సార్వత్రిక నైతిక విలువలు అంటే ఏమిటి?

Uv what are universal values

సార్వత్రిక నైతిక విలువల యొక్క అర్థం

"సార్వత్రిక నైతిక విలువలు" అనే పదం మనకు ఎందుకు ఉంది? సార్వత్రిక అంటే విశ్వాసి లేదా అవిశ్వాసి ఎవరైనా ఒక విషయాన్ని అంగీకరించగలరని అర్థం. హిందువు అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, బౌద్దుడు అయినా, యూదు అయినా, జైను అయినా సరే ఈ విలువలను అంగీకరించవచ్చు. సైంటిస్టు అయినా కాకపోయినా, చదువుకున్నా లేకపోయినా అందరూ ఈ విలువలను అంగీకరించి తమ సంతోషం కోసం వాటిని పాటించడం చాలా ముఖ్యమని తెలుసుకోవచ్చు. అది సార్వత్రిక నిజం. నైతికత అనేది ఒక ప్రవర్తనా విధానం, దీన్ని అనుసరించడం ద్వారా, మిమ్మల్ని ఒక సంతోషకరమైన వ్యక్తిగా చేస్తుంది మరియు ఇతరుల సంతోషాన్ని అందిస్తుంది. సంఘం సంతోషంగా ఉంటుంది మరియు మీరు కూడా సంతోషంగా ఉంటారు. ఈ రెండూ కలిసి సార్వత్రిక నైతికత అవుతుంది.

ఒక మనిషి విశ్వం అని పిలిచే ఈ మొత్తంలో ఒక భాగం, ఇది టైమ్ మరియు స్పేస్ లో ఒక పరిమితమైన భాగం. మనిషి తనను, తన ఆలోచనలను మరియు భావాలను మిగిలిన వారి నుంచి వేరుగా ఉన్నట్లుగా అనుభవిస్తాడు, అతని తెలివిలో ఉండే ఒక రకమైన ఆప్టికల్ భ్రమ. ఈ భ్రమ మనకు ఒక రకమైన జైలు లాంటిది, ఇది మనకు దగ్గరగా ఉన్న కొంతమంది వ్యక్తుల పట్ల మన కోరికలు మరియు ప్రేమకు పరిమితం చేస్తుంది. సమస్త జీవరాశులను, ప్రకృతిని తన అందంతో చూసి మురిసిపోవడానికి మన కరుణను విస్తరించడం ద్వారా ఈ జైలు నుంచి మనల్ని మనం విముక్తి చేసుకోవడమే మన కర్తవ్యం అవ్వాలి. - ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

ఐన్‌స్టీన్ మనం అనుభవించే సమస్యలన్నింటికీ కారణం మన స్వార్ధంతో కూడిన ఆలోచనలు, మన గురించి, కేవలం ఒక చిన్న అంతర్గత వలయం గురించి ఆలోచించడం, మరియు మిగిలిన విశ్వం గురించి మరచిపోవడం అని చెప్పాడు. కేవలం ఒక చిన్న అంతర్గత వలయంతో ఈ అనుబంధం కేవలం ఒక భ్రమ మాత్రమేనని ఆయన చెప్పారు. ఎందుకు? ఎందుకంటే మనమందరం ఒకరితో ఒకరు అనుసంధానమై ఉన్నాము. ఈ జైలు నుంచి ఎలా బయటపడాలి? ఇతరులను కలుపుకునేలా మనం మన కరుణను విస్తరించాలని, ఇతరులు మన పట్ల తమ కరుణను విస్తరిస్తే, మనమందరం సంతోషంగా ఉంటామని అతను చెప్పాడు. దాన్నే అతను ప్రోత్సహిస్తున్నాడు.

నైతికతను ఎందుకు ప్రాక్టీస్ చేయాలి?

నైతికత అనేది మనస్సాక్షితో చేసే మానవ పనులు మరియు ఇది వ్యక్తి మరియు సమాజంలో ఎక్కువ సామరస్యం, శాంతి మరియు సంతోషానికి దారితీస్తుంది. ఒకరు సుఖదుఃఖాలకు లోనైనా, మనం దాన్ని మన కర్మల ఫలితంగా మాత్రమే చూడవచ్చు. అన్ని పనులు మన ఆలోచనలు, భావోద్వేగాలతో జరుగుతాయి. అనైతిక ఆలోచనలు ఈ రోజు ఈ ప్రపంచంలో మనం చూస్తున్న చెడు ఫలితాలకు దారితీస్తాయి. ఈ మూడింటి మధ్య సరైన కారణ సంబంధాన్ని అర్థం చేసుకోవడంలో మన వైఫల్యమే, అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి:

  • ఆలోచనలు మరియు భావోద్వేగాలు
  • మన పనులు
  • సంతోషం లేదా బాధ ఫలితంగా వచ్చే పర్యవసానాలు ఉంటాయి.

