మనస్సును శాంత పరచడానికి శ్వాస ధ్యానాలు

ప్రశాంతత పొందడం కోసం ఉన్న సాంప్రదాయ బౌద్ధమత పద్ధతి, శ్వాసపై దృష్టి పెట్టడం. బౌద్ధమత శిక్షణలో, శ్వాస తీసుకోవడంలో అనేక మార్గాలు మరియు వివిధ శ్వాస సంబంధిత వ్యాయామాలు ఉన్నాయి. నాకు తెలిసిన వాటిలో దాదాపు అన్నీ నోటి ద్వారా కాకుండా ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం మరియు బలవంతంగా కాకుండా సున్నితంగా శ్వాస తీసుకోవడం గురించి ఉంటాయి.

ఈ పద్ధతుల్లో కొన్నింటిలో మనం ఊపిరి పీల్చుకుని ఆపుతాము, మరికొన్నింటిలో అలా చెయ్యము. కొన్నిసార్లు మన శ్వాసను లోపలికి తీసుకుంటున్నప్పుడు ఆపుతాము మరియు కొన్నిసార్లు బయటకు వదులుతున్నప్పుడు ఆపుతాము. శ్వాస వ్యాయామం యొక్క ప్రయోజనం మనం గాలి పీల్చుకునే విధానంపై ఆధారపడి ఉంటుంది.

మన మనస్సుని శాంత పరచడానికి ఉన్న సాంప్రదాయ మార్గమే శ్వాసను లోపలి తీసుకోవడం మరియు బయటకి వదలడం. మనం శ్వాసను బయటకు వదులుతున్నప్పుడు ఆపవచ్చు, ఎందుకంటే దాని వల్ల సహజంగానే మనం గాలిని బలవంతంగా కాకుండా లోపలికి తీసుకోగలుగుతాము. శాంతపరిచే ఈ సులభమైన పద్ధతిలో, ఇతర పద్ధతులలో లాగా, మన శ్వాసను తీసుకున్నప్పుడు లోపాలే పట్టి ఉంచము. ఈ చక్రాన్ని ఉపయోగించడానికి చాలా కారణాలు ఉన్నాయనేది నా ఉద్దేశ్యం - కానీ ఇక్కడ దాని ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే, మన ఆలోచనలను శాంతపరచాలని అనుకోవడం. ఈ లెక్కలు వేసే విధానం సాధారణంగా ఈ శ్వాస చక్రాన్ని ఊహించుకునే విధానానికి వేరుగా ఉంటుంది, దీనికి ఎక్కువ ఏకాగ్రత అవసరం. అందుకే ఇది వేరే విషయాల గురించి ఆలోచించడానికి ఎక్కువ సమయం ఇవ్వదు, కాబట్టి ఇది మనస్సును శాంత పరచడానికి బాగా సహాయపడుతుంది.

ఇది సంప్రదాయ పద్ధతి. కానీ నా అనుభవం నుంచి నేను కనిపెట్టినది ఏమిటంటే, పాశ్చాత్య ప్రజలు, ముఖ్యంగా బోధనల విషయంలో, చాలా ఒత్తిడితో కూడిన రోజును అనుభవిస్తున్నారు. వాళ్ళు సాధారణంగా ఒత్తిడితో కూడిన ఉద్యోగాలలో చాలా కష్టపడుతున్నారు, ఆ తర్వాత ట్రాఫిక్ మొదలైన వాటిని ఎదుర్కుని సాయంత్రం సమయంలో బోధనకు రావాల్సి వస్తుంది. భారతదేశం లేదా టికెట్‌లోని సాంప్రదాయ బౌద్దుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి విషయాలు ఉండవు. కాబట్టి, ఒత్తిడికి గురైన పాశ్చాత్యులు బౌద్ధమత కేంద్రానికి రాగానే మీరు చెయ్యాల్సిన మొదటి పని వాళ్ళను శ్వాస తీసుకునే విధానంపై దృష్టి పెట్టమని చెప్పడం. అయితే, వాళ్ళు ఇప్పటికే ఒత్తిడికి గురై ఉంటే, అది వారి ఒత్తిడిని ఇంకా పెంచుతుంది, ఇది సాధారణ పద్ధతికి వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఇది కాస్త ఇబ్బందిగా ఉంటుంది.

