సరైన ఆలోచన మరియు ఉద్దేశ్యం

సరైన అవగాహన అనేది ఏది సరైనదో, ఏది తప్పైనదో, ఏది సహాయం చేస్తుందో, ఏది హానికరం చేస్తుందో తెలుసుకోవడమే. దీని కోసం, మనకు ఈ ఎనిమిది మార్గాలలో చివరి రెండు విషయాలు ఉన్నాయి: అవే సరైన ఆలోచన మరియు సరైన ఉద్దేశ్యం (సరైన ప్రేరణను కలిగించే ఆలోచన).

సరైన ఆలోచన అనేది మనం నిజమని నమ్మేదానికి సంబంధించినది, ఏది సరైనదో మరియు ఏది తప్పైనదో, లేదా ఏది హానికరమైనదో మరియు ఏది సహాయకారి అని. ఇది మన నిర్మాణాత్మక మానసిక స్థితికి సరైన ప్రేరణను కలిగి ఉంటుంది.

ఆలోచన

మనకు సరైనది లేదా తప్పు వివక్ష అవగాహన ఉండవచ్చు:

  • మనం ఒక విషయాన్ని సరిగ్గా చూసి అది నిజమని నమ్మవచ్చు.
  • మనం ఒక విషయాన్ని తప్పుగా చూసి అది నిజమని నమ్మవచ్చు.

మనకు తప్పు అవగాహన ఉండి అదే నిజం అని నమ్మినప్పుడు అది తప్పు అవుతుంది. సరైన ఆలోచన సరైన అవగాహనను కలిగి ఉండి దానిని నిజం అని నమ్మినప్పుడు ఉంటుంది.

తప్పు ఆలోచన

ఉదాహరణకు, మన పనులకు నైతిక విలువ లేదని, కొన్ని వినాశకరమైనవి, కొన్ని నిర్మాణాత్మకమైనవి, మరియు అవి మనం అనుభవించే వాటి వల్ల ఫలితాలను ఇవ్వవని నమ్మడం తప్పుడు ఆలోచన. ఈ రోజు చాలా మందికి ఉన్న "ఏదొకటిలే" అనే మనస్తత్వమే దీనికి కారణం. అది నాకు అవసరం లేదు; ఏదీ అసలు ముఖ్యం కాదు అని. ఏమైనా కానీ నేను ఈ పని చేసినా చెయ్యకపోయినా ఏం ఫర్వాలేదు. ఇది సరైనది కాదు. మీరు స్మోక్ చేస్తున్నారా లేదా అనేది ముఖ్యం. మీరు స్మోక్ చేస్తుంటే, అది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

మనల్ని మనం మెరుగుపరచుకోవడానికి, మన లోపాలను అధిగమించడానికి వేరే మార్గం ఏదీ లేదని నమ్మడం మరో తప్పు ఆలోచన, కాబట్టి దీనిని పట్టించుకునే అవసరమే లేదు. ఇది తప్పు ఎందుకంటే విషయాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు లేదా కాంక్రీట్‌పై రాసి ఉండవు. ఇతరుల పట్ల దయగా ఉండి సహాయం చేయడానికి ప్రయత్నించడంలో ఏ అర్థం లేదని, ప్రతి ఒక్కరినీ వాడుకుని సాధ్యమైనంత ఎక్కువ లాభం పొందడానికి ప్రయత్నించాలని, అదే సంతోషాన్ని ఇస్తుందని కొందరు నమ్ముతారు. ఇది తప్పు ఎందుకంటే ఇది సంతోషాన్ని తెచ్చిపెట్టదు. ఇతరులు మన వస్తువులను దొంగిలిస్తున్నారనే ఆలోచన, అసూయ, ఆందోళనలను కలిగిస్తుంది.

