ఒక బౌద్ధమత బోధనను పరిశీలించడానికి నాలుగు సూత్రాలు

ఒక బౌద్ధమత బోధన అర్థవంతంగా ఉందో లేదో తెలుసుకోవడానికి, మనం దాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. మంచి గుణాన్ని పెంపొందించుకోవాలంటే ఏం చెయ్యాలో మనం ముందుగానే తెలుసుకోవాలి. మనం దాన్ని అభివృద్ధి చేసుకున్న తర్వాత, అది ఎలా సహాయపడుతుంది; ఈ ప్రయోజనాలు లాజికల్ గా ఎలాంటి అర్ధాన్ని కలిగి ఉన్నాయి; మరియు అవి వస్తువుల యొక్క ప్రాథమిక స్వభావానికి అనుగుణంగా ఉన్నాయా? అని పరిశీలించాలి. బోధన ఈ ప్రమాణాలన్నిటినీ పాస్ అయ్యితే, దాన్ని ఆచరణలో పెట్టడంపై మనకు నమ్మకం కలుగుతుంది.

వాస్తవిక ఆలోచనను కలిగి ఉండటంపైనే ధర్మ ఆచరణలో విజయం ఆధారపడి ఉంటుంది. అంటే ధర్మ బోధనలను నిజంగా ఎలా ఉన్నాయో తెలుసుకునే విధంగా పరిశీలించడం. అటువంటి పరిశీలన కోసం, బుద్ధుడు నాలుగు సూత్రాలను (రిగ్స్-పా బ్జి) బోధించాడు, ఇవి బౌద్ధమత ఆలోచనలోని ప్రాథమిక అంచనాలు. "నేను బోధించే దాన్ని కేవలం విశ్వాసంతో లేదా నాపై ఉన్న గౌరవంతో నమ్మవద్దు, బంగారం కొనేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటారో అలా మీరే పరిశోధించుకుని తెలుసుకోండి" అని బుద్ధుడు చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకోండి.

ఈ నాలుగు సూత్రాలు:

  • ఆధారపడటం (ఇటోస్-పై రిగ్స్-ప)
  • పనితీరు (బైయా-బా బైడ్-పాయ్ రిగ్స్-పా)
  • కారణం ద్వారా స్థాపన (షద్-మేయీ రిగ్స్-పా)
  • వస్తువుల స్వభావం (చోస్-నైద్-కై రిగ్స్-పా).

మార్గం యొక్క గ్రేడెడ్ దశల యొక్క గ్రాండ్ ప్రెజెంటేషన్ (లామ్-రిమ్ చెన్-మో) లో సోంగ్ ఖాపా గారు ఈ నాలుగింటిని ఎలా వివరించారో తెలుసుకుందాం.

ఆధారపడటం యొక్క సూత్రం

మొదటి సూత్రం ఏమిటంటే, కొన్ని విషయాలు ఇతర విషయాలపై ఆధారపడి ఉంటాయి. ఇదే ఆధారపడటం యొక్క సూత్రం. ఒక ఫలితం పొందడానికి, అది కారణాలు మరియు పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఇది మనమందరం అంగీకరించగల సూత్రం. అంటే మనం ఒక మంచి గుణాన్ని లేదా దేనిపైనైనా అవగాహనను పెంచుకోవాలనుకుంటే, అది దేనిపై ఆధారపడి ఉంటుందో తెలుసుకోవాలి. దాన్ని బేసిస్ గా తీసుకుని ముందుగానే మనం దీన్ని అభివృద్ధి చేసుకోవాలి?

