బౌద్ధమత అభ్యాసకులకు సెర్కాంగ్ రింపోచే గారి సలహా

మన ఆధ్యాత్మిక గురువు పట్ల శ్రద్ధను చూపడం

సెర్కాంగ్ రింపోచే గారు ఎప్పుడూ లామాలు అందరి పట్ల శ్రద్ధ వహించాలని మరియు వారి సమయాన్ని వృథా చెయ్యకూడదని చెప్పారు. స్పితిలోని భక్తుల ఉదాహరణను తీసుకోకూడదని ఆయన చెప్పారు. ఆయనకు సంప్రదాయ కండువాలు (కాటా) సమర్పించడానికి క్యూ కట్టినప్పుడు, స్పితిలోని అతని భక్తులు సాష్టాంగ నమస్కారం చెయ్యడానికి ముందు నేరుగా అతని ముందు వచ్చే వరకు వేచి ఉంటారు, ఒక్కొక్కరిగా. ఇటువంటి ప్రక్రియకు దాదాపు గంటల సమయం పట్టవచ్చు. అంతేకాకుండా, ఒక లామాను ప్రశ్నించినప్పుడు, రింపోచే గారు ఎప్పుడూ పెద్ద కథ చెప్పడం లేదా ప్రదర్శన చెయ్యకూడదని చెప్పారు. అలాంటి ప్రశ్నలను అక్షరాలా అనువదించవద్దని, కేవలం పాయింట్ కు మాత్రమే చేరుకోవాలని ఆయన చెప్పారు.

దీనికి తోడుగా, సందర్శకులు ఎప్పుడూ తనకు కటాలతో మరియు "అనవసరమైన" కుకీల పెట్టెలు అని పిలిచే వాటితో ప్రెజెంట్ చెయ్యడం రింపోచే గారిని ఇష్టం లేదు. లామాకు నైవేద్యం పెట్టాలనుకునే వారు ఆ వ్యక్తి ఉపయోగించగల లేదా ఇష్టపడే మంచి వస్తువుని సమర్పించాలని ఆయన చెప్పారు. అంతేకాక, ఎవరైనా అతన్ని తరచుగా కలుస్తుంటే, నాలాగా, వస్తువులను తీసుకురావడం మానేయమని చెప్పారు. తనకు ఏమీ అవసరం లేదు అని చెప్పారు.

కామన్ సెన్స్ ను ఉపయోగించడం మరియు ఏదైనా పనిచెయ్యకపోతే వేరే ప్లాన్స్ తో సిద్ధంగా ఉండడం

ప్రజలు ఎప్పుడూ కామన్ సెన్స్ ను ఉపయోగించాలని రింపోచే గారు చెప్తూ ఉంటారు. అందువల్ల, ప్రాపంచిక విషయాల గురి౦చి ప్రజలు తనను ప్రవచనాలు అడగడ౦ ఆయనకు నచ్చదు. సాధారణ మార్గాలు ఒక సమస్యను, ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన వాటిని పరిష్కరించలేనప్పుడు భవిష్యవాణిని అభ్యర్థించడం సముచితమైన ఏకైక పరిస్థితి. ఒకసారి నా అద్దె విషయంలో నాకు ఒక సమస్య వచ్చింది మరియు ఏమి చేయాలో ఆలోచించమని అడిగాను. అప్పుడు రింపోచే గారు నన్ను తరిమేసి, లాయర్ ను కలవమని చెప్పి వెళ్ళిపోయారు.

ఇంకా, ఏదైనా పనిని ప్లాన్ చెయ్యడంలో కనీసం మూడు సాధ్యమైన పనులను ఎప్పుడూ సిద్ధం చేసుకోవాలని రింపోచే గారు రికమండ్ చేశారు. అటువంటి ప్లాన్ నుంచి పొందిన సౌలభ్యం ఒక ప్రణాళిక విఫలమైతే నిస్సహాయ భయాలను నివారిస్తుంది. అనేక ప్రత్యామ్నాయాలను సిద్ధంగా ఉంచడం వల్ల కనీసం ఒకటి పనిచేస్తుందనే నమ్మకం ద్వారా భద్రత లభిస్తుంది.

