కరుణను పెంపొందించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు

బౌద్ధమతంలో, కరుణ ఒక విలువైన ఆలోచన కంటే ఎక్కువ; ఇది మన ఆధ్యాత్మిక ఆచరణలో ముఖ్యమైన భాగంలో ఉన్న శక్తితో ఉండే మరియు మార్పు తీసుకువచ్చే మంచి శక్తి. కరుణను అభివృద్ధి చెయ్యడం ఎంతో అవసరం, అవును, అది మన వ్యక్తిగత అభివృద్ధికి మాత్రమే కాకుండా, మనందరికీ కావాలనుకున్న ప్రశాంతమైన మరియు సమైక్యమైన ప్రపంచాన్ని సృష్టించడానికి కూడా సహాయపడుతుంది. మనలో కరుణకు విస్తృత భావం పెంచడం ద్వారా, మనం ఇతరుల జీవితాలను అద్భుతంగా మార్చగలము, చీకటి ఉన్న ప్రదేశాలకు కాంతిని తీసుకువచ్చి, బాధ ఉన్న చోట శాంతిని అందించగలము. ఇదే కరుణ యొక్క శక్తి.

మనం కరుణను ఎందుకు పెంపొందించుకోవాలి? 

మనలో కొందరు ఇలా అడగవచ్చు: “మనకు కరుణ ఎందుకు అవసరం?” అని. మన జీవితం సుఖంగా, విజయవంతంగా సాగుతోందని భావించి, కరుణ లాంటి భావనను పెంపొందించాల్సిన అవసరం లేదని మనకు అనిపించవచ్చు. కానీ నిజంగా మనం సంతోషంగా, విజయవంతంగా ఉన్నామా అని లోతుగా పరిశీలిస్తే, మన సుఖసంతోషాలన్నీ ఎంతవరకు ఇతరులపై ఆధారపడి ఉన్నాయని మనకు అర్థమవుతుంది — ఉదాహరణకి మనం తినే ఆహారాన్ని పండించే రైతులు, మనం ఉపయోగించే రహదారులను నిర్వహించే కార్మికులు. వాళ్ల సహకారం లేకపోతే మన పరిస్థితి ఎలా ఉండేదో ఒకసారి ఊహించండి.

మన చుట్టూ ఉన్న ప్రపంచానికి మనం ఎంతో రుణపడి ఉన్నామని నిజంగా మనం అర్థం చేసుకున్నప్పుడు, కరుణను అభివృద్ధి చెయ్యడం ద్వారా మనకు దగ్గరలో ఉన్న వారితోనే కాదు, దూరమైనవారితో కూడ మన బంధం మరింత లోతుగా మారుతుంది అనే సత్యాన్ని మనం గ్రహిస్తాము. బుద్ధుడు బోధించినట్లుగా, ఈ లోకంలోని ప్రతి జీవీ ఒకరితో ఒకరు సంబంధాన్ని కలిగి ఉన్నారు. అందుకే, ఇతరుల ఆనందం, బాధలు కూడా మన ఆనందం, మన బాధలతో విడదీయలేని సంబంధంలో ఉంటాయి.

మనమందరం కరుణను అభివృద్ధి చేసుకుంటే, ఒక గొప్ప మార్పు జరుగుతుంది: మనం మనకోసం, మన అవసరాలు, కోరికలు, భయాల కోసం మాత్రమే ఆలోచించటం తగ్గిపోతుంది. మనం ఈ గ్రహంపై ఉన్న ప్రతి జీవి సుఖసంతోషాలను కూడా మన స్వంత ఆనందంతో సమానంగా చూడడం మొదలుపెడతాము. టిబెటన్ గురువులు చెప్పే ఒక అందమైన సాధన ఇది: మనల్ని మనం ఒక వైపు ఊహించుకోవాలి, ఒంటరిగా, మన అవసరాలు, కోరికలతో ఉన్న మన రూపం. ఇంకొక వైపు, ప్రతి ఇతర జీవిని ఆయా ఆశలతో, కష్టాలతో ఒకచోట ఊహించాలి. అప్పుడు మనల్ని మనం ఒక ప్రశ్న అడగాలి: “ఇప్పటి పరిస్థితిలో ఎవరికి అవసరాలు ఎక్కువ ఉన్నాయి? కేవలం నా అవసరాలా? లేక సమస్త జీవుల అవసరాలా?” అని. ఈ ఆలోచన మార్పు కేవలం ఇతరులను సహాయపడటం కోసమే కాదు, మన మనసులో ఉండే ఆత్మ-కేంద్రీకరణ బంధాల నుంచి మనల్ని విముక్తి చేస్తుంది. మనమే మన ప్రపంచం అన్న భావన నుంచి బయటపడటానికి ఇది ఒక మార్గం.