ఆధ్యాత్మిక సాధన యొక్క ప్రతి స్థాయి దాని ఆధారంగా ఇతర సాధనలు మరియు కారణాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, శూన్యత లేదా వాస్తవికత గురించి విచక్షణాత్మక అవగాహనను పెంపొందించుకోవాలనుకుంటే, ఈ అవగాహన దేనిపై ఆధారపడి ఉంటుందో మనం పరిశోధించి తెలుసుకోవాలి. ఇది ఏకాగ్రతపై ఆధారపడి ఉంటుంది. ఏకాగ్రత లేకపోతే మనం అవగాహనను పెంపొందించుకోలేం. ఏకాగ్రత దేనిపై ఆధారపడి ఉంటుంది? ఇది సొంత క్రమశిక్షణపై ఆధారపడి ఉంటుంది. మన దృష్టి తప్పుదారి పట్టినప్పుడు దాన్ని సరిదిద్దుకునే క్రమశిక్షణ లేకపోతే ఏకాగ్రతను మనం పెంపొందించుకోలేం. కాబట్టి శూన్యత పట్ల ఒక విచక్షణా ఆలోచనా విధానాన్ని పెంపొందించుకోవాలంటే ముందుగా మనం సొంత క్రమశిక్షణను, ఏకాగ్రతను పెంపొందించుకోవాలి.

ధర్మాన్ని అధ్యయనం చెయ్యడానికి ఈ మొదటి సూత్రాన్ని ఉపయోగించడం చాలా ముఖ్యం. మనలో చాలా మంది ధర్మ గ్రంథాలలో చదివిన అద్భుతమైన విషయాలను సాధించాలని కోరుకుంటారు, కాని మన కోరికల గురించి రియలిస్టిక్ గా ఉండాలనుకుంటే, వారి విజయం దేనిపై ఆధారపడి ఉంటుందో తెలుసుకోవాలి. మన లక్ష్యాలను చేరుకోవడానికి మనం ఏమి నిర్మించుకోవాలో తెలుసుకున్నప్పుడు, వాటిని ఎలా చేరుకోవాలో మనకు తెలుస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి మనం పునాది వేసుకోవచ్చు. ఇది మన అన్వేషణలను రియలిస్టిక్ గా ఉండేలా చేస్తుంది.

పనితీరు యొక్క సూత్రం

రెండవది పనితీరు యొక్క సూత్రం. కారణాలు మరియు పరిస్థితుల ద్వారా ప్రభావితమయ్యే ప్రతి సంఘటన దాని నిర్దిష్ట విధిని నిర్వహిస్తుంది. నీరు కాదు, నెప్పే కాల్చే పనిని చేస్తుంది. ఇది బౌద్ధమతంలో ఒక ప్రాథమిక భావన, సూత్రం, మరియు ఇది మనం అంగీకరించగల ఒక విషయం. ధర్మాన్ని అధ్యయనం చెయ్యడంలో మరియు నేర్చుకోవడంలో, ఇది లేదా అది చేసే విధులను పరిశోధించాల్సిన అవసరం ఉందని దీని ఉపయోగం చెప్తుంది. ప్రేమ మరియు ఏకాగ్రత లాంటి కొన్ని మానసిక స్థితులు లేదా భావోద్వేగాల గురించి, మరియు గందరగోళం లేదా లాంటి వాటి గురించి మనకు సూచనలు ఇవ్వబడ్డాయి. మనం పాటించాల్సిన కొన్ని పద్ధతులను కూడా నేర్పిస్తుంది. వీటిని అర్థం చేసుకుని వాటి పనులు ఏమిటో మనం పరిశోధించాలి. కొన్ని విషయాలు అనుకూలంగా ఉంటాయి మరియు మరికొన్ని అనుకూలంగా ఉండవు కాబట్టి, కొన్ని మానసిక స్థితులు ఇతర వాటిని మెరుగుపరచడానికి లేదా పెంచడానికి పనిచేస్తాయి.

