సెర్కాంగ్ రింపోచే గారి మరణం మరియు అతని పునర్జన్మ

దలైలామా గురువు గారి ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు

సెర్కాంగ్ రింపోచే గారి మరణం అతని జీవితం కంటే చాలా గొప్పది. 1983, జూలైలో స్పితిలోని టాబో మఠంలో దలైలామా గురువు గారి కాలచక్ర సాధికారత ప్రదానం చెయ్యడాన్ని నిర్వహించారు. ఆ తర్వాత, టిబెటన్ జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇది గురువు గారు ఇబ్బందులు ఎదుర్కునే సంవత్సరం అని రింపోచే గారు అక్కడి స్థానిక సన్యాసి అయిన కచెన్ డ్రుబ్యెల్ కు చెప్పారు. గురువు గారి ప్రాణానికి ప్రమాదం ఉంది. ఈ ఇబ్బందులను తనపై వేసుకుంటే బాగుంటుంది అని అనుకున్నారు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని ఆ వృద్ధ సన్యాసికి చెప్పారు.

రింపోచే గారు తర్వాత మూడు వారాల పాటు కఠినమైన ధ్యాన రిట్రీట్ లోకి ప్రవేశించారు. ఆ తర్వాత సమీపంలోని ఒక టిబెట్ సైనిక శిబిరానికి వెళ్లి అక్కడి సైనికులకు భోధిసత్వ ప్రవర్తనను ఎలా పాటించాలో నేర్పించారు. రింపోచే గారు మొత్తం పాఠ్యాంశాన్ని చాలా కాలం పాటు నెమ్మదిగా బోధించాలని అనుకున్నారు, కాని వేగంగానే పూర్తి చేశారు. అనుకున్న దానికంటే చాలా రోజులు ముందుగానే ఆ క్యాంపు నుంచి వెళ్లిపోవాలనని, తను ఎక్కడికో వెళ్లాల్సి ఉందని చెప్పారు. 1983, ఆగస్టు 29న స్విట్జర్లాండ్ లోని జెనీవాకు వెళ్తున్నప్పుడు పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ చైర్మన్ యాసర్ అరాఫత్ కూడా అక్కడికి రావాల్సి ఉంది. అరాఫత్ పై ఏదొక ఉగ్రవాద చర్య జరిగే అవకాశం ఉందని పోలీసు అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. గురువు గారి భద్రతకు తాము హామీ ఇవ్వలేమని హెచ్చరించారు.

తన గురువు గారి జీవితానికి ఎదురయ్యే అడ్డంకులను తనే స్వీకరించడానికి సిద్ధపడ్డారు

రింపోచే గారు, గావాంగ్ ఆర్మీ క్యాంప్ నుంచి జీపులో బయలుదేరి వెళ్తూ టాబో మొనాస్టరీ దగ్గర కాసేపు ఆగారు. రింపోచే గారు కచెన్ డ్రుబ్యెల్ ను వాళ్లతో చేరమని కోరారు, కాని ఆ వృద్ధ సన్యాసి తాను అప్పుడే తన దుస్తులను ఉతుక్కున్నానని చెప్పాడు. ఏం ఫరవాలేదు, అండర్ స్కర్ట్ లో రమ్మని రింపోచే గారు చెప్పారు. అతను తన దుస్తులను జీపు పైభాగానికి కట్టి ఆరబెట్టుకుని వాళ్లతో కలిసి బయలుదేరాడు.

అలా వాళ్ళు స్పితి లోయలో లోతుగా వెళ్తుండగా, రింపోచే గారు గావాంగ్ తో మాట్లాడుతూ, కరుణ యొక్క మంత్రం, ఓం మణి పద్మే హమ్ అనే మంత్రాన్ని ఆపకుండా జపించమని చెప్పానని, కానీ అతను ఇది ఎప్పుడూ సీరియస్ గా తీసుకోలేదని చెప్పారు. ఇది ఆయన వీడ్కోలు సలహాగా అయ్యింది.