అయితే, శిష్యులు కొన్నిసార్లు భవిష్యవాణిపై ఆధార పడతారు, అలా వారు తమ గురించి తాము ఆలోచించుకోలేకపోతారు. ఇలాంటి వారు తమ ప్రాణాల పట్ల బాధ్యతను వదిలేసి, తమ కోసం ఎవరో ఒకరు నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటారు. ప్రధాన నిర్ణయాల గురించి ఆధ్యాత్మిక గురువును సంప్రదించడం ఎప్పుడూ సహాయంగా ఉన్నప్పటికీ, దీన్ని చెయ్యడానికి అత్యంత స్థిరమైన మార్గం అతని లేదా ఆమె విలువలను అంతర్గతీకరించడం. లామా లేకపోయినా, తెలివైన పనిని నిర్ణయించడంలో సహాయపడటానికి ఈ విలువలు ఎప్పుడూ దగ్గరే ఉంటాయి.

రింపోచే గారు ముఖ్యంగా ప్రజలు తమకు కావలసిన సమాధానం పొందే వరకు ఒకే ప్రశ్నపై ప్రవచనాల కోసం చాలా మంది లామాలను అభ్యర్థించవద్దని సలహా ఇచ్చారు. భవిష్యవాణిని అభ్యర్థించడం అంటే లామాపై విశ్వాసం ఉంచుకోవడం. దీని అర్థం వ్యక్తి ఏం సలహా ఇస్తాడో అది చెయ్యడం. అంతేగాక, లామా దగ్గరకు వచ్చి మరో టీచర్ ఇలా చెయ్యమని చెప్పారని, కానీ మీరేమనుకుంటున్నారో చెప్పమని అడుగవద్దని రింపోచే గారు హెచ్చరించారు. నేను అలా చెయ్యాలా? ఒక లామాను మరో ఆధ్యాత్మిక గురువు తప్పు అని చెప్పవలసిన ఇబ్బందికరమైన స్థితిలో ఉంచడం సున్నితత్వం యొక్క లోపాన్ని ప్రదర్శిస్తుంది.

ప్రశ్నలు సరిగ్గా ఎలా అడగాలో నేర్చుకోవడం

చాలా మంది పాశ్చాత్యులకు లామాలను ప్రశ్నలు అసలు సరిగ్గా ఎలా అడగాలో తెలియదు. వాళ్ళు వచ్చి తెలివితక్కువగా విషయాలు అడిగినప్పుడు, రింపోచే గారు సాధారణంగా వాళ్ళను సరిదిద్దేవారు. ఉదాహరణకు, ఒక సాధికారతకు హాజరు కావాలో లేదో ఎవరికైనా తెలియనప్పుడు, "ఈ దీక్షకు హాజరుకావడం మంచిదేనా?" అని అడగడం సరైనది కాదు. అవును, అది మంచిదే; చెడ్డదని ఎవరూ చెప్పలేరు. "నేను హాజరు కావాలా వద్దా?" అని ఎవరైనా అడిగితే, దాని అర్ధం "నేను హాజరు కావాల్సి ఉందా లేదా?" అని. ఎవరూ ఖచ్చితంగా హాజరు కావాల్సిన అవసరం లేదు. అలా౦టి విషయాల గురి౦చి ఆధ్యాత్మిక గురువు సలహాను కోరేటప్పుడు, దానికి బదులుగా, "నేను ఏమి చెయ్యాలో మీరు చెప్పగలరా?" అని అడగడ౦ ఉత్తమ౦.