ఉదాహరణకు, ప్రేమను పెంపొందించుకోవడానికి ఒక నిర్దిష్ట ధ్యాన పద్ధతి యొక్క పరిశోధన మరియు అనుభవంతో దానిపై మనకున్న విశ్వాసాన్ని పెంచుతుంది. మనం "ఇది సరైనదా కాదా?" అని పరిశోధిస్తాము మరియు ఆ తర్వాత మనం దాని అనుభవాన్ని పొందడానికి ప్రయత్నిస్తాము. ఇలా చేయడం వల్ల ఆ పద్ధతి గురించి మనకు ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఒక అభ్యాస పద్ధతి సరైనదని మరియు అది పనిచేస్తుందని విశ్వాసం ఎలా నిర్ధారిస్తుంది? ఇది లోతుగా సాధన చేసే మన సామర్థ్యాన్ని పెంచుతుంది. మనం చేసే పనిలో నమ్మకం లేకపోతే మనం ఆ పనిని చెయ్యలేము. ప్రతి అడుగు యొక్క విధిని మనం అర్థం చేసుకుంటే, మన హృదయాలను ప్రతి దానిలో ఉంచుతాము. మనకు అది అర్థం కాకపోతే, ఇంకేమీ చెయ్యలేము.

దానికి తోడుగా, మరొక దాన్ని దెబ్బతీయడానికి లేదా ఎదుర్కోవటానికి అవసరమైన పనిని అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు, ఒక పద్ధతిపై విశ్వాసం దాని గురించి ఉండే నిర్ణయాత్మకతను నాశనం చేస్తుంది. ఒక పద్ధతిపై నమ్మకం లేకపోవడం లేదా దానిని అనుసరించే మన సామర్థ్యాలపై నమ్మకం లేకపోవడం దాన్ని విజయవంతం చెయ్యకుండా మరియు దానితో ఎక్కడికీ వెళ్లనివ్వకుండా చేస్తుంది.

మనం నేర్చుకునే ప్రతి విషయం మరియు మనం తీసుకునే ప్రతి అభ్యాసం దేన్ని బలపరుస్తుందో మరియు దేన్ని నాశనం చేస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడు మనం ఏం చేస్తున్నామో అని ఒక వాస్తవిక ఆలోచన ఉంటుంది. ఉదాహరణకు, ప్రేమ లాంటి ఒక నిర్దిష్ట పాజిటివ్ మానసిక స్థితిని లేదా ఆలోచనను మన౦ ఎ౦దుకు పె౦పొ౦ది౦చుకోవాలని అనుకు౦టా౦? దీనికి సరైన కారణం ఏమిటంటే, ఇది మన మనశ్శాంతిని తీసుకురావడానికి పనిచేస్తుంది, మరియు ఇతరులకు సహాయం చెయ్యడానికి వీలు కల్పిస్తుంది. కోప౦ లాంటి ఒక నిర్దిష్ట ప్రతికూల మానసిక స్థితి ను౦చి మన౦ ఎ౦దుకు బయటపడాలనుకు౦టా౦? ఎందుకంటే అది ఇతరులకు, మనకు ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి. ధూమపానం లాంటి అలవాటు నుంచి మనం అనుభవించే వినాశకరమైన నష్టాలను ఆపాలనుకున్నప్పుడు దీన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ధూమపానం మన ఊపిరితిత్తులకు ఏమి చేస్తుందో అనే నష్టాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకుంటే, అప్పుడు మనం దాన్ని ఎందుకు వదిలెయ్యాలో తెలుస్తుంది. మనం పనితీరు సూత్రాన్ని ఈ విధంగా ఉపయోగిస్తాం.