అనేక రకాలైన తప్పు ఆలోచనలు ఉన్నాయి. ఇవి బాధలను డీల్ చెయ్యగలవు మరియు కారణాలను తెచ్చిపెట్టగలవు. ఉదాహరణకు. మీ పిల్లవాడు స్కూలులో చెడుగా ప్రవర్తిస్తున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోండి. తప్పుగా ఆలోచించడం అంటే, "ఇదంతా నా వల్లే. తల్లిదండ్రులుగా నాదే తప్పు." ఇదే తప్పు ఆలోచన. కేవలం ఒక కారణం వల్ల అన్నీ జరిగిపోవు. ఒకటి కాదు, అనేక కారణాలు మరియు పరిస్థితుల వల్ల ఇలా జరుగుతుంది. మనం సహాయం చేసి ఉండవచ్చు, కానీ ఆ సమస్యకు మనం మాత్రమే కారణం కాదు. కొన్నిసార్లు మనకు దానికి సంబంధం కూడా ఉండదు - ఇది పూర్తిగా తప్పుగా ఆలోచించటం. బాగా బాధలో ఉన్న ఒక వ్యక్తి ఉదాహరణ గురించి నేను ఆలోచిస్తున్నాను: అతను ఒక ఫుట్ బాల్ ఆటకు వెళ్ళాడు అక్కడ అతని టీమ్ ఓడిపోయింది. తన టీమ్ ఓడిపోవడానికి ఒకే ఒక కారణం తాను ఆ ఆటకు వెళ్లడం అని అనుకున్నాడు. దాన్నే అతను: "నా టీమ్ ఓడిపోవడానికి నేనే కారణం" అని అన్నాడు. ఇది అస్సలు సరైనది కాదు. కారణానికి సంబంధించి ఇది తప్పు ఆలోచన.

సరైన ఆలోచన 

సరైన ఆలోచన చాలా ముఖ్యం, దీని కోసం మనం వాస్తవికత, కారణాలు మొదలైనవన్నీ నేర్చుకోవాలి. అనేక కారణాలు, పరిస్థితుల వల్ల ప్రభావితమైన వాతావరణం లాగా, మనల్ని మనం దేవుడిలా తప్పుగా అనుకోకూడదు. అక్కడ మనం ఒక పని చేస్తే మన పిల్లలు పాఠశాలలో చెడుగా ఉన్నా కానీ అంతా బాగుంటుంది అని అనుకోకూడదు. అన్నీ అలా జరగవు.

విచక్షణా అవగాహనకు మన సరైన విచక్షణపై దృష్టి పెట్టడానికి ఇంగిత జ్ఞానం, తెలివితేటలు మరియు ఏకాగ్రత అవసరం. దీని కోసం, మనకు క్రమశిక్షణ అవసరం. ఇవన్నీ ఈ విధంగానే ఉంటాయి.

ఉద్దేశం (ప్రేరణ కలిగించే ఆలోచన)

ఏది సహాయకారిగా ఉంటుంది మరియు ఏది హానికరం, ఏది వాస్తవమైనది మరియు ఏది కాదు అనే దాని మధ్య తేడా తెలుసుకున్న తర్వాత, మన ఉద్దేశం లేదా ప్రేరేపించే ఆలోచన అనేది మనం మాట్లాడే లేదా ప్రవర్తించే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. మనం తప్పుగా ఆలోచిస్తే, ఒక తప్పుడు ప్రేరణాత్మక ఆలోచన అనుసరిస్తుంది, అదే సరిగ్గా ఆలోచిస్తే, ఒక సరైన ప్రేరణ ఆలోచన వస్తుంది.

తప్పు ఉద్దేశం

ఉద్దేశం లేదా ప్రేరేపించే ఆలోచన ప్రభావితం చేసే మూడు ప్రధాన అంశాలు ఉన్నాయి:

ఇంద్రియ కోరికలు

ఇంద్రియ కోరికలపై ఆధారపడినదే తప్పుడు ప్రేరణ ఆలోచన - ఇంద్రియ వస్తువులు అందమైన వస్తువులు, సంగీతం, మంచి ఆహారం, మంచి బట్టలు మొదలైనవాటిపై ఆధారపడి ఉంటాయి. మన కోరికలను కొనసాగించాలనే మన ప్రేరణాత్మక ఆలోచనలు చాలా ముఖ్యమైనవి అని అనుకోవడం తప్పుగా ఆలోచించడంపై ఆధారపడి ఉంటుంది. మనకు సరైన ఆలోచన ఉంటే, మనకు సమతుల్యం ఉంటుంది, ఇది ఇంద్రియ వస్తువులపై మమకారం లేని సమతుల్యమైన మనస్సు అవుతుంది.

ఒక ఉదాహరణ ఏమిటంటే, మనం ఎక్కడ భోజనం చేస్తాము మరియు ఏమి తింటున్నాము అనేది చాలా ముఖ్యం అని తప్పుగా ఆలోచించడం. మెనూ నుంచి సరైన ప్రదేశం మరియు సరైన వంటకాన్ని ఎంచుకుంటే అది నిజంగా మనకు ఆనందాన్ని ఇస్తుందని మనం అనుకుంటాము. మీరు సరిగ్గా ఆలోచిస్తే, ఇది అంత ముఖ్యమైన విషయం కాదని తెలుసుకుంటారు, మరియు రాత్రి భోజనానికి లేదా టీవీలో ఏమి వస్తుందో అనే వాటికంటే మన జీవితంలో ఇంకా చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మన మనస్సు ఇంకా రిలాక్స్ గా, బ్యాలెన్స్ గా ఉంచుకోవాలి.

