ఉపాధ్యాయులు మరియు అనువాదకులు కొన్నిసార్లు తప్పులు చేస్తారు

అనువాదకులు అప్పుడప్పుడు తప్పులు చేస్తూ ఉంటారు. మీకు చెప్పినది, రాసినది లేదా మీ రికార్డర్లలో ఉన్న వాటిపై గుడ్డిగా ఆధారపడకూడదు. అది అవివేకం. అదే విధంగా, నేను బోధిస్తున్నప్పుడు, నేను నాలుక జారగలను లేదా కొన్నిసార్లు ఏదైనా తప్పుగా చెప్పగలను. ఆ సమయాల్లో, మీరు మీ రికార్డర్లో తర్వాత విన్న వాటిని గుడ్డిగా నమ్మెయ్యకూడదు. బుద్ధుడు తన బోధనలకు సంబంధించి చెప్పినట్లు, నేను చెప్పినంత మాత్రాన మీరు దేనినైనా అంగీకరించకూడదు, కానీ మీరు దాన్ని బంగారాన్ని పరీక్షించే విధంగా విశ్లేషించాలి. విశ్వాసం మీద ఆధారపడవద్దు లేదా రికార్డర్ లో ఉన్న ప్రతి దాన్ని నమ్మెయ్యవద్దు.

తొమ్మిదవ భోధిసత్వ భూమి స్థాయిని సాధించే వరకు మీరు తప్పులు చేస్తూనే ఉంటారు. మీరు ఈ తొమ్మిదవ స్థాయి మనస్సును సాధించిన తర్వాత మాత్రమే విషయాలను వివరించేటప్పుడు తప్పులు చేయడం మానేస్తారు. ఆ సమయంలోనే మీరు నాలుగు ఖచ్చితమైన మరియు సంపూర్ణ అవగాహనలను పొందుతారు. ఒక్కసారి మీరు ఆ వాస్తవికతను తెలుసుకున్న తర్వాత, మీరు ఇంక ఎలాంటి తప్పులను చెయ్యరు.

ఉదాహరణకు భోధిసత్వ ప్రవర్తనలో నిమగ్నం కావడం, బోధిచర్యావతార అనే ఈ బోధన ప్రారంభంలో, అది ఎలా అనువదించబడిందో నాకు తెలియకపోయినా, నేను చెప్పింది ఏమిటంటే, కును లామా రింపోచే గారి బుద్ధపాలిత యొక్క సంస్కృత గ్రంధాలను చదివి బోధ్గయలో రెండు సంవత్సరాలు గడిపినప్పుడు, ఆ గ్రంథం టిబెటన్ భాషలోకి అనువదించబడలేదు. అక్కడ నేను కొంచెం తప్పుగా చెప్పాను. నా ఉద్దేశ్యం ఆ నిర్దిష్ట గ్రంధం, ఆ నిర్దిష్ట ముద్రణ టిబెటన్ భాషలోకి అనువదించబడలేదు అని. బుద్ధపాలిత గ్రంథం టిబెటన్ భాషలోకి అనువదించబడలేదనే మాట సరైనది కాదు. జె సోంగ్ ఖాపా గారు ఆ గ్రంథాన్ని అధ్యయనం చేసి, దాని నుంచి తన సాక్షాత్కారాన్ని పొందాడని నేను చెప్పినట్లు మీకు గుర్తుండే ఉంటుంది. మీరు నన్ను చెక్ చేసి ప్రశ్నలు అడగాలి ఎందుకంటే ఈ ప్రక్రియలు అలానే చెయ్యబడతాయి. ఇలా ఒక్కోసారి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి.

ఉదాహరణకు, మొన్న నేను మొదటిసారిగా ప్రాసంగిక మరియు చిత్తమాత్ర పాఠశాలలలో బోధించినప్పుడు, సత్రంతిక పాఠశాలలో, మీరు లోతైన వాస్తవ దృగ్విషయాలకు మూడు పర్యాయపదాల సమూహాన్ని తెలుసుకున్నారని నేను సరిగ్గానే చెప్పాను: కండిషన్డ్ ఫినామినా, ఆబ్జెక్టివ్ ఎంటిటీలు మరియు నాన్ స్టాటిక్ ఫినామినా అని. కన్వెన్షనల్ ట్రూ ఫినామినాలకు మీకు మరొక పర్యాయపదం ఉందని కూడా నేను చెప్పాను: అవే అన్ కండిషన్డ్ ఫినామినా, మెటాఫిజికల్ ఎంటిటీలు మరియు స్టాటిక్ ఫినామినా. చిత్తమాత్ర పాఠశాలలో, మీరు ఇతర శక్తితో కూడిన, పూర్తిగా స్థాపించబడిన మరియు పూర్తిగా ఊహాజనిత ఫినామినాలను ప్రదర్శించారని నేను చెప్పాను. ఆ సిస్టంలో, పూర్తిగా ఊహాజనిత ఫినామినాలు నిజంగా స్థాపించబడిన, తిరుగులేని ఉనికిని కలిగి ఉండవు. నిన్న, నేను ఆ విషయాన్ని సమీక్షించినప్పుడు, అది ఆ విధంగా అనువదించబడనప్పటికి - అనువాదకుడు స్వయంగా దాన్ని సరిదిద్దుకున్నాడు - నేను నన్ను నేను సరిదిద్దుకున్నాను ఎందుకంటే నేను రెండు రకాల నిజమైన ఫినామినాలకు పర్యాయపదాల సెట్ల నియామకాన్ని మార్చాను. ఈ విధంగా తప్పు చాలా సులభంగా జరిగిపోతూ ఉంటుంది. 

మీరు చూసే, వినే, చదివే మరియు చేసే ప్రతి దాన్ని ఎప్పుడూ చెక్ చేసుకుంటూ ఉండాలి. బోధించేవాడిగా కూడా, నేను చెప్పిన దాన్ని సమీక్షించి, నేను ఏవైనా తప్పులు చేశానా లేదా అని చూసుకుంటాను. అదే విధంగా, ఆ బోధనలను వినే శ్రోతల విషయంలో కూడా అలాగే ఉండాలి. 

Top