ఆ తర్వాత వాళ్ళు కై మొనాస్టరీ దగ్గర ఆగారు. రింపోచే గారు సమర్పణలు చెయ్యాలనుకున్నారు. అప్పటికే ఆలస్యమైందని, పొద్దున్నే వెళ్లొచ్చని గావాంగ్ చెప్పినా రింపోచే గారు పట్టుబట్టారు. చాలా సార్లు, రింపోచే గారు నెమ్మదిగా మరియు ఎంతో కష్టంతో నడిచేవారు. కానీ, కొన్ని సందర్భాల్లో, రింపోచే గారు పరుగెత్తగలిగేవారు. ఉదాహరణకు, ఒకసారి ఎయిర్ పోర్ట్ లో, మేము ఫ్లైట్ కు దాదాపు ఆలస్యం అయినప్పుడు, రింపోచే గారు చాలా వేగంగా పరిగెత్తారు, మేము ఎవరూ అతనిని అందుకోలేకపోయాము. అదే విధంగా ఒకసారి బోధ్ గయాలో బుద్ధుని మాటల వంద సంపుటాల టిబెటన్ అనువాదాన్ని (కాంగ్యూర్) గురువు గారు సామూహిక పఠనంలో పాల్గొన్నప్పుడు, రింపోచే గారు నాతో పాటు ఆయన ప్రక్కన కూర్చున్నారు. గాలి దేవుని లూజ్-లీఫ్ టెక్స్ట్ నుంచి ఒక పేజీని కింద పాడినప్పుడు, రింపోచే గారు వెంటనే దాన్ని నేలపై నుంచి తియ్యడానికి పరిగెత్తుకుంటూ వెళ్లారు. సాధారణంగా, అతను లేవడానికి సహాయం తీసుకునేవారు. కై మొనాస్టరీలో అదే విధంగా, రింపోచే గారు ఏ సహాయం లేకుండా, నిటారుగా ఉన్న పర్వత మార్గం మీదుగా వేగంగా పరిగెత్తుకుని వెళ్ళారు.

రింపోచే గారు తన నైవేద్యాలను సమర్పించుకున్న తర్వాత, కై సన్యాసులు అతనిని ఆ రాత్రి అక్కడే ఉండమని అడిగారు. ఆ రాత్రి కైబార్ గ్రామానికి వెళ్లాలని చెప్పి రింపోచే గారు ఒప్పుకోలేదు. ఆయన్ని మళ్లీ చూడాలనుకుంటే వాళ్ళు అక్కడికి వెళ్లాల్సిందే. ఆ తర్వాత ఏం జరగబోతోందో ఇండైరెక్ట్ గా మెసేజ్ ఇస్తూ వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

రింపోచే గారు మరియు అతని గ్రూప్ ఎత్తులో ఉండే గ్రామం కైబార్ కు చేరుకున్నప్పుడు, తమకు తెలిసిన ఒక రైతు ఇంటికి వెళ్లారు. ఆ వ్యక్తి ఇంకా తన పొలంలో ఉన్నాడు మరియు ఎటువంటి అతిథులు వస్తున్నట్టు అతనికి తెలీదు. రింపోచే గారు అతనిని వచ్చే వారం రోజులు బిజీగా ఉన్నారా లేదా అని అడిగారు. ఆ రైతు లేదు అని చెప్పి రింపోచే గారిని ఆహ్వానించాడు.

ధ్యానంలో రింపోచే గారు చనిపోయిన సాయంత్రం

స్నానం చేసి కొంత పెరుగు తిన్న తర్వాత, రింపోచే గారు జ్ఞాపకం నుండి సోంగ్ ఖాపా యొక్క వివరణాత్మక మరియు ఖచ్చితమైన అర్థాల యొక్క అద్భుతమైన సారాంశాన్ని చదివారు, దీనికి అతనికి సుమారు రెండు గంటలు పట్టింది. తర్వాత, అతను గావాంగ్ ను పిలిచి తనకు ఆరోగ్యం బాగోలేదని చెప్పారు. అప్పుడు అతను గావాంగ్ భుజంపై తన తలను ఉంచారు - ఇలా రింపోచే గారు సాధారణంగా ఎప్పుడూ చెయ్యరు. జరిగేది చూస్తుంటే ఆయన వీడ్కోలు చెప్తున్నట్టుగా అనిపించింది. ఏం జరుగుతుందో చూడటం చోండ్జేలాకు చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి దీనికి ముందే చోండ్జేలాను సిమ్లాకు పంపించారు. అతను ఆరేళ్ల వయస్సు నుంచి రింపోచే గారితో ఉన్నాడు మరియు రింపోచే గారు అతన్ని తన కొడుకులా పెంచారు.

