ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న బౌద్ధమతం

దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియా యొక్క  థెరవాడ బౌద్ధమతం

భారతదేశం

భారతదేశంలో 7 వ శతాబ్దంలో బౌద్ధమతం దాని యొక్క ప్రభావాన్ని కోల్పోవడం మొదలుపెట్టింది, అలా 12 వ శతాబ్దంలో పాల సామ్రాజ్యం పతనం తర్వాత, సుదూర ఉత్తర హిమాలయ ప్రాంతాలలో తప్ప మిగిలిన ప్రతీ చోట ఇది కనుమరుగైపోయింది. 19వ శతాబ్దం చివరిలో శ్రీలంక బౌద్ధ మత నాయకుడు అయిన "అనగారిక ధర్మపాల" బ్రిటిష్ పండితుల సహాయంతో మహా బోధి సొసైటీని స్థాపించడంతో భారతదేశంలో బౌద్ధమతం మళ్ళీ జీవం పోసుకుంది. భారతదేశంలో బౌద్ధమత పుణ్యక్షేత్రాలను పునరుద్ధరించడమే వారి ప్రాధమిక ఉద్దేశ్యం, అలా వారు విజయవంతంగా అన్ని బౌద్ధమత ప్రదేశాలలో బుద్ధుని దేవాలయాలను నిర్మించారు. వాటన్నిటిలో సన్యాసులు కూడా ఉన్నారు.

1950వ దశాబ్దంలో, అంటరాని కులం ప్రజలతో కలిసి అంబేద్కర్ గారు ఒక నియో-బౌద్ధమత ఉద్యమాన్ని ప్రారంభించారు, అప్పుడు వారి కుల సమస్యలను తప్పించుకోవడానికి లక్షల మంది ప్రజలు బౌద్ధ మతంలోకి మారారు. గత దశాబ్దంలో కూడా పట్టణ మధ్య తరగతి ప్రజలలో బౌద్ధమతం పట్ల ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం భారత జనాభాలో బౌద్దులు సుమారు 2% ఉన్నారు.

శ్రీలంక

క్రీస్తుపూర్వం 3 వ శతాబ్దంలో భారత చక్రవర్తి అశోకుడి కుమారుడు మహేంద్ర బౌద్ధ మతాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి శ్రీలంక బౌద్ధమత విద్యకు కేంద్రంగా ఉంది. శ్రీలంక బౌద్ధమతం యొక్క సుదీర్ఘ నిరంతర చరిత్రను కలిగి ఉంది. ఇది యుద్ధ సమయంలో మరియు 16 వ శతాబ్దం నుంచి ద్వీపంగా వేరు చేయబడినప్పటి నుంచి మరియు యూరోపియన్ మిషనరీలు క్రైస్తవ మతాన్ని మత మార్పిడి చేసినప్పటి నుంచి ఎక్కువ రోజులు పతనాన్ని చవి చూసింది.

19 వ శతాబ్దంలో బ్రిటిష్ పండితులు మరియు వేదాంత వేత్తల సహాయంతో బౌద్ధమతం బలంగా మారింది, అందుకని శ్రీలంక లోని బౌద్ధమతం కొన్నిసార్లు "ప్రాటెస్టెంట్ బౌద్ధమతం"గా చెప్పబడింది. పండిత అధ్యయనం, సాధారణ సమాజం కోసం సన్యాసుల పశు పోషణ పనులు మరియు ధ్యాన అభ్యాసాలకు ప్రాధాన్యత ఇవ్వబడింది. 1948 లో ఈ దేశానికి స్వాతంత్రం లభించింది, అప్పటి నుంచి బౌద్ధ మతం మరియు దాని సంస్కృతిపై ఆసక్తి బాగా పెరిగింది.

ప్రస్తుతం, శ్రీలంకన్లలో 70% మంది బౌద్దులే, అక్కడి మెజారిటీ ప్రజలు థెరవాడ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. 30 సంవత్సరాల సివిల్ వార్ తర్వాత, శ్రీలంక ఇప్పుడు జాతీయవాద బౌద్ధమతంలో పెరుగుదలను చూస్తుంది. బోడు బాల సేన (బౌద్ధ శక్తి దళం) వంటి కొన్ని సంస్థలు ముస్లిం వ్యతిరేక అల్లర్లు మరియు మితవాద బౌద్ధ నాయకులపై దాడులను చేస్తున్నాయి.

మయన్మార్ (బర్మా)

బర్మాలో బౌద్ధమతానికి 2,000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉందని ఒక చారిత్రక పరిశోధనలో తేలింది, ప్రస్తుతం ఆ దేశపు జనాభాలో 85% మంది బౌద్దులుగా గుర్తించబడ్డారు. నియమిత సమాజానికి ధ్యానం మరియు అధ్యయనానికి సమతుల్య ప్రాధాన్యత ఇచ్చే సుదీర్ఘ సంప్రదాయం ఉంది, మరియు అక్కడి సాధారణ ప్రజలు గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. బర్మా బౌద్దులలో అత్యంత ప్రసిద్ధుడు ఎస్.ఎన్. గోయెంకా, ఒక విపాసన ధ్యాన పద్ధతుల ఉపాధ్యాయుడు.