అంతేకాక, ఒక లామా దగ్గరకు వెళ్లి, అతను లేదా ఆమె అందిస్తున్న సాధికారతను స్వీకరించడానికి అనుమతి కోరినప్పుడు, "నేను దీక్షను తీసుకోవచ్చా లేదా?" అని అడగడం మూర్ఖత్వం. ఇది "నేను సమర్థుడినా కాదా?" అని సూచిస్తుంది, ఇది అసంబద్దమైనది. అడగడానికి సరైన పద్ధతి "నేను దయచేసి సాధికారతను పొందవచ్చా?" అని. ఇది పరాయి దేశంలో ఉండటానికి వీసా పొడిగింపు కోసం ఒక మూర్ఖుడు "నేను ఎక్కువ కాలం ఇక్కడ ఉండగలనా లేదా?" అని అడుగడం లాంటిది. ఇక్కడ అడగడానికి సరైన మార్గం "మీ దయగల అనుమతితో, నేను ఎక్కువ కాలం ఇక్కడ ఉండాలనుకుంటున్నాను" అని.

ఒకసారి ఆధ్యాత్మిక సంరక్షకుడు అయిన ఆరు చేతుల మహాకాళుడిని పిలిచేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ టర్నర్ రింపోచే గారిని కొన్ని నెలల పాటు బాగా వేధించాడు. చివరగా, రింపోచే గారు దానికి అంగీకరించినప్పుడు, టర్నర్ అతనిని రోజువారీ పఠన నిబద్ధత ఏమి ఉండాలని అడిగాడు. అప్పుడు రింపోచే గారు నిబద్ధతగా ఏదైనా చెయ్యడానికి సిద్ధంగా ఉండాలని తిట్టుకుంటూ అతన్ని కొట్టారు..

అట్టి నిర్ణయాలు తీసుకునే ముందు వాటిని పరిశీలించడం

పాశ్చాత్యులు ప్రార్ధనల గురించి అనుమానాలు అడగటానికి ప్రయత్నించినప్పుడు రింపోచే గారు చాలా అసంతృప్తి చెందారు. అందరికీ మేలు జరిగేలా జ్ఞానోదయాన్ని పొందడానికి దాని సాధనలో నిమగ్నం కావాలనే చిత్తశుద్ధితోనే ఒక నిర్దిష్ట బుద్ధుని విగ్రహానికి సాధికారతను తీసుకురావాలని ఆయన ఎప్పుడూ నొక్కి చెప్పారు. కేవలం "మంచి ప్రకంపనల" కోసమో, లేదా అందరూ వెళుతున్నారని హాజరవ్వడం అనవసరంగా అనిపించింది. కేవలం ఒక చిన్న రిట్రీట్ చేసి, ఆ తర్వాత ధ్యాన అభ్యాసాన్ని మరచిపోవాలనే ఉద్దేశ్యంతో వెళ్లడం కూడా సరైనది కాదు. ఒక నిర్దిష్ట తాంత్రిక అభ్యాసం పట్ల నిబద్ధత జీవితాంతం ఉండాలి.

ఆధ్యాత్మిక అభ్యాసాలలో పాల్గొనడానికి ముందు గురువులను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఆ తర్వాత వరకు వేచి ఉండకూడదని రింపోచే గారు నొక్కి చెప్పారు. పాశ్చాత్యులలో రింపోచే గారు చూసిన ప్రధాన లోపం ఇదే. మనం పనులు చెయ్యడంలో తొందరపడిపోతాం. గడ్డకట్టిన సరస్సుపై పరిగెత్తే వెర్రి వ్యక్తిలా ఉండకూడదని, అక్కడికి వెళ్లి ఆ మంచు ప్రదేశం తన బరువును భరించేంత బలంగా ఉందో లేదో తెలుసుకోవడానికి కర్రతో పరీక్షించేలా ఉండకూడదని రింపోచే గారు హెచ్చరించారు.