డాక్టర్ ను పిలవాలా లేదా ఏదైనా మందులు తీసుకురావాలా అని గావాంగ్ అడిగాడు, కాని రింపోచే గారు వద్దు అని చెప్పారు. నేను ఇంకేదైనా చెయ్యగలనా అని గావాంగ్ అడిగాడు, అప్పుడు రింపోచే గారు టాయిలెట్ వరకు తీసుకెళ్లామని కోరారు, అతను సహాయం చేశాడు. అప్పుడు రింపోచే గారు తన మంచం తయారు చెయ్యమని గావాంగ్ ను అడిగారు. అతను ఎప్పుడూ పడుకునే సాధారణ పసుపు షీట్ కు బదులుగా, రింపోచే గారు గావాంగ్ ను తెల్లని షీట్ వెయ్యమని కోరారు. తాంత్రిక అభ్యాసంలో, పసుపును ఇతరులకు సహాయం చేసే సామర్థ్యాన్ని పెంచడానికి ఆచారాలకు ఉపయోగిస్తారు, తెలుపు అడ్డంకులను శాంత పరచడానికి ఉపయోగిస్తారు.

అప్పుడు రింపోచే గారు గావాంగ్ మరియు కచెన్ డ్రుబ్యెల్ ను తన పడకగదికి రమ్మని కోరారు, వాళ్ళు అక్కడికి వచ్చారు. అప్పుడు రింపోచే గారు తన కుడి వైపున, బుద్ధుని నిద్ర భంగిమలో పడుకున్నారు. మామూలుగా నిద్రపోయేటప్పుడు ఉండే భంగిమకు బదులుగా, తాంత్రిక శాస్త్రం ప్రకారం పడుకున్నారు. ఆ తర్వాత అతను లోతుగా శ్వాస తీసుకోవడం ప్రారంభించాడు మరియు "ఇవ్వడం మరియు తీసుకోవడం" (టాంగ్లెన్) అనే ధ్యాన ప్రక్రియ ద్వారా మరణించారు. ఆ సమయంలో అరవై తొమ్మిదేళ్ల వయసున్న ఆయన సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉన్నారు. రెండు నెలల క్రితం ఢిల్లీలో వైద్య పరీక్షల కోసం నేనే ఆయనను తీసుకెళ్లాను.

సరిగ్గా ఆ సమయంలో జెనీవాకు విమానంలో వెళ్తుండగా గురువు గారు, చైర్మన్ అరాఫత్ హఠాత్తుగా మనసు మార్చుకుని స్విట్జర్లాండ్ పర్యటనను వాయిదా వేసుకున్నారు. దీంతో విమానాశ్రయంలో ఉగ్రవాద దాడి ప్రమాదం ఏమీ జరగలేదు. ఆయన ప్రాణాలకు ముప్పు లేకపోయినప్పటికీ ఎయిర్ పోర్టు నుంచి హోటల్ కు వెళ్లే దారిలో ఆయన వాహనం మాయమయ్యింది. అయితే, గురువు గారికి ఎలాంటి హాని జరగలేదు. సెర్కాంగ్ రింపోచే గారు తన జీవితానికి ఉన్న అవరోధాన్ని విజయవంతంగా ఎదుర్కొని తన ప్రాణశక్తిని గురువు గారికి అందించారు.