1948 లో బర్మా గ్రేట్ బ్రిటన్ నుంచి స్వాతంత్రం దక్కించుకున్నప్పటి నుంచి, పౌర మరియు సైనిక ప్రభుత్వాలు రెండూ బౌద్ధమతాన్ని ప్రోత్సహించాయి. సైనిక పాలనలో, బౌద్ధమతం కఠినంగా నియంత్రించబడింది మరియు అసమ్మతి వాదులకు ఆశ్రయం కల్పించే మఠాలు నాశనం చేయబడ్డాయి. 8888 తిరుగుబాటు మరియు 2007 లో కాషాయ విప్లవం వంటివి చేసి సైనిక పాలనకు వ్యతిరేకంగా రాజకీయ ప్రదర్శనను సన్యాసులు బాగానే చూపించారు.

గత దశాబ్దంలో, బౌద్ధ మతాన్ని పునరుద్ధరించడానికి మరియు ఇస్లాంను వ్యతిరేకించడానికి ప్రయత్నిస్తూ వివిధ జాతీయవాద సమూహాలు పుట్టుకొచ్చాయి. 969 గ్రూప్ నాయకుడు “అషిన్ విరాతు” తనను తాను "బర్మీస్ బిన్ లాడెన్" అని చెప్పుకున్నాడు, అలా ముస్లిం దుకాణాలను బహిష్కరించాలని ప్రతిపాదించాడు. “బౌద్ధమతాన్ని పరిరక్షించే” ముసుగులో మసీదులు, ముస్లిం ఇళ్లపై హింసాత్మక పనులు జరుగుతుండగా, ముస్లింల తిరుగు దాడులు ఈ గొడవలను ఇంకా రెచ్చగొట్టాయి.

బంగ్లాదేశ్

11 వ శతాబ్దం వరకు బౌద్ధమతం ఈ ప్రాంతంలో ఒక ప్రధాన విశ్వాసంగా ఉంది. ఈ రోజు, దాని జనాభాలో 1% కంటే తక్కువ మంది బౌద్దులు ఉన్నారు, మరియు వారు బర్మా సమీపంలోని చిట్టగాంగ్ హిల్స్ ప్రాంతాలలో నివసిస్తున్నారు.

రాజధాని ఢాకలో నాలుగు బౌద్ధమత దేవాలయాలు, తూర్పు గ్రామాలలో కూడా అనేక దేవాలయాలు ఉన్నాయి. కానీ, బర్మాలో కాకుండా, వేరే చోట్ల బౌద్ధమత అభ్యాసం మరియు అవగాహన చాలా తక్కువగానే ఉంది.

థాయిలాండ్

క్రీ.శ. 5 వ శతాబ్దం నుంచి ఆగ్నేయ ఆసియా సామ్రాజ్యాలకు బౌద్ధమతం పరిచయం చేయబడింది. జానపద మరియు హిందూ మతం, అలాగే మహాయాన బౌద్ధం నుంచి బలమైన ప్రభావంతో థెరవాడని అనుసరించారు. శ్రీలంక, బర్మా లాగా ఇక్కడ స్త్రీలకు వారసత్వం అనేది ఎప్పుడూ ఉండలేదు. ఈ దేశంలో దాదాపు 95% మంది బౌద్దులే ఉన్నారు.

థాయ్ సన్యాసి సమాజం థాయ్ రాచరికానికి ఒక నమూనాగా ఉంది, అలాగే సంప్రదాయం యొక్క స్వచ్ఛతను కాపాడటానికి బాధ్యత వహించే ఒక సుప్రీం పితామహుడు, మరియు ఒక పెద్దల మండలి కూడా ఉంది. అడవుల్లో మరియు గ్రామాల్లో నివసించే సన్యాస సంఘాలు ఉన్నాయి. ఈ రెండూ గొప్ప ఆరాధన మరియు మద్దతుకి మంచి ఉదాహరణలు.

అటవీ సంప్రదాయాలను పాటిస్తున్న సన్యాసులు ఏకాంత అడవుల్లో నివసిస్తూ, సన్యాస నియమాలను పూర్తిగా పాటిస్తూ తీవ్రమైన ధ్యానంలో పాల్గొంటారు. గ్రామంలో ఉండే సన్యాసులు ముఖ్యంగా గ్రంథాలను స్మరించుకుంటూ స్థానిక ప్రజల కోసం వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు. ఆత్మలపై థాయ్ సాంస్కృతిక విశ్వాసానికి తగినట్టుగా, ఈ సన్యాసులు సాధారణ ప్రజలకు రక్షణ కోసం తాయత్తులు కూడా ఇస్తారు. సన్యాసుల కోసం ఒక బౌద్ధ విశ్వవిద్యాలయం ఉంది, అందులో ప్రధానంగా బౌద్ధ గ్రంథాలను సాంప్రదాయ పాళీ భాష నుండి ఆధునిక థాయ్ లోకి అనువదించడానికి సన్యాసులకు శిక్షణ ఇవ్వబడుతుంది.

లావోస్

క్రీ.శ 7 వ శతాబ్దంలో బౌద్ధమతం ముందుగా లావోస్ కు చేరుకుంది, ఇప్పుడు ఆ దేశంలోని జనాభాలో 90% మంది యానిమిజంతో కలిసి ఉండే బౌద్ధమతంపై వారి నమ్మకాన్ని తెలిపారు. కమ్యూనిస్టు పాలనలో, అధికారులు ముందుగా మతాన్ని పూర్తిగా అణచివేయలేదు, కానీ బౌద్ధమత సంఘాన్ని వారి రాజకీయ లక్ష్యాలను పెంచుకోవడానికి ఉపయోగించుకున్నారు. కాలక్రమేణా బౌద్ధమతం తీవ్రమైన అణచివేతకు గురైంది. 1990 నుంచి, బౌద్ధమతం పునరుజ్జీవనం పొందింది. చాలా మంది లావోటియన్లు చాలా భక్తి పరులుగా, మరియు చాలా మంది అక్కడి మఠం లేదా ఆలయంలోకి చేరారు. అలా చాలా కుటుంబాలు పౌర్ణమి రోజున సన్యాసులకు ఆహారాన్ని సమర్పించి, దేవాలయాలను సందర్శిస్తారు.

