ప్రజలు బౌద్ధమతం వైపు ఎందుకు ఆకర్షించబడుతున్నారు

08:12
మన ఆధునిక కాలంలో ఎక్కువ మంది బౌద్ధమతం వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు? నిజానికి, దీనికి చాలా రకాల కారణాలు ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ చాలా రకాల ప్రజలు ఉన్నారు మరియు ప్రతి ఒక్కరూ చాలా వేరుగా ఉంటారు. కానీ ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు బౌద్ధమతం వైపు మొగ్గు చూపుతున్నారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే వారి జీవితాలలో ఎక్కువ సమస్యలు ఉన్నాయని వారు గుర్తిస్తున్నారు.

ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల రకాలు

ఈ భూమ్మీద మనుషులు ఉన్నంత కాలం, బహుశా అంతకు ముందు నుంచి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి: సంబంధాలలో ఉండే సమస్యలు, కోపం వల్ల, గొడవల వల్ల, వివాదాల వల్ల వచ్చే సమస్యలు లాంటివి. ఇవి ప్రతి ఒక్కరూ దాదాపు ఎప్పుడూ ఎదుర్కొంటున్న సమస్యలే. కాబట్టి మీరు లేదా నేను ఇప్పుడు అనుభవిస్తున్న దాని గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పనవసరం లేదు. ఆర్థిక సమస్యలు, యుద్ధాల సమస్యలు లాంటివి ఇంకా కష్టతరం చేసే ప్రస్తుత సమస్యలు కూడా ఉన్నాయి. ప్రజలు ఈ సమస్యలను ఎక్కువగా అనుభవిస్తున్నారు. వాటికి పరిష్కారాలు కనిపెట్టడం లేదు, లేదా వ్యక్తిగత స్థాయిలో, ముఖ్యంగా వారి భావోద్వేగాలు మరియు వారి మనస్సుల పరంగా వాటిని ఏం చెయ్యాలో కనిపెట్టడం లేదు. ఇప్పటికే అందుబాటులో ఉన్న వాటి నుంచి ఈ సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు.

కానీ ఆధునిక కాలంలోని అద్భుతమైన పరిణామాలలో ఒకటి కమ్యూనికేషన్, ముఖ్యంగా మనం ఇప్పుడు సమాచార యుగం అని పిలుస్తున్న దానిలో, మరియు సోషల్ మీడియా యుగంతో ఇది వచ్చింది. అంటే అనేక ప్రత్యామ్నాయ వ్యవస్థల గురించి మనకు ఎక్కువ సమాచారం లభిస్తుంది. దలైలామా వంటి ఎందరో గొప్ప బౌద్ధమత నాయకులు ప్రపంచ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. కొన్ని కష్టమైన పరిస్థితులను ఎదుర్కొని ప్రశాంతంగా, ప్రేమపూర్వకమైన మనస్సును కలిగి ఉండటానికి తమను తాము అసాధారణ స్థాయికి అభివృద్ధి చేసుకోగలిగిన వారిని చాలా మంది తమ కళ్లతో స్వయంగా చూసారు. కాబట్టి, ఇది సజీవ వ్యక్తి నుంచి ప్రేరణను జోడించింది, ఇది ఇంటర్నెట్లో లేదా పుస్తకాలలో మనం పొందగల సమాచారంతో పాటు చాలా ముఖ్యమైనది.

కాబట్టి, ప్రజలు ప్రధానంగా బౌద్ధమతం వైపు మొగ్గు చూపుతున్నారు, ఎందుకంటే వారు ఎదుర్కొంటున్న సమస్యలకు ఏదో ఒక పరిష్కారం కోసం వెతుకుతూ జీవితాన్ని ఎదుర్కోవడానికి బౌద్ధమతం ఏదో ఒక మార్గాన్ని అందించగలదని వారు ఆశిస్తున్నారు. బౌద్ధమతం వారి సమాజానికి చాలా విదేశీయమైనదిగా లేదా ఇది మీ ప్రజల సాంప్రదాయ వ్యవస్థగా కూడా ఉండవచ్చు.

Top