శ్వాస వ్యాయామం యొక్క మొదటి ఉద్దేశ్యం ప్రశాంతతను పొందడం. కాబట్టి, ఒత్తిడికి గురై వచ్చిన పాశ్చాత్య అభ్యాసకులకు నేను దీన్ని చెయ్యమని సూచిస్తున్నాను, వాళ్ళు శ్వాస చక్రాన్ని లెక్కించడానికి సాంప్రదాయ పద్ధతిని ఉపయోగిస్తారు, ఆ తర్వాత కొద్దిగా విరామం ఇచ్చి మళ్ళీ ఇబ్బంది పడతారు, మరియు ఇది వారిని ఇంకా ఒత్తిడికి గురిచేస్తుంది, దీని ప్రయోజనాన్ని పోగొడుతుంది. అందువల్ల, ఈ ప్రత్యేక సందర్భంలో ఆ పద్ధతిని పాటించడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. అటువంటి పరిస్థితిలో, నేను చెప్పేది ఏమిటంటే, వాళ్ళు ఈ శ్వాస చక్రాన్ని చూసే సాంప్రదాయ పద్ధతి ద్వారా ఒత్తిడికి గురైతే, పాశ్చాత్య పద్ధతిని ఉపయోగించవచ్చు, ఇందులో కేవలం శ్వాస తీసుకోవడం మరియు ఎలాంటి విరామం లేకుండా శ్వాసను బయటకు వదులుతూ లెక్కించడం ఉంటుంది.

మన మనస్సు వేరే ఆలోచనలలో ఉంటే, ప్రశాంతంగా ఉండటానికి మనం శ్వాస చక్రాలపై దృష్టి పెట్టి వాటిని లెక్కించవచ్చు. కానీ మన మనస్సులు పరధ్యానంలో లేకుండా లేదా ప్రశాంతంగా ఉంటే, అప్పుడు అలా లెక్కించాల్సిన అవసరం లేదు.

మరో మాటలో చెప్పాలంటే, సాంప్రదాయ ధర్మ విధానాన్ని అనుసరిస్తూ, మనం ఉపయోగించగల మూడు సంభావ్య పద్ధతులు ఉన్నాయి. ఒకరి మనస్సు యొక్క పరిస్థితిని బట్టి వీటిని అంచనా వేసుకోవాలి, ఆ తర్వాత రకరకాల పద్ధతులను అనుసరించాలి. అవి,

  • మనం బాగా ఒత్తిడికి లోనైతే, సాధారణ పాశ్చాత్య పద్ధతిలో శ్వాసను లోపలికి మరియు బయటకు వదులుతూ లెక్క పెడతాము.
  • మనం ఒత్తిడికి లోనవ్వకపోతే, మన మనస్సు ఏకాగ్రతతో లేకపోతే, అప్పుడు మనం శ్వాసను బయటకు వదిలి ఆపి లోపలికి తీసుకునే సంప్రదాయ పద్ధతిలో లెక్కించవచ్చు.
  • మన మనస్సు మామూలు ప్రశాంతంగా ఉంటే, లెక్కించాల్సిన అవసరం ఏమీ లేదు, కేవలం శ్వాసపై దృష్టి పెడితే సరిపోతుంది.

ఈ రకమైన పద్ధతులను అప్లై చేసేటప్పుడు, మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, మన పట్ల మనం సున్నితంగా ఉండాలి మరియు సరైన పద్ధతిని ఉపయోగించాలి. బౌద్ధమత బోధనల గురించి ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే, వాటి పద్ధతులు చాలా గొప్పవి, కాబట్టి ఏదైనా ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించడానికి చాలా పద్ధతులు ఉంటాయి. ఇది సున్నితత్వ శిక్షణలో కూడా బాగా సహాయపడుతుంది. ఏ సమయంలోనైనా మన అసలైన భావోద్వేగ స్థితికి సంబంధించి మనలో సున్నితత్వాన్ని పెంపొందించుకోవాలి. ఏదైనా సాధించడానికి మనం అనేక పద్ధతులను నేర్చుకుంటే, వాటిల్లో సరైన దాన్ని అప్లై చేసుకోవాలి. మరియు ఇది పని చెయ్యకపోతే, ఇంకొక దాన్ని ప్రయత్నించాలి. అలా ప్రశాంతంగా ఉండటానికి ఈ మూడు పద్ధతుల్లో ఒక దానితో శ్వాసపై దృష్టి పెట్టాలి.

[ధ్యానం]

మన కళ్ళ పరంగా ప్రశాంతమైన ఈ ప్రారంభ దశలో, మన కళ్ళు తెరిచి పెట్టి, నేల వైపు చూడవచ్చు లేదా మూసి వేయవచ్చు. ఈ రెండు పద్ధతులను బుద్ధుడు బోధించాడు. బౌద్ధమత బోధనలలో రెండు ప్రధాన విభాగాలు ఉన్నాయి. హీనయాన సంప్రదాయం తర్వాత మిగిలిపోయిన థెరవాడ సంప్రదాయంలో మనం సాధారణంగా కళ్లు మూసుకుని ధ్యానం చేస్తాము; ఇంకొక ప్రధాన విభాగమైన మహాయాన సంప్రదాయంలో, సాధారణంగా ముక్కు చివర లేదా నేల వైపు చూస్తూ కళ్ళు తెరిచి చేస్తాము. కానీ మనం నేల వైపు చూస్తున్నప్పుడు, ముక్కు చివర ఉన్న దిశలో, కళ్ళు మాములుగా చూస్తాయి, పదునైన దృష్టిని కేంద్రీకరించకుండా.