కారణం ద్వారా స్థాపన యొక్క సూత్రం

మూడవది కారణం ద్వారా స్థాపన యొక్క సూత్రం. దీని అర్థం ఒక విషయాన్ని నిర్ధారించవచ్చు లేదా రుజువు చెయ్యవచ్చు, ఎప్పుడైతే సరైన జ్ఞాన సాధనం దానికి విరుద్ధంగా ఉండదో. ముందు, ధర్మంగా మనం నేర్చుకున్న దేనినైనా పరిశోధించి, దానికి గ్రంధాధికారం విరుద్ధంగా ఉందో లేదో తెలుసుకోవాలి. ఒక బోధన ధర్మ బోధన అని మనకు ఎలా తెలుస్తుంది? ఇది బుద్ధుడు బోధించిన దానికి అనుగుణంగా ఉంటుంది. బుద్ధుడు వివిధ శిష్యులకు వేర్వేరు విషయాలను బోధించాడు, పైకి విరుద్ధంగా కనిపించినా, బుద్ధుని లోతైన ఉద్దేశం మనకు ఎలా తెలుస్తుంది? బుద్ధుని బోధనలో ఒక పునరావృత ఇతివృత్తంగా కనిపిస్తే, బుద్ధుడు నిజంగా దాన్ని అర్థం చేసుకున్నాడని మనకు తెలుసు అని భారతీయ గురువు ధర్మకీర్తి గారు వివరించారు. ముఖ్యంగా నైతిక సమస్యలకు సంబంధించి ఇది చాలా ముఖ్యమైనది.

ఏదైనా విషయాన్ని వాలిడ్ గా తెలుసుకోవడానికి రెండవ మార్గం లాజిక్ మరియు ఊహ. ఇది లాజికల్ గా స్థిరంగా ఉంటుందా లేదా లాజిక్ దానికి విరుద్ధంగా ఉంటుందా? ఇది కామన్ సెన్స్ ను కలిగి ఉందా లేదా పూర్తిగా వింతగా ఉందా? దీన్ని తెలుసుకోవడానికి ఉన్న మూడవ సరైన మార్గమే సూటి జ్ఞానం. మన౦ నిజ౦గా ధ్యానం చేసినప్పుడు, మన అనుభవ౦ దానికి విరుద్ధ౦గా ఉ౦దా లేదా అని ధృవీకరిస్తు౦దా?

ఈ సూత్రాన్ని ఎలా అప్లై చెయ్యాలో ఒక ఉదాహరణను చూద్దాం. "ప్రేమ కోపాన్ని జయిస్తుంది" అనే లాంటి ఒక నిర్దిష్ట లోపాన్ని లేదా సమస్యను ఒక నిర్దిష్ట ప్రత్యర్థికి వర్తింపజేయడ౦ ద్వారా తొలగిపోతుందనే బోధను మన౦ పొందవచ్చు. ముందుగా, ఇది బుద్ధుడు బోధించిన దానికి అనుగుణంగా ఉందా లేదా అని మనం పరిశీలిస్తాము. ఇది బుద్ధుడు బోధించిన దానికి విరుద్ధంగా లేదు అని తెలుసుకుంటాము.

ఇది లాజికల్ గా సరైనదేనా? అవును, ప్రేమ అనేది ఇతరులు సంతోషంగా ఉండాలనే కోరిక. నాకు హాని కలిగిస్తున్న, నా మీద కోపంగా ఉన్న ఈ వ్యక్తి ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? ఈ వ్యక్తి అసంతృప్తితో ఉన్నందుకు ఈ భయంకరమైన పనులు చేస్తున్నాడు; ఆ వ్యక్తి మానసికంగా మరియు భావోద్వేగంగా ఇబ్బందిలో ఉన్నాడు. ఈ వ్యక్తిపై నాకు ప్రేమ ఉంటే, అతను లేదా ఆమె సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను; ఆ వ్యక్తి బాధ పడకుండా మరియు అంత దయనీయంగా ఉండకూడదని నేను కోరుకుంటాను. అటువంటి ఆలోచన ఆ వ్యక్తిపై కోపం రాకుండా ఆపుతుంది, కదా? ఇది పూర్తిగా లాజికల్ గా ఉంటుంది. ఈ వ్యక్తి చాలా హాని కలిగిస్తుంటే, అతను లేదా ఆమె అలా చెయ్యడం మానేయ్యాలని నేను కోరుకుంటే, నేను నా ప్రేమను విస్తరించాలి. ఆ వ్యక్తి సంతోషంగా ఉండాలని నేను కోరుకోవాలి ఎందుకంటే అతను లేదా ఆమె సంతోషంగా ఉంటే, ఆ వ్యక్తి ఎలాంటి హాని చెయ్యడు. ఆ వ్యక్తిపై కోపం తెచ్చుకోవడం వల్ల అతను లేదా ఆమె నాకు ఎలాంటి హాని చెయ్యలేరు. ఈ బోధన లాజికల్ గా అర్థవంతంగా ఉంటుంది.