ఇతరులు సంతోషంగా ఉండాలంటే, కరుణను అభ్యసించండి. మీరు సంతోషంగా ఉండాలంటే కూడా, కరుణను అభ్యసించండి. — మహా గురువు గారు 14వ దలైలామా

ఇంకా చెప్పాలంటే, బుద్ధుని ప్రకారం కరుణ అనేది నిజమైన ఆనందానికి మూలం. మెటీరియల్ సంపత్తులు గానీ, వృత్తిపరమైన విజయాలు గానీ, మనకు కేవలం తాత్కాలిక సంతృప్తినే ఇస్తాయి — కానీ కరుణ మనకు స్థిరమైన తృప్తిని, లోతైన సంతోషాన్ని అందిస్తుంది. కరుణ వల్ల మనం రోజూ ఎదురయ్యే చిన్నపాటి క్షణాల్లో ఆనందాన్ని అనుభవించగలుగుతాము — ఉదాహరణకు ప్రతిఫలం ఆశించకుండా ఏదైనా ఇవ్వడం, లేదా ఒక అపరిచితుడికి సాదా చిరునవ్వు ఇవ్వడం లాంటి చిన్న విషయాల్లో. ఈ ఆనందం బయటి పరిస్థితులపై ఆధారపడదు; ఇది ఇతరుల పట్ల మన హృదయపూర్వక శ్రద్ధ, మనం ఎవరితో అయినా కనెక్ట్ అవ్వాలనే తపనతో సహజంగా వస్తుంది — ఎందుకంటే వాళ్ళు కూడా మనలాగే సంతోషంగా ఉండాలనే కోరికతోనే ఉంటారు.

కరుణను అభివృద్ధి చేసుకోవడం వల్ల కలిగే లాభాలు

మొదట్లో, ఇతరుల బాధలను గమనించడం, వాటి కోసం ఏదైనా చెయ్యాలనే తపన మనల్ని ఎమోషనల్ గా మార్చేస్తుందేమోనని అనిపించవచ్చు. కానీ ఆసక్తికరంగా, ఇది పూర్తి విరుద్ధంగా పనిచేస్తుంది, మనం కరుణను అభ్యాసించడంలో ఎంతగా లీనమవుతామో, అంతగా మనం మనల్ని మనమే ఉద్దరించుకుంటాము; మన జీవితాల్లో మరింత ప్రశాంతత, ప్రయోజనం కనిపెట్టగలుగుతాము. సింపుల్‌గా చెప్పాలంటే, కరుణను అభివృద్ధి చేసుకోవడం మనకూ, మన చుట్టూ ఉన్న ప్రపంచానికీ అనేక లాభాలను కలిగిస్తుంది.

వ్యక్తిగత స్థాయిలో, కరుణ మనలో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌ను తగ్గిస్తుందని శాస్త్రీయంగా రుజువైంది. ఇది మనకు భావోద్వేగ బలాన్ని అందిస్తుంది, జీవితంలో ఎదురయ్యే అన్ని సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుతుంది. అంతేకాక, కరుణ మన వ్యక్తిగత సంబంధాలను మరింత సార్ధకంగా మారుస్తుంది. ఇది మనల్ని మరింత అవగాహన కలిగినవారిగా, సహనంతో కూడినవారిగా, మనకు ప్రియమైనవారిని సపోర్ట్ గా నిలిచే వారిగా తీర్చిదిద్దుతుంది.