అడ్డంకులను అధిగమించడానికి ఉపయోగించే ఇవ్వడం మరియు తీసుకునే రకపు ధ్యానం

ఇవ్వడం మరియు తీసుకునే రకపు ధ్యానం అనేది ఇతరుల కష్టాలను తీసుకుని వారికి ఆనందాన్ని అందించే అధునాతన భోధిసత్వ పద్ధతి.  రింపోచే గారు ఈ అభ్యాసాన్ని బోధించినప్పుడల్లా, మన జీవితాలను త్యాగం చేసే స్థాయికి వచ్చినా ఇతరుల బాధను స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. తన సొంత జిల్లాలో ఒకరి తలకు గాయమై, దాని ఫలితంగా మరణించిన ఒక వ్యక్తి గురించి కును లామా రింపోచే గారు ఇచ్చిన ఉదాహరణను ఆయన ఎప్పుడూ చెప్పేవారు. మీరు దీన్ని చేస్తే అది వృథా కాదా అని మేము రింపోచే గారిని అడిగినప్పుడు, ఆయన లేదు అని సమాధానం ఇస్తారు. ప్రపంచ ప్రగతి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఆస్ట్రోనాట్ లా ఉంటుందని ఆయన చెప్పారు. వీరోచిత ఆస్ట్రోనాట్ యొక్క ఉదాహరణ మరియు కీర్తి అతని కుటుంబానికి గణనీయమైన ప్రభుత్వ పింఛనుకు హామీ ఇచ్చినట్లే, లామా త్యాగం యొక్క వీరోచిత ఉదాహరణ కూడా అతని శిష్యుల ఆధ్యాత్మిక పోషణను అందిస్తుంది అని చెప్పారు.

మూడు రోజుల పాటు మృత్యువు ధ్యానంలో ఉండడం 

సెర్కాంగ్ రింపోచే గారు మూడు రోజుల పాటు స్పష్టమైన వెలుగులో మరణ-దశ ధ్యానంలో ఉన్నారు. వారి పునర్జన్మలను నిర్దేశించే సామర్థ్యం ఉన్నవారు సాధారణంగా పునర్జన్మ లామాల వరుసను సృష్టించే లేదా కొనసాగించే ప్రక్రియలో భాగంగా ఈ ధ్యానంలోకి ప్రవేశిస్తారు. ఈ ధ్యానం చేసేటప్పుడు, వారి హృదయాలు వెచ్చగా ఉంటాయి మరియు వారు శ్వాస తీసుకోవడం ఆపివేసినప్పటికీ వారి శరీరాలు కుళ్లిపోకుండా ఉంటాయి. సాధారణంగా, గొప్ప లామాలు చాలా రోజుల వరకు ఈ స్థితిలో ఉంటారు, ఆ తర్వాత వారి తలలు కుంగిపోయి, రక్తం నాసికా రంధ్రాల నుంచి బయటకు వస్తుంది, ఇది వారి స్పృహ వారి శరీరాలను విడిచి వెళ్లిందని సూచిస్తుంది.

సెర్కాంగ్ రింపోచే గారితో ఈ సంకేతాలు కనపడినప్పుడు, ఇంద్రధనుస్సు ఆకాశంలో మెరిసింది మరియు అతని దహన సంస్కారాలకు ఎంచుకున్న బంజరు కొండపై అద్భుతమైన వెలుగులు కనిపించాయి. అంత్యక్రియలకు సన్యాసులు రావాలని ధర్మశాలలోని నామ్ గ్యాల్ మఠానికి ప్రజలు సమాచారం పంపినప్పటికీ వాళ్ళు సమయానికి అక్కడికి చేరుకోలేకపోయారు. రింపోచే గారు కోరుకున్నట్లుగా స్పితి సన్యాసులు అతని కర్మకాండలు జరిపారు. కొద్దిసేపటికే ఆ పూడ్చిపెట్టిన చోటు నుంచి వైద్య శక్తులతో ఉన్న మంచినీటి ధార ఏరులైపారింది. ఇప్పటికీ అది ప్రవహిస్తూ ఉంది, దాన్ని ఒక తీర్థ యాత్రా స్థలంగా మార్చబడింది. సరిగ్గా తొమ్మిది నెలల తర్వాత, 1984, మే 29 న, రింపోచే గారు మరోసారి స్పితిలో, ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు.