కంబోడియా

13 వ శతాబ్దం నుంచి థెరవాడ బౌద్ధమతం రాష్ట్ర మతంగా ఉంది, అక్కడి జనాభాలో 95% మంది ఇప్పటికీ బౌద్దులే ఉన్నారు. 1970వ దశకంలో ఖ్మేర్ రూజ్ గ్రూప్ బౌద్ధమతాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించి దాదాపు విజయం సాధించింది. 1979 నాటికి, దాదాపు ప్రతి సన్యాసి హత్య చేయబడ్డాడు లేదా బహిష్కరణకు గురయ్యాడు. అలా ప్రతి ఆలయం మరియు గ్రంథాలయం నాశనం చేయబడ్డాయి.

రాజకుమారుడు సిహానౌక్ రాజుగా తిరిగి నియమించబడిన తర్వాత, ఆంక్షలు నెమ్మదిగా తీసి వేయబడ్డాయి మరియు బౌద్ధమతంపై ఆసక్తి పునరుద్ధరించబడింది. కంబోడియన్లు జాతకాలు, జ్యోతిష్యం మరియు ఆత్మ ప్రపంచాన్ని బలంగా నమ్ముతారు. అక్కడి సన్యాసులు ఎక్కువగా హీలర్లుగా ఉంటారు. బౌద్ధమత సన్యాసులు పిల్లలకు పేరు పెట్టే వేడుకల నుంచి వివాహాలు మరియు అంత్యక్రియల వరకు అనేక రకాల వేడుకలలో పాల్గొంటారు.

వియత్నాం

వియత్నాంకు బౌద్ధమతం 2,000 సంవత్సరాల క్రితమే వచ్చింది, ముందుగా భారతదేశం నుంచి, తర్వాత ప్రధానంగా చైనా నుంచి. అయితే, ఇది 15 వ శతాబ్దంలో పాలక వర్గాలకు అనుకూలంగా మారడం ప్రారంభించింది. 20 వ శతాబ్దం ప్రారంభంలో మళ్ళీ ప్రాణం పోసుకుంది, కాని రిపబ్లికన్ కాలంలో, కాథలిక్ అనుకూల విధానాలు బౌద్దులను వ్యతిరేకించాయి. ఇప్పుడు, అక్కడి జనాభాలో 16% మంది మాత్రమే బౌద్ధమతాన్ని అనుసరిస్తున్నారు, కాని ఇది ఇప్పటికీ అతిపెద్ద మతంగా ఉంది.

ప్రభుత్వం ఇప్పుడు బౌద్ధమతం గురించి బాగా రిలాక్స్ గా ఉంది, అయినప్పటికీ ఏ రాష్ట్రంలోనూ వాళ్లకు వాళ్లే స్వతంత్రంగా పనిచేయడానికి వారి దేవాలయాలను అనుమతించలేదు.

ఇండోనేషియా మరియు మలేషియా

బౌద్ధమతం క్రీ.శ 2 వ శతాబ్దంలో భారతదేశంతో వాణిజ్య మార్గాల ద్వారా ఈ చోటుకి వచ్చింది. చివరి హిందూ-బౌద్ధ సామ్రాజ్యమైన మజాపాహిత్ పతనమైన 15 వ శతాబ్దం వరకు బౌద్ధమతం హిందూ మతంతో పాటు కలిసి ఆచరించబడింది. 17 వ శతాబ్దం ప్రారంభం నాటికి ఇస్లాం ఈ మతాలను పూర్తిగా ఆక్రమించుకుంది.

ఇండోనేషియా ప్రభుత్వ పంచశిల విధానం ప్రకారం అధికారిక మతాలు దేవుడిపై విశ్వాసం ఉంచాల్సి ఉంది. బౌద్ధమతం భగవంతుడిని ఒక వ్యక్తిగత జీవిగా పేర్కొనలేదు, కానీ వెయ్యి సంవత్సరాల క్రితం భారతదేశంలోని కాలచక్ర తంత్రంలో చర్చించినట్లుగా ఆది బుద్ధుడు లేదా "మొదటి బుద్ధుడు" యొక్క వాదన కారణంగా ఇలా గుర్తించబడింది. ఆది బుద్ధుడు కాలానికి, మరియు ఇతర పరిమితులకు అతీతంగా అన్ని రూపాలకు సర్వజ్ఞుడైన సృష్టికర్త, మరియు ఒక ప్రతీకాత్మక వ్యక్తి ద్వారా ప్రాతినిధ్యం వహించినప్పటికీ, వాస్తవానికి అతను ఒక జీవి కాదు. ఆది బుద్ధుడు మనస్సు యొక్క స్పష్టమైన కాంతి స్వభావంగా అన్ని జీవులలో కనిపిస్తాడు. దాని ఆధారంగా ఇస్లాం, హిందూ మతం, కన్ప్యూషియనిజం, కాథలిజం, ప్రొటెస్టంట్ మతాలతో పాటు బౌద్ధమతం అంగీకరించబడింది.