కాబట్టి, మళ్ళీ మన పట్ల మనం సున్నితంగా ఉండాలి, కానీ మనం చాలా ఒత్తిడికి గురైతే, ఆందోళన చెందుతుంటే, కళ్ళు మూసుకుని ధ్యానం చెయ్యడమే సులభం. కానీ మనం అప్పటికే కొంచెం ప్రశాంతంగా ఉంటే కిందకు చూస్తూ కళ్ళు తెరిచి ఉండడం కూడా మంచిదే, ఎందుకంటే మనం కళ్ళు మూసుకోవడం ద్వారా ప్రపంచాన్ని చూడకుండా ఉండాలని ప్రశాంతంగా ఉండలేము, ఏదైనా పని చేసేటప్పుడు లేదా ఇతరులతో వ్యవహరించేటప్పుడు మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము మరియు విశ్రాంతి తీసుకోగలుగుతాం. కాబట్టి కళ్లు తెరిచి చెయ్యడం దానికి అనుకూలంగా ఉంటుంది.

తర్వాతి దశ మన ప్రేరణను తిరిగి పొందడం. తరచుగా, మనం శిక్షణకు వెళ్ళడానికి లేదా ధ్యానం చెయ్యడానికి భావోద్వేగ కారణాలు లేదా మానసిక కారణాలను పరిశీలించడాన్ని సూచిస్తుందని అనుకుంటాము. నేనెందుకు ఇలా చేస్తున్నాను? అపరాధ భావంతోనా? గ్రూపు ఒత్తిడితోనా? లేదా ఒక సామాజిక సందర్భంలో, ఒక గ్రూపుతో అనుబంధంతో, లేదా నేను చెప్పినట్లు ఒక చరిష్మా గల నాయకుడి నుంచి మీ శక్తిని పొందడానికి చేస్తున్నానా? లేదా టీచర్ తో ప్రేమలో పడి ఆ అనుబంధం నుంచి బయటపడటానికి చేస్తున్నానా? అని. బౌద్ధమత విధానంలో ఇది నొక్కి చెప్పబడలేదు. ఇది చాలా పాశ్చాత్య విధానం మరియు నిజానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

కానీ సాంప్రదాయ బౌద్ధమత విధానంలో, మనం ప్రేరణను పునరుద్ఘాటిస్తున్నామని చెప్పినప్పుడు, దాని అర్థం మన ఉద్దేశ్యాన్ని పునరుద్ఘాటించడం. బౌద్ధమత ప్రేరణ అనేది ఉద్దేశ్యం యొక్క ఒక రకం. మరో మాటలో చెప్పాలంటే, ఇక్కడికి రావడానికి మనం ఏమి చేస్తున్నాము మరియు మన లక్ష్యం ఏమిటి? అని. ఇక్కడికి రావడం ద్వారా మనం సాధించాలని అనుకున్న మూడు లక్ష్యాల గురించి మనం దీన్ని ఆలోచించవచ్చు, అవి సముచితంగా ఉంటాయి. మళ్ళీ, మన పట్ల మనం సున్నితంగా ఉండాలి మరియు మన లక్ష్యం ఏమిటి అనే దాని గురించి మనతో మనం నిజాయితీగా ఉండాలి. ఎందుకంటే తనను తాను బౌద్ధుడిగా భావించే వ్యక్తి , "సమస్త ప్రాణులకు ప్రయోజనం అందించడానికి జ్ఞానోదయం పొందడానికి నేను ఇలా చేస్తున్నాను" అని చెప్పడం చాలా సులభం. ఇవి కేవలం మాటలు మాత్రమే.