ఆయన పునర్జన్మను డైరెక్ట్ చెయ్యడం

చాలా సంవత్సరాల క్రితం, రింపోచే గారు సెరింగ్ చోడ్రాగ్ మరియు కుంజాంగ్ చోడ్రాన్ అనే జంటను కలుసుకున్నారు, వారిద్దరూ ఆయనను బాగా ఆకట్టుకున్నారు. వాళ్ళు చాలా బలమైన ధర్మ అభ్యాసకులు, సన్యాసిగా మరియు సన్యాసినిగా మారాలనేదే వారి గట్టి కోరిక అని వారు రింపోచే గారికి చెప్పారు. ఒక యువ కుటుంబంతో పెద్దలుగా ఉంటూ సన్యాస జీవితంలో చేరడం వల్ల అనేక సమస్యలు వస్తాయని ఆ స్థానిక గ్రామ పెద్దలు దీన్ని ఒప్పుకోలేదు. వాళ్ళు ముందుగా తమ పిల్లలను జాగ్రత్తగా పెంచుకోవాలి. రింపోచే గారు ఆ మాటను సమర్థించారు. ఈ దంపతులు రింపోచే గారిని తమ నాలుగవ సంతానంగా జన్మను ప్రసాదించింది.

మరణ-దశ ధ్యానంలో ప్రావీణ్యం పొందిన ఒక గొప్ప లామా యొక్క పునర్జన్మను కనిపెట్టడానికి శిష్యులు వివిధ మార్గాలను ఉపయోగిస్తారు. ఈ పద్ధతులలో కన్సల్టింగ్ ఒరాకిల్స్ మరియు అత్యంత సాకారమైన మాస్టర్ల కలలు ఉన్నాయి. అప్పుడు ఆఖరి అభ్యర్థి చనిపోయిన లామా యొక్క అనేక వస్తువులను సరిగ్గా గుర్తించాల్సి ఉంటుంది. అయితే దలైలామా మాత్రం ఇలాంటి మార్గాలపై ఆధారపడవద్దని హెచ్చరించారు. ఆ పిల్లవాడు సీరియస్ అభ్యర్థిగా పరిగణించబడే ముందు అతని లేదా ఆమె గుర్తింపు యొక్క స్పష్టమైన సంకేతాలను ఇవ్వాలి.

రింపోచే గారి పునర్జన్మను గుర్తించడం

స్పితి ప్రజలు సెర్కాంగ్ రింపోచే గారిని ఒక సాధువుతో సమానంగా భావిస్తారు: దాదాపు ప్రతి ఇంట్లో అతని బొమ్మ ఉంటుంది. చిన్న సెర్కాంగ్ రింపోచే గారు మాట్లాడగలిగిన వెంటనే, అతను తన తల్లిదండ్రుల ఇంటి గోడపై ఉన్న రింపోచే గారి చిత్రాన్ని చూపిస్తూ, "అది నేను!" అని అన్నారు. ఆ తర్వాత చిన్న పిల్లవాడిని చూసేందుకు ఇంటికి వెళ్లిన గావాంగ్ వెంటనే ఆయన అతని దగ్గరకు పరిగెత్తాడు. తనతో కలిసి తిరిగి తన మఠానికి వెళ్లాలని అనుకున్నాడు.

అతనెవరో ఎవరికీ అనుమానం రాలేదు. ఏదేమైనా, కొన్ని సంవత్సరాల క్రితం, ఒక ప్రముఖ స్పితి మహిళల బృందం వచ్చేసారి తమ లోయలో పునర్జన్మ తీసుకోవాలని రింపోచే గారిని అభ్యర్థించింది. తమ మారుమూల సరిహద్దు జిల్లాను సందర్శించడానికి భారత ప్రభుత్వం నుంచి అనుమతి పొందడం ఎప్పుడూ సమస్యగానే ఉండేది. అటువంటి పునర్జన్మ ప్రతి విషయాన్ని సులభతరం చేస్తుంది. అతని తల్లిదండ్రులు ఎంతో గౌరవించబడ్డారు, వారి సమ్మతిని తెలియజేశారు మరియు, నాలుగు సంవత్సరాల వయస్సులో, చిన్న రింపోచే గారు ధర్మశాలకు బయలుదేరారు. తన తల్లిదండ్రులు అప్పుడప్పుడు తన వద్దకు వస్తున్నా, ఆ పిల్లవాడు వాళ్ళను ఎప్పుడూ గుర్తుచేసుకోలేదు, వారిని కూడా మిస్ అయినట్లు కనిపించలేదు. మొదటి నుంచి తన పాత ఇంటి సభ్యులతో కలిసి ఉంటేనే తనకు ఇంట్లోనే ఉన్న ఫీలింగ్ కలిగింది. వాళ్లే అతని హృదయానికి దగ్గరగా ఉన్న కుటుంబం.