ప్రజలు ఎవరి బోధనలకైనా హాజరు కావచ్చని, మర్యాదపూర్వకంగా, గురువు యొక్క సన్యాస వస్త్రాలకు లేదా గదిలోని బుద్ధ-పెయింటింగ్ కు సాష్టాంగ నమస్కారం చేయవచ్చని రింపోచే గారు చెప్పారు. అయితే ఆ గురువుకు శిష్యుడు కావడం వేరే విషయం అని చెప్పారు. నేను ఏ లామాకైనా అనువదించగలను, కానీ ఒకరి కోసం పనిచేయడం ఆ వ్యక్తిని నా ఆధ్యాత్మిక గురువుగా చెయ్యదని కూడా ఆయన నాకు చెప్పారు. నేను తాంత్రిక సాధికారతను అనువదించినా ఇది అక్కడ వర్తిస్తుందని ఆయన వివరించారు. గురువు పట్ల ఒక వ్యక్తి యొక్క వైఖరి అనేదే ముఖ్యం అని చెప్పారు.

అకాల సన్యాసి లేదా సన్యాసినిగా మారకుండా ఉండడం 

చాలా మంది పాశ్చాత్యులు తమ జీవితాంతం కోరుకునేది ఇదేనా కాదా అని తెలుసుకోకుండా, చాలా త్వరగా బౌద్ధమత సన్యాసులు మరియు సన్యాసినులుగా మారుతారని రింపోచే గారు అనుకుంటారు. వారు సన్యాసం లోకి మారడం వారి తల్లిదండ్రులను ఎలా ప్రభావితం చేస్తుందో లేదా భవిష్యత్తులో వాళ్ళను ఎలా చూసుకోగలుగుతారో తెలుసుకోవడంలో విఫలమవుతారు. నిజానికి, ఎవరైనా గతంలోని గొప్ప అభ్యాసకుల మాదిరిగా ఉంటే, అతను లేదా ఆమె కుటుంబం లేదా డబ్బు లాంటి విషయాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ మనం మిలారెపాలమా కాదా అని మనకు తెలుసు.

ఈ సందర్భంలో, రింపోచే గారు ఎప్పుడూ డ్రుబ్కాంగ్ గెలెగ్-గ్యాట్సో యొక్క ఉదాహరణను ఉదహరించారు. ఈ గొప్ప టిబెటన్ గురువు తన యవ్వనంలో సన్యాసి కావాలని అనుకున్నాడు, కాని అతని కుటుంబం దానికి అంగీకరించలేదు అప్పుడు అతను చాలా బాధ పడ్డాడు. అలా అతను తన తల్లిదండ్రులకు వారి బతికి ఉన్నన్ని రోజులు బాగా సేవ చేసుకుని వాళ్ళు మరణించినప్పుడు, అతను తన వారసత్వాన్ని విలువైన కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చేసాడు. అప్పుడే అతను ఒక సన్యాసి మారాడు.

రింపోచే గారు ఎప్పుడూ మన తల్లిదండ్రులను గౌరవించడం మరియు సేవ చేయడం గురించి నొక్కి చెప్పేవారు. పాశ్చాత్య బౌద్దులుగా, ప్రతి ఒక్కరూ పూర్వజన్మలో మన తల్లులు మరియు తండ్రులుగా గుర్తించి, వారి దయకు ప్రతిఫలం ఇవ్వాలని మనం గొప్పగా మాట్లాడతాము. అయినప్పటికీ, వ్యక్తిగత స్థాయిలో, మనలో చాలా మంది ఈ జన్మలో మన తల్లిదండ్రులతో కూడా బాగా కలిసి ఉండలేరు. మన తల్లిద౦డ్రులకు సేవ చెయ్యడ౦, దయ చూపి౦చడ౦ నిజంగా గొప్ప బౌద్ధమత అభ్యాసమని రింపోచే గారు బోధి౦చారు.