మనకు సంతోషం కావాలనే ఆశ ఉండవచ్చు, కానీ ఆలోచనలతో, మనం బాధ మరియు దుఃఖానికి దారితీసే పనులను చేసుకుంటూ పోతాము. కాబట్టి తెలివి అంటే ఏమిటి, ఆలోచనలు, భావోద్వేగాలు అంటే ఏమిటి, మరియు చివరికి ఒక నిర్దిష్ట ఫలితాన్ని ఇవ్వడానికి ఈ ఆలోచనలు మరియు తెలివితేటలు మన పనులను నియంత్రించే యంత్రాంగాలు పని చేసేవి ఏమిటి అనే దానిపై మనకు సరైన జ్ఞానం అవసరం. అప్పుడు మనం ఆశించిన ఫలితాలను తెచ్చిపెట్టే పనులను సులభతరం చేసే మనస్తత్వాలను పెంపొందించుకోవడం మరియు మన విలువను తగ్గించే పనులను విడిచిపెట్టడం తెలివైన నిర్ణయం. ఈ నైతికత, మరియు దాని అన్ని సూత్రాలను నొక్కి చెప్పేది కరుణ.

అప్పుడు సుఖదుఃఖాలకు తెచ్చి పెట్టేది మన మనస్సులే. ఇది మన భావోద్వేగాలు మరియు వాటి కారణాలపై కూడా ఆధారపడి ఉంటుంది. భావోద్వేగాలు మన ఆలోచనలను నడిపిస్తాయి, మరియు మన ఆలోచనలు మన పనులను నడిపిస్తాయి. మనకు ఆనందాన్ని తెచ్చిపెట్టే భావోద్వేగాలు "పాజిటివ్ భావోద్వేగాలు". సార్వత్రిక అర్థంలో, మనం "అసలైన పాపం" గురించి మాట్లాడలేము. మనం చాలా సార్వత్రిక రీతిలో మాట్లాడాలి. ప్రపంచవ్యాప్తంగా, నిజమైన సంతోషాన్ని కలిగించేవి పాజిటివ్ భావోద్వేగాలు, మరియు దుఃఖానికి కలిగించేవి వినాశకరమైన భావోద్వేగాలు అని చెప్పవచ్చు. వీటిని మనం మనస్సు విషయంలో ఒక భాగంగా అధ్యయనం చేసి నేర్చుకోవాలి. అటువంటి ఆలోచనలతో ప్రజలకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది.

పాఠశాల వ్యవస్థలో సార్వత్రిక నైతిక విలువలను బోధించడం

వ్యక్తులకు మరియు సమాజానికి అర్థవంతమైన వాటిని బోధించడానికి ప్రజలను మనం ఎలా ప్రభావితం చెయ్యాలి? దేవుని భయం అనే భావనపై ఆధారపడి నైతికతను కలిగి ఉన్నవారు కొంతమంది ఉన్నారు. కొంతమంది అసలు దేవుడిని నమ్మరు, కానీ కర్మపై నమ్మకాన్ని కలిగి ఉంటారు, కర్మ ఆధారంగా, వాళ్ళు మంచిగా ప్రవర్తించి జాగ్రత్తగా ఉండాలని అనుకుంటారు. కానీ కొందరు భగవంతుడిని, కర్మను దేన్నీ నమ్మరు. భగవంతుడు, కర్మ అనే భావన లేకుండా, నైతికత అనేది పాటించాల్సిన విషయం అని మనం ప్రజలను ఎలా ఒప్పించగలము? దీని కోసం, దలైలామా గురువు గారు ఈ క్రింది మూడు విషయాలను బోధించారు:

  • సాధారణ అనుభవం
  • ఇంగిత జ్ఞానం
  • శాస్త్రీయ పరిశోధనలు.

వీటి ఆధారంగా, ఆధునిక విద్యా విధానంలో సార్వత్రిక నీతిని బోధించడానికి గురువు గారు మూడు దశలను ప్రతిపాదించారు.

విశ్వాసులకు లేదా అవిశ్వాసులకు సాధారణ అనుభవం ఆధారంగా బోధించడానికి ఒక ఉదాహరణ ఏమిటంటే, చిన్న పిల్లలుగా మన తల్లులు తల్లి పాలు పట్టించే విధానం. ఇది ఎటువంటి మతతత్వం లేదా తత్వశాస్త్రం లేని ఒక సాధారణ అనుభవం - ఇది మన తల్లుల నుంచి మనకు లభించే స్వచ్ఛమైన ప్రేమ మరియు ఆప్యాయత. ఈ ప్రేమ, ఆప్యాయతలు తల్లీ బిడ్డలకు ఒకరిపై ఒకరికి నమ్మకం, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి, అక్కడి నుంచి మిగతావన్నీ పోతాయి. వినాశకరమైన భావోద్వేగాలు పోతాయి మరియు ప్రపంచంలోని గందరగోళం కూడా పోతుంది. ప్రేమ, ఆప్యాయతలు మాత్రమే మిగులుతాయి. ఉగ్రవాదం, లింగ వివక్ష, ధనిక, పేద ప్రజల మధ్య తేడా లాంటివన్నీ ఇతరుల పట్ల ప్రేమ, ఆప్యాయత లేకపోవడం వల్లనే వస్తున్నాయి.