మా మొదటి సమావేశంలో నన్ను గుర్తించిన అతని యువ పునర్జన్మ

రింపోచే గారు మొదటిసారి ధర్మశాలకు వచ్చినప్పుడు నేను భారతదేశం నుంచి ఉపన్యాస పర్యటన చేస్తూ ఉన్నాను. కొన్ని నెలల తర్వాత, నేను తిరిగి వచ్చాక, నేను ఆయనను చూడటానికి వెళ్ళాను, అతిగా ఏమీ ఆశించకుండా లేదా అనుమానించకుండా ఉండడానికి ప్రయత్నించాను. నేను రింపోచే గారి గదిలోకి ప్రవేశించగానే, నేను ఎవరో మీకు తెలుసా అని గావాంగ్ ఆ బాలుడిని అడిగాడు. దానికి ఆ పిల్లవాడు "పిచ్చిగా మాట్లాడకు. అవును, ఇతను ఎవరో నాకు తెలుసు!" అని వాటికన్ లో పాత సెర్కాంగ్ రింపోచే, పోప్ ల మధ్య జరిగిన సమావేశానికి నేను అనువదించిన ఫోటో తన సిట్టింగ్ రూమ్ గోడకు వేలాడదియ్యబడి ఉన్న దాన్ని చూపించారు. బహుశా దాని నుంచి అతను నన్ను గుర్తుపట్టి ఉంటారని నేను అనుకున్నాను. అయినా కానీ, మేము కలుసుకున్న క్షణం నుంచి, చిన్న రింపోచే గారు నన్ను ఒక కుటుంబ సభ్యుడిలా పూర్తి పరిచయంతో బాగా చూసుకున్నారు. నాలుగేళ్ల పిల్లవాడు అలాంటి విషయాన్ని ఫేక్ చెయ్యలేడు. అన్నింటికంటే ఈ విషయం అతను ఎవరో నాకు నమ్మకం కలిగేలా చేసింది.

1998వ సంవత్సరంలో పద్నాలుగేళ్ల రింపోచే గారు

ఇప్పుడు, 1998 లో, కొత్త సెర్కాంగ్ రింపోచే గారికి పద్నాలుగేళ్లు. ముండ్గోడ్ లోని తన మఠంలో ఎక్కువగా నివసిస్తూ అక్కడే చదువుకుంటూ, సంవత్సరానికి ఒకటి లేదా రెండుసార్లు గురువు గారు బోధనలు ఇస్తున్నప్పుడు ధర్మశాలకు వస్తూ ఉంటారు. చోండ్జెయిలా మరియు రింపోచే గారి పాత వంటమనిషి మరణించారు మరియు గావాంగ్ అన్నిటినీ వదిలేసి, వివాహం చేసుకుని ఇప్పుడు నేపాల్ లో నివసిస్తున్నారు. రింపోచే గారిని చూసుకోవడానికి ఒక కొత్త సన్యాసుల కుటుంబం ఉంది. వారందరినీ అతను తన పూర్వ జన్మలోనే ఎంచుకున్నారు. ఉదాహరణకు, అతను స్పితి మరియు కిన్నౌర్ నుంచి ఇద్దరు పదేళ్ల వయసు ఉన్న పిల్లలను తన జీవితంలో చివరి కొన్ని నెలల్లో తన ఇంటిలో తనతో ఉండడానికి ఎంచుకున్నారు.

అతను తన పూర్వీకుల మాదిరిగానే హాస్యాన్ని కలిగి ఉన్నప్పటికీ మరియు అదే ఆచరణాత్మక ఉదారపు విధానాన్ని పంచుకున్నప్పటికీ, యువ సెర్కాంగ్ రింపోచే గారు తన స్వంత వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారు. ఒక జన్మ నుంచి మరో జన్మ వరకు కొనసాగేది ప్రతిభ, అభిరుచులు, కర్మ సంబంధాలు. అతనితో నా సంబంధంలో, నేను కెప్టెన్ కిర్క్ యొక్క ఒరిజినల్ స్టార్ ట్రెక్ బృందంలో ఉండే ఒక సభ్యుడిలా భావిస్తాను, అతను ఇప్పుడు స్టార్ ట్రెక్: ది నెక్ట్స్ జనరేషన్ యొక్క కెప్టెన్ పికార్డ్ తో చేరాడు. ఇప్పుడు అంతా మారిపోయింది, కానీ కొనసాగుతూనే ఉంటుంది.