శ్రీలంక సన్యాసులు బాలి మరియు ఇండోనేషియాలోని ఇతర ప్రాంతాలలో థెరవాడ బౌద్ధమతాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారు, కాని చాలా పరిమిత స్థాయిలోనే అలా జరిగింది. బాలి పట్ల ఆసక్తి చూపుతున్న వారు హిందూ మతం, బౌద్ధమతం మరియు స్థానిక ఆత్మ మతం యొక్క సాంప్రదాయ బాలినీస్ ఈ కలయికను అనుసరిస్తున్నారు. ఇండోనేషియాలోని ఇతర చోట్ల ఉండే జనాభాలో సుమారు 5% ఉన్న బౌద్దులు చైనా సంతతికి చెందిన ఇండోనేషియా కమ్యూనిటీకి చెందిన వారే. కొన్ని చిన్న ఇండోనేషియా బౌద్ధమత శాఖలు కూడా ఉన్నాయి, ఇవి థెరవాడ, చైనీస్ మరియు టిబెటన్ యొక్క హైబ్రిడ్ జాతులు.

మలేషియా యొక్క జనాభాలో 20% మంది బౌద్ధమతానికి కట్టుబడి ఉన్నారు, మరియు వారు ప్రధానంగా విదేశీ చైనీస్ కమ్యూనిటీలుగా ఉన్నారు. అర్ధ శతాబ్దం క్రితం బౌద్ధమతం పట్ల ఆసక్తి తగ్గిపోవడంతో, 1961లో బౌద్ధమత వ్యాప్తి లక్ష్యంగా బౌద్ధమత మిషనరీ సొసైటీని స్థాపించారు. యువతలో కూడా గత దశాబ్దం నుంచి బౌద్ధమత అభ్యాసం యొక్క అలవాటు పెరిగింది. ప్రస్తుతం అనేక థెరవాడ, మహాయాన, వజ్రయాన కేంద్రాలు ఉన్నాయి, ఇవి ఎక్కువ నిధులను మరియు మద్దతును కలిగి ఉన్నాయి.

తూర్పు ఆసియా మహాయాన బౌద్ధమతం

పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా

గత 2,000 సంవత్సరాల చైనా చరిత్రలో బౌద్ధమతం ఒక ప్రముఖ పాత్రను పోషించింది, మరియు చైనీస్ బౌద్ధమతం తూర్పు ఆసియాలో బౌద్ధమత వ్యాప్తిలో చురుకైన పాత్రను పోషించింది. ప్రారంభ టాంగ్ రాజవంశం (క్రీ.శ 618–907) కళ మరియు సాహిత్యం అభివృద్ధి చెందడంతో బౌద్ధమతానికి స్వర్ణయుగం వచ్చింది.

1960 మరియు 70 ల సాంస్కృతిక విప్లవం సమయంలో, మెజారిటీ చైనీస్ బౌద్ధమత మఠాలు నాశనం చేయబడ్డాయి మరియు బాగా శిక్షణ పొందిన సన్యాసులు, సన్యాసినులు మరియు ఉపాధ్యాయులలో చాలా మంది ఉరితీయబడ్డారు లేదా ఖైదు చేయబడ్డారు. టిబెట్, మరియు ఇన్నర్ మంగోలియాలో బౌద్ధమత అణచివేత ఇంకా తీవ్రంగా పెరిగింది. చైనా రిఫార్మ్ అయ్యి మారడంతో సంప్రదాయ మతాల పట్ల ఆసక్తి ఇంకా పెరిగింది. కొత్త దేవాలయాలు నిర్మించబడ్డాయి మరియు పాతవి రీస్టోర్ చేయబడ్డాయి. మఠాల్లో చేరిన వారిలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద, నిరక్షరాస్య కుటుంబాలకు చెందిన వారే కావడంతో విద్యా ప్రమాణాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అనేక దేవాలయాలు కేవలం పర్యాటక ప్రదేశాలుగా మాత్రమే ఉన్నాయి, సన్యాసులు కేవలం టికెట్ కలెక్టర్లు మరియు ఆలయ సహాయకులుగా మాత్రమే ఉండేవారు.

నేడు, పెద్ద సంఖ్యలో చైనీయులు బౌద్ధమతం పట్ల ఆసక్తిని కలిగి ఉన్నారు, టిబెటన్ బౌద్ధమతం పట్ల భక్తి గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుత అంచనాల ప్రకారం బౌద్ధమత జనాభాలో 20% ఉన్నారు, మరియు చైనా అంతటా దేవాలయాలు అవి మొదలుపెట్టే సమయాలలో చాలా బిజీగా ఉంటాయి. ప్రజలు ధనవంతులుగా మరియు బిజీగా మారడంతో, చాలా మంది చైనీస్ మరియు టిబెటన్ ప్రజలు బౌద్ధమతాన్ని అనుసరిస్తూ ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. టిబెటన్ బౌద్ధమతం చాలా మంది హాన్ చైనీయులకు ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉంది, ముఖ్యంగా పెరుగుతున్న టిబెటన్ లామాలు చైనీస్ భాషలో బోధిస్తున్నారు.