విస్తృత స్థాయిలో చూస్తే, కరుణ సమాజాన్ని మార్చే శక్తిని కలిగి ఉంది. మనం కరుణతో స్పందించినప్పుడు, దయా ధర్మాలు మరియు సహానుభూతి కలిగిన సంస్కృతికి మనం వంతుగా మారతాము. ఇది ప్రతి ఒక్కరూ విలువైనవారని, అండగా ఉన్నారని అనుభవించే సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది — దీని ఫలితంగా సామాజిక సామరస్యం మరియు ఐక్యత పెరుగుతుంది.

అయితే, కరుణ అందించే అత్యంత గొప్ప లాభం ఏమిటంటే, అది మన అసలైన స్వభావంతో మనల్ని మళ్లీ కలిపే విధానం. కరుణ మనకు వేరుపడి ఉన్నాం అన్న భావన ఒక మాయ మాత్రమేనని చూపిస్తుంది. సమస్త జీవరాశులు పరస్పరంగా ఎలా అనుసంధానమై ఉన్నాయో చూపిస్తుంది. ఈ నిజాన్ని తెలుసుకునే క్షణంలో, మనకు కేవలం జీవితం యొక్క గమ్యం గాక, దీర్ఘకాలిక శాంతి మరియు సంతృప్తికి దారి చూపే మార్గం కూడా దొరుకుతుంది.

కరుణను అభివృద్ధి చేసుకునే మార్గాలు

బుద్ధుడు కరుణను పెంపొందించుకునేందుకు అనేక మార్గాలను బోధించారు. వీలైనన్ని సాధనలను మన జీవనశైలిలో భాగం చేసుకుంటే, క్రమంగా మన కరుణ మిగతావారి పట్ల సహజ స్పందనగా మారుతుంది — ఇది మనలో సహజమైన దయా చర్యలకు దారితీస్తుంది.

ఇతరుల బాధను మనస్సులో అన్వయించుకోవడం

ఈరోజుల్లో మనుషులు ఎంతగా “కరుణ అలసట” అనుభవిస్తున్నట్లు నివేదించటం చూస్తున్నాం. యుద్ధాలు, కరువు, ప్రకృతి విపత్తుల లాంటి వాటితో వార్తలు, సోషల్ మీడియా క్షణక్షణం ముంచెత్తుతున్న సమయంలో, మనం మరింత బాధను స్వీకరించలేమన్న భావనతో బాధితుల విషయంలో విసుకుపోతున్నాం, విరక్తి చెందుతున్నాం.

అయితే, కరుణను అభివృద్ధి చేసుకునే అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి ఏమిటంటే ఇతరుల బాధపై చిత్తశుద్ధితో మనసుని కేంద్రీకరించడం. మనకు వార్తల్లో ఏదైనా విషాదకర సంఘటన కనిపించినప్పుడు, “అయ్యో ఎంత దారుణం” అని ఒక్క క్షణం అనుకొని వెంటనే స్క్రోల్ చేయడమే కాకుండా, మనం ఆ బాధను నిజంగా అన్వయించుకోవాలి. ఉదాహరణకి, ఒక శరణార్థుల కథను తీసుకుందాం. ఒక మనిషి తన పుట్టిన నేల, జీవితం అంతా వదిలేసి తెలియని భవిష్యత్తు కోసం బయలుదేరాల్సిన పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్క క్షణం ఆలోచించండి. తమ ప్రాణాలనే త్యాగం చేసేంత ప్రమాదకరమైన మార్గాల్లో ప్రయాణించి, చివరికి ఏదో చోటకు చేరిన తర్వాత కూడా, వారిని అనుమానం, భయం, లేదా నిర్లక్ష్యంతో తీరుస్తారు. అలా జీవించాల్సి వస్తే మనల్ని గానీ, మన ప్రేమించే వారిని గానీ ఆ స్థితిలో ఊహించండి. అప్పుడు సహజంగా మనసులోంచి ఒక్క భావన వచ్చేస్తుంది: “ఇలాంటి బాధ ఎవరికీ కలగకూడదు.” అని.

ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఏమిటంటే ఇతరుల బాధపై మనసుతో ఆలోచించడం అంటే బాధను గానీ, దిగులును గానీ మన లోపల ఉంచుకుని దిగులుగా మారిపోవడం కాదు. కానీ, ఈ ప్రపంచంలో బాధ అనేది ప్రతి ఒక్కరికి ఎదురయ్యే సాధారణ అనుభవమని గుర్తించడం. మన చుట్టూ ఉన్నవారే కాకుండా, దూర దేశాలలో ఉన్నవారు కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారన్న సత్యాన్ని అంగీకరించినప్పుడు — వారి బాధను తేలిక చేయాలన్న నిజమైన ఆకాంక్ష మనలో దానికదే ఎదుగుతుంది. ఇదే కరుణకు నిజమైన మొదలు.

దయతో వ్యవహరించడం

ముందే చెప్పినట్లు, కరుణ అనేది కేవలం మనసులో అనుభవించే భావమే కాదు — అది మనం ఆచరిస్తూ చూపించాల్సిన లక్షణం కూడా. చిన్నచిన్న దయా పనులు లాంటివి అవసరమైనప్పుడు ఓ సహాయం చేయడం, ఎవరైనా మాట్లాడుతుంటే శ్రద్ధగా వినడం, లేకపోతే ఎవరికైనా ఓ చిరునవ్వు పంచడం లాంటి వాటి ద్వారా మన కరుణను చూపించవచ్చు.

ఈ చిన్నచిన్న దయా పనులు తక్కువగా అనిపించవచ్చు, కానీ అవి ఊహించని విధంగా చాలా మంది జీవితాలను మార్చవచ్చు. దయ ఒక కండరం లాంటిది, మనం చేసే ప్రతి క్షణికమైన సహాయం లేదా సానుభూతి పని మన కరుణను బలోపేతం చేస్తుంది. అలా భవిష్యత్తులో ఇంకా సులభంగా, సహజంగా, మనం ఇతరుల పట్ల అనురాగంగా స్పందించగలుగుతాం. ఈ విభజనతో ఉన్న ప్రపంచంలో, ఇలాంటి చిన్న పనులే ఇతర జీవుల పట్ల మన అనుబంధాన్ని పెంచుతూ, ఈ లోకానికి కొంచెం వెలుగుని తీసుకురాగలవు.

నిస్వార్థ ప్రేమను అభ్యసించడం

నిస్వార్థ ప్రేమ, అంటే ఇతరులు సంతోషంగా ఉండాలన్న నిష్కలంకమైన కోరిక. కరుణతో చాలా దగ్గర సంబంధం కలిగి ఉంది. ఇది శక్తివంతమైన సాధన, మన దృష్టిని స్వార్థపూరిత ఆలోచనల నుంచి అన్ని జీవుల పట్ల వ్యాప్తి చెందే ప్రేమ వైపు మళ్ళించే సాధన. ఇలా చేస్తే, మనలోపలే ఉన్న శాంతి, తృప్తి అనే మూలాన్ని మనం సృష్టించగలుగుతాం.

బౌద్ధ సన్యాసి మరియు "ప్రపంచంలో అత్యంత ఆనందంగా ఉండే మనిషి"గా గుర్తింపు పొందిన మత్యూ రికార్డ్ చెప్పినట్లు, "నిస్వార్థ భావన అనేది మన మనసుకు అత్యుత్తమ స్థితి, ఎందుకంటే అది మనకూ, ఇతరులకూ గొప్ప మేలు చేస్తుంది." మనం రోజువారీ జీవితంలో నిస్వార్థ ప్రేమను అభ్యసించడానికి ప్రయత్నిస్తే, మన హృదయం సహజంగానే ఎక్కువ కరుణతో ఉంటూ, విస్తృతంగా మారుతుంది.

