ఒక ఆధ్యాత్మిక గురువుపై నమ్మకం మరియు హృదయపూర్వక నిబద్ధతను పెంపొందించుకోవడం
ఒక ఆధ్యాత్మిక గురువు పట్ల హృదయపూర్వక నిబద్ధత అనేది అత్యంత కష్టమైన మరియు సున్నితమైన బౌద్ధమత అభ్యాసాలలో ఒకటి. ఇది సరిగ్గా స్థాపించబడటానికి మరియు నిర్వహించడానికి చాలా శ్రద్ధ అవసరం. ఒక్కసారి సౌండ్ బేసిస్ లో సెట్ చేస్తే దాన్ని ఎవరూ మార్చలేరు. సెర్కాంగ్ రింపోచే గారు తనకూ, నాకూ మధ్య ఇలాగే ఉండాలని చాలా కష్టపడ్డారు. ఒక సాయంత్రం, ముండ్గోడ్ లో గొప్ప మోన్లాం ఉత్సవం ఆఖరిలో, రింపోచే గారు అక్కడ తన ఆస్తి యొక్క ఆర్థిక పరిస్థితుల గురించి సంక్లిష్టమైన కథను నాకు చెప్పారు. అతని ఇతర సహాయకులు ఇది అనవసరమని భావించినప్పటికీ, నేను అది తెలుసుకోవడం చాలా ముఖ్యం అని రింపోచే గారు చెప్పారు. ఆ తర్వాత, ఈ సమస్య గురించి అసూయతో కూడిన వర్గాల నుంచి నేను కొన్ని తప్పుడు పుకార్లు విన్నప్పటికీ, అతని నిజాయితీ గురించి లేదా నా హృదయపూర్వక నిబద్ధత గురించి నాకు ఎలాంటి సందేహం రాకుండా చూసుకోవాలని అతను కోరుకున్నారు.
ఒక ఆధ్యాత్మిక గురువు పట్ల పూర్తి హృదయపూర్వక నిబద్ధత ఉండాలంటే ఆ శిష్యులు మరియు గురువుల మధ్య సమగ్రమైన మరియు సుదీర్ఘమైన పరస్పర పరిశీలన అవసరం. ఆ పరిశీలన తర్వాత, శిష్యులు తమ లామాలను బుద్ధుడిగా చూడవలసి ఉన్నప్పటికీ, ఆధ్యాత్మిక గురువులు తప్పు చెయ్యలేరని దీని అర్థం కాదు. శిష్యులు ఎప్పుడూ గురువులు ఏమి చెబుతున్నారో చెక్ చెయ్యాలి మరియు అవసరమైతే, మర్యాదగా సూచనలను ఇవ్వాలి. ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటూ, వారి లామాలు వింతగా ఏమి మాట్లాడినా లేదా ఏమి చేసినా వాటిని వాళ్ళు గౌరవంగా సరిదిద్దుకోవాలి.
ఒకసారి, రింపోచే గారు ఫ్రాన్స్ లోని నలందా ఆశ్రమంలోని పాశ్చాత్య సన్యాసులకు ఈ విషయాన్ని చెప్పడానికి ప్రయత్నించారు. ఆ ప్రసంగం సమయంలో, అతను ఉద్దేశపూర్వకంగా ఒక తప్పును చెప్పారు. ఆయన చెప్పింది విడ్డూరంగా ఉన్నప్పటికీ, సన్యాసులందరూ ఆయన మాటలను గౌరవపూర్వకంగా తమ నోట్ బుక్ లలో కాపీ చేసుకున్నారు. ఆ తర్వాతి సెషన్ లో, రింపోచే గారు ఆ సన్యాసులను తిట్టారు, చివరి గంటలో అతను హాస్యాస్పదమైన, తప్పు పద్ధతిలో ఏదో వివరించారు. ఆయనను ఎవరూ ఎందుకు ప్రశ్నించలేదు? బుద్ధుడు స్వయంగా సలహా ఇచ్చినట్లుగా, గురువు చెప్పేదాన్ని గుడ్డిగా, విమర్శనాత్మకంగా అంగీకరించకూడదని ఆయన వారికి చెప్పారు. గొప్ప గురువులు కూడా అప్పుడప్పుడు తప్పులు చెప్తుంటారు. అనువాదకులు తరచుగా తప్పులు చేస్తారు; మరియు విద్యార్థులు ఎప్పుడూ అస్పష్టమైన మరియు గందరగోళమైన నోట్స్ లను తీసుకుంటారు. ఏదైనా వింతగా అనిపిస్తే, వాటిని గొప్ప గ్రంథాలకు వ్యతిరేకంగా ప్రతి అంశాన్ని ప్రశ్నించాలి మరియు చెక్ చెయ్యాలి.