ఎవరైనా ముందుగానే క్షుణ్ణంగా పరిశోధించి సన్యాసిగానో, సన్యాసినిగానో మారితే, లేదా ఎవరైనా ఇప్పటికే సన్యాస దీక్షను పొంది ఉంటే, రింపోచే గారు గబ్బిలంలా దానిలో సగం దూరం వెళ్లిపోకూడదు అని చెప్పారు. ఒక గబ్బిలం పక్షుల మధ్య ఉన్నప్పుడు మరియు వారు చేస్తున్నదాన్ని అనుసరించడానికి ఇష్టపడనప్పుడు, అది ఇలా చెబుతుంది, "అయ్యో, నేను అలా చేయలేను. నాకు దంతాలు ఉన్నాయి" అని. ఎలుకల మధ్య ఉన్నప్పుడు, "ఓహ్, నేను అలా చెయ్యలేను. నాకు రెక్కలు ఉన్నాయి" అని చెబుతుంది. ఈ ఉదాహరణలా వ్యవహరించడం అంటే సౌలభ్యం కోసం సన్యాస వస్త్రాలను ఉపయోగించడమే. అటువంటి వ్యక్తులు ఆర్థికంగా తమను తాము పోషించుకోవడం లాంటి కొన్ని సాధారణ పనులను ఇష్టపడనప్పుడు, వారు తమ దుస్తుల సాకును ఉపయోగిస్తారు. సుదీర్ఘ ఆచారాలకు హాజరుకావడం లేదా దుస్తులు ధరించడం లాంటి కొన్ని సన్యాస పనులు లేదా రూపాలను వారు పట్టించుకోనప్పుడు, వారు పాశ్చాత్యుడు అనే సాకును ఉపయోగిస్తారు. రింపోచే గారు "ఎవరిని మోసం చేస్తున్నావు?" అని చెప్తున్నట్టుగా.

ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నం కావడం అనేది ఉద్యోగం దొరకకపోవడానికి సాకు కాదు

దీని అర్థం బౌద్ధమత అభ్యాసకులు పని చెయ్యకూడదని రింపోచే గారు చెప్పలేదు. ప్రతి ఒక్కరూ ఆచరణాత్మకంగా మంచి స్వభావాన్ని కలిగి ఉండాలి. మన శరీరాన్ని మనం ఎలా ఆక్రమించుకున్నామనే దానికంటే మన మనస్సును, మాటలను ఎలా ఉపయోగిస్తామనేది ముఖ్యమని రింపోచే గారు నేర్పించారు. అందువల్ల తమను తాము పోషించుకోవాల్సిన ఇంటెన్సివ్ అభ్యాసకులకు సరైన ఉద్యోగాలను ఇవ్వాలని ఆయన చెప్పారు. పని చేసేటప్పుడు, మనం మంత్రాలను చదవవచ్చు మరియు మంచి భావాలను మరియు దయగల ఆలోచనలను విస్తరించవచ్చు. పని చేస్తున్నప్పుడు బోధనల గురించి ఆలోచించడం చాలా కష్టం మరియు మనం తాంత్రిక సాధికారతను పొందితే, కనీసం మన సొంత గుర్తింపుని మార్చుకోవచ్చు. రోజంతా, మనల్ని మనం బుద్ధుని వ్యక్తులుగా, మన పరిసరాలను ఆధ్యాత్మిక వికాసానికి పూర్తిగా అనుకూలమైన స్వచ్ఛమైన మనుషులుగా ఊహించుకోవడానికి ప్రయత్నించవచ్చు. అప్పుడు, ఉదయం మరియు రాత్రి, మనం సాధనల యొక్క విస్తారమైన దృశ్యీకరణలను అభ్యసించవచ్చు. బౌద్ధమతాన్ని జీవితం నుంచి వేరుగా చేయవద్దని రింపోచే గారు ఎప్పుడూ చెప్పేవారు.