ఈ సాధన కోసం ఎటువంటి గొప్ప పనులు చెయ్యనవసరం లేదు; మనం రోజూ కలిసే ప్రతి వ్యక్తికి మనస్ఫూర్తిగా సంతోషం కలగాలనే ఆకాంక్షతో ప్రారంభించవచ్చు. వీధిలో ఎదురయ్యే ఒక అనామకుడికి నిశ్శబ్దంగా మేలు కావాలని ఆకాంక్షించటం, స్నేహితుడికి మనశ్శాంతి కలగాలని ఆశించటం, లేదా ప్రపంచవ్యాప్తంగా బాధలో ఉన్నవారికి ప్రేమను పంచటం — ఇవన్నీ మన ప్రేమను, కరుణను విస్తరించే చిన్న కానీ అర్థవంతమైన పనులే. ఇలా మనం చెయ్యబోయే ప్రతి చిన్న ఉద్దేశపూరిత దయతో కూడిన పని మనలో ప్రేమ, సానుభూతి సామర్థ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది.

కొన్నిసార్లు బయట బాధపడుతున్నట్లుగా కనిపించే వారికి మనం నిస్వార్థ ప్రేమను చూపించడం చాలా సులభంగా అనిపించవచ్చు. ఉదాహరణకు, వీధిలో ఓ భిక్షాటన చేసే వ్యక్తిని చూస్తే, మనలో సహజంగా, “అయ్యో, వీళ్ళ బాధలు తీరాలని, వీళ్లు సంతోషంగా ఉండాలని” అనిపించవచ్చు. కానీ అదే సమయంలో, ఎవ్వరైనా సంపన్నంగా, అన్నీ సంపాదించుకున్నట్లుగా కనిపిస్తే, మనకు “ఇవాళ్లకు ఇక ఇంకేమైనా కావాలా? వీళ్లకు నేను సంతోషాన్ని కోరాలా?” అనే భావన రావచ్చు. అయితే, నిజమైన నిస్వార్థ ప్రేమ అనే భావన ఈ బయటి పరిస్థితులను దాటి ఉంటుంది. ఎవరికైనా బాధలు ఉన్నాయా లేదా అన్నది ముఖ్యం కాదు, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండటానికి అర్హులే అన్న సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి.

దీని కోసమే బుద్ధుడు ప్రేమపూర్వక దయ ధ్యానాన్ని బోధించాడు. ఈ సాధనలో మనం ముందుగా మనపై ప్రేమ, సానుభూతి భావాలను పెంపొందించటం ప్రారంభిస్తాము. తర్వాత అదే భావనలను మనకు ప్రియమైనవారిపై, ఆ తర్వాత న్యూట్రల్ వాళ్లపై, చివరికి మనకు కష్టం కలిగించే లేదా అసహ్యంగా అనిపించే వ్యక్తులపైనా చూపించాలి. ఈ విధంగా మన ప్రేమ, కరుణ అనే వృత్తాన్ని విస్తరిస్తూ, చివరికి అన్ని ప్రాణులపై కూడా వివక్ష లేకుండా పరిపూర్ణ ప్రేమను కలిగించటమే లక్ష్యం. కాలక్రమేణా, మనం కలిసే ప్రతి ఒక్కరికీ, వాళ్ళు ఎవరైనా సరే, మనస్ఫూర్తిగా సంతోషం కలగాలని కోరే స్వభావిక తత్వం మనలో ఏర్పడుతుంది.

మైండ్‌ఫుల్‌నెస్ మరియు మెడిటేషన్

మైండ్‌ఫుల్‌నెస్ అనేది మన ఆలోచనలు, భావోద్వేగాలు, మరియు చుట్టూ ఉన్న పరిస్థితులపై నిష్పక్షపాతంగా, పూర్తిగా చైతన్యంతో ఉండే సాధన. ఈ నైపుణ్యాన్ని మనందరం అభ్యాసంతో అభివృద్ధి చేయగల సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటే, మనకే కాదు ఇతరులకూ ఉన్న బాధలను స్పష్టంగా గుర్తించగలగుతాము. మన అవగాహన పెరిగే కొద్దీ, సహజంగానే మన కరుణ కూడా పెరుగుతుంది. ఎందుకంటే అప్పటికి మనం ప్రతి ఒక్కరి జీవితంలోనూ బాధ అనేది ఓ మౌలికమైన అనుభవమని, అది మనందరికీ జరుగుతుందని తెలుసుకుంటాము.

