టిబెట్ లో మూలసర్వస్థివాద భిక్షు సన్యాసం మూడు సందర్భాలలో స్థాపించబడినప్పటికీ, అది ఎప్పుడూ దృఢంగా స్థాపించబడలేదు. దాని ఫలితంగా, మూలసర్వస్థివాద వినయ సంప్రదాయంలో టిబెటన్ బౌద్ధమత సంప్రదాయాన్ని అనుసరించి, సన్యాసాన్ని తీసుకోవాలనుకునే స్త్రీలు శ్రామనెరికలుగా లేదా కొత్త సన్యాసినులుగా మారారు.
టిబెట్ లో మొట్ట మొదటిసారిగా మూలసర్వస్థివాద భిక్షు సన్యాసాన్ని భారత గురువు శాంతరక్షిత, ముప్పై మంది సన్యాసులతో కలిసి సందర్శించి చెయ్యడం జరిగింది, మరియు దీన్ని క్రీ.శ.775లో సెంట్రల్ టిబెట్ లో సమ్యే మఠం స్థాపనతో చేశారు. ఇది టిబెటన్ చక్రవర్తి ట్రి సోంగ్డెట్సెన్ సంరక్షణలో ఉండేది. కానీ, ఆ సమయంలో పన్నెండు మంది భారతీయ మూలసర్వస్థివాద భిక్షుణిలు టిబెట్ కు రాకపోవడం, లేదా తర్వాత టిబెట్ మహిళలు ఉన్నత హోదా పొందడానికి భారతదేశానికి ప్రయాణించకపోవడం వల్ల, ఈ మొదటి సమయంలోనే టిబెట్ లో మూలసర్వస్థివాద భిక్షుని వంశం స్థాపించబడలేదు.
డున్హువాంగ్ పత్రాలలో భద్రపరచబడిన ఒక చైనీస్ మూలం ప్రకారం, అప్పటి చక్రవర్తి ట్రి సోంగ్డెట్సెన్ యొక్క రెండవ భార్యలలో ఒకరైన రాణి డ్రోజా జాంగ్డ్రోన్ మరియు ముప్పై మంది మహిళలు సమ్యే దగ్గర భిక్షుని సన్యాసాన్ని పొందారు. క్రీ.శ. 781లో సమ్యేలోని అనువాద విభాగానికి ఆహ్వానించిన చైనీయుల భిక్షువులు వీరికి సన్మానం అందించి ఉండేవారు. క్రీ.శ.709 లో చైనా టాంగ్ చక్రవర్తి ఝాంగ్-జోంగ్ చైనాలో ధర్మగుప్తక వంశాన్ని మాత్రమే అనుసరించాలని ఆదేశించినందున, టిబెట్‌లో భిక్షుని వంశం ధర్మగుప్తక వంశానికి చెందినది అయి ఉండొచ్చు. బహుశా, ఏకైక సంఘ పద్ధతి ద్వారా ఈ సన్యాసం ఇవ్వబడి ఉండవచ్చు మరియు సమ్యే చర్చలో (క్రీ.శ 792-794) చైనా వర్గం ఓడిపోయిన తర్వాత మరియు టిబెట్ నుంచి బహిష్కరణ తర్వాత ఆ వంశం కొనసాగి ఉండకపోవచ్చు.
టిబెటన్ చక్రవర్తి ట్రి రెల్పాచెన్ (క్రీ.శ. 815 - 836) పాలనలో, సర్వస్వస్థివాద సమూహంలోని గ్రంథాలు తప్ప మరే ఇతర హీనయాన గ్రంథాలను టిబెటన్ భాషలోకి అనువదించరాదని చక్రవర్తి ఆదేశించాడు. ఇది మూలసర్వస్థివాద కాకుండా ఇతర వంశాలను టిబెట్ కు పరిచయం చెయ్యకుండా బాగా పరిమితం చేసింది.
క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దం చివరిలో లేదా 10 వ శతాబ్దం ప్రారంభంలో రాజు లంగ్ధర్మ బౌద్ధమతాన్ని అణచి వెయ్యడంతో శాంతరక్షిత నుంచి మూలసర్వస్థివాద భిక్షు సన్యాసం దాదాపు కనుమరుగైపోయింది. ప్రాణాలతో బయటపడిన ముగ్గురు మూలసర్వస్థివాద భిక్షువులు, ఇద్దరు చైనీస్ ధర్మగుప్తక భిక్షువుల సహాయంతో తూర్పు టిబెట్ లోని గోంగ్పా-రబ్సెల్ సహకారంతో ఈ భిక్షు వంశాన్ని పునరుజ్జీవింపజేశారు. అయితే, ధర్మగుప్త భిక్షునిలతో ఉండే ఇలాంటి పద్ధతి ఏదీ ఆ సమయంలో కలిసిపోయి ఉండే వంశ ద్వంద్వ సంఘం ద్వారా మూలసర్వస్థివాద భిక్షుని సన్యాసంలో ఏర్పాటు చెయ్యబడలేదు.
