మనం ప్రస్తుతం ఉంటున్న ఈ ప్రపంచం చాలా సంక్లిష్టమైనది, పెద్దది మరియు పరస్పర ఆధారితమైనది. ప్రస్తుత, భవిష్యత్ తరాలు ఎదుర్కొంటున్న సవాళ్లు విస్తృతమైనవి, మరియు దూరదృష్టితో కూడుకున్నవి. వాటి పరిష్కారాలకు ఖచ్చితంగా సహకార, ఇంటర్ డిసిప్లినరీ మరియు ప్రపంచ-ఆధారిత కొత్త ఆలోచనా విధానం మరియు సమస్యా పరిష్కార మార్గం అవసరం. ప్రపంచంతో కలిసిపోయి ఉండడానికి కరుణ ఒక్కటే సరిపోదు. మనం నివసిస్తున్న విస్తృత వ్యవస్థలపై అవగాహన ఆధారంగా బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకోవడంతో సహానుభూతిని పెంపొందించుకోవాలి.
ప్రపంచ స్థాయి డొమైన్ మొదట్లో భయానకంగా అనిపించవచ్చు, కానీ ఇది వ్యక్తిగత మరియు సామాజిక డొమైన్లలో అన్వేషించబడిన అదే జ్ఞానం మరియు నైపుణ్యాలతో నిర్మించబడింది, ఇది మన కమ్యూనిటీలు, సమాజాలు మరియు ప్రపంచ సమాజానికి విస్తరించింది. మన ప్రవర్తనను, ఇతరుల ప్రవర్తనను అర్థం చేసుకోగలిగినట్లే వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడం కూడా అలానే ఉంటుంది. ఈ అవగాహనను పెంపొందించుకోవడం ద్వారా మరియు సంక్లిష్ట పరిస్థితులకు విమర్శనాత్మక ఆలోచనను అప్లై చెయ్యడం ద్వారా, నైతిక నిమగ్నత ఉద్భవించవచ్చు. సమస్యలను చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టే మన ధోరణిని నివారించడం ద్వారా సమస్య పరిష్కారం ఇంకా మంచి ప్రక్రియగా అవుతుంది.
ప్రపంచ స్థాయి డొమైన్ ఈ క్రింది విషయాల ద్వారా అన్వేషించబడుతుంది:
- పరస్పర ఆధారాన్ని అభినందించడం
- ఉమ్మడి మానవత్వాన్ని గుర్తించడం
- కమ్యూనిటీ మరియు ప్రపంచ స్థాయి సంబంధాలు
పరస్పర ఆధారాన్ని అభినందించడం
పరస్పర ఆధారం అంటే వస్తువులు మరియు సంఘటనలు సందర్భం లేకుండా రావు అని, దానికి బదులుగా వాటి ఉనికి కోసం ఇతర వస్తువులు మరియు సంఘటనలపై ఆధారపడతాయి అనే భావన. ఉదాహరణకు, మనం తినే సాధారణ భోజనం, వివిధ వనరులు మరియు వ్యక్తుల నుంచి వస్తుంది, మనం దాన్ని సరైన సమయంలో ఆ చోటులో కనిపెడితే. ఇంకా పరస్పర ఆధారం అంటే ఒక ప్రాంతంలో జరిగే మార్పులు మరో ప్రాంతంలో జరిగే మార్పులకు దారితీస్తాయి. ఆ ప్రభావాలకు కారణాలు ఉంటాయి, నిజానికి, వివిధ కారణాలు మరియు పరిస్థితుల కారణంగా అవి రావొచ్చు.
పరస్పర ఆధారాన్ని గుర్తు చెయ్యడం యొక్క ఉద్దేశ్యం మన ప్రపంచ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయనే దానిపై అవగాహనను పెంపొందించుకోవడానికి కాదు, ఆ జ్ఞానాన్ని మన గురించి, ఇతరుల గురించి మరియు ఈ ప్రపంచం గురించి మన ఆందోళనలతో ముడిపెట్టడం. పరస్పర ఆధారాన్ని మనం రెండు కోణాల నుంచి అన్వేషించవచ్చు:
- పరస్పర ఆధారిత వ్యవస్థలను అర్థం చేసుకోవడం
- ఒక వ్యవస్థ నేపధ్యంలో ఉన్న వ్యక్తులు
పరస్పర ఆధారిత వ్యవస్థలను అర్థం చేసుకోవడం అనేది "అంతర్గత" మరియు "ఇతర" దృష్టి నుంచి విస్తృత వ్యవస్థలపై "బయటి" దృష్టికి మారడానికి సంబంధించినది. పరస్పర ఆధారిత సూత్రాలు, కారణం మరియు ప్రభావం లాంటి ప్రపంచ వ్యవస్థలను అర్థం చేసుకోవడానికి మనం మన అవగాహనను నిర్దేశిస్తాము. ఒక వ్యవస్థ నేపధ్యంలో ఉండే వ్యక్తులుగా, మన ఉనికి, మన చుట్టూ ఉన్న ఇతరుల లాగానే, ప్రపంచవ్యాప్తంగా అనేక సంఘటనలు, కారణాలు మరియు వ్యక్తులతో సంక్లిష్టంగా ఎలా సంబంధం కలిగి ఉంటుందో మనం తెలుసుకుంటాము.
