థెరవాడ వంశపు సన్యాసుల చరిత్ర

భారత చక్రవర్తి అశోకుని యొక్క కొడుకు మహింద చేసిన ఒక మిషన్ ద్వారా క్రీస్తుపూర్వం 249లో బౌద్ధమతం శ్రీలంకకు వచ్చింది. ఆ సమయంలోనే తొలి శ్రీలంక భిక్షువులు సన్యాసులుగా మారారు. కానీ థెరవాడ అనే పేరు ఉపయోగించిన తేదీ వివాదాస్పదంగా ఉన్నప్పటికీ, సింప్లిసిటీ కోసం ఈ బౌద్ధమత వంశాన్ని మనం "థెరవాడ" అని పిలుస్తాము. అశోక చక్రవర్తి కుమార్తె సంఘమిత్త క్రీస్తుపూర్వం 240లో శ్రీలంకకు రావడంతో థెరవాడ భిక్షుని సన్యాస వంశం అక్కడికి వ్యాపించింది. క్రీ.శ. 1050 నాటికి చోళ సామ్రాజ్యం కింద తమిళుల దండయాత్రతో శ్రీలంకలో వాళ్ళ పాలన ఫలితంగా ఈ సన్యాస వారసత్వ వంశం కనుమరుగైపోయింది.

మౌఖిక సంప్రదాయం ప్రకారం అశోక చక్రవర్తి సోనా మరియు ఉత్తర అనే ఇద్దరు దూతలను సువన్నఫుమ్ (సం. సువన్నభూమి) రాజ్యానికి పంపి అక్కడ థెరవాడ బౌద్ధమతాన్ని, భిక్షు వంశాన్ని స్థాపించాడు. చాలా మంది పండితులు ఈ రాజ్యాన్ని మోన్ (తైలాంగ్) ప్రజలుగా మరియు దక్షిణ బర్మాలోని ఓడరేవు నగరం థాటన్ తో గుర్తిస్తారు. అయితే భిక్షుని వంశం ఈ సమయంలో వ్యాప్తి చెందిందా లేదా తర్వాత వ్యాప్తి చెందిందా అనేది మనకు స్పష్టంగా తెలీదు.

క్రీస్తుపూర్వం 1 వ శతాబ్దం నుంచి ఉత్తర బర్మాలోని వివిధ ప్యూ సిటీ రాష్ట్రాలలో థెరవాడ బౌద్ధమతం ఉన్నప్పటికీ, ఇది మహాయాన, హిందూ మరియు స్థానిక అరి మతంతో కలిసిపోయి ఉండి, ఇందులో ఆత్మలకు జంతువులను బలిచ్చే ఆచారాలు ఉన్నాయి. క్రీ.శ. 11 వ శతాబ్దం మధ్యలో, అనవ్రహ్తా రాజు ఉత్తర బర్మాను ఏకీకృతం చేశాడు, థాటన్ వద్ద మోన్ రాజ్యాన్ని పొందాడు, పాగన్ దగ్గర తన రాజధానిని స్థాపించుకుని మోన్ భిక్షు అరహంతను తన రాజ్యం అంతటా థెరవాడ బౌద్ధమతం మరియు దాని అనుబంధ సన్యాస వంశాలను స్థాపించడానికి ఆహ్వానించాడు.

క్రీ.శ 1070 లో శ్రీలంకలో చోళుల ఓటమి మరియు పొలన్నరువా దగ్గర కొత్త రాజధాని స్థాపనతో, పాగన్ నుంచి ఆహ్వానించబడిన భిక్షువులచే శ్రీలంకలో థెరవాడ భిక్షు సన్యాసుల వంశం తిరిగి స్థాపించబడింది. అయితే, అనవ్రత మహారాజు భిక్షుని వంశం యొక్క స్వచ్ఛతను ప్రశ్నించి ఆ భిక్షుని వంశాన్ని తిరిగి స్థాపించడానికి మిగతా భిక్షునిలను అక్కడికి పంపలేదు. అందువల్ల, శ్రీలంకలో ఆ సమయంలో భిక్షునిల థెరవాడ వంశం పునరుద్ధరించబడలేదు. బర్మాలో భిక్షుని సన్యాస మఠం ఉనికికి సంబంధించిన చివరిగా రాయబడిన సాక్ష్యం క్రీ.శ 1287 లో పాగన్ మీద మంగోల్ దండయాత్ర జరిగినప్పుడు ఉంది.