తైవాన్, హాంగ్ కాంగ్, మరియు బయట చైనీస్ ప్రాంతాలు

చైనా నుండి ఉద్భవించిన తూర్పు ఆసియా మహాయాన బౌద్ధమత సంప్రదాయాలు తైవాన్ మరియు హాంగ్ కాంగ్ లలో బలంగా ఉన్నాయి. తైవాన్ లో సన్యాసులు మరియు సన్యాసినుల బలమైన సన్యాసి సమాజం ఉంది., సాధారణ సమాజం చాలా మంచిగా వీటికి మద్దతుని ఇస్తుంది. సాంఘిక సంక్షేమం కోసం బౌద్ధమత విశ్వవిద్యాలయాలు మరియు బౌద్ధమత కార్యక్రమాలు ఉన్నాయి. హాంగ్ కాంగ్ లో బాగా నడుస్తున్న సన్యాస సమాజం కూడా ఉంది. మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, థాయ్ లాండ్ మరియు ఫిలిప్పీన్స్ లోని విదేశీ చైనీస్ బౌద్ధమత సమాజాలలో పూర్వీకుల సంక్షేమం కోసం మరియు జీవించి ఉన్నవారికి శ్రేయస్సు మరియు సంపద కోసం వేడుకలకు ప్రాధాన్యత ఇవ్వబడింది. బౌద్ధమత గురువులు ట్రాన్స్ లో మాట్లాడే అనేక మాధ్యమాలు ఉన్నాయి మరియు సాధారణ సమాజం ఆరోగ్య మరియు మానసిక సమస్యల కోసం ఇంకెవరిని సంప్రదిస్తాయి. ఈ "ఆసియా పులి" ఆర్థిక వ్యవస్థల వెనుక ప్రధానంగా నడిపించే శక్తిగా ఉన్న చైనా వ్యాపారవేత్తలు తమ ఆర్థిక విజయాల కోసం దీక్షలు  చెయ్యడానికి సన్యాసులకు తరచుగా ఉదారంగా విరాళాలు ఇచ్చారు. తైవాన్, హాంగ్ కాంగ్, సింగపూర్, మలేషియాలలో కూడా టిబెట్ బౌద్దుల సంఖ్య పెరుగుతోంది.

దక్షిణ కొరియా

క్రీ.శ 3 వ శతాబ్దంలో బౌద్ధమతం చైనా నుంచి కొరియా పెనిన్సులాకు చేరుకుంది. ఛాందస వాద క్రైస్తవ సంస్థల నుంచి దాడులు పెరిగినప్పటికీ దక్షిణ కొరియాలో బౌద్ధమతం ఇప్పటికీ బలంగానే ఉంది. గత దశాబ్దంలో ఇటువంటి సమూహాలు ప్రారంభించిన మంటల వల్ల పెద్ద సంఖ్యలో బౌద్ధ దేవాలయాలు ధ్వంసమయ్యాయి. అక్కడి జనాభాలో 23% మంది బౌద్దులే ఉన్నారు.

జపాన్

బౌద్ధమతం 5 వ శతాబ్దంలో కొరియా నుంచి జపాన్ కు వచ్చింది మరియు జపనీస్ సమాజం మరియు సంస్కృతిలో ఇది ప్రముఖ పాత్రను పోషించింది. 13వ శతాబ్ధం నుంచి మద్యపాన నిషేధం లేని ఆలయ పూజారులను వివాహం చేసుకునే సంప్రదాయం ఉంది. అటువంటి పూజారులు క్రమంగా బ్రహ్మచారి సన్యాసుల సంప్రదాయాలను మార్చారు. చారిత్రాత్మకంగా, కొన్ని బౌద్ధమత సంప్రదాయాలు అత్యంత జాతీయ వాదంగా ఉన్నాయి. జపాన్ ను ఒక బౌద్ధమత దేశంగా నమ్మాయి. ఆధునిక కాలంలో, కొన్ని మతోన్మాది వ్యక్తులు తమను తాము బౌద్దులుగా పిలుచుకుంటున్నారు, అయినా కానీ వాళ్లకు బుద్ధ శాక్యముని బోధనలతో చాలా తక్కువ సంబంధం ఉంది.

ఈ జనాభాలో సుమారు 40% మంది బౌద్దులుగా గుర్తించబడ్డారు, మరియు చాలా మంది జపనీస్ బౌద్ధమతంపై నమ్మకాన్ని వారి అసలు మతమైన షింటోమతంతో కలిపారు. షింటో ఆచారాలను అనుసరించి పుట్టుక మరియు వివాహాలను జరుపుకుంటారు, మరియు బౌద్ధ పూజారులు అంత్యక్రియలను నిర్వహిస్తారు.

జపాన్ లోని దేవాలయాలు పర్యాటకులకు మరియు సందర్శకుల కోసం అందంగా ఉంచబడ్డాయి, అయినా కానీ వాటిల్లో చాలా వరకు వాణిజ్యీకరించబడ్డాయి. చాలా వరకు, వాస్తవ అధ్యయనం మరియు అభ్యాసం తీవ్రంగా బలహీనపడ్డాయి. ప్రపంచంలోని అతిపెద్ద బౌద్ధమత సంస్థలలో ఒకటైన సోకా గక్కై జపాన్ లో ఉద్భవించింది.

మధ్య ఆసియా మహాయాన బౌద్ధమతం

టిబెట్

క్రీ.శ 7 వ శతాబ్దంలోనే బౌద్ధమతం టిబెట్ కు వచ్చింది. కొన్ని శతాబ్దాలుగా, రాచరిక మద్దతు మరియు కులీన వర్గం సహాయంతో, బౌద్ధమతం టిబెట్ జీవితాలలోని వివిధ అంశాలలో పాతుకు పోయింది.

పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా టిబెట్ ను ఆక్రమించిన తర్వాత, టిబెట్ లో బౌద్ధమతం తీవ్రంగా అణచివేయబడింది. 6,500 మఠాలు మరియు సన్యాస గృహాలలో 150 మినహా మిగిలినవన్నీ నాశనమయ్యాయి, మరియు విద్యావంతులైన సన్యాసులలో ఎక్కువ మంది నిర్బంధ శిబిరాల్లో ఉరితీయబడ్డారు లేదా వారికి వారే మరణించారు. సాంస్కృతిక విప్లవం తర్వాత, మఠాల పునర్నిర్మాణంలో ఎక్కువ భాగం మాజీ సన్యాసులు, స్థానిక ప్రజలు మరియు ప్రవాసంలో ఉన్న టిబెటన్ల ప్రయత్నాల ద్వారా జరిగింది. ప్రభుత్వం రెండు లేదా మూడు పునర్నిర్మాణాలకు మాత్రమే సహాయం చేసింది.

చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం నాస్తికమైనది కాని ఇది ఐదు "గుర్తింపు పొందిన మతాలను" అనుమతిస్తుంది, వాటిలో ఒకటి బౌద్ధమతం. మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకోమని వారు చెబుతున్నప్పటికీ, దలైలామా ఒక యువ టిబెటన్ బాలుడిని పంచెన్ లామా యొక్క పునర్జన్మగా గుర్తించిన తర్వాత, అతను మరియు అతని కుటుంబం వెంటనే ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోయారు. ఆ వెంటనే చైనా ప్రభుత్వం సగం చైనీస్, సగం టిబెటన్ బాలుడి కోసం వెతకడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి దలైలామాకు వాళ్ళు కనిపించలేదు.

ఈ రోజుల్లో, ప్రతి మఠం, దేవాలయానికి దాని స్వంత ప్రభుత్వ వర్కింగ్ టీమ్ ఉంది. వీరు సాదాసీదా దుస్తులు ధరించిన పోలీసులు మరియు వివిధ పనులలో "సహాయం" చేసే మహిళలు. దీని అర్థం వాళ్ళు సన్యాస సమాజాన్ని గమనిస్తారు మరియు రిపోర్ట్స్ అందిస్తారు. కొన్నిసార్లు, ఈ వర్కింగ్ టీమ్స్ సన్యాసి జనాభా లాగా పెద్దవిగా ఉండొచ్చు. ప్రభుత్వ జోక్యాన్ని పక్కన పెడితే, టిబెట్ లో బౌద్దులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో ఒకటి సరైన అర్హత కలిగిన ఉపాధ్యాయులు లేకపోవడం. సన్యాసులు, సన్యాసినులు మరియు సాధారణ ప్రజలు అందరూ ఇంకా నేర్చుకోవడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు, కాని మెజారిటీ ఉపాధ్యాయులకు పరిమిత శిక్షణ మాత్రమే ఉంది. గత దశాబ్దంలో ప్రభుత్వం లాసా సమీపంలో బౌద్ధమత "విశ్వవిద్యాలయాన్ని" ప్రారంభించింది. ఇది యువ తుల్కులకు ఒక శిక్షణ పాఠశాలగా పనిచేస్తుంది. ఇక్కడ వారు టిబెటన్ భాష, కాలిగ్రఫీ, వైద్యం మరియు ఆక్యుపంక్చర్, అలాగే కొన్ని బౌద్ధ తత్వశాస్త్రాలను నేర్చుకుంటారు. డిజిటల్ యుగం యువ టిబెటన్లను బౌద్ధమతానికి ఇంకా దగ్గర చేసింది. వారిలో చాలా మంది బౌద్ధ బోధనలు మరియు కథలను పంచుకునే వీచాట్(Wechat) మరియు వీబో(Weibo) వాటిల్లో సభ్యులుగా ఉన్నారు. బౌద్ధమతం గురించి ఇంకా తెలుసుకోవడం ఇప్పుడు "నిజమైన టిబెటన్" గా ఒకరి గుర్తింపును బలోపేతం చేయడానికి ఒక మార్గంగా చూడబడుతుంది.

తూర్పు తుర్కిస్తాన్

తూర్పు తుర్కిస్తాన్ (జిన్జియాంగ్) లో నివసిస్తున్న కల్మిక్ మంగోలుల మఠాలు చాలా వరకు సాంస్కృతిక విప్లవం సమయంలో ధ్వంసమయ్యాయి. ఇప్పుడు వాటిల్లో అనేకమైనవి మళ్ళీ నిర్మించబడ్డాయి, కాని టిబెట్ కంటే అక్కడ ఉపాధ్యాయుల కొరత ఎక్కువగా ఉంది. కొత్త యువ సన్యాసులకు అధ్యయన సౌకర్యాలు లేకపోవడం వల్ల చాలా నిరుత్సాహానికి గురయ్యి అక్కడినుంచి వెళ్లిపోయారు.

ఇన్నర్ మంగోలియా

పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఆధీనంలో ఉన్న టిబెట్ బౌద్దులకు అత్యంత దారుణమైన పరిస్థితి ఇన్నర్ మంగోలియాలో ఉంది. సాంస్కృతిక విప్లవం సమయంలో పశ్చిమ భాగంలోని మఠాలు చాలా వరకు ధ్వంసమయ్యాయి. గతంలో మంచూరియాలోని తూర్పు భాగంలో, రెండవ ప్రపంచ యుద్ధం ఆఖరిలో రష్యన్లు ఉత్తర చైనాను జపనీయుల నుంచి విముక్తి చేయడానికి సహాయపడిన సమయంలో స్టాలిన్ దళాలచే ఇప్పటికే చాలా మంది నాశనమయ్యారు. 700 మఠాలకు గాను 27 మాత్రమే మిగిలాయి.