పరస్పర ఆధారిత వ్యవస్థలను అర్థం చేసుకోవడం
పరస్పర ఆధారిత అనేది ప్రకృతి నియమం మరియు మానవ జీవితం యొక్క ప్రాథమిక రియాలిటీ. ఆహారం, నీళ్లు మరియు ఆశ్రయం లాంటి అవసరాలను అందించడానికి పనిచేసే లెక్కలేనన్ని ఇతరుల సహాయం లేకుండా, అలాగే విద్య, అమలు చేసే చట్టం, ప్రభుత్వం, వ్యవసాయం, రవాణా, ఆరోగ్య సంరక్షణ మొదలైన వాటికి బాధ్యత వహించే లెక్కలేనన్ని సంస్థల సహాయం లేకుండా ఎవరూ జీవితాన్ని కొనసాగించలేరు. 2007-2009 అంతర్జాతీయ సంక్షోభం, వాతావరణ మార్పు మరియు ప్రపంచ హింసాత్మక సంఘర్షణ గురించి పెరుగుతున్న ఆందోళనలు లాంటి ప్రధాన మరియు బాగా ప్రచారం పొందిన సంక్షోభాలు ప్రపంచ స్థాయిలో ఈ రకమైన ఆర్థిక మరియు పర్యావరణ పరస్పర ఆధారపడే విషయాన్ని ప్రదర్శిస్తాయి.
సాంప్రదాయక సమాజాలలో, ఇతరులతో సంబంధం యొక్క భావన మన రోజువారీ జీవితంలో బాగా లోతుగా ఇమిడిపోయి ఉంటుంది. మన మనుగడ అనేది ఎప్పుడూ వస్తువులను పంచుకోవడం మరియు ఇతర రకాల సామాజిక సహకారంపై ఆధారపడి ఉంటుంది, అంటే పంటలను కోయడం నుంచి భవనాలను నిర్మించడం మరియు జంతువులతో పోరాడటం వరకు. పారిశ్రామిక విప్లవం నుంచి, ఆర్థిక స్థితిని మెరుగుపరచాలనే కోరికతో, మనం ఇంకా దూరంగా ఉంటూ సమాజం నుంచి దూరమయ్యాము. ఇది స్వాతంత్రం యొక్క భ్రమకు దారితీసింది, యుక్త వయస్సుకు చేరుకున్న తర్వాత, మనకు ఇకపై ఇతరులు అవసరం లేదని నమ్మడం సులభం అయ్యింది. ఈ స్వయం సమృద్ధి యొక్క భావన మానసిక మరియు సామాజిక ఒంటరితనం యొక్క పెరుగుతున్న భావనకు సహాయపడింది. మనం తీవ్రమైన సామాజిక జీవులం, దాని మనుగడ, అలాగే మానసిక శ్రేయస్సు ఇతరులతో సంబంధాలపై ఆధారపడి ఉంటుంది.
ఒక వ్యవస్థ నేపధ్యంలో ఉన్న వ్యక్తులు
పరస్పర ఆధారిత వ్యవస్థలను మనం సరిగ్గా అర్ధం చేసుకోవడానికి, మనమందరం ఇంత పెద్ద దానిలో ఎలా సరిపోతామో చూడటం ద్వారా దాన్ని అర్ధం చేసుకోవాలి. ఇది మనల్ని ఇతరులతో సంబంధం లేని వారిగా లేదా ఒక పెద్ద వ్యవస్థ నుంచి స్వతంత్రంగా చూసే ధోరణిని ఎదుర్కోవటానికి సహాయపడుతుంది. ఇక్కడ, మనం ఇతర మానవులతో మన సంబంధాలను మరియు ఈ సంబంధాల సంక్లిష్టతను అన్వేషిస్తాము. దాని ఫలితాలు మూడు విధాలుగా ఉంటాయి:
- వ్యవస్థ స్థాయిలో ఇతరుల పట్ల నిజమైన కృతజ్ఞతా భావం
- ఇతరుల జీవితాలను సరిదిద్దడానికి మనకు ఉన్న సామర్ధ్యం గురించి లోతైన అవగాహన
- అందరి మంచిని నిర్ధారించే పనులు చెయ్యాలనే ఆకాంక్ష పెరుగుతోంది
మన ప్రవర్తన ఇతరులను ఎలా ప్రభావితం చేస్తుందో అనే దాని నుంచి మనం దీన్ని ప్రారంభిస్తాము. మన శ్రేయస్సుకు ఇతరులు సహాయపడే వివిధ మార్గాలను అన్వేషిస్తాము. ఒక లిస్ట్ ను తయారు చేసుకుని దాన్ని పదే పదే పరిశీలించడం ద్వారా మనం దీన్ని చేయవచ్చు. సోషల్ డొమైన్ లో లాగా మనకు తెలిసిన వ్యక్తులపై దృష్టి పెట్టడానికి బదులుగా, ఇక్కడ మనం చాలా విస్తృతమైన స్పెక్ట్రమ్ ను కలిగి ఉన్నాము: వ్యక్తులు, సమాజాలు మరియు వ్యవస్థలు మనకు వ్యక్తిగతంగా తెలియకపోవచ్చు. అంతమంది సహాయం లేకుండా మనం ఎదగలేమని - జీవితాన్ని సాగించలేమని అర్థం చేసుకోవడం ఇతరుల పట్ల నిజమైన ప్రశంసను పెంపొందించడానికి చాలా అవసరం.