రింపోచే గారి పెంపకంలో సహాయకుడిగా ఉండడం

ఇప్పటివరకు, నేను సెర్కాంగ్ రింపోచే గారి పెంపకంలో సహాయకుడి పాత్రను పోషించాను. పాత రింపోచే గారు ప్రధానంగా తన సొంత ప్రజలకు సేవ చెయ్యాలని కోరుకునేవారని నేను భావించాను. చాలా మంది గొప్ప లామాలు పాశ్చాత్య దేశాలలో లేదా ఆసియాలోని తమ సాంప్రదాయ సాంస్కృతిక రంగానికి బయట బోధనకు తమను తాము అంకితం చేసుకున్నారు, ఇది టిబెటన్లకు హాని కలిగిస్తుంది. బౌద్ధమతం యొక్క టిబెటన్ రూపం దాని పూర్తి రూపంలో బతికి ఉండాలంటే, భవిష్యత్ తరాల టిబెటన్లకు మంచి శిక్షణ అవసరం. ఎందుకంటే, ప్రస్తుతం, పూర్తి బౌద్ధమత బోధనలు టిబెటన్ భాషలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. నా శిక్షణ మరియు సొంత-అభివృద్ధికి ఊహించిన ఉత్తమ పరిస్థితులను రింపోచే గారు నాకు అందించారు. అతని దయకు ప్రతిఫలంగా, నేను అతని కోసం అదే చెయ్యటానికి ప్రయత్నిస్తున్నాను.

సాంస్కృతిక సంఘర్షణను నివారించడానికి, నేను రింపోచే గారి ఆధునిక విద్యలో పాల్గొనలేదు. మేము కలిసినప్పుడల్లా మా మధ్య సన్నిహిత సంబంధం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, నేను ఉద్దేశపూర్వకంగా అతనితో ఎక్కువ సంబంధాన్ని పెట్టుకోలేదు. దానికి బదులుగా, భారతదేశంలోని టిబెటన్ పాఠశాలలు ఉపయోగించే అదే పాఠ్య ప్రణాళికను అనుసరిస్తూ, స్థానిక టిబెటన్ బోధకులు అతనికి ఇంగ్లీష్, సైన్స్ మరియు సోషల్ స్టడీస్ బోధించడానికి ఏర్పాట్లు చెయ్యడానికి నేను సహాయం చేశాను. దాని కారణంగా రింపోచే గారు తన ప్రజలతో పూర్తిగా కలిసిపోగలరు అని అనుకున్నాను. నేను అతన్ని పాశ్చాత్య దేశాలకు తీసుకెళ్లలేదు లేదా అతనికి కంప్యూటర్ లేదా వీడియో ప్లేయర్ ను కొనిపెట్టలేదు, మరియు ఇతరులు అతనికి వీటిని ఇవ్వకుండా చూసుకున్నాను. చాలా మంది యువ పునర్జన్మ లామాలు వారి సాంప్రదాయ సన్యాస అధ్యయనాల కంటే కంప్యూటర్ గేమ్స్ మరియు యాక్షన్ వీడియోలు ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటాయని అనుకుంటారు.

మరోసారి ఆయన శిష్యుడిగా మారడానికి నా ప్రార్థన

నా పనులు ఎంతగా సహాయపడ్డాయో నాకు తెలియదు, కానీ రింపోచే గారు లోతైన భద్రతా భావాన్ని ప్రదర్శిస్తారు మరియు తన స్వంత వాతావరణంలో పూర్తిగా సౌకర్యవంతంగా ఉంటారు. ఇది అతనికి మరియు భవిష్యత్తులో అతన్ని కలిసే వాళ్ళకు మాత్రమే ప్రయోజనకరంగా ఉంటుంది. అతను మెచ్యూరిటీకి చేరుకున్నప్పుడు పాశ్చాత్య దేశాల గురించి తనకు తానే నేర్చుకోగలడు. వచ్చే జన్మలో కూడా మరోసారి ఆయనకు శిష్యుడిని కావాలని నేను ప్రార్థిస్తున్నాను.

Top