చాలా సంవత్సరాలు, టర్నర్ తన భార్య మరియు ఇద్దరు పిల్లలతో కలిసి సాంఘిక సంక్షేమం కోసం ఇంగ్లాండులో నివసించాడు. దాదాపు తన సమయమంతా ఇంటెన్సివ్ రిట్రీట్ ప్రాక్టీస్ చేస్తూ గడిపాడు. నేను బోధనలను అభ్యసించగలిగినప్పుడు పనిచేస్తూ సమయం వృధా చెయ్యడం ఎందుకు అని అతను అనుకున్నాడు. అంతకు ముందు, అతను సంపదతో సంబంధం ఉన్న సంరక్షక వ్యక్తి వైట్ మహాకాళ యొక్క అనుమతి వేడుకను రింపోచే గారి నుండి పొందాడు మరియు తన ఆర్థిక సమస్యలు పరిష్కరించబడాలని ప్రతిరోజూ ప్రార్థించాడు. రింపోచే గారు దానికి అస్సలు సంతోషించలేదు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి కోలుకోవాలని బుద్ధ ఔషధాన్ని ప్రార్థించినట్లుగా ఉందని, కానీ ఎప్పుడూ మందులు తీసుకోలేదని ఆయన అన్నారు. అతను టర్నర్ కు ఉద్యోగం సంపాదించమని మరియు తన ఇంటెన్సివ్ అభ్యాసాలు ఉదయం మరియు రాత్రి సమయంలో మాత్రమే చెయ్యమని చెప్పాడు. అప్పుడు, తెల్ల మహాకాళాన్ని ప్రార్థించడం అతని పని ఆర్థికంగా విజయవంతం కావడానికి సహాయపడుతుంది.

ఎప్పుడూ ఆచరణాత్మకంగా మరియు సమర్థవంతంగా ఉండటం

ఆచరణాత్మకంగా మరియు సమర్థవంతంగా ఉండే ప్రజలను రింపోచే గారు ఇష్టపడతారు, మరియు ఖాళీగా ఉండకూడదని చెప్తారు. అందువల్ల, అతను ఎప్పుడూ అభ్యాసాలు మరియు జపం త్వరగా చేసేయాలని చెప్తారు. ఒకసారి, ఇటలీలోని మిలన్ లోని ఘెఫెలింగ్ సెంటర్ లోని విద్యార్థులు రింపోచే గారిని 'దారి యొక్క గ్రేడెడ్ దశలు (లామ్-రిమ్)' మరియు అవలోకితేశ్వర అభ్యాసంపై తన కోర్సును ముగించడానికి ఒక ధ్యాన సెషన్ చెయ్యమని కోరారు. అందుకు రింపోచే గారు అంగీకరించి ఆరు దశల ప్రక్రియ ద్వారా తమను తాము అవలోకితేశ్వరుడిగా సృష్టించుకోవాలని, ఆ తర్వాత లామ్-రిమ్ యొక్క అనేక డజను పాయింట్ల మీద ధ్యానించాలని, ఇవన్నీ రెండు రెండు నిమిషాలు చెయ్యాలని ఆదేశించారు. వీటన్నిటికీ ఎంత తక్కువ సమయం ఇచ్చారని విద్యార్థులు అసహనం వ్యక్తం చెయ్యగా, రింపోచే గారు శాంతించి , "సరే, మూడు నిమిషాలు తీసుకోండి" అని చెప్పారు. ఒక మంచి అభ్యాసకుడు గుర్రం ఎక్కేటప్పుడు తన పాదాన్ని శాడిల్ పై ఉంచడానికి పట్టే సమయంలో మొత్తం లామ్-రిమ్ ను కవర్ చెయ్యగలడని ఆయన వివరించారు. మరణం వచ్చినప్పుడు, చక్కగా కూర్చొని నెమ్మదిగా అలా చేయడానికి సమయం ఉండదని ఆయన చెప్పారు.