మన జీవితాలకు సహాయం చేసే వ్యక్తుల నెట్‌వర్క్ లో ప్రతి ఒక్కరూ ఒక పాత్ర పోషిస్తారు. ఈ విషయాన్ని మనం గ్రహించినప్పుడు మనలో ఒక పరస్పర భావం ఏర్పడుతుంది. ఏదో ఒక రకంగా ప్రయోజనం ఉంటుందని అంగీకరించే ముందు ఇతరులు మనకు ఎలా ప్రయోజనం చేకూరుస్తారో మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఈ అవగాహన పెరిగే కొద్దీ, సంకుచిత సొంత-కేంద్రీకృత లేదా పోటీ ఆలోచనల కంటే సంబంధాల పరస్పర ప్రయోజనకరమైన స్వభావం నెమ్మదిగా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఇతరులతో పెరిగిన ఈ సంబంధ భావన సానుభూతి ఆనందం కోసం మన సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ఒంటరితనాన్ని ఎదుర్కోవటానికి నేరుగా పనిచేస్తుంది. ఇది ఇతరుల విజయాలలో విపరీతమైన ఆనందాన్ని, అసూయ మరియు ఆ అసూయకు విరుగుడును అందిస్తుంది, అలాగే ఇతరులతో కఠినమైన విమర్శ లేదా అవాస్తవ పోలికలను కూడా కలిగిస్తుంది.
ఉమ్మడి మానవత్వాన్ని గుర్తించడం
పరస్పర ఆధారం గురించి మంచి అవగాహన, ముఖ్యంగా సహానుభూతి యొక్క సామాజిక డొమైన్ లో పెంపొందించబడిన నైపుణ్యాలతో కలిపినప్పుడు, ఇతరుల పట్ల ఎక్కువ ఆందోళన భావనకు మరియు మనమందరం ఎలా పరస్పర సంబంధం కలిగి ఉన్నామనే గుర్తింపుకు దారితీస్తుంది. సాధారణ మానవత్వానికి స్పష్టమైన గుర్తింపును పెంపొందించడం ద్వారా దీన్ని బలోపేతం చెయ్యవచ్చు, విస్తరించవచ్చు. ఇక్కడ, మనం ప్రాథమిక స్థాయిలో, మానవులందరూ వారి అంతర్గత జీవితాల గురించి మరియు వారి జీవిత పరిస్థితుల గురించి కొన్ని సమానతలను ఎలా పంచుకుంటారో గుర్తించడానికి మనం విమర్శనాత్మక ఆలోచనలో నిమగ్నమవుతాము. ఈ విధంగా, మనం ఎక్కడైనా, దూరంగా ఉన్న లేదా మనకంటే చాలా వేరుగా కనిపించే ఏ వ్యక్తి పట్లనైనా ప్రశంస, సహానుభూతి మరియు కరుణను పెంపొందించుకోవచ్చు. మన ఉమ్మడి మానవత్వాన్ని మనం రెండు రకాలుగా అన్వేషిస్తాం:
- అందరి ప్రాథమిక సమానత్వాన్ని అభినందించడం
- వ్యవస్థలు అనేవి శ్రేయస్సును ఎలా ప్రభావితం చేస్తాయో అనే దాన్ని అభినందించడం
అందరి ప్రాథమిక సమానత్వాన్ని అభినందించడం అంటే, మన స్నేహితులు మరియు కుటుంబం నుంచి ఈ ప్రపంచం యొక్క అవతలి వైపు ఉన్న అపరిచితుల వరకు వాళ్ల ఆనందం మరియు శ్రేయస్సు కోసం వారి ఆకాంక్షలో తోడుగా ఉంటూ వారి బాధను నివారించాలనే కోరికలో ప్రాథమికంగా సమానమని అనుకోవడం. వ్యవస్థలు శ్రేయస్సును ఎలా ప్రభావితం చేస్తాయో అనే దాన్ని అభినందించడం అంటే ప్రపంచ వ్యవస్థలు పాజిటివ్ విలువలను అవలంబించడం ద్వారా లేదా సమస్యాత్మక నమ్మకాలను కొనసాగించడం ద్వారా శ్రేయస్సును ప్రోత్సహించగలవు లేదా రాజీపడగలవని గుర్తించడం.