ఈర్ష్య

రెండవ తప్పు ప్రేరణ లేదా ఉద్దేశ్యం ఈర్ష్య, ఒకరిని బాధపెట్టడం లేదా వారికి హాని కలిగించాలనే కోరుకోవడం. ఎవరైనా తప్పు చేసినప్పుడు, మీకు కోపం వచ్చినప్పుడు మరియు వారు నిజంగా చెడ్డవారు మరియు శిక్షించాల్సిన అవసరం ఉందని మీరు అనుకున్నప్పుడు; ఇది తప్పుడు ఆలోచన అవుతుంది.

ప్రజలు ఎప్పుడూ తప్పులు చేయరనే తప్పు ఆలోచనలో మనం ఉంటాము, ఇది అసంబద్దమైనది. మనం ఎవరినైనా కొట్టాలని అనుకునేంత కోపం రావచ్చు, కానీ మనకు సరైన ఆలోచన ఉంటే, మనం దయను పెంపొందించుకుంటాము. ఇది ఇతరులకు సహాయం చేసి వారికి సంతోషాన్ని తెచ్చిపెట్టాలనే కోరిక, మరియు ఇందులో బలం మరియు క్షమాగుణం ఉంటాయి. ఎవరైనా తప్పు చేస్తే, అది మామూలు విషయమే అని మీరు గ్రహించి పగను పెంచుకోకుండా ఉండాలి.

క్రూరత్వం

మూడవ రకపు తప్పు ఉద్దేశ్యం క్రూరత్వంతో నిండిన మనస్సు, ఇందులో చాలా అంశాలు ఉన్నాయి:

  • చెడ్డ ఆలోచనా విధానం - ఇతరులు బాధపడాలని మరియు ఇబ్బంది పడాలని కోరుకోవడం. ఉదాహరణకు, మనం వేరొక ఫుట్ బాల్ టీమ్ యొక్క అభిమానులు చెడ్డ వాళ్లని అనుకుని వారిపై వివక్షను చూపించి అలా వాళ్ళు వేరొక టీమ్ ని ఇష్టపడతారు కాబట్టి వాళ్లతో గొడవపడటం.
  • సొంత ద్వేషం - మనల్ని మనం చెడ్డ వ్యక్తిలా భావించి, సంతోషంగా ఉండటానికి అర్హులు కాదని భావించి మన ఆనందాన్ని దెబ్బతీసే క్రూరమైన సొంత-ప్రేమను చూపించుకోకపోవడం. అనారోగ్యకరమైన సంబంధాల్లోకి వెళ్లడం, చెడు అలవాట్లను కొనసాగించడం, అతిగా తినడం వల్ల మనం తరచుగా ఇలా చేస్తూ ఉంటాం.
  • కుళ్లుతో కూడిన ఆనందం - ఇతరులు పడుతున్న బాధను చూసినప్పుడు లేదా విన్నప్పుడు మనం కుళ్లుతో ఉంటాము. ఒకడు చెడ్డవాడని, వాడు అనుభవిస్తున్న బాధలకు అర్హుడని మీరు అనుకుంటారు. ఉదాహరణకు, మనకు నచ్చని ఒక రాజకీయ నాయకుడు ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు. ఇక్కడ, కొంతమంది చెడ్డవారు మరియు శిక్షించబడటానికి అర్హులు అని, మరియు వాళ్లకు అంతా చెడు జరగాలని అనుకుంటాము, మనకు ఏమో ప్రతీదీ బాగా జరగాలి అని అనుకుంటాము.

