మరణం మరియు చనిపోతూ ఉండడంపై బౌద్ధమత సలహా

05:29
మనమందరం చావుని ఎదుర్కోబోతున్నాము, కాబట్టి మనం దాన్ని మనం మర్చిపోకూడదు. మన మరణాల గురించి మనం రియలిస్టిక్ గా ఉండటం వల్ల పూర్తి, అర్థవంతమైన జీవితాన్ని గడపడానికి వీలు ఉంటుంది. భయంతో చనిపోకుండా, మన జీవితాన్ని మంచిగా సద్వినియోగం చేసుకున్నామని సంతోషంగా చనిపోవచ్చు.

ఒక అర్థవంతమైన జీవితాన్ని గడపడం

కొన్నేళ్లుగా, మన శరీరాలు మారిపోతూ వస్తున్నాయి. సాధారణంగా చెప్పాలంటే, ఆధ్యాత్మికత లేదా ధ్యానం కూడా అలా జరగకుండా ఆపలేవు. మనం అశాశ్వతం, ఎప్పుడూ మారుతూ, క్షణ క్షణానికి మారుతూ ఉంటాం; మరియు ఇది ప్రకృతిలో భాగం. కాలం ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది. దాన్ని ఏ శక్తీ ఆపలేదు. కాబట్టి, మనం సమయాన్ని సరిగ్గా ఉపయోగిస్తున్నామా లేదా అనేదే అసలు ప్రశ్న. ఇతరులకు ఇంకా సమస్యలను సృష్టించడానికి మనం సమయాన్ని ఉపయోగిస్తామా, ఇది చివరిగా మనలోపల అసంతృప్తిని కలిగిస్తుందా? సమయాన్ని ఉపయోగించుకోవడానికి ఇది తప్పుడు మార్గం అని నేను అనుకుంటున్నాను.

ప్రతిరోజూ సరైన ప్రేరణతో మన మనస్సులను రూపొందించడానికి ప్రయత్నించడం మరియు అలాగే రోజంతా ఉండడం మంచి మార్గం. అంటే వీలైతే ఇతరులకు సేవ చెయ్యడం; అలా లేకపోతే కనీసం ఇతరులకు హాని చెయ్యకుండా ఉండడం. ఆ విషయంలో వృత్తుల మధ్య తేడా ఉండదు. మీ వృత్తి ఏదైనా, మీరు పాజిటివ్ ప్రేరణను కలిగి ఉండవచ్చు. మన సమయాన్ని ఆ విధంగా రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు - దశాబ్దాలు, ఐదు సంవత్సరాలే కాకుండా - ఉపయోగిస్తే మన జీవితాలు అర్థవంతంగా మారతాయి. కనీసం, మన స్వంత వ్యక్తిగత సంతోషకరమైన మానసిక స్థితికి మనం ఒక రకమైన సహకారాన్ని అందిస్తున్నాము. త్వరలోనే మనకు అంతం అనేది వస్తుంది, ఆ రోజు మనకు ఏ పశ్చాత్తాపం కలగదు; మనం మన సమయాన్ని నిర్మాణాత్మకంగా ఉపయోగించామని మనకు తెలుసు.

మరణం గురించి రియలిస్టిక్ అవగాహన ఉండటం

అయితే మన ప్రస్తుత జీవితాలు శాశ్వతమైనవి కావు. కానీ "మరణమే శత్రువు" అనుకోవడం పూర్తిగా తప్పు. మరణం మన జీవితంలో ఒక భాగం మాత్రమే. నిజానికి, బౌద్ధమత ఆలోచన నుంచి, ఈ శరీరం ఒక విధంగా శత్రువే. మోక్షం - అంటే ముక్తి పట్ల నిజమైన కోరికను పెంపొందించుకోవడానికి మనకు ఆ విధమైన ఆలోచన అవసరం: ఈ జన్మ, ఈ శరీరం, దాని స్వభావమే బాధపడుతోంది, కాబట్టి మనం దాన్ని ఆపాలని అనుకుంటున్నాము. కానీ ఇలాంటి ప్రవర్తన చాలా సమస్యలను సృష్టిస్తుంది. మీరు మరణాన్ని శత్రువుగా భావిస్తే, ఈ శరీరం కూడా శత్రువే, పూర్తి జీవితం కూడా శత్రువే. అది కాస్త ఎక్కువ దూరంగానే వెళ్తోంది.