అందరి ప్రాథమిక సమానత్వాన్ని అభినందించడం
మానవాళి యొక్క ప్రాథమిక సమానత్వం యొక్క సాక్షాత్కారాన్ని మన తక్షణ సమాజానికి బయట ఉన్నవారికి అందిస్తాము. చివరిగా, మనం ఈ సాక్షాత్కారాన్ని పూర్తి ప్రపంచానికి విస్తరించడానికి ప్రయత్నిస్తాము. మనుషులుగా మనమందరం పంచుకునే వాటిపై దృష్టి పెట్టడం ద్వారా మనం దీన్ని చేస్తాము, అంటే ఎదగాలనే కోరిక మరియు బాధ మరియు అసంతృప్తిని నివారించాలనే కోరిక. ఇది పక్షపాతం మరియు ఇతరుల అవసరాలను తగ్గించే మన ధోరణిని తగ్గించడానికి సహాయపడుతుంది.
ఇతరులను ఈ విధంగా సమానంగా గుర్తించడం ద్వారా, మన "సమూహంలోని" వివిధ ఆచారాలు, జాతులు, మతాలు మొదలైన ప్రజలను చేర్చడానికి విస్తరించవచ్చు. ఒక వ్యక్తి రక్తదానం చెయ్యడం నుంచి ప్రకృతి విపత్తు తర్వాత సంభవించే దాన ధర్మాల వరకు, ఒకరు భాగం కాని సమూహాలకు వ్యతిరేకంగా అన్యాయాన్ని వ్యతిరేకించడం వరకు ఈ సామర్థ్యాన్ని సమాజం అంతటా వివిధ విధాలుగా ప్రదర్శిస్తారు. ఒకరిపై ఒకరు ఆధారపడడాన్ని అభినందించడం మరియు ఇతరుల పట్ల సహానుభూతిని కలిగి ఉండటం లాంటి నైపుణ్యాలు పక్షపాతం, దూరంగా ఉంచే భావన మరియు మనకన్నా దూరంగా ఉన్న వారి సమస్యల పట్ల శ్రద్ధ లేకపోవడం లాంటి ఇతరులకు సంబంధించి మనకు ఉన్న అనేక అవరోధాలకు విరుగుడుగా పనిచేస్తాయి.
మనపై మనం దృష్టి పెట్టినప్పుడు, ప్రపంచం చిన్నదిగా కనిపిస్తుంది మరియు మన సమస్యలు మరియు ఆందోళనలు పెద్దవిగా కనిపిస్తాయి. కానీ మనం ఇతరులపై దృష్టి పెట్టినప్పుడు, ప్రపంచం పెద్దదిగా కనిపిస్తుంది, మన సమస్యలు మనస్సు అంచులకు వెళ్తాయి మరియు చిన్నవిగా కనిపిస్తాయి. అలా మనం మంచి సంబంధం మరియు కారుణ్య పని కోసం మన సామర్థ్యాన్ని పెంచుకుంటాము.
వ్యవస్థలు శ్రేయస్సును ఎలా ప్రభావితం చేస్తాయో అనే దాన్ని అభినందించడం
వ్యవస్థలు సాంస్కృతిక మరియు నిర్మాణాత్మక స్థాయిలలో శ్రేయస్సును ప్రోత్సహించవచ్చు లేదా పట్టించుకోకపోవచ్చు - పాజిటివ్ విలువలను ప్రోత్సహించడం ద్వారా లేదా సమస్యాత్మక నమ్మకాలు మరియు అసమానతలను సృష్టించడం ద్వారా. మనం అసమానత, పక్షపాతానికి గురైనప్పుడు మనం ఎలా భావిస్తామో ఆలోచించడానికి కొంచెం సమయం తీసుకోవచ్చు. ఇటువంటి సమస్యాత్మక వ్యవస్థల ప్రభావాలను వివరించడానికి చరిత్ర మరియు వర్తమాన వ్యవహారాల నుంచి ఉదాహరణలను కూడా ఉపయోగించవచ్చు. చివరిగా, పక్షపాతం నిజంగా సమర్థనీయమేనా, లేదా మనుషులందరికీ ఆనందాన్ని చేకూర్చడానికి సమాన హక్కు ఉంటుందా అని మనం ఆలోచించాలి.