సరైన ఉద్దేశం

సరైన ఉద్దేశం సరైన అహింసాయుత, క్రూరమైన వైఖరి మీద ఆధారపడి ఉంటుంది. బాధలో ఉన్న ఇతరులకు హాని చేయకూడదని, వారిని చికాకు పెట్టడానికి లేదా ఇబ్బంది పెట్టడానికి ఇష్టపడని మానసిక స్థితి మీకు ఉంటుంది. వారి పరిస్థితులు చెడుగా మారినప్పుడు మనం సంతోషించము. ఇక్కడ కరుణా భావం కూడా ఉంటుంది. ఇక్కడ ఇతరులు బాధల నుంచి మరియు వాటి కారణాల నుంచి విముక్తి పొందాలని మనం కోరుకుంటాము. ఎందుకంటే ప్రతి ఒక్కరూ బాధపడటం మనం చూస్తాము, ఎవరూ బాధపడటానికి ఇష్టపడరు మరియు ఎవరూ బాధపడటానికి అర్హులు కాదు. ప్రజలు తప్పులు చేస్తే, అది వారి ఇబ్బందుల వల్ల అలా చేశారని మనకు తెలుస్తుంది, నిజానికి వాళ్లు చెడ్డ వాళ్లు కాదు. సరైన ఆలోచన మరియు సరైన ఉద్దేశ్యంతో, మనం సహజంగానే సరైన మాటలు మరియు సరైన పనులు చేస్తాము.

ఎనిమిది విషయాలను కలిపి చూడడం

ఎనిమిది మార్గాలలోని అన్నీ కలిసిపోయి సరిగ్గా ఉంటాయి:

  • సరైన ఆలోచన మరియు ఉద్దేశం ఆచరణకు సరైన పునాదిని అందిస్తాయి మరియు సహజంగా సరైన మాటలు, సరైన పని మరియు సరైన జీవనోపాధిలో ఉండేలా చేస్తాయి. ఇతరులపై మన ప్రవర్తన యొక్క ప్రభావాల పరంగా సరైన దాన్ని మనం చూస్తాము మరియు ఇతరులకు సహాయం చేయాలనే కోరికను కలిగి ఉంటాము, వారికి హాని కలిగించకూడదు అని అనుకుంటాము.
  • దీని ఆధారంగా, మనల్ని మనం మెరుగుపరచుకోవడానికి, మంచి లక్షణాలను పెంపొందించుకోవడానికి మరియు మన శరీరం మరియు భావాల గురించి వింత ఆలోచనలతో దృష్టి మరల్చకుండా ఉండటానికి ప్రయత్నిస్తాము. ప్రయోజనకరమైన వాటిపై దృష్టి పెట్టడానికి మనం ఏకాగ్రతను ఉపయోగిస్తాము, అప్పుడు మన ఉద్దేశం బలపడుతుంది. ఈ విధంగా, ఇవన్నీ ఒక దానితో ఒకటి కనెక్ట్ అయ్యి ఉంటాయి.

శిక్షణ యొక్క మూడు భాగాలను మరియు ఎనిమిది మార్గాలను ఒక క్రమంగా ప్రదర్శించగలిగినప్పటికీ, అంతిమ లక్ష్యం ఏమిటంటే వాటన్నింటినీ ఆచరణలో పెట్టగలగడం.

సారాంశం

ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు మన ఇంద్రియాలు వినోదం కోసం ఆరాట పడుతూ ఉంటాయి. మన కళ్ళు అందమైన రూపాలను చూడాలని కోరుకుంటాయి, మన చెవులు మంచి శబ్దాలను వినాలని కోరుకుంటాయి మరియు మన నోరు రుచికరమైన ఆహారాన్ని తినాలని కోరుకుంటుంది. ఆహ్లాదకరమైన అనుభవాలను కోరుకోవడంలో తప్పు లేనప్పటికీ, మన ఆలోచన ఇలాగే ఉంటే, మనం ఇంక ఎప్పటికీ తృప్తి చెందలేము మరియు మనం సరైన ఏకాగ్రతను కూడా పెంపొందించుకోలేము.

నైతికత, ఏకాగ్రత మరియు అవగాహనలోని ఈ మూడు శిక్షణలు ప్రతి క్షణాన్ని సాధ్యమైనంత ఉత్తమమైనదిగా జీవించడానికి అనుమతిస్తాయి. కేవలం సొంత ఆనందాన్ని వెతుక్కోవడానికి బదులుగా, ఈ ఎనిమిది మార్గాలు మనకు మాత్రమే కాకుండా ఇతరులకు కూడా సహాయం చేయడానికి దారి చూపిస్తాయి. సరైన అభిప్రాయాలు ఎందుకు సరైనవి మరియు తప్పు అభిప్రాయాలు ఎందుకు అలా కాదు అని, మరియు సరైన పనులు ఎందుకు సహాయపడతాయి మరియు తప్పుడు పనులు హానికరం (మొదలైనవి) అని పరిశీలించి అర్థం చేసుకున్నప్పుడు, దీనికి అనుగుణంగా ప్రవర్తించినప్పుడు, మన జీవితాలు వాటికవే మెరుగుపడతాయి. "ఒక పూర్తి బౌద్ధమత జీవితం" మనం పొందగలుగుతాము.

Top