నిజానికి, మరణం అంటే అసలు ఉండకపోవడం, కనీసం ఈ శరీరం అయినా. ఈ జన్మలో మనం కొంత సన్నిహిత సంబంధాన్ని పెంపొందించుకున్న అన్ని విషయాల నుంచి మనం విడిపోవాల్సి ఉంటుంది. జంతువులు కూడా మరణాన్ని ఇష్టపడవు, కాబట్టి సహజంగా, మానవుల విషయంలో కూడా అంతే. కానీ మనం ప్రకృతిలో ఒక భాగం, కాబట్టి మరణం మన జీవితంలోని భాగం. లాజికల్ గా, జీవితానికి ఒక ప్రారంభం మరియు అంతం ఉంటుంది - జననం మరియు మరణం ఉంటాయి. కాబట్టి, ఇది అసాధారణమైనది కాదు. కానీ మరణం గురించి మన అవాస్తవిక విధానాలు మరియు అభిప్రాయాలు మిగతా ఇబ్బందులు మరియు ఆందోళనలు కలిగిస్తాయని నేను అనుకుంటున్నాను.

కాబట్టి బౌద్ధమత అభ్యాసకులుగా, మరణం మరియు అశాశ్వతం గురించి ప్రతిరోజూ మనల్ని మనం గుర్తు చేసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అశాశ్వతంలో రెండు స్థాయిలు ఉన్నాయి: స్థూల స్థాయి [మొదలయ్యినవన్నీ ముగింపుకు వస్తాయి] మరియు సూక్ష్మ స్థాయి (కారణాలు మరియు పరిస్థితుల ద్వారా ప్రభావితమైన అన్ని ప్రతి క్షణం మారుతూనే ఉంటాయి). నిజానికి, అశాశ్వత యొక్క సూక్ష్మ స్థాయి బౌద్ధమతం యొక్క నిజమైన బోధన; కానీ సాధారణంగా, అశాశ్వత స్థాయి కూడా సాధనలో ఒక ముఖ్యమైన భాగం ఎందుకంటే ఇది మన విధ్వంసక భావోద్వేగాలలో కొన్నిటిని తగ్గిస్తుంది, ఇవి మనం శాశ్వతంగా ఉంటామనే భావనపై ఆధారపడి ఉంటాయి.

ఈ గొప్ప రాజులను చూడండి - పాశ్చాత్య దేశాలలో వారికి చాలా పెద్ద కోటలు మరియు భవనాలు ఉన్నాయి. ఈ చక్రవర్తులు తమను తాము అమరులుగా చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఈ నిర్మాణాలను చూస్తే అది చాలా సిల్లీగా అనిపిస్తోంది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను చూడండి. దాన్ని నిర్మించిన వారికి ఇది ఎంతటి దుర్భరమైన బాధను కలిగించిందో. కానీ ఈ పనులు "నా శక్తి, సామ్రాజ్యం ఎప్పటికీ ఉండిపోతాయి", "నా చక్రవర్తి ఎప్పటికీ నిలిచిపోతాడు" అనే భావనతో జరిగాయి. బెర్లిన్ గోడ లాగా - ఇది వేయి సంవత్సరాల పాటు ఉంటుందని ఒక తూర్పు జర్మన్ కమ్యూనిస్ట్ నాయకుడు చెప్పాడు. ఈ భావాలన్నీ తమపైనా, తమ పార్టీపైనా, తమ నమ్మకాలపైనా ఉన్న పట్టులో శాశ్వతంగా ఉంటామని భావించడం వల్ల వస్తాయి.

ఇప్పుడు మన ప్రేరణలో భాగంగా పాజిటివ్ కోరిక మనకు అవసరం - ఏ కోరిక లేకుండా, కదలిక ఉండదు. కానీ అజ్ఞానంతో కూడిన కోరిక ప్రమాదకరం. ఉదాహరణకు, శాశ్వతత్వ భావన ఎప్పుడూ "నేను ఎప్పటికీ ఉంటాను" అనే ఆలోచనను సృష్టిస్తుంది. అది అవాస్తవం. అది అజ్ఞానం. మీరు దాన్ని కోరికతో కలిపినప్పుడు - ఇంకా ఏదో, అంతకంటే ఎక్కువ కోరుకోవడం ఇంకా సమస్యలను సృష్టిస్తుంది. కానీ, వివేకంతో కూడిన కోరిక చాలా సానుకూలమైనది, కాబట్టి మనకు అది అవసరం.