విస్తృత-పరిధి సహానుభూతిని పెంపొందించడం చాలా ముఖ్యం ఎందుకంటే మనుషులుగా మనకు సహానుభూతి మన పుట్టుకతో వచ్చే సామర్థ్యం లాగా కనిపించదు. ఉదాహరణకు, మనలో చాలా మంది ఒకే బాధితుడితో సహానుభూతి చూపే బలమైన ధోరణిని కలిగి ఉంటారు. ఏదేమైనా, నిర్మాణాత్మక మరియు సాంస్కృతిక సమస్యల గురించి నేర్చుకోవడం ద్వారా, బాధ పట్ల మన అవగాహన మరియు అంతర్దృష్టి పెరుగుతుంది, అలాగే ఆ బాధకు మన ప్రతిస్పందనల యొక్క అధునాతన ఆలోచన పెరుగుతుంది.
సాధారణ మానవత్వాన్ని గుర్తించి ఇతరుల గురించి అవగాహనను మరియు ఆకాంక్షలను తెలుసుకున్నప్పుడు జాతి మరియు సామాజిక సమూహాల మధ్య కమ్యూనికేట్ చెయ్యడం మరియు సహకరించడం మనం నేర్చుకోవచ్చు. మనం ఇతరులతో పంచుకునే దాని గురించి ఎక్కువ అవగాహనతో, పక్షపాతం మరియు ఒంటరితనానికి దారితీసే స్పష్టమైన తేడాలను మనం తెలుసుకోవచ్చు. వ్యక్తుల శ్రేయస్సు వ్యవస్థల ద్వారా ఎలా రూపుదిద్దుకుంటుందో అర్థం చేసుకోవడం ద్వారా, మన సహానుభూతి ఇంకా లోతుగా ఉంటుంది, అలాగే మానవ బాధలకు సాధ్యమయ్యే పరిష్కారాల గురించి మన విమర్శనాత్మక ఆలోచన కూడా ఉంటుంది.
కమ్యూనిటీ మరియు ప్రపంచ స్థాయి అనుసంధానం
పరస్పర ఆధారాన్ని ప్రశంసించడం, ఇతరుల నుంచి మనం ప్రయోజనం పొందే మార్గాలకు అనుగుణంగా ఉండటం మరియు మన ఉమ్మడి మానవత్వాన్ని గుర్తించడం బాధ్యత యొక్క భావాన్ని మరియు పని చెయ్యాలనే కోరికను సృష్టిస్తుంది. అప్పుడు మనం సహజంగానే సమాజం నుంచి మనకు లభించే అనేక ఉపయోగాలను తిరిగి పొందాలని కోరుకుంటాము మరియు కష్టాల్లో ఉన్న మరియు అవసరమైన వాళ్లకు సహాయపడాలని కోరుకుంటాము. అయినా సంక్లిష్టమైన వ్యవస్థల్లో లేదా మతపరమైన లేదా ప్రపంచ స్థాయిలో మనం సమర్థవంతంగా ఎలా పాల్గొనగలం?
దయగల ప్రపంచ పౌరులుగా మన సామర్థ్యాన్ని గుర్తించడానికి మరియు గ్రహించడానికి మనకు సాధికారత కల్పించడమే SEE లెర్నింగ్ యొక్క పూర్తి ఉద్దేశ్యం. దీన్ని సాధించడానికి, అన్వేషించడానికి రెండు దశలు ఉన్నాయి:
- సమాజం మరియు ప్రపంచంలో పాజిటివ్ మార్పును కలిగించే మన సామర్థ్యం
- సమాజం మరియు ప్రపంచ స్థాయి పరిష్కారాలలో నిమగ్నం కావడం
ఈ రెండు పాయింట్లు ఒకేలా ఉంటాయి, కానీ మొదటిది మన సామర్థ్యాలు మరియు అవకాశాల ఆధారంగా పాజిటివ్ మార్పును తీసుకురావడానికి మనం ఏమి చెయ్యగలమో గుర్తించడానికి సహాయపడుతుంది. రెండవది మన సమాజాన్ని మరియు ప్రపంచాన్ని ప్రభావితం చేసే సమస్యలకు సరైన పరిష్కారాలను కనిపెట్టడానికి సహాయపడుతుంది.