మన బౌద్ధమత అభ్యాసంలో రియలిస్టిక్ గా ఉండటం

బౌద్ధమత అభ్యాసం యొక్క అన్ని అంశాలలో రియలిస్టిక్ గా ఉండాల్సిన అవసరాన్ని రింపోచే గారు నొక్కి చెప్పారు. మనం ఇతరులకు ప్రయోజనం చేకూర్చడానికి ప్రయత్నిస్తున్న ఔత్సాహిక బోధిసత్వులైతే ఇది చాలా ముఖ్యం. మన వైపు ను౦చి మన౦ ఎప్పుడూ సహాయ౦ చెయ్యడానికి సిద్ధ౦గా ఉ౦డాల్సిన అవసర౦ ఉన్నప్పటికీ, మన సహాయ౦ పట్ల ఇతరుల బహిరంగత, చివరికి మన ప్రయత్నాల విజయ౦ వారి కర్మపై ఆధారపడి ఉ౦టు౦దని మన౦ గుర్తు౦చుకోవాలి – అదే వారి మనస్సులను కండిషన్ చేసిన ఇంతకుముందు నమూనాలు. కాబట్టి, మనకు సంబంధం లేని విషయాలలో లేదా ఇతరులు మన సహాయాన్ని స్వీకరించడానికి ఆసక్తి చూపనప్పుడు సహాయం చెయ్యడానికి ముందుకు రావద్దని రింపోచే గారు హెచ్చరించారు. మన జోక్యం ఆగ్రహాన్ని మాత్రమే కలిగిస్తుంది మరియు అక్కడ మన సహాయం పనిచేయకపోతే మనమే అన్ని నిందలను తీసుకోవాల్సి ఉంటుంది..

మనం చెయ్యగలిగిన దానికంటే ఎక్కువ ప్రామిస్ చెయ్యకపోవడం

ఎప్పుడూ లో ప్రొఫైల్ ను ఉంచుకోవడం ఉత్తమం. మన౦ ఇతరులకు సహాయ౦ చెయ్యడానికి సిద్ధంగా ఉన్నామని తెలియచెయ్యవచ్చు, ఒకవేళ వాళ్ళు అడిగితే, మన౦ ఖచ్చిత౦గా వారి పనుల్లో సహాయపడవచ్చు. అయితే మనల్ని మనం "సహాయం చెయ్యటానికి ఉన్న భోధిసత్వుడు" అని ప్రచారం చేసుకోవడం మానుకోవాలి. మన రోజువారీ ధ్యాన అభ్యాసాలు చేసుకుని వినయంగా జీవించడం ఉత్తమం. ముఖ్యంగా రింపోచే గారు మనం సాధించగలిగిన దానికంటే ఎక్కువ చేస్తామని ప్రామిస్ చెయ్యడం లేదా భవిష్యత్తులో ఏదైనా చేస్తాము అని ప్రచారం చెయ్యవద్దని హెచ్చరించారు. ఇది ఇంకొన్ని అడ్డంకులను కలిగిస్తుంది మరియు చివరికి, మనం చెప్పిన దానిని ఆచరణలో పెట్టకపోతే, మనల్ని మనం మూర్ఖులుగా చేసుకుంటాము మరియు మన విశ్వసనీయతను కోల్పోతాము.

మన౦ సాధి౦చగలిగిన దానికన్నా ఎక్కువ సహాయం చేస్తానని ప్రామిస్ చెయ్యకు౦డా ఉ౦డడ౦ మన ఆధ్యాత్మిక బోధకులతో మనకున్న స౦బ౦ధాలకు ప్రత్యేక౦గా స౦బ౦ధి౦చినది. ఆధ్యాత్మిక గురువుపై అశ్వఘోషుడు రాసిన యాభై శ్లోకాల మార్గదర్శకాలను ఎప్పుడూ పాటించాలని రింపోచే గారు చెప్తారు, దీన్ని అతను తన ధ్యాన సాధనలో భాగంగా ప్రతిరోజూ చదువుతారు. కొన్ని కారణాల వల్ల మనం చెయ్యలేని పనిని తీసుకోమని మన ఉపాధ్యాయులు మనల్ని కోరితే, మనం ఎందుకు పాటించలేకపోతున్నామో వినయంగా, మర్యాదగా వాళ్లకు వివరించాలి. ఒక ఆధ్యాత్మిక గురువు పట్ల హృదయపూర్వక నిబద్ధత యొక్క ఉద్దేశ్యం బానిసగా లేదా రోబోగా మారడం కాదని, మన స్వంత కాళ్లపై నిలబడటం, మన కోసం ఆలోచించడం మరియు జ్ఞానోదయం పొందడం నేర్చుకోవాలి అని రింపోచే గారు నొక్కి చెప్పారు. మన గురువులు సూచించిన విధంగా మనం చెయ్యలేకపోతే, మన మెంటార్ లను నిరుత్సాహ పరుస్తున్నామని, అప్పుడు మనం చెడ్డ శిష్యులమని అపరాధ భావం తగదు. సరైన ఆధ్యాత్మిక గురువు అసమంజసమైన మనిషి కాదు.