బుద్ధుడిగా మారడం అంటే ఏమిటో నిజంగా అర్థం చేసుకోకుండా, విశ్వంలోని ప్రతి కీటకానికి నియంత్రణలో లేని పునర్జన్మ నుంచి విముక్తి కలిగించాలనే చిత్తశుద్ధి లేకుండా, "నేను సమస్త జీవులకు సహాయపడటానికి జ్ఞానోదయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాను" అని చెప్పడంలో ఏ అర్ధం లేదు. కాబట్టి, మన లక్ష్యం ఏమిటనే దాని గురించి వాస్తవికంగా మరియు నిజాయితీగా ఉండటం బాగా ప్రభావవంతంగా ఉంటుంది. కాబట్టి, మనకు మూడు సముచిత లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే, ఈ జన్మలో మన సంబంధాలను మెరుగుపరచడం గురించి మాత్రమే మనం ఆందోళన చెందుతున్నాము, కాబట్టి బౌద్ధమత పద్ధతులు సూచించిన ఒక రకమైన చికిత్సగా ఈ శిక్షణను తీసుకోవడానికి మనం ఇక్కడకు వచ్చాము.

లేదా ధర్మ-లైట్ ఆలోచన నుంచి దీన్ని మనం చూడవచ్చు, అంటే "ఈ జన్మలో నా సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి నేను దీన్ని చేస్తున్నాను, కాని ముక్తి మరియు జ్ఞానోదయం పొందే దిశలో దీన్ని ఒక మెట్టుగా నేను చూస్తాను" అని అనుకోవడం. లేదా దీన్ని మనం ఒక నిజమైన వాస్తవ ధర్మంగా కూడా చూడవచ్చు, అంటే "నేను ఈ శిక్షణను నిజంగా ముక్తి మరియు జ్ఞానోదయాన్ని పొందడానికి ఒక దశగా చేస్తున్నాను" అని. కాబట్టి, మన అసలు లక్ష్యం ఏదైనా కానీ, మనం దాన్ని తిరిగి పొందుతాము. మన లక్ష్యం పట్ల మనకు చిత్తశుద్ధి ఉంటే, మన హృదయాలను దానిపై ఉంచడం చాలా సులభం అవుతుంది. లేకపోతే మనం చేస్తున్నది ఒక ఆటలాగా ఉంటుంది.

అప్పుడు ఏకాగ్రతతో వినాలని ఒక నిర్ణయం తీసుకుంటాం. మన దృష్టి ఎటైనా వెళ్తే, దాన్ని తిరిగి తీసుకురావడానికి మనం ప్రయత్నిస్తాము, మనకు నిద్ర వచ్చినప్పుడు, మేలుకుని ఉండడానికి ప్రయత్నిస్తాము. బాగా ఏకాగ్రతతో ఉండటానికి సహాయపడితే, మనం మన భంగిమను సరిచేసుకుంటాము - నిటారుగా ప్రశాంతంగా కూర్చుంటాము. ఆ తర్వాత కాస్త నీరసంగా అనిపిస్తే ఎనర్జీని పెంచడానికి మన కనుబొమ్మల మధ్య ఉన్న చోటుపై దృష్టి పెడతాం, మన కళ్ళు, తలను నిటారుగా ఉంచి పైకి చూస్తున్నట్టుగా. మనకు కొంచెం కంగారుగా లేదా టెన్షన్ గా అనిపిస్తే మళ్ళీ శక్తిని పెంచుకోవడానికి నాభిపై దృష్టి పెడతాం, కళ్ళు కిందికి చూస్తూ, తలను లెవల్ గా ఉంచుతూ. మనం సాధారణంగా శ్వాస తీసుకునేటప్పుడు, మనం శ్వాస తీసుకోవాల్సిన అవసరం వచ్చే వరకు మన శ్వాసను పట్టి ఉంచుతాము.

మైత్రేయి సూచనల నుంచి ఏకాగ్రతను ఎలా పొందాలో, మరియు ఉద్దేశపూర్వకమైన నిర్ణయం లేదా దృష్టి పెట్టాలనే ఉద్దేశ్యం దానికదే వస్తుంది. మధ్య నుదుటిపై మరియు నాభిపై దృష్టి పెట్టడం ద్వారా చేసే శక్తుల సర్దుబాటు కాలచక్ర బోధనల నుంచి వస్తుంది. కాబట్టి, సరిగ్గా ఈ అంశాలను కలిపి ఉంచే సాంప్రదాయ బౌద్ధమత సమూహాల కలయిక లేనప్పటికీ, అవన్నీ బౌద్ధమత బోధనల నుంచే వచ్చాయి. కానీ నేను వాటిని ఈ రూపంలోనే ఉంచుతాను, ఎందుకంటే నేను ఎదుర్కొనేది ఏమిటంటే, చాలా మంది పాశ్చాత్యులు బోధనలలో చాలా ఒత్తిడికి లోనవుతారు, మరియు ఈ రకమైన ప్రాథమిక సూత్రాలు వాటిని పరిష్కరిస్తాయి. ఇటువంటి సూత్రాలు అత్యంత ఒత్తిడితో కూడిన మన జీవితాలకు చాలా అవసరం.

Top