1980 నుంచి, దేవాలయాలను పునరుద్ధరించడానికి మరియు మఠాలను పునర్నిర్మించడానికి ప్రయత్నాలు జరిగాయి, వీటిలో మంగోలియన్లు మాత్రమే కాకుండా హాన్ చైనీయులు కూడా పాల్గొన్నారు.

మంగోలియా

మంగోలియాలో, వేలాది మఠాలు ఉన్నాయి, అవన్నీ స్టాలిన్ ఆదేశాలతో 1937 లో కొంతవరకు మరియు ఆ తర్వాత పూర్తిగా నాశనం చేయబడ్డాయి. 1946 లో, టోకెన్ చిహ్నంగా ఉలాన్ బాతర్లో ఒక మఠాన్ని తిరిగి ప్రారంభించారు, మరియు 1970 లలో సన్యాసుల కోసం ఐదు సంవత్సరాల శిక్షణా కళాశాలలను ప్రారంభించారు. ఆ పాఠ్య ప్రణాళిక చాలా సంక్షిప్తీకరించబడింది మరియు మార్క్సిస్ట్ అధ్యయనానికి అధిక ప్రాధాన్యతను కలిగి ఉంది. సన్యాసులు ప్రజల కోసం పరిమిత సంఖ్యలో ఆచారాలను నిర్వహించడానికి అనుమతించబడ్డారు. 1990 లో కమ్యూనిజం పతనం తర్వాత, ప్రవాసంలో ఉన్న టిబెటన్ల సహాయంతో బౌద్ధమతంలో ఒక బలమైన పునరుజ్జీవనం జరిగింది. అనేక మంది కొత్త సన్యాసులు శిక్షణ కోసం భారతదేశానికి పంపబడ్డారు మరియు 200 కంటే ఎక్కువ మఠాలు తగిన స్థాయిలో పునర్నిర్మించబడ్డాయి.

1990 తర్వాత మంగోలియాలో బౌద్ధమతం ఎదుర్కొన్న అత్యంత తీవ్రమైన సమస్యలలో ఒకటి దూకుడు మోర్మన్, అడ్వెంటిస్ట్ మరియు బాప్టిస్ట్ క్రైస్తవ మిషనరీల రాక, వారు ఆంగ్లం బోధించే ముసుగులో వచ్చారు. వారు మతం మారితే వాళ్ళ పిల్లలు అమెరికాలో చదువుకోవడానికి డబ్బు మరియు తగిన సహాయాన్ని అందిస్తారని మరియు వ్యావహారిక మంగోల్ భాషలో యేసుపై అందంగా ముద్రించిన, ఉచిత బుక్ లెట్లను ఇస్తారని చెప్పారు. ఎక్కువ మంది యువత క్రైస్తవ మతం వైపు ఆకర్షితులయి ఉండటంతో, బౌద్ధమత సంస్థలు ముద్రిత వస్తువులు, టెలివిజన్ ప్రదర్శనలు మరియు రేడియో కార్యక్రమాల ద్వారా వ్యవహారిక భాషలో బౌద్ధమతం గురించి సమాచారాన్ని అందించడం ప్రారంభించాయి.

మంగోలియాలో మత మార్పిడిని నిషేధించారు. 2010 లో జనాభాలో 53% బౌద్దులు, 2.1% క్రైస్తవులు ఉన్నారు.

వెలివేయబడిన టిబెటన్లు

మధ్య ఆసియాలోని టిబెటన్ సంప్రదాయాలలో, టిబెట్ పై చైనా సైనిక ఆక్రమణకు వ్యతిరేకంగా 1959లో ప్రజా తిరుగుబాటు నుంచి భారతదేశంలో వెలివేయబడి ఉన్న దలైలామా చుట్టూ ఉన్న టిబెట్ శరణార్థి సమాజం బలంగా మారింది. వారు టిబెట్ లోని చాలా ప్రధాన మఠాలు మరియు అనేక సన్యాసి గృహాలను మళ్ళీ ప్రారంభించారు మరియు సన్యాసి పండితులు, ధ్యాన గురువులు మరియు ఉపాధ్యాయులకు సాంప్రదాయ పూర్తి శిక్షణా కార్యక్రమాన్ని కలిగి ఉన్నారు. టిబెటన్ బౌద్ధమత సంప్రదాయంలోని ప్రతి పాఠశాల యొక్క అన్ని అంశాలను సంరక్షించడానికి విద్యా, పరిశోధన మరియు ప్రచురణ సౌకర్యాలు ఉన్నాయి.

వెలివేయబడి ఉన్న టిబెటన్లు లడఖ్ మరియు సిక్కింతో సహా హిమాలయ ప్రాంతాలైన భారతదేశం, నేపాల్ మరియు భూటాన్లలో బౌద్ధమతాన్ని పునరుజ్జీవింపజేయడానికి ఉపాధ్యాయులను పంపి బోధనలను తిరిగి ప్రసారం చేయడంలో సహాయపడ్డారు. ఈ ప్రాంతాలకు చెందిన అనేక మంది సన్యాసులు మరియు సన్యాసినులు టిబెటన్ శరణార్థి మఠాలలో వారి విద్య మరియు శిక్షణను పొందుతున్నారు.

నేపాల్

నేపాలీల జనాభాలో ఎక్కువ మంది హిందువులు అయినప్పటికీ, బుద్ధుడు జన్మించిన దేశంలో బలమైన బౌద్ధమత సాంస్కృతిక ప్రభావాలు ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తాయి. నెవార్లు, గురుంగ్ లు మరియు తమాంగ్ లు వంటి జాతి సమూహాలు నేపాలీ బౌద్ధమతం యొక్క సాంప్రదాయ రూపాన్ని ఆచరిస్తారు. అక్కడి జనాభాలో బౌద్దులు 9% ఉన్నారు.