ఇంగిత జ్ఞానం అంటే ఒక వ్యక్తి ఎక్కువ ప్రేమతో ఉంటే, అతని చుట్టూ ఎక్కువ మంది స్నేహితులు ఉంటే, వారు ఇంట్లో ఉన్నట్లు భావించి ఆ వ్యక్తులను తమ తమ్ముళ్లు మరియు చెల్లెళ్లుగా చూస్తారు. ఎదుటి వారి పట్ల మనకు ఈ ప్రేమ, ఆప్యాయత కలగనప్పుడు, మన ఇంట్లో కూడా మనం ఇలాంటి అనుభూతిని పొందలేము. మనకు తోడ పుట్టిన వాళ్ళు కూడా మనల్ని శత్రువులుగా చూస్తారు. ఇంగిత జ్ఞానం కోణం నుంచి చూస్తే, ప్రేమ, ఆప్యాయతలు సార్వత్రిక నైతికతకు మూల స్తంభం అని మనం నమ్మవచ్చు.

చివరిగా, శాస్త్రీయ పరిశోధనలు, ఉదాహరణకు, పిల్ల కోతులను వాటి తల్లుల నుంచి వేరు చేసి, వాటి తల్లులు ఆ పిల్లలను చూసుకోనప్పుడు కలిగే అనుభవాన్ని గుర్తించే ప్రయోగాలను చూడండి. అప్పుడు, అవి పెద్దయ్యాక, చాలా దూకుడుగా మారిపోతాయి. వాటికి వేరే వాటితో ఎలా ఆడుకోవాలో తెలియదు, కానీ వాటిని అవి రక్షించుకుంటాయి మరియు మిగతా వాటితో గొడవ పడతాయి. మరోవైపు తల్లులతో పాటు ఉండే పిల్ల సంతోషంగా, ఆడుకుంటూ ఉంటాయి.

ఈ మూడు భావనల ఆధారంగా నిజమైన ప్రేమ, ఆప్యాయతలు - సార్వత్రిక నైతికతకు మూలమైనవి - అందరిలో పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని గురువు గారు చెప్పారు.

ఒక మనిషిగా సార్వత్రిక గుర్తింపును కలిగి ఉండటం

సార్వత్రిక నైతికతను ప్రవేశపెట్టడం ద్వారా మనం ఎదుర్కొంటున్న ఒక సవాలు మన గుర్తింపు. "నేను టిబెటన్, నేను చైనీస్, నేను బౌద్దుడిని, నేను హిందువును" అని మనకు అనిపించినప్పుడు, మన సొంత అస్తిత్వాల పట్ల అటువంటి అనుబంధాలు కనిపించిన మరుక్షణం, ఇతరుల పట్ల మనకు అయిష్టం ఏర్పడుతుంది. ఇది చాలా పెద్ద సవాలు మరియు చాలా తీవ్రమైన విషయం.

ఒక వ్యక్తికి వందలాది వేర్వేరు గుర్తింపులు ఉండవచ్చు. ఉదాహరణకు, నేను ఒక పురుషుడిని అని చెప్పగలను మరియు దీనితో, పురుషాధిక్యత భావన వస్తుంది. పురుషాధిక్యత ఆధారంగా, స్త్రీవాదం వస్తుంది. నేను బౌద్దుడిని అని అనుకుంటే, మీరు బౌద్ధేతరులుగా అనిపిస్తారు. నేను హిందువునో, ముస్లిమో అయితే మీరు హిందువేతరులు, ముస్లిమేతరులు లాగా అనిపిస్తారు. ఒక వ్యక్తి బాగా అభివృద్ధి చెందకపోతే కానీ, తక్కువ ముఖ్యమైన గుర్తింపును అత్యంత ముఖ్యమైన గుర్తింపుగా ఆలోచించే ప్రమాదం లేదా ధోరణి ఉంటుంది. ఫండమెంటలిజం, రాడికలిజం ఇవన్నీ అత్యున్నతమైన గుర్తింపును కలిగి ఉండటం వల్లనే వస్తాయి.

మనమందరం కేవలం మనుషులుగా ఎందుకు గుర్తించబడకూడదు? గ్రహాంతరవాసులు వచ్చి మనపై కాల్పులు జరపడం మొదలుపెడితే, అప్పుడు మనం ఈ భూ గ్రహానికి చెందిన వాళ్లం అనే గుర్తింపు వస్తుంది, అలా మనం ఐక్యంగా ఉంటాం. మన గుర్తింపును సృష్టించడానికి మూడవ విషయం కోసం మనం ఎందుకు వేచి ఉండాలి? ఇప్పుడే మన కోసం ఒక గుర్తింపుని ఎందుకు తయారు చేసుకోకూడదు? ఏ గుర్తింపు మనల్ని మరియు ప్రపంచాన్ని సంతోషంగా ఉంచుతుంది? మనిషిగా మన గుర్తింపుని పొందితే, మనం సంతోషంగా ఉన్నామని, అందర్నీ సోదర సోదరీమణులుగా చూస్తామని మనకు తెలుస్తుంది.

Top