మనశ్శాంతి మరియు సంతృప్తిని కనిపెట్టడం

Study buddhism universal values 02

ఒక సందర్భం యొక్క వాస్తవికతను పరిశోధిస్తే వచ్చే ప్రాముఖ్యత

మనశ్శాంతి అనేది మానసిక ప్రశాంతతకు సంబంధించినది. శారీరక అనుభవం మన మానసిక ప్రశాంతతను నిర్ణయించదు. మనకు మానసిక ప్రశాంతత ఉంటే శారీరక సంతోషం అంత ముఖ్యమైనది కాదు.

ఇప్పుడు, మనం ప్రార్థన చేసి మనశ్శాంతిని పె౦పొ౦ది౦చుకోవాలా? కాదు, ఆలా చెయ్యాల్సిన పని లేదు. శారీరక శిక్షణ ద్వారా పె౦పొ౦ది౦చుకోవాలా? కాదు. కేవలం జ్ఞానాన్ని సంపాదించడం ద్వారా పె౦పొ౦ది౦చుకోవాలా? కాదు. మన భావాలను నిర్వీర్యం చేసుకుని పె౦పొ౦ది౦చుకోవాలా? కాదు. కానీ ఏదైనా కష్టమైన పరిస్థితిని ఎదుర్కుంటున్నప్పుడు, ఆ పని యొక్క ప్రయోజనం మరియు దాని వల్ల కలిగే నష్టాలపై మనకు పూర్తి అవగాహన ఉండి అప్పుడు ఆ పరిస్థితిని ఎదుర్కుంటే, మన మనస్సు ఎలాంటి బాధను అనుభవించదు. అదే మనకు నిజమైన మనశ్శాంతి.

కాబట్టి, కరుణ మరియు వాస్తవిక దృక్పథాన్ని కలిగి ఉండటం అనేది చాలా ముఖ్యం. అనుకోని పరిస్థితులు ఎదురయ్యి అవి మనకు  భయాన్ని కలిగించినప్పుడు, దానికి కారణం అనేది మనం అవాస్తవికమైన ఆలోచనలతో ఉండటమే. మనం వాటి నుంచి వచ్చే అన్ని పర్యవసానాలను తెలుసుకోలేము. అందువల్ల మనకు దాని గురించి సరిగ్గా అవగాహన లేకుండా అది మనకు అర్ధం కాదు. దానిని సరిగ్గా అర్ధం చేసుకోకపోవడం వల్లే మనకు ఆ భయం వస్తుంది, కాబట్టి ఆ పరిస్థితిని మనం అన్ని వైపుల నుంచి పూర్తిగా అర్ధం చేసుకోవాలి. ప్రతిసారీ వాస్తవానికి మరియు మనకు కనపడేదానికి మధ్య ఎంతోకొంత తేడా ఉంటుంది, కాబట్టి మనం దాన్ని అన్ని వైపుల నుంచి అర్ధం చేసుకోవాలి.

దేనినైనా చూసిన వెంటనే అది పాజిటివ్ లేదా నెగిటివ్ ఆ అని తెలుసుకోవడం కష్టం. కానీ, మనం [దానిని క్షుణ్ణంగా పరిశీలించి] దాని అసలు నిజాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే, అది పాజిటివ్ లేదా నెగిటివ్ ఆ అని అంచనా వెయ్యగలము. కాబట్టి, మన పరిస్థితులను మనం హేతుబద్ధంగా అంచనా వేసుకోవాలి. "నాకు ఈ ఫలితం కావాలి, లేదా ఆ ఫలితం కావాలి" అనే కోరికతో అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, మన అంచనా పక్షపాతంగా మారుతుంది. భారతదేశానికి చెందిన నలంద సంప్రదాయం మనం ఎప్పుడూ అనుమానాస్పదంగా ఉంటూ మతంతో సహా అన్ని రంగాలను నిష్పాక్షికంగా పరిశోధించాలని చెబుతుంది.