మన ఉపాధ్యాయుల కోసమో, మరెవరి కోసమో మనం ఏదైనా చెయ్యడానికి అంగీకరిస్తే, రింపోచే గారు మొదటి నుంచి ప్రతిదీ స్పష్టం చేసుకోవాలని సలహా ఇస్తారు. ఒక అమాయకుడిలా ఒప్పుకుని, ఆ పనిని చేసేటప్పుడు లేదా పూర్తి చేసిన తర్వాత, దానికి ప్రతిఫలంగా మనం ఏదో ఆశిస్తున్నామని చెప్తే మనకు సమస్య ఎదురవుతుంది. మనం ఆచరణాత్మకంగా, రియలిస్టిక్ గా ఉండి, విషయాలను ముందుగానే ఆలోచిస్తే, ప్రాపంచిక, ఆధ్యాత్మిక వ్యవహారాలు రెండూ సక్రమంగా జరుగుతాయని రింపోచే గారు చెప్పారు. మనం ఆచరణ సాధ్యం కానివి, అవాస్తవికమైనవి, ఆలోచనారహితంగా విషయాల్లోకి వెళ్తే, దేనిలోనూ విజయం సాధించలేము.

బౌద్ధమత కేంద్రాలకు సలహాలు

రింపోచే గారు పాశ్చాత్య బౌద్ధమత కేంద్రాల విషయంలోనూ ఇదే విధానాన్ని సూచించారు. తాము అమలు చెయ్యలేని, పూర్తి చెయ్యలేని ప్రాజెక్టులు తీసుకుని అప్పుల ఊబిలో కూరుకుపోకూడదని చెప్పారు. చిన్నగా, అప్రతిహతంగా ప్రారంభించి ముందు ఒక మారుమూల పల్లెల్లో గుర్తించబడాలని చెప్పారు. బౌద్ధమత కేంద్రాలు నగరవాసులకు చేరుకోవడానికి మరియు నివాసితులు సమీపంలో పని వెతుక్కోవడానికి సౌకర్యవంతంగా ఉండాలని చెప్పారు. గ్రూప్ ఎప్పుడూ కేంద్రాన్ని అమ్మవచ్చు మరియు అవసరమైతే ఇంకొక పెద్దదాన్ని కొనుక్కోవచ్చు, కానీ అన్నీ సరైన సమయంలో చెయ్యాలి.

బౌద్ధమత కేంద్రాల ఉద్దేశం సర్కస్ లాంటి బూటకపు ప్రకటనలతో పెద్ద సంఖ్యలో జనాన్ని ఆకర్షించడం కాదు. రింపోచే గారు ఎప్పుడూ నిజాయితీగల విద్యార్థుల చిన్న గ్రూప్ లను ఇష్టపడతారు. అంతేకాక ఒక ఆధ్యాత్మిక గురువును ఎన్నుకొనేటప్పుడు, ఆ వ్యక్తి ఎంత వినోదాత్మకంగా ఉంటాడు లేదా అతను లేదా ఆమె చెప్పే కథలు ఎంత ఫన్నీగా ఉంటాయి అనేది ప్రధాన విషయం కాదు. మనం నవ్వాలనుకుంటే లేదా ఏదైనా వింతను చూడాలనుకుంటే, మనం సర్కస్ లోని క్లౌన్ లను లేదా సైడ్ షోను చూడవచ్చు.

Top