బౌద్ధమతం మరియు హిందూ మతాల మిశ్రమాన్ని అనుసరించి, మఠాల్లోనే కుల భేదాలను ఉంచే ఏకైక బౌద్ధ సమాజం నేపాల్. గత 500 సంవత్సరాలలో వివాహిత సన్యాసులు ఆవిర్భవించారు, వంశపారంపర్య కులం వారు దేవాలయ సంరక్షకులుగా మరియు ఆచార నాయకులుగా మారారు.

రష్యా

బురియాటియా, తువా మరియు కల్మికియా రష్యాలోని మూడు సంప్రదాయక టిబెటన్ బౌద్ధమత ప్రాంతాలు. బురియాటియాలో దెబ్బతిన్న మూడు మఠాలు మినహా ఈ ప్రాంతాల్లోని మఠాలన్నీ 1930 ల చివరలో స్టాలిన్ చేత పూర్తిగా ధ్వంసం చేయబడ్డాయి. 1940 లలో, స్టాలిన్ కఠినమైన కెజిబి నిఘాలో బురియాటియాలో రెండు టోకెన్ మఠాలను తిరిగి ప్రారంభించాడు; సన్యాసులు పగటిపూట తమ దుస్తులను యూనిఫాంలాగా ధరించి ఆచారాలను నిర్వహించారు. కమ్యూనిజం పతనం అయిన తర్వాత, ఈ మూడు ప్రాంతాలలో బౌద్ధమతం పెద్ద ఎత్తున పునరుజ్జీవనం చెందింది. ప్రవాసంలో ఉన్న టిబెటన్లు ఉపాధ్యాయులను పంపారు, మరియు భారతదేశంలోని టిబెటన్ మఠాలలో శిక్షణ పొందడానికి కొత్త యువ సన్యాసులను పంపారు. బురియాటియా, తువా మరియు కల్మికియాలో 20 కి పైగా మఠాలు పునరుద్ధరించబడ్డాయి.

బౌద్ధేతర దేశాలు

బౌద్ధ దేశాల యూరోపియన్ వలసల కారణంగా మరియు క్రైస్తవ మిషనరీలు మరియు పండితుల రచనల వల్ల 19 వ శతాబ్దపు ఐరోపాలో బౌద్ధమతం యొక్క వివరణాత్మక జ్ఞానం వచ్చింది. అదే సమయంలో చైనీయులు, జపనీస్ వలస కార్మికులు ఉత్తర అమెరికాలో దేవాలయాలను నిర్మించారు.

బౌద్ధమతం యొక్క అన్ని రూపాలు ప్రపంచవ్యాప్తంగా, సాంప్రదాయకంగా బౌద్ధేతర దేశాలలో కూడా కనిపిస్తాయి. ఇందులో రెండు ప్రధాన గ్రూపులు ఉన్నాయి: అవి ఆసియా వలసదారులు మరియు ఆసియాయేతర అభ్యాసకులు. ఆసియా వలసదారులు, ముఖ్యంగా యుఎస్(US), ఆస్ట్రేలియా, మరియు ఐరోపాలో కొంతవరకు, వారి స్వంత సంప్రదాయాల నుంచి అనేక దేవాలయాలను కలిగి ఉన్నారు. ఈ దేవాలయాల యొక్క ప్రధాన లక్ష్యం భక్తి అభ్యాసాన్ని ప్రోత్సహించడం మరియు వలస ప్రజల సాంస్కృతిక గుర్తింపులను కాపాడుకోవడంలో సహాయపడటానికి ఒక కమ్యూనిటీ కేంద్రాన్ని ఏర్పాటు చెయ్యడం. ఇప్పుడు అమెరికాలో నాలుగు మిలియన్లకు పైగా, మరియు ఐరోపాలో రెండు మిలియన్లకు పైగా బౌద్దులు ఉన్నారు.

అన్ని సంప్రదాయాలకు చెందిన వేలాది బౌద్ధమత "ధర్మ కేంద్రాలు" ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 100 కి పైగా దేశాలలో మరియు ప్రతి ఖండంలో కనిపిస్తాయి. ఈ టిబెటన్, జెన్ మరియు థెరవాడ కేంద్రాలను ఎక్కువ భాగం ఆసియాయేతరులు తరచుగా సందర్శిస్తారు మరియు ధ్యానం, అధ్యయనం మరియు ఆచార అభ్యాసానికి ప్రాధాన్యతను ఇస్తారు. ఈ ఉపాధ్యాయులలో పాశ్చాత్యులు మరియు ఆసియాకు చెందిన బౌద్దులు ఉన్నారు. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీల్లో అత్యధిక కేంద్రాలు ఉన్నాయి. చాలా మంది సీరియస్ విద్యార్థులు లోతైన శిక్షణ కోసం ఆసియాకు వస్తారు. ఇంకా, ప్రపంచవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాలలో బౌద్ధమత అధ్యయన కార్యక్రమాలు ఉన్నాయి. బౌద్ధం మరియు ఇతర మతాలు, సైన్స్, మనస్తత్వ శాస్త్రం మరియు వైద్యం లాంటి వాటి మధ్య ఎప్పుడూ సంభాషణలు జరుగుతాయి మరియు ఆలోచనల మార్పిడి కూడా జరుగుతుంది. దలైలామా గారు ఈ విషయంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషించారు.

Top