతంత్రంగా ఉండదు.
  • ఇతరులు మాట్లాడే అవగాహన మిమ్మల్ని ఒక నిర్దిష్ట స్థితికి తీసుకువెళుతుంది, కానీ అది మిమ్మల్ని ముక్తి వరకు తీసుకెళ్లగల నిజమైన మనస్సు కాదు.

సహజంగా, మిగిలిన వారంతా బౌద్ధమతం గురించి అదే మాట చెబుతారు, కాబట్టి రియాలిటీ ఏమిటో మనం పరిశోధించాలి. ఈ శ్లోకంలో మనం చూసినట్లుగా, ఆధ్యాత్మిక మార్గానికి పూర్తి పునాది - మరియు ఇది బౌద్ధమతంలో మాత్రమే కాకుండా హిందూ మతం మరియు జైన మతానికి వర్తిస్తుంది - రియాలిటీ యొక్క దృక్పథం. దీన్ని లాజిక్, అనుభవం, మరియు అవగాహనతో పరీక్షించాలి.

ఈ జన్మలో దయగల, కరుణ గల వ్యక్తిగా మారడానికి ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించడానికి మరియు ముక్తిని పొందాలని కోరుకోవడానికి చాలా తేడా ఉంది. జ్ఞానోదయం గురించి మనం మాట్లాడితే, ఏ వివరణ సరైనదో తెలుసుకోవడానికి మీరు లాజిక్ మరియు చర్చ ఆధారంగా పరిశోధించవచ్చు. అయితే, ఆధ్యాత్మిక మార్గాన్ని ఆచరించే చాలా మంది ప్రజలు నిజంగా ముక్తిని లక్ష్యంగా పెట్టుకోరు. వారు అలా అనవచ్చు, కానీ దాని అర్థం ఏమిటో వారికి తెలియదు మరియు ఈ జన్మలో వారి జీవితాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తారు. అది కూడా బాగానే ఉంటుంది, అందులో తప్పేమీ లేదు.

దలైలామాను ఏ మతం మంచిది అని అడిగినప్పుడు, మీరు వ్యక్తిగతంగా దయగల మరియు కరుణ గల వ్యక్తిగా మారడానికి సహాయపడేది మంచి మతం అని ఆయన చెప్పారు. ప్రతి వ్యక్తి వేరుగా ఉంటాడు, కాబట్టి కరుణ, దయ, సహనం, క్షమాగుణం మొదలైన వాటిని పెంపొందించడానికి ఒకే సరైన మార్గం ఉందని మనం చెప్పలేము. వివిధ మతాల ప్రకారం వాటిని సమానంగా అభివృద్ధి చెయ్యవచ్చు. ఇదే మత సామరస్యానికి పునాది.

ఆధ్యాత్మిక మార్గంలో ఎలా ప్రోగ్రెస్‌ని సాధించాలి

ఈ మార్గంలో ప్రోగ్రెస్ సాధించడం గురించి నేను అడగాలనుకుంటున్నాను. సోవియట్ యూనియన్ లో ఆర్థికాభివృద్ధికి 5 సంవత్సరాల ప్రణాళికలు ఉండేవి. బౌద్ధమత అభ్యాసం ప్రారంభించే వారు దారి తప్పకుండా ఉండటానికి ఒకటి, మూడు లేదా ఐదు సంవత్సరాలు ఏమి చేయాలో మీరు సలహా ఇవ్వవచ్చు.

కనీసం నేను శిక్షణ పొందిన సంప్రదాయాలలో అత్యంత సాధారణమైన మరియు నమ్మదగిన మార్గం లామ్-రిమ్, అంటే గ్రేడెడ్ దశలలో పనిచెయ్యడం. ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించడానికి మనం అర్థం చేసుకోవాల్సిన, జీర్ణించుకోవాల్సిన, అభివృద్ధి చెందాల్సిన విషయాలను అంచెలంచెలుగా చూపిస్తుంది.

లామ్-రిమ్ ను అనుసరించే సాంప్రదాయ మార్గం ఏమిటంటే, మీరు ఒక పాయింట్ ను పొందుతారు, ఆ తర్వాత ఏమి జరుగుతుందో తెలుసుకోకుండా మీరు దానితో పని చేస్తారు. మీరు ఒక భాగాన్ని అర్థం చేసుకున్న తర్వాత, అప్పుడు వేరొక దానికి వెళతారు. ఈ రోజుల్లో పూర్తి మార్గాన్ని పుస్తకాలలో ఉంచారు, అలా మీరు మొత్తం విషయాన్ని ఒకేసారి చదవవచ్చు, కానీ మీరు ఇంకా ప్రతి అంశంపై ఎక్కువ సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. మీరు పూర్తి విషయాన్ని చదివిన తర్వాత కూడా, తిరిగి వెళ్లి ప్రతి పాయింట్ మిగిలిన వాటితో ఎలా అనుసంధానించబడి ఉందో తెలుసుకోవాలి.

ప్రోగ్రెస్ ఎప్పుడూ ఒకేలా ఉండదని, అది ఎప్పుడూ మారుతూ ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఒక రోజు బాగుంటే, ఆ తర్వాతి రోజు అలా ఉండకపోవచ్చు - అందులో ప్రత్యేకత ఏమీ లేదు. మీరు అలా వెళ్తూ ఉండాలి అంతే. ఇది నా గురువు యొక్క యువ పునర్జన్మకు ఇష్టమైన వాక్యం: "ఇది ప్రత్యేకమైనది కాదు." మీరు అనుభవించే దానిలో ప్రత్యేకత ఏమీ లేదు. ఇది బాగా జరుగుతుంది, బాగా జరగదు. అయితే ఏమిటి?