మన ఆలోచనలు అందరికి అందేలా చెయ్యడంలో ఉండే ప్రాముఖ్యత

ఎవరికైతే ఎక్కువ స్వీయ-కేంద్రీకృత ప్రేరణ ఉంటుందో వాళ్లు మనశ్శాంతి లేకుండా అసంతృప్తికి గురవుతారు. ఒక వ్యక్తికి తన బాధను అధిగమించి ఆనందాన్ని పొందే హక్కు ఉంది. కానీ మనం మన గురించే ఆలోచిస్తే మన మనస్సు చాలా నెగెటివ్ గా మారుతుంది. అప్పుడు ఒక చిన్న సమస్య కూడా పెద్దగా కనిపించి మనకు ఇబ్బంది అనిపిస్తుంది. ఎదుటివారిని మన లాగే ఆత్మీయులుగా భావించినప్పుడు మన మనస్సు సాదరా భావంతో విశాలంగా ఉంటుంది. అప్పుడు, పెద్ద సమస్య అసలు ఒక సమస్య లాగే కనిపించదు. కాబట్టి, మనం విషయాలను ఎలా చూస్తున్నామనే దానిపై ఆధారపడి భావోద్వేగంలో పెద్ద వ్యత్యాసం ఉంటుంది.

కాబట్టి, మన మనశ్శాంతికి రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. మొదటిది వాస్తవికతపై అవగాహన. మనం విషయాలను వాస్తవికంగా చూసి వ్యవహరిస్తే వాటివల్ల మనకు ఎలాంటి అనుకోని నష్టం జరగదు. రెండోది కరుణ, ఇది మన "అంతర్గత ద్వారం" అని పిలువబడే దానిని తెరుస్తుంది. భయం, మరియు అనుమానం మనల్ని ఇతరుల నుంచి దూరం చేస్తాయి.

మనం బయట కనిపించే రూపం గురించి పట్టించుకోకపోవడం

[మనం మన మనశ్శాంతిని కోల్పోవటానికి ఆలోచించే మరొక విషయం ఏమిటంటే మన బయట ఎలా కనిపిస్తున్నామనే ఆలోచనే.] ఉదాహరణకు, నేను మొదటిసారి బీజింగ్ కు వెళ్లినప్పుడు, నాకు ఎటువంటి అనుభవం లేదు. నేను కొంచెం భయపడి ఆందోళన పడ్డాను. కానీ అప్పుడు నేను కొంత మందిని గమనించాను వాళ్లు అసలు వాళ్ల రూపం గురించి ఆలోచిస్తున్నారా లేదా అని, ఆ సమయంలో వాళ్ల నుంచి ఏదైనా తప్పు జరిగితే వారి ముఖం ఎర్రగా మారిపోయేది. కానీ వాళ్లు ఓపెన్ గా ఉండి ఏ తప్పు జరిగినా పట్టించుకోకపోతే అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు.

ఉదాహరణకు, 1954లో, నేను బీజింగ్ లో ఉన్నప్పుడు, ఇండియన్ అంబాసిడర్ నన్ను చూడటానికి నా రూమ్ లోకి వచ్చారు. చైనీయులు పువ్వులు, పండ్లు మొదలైన వాటితో భారీ సన్నాహాలు చేశారు. వాళ్లు మాకు ఒక చైనీస్ అనువాదకుడిని కూడా ఇచ్చారు. కాబట్టి ఇది టిబెటన్ నుండి చైనీస్ నుండి ఇంగ్లీష్ లోకి వెళ్ళింది, కానీ అక్కడ నా అధికారులలో కొంత మందికి ఇంగ్లీష్ భాష తెలుసు. ఒకానొక సమయంలో ఆ పండ్లన్నీ కింద పడిపోయాయి. అప్పటి వరకు చాలా ఫార్మల్ గా ఉన్న ఆ చైనా అధికారులు మోకాళ్ల మీద కూర్చొని చేతులతో ఆ పండ్లను తీశారు. వాళ్ళు ఎలా కనిపిస్తారనే దాని గురించి పట్టించుకుని ఉండకపోతే, అది పెద్ద సమస్య అయ్యేది కాదు. కానీ ఇది వాళ్లకు కాస్త ఇబ్బందిగా అనిపించింది.

