సెంజాబ్ సెర్కాంగ్ రింపోచే గారు, 14వ దలైలామా గారి ప్రధాన గురువులలో ఒకరు, మరియు డాక్టర్. బెర్జిన్ గారి ప్రధాన గురువు. ఆయన ఉదారపు వ్యవహార శైలి, ఆచరణాత్మక దృక్పథం, గొప్ప హాస్య చతురత టిబెట్, పాశ్చాత్య దేశపు విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. టిబెటన్ బౌద్ధమతం యొక్క అన్ని సంప్రదాయాలలో గొప్ప గురువు అయిన అతను ఒక పండితుడు, నిష్ణాతుడైన అభ్యాసకుడు, నైపుణ్యం, మరియు దయగల ఉపాధ్యాయుడి లక్షణాలను కలుపుకుని ఉన్న వ్యక్తి. ఇక్కడ, డాక్టర్. బెర్జిన్ తన సన్నిహిత శిష్యుడిగా, అనువాదకుడిగా మరియు ఆంగ్ల కార్యదర్శిగా తను గడిపిన తొమ్మిదేళ్ల జ్ఞాపకాలను పంచుకున్నారు.