ప్రఖ్యాత బౌద్ధ సన్యాసి మరియు ఆచార్యుడు థిచ్ నాట్ హాన్ ఎంతో అనర్గళంగా చెప్పారు, “ మైండ్‌ఫుల్‌నెస్ కరుణకు జన్మనిస్తుంది.” మనం మనస్ఫూర్తితో జీవించడాన్ని అభ్యాసించగలిగితే, మనకు మాత్రమే కాదు, ఇతరులకు కూడా బాధలు, భయాలు, నిరాశలు కలుగుతున్న తక్కువగా కనిపించే రూపాలను కూడా గమనించగలుగుతాము. ఈ అవగాహన మన మనసును మెత్తబరుస్తుంది, దాంతో మనం అసహనం లేదా ఆగ్రహంతో స్పందించకుండా, దయతో, కరుణతో స్పందించగలుగుతాము.

మైండ్‌ఫుల్‌నెస్ మరియు ధ్యానం ద్వారా మనం ఒక విషయం స్పష్టంగా గుర్తించగలుగుతాము, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో పోరాటాలు, సవాళ్ళను ఎదుర్కొంటూనే ఉంటారు. ఇది మనం వెంటనే తీర్పు చెప్పే అలవాటును, మనం సాధారణంగా తీసుకునే నిర్ధారణలను క్రమంగా విడిచిపెట్టడంలో సహాయపడుతుంది. మన కరుణను అన్ని జీవులవైపు క్రమంగా విస్తరించడాన్ని అభ్యాసించే ప్రాసెస్ లో, మనమేమో విడిపోయినట్టు భావించే గోడలను చాలా సందర్భాల్లో గర్వభావాన్ని కూడా కూలదొడుతూ పోతాం. ఈ మార్పుతో మనం మనం సమాజంలో జీవించే జీవులుగా స్వయంగా ఆనందాన్ని పొందడమే కాక, చుట్టూ ఉన్నవారందరికి ఆనందాన్ని అందించగలుగుతాము.

ముగింపు: నిజమైన కరుణ దిశకు మార్గం

"కరుణ అనేది ఒక క్రియ" అని థిచ్ నాట్ హాన్ అన్నారు. ఇది మనం చురుకుగా పెంపొందించుకోవాల్సిన విషయం, స్పష్టంగా కష్టపడుతున్న వారికే కాకుండా మనం ఎదుర్కొనే ప్రతి ఒక్కరితో కూడా. చిన్న చిన్న దయగల పనుల ద్వారా, ఇతరుల బాధలను ప్రతిబింబించడం ద్వారా లేదా ప్రేమపూర్వక దయ ధ్యానం ద్వారా, మనలోని కరుణ అనే విత్తనం అన్ని జీవుల పట్ల నిజమైన శ్రద్ధ అనే పుష్పంగా వికసించగలదు.

మనుషులుగా, మన వ్యక్తిగత అవసరాలు మరియు కష్టాలలో మునిగిపోయి ఉంటాము, కానీ ఎవరు ఎవరనేది, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు లేదా వారి రూపం ఎలా అనేది చూసి, ప్రతి ఒక్కరు కూడా ఆనందం మరియు బాధ నుంచి ఉపశమనం కోరుకుంటారు. ఇక్కడ మనం మార్పు చేసేందుకు ప్రవేశించవచ్చు. మనం చిన్నదిగా భావించే విధంగా అయినా, బుద్ధుడు మనకు అన్ని విషయాలు మరియు వ్యక్తులు పరస్పరం సంబంధించి ఉంటాయని చెప్పారు. దీని అర్థం మనం అపరిచితులకు ఇచ్చే ప్రతి చిరునవ్వు మరియు ప్రేమపూర్వక దయ ధ్యానంలో మనం గడిపే ప్రతి నిమిషం అని అర్ధం, ఇవన్నీ మనపై మరియు మన చుట్టూ ఉన్నవారిపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి.

Top