మెక్సికో సిటీలో ఒకసారి, ఒక మతాంతర సమావేశంలో, ఒక జపనీస్ పూజారి ఉన్నారు. అతని చేతిలో పూసల జపమాల ఒకటి ఉంది. దాని తాడు తెగిపోయింది. ఆ పూసలు నేల మీద అంతా పడిపోయినా కూడా తన వేలితో ఇంకా జపిస్తూనే ఉన్నారు. వాటిని తీసుకోవడానికి అతను చాలా ఇబ్బంది పడ్డారు. తన రూపం గురించి అతను ఆలోచించటం వల్ల అతను చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు.

ఏదేమైనా, కరుణ, పరోపకారం, సత్యం మరియు నిజాయితీ - మీ బయట కనిపించే రూపం గురించి ఆందోళన చెందకుండా అంతర్గత ప్రశాంతతను తీసుకురావడానికి చాలా ముఖ్యమైనవి. నేను ఒక ప్రత్యేకమైన మనిషిని అని ఎప్పుడూ చెప్పలేదు, కానీ నా స్వంత అనుభవం నుంచి నాకు వేలాది మంది ముందు ఎలా ప్రవర్తించాలి అనే దానికి గురించి నాకు ఎలాంటి ఆందోళన లేదు. ఇలాంటి ఉపన్యాసాలలో నేను వేలాది మందితో మాట్లాడటానికి ఇష్టపడతాను, ఎందుకంటే నాకు ఇది కొంత మందితో మాట్లాడినట్టే ఉంటుంది. ఏదైనా తప్పు జరిగితే, నేను దాని గురించి అస్సలు పట్టించుకోను. నా పక్కన వాళ్ళు కూడా తప్పులు చేస్తే నేను ఊరికే ఒక నవ్వు నవ్వుతాను.

అంతర్గత మార్పు

ఇప్పుడు అంతర్గత మార్పుల విషయానికొస్తే, ఇది భావోద్వేగ స్థాయి గురించి వివరిస్తుంది. ఈ అంతర్గత మార్పులలో రెండు ఉంటాయి. ఒకటి ఏమో వయస్సు ద్వారా సహజంగా వచ్చేది, ఇంకొకటి ఏమో బయట పరిస్థితుల నుంచి వచ్చేది. ఈ రకమైన మార్పులు ఆటోమేటిక్ గానే వచ్చేస్తాయి. మిగతావి కష్టపడటం ద్వారా వస్తాయి మరియు మన కోరికలకు అనుగుణంగా అంతర్గత మార్పుని తీసుకురావటమే మనకు ప్రధానమైన లక్ష్యం.

ఇప్పుడు, మనం మన వచ్చే జన్మ, మోక్షం లేదా స్వర్గం గురించి మాట్లాడుకోవటం లేదు, కానీ ఇన్ని కష్టాలు మరియు సమస్యలు ఉన్నప్పటికీ ఈ జీవితాన్ని చాలా సంతోషంగా మరియు ప్రశాంతంగా ఎలా బ్రతకాలనే దాని గురించి మాట్లాడుతున్నాము. దీనికోసం మనం కోపం, ద్వేషం, భయం, అసూయ, అనుమానం, ఒంటరితనం, ఒత్తిడి మొదలైన ప్రధాన అంశాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవన్నీ మన ప్రాథమిక మానసిక దృక్పథానికి సంబంధించినవి. అవి చాలా స్వార్ధంగా ఉండటం వల్ల వస్తాయి. మనం వీటిని అనుభవించినప్పుడు, స్వార్ధం అనేది ముఖ్యమైనది అయ్యి అసూయను కలిగిస్తుంది. అప్పుడు మన గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఏదైనా చిన్న చికాకు వచ్చినా అది కోపానికి దారితీస్తుంది, కోపం భయాన్ని తెచ్చిపెడుతుంది. మనం మిగతా వాళ్లను పట్టించుకోము. మనల్ని మనం మాత్రమే పట్టించుకుంటాము. ఇతరులు కూడా వాళ్ల గురించి వాళ్లే పట్టించుకుంటారని మనం అనుకుని మన గురించి అస్సలు పట్టించుకోరని భావిస్తాము. దాని వల్ల మనం ఒంటరిగా ఫీలవుతాము. "నేను ఇతరులపై ఆధారపడలేను" అని మనం అనుకుంటాము, కాబట్టి మనకు ఎదురుగా ఉన్నవారిని, పక్క వారిని మరియు మన వెనుక ఉన్నవారిని అందరినీ మనం అనుమానిస్తాము.