చివరగా, మనం సూటి జ్ఞానంతో లేదా ధ్యానం యొక్క అనుభవంతో పరిశోధిస్తాము. మరో మాటలో చెప్పాలంటే, ఇది పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి మనం దీన్ని ప్రయత్నిస్తాము. నేను ప్రేమ మీద ధ్యానం చేస్తే, అది నా కోపాన్ని తగ్గిస్తుందా? అవును. ఏదైనా సహేతుకమైన బోధన కాదా అనే దానికి ఇది మూడవ పరీక్ష. కారణం ద్వారా స్థాపన సూత్రాన్ని మనం ఈ విధంగా ఉపయోగిస్తాం.

వస్తువుల స్వభావం యొక్క సూత్రం

ఆఖరిది వస్తువుల స్వభావం యొక్క సూత్రం. ఇది కొన్ని విషయాల స్వభావం సాధారణంగా అలాగే ఉంటుందనే సూత్రం. అగ్ని వేడిగా ఉండటం మరియు నీరు తడిగా ఉండటం లాంటివి. మంట ఎందుకు వేడిగా మరియు నీరు ఎందుకు తడిగా ఉంటుంది? అవును, దాని స్థితులు అలానే ఉన్నాయి. ధర్మంలో ఏ అంశాలు నిజమో పరిశోధించాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే ఇది వస్తువుల స్వభావం. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు మరియు ఎవరూ దుఃఖంలో ఉండాలని కోరుకోరు. ఎందుకని? అది అలానే ఉంటుంది. ఇంకొక ఉదాహరణను తీసుకుందాం. వినాశకర ప్రవర్తన నుంచి అసంతృప్తి మరియు నిర్మాణాత్మక ప్రవర్తన నుంచి ఆనందం వస్తాయి. ఎందుకు? ఈ విశ్వం అలానే పనిచేస్తుంది. బుద్ధుడు అలా సృష్టించాడని కాదు; అది అలాగే ఉంది. మనం పరిశోధించి, కొన్ని విషయాలు ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయని కనిపెడితే, వాటిని జీవిత వాస్తవాలుగా అంగీకరించాలి. వాటి పట్ల మనం పిచ్చిగా ప్రవర్తిస్తే సమయం వృథా అవుతుంది.

ధర్మ ఆచారానికి అత్యంత సంబంధమున్న విషయాల స్వభావంలో ఒకటి సంసారం ఎప్పుడూ సుఖ కష్టాలను చూపిస్తూ ఉంటుంది. ఇది అదృష్టకరమైన మరియు దురదృష్టకరమైన పునర్జన్మలను మాత్రమే సూచించదు, మన జీవితంలో ప్రతి క్షణానికి ఇది వర్తిస్తుంది. మన మనోభావాలు, మనం చేయాలనుకున్నవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. మనం వాటిని యథాతథంగా అంగీకరిస్తే, దాని గురించి మనం ఏ బాధ పడము. సంసారం నుండి మీరు ఇంకేమి ఆశిస్తారు? నిజానికి, కొన్ని రోజులు ధ్యానం బాగా జరుగుతుంది మరి కొన్ని రోజులు అలా జరగదు. కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలనిపిస్తుంది, మరికొన్ని రోజులు అలా అనిపించదు. ఇదేమీ ఒక పెద్ద విషయం కాదు! పరిస్థితులు అలానే ఉంటాయి. దాన్ని వదిలెయ్యాలి. ఏ బాధను పెట్టుకోకూడదు అది చాలా కీలకమైనది.