కాబట్టి, 5 సంవత్సరాల ప్రణాళికను సెట్ చెయ్యడం అవాస్తవం ఎందుకంటే ప్రతి వ్యక్తి వేరేగా ప్రోగ్రెస్‌ని సాధిస్తాడు. అయితే, మీరు ప్రోగ్రెస్ సాధించారో లేదో తెలుసుకోవడానికి మార్గం రోజువారీ లేదా నెల నుంచి నెలకు చూడటం అని కాదని, 5 సంవత్సరాల సమయంగా చూడటం అని దలైలామా గారు చెప్పారు. ఇంతకు ముందు కష్టాలను మనం ఎలా ఎదుర్కొన్నామో, ఇప్పుడు వాటిని ఎలా ఎదుర్కొన్నామో మనం పోల్చుకోవచ్చు. మనం ప్రశాంతంగా ఉన్నామా? అని. అప్పుడు మనకు మన ప్రోగ్రెస్ కనిపిస్తుంది.

గోండ్రో చెయ్యడం, ప్రాథమిక అభ్యాసాలు, 100,000 సాష్టాంగ నమస్కారాలు చెయ్యడం, ఆశ్రయ సూత్రాలను పాటించడం లాంటివి కూడా ఉన్నాయి. ప్రజలు ఎక్కువగా ఇలా ప్రారంభిస్తారు. ఈ రెండు విధానాలు ధర్మ బోధనలను చేరుకునే రెండు మార్గాలను ప్రతిబింబిస్తాయని నేను అనుకుంటున్నాను. మీరు గోండ్రోను ప్రారంభించినప్పుడు, ఇది సాధారణంగా ఉపాధ్యాయుడి నుంచి ప్రేరణ ఆధారంగా ఉంటుంది. మీకు పెద్దగా ఏమీ తెలియకపోవచ్చు, కానీ మీరు ఉపాధ్యాయుడి నుంచి చాలా ప్రేరణను పొందారు, మరియు అతను వివరించినవి ప్రయోజనకరంగా ఉంటాయని మీకు నమ్మకం ఉంటుంది, కాబట్టి మీరు గోండ్రో యొక్క 100,000 అభ్యాసాల సెట్లను చేశారు.

దలైలామా గారు స్వయంగా బోధించే ఈ శ్లోకం నుంచి నేను శిక్షణను పొందాను. ముందు మీరు నమ్మకం మరియు మార్గంపై అవగాహనను పొందుతారు - అది కుదురుతుంది, లక్ష్యం ఏమిటి, అనేటటువంటివి - తర్వాత మీరు ఒక గోండ్రో చేస్తారు.

సహజంగానే, వారి మధ్య ఒక మధ్య మార్గాన్ని చెయ్యవచ్చు. గోండ్రోతో ముందు ప్రారంభించేటప్పుడు, లక్ష్యాన్ని సాధించే అవకాశంపై నమ్మకాన్ని పొందడానికి కూడా మీరు పనిచేయడం ప్రారంభిస్తారు. లేదా మీరు ఈ అధ్యయనం మరియు అభ్యాసం చేస్తున్నప్పుడు, మీరు ఇప్పటికే గోండ్రోను చెయ్యడం ప్రారంభించవచ్చు. కాబట్టి, వాటిని కలపడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. నేను వివరిస్తున్న ఈ నిర్మాణంలో వివిధ టిబెటన్ గురువులు ధర్మాన్ని బోధించే విధానం గురించి నిజంగా ఆలోచించడం ప్రారంభిస్తే ఇవి సరిపోతాయని నేను అనుకుంటున్నాను. ఇది నాగార్జున మరియు బోధిచిత్తను అభివృద్ధి చేసే రెండు వేర్వేరు మార్గాలకు వెళుతుంది - ముందు రిలేటివ్, తర్వాత లోతైనది, లేదా ముందు లోతైనది మరియు తరువాత రిలేటివ్. ఎవరికీ ఏది బాగా సరిపోతుందో వాళ్లే స్వయంగా నిర్ణయించుకోవాలి.

సారాంశం

నాలుగు ఉత్తమమైన సత్యాలు రెండు సత్యాలలో రియాలిటీపై బౌద్ధమత బోధనలతో, దానికి ప్రతిగా మూడు విలువైన రత్నాలతో ఎలా సంబంధాన్ని కలిగి ఉన్నాయో అనేది చాలా అధునాతన ఎనాలిసిస్. ఇది అన్ని సత్యాలు మరియు రత్నాలు ఏమిటో తెలియజేయడమే కాకుండా, బౌద్ధమత తత్వశాస్త్రం మరియు ఆచరణలో స్పష్టమైన నిర్మాణాన్ని అందిస్తుంది. ఈ సాక్షాత్కారాలను బాగా పరిశోధించడానికి దలైలామా గారు రాసిన ఒక సంక్షిప్తమైన కానీ చొచ్చుకుపోయే వచనాన్ని ప్రాతిపదికగా దాన్ని మనం ఉపయోగించాము. ఈ అద్భుతమైన ఫలితం మన అవగాహనను పెంచడానికి ఒక లాజిక్ ఆర్డర్ ని చూపించడమే కాకుండా, ప్రతి ముఖ్యమైన బౌద్ధమత సాక్షాత్కారాలు మరొక దానికి ఎలా సహాయపడతాయో కూడా చూపిస్తుంది. ఈ విధంగా, ఒక సంక్లిష్టమైన మరియు సమగ్రమైన ఆధ్యాత్మిక మార్గం పుడుతుంది.

Top