బేసిక్ గా మనం దాని గురించి ఆలోచించినప్పుడు, మానవ స్వభావం ఎలాంటిది అంటే ప్రతి ఒక్కరూ స్నేహాన్ని మెచ్చుకుంటారు. స్నేహాన్ని పెంచుకుంటే చాలా మంది పాజిటివ్ గా మనకు రిలేట్ అవుతారు. ఆందోళనను కలిగించే ఈ నెగెటివ్ భావోద్వేగాల విషయానికొస్తే, వాటిని వ్యతిరేకించడానికి మనకు కొన్ని ప్రతి చర్యలు అవసరం. ఉదాహరణకు, మనకు చాలా వేడిగా అనిపిస్తే, మనం టెంపరేచర్ ని తగ్గిస్తాము, లేదా చీకటిని తీసెయ్యాలని అనుకుంటే, లైట్ ని తీసుకురావటం తప్ప మనకు వేరే మార్గం లేదు. ఇది భౌతిక స్థాయిలో నిజమే. దానికి అనువైన విరుద్ధమైన శక్తిని ఉపయోగించడం వల్ల మార్పు వస్తుంది - అది ప్రకృతి వల్ల అలా జరుగుతుంది. కానీ ఇది భౌతిక స్థాయిలోనే కాదు, మానసిక స్థాయిలోనూ వర్తిస్తుంది. కాబట్టి, మన ఆలోచనను లేదా దృక్పథాన్ని ఒక వ్యతిరేక ఆలోచనతో ఎదుర్కోవాలి [ఇతరుల పట్ల శ్రద్ధ మరియు స్నేహంతో స్వీయ-కేంద్రీకృతను మరియు అనుమానాన్ని వ్యతిరేకించడం వంటివి].

ఉదాహరణకు ఒక పసుపు పువ్వుని తీసుకోండి. ఏదో కారణం వల్ల "అది తెల్లగా ఉంది" అని నేను చెప్పి, తరువాత ఆ మాటను పసుపు రంగు అని మార్చి చెప్తే, అప్పుడు ఇవి రెండు విరుద్ధమైన ఆలోచనలు. అవి రెండు ఒకే చోట ఉండలేవు. పసుపు రంగు గురించి మీకు ఆలోచన వచ్చిన వెంటనే తెలుపు రంగు అనే భావన పోతుంది. ఇవి ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. కాబట్టి, అంతర్గత మార్పును తీసుకురావడానికి ఒక రకమైన పద్ధతి వ్యతిరేక మానసిక స్థితిని తీసుకురావడం.

కష్టానికి ఇంకొక కారణం అజ్ఞానం కావచ్చు. దానికి పనికి వచ్చే ది ఏమిటంటే, విశ్లేషణ, మరియు పరిశోధన. ఎందుకంటే అజ్ఞానం అనేది వాస్తవాన్ని చూడకపోవడంతో వస్తుంది. కాబట్టి, అజ్ఞానానికి ప్రతిరూపాత్మకమైన పని విశ్లేషణ. అదే విధంగా, స్వీయ-సంరక్షణ యొక్క ప్రతిఘటన శక్తి ఇతరులకు ఆందోళన కలిగిస్తుంది. ఇందులో మనస్సు యొక్క శిక్షణ [లేదా మన ఆలోచనలను మార్చుకోవడంగా] ఉంటుంది.