సమాజం మరియు ప్రపంచంలో పాజిటివ్ మార్పును కలిగించే మన సామర్థ్యం
మనం సమాజం లేదా ప్రపంచంలో నిమగ్నమై, మనకు మరియు ఇతరులకు ప్రయోజనకరమైన విధంగా అవసరాలను తీర్చాలంటే, నిరాశకు లోను కాకుండా, రియలిస్టిక్ గా మరియు ప్రభావవంతంగా ఉండాలంటే, మన పరిమితులు మరియు మన సామర్థ్యాలు రెండింటినీ మనం గుర్తించాలి. ప్రతిదీ మన శక్తిలో ఎలా ఉండదో తెలుసుకోవడం చాలా ముఖ్యం, మరియు ఆ లోతైన సమస్యలు మారడానికి కొంచెం సమయం పడుతుంది. దీని అర్థం మనం సమర్థవంతమైన పనులలో పాల్గొనలేమని కాదు. నిజానికి, క్లిష్టమైన సమస్యలను ఎదుర్కున్నప్పుడు మనం శక్తిహీనులుగా భావిస్తే, ఇది ఇతరుల పట్ల కరుణ మరియు సొంత కరుణను పెంపొందించుకోవడాన్ని ఇంకా కష్టతరం చేస్తుంది. ఎందుకంటే కరుణ - బాధ నుంచి ఉపశమనం పొందాలనే కోరిక లేదా ఉద్దేశ్యం, ఆశపై ఆధారపడి ఉంటుంది.
మనం పూర్తి వ్యవస్థను మార్చలేనప్పటికీ, ఆ వ్యవస్థలోని కీలక విషయాలపై దృష్టి పెట్టి మార్పును తీసుకువచ్చే మార్గాల్లో వ్యవహరించవచ్చు. ఇది ప్రపంచ మరియు వ్యవస్థల స్థాయి సమస్యలలో మునిగిపోకుండా సాధికారత భావనను అందిస్తుంది. ఒక వ్యవస్థలో ఎక్కువ ప్రభావాలకు కారణమయ్యే విషయాలను మనం గుర్తిస్తే, వాటిని పరిష్కరించడంపై దృష్టి పెట్టి మంచి ఫలితాలను పొందవచ్చు. మనం వెంటనే పెద్ద ఎత్తున మార్పు తీసుకురాలేకపోయినా, మనం చెయ్యగలిగే చిన్న స్థాయి మార్పులు కూడా చాలా విలువైనవి అనే నిజాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు చిన్న స్థాయి మార్పులు తరువాత చాలా పెద్ద మార్పులు అవుతాయి. ల్యాండ్ ఫిల్ చెత్త నుంచి రీసైక్లింగ్ చెయ్యగలిగే వాటిని క్రమబద్ధీకరించడం లాంటి సమిష్టి చిన్న పనుల ద్వారా పెద్ద మార్పులను సృష్టించవచ్చు. పరస్పర ఆధారిత వ్యవస్థలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం ద్వారా, ఈ ఫలితాలను మనం ప్రత్యక్షంగా చూడలేకపోయినా, చిన్న-స్థాయి పనులు మరియు ప్రవర్తనలు భవిష్యత్తులో ఎక్కువ ప్రభావానికి దారితీస్తాయనే నమ్మకాన్ని మనం పొందుతాము.
సంక్లిష్టమైన సామాజిక, ప్రపంచ సమస్యలను చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి విశ్లేషించి, వాటితో నిమగ్నం కావాలి. మన పనులు సమస్యల యొక్క చిన్న భాగాలను ఎలా పరిష్కరించగలవు మరియు ఆ భాగాలు విస్తృత వ్యవస్థలలో ఒకదానిపై మరొకటి ఎలా సంబంధం కలిగి ఉన్నాయో చూసినప్పుడు, మనకు ఆత్మవిశ్వాసం మరియు సాధికారత యొక్క భావన లభిస్తుంది. దీని కోసం, విమర్శనాత్మక ఆలోచన నైపుణ్యాలు అవసరం. ఇక్కడ, విమర్శనాత్మక ఆలోచన అనేది సంక్లిష్ట సమస్యల ద్వారా ప్రాథమిక మానవ విలువలతో తెలియజేసే విధంగా ఆలోచించే అభ్యాసం. మనం చేస్తున్న పనులు తప్పనిసరిగా ఇతరులకు ప్రయోజనకరంగా అనిపిస్తాయో లేదో అని ఇది హామీ ఇవ్వనప్పటికీ, విమర్శనాత్మక ఆలోచన నిర్మాణాత్మక ఫలితాన్ని పొందే అవకాశాన్ని పెంచుతుంది.