గోంగ్పా-రబ్సెల్ యొక్క మూలసర్వస్థివాద భిక్షు సన్యాసం తిరిగి సెంట్రల్ టిబెట్ కు తీసుకువచ్చి "కిందటి స్థాయి టిబెట్ వినయ" సంప్రదాయంగా ప్రసిద్ధి చెందింది. అయితే పశ్చిమ టిబెట్ లో రాజు యేషే-వో క్రీ.శ 10 వ శతాబ్దం చివరిలో, తన రాజ్యంలో మూలసర్వస్థివాద భిక్షు సన్యాసాన్ని స్థాపించడానికి లేదా మళ్ళీ తిరిగి స్థాపించడానికి భారతదేశం వైపు ఆసక్తిని కనబరిచాడు. అందువల్ల, అతను పశ్చిమ టిబెట్ లోని గుగేను, తూర్పు భారత పండితుడు ధర్మపాలుడిని మరియు అతని అనేక మంది శిష్యులను రెండవ మూలసర్వస్థివాద భిక్షు సన్యాస కార్యక్రమాన్ని స్థాపించడానికి ఆహ్వానించాడు. ఇదంతా "ఉన్నత స్థాయి టిబెట్ వినయ" సంప్రదాయంగా ప్రసిద్ధి చెందింది.
గుగే క్రానికల్స్ ప్రకారం, ఈ సమయంలో గుగేలో ఒక మూలసర్వస్థివాద సన్యాసి ఆజ్ఞ కూడా స్థాపించబడింది, మరియు రాజు యెషే-వో యొక్క కుమార్తె, లాయ్-మెటోగ్ ఇందులో సన్యాసాన్ని పొందింది. అయితే, ఈ సన్యాస కార్యక్రమం భిక్షునిగా జరిగిందా లేక శ్రామికునిగా జరిగిందా అనేది స్పష్టంగా తెలీదు. ఈ రెండింటిలోనూ మూలసర్వస్థివాద భిక్షునిలను గుగేకు పిలిపించి సన్మానం చేయించారా అనేది కూడా స్పష్టంగా తెలియదు, మరియు ఆ సమయంలో పశ్చిమ టిబెట్ లో మూలసర్వస్థివాద భిక్షుని సంఘం బలంగా స్థిరపడినట్లు కూడా ఎటువంటి ఆధారాలు లేవు.
క్రీ.శ. 1204 లో టిబెట్ అనువాదకుడు ట్రోపు లోట్సావ నలంద మఠం యొక్క చివరి సింహాసన అధిపతి అయిన భారతీయ గురువు శాక్యశ్రీభద్రను, ఘురిద్ రాజ వంశానికి చెందిన దండయాత్ర గుజ్ టర్కులు చేసిన విధ్వంసం నుంచి తప్పించుకోవడానికి టికెట్‌కు రమ్మని ఆహ్వానించాడు. టిబెట్ లో ఉన్నప్పుడు, శాక్యశ్రీభద్రుడు మరియు అతని వెంట ఉన్న భారతీయ సన్యాసులు శాక్య సంప్రదాయంలోని అభ్యర్థులకు మూలసర్వస్థివాద భిక్షువును ప్రదానం చేశారు, అలా టిబెట్ లో అటువంటి మూడవ సన్యాస ప్రక్రియ ప్రారంభమైంది. దీనికి రెండు ఉప వర్గాలు ఉన్నాయి, ఒకటి శాక్యశ్రీభద్రుని శాక్య పండితుని సమన్వయం నుంచి మరియు రెండవది అతను తర్వాత శిక్షణ పొందిన సన్యాసుల సంఘం నుంచి వచ్చింది మరియు అది చివరికి నాలుగు శాక్య సన్యాస సంఘాలుగా విభజించబడింది. క్రీస్తు శకం 12 వ శతాబ్దం చివరి నాటికి ఉత్తర భారతదేశంలో ఇంకా భిక్షునిలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నప్పటికీ, శాక్యశ్రీభద్రుడిని టిబెట్ కు ఏ మూలసర్వస్థివాద భిక్షునిలు తన వెంట తీసుకెళ్లలేదు. అందువల్ల టిబెట్ లోని మూడు మూలసర్వస్థివాద భిక్షుని సన్యాసం ఏ ఒక్క మూలసర్వస్థివాద భిక్షు వంశంతో కలిసి పెరగలేదు.
శాక్యశ్రీభద్రుని సందర్శన తర్వాతి శతాబ్దాలలో, టిబెట్ లో మూలసర్వస్థివాద భిక్షుని సన్యాసాన్ని స్థాపించడానికి కనీసం ఒక్క ప్రయత్నం అయినా జరిగి ఉంటుంది, కానీ అది విఫలం అయ్యింది. క్రీ.శ. 15 వ శతాబ్దం ప్రారంభంలో, శాక్య గురువు శాక్య-చోగ్డేన్ తన తల్లి కోసం ప్రత్యేకంగా మూలసర్వస్థివాద భిక్షుని అనే ఒకే సన్యాస సంఘాన్ని ఏర్పాటు చేశాడు. అయితే, ఇంకొక సమకాలీన శాక్య గురువు అయిన గోరంప ఈ సన్యాసం యొక్క ప్రామాణికతను తీవ్రంగా విమర్శించి దీన్ని పూర్తిగా నిలిపివేశాడు.