లౌకిక నైతిక విలువలు

మన మనస్సులకు ఎలా శిక్షణ ఇవ్వాలి [లేదా మన ఆలోచనలను ఎలా మార్చుకోవాలి], ఈ ప్రశ్న మతం లేదా ఆధ్యాత్మికతకు సంబంధించినది అని మీరు అనుకుంటున్నారా. నేను అయితే దీనికి మతంతో అస్సలు సంబంధం లేదని అనుకుంటాను.

ఆధ్యాత్మికత విషయానికొస్తే, ఇవి రెండు రకాలు: ఒకటి మతం మరియు విశ్వాసంతో సంబంధించింది, ఇంకొకటి ఇవి లేకుండా ఉండేది. అవి లేని దాన్ని నేను "లౌకిక నీతి విలువలు" అని పిలుస్తాను. "లౌకికవాదం" అంటే మతాన్ని తిరస్కరించడం కాదు, అన్ని మతాల పట్ల సమాన ఆలోచనా తీరుతో మరియు గౌరవంతో ఉండటం. ఉదాహరణకు, భారత రాజ్యాంగంలో అన్ని మతాల పట్ల గౌరవం ఉంటుంది. ఇది ఒక లౌకిక రాజ్యాంగం. అందువల్ల, ఫార్సీలు లేదా జొరాస్ట్రియన్ సమూహం భారతదేశంలో చాలా తక్కువగా ఉన్నప్పటికీ - అంటే భారతదేశంలోని బిలియన్లకు పైగా ప్రజలలో వాళ్ళు లక్ష మంది మాత్రమే ఉన్నప్పటికీ - వారికి సైన్యంలో మరియు రాజకీయ రంగంలో సమాన స్థానం ఇవ్వబడింది.

లౌకిక నీతి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, ఇది అవిశ్వాసులు అంటే నాస్తికుల నైతికతను సూచిస్తుంది. లౌకిక నైతిక విలువల ఆధారంగా జంతువులకు కూడా మన నైతికతను, గౌరవాన్ని విస్తరించవచ్చు. అలాగే, లౌకిక ఆధ్యాత్మికత లేదా నైతిక విలువల యొక్క మరొక భాగం మన పర్యావరణాన్ని కాపాడుకోవడం. లౌకికంగా, మనం మన మనస్సులను ఆలోచింపచేసుకోవాలి; మనం మన లౌకిక నైతిక విలువలను పెంపొందించుకోవాలి. ఈ భూమి మీద ఉన్న 6 బిలియన్ల మంది ఆ పనిని చేయాలి. మత వ్యవస్థలు లౌకిక నైతిక విలువలను పెంపొందించటానికి సహాయపడతాయి - అవి ఆ పెరుగుదలకు కోసం సహాయపడే అదనపు పనిముట్లు. అవి దీనిని తగ్గించటానికి ఎలాంటి ప్రయత్నం చెయ్యవు.

కాబట్టి, లౌకిక నైతిక విలువల గురించి మాట్లాడేటప్పుడు, మనకు అశాస్త్రీయ దృక్పథం ఉంటుంది. ఒక మతాన్ని అనుసరించే వ్యక్తి లౌకిక నైతికత విలువలను పెంపొందించడానికి పనిచేస్తే, అతను నిజంగానే ఆ మతపరమైన భక్తుడు అని అర్ధం. అతను అలా చెయ్యకపోతే, వారు చర్చికి లేదా మసీదుకు లేదా ఏ ప్రార్థనా మందిరానికి వెళ్లినా, వాళ్లు నిజంగా వాళ్ల మతానికి కట్టుబడి ఉన్నారా లేదా అని నేను సందేహిస్తాను.

Top