సమాజ మరియు ప్రపంచ స్థాయి పరిష్కారాలలో నిమగ్నం కావడం
పరిష్కారాలను పొందడం మనకు కుదరనప్పటికీ, సమస్యలు మరియు వాటికి సాధ్యమయ్యే పరిష్కారాల గురించి మనం ఇప్పటికి కూడా ఆలోచించవచ్చు. మనం ఎదుర్కొంటున్న సమస్యలను అన్వేషించడానికి ఈ క్రింది వాటిని ఉపయోగించవచ్చు:
- వ్యవస్థలు మరియు వాటి సంక్లిష్టతను గుర్తించడం
- పనుల యొక్క స్వల్ప మరియు దీర్ఘకాలిక పర్యవసానాలను అస్సెస్ చేయడం
- ప్రాథమిక మానవ విలువల నేపధ్యంలో పరిస్థితులను అస్సెస్ చేయడం
- నెగెటివ్ భావోద్వేగాలు మరియు పక్షపాతం యొక్క ప్రభావాన్ని తగ్గించడం
- ఓపెన్ మైండెడ్, సహకరాత్మక మరియు మేధోపరంగా వినయపూర్వక వైఖరిని పెంపొందించుకోవడం
- ఒక నిర్దిష్ట పని యొక్క లాభనష్టాలను పరిగణనలోకి తీసుకోవడం.
ఇవన్నీ స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక పరిణామాలను సరిగ్గా అంచనా వెయ్యకుండా యాక్షన్ తీసుకుంటారు. మనం ఒక నిర్దిష్ట సమస్యను పరిశీలిస్తున్నప్పుడు, ఒక కార్యాచరణ ద్వారా ప్రభావితమయ్యే వివిధ విషయాల గురించి కూడా మనం ఆలోచించాలి. మనం ఈ ప్రక్రియను అనుసరించి దాని గురించి తెలుసుకుంటే, పనుల యొక్క విస్తృత ప్రభావాల గురించి మరియు మొదట్లో, సమస్యకు చాలా దూరంగా కనిపించే వ్యక్తులను అవి ఎలా ప్రభావితం చేస్తాయనే దాని గురించి మనం సహజంగా ఆలోచించడం ప్రారంభిస్తాము. సమస్యలు ప్రాథమిక మానవ విలువలతో ఎలా సంబంధాన్ని కలిగి ఉన్నాయో మరియు దాని పరిష్కారాలు వ్యక్తిగత, సామాజిక మరియు ప్రపంచ అభివృద్ధిని ఎలా సహాయపడతాయో కూడా మనం తెలుసుకోవాలి.
సమాజ మరియు ప్రపంచ స్థాయి సంబంధాలలో ఇతరులతో కలిసి పని చెయ్యడానికి మరియు వాళ్ళ ఆలోచనలు, అభిప్రాయాలు, జ్ఞానం మరియు అనుభవాల నుంచి ఏదైనా నేర్చుకుని దాన్ని గౌరవించడానికి సిద్ధంగా ఉన్న ఓపెన్ మైండెడ్ ఆలోచన ద్వారా చాలా సహాయం లభిస్తుంది. ఇతరులు కూడా తమ తార్కికతను, అనుభవాన్ని ఉపయోగించి వాళ్ళు ఉన్న స్థానాలకు వస్తున్నారని భావించినప్పుడు మాత్రమే ఒక ఆరోగ్యకరమైన చర్చ సాధ్యమవుతుంది, ఒకవేళ ఆ స్థానాలు మన కంటే వేరుగా ఉన్నా కానీ. మేధో వినయం మరియు ఓపెన్ మైండెడ్ లేకపోతే సంభాషణలు మరియు పరస్పర ఏకాభిప్రాయాలు సరిగ్గా జరగవు, మరియు సంభాషణలు అనేవి గొడవలు మరియు అధికార పోరాటాలుగా మారుతాయి.
ఇతరులతో కలిసి పని చెయ్యకుండా ఒంటరి వ్యక్తులుగా మనం పరిష్కరించగల కొన్ని తీవ్రమైన సమస్యలు ఉన్నాయి, వీటికి మన ఆలోచనలు మరియు విలువలను కమ్యూనికేట్ చెయ్యగల సామర్థ్యం అవసరం. అందువల్ల సమాజం మరియు ప్రపంచ అనుసంధానం అనేది మన వైఖరిని వ్యక్తీకరించడానికి, ప్రశ్నలు అడగడానికి, ఇతరుల నుంచి నేర్చుకోవడానికి మరియు నిర్మాణాత్మకంగా సంభాషణలలో పాల్గొనే సామర్థ్యానికి బాగా సహకరిస్తుంది. మన విమర్శనాత్మక ఆలోచన మరియు లోతైన విలువల ఆధారంగా స్పష్టంగా కమ్యూనికేట్ చెయ్యగలగడం మరియు గొంతు లేని వారి తరఫున కూడా సాధికారత మరియు స్ఫూర్తిదాయకమైన రీతిలో మాట్లాడగలగడం ప్రపంచ పౌరులుగా మరియు పరివర్తన నాయకులుగా మనందరికీ ఉండే ఒక శక్తివంతమైన నైపుణ్యం.