క్రీ.శ 1215 నుంచి 1236 వరకు కళింగ (ఆధునిక ఒరిస్సా, తూర్పు భారతదేశం) రాజ్యపు మాఘ రాజు శ్రీలంకను ఆక్రమించి పరిపాలించాడు. ఈ కాలంలో శ్రీలంక భిక్షు సంఘం తీవ్రంగా బలహీనపడింది. మాఘ మహారాజు ఓటమితో, భిక్షు వంశాన్ని పునరుద్ధరించడానికి క్రీ.శ 1236 లో ప్రస్తుత తమిళనాడులో బలహీనమైన చోళ రాజ్యంలోని బౌద్ధమత కేంద్రం కాంచీపురానికి చెందిన థెరవాడ భిక్షువులను శ్రీలంకకు ఆహ్వానించారు. తమిళ భిక్షునిలను ఆహ్వానించక పోవడం వలనే ఈ సమయంలో దక్షిణ భారతదేశంలో భిక్షుని సంఘం లేకపోవడానికి కారణం. బెంగాల్ తో సహా ఉత్తర భారతదేశంలో భిక్షుని సంఘానికి సంబంధించిన చివరి లిఖితపూర్వక ఆధారాలు క్రీ.శ 12 వ శతాబ్దం చివరి నుంచి ఉన్నాయి. సన్యాసినులు ఏ వంశానికి చెందిన భిక్షుని ప్రతిజ్ఞలు తీసుకున్నారో స్పష్టంగా తెలియదు.

థాయ్ లాండ్ లోని సుఖోత్తై రాజ్యానికి చెందిన రామ్ ఖమ్ హాంగ్ రాజు క్రీ.శ 13 వ శతాబ్దం చివరిలో శ్రీలంక నుంచి థాయ్ లాండ్ వచ్చి అక్కడ థెరవాడ బౌద్ధమతాన్ని స్థాపించాడు. ఆ సమయంలో శ్రీలంకలో ఏ భిక్షుని సంఘం లేనందు వల్ల, భిక్షుని సన్యాస వంశం థాయ్ లాండ్ కు ఎప్పుడూ చేరుకోలేక పోయింది. కేవలం భిక్షు వంశం మాత్రమే వచ్చింది. క్రీ.శ. 14 వ శతాబ్దం ప్రారంభంలో థాయ్ లాండ్ నుంచి కాంబోడియాలోకి వచ్చి థెరవాడ బౌద్ధమతం స్థాపించబడింది. ఆ తర్వాత కూడా కంబోడియా, లావోస్ కి కూడా థెరవాడ భిక్షుని వంశం చేరలేక పోయింది.

థెరవాడ దేశాలలో, కేవలం శ్రీలంక మాత్రమే అధికారికంగా థెరవాడ భిక్షుని వ్యవస్థను పునరుద్ధరించింది, అది కూడా క్రీ.శ 1998 లో. అప్పటి వరకు, శ్రీలంకలోని మహిళలు కేవలం దశశిల్ మాతలుగా, అంటే "పది-గురువుల అభ్యాసకులుగా" అవ్వడానికి మాత్రమే అనుమతించబడ్డారు, భిక్షునిలుగా కాదు. అటువంటి సాధారణ స్త్రీలు దుస్తులు ధరించి బ్రహ్మచర్యం పాటిస్తున్నప్పటికీ, వారిని సన్యాస సంఘంలో సభ్యులుగా పరిగణించలేదు. బర్మా మరియు కాంబోడియాలలో, సిలాషిన్ అని బర్మాలో మరియు డోంచి లేదా యిచి అని కాంబోడియాలో పిలువబడే "ఎనిమిది-సూత్రాల అభ్యాసకులుగా" అవ్వడానికి మాత్రమే మహిళలను అనుమతించారు. బర్మాలోని కొందరు మహిళలు కూడా ఈ పది సూత్రాలను అందుకున్నారు. థాయ్ లాండ్ లో, వాళ్ళు మేచి (మేజీ) అని పిలువబడే "ఎనిమిది-సూత్రాల అభ్యాసకులుగా" అవ్వొచ్చు. క్రీ.శ 1864 లో తీరప్రాంత బర్మాలోని అరకాన్ జిల్లా నుంచి చిట్టగాంగ్ జిల్లాలో మరియు బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ పర్వత ప్రాంతాలలో థెరవాడ బౌద్ధమతం పునరుద్ధరించబడినప్పటి నుంచి, మహిళలు అక్కడ ఎనిమిది సూత్రాల అభ్యాసకులుగా మారారు.

Top