కొంతమంది తమ జీవితంలో నైతిక విలువలు లేకుండా వ్యవహరించడానికి మతం అవసరం లేదని నమ్ముతారు. ప్రేమ, కరుణ లాంటి విలువలు ఏ మతానికి సంబంధించినవి కాదని వాళ్ళు అనుకుంటారు. నేను ఈ విలువలను "సార్వత్రిక నైతిక విలువలు" లేదా "సార్వత్రిక నమ్మకాలు" అని పిలుస్తాను. మతం లేకపోయినా, దేన్నీ నమ్మకపోయినా కూడా మనం మన జీవితాల్లో నీతిని పెంపొందించుకోవచ్చు.
సార్వత్రిక నైతిక విలువల యొక్క ప్రాథమిక ఆధారం ఏమిటంటే అందరూ సంతోషంగా ఉండాలని కోరుకోవడంలో, ప్రేమించబడాలని కోరుకోవడంలో మరియు గౌరవించబడాలని కోరుకోవడంలో ప్రతి ఒక్కరూ పూర్తిగా సమానులే అని. భారత రాజ్యాంగం సార్వత్రిక సూత్రాలపై ఆధారపడి ఉంటుంది, ఇది అన్ని సంప్రదాయాలను మరియు అన్ని మతాలను ప్రత్యేకమైన ప్రాధాన్యత లేకుండా గౌరవిస్తుంది. నైతిక విద్య మరియు నైతిక అవగాహన ద్వారా మంచి శాంతియుత ప్రపంచాన్ని సృష్టించడమే భారతీయ జ్ఞానం యొక్క లక్ష్యం. సైన్స్, ఎకానమీ, పాలిటిక్స్, టెక్నాలజీ, ఆర్ట్స్, లిటరేచర్ రంగాల్లో విద్య కొన్ని మైలు రాళ్లను సెట్ చేసుకుంది. కానీ ప్రస్తుతం సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలతో పోలిస్తే అవి అంత ప్రభావవంతంగా ఆకట్టుకోలేదు అంటారా?
ఈ పరివర్తనాత్మక బోధనా శైలి మనుషులు అంతా ఒకే కుటుంబం అనే సార్వత్రిక సూత్రంపై ఆధారపడి ఉంటుంది. విద్యార్థుల మనస్సులు మరియు భావోద్వేగాల యొక్క పూర్తి సామర్థ్యాన్ని పొందడానికి మానవత్వం మరియు సమగ్రత యొక్క లక్షణాలు మరియు లాజిక్, సహానుభూతి, నైతిక తార్కికం మరియు అంతర్దృష్టి లాంటి సామర్థ్యాలు అవసరం. సార్వత్రిక నైతిక విలువలు లేని విద్య ఎప్పుడూ ఆర్థిక అభివృద్ధి వైపే మొగ్గు చూపుతుంది, ఇది వ్యక్తిగత స్థాయిలో మానసిక సమస్యలను లేదా స్థూల స్థాయిలో సామాజిక సమస్యలను పరిష్కరించదు.
టెక్నాలజీలో మార్పులు మనం పనులు "చెయ్యడానికి" కొత్త మార్గాలను తీసుకొస్తుంటే, సార్వత్రిక నైతిక విలువలు ఒక కొత్త మనిషిగా "మారడానికి" కొత్త మార్గాలను తీసుకొస్తున్నాయి. మనుషులు పనులను చెయ్యడం స్వీకరించినప్పుడే ఎవొల్యూషన్ జరుగుతుంది. టెక్నాలజీ యొక్క ఈ విపరీతమైన పెరుగుదల, సార్వత్రిక నైతిక విలువలు స్వంత-పరివర్తనను ఎలా మారుస్తుంది, మానవాళికి శాంతి మరియు స్వేచ్ఛను ఎలా తెస్తుంది మరియు ఆత్మ యొక్క బలమైన మరియు స్థిరమైన లక్షణాన్ని ఎలా నిర్మిస్తాము అనేటటువంటి తీవ్రమైన ప్రశ్నలకు దారితీస్తుంది.
మనకు ఓపెన్ మైండ్ లేకపోతే మనం ఎదగలేము. ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి ఇద్దరికీ పరివర్తన అనేది అవసరం. మీరు ఒక మంచి మనిషిగా ఉండాలనుకుంటే, నైతిక పద్ధతులు మరియు విలువలను అలవాటు చేసుకోవడం తప్ప ఇంక వేరే ఏ మార్గం లేదు. నాకు నా గుర్తింపు ఉంది, కానీ సమాజంలో బహుళత్వం ఉంటుందని నేను అంగీకరించాలి. సార్వత్రిక నైతికత మనిషిని బలవంతుడిని చేస్తుంది మరియు సొంత పరివర్తనను తీసుకొస్తుంది. ఈ భౌతికవాద ప్రపంచంలో విజయాన్ని పొందాలంటే నైతికతను త్యాగం చెయ్యాలని అనుకుని ప్రజలు కొన్నిసార్లు అయోమయానికి గురవుతారు. కానీ ఈ భౌతికవాద ప్రపంచంలో కూడా, మీరు ఒక బిలియనీర్ అవ్వాలంటే, మీరు విశ్వసనీయంగా ఉండాల్సి ఉంటుంది. అలా విశ్వసనీయంగా ఉండటానికి, మీరు నైతిక విలువలతో మరియు నిజాయితీగా ఉండాలి. మీ ఇంట్లో ఒక అద్భుతమైన వంటమనిషి ఉంటే, అతన్ని మీరు చాలా బాగా మెచ్చుకుంటారు, కానీ ఒక రోజు ఆ వంటవాడు మీ నుంచి డబ్బులు కొట్టేస్తున్నాడని మీకు తెలిస్తే, అతన్ని మీరు ఇంటి నుంచి పంపించెయ్యాలని అనుకుంటారు. మీ కింద పనిచేసే వాళ్ళు నిజాయితీని పాటించకపోవడం మీకు నచ్చకపోతే, మీ బాస్ మీరు అతనితో నిజాయితీగా ఉండకపోతే మిమ్మల్ని అంగీకరిస్తాడని మీరు ఎలా అనుకుంటారు?
ఈ విషయాలు అర్థం చేసుకోవడానికి చాలా సులభంగా ఉంటాయి. ఇది అసలు కష్టమైన విషయమేమీ కాదు.