సారాంశం
మొదటి రెండు భాగాలలో, మనం మన భావోద్వేగాలను నావిగేట్ చెయ్యడం మరియు మన కుటుంబం, స్నేహితులు మరియు సహోద్యోగులతో సామరస్యంగా ఉండడం నేర్చుకున్నాము. ఈ మూడవ మరియు చివరి భాగంలో, ప్రపంచం ఎలా ఒకరి మీద ఒకరితో ఆధారపడి ఉందో, మానవులందరూ ఆనందం కోసం మరియు బాధలను నివారించాలనే ఒకే కోరికను ఎలా పంచుకుంటారో మరియు మన పనులు విస్తృత ప్రపంచ మార్పుకు ఎలా సహాయపడతాయో అర్థం చేసుకోవడం ఉంటుంది.
మనం నివసిస్తున్న ఈ ప్రపంచం చాలా సంక్లిష్టమైనది. పెద్దలుగా, ఇతరుల సహాయం లేకుండా, మనకు మనమే జీవించగలమని కొన్నిసార్లు అనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తోటి మనుషులు మనకు ముఖ్యం కాదని అనిపించవచ్చు – ఏది ఏమైనా వాళ్ళు మనకంటే చాలా వేరుగా ఉంటారు. ఎప్పుడూ, ప్రపంచంలో ఏదైనా నిజమైన మార్పును తీసుకురావడం అసాధ్యం లేదా చాలా కష్టంగా అనిపించవచ్చు. మన పరిస్థితుల రియాలిటీను మనం అర్థం చేసుకున్నప్పుడు – మనం తినే ఆహారం, ధరించే దుస్తులు, నడిపే కార్లు అన్నీ ఇతరుల పని నుంచి ఎలా వస్తాయో అని అర్థం చేసుకున్నప్పుడు, మనకు సహజంగానే వారి పట్ల ప్రశంసా భావన కలుగుతుంది. ఈ తోటి మనుషులు కూడా మనలాగే సుఖాన్ని కోరుకుంటారని తెలుసుకున్నప్పుడు, వాళ్ళు సంతోషంగా ఉండాలనే కోరికను మనం కూడా పెంపొందించుకుంటాం. చివరిగా, చిన్న పనులే పెద్ద ఫలితాలను అందిస్తాయని తెలుసుకుని, మనం చేసే నిర్మాణాత్మక పనులు - ఎంత చిన్నవైనా - అవి ప్రపంచానికి సహాయం చేస్తాయనే నమ్మకం మనకు కలుగుతుంది.
ఈ శిక్షణా కార్యక్రమం కేవలం చదివి ఆ తర్వాత మర్చిపోవడానికి కాదు; దీన్ని మనం పాయింట్ బై పాయింట్ ప్రాక్టీస్ చెయ్యాలి. మనం అందరం వేరుగా ఉంటాము, కానీ లెక్కలేనన్ని వ్యక్తిగత కలయికలు మరియు సామాజిక పరిస్థితుల ద్వారా మన మార్గాన్ని నావిగేట్ చేసేటప్పుడు మనమందరం అనేక రకాల సవాళ్లను ఎదుర్కుంటాము. మన జీవితంలోని ఒడిదుడుకులను మేనేజ్ చేసేటప్పుడు, సొంత ప్రయోజనాల కోసం ప్రేరేపించబడిన పనులకు మరియు ఇతరుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకునే పనులకు మధ్య స్పష్టమైన తేడా ఉంటుంది. మన ప్రేరణలు మరియు పక్షపాతాల గురించి మంచి అవగాహనతో, మన ప్రతిచర్యలను నిర్వహించే మరియు పరిస్థితులను విమర్శనాత్మకంగా పరిశీలించే సామర్థ్యంతో, జీవితంలో మనం ఎదుర్కునే దేనినైనా మనం మేనేజ్ చేసుకోగలము. మనం ఇంకా ముందుకు వెళ్ళగలము మరియు మంచి కోసం ఒక శక్తిగా ఉండటానికి మన అపారమైన సామర్థ్యాన్ని గ్రహించగలము: మన మంచి, ఇతరుల మంచి మరియు విస్తృత ప్రపంచం యొక్క మంచి కోసం.
మీరు దీని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే, SEE లెర్నింగ్ ఫ్రేమ్ వర్క్ యొక్క పూర్తి వెర్షన్ ను చదవండి మరియు సెంటర్ ఫర్ కంటంప్లేటివ్ సైన్స్ మరియు కంపాషన్-బేస్డ్ ఎథిక్స్ యొక్క మిగతా ప్రోగ్రామ్ ల గురించి తెలుసుకోండి.