మనం ధర్మాన్ని వాస్తవిక పద్ధతిలో చూడాలనుకుంటే, బుద్ధుడు బోధించిన ఈ నాలుగు అంశాలు చాలా ఉపయోగపడతాయి. వాటి గురి౦చి మన అవగాహనను ధృవీకరి౦చుకోవడానికి, మన౦ నేర్చుకునే బోధనలకు వాటిని ఎలా అన్వయి౦చుకోవాలో తెలుసుకోవడానికి, మన శరీరాల ను౦చి నిర్లిప్త౦గా ఉ౦డే ఒక ఉదాహరణను పరిశీలిద్దా౦.

  1. ఈ విడిపోవడం యొక్క అభివృద్ధి దేనిపై ఆధారపడి ఉంటుంది? ఇది అశాశ్వతం, పునర్జన్మ, ఆత్మ ఎలా ఉంటుంది, శరీరం, మనస్సు మరియు ఆత్మ మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉంటుంది.
  2. మన శరీరం నుంచి విడగొట్టడానికి చేసే పని ఏమిటి? ఇది మనం అనారోగ్యానికి గురైనప్పుడు, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు లేదా మతిస్థిమితం కోల్పోయినప్పుడు బాధ పడకుండా మరియు కోపం తెచ్చుకోకుండా ఉండటానికి సహాయపడుతుంది.
  3. ఇది కారణం నుంచి వచ్చిందా? అవును, శరీరం నుంచి విడిపోవడం బాధ యొక్క కారణాలలో ఒక దాన్ని తొలగిస్తుందని బుద్ధుడు బోధించాడు: తాత్కాలికమైన దానిని గుర్తించడంపై ఆధారపడిన అనుబంధం. ఇది లాజికల్ గా ఉంటుందా? అవును, ఎందుకంటే శరీరం క్షణ క్షణానికి మారుతుంది మరియు మనల్ని ముసలి వాళ్ళగా చేస్తుంది. దాని పనితీరును మనం అనుభవిస్తామా? అవును, మన౦ వదిలించుకోవడాన్ని పె౦పొ౦ది౦చుకునే కొద్దీ, మన౦ తక్కువ అసంతృప్తిని, సమస్యలను అనుభవిస్తా౦.
  4. వస్తువుల స్వభావం ఏమవుతుంది? నేను నా శరీరానికి దూరంగా వెళ్ళడానికి ధ్యానం చేస్తే, నా ఆనందం ప్రతిరోజూ బలపడుతుందా? నో, అలా జరగదు. ఇదే సంసారం; ఎప్పుడూ మారుతూ ఉంటుంది. చివరికి, దీర్ఘకాలిక ఆలోచన నుంచి, నేను సంతోషంగా ఉండగలను మరియు నా జీవితం మెరుగుపడగలదు, కానీ ఇది ఎప్పుడూ ఒకేలా ఉండదు. వస్తువుల స్వభావం అలా ఉండదు.

సారాంశం

మన శరీరాల నుంచి విషయాలను వదిలించుకోవడం కోసం బోధనలను పరిశోధించడానికి నాలుగు సూత్రాలను ఉపయోగించడం ద్వారా, దాన్ని ఎలా చేరుకోవాలనే దానిపై వాస్తవిక ఆలోచనను పెంపొందించుకోవచ్చని మనం చూడవచ్చు. అందువల్ల, బుద్ధుడు, "నేను బోధించేదాన్ని కేవలం విశ్వాసం లేదా గౌరవంతో నమ్మవద్దు, కానీ బంగారం కొనుగోలు చేసినట్లుగా మిమ్మల్ని మీరు పరిశోధించుకోండి" అని చెప్పినప్పుడు, అతను నాలుగు సూత్రాలను ఉపయోగించుకుని వాటిని పరిశోధించుకోవాలని చెప్పాడు.

Top