తాంత్రిక అభ్యాసంలో, పుర్రెలు మరియు ఈ రకమైన వస్తువులతో అశాశ్వతమైన జ్ఞాపకాలను కూడా మనం చూస్తాము, మరియు కొన్ని మండలాలలో, శ్మశానాలు, చార్నెల్ మైదానాలను ఊహించుకుంటాము. ఇవన్నీ మనకు అశాశ్వతాన్ని గుర్తు చేసే చిహ్నాలు. ఒక రోజు నా కారు శ్మశానం గుండా వెళ్ళింది, కాబట్టి నేను తర్వాత ఇచ్చిన బహిరంగ ప్రసంగంలో ఇది తట్టింది: "నేను శ్మశానం గుండా వెళుతున్నాను. అదే మా చివరి గమ్యం. మనం అక్కడికి వెళ్ళాలి" అని. యేసు క్రీస్తు సిలువపై తన అనుచరులకు చివరికి మరణం వస్తుందని చూపించాడు. బుద్ధుడు కూడా అలాగే చేశాడు. అల్లా, నాకు తెలియదు - అల్లాహ్ కు రూపం లేదు - కానీ మొహమ్మద్ దానిని చూపించాడు.

కాబట్టి, మరణం త్వరలోనే వస్తుందని మనం రియలిస్టిక్ గా ఉండాలి. మరణం వస్తుందని మొదటి నుంచి ఏదో ఒక ఆలోచనను పెంపొందించుకుంటే. అప్పుడు నిజంగా మరణం వచ్చినప్పుడు, మీరు చాలా తక్కువ ఆందోళన చెందుతారు. కాబట్టి, బౌద్ధమత అభ్యాసకుడికి, ప్రతిరోజూ దీనిని గుర్తు చేసుకోవడం చాలా ముఖ్యం.

మరణ సమయంలో మీరు ఏమి చెయ్యాలి

మన చివరి రోజు వచ్చినప్పుడు, దాన్ని మనం అంగీకరించాలి మరియు దాన్ని వింతగా చూడకూడదు. మనకు ఇంకో మార్గం లేదు. ఆ సమయ౦లో, ఆస్తిక వాద మత౦పై విశ్వాస౦ ఉ౦డే ఎవరైనా ఇలా ఆలోచించాలి, "ఈ జీవిత౦ దేవుని ద్వారా సృష్టి౦చబడి౦ది, కాబట్టి చివరిగా కూడా దేవుని ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. నేను మరణాన్ని ఇష్టపడనప్పటికీ, దేవుడు దాన్ని సృష్టించాడు, కాబట్టి దానికి కొంత అర్థం ఉండి ఉంటుంది." సృష్టికర్త దేవుడిని నిజంగా నమ్మే వారు ఆ రకంగా ఆలోచించాలి.

భారతీయ సంప్రదాయాలను అనుసరించి పునర్జన్మను నమ్మే వారు తమ భవిష్యత్తు జీవితం గురించి బాగా ఆలోచించి, చింతించకుండా మంచి భవిష్యత్తు జీవితానికి సరైన కారణాలను సృష్టించడానికి ప్రయత్నం చెయ్యాలి. ఉదాహరణకు, మీరు మరణించే సమయంలో మీ సద్గుణాలన్నిటినీ అంకితం చేయవచ్చు, అలా మీ తర్వాతి జీవితం మంచి జీవితం అవుతుంది. ఆపై మన నమ్మకాలు ఎలా ఉన్నా చనిపోయే సమయంలో మానసిక స్థితి ప్రశాంతంగా ఉండాలి. కోపం, మితిమీరిన భయం లాంటివి మంచివి కావు.

వీలైతే, బౌద్ధమత అభ్యాసకులు తమ తర్వాతి జీవితాల కోసం ఎదురు చూడటానికి ఇప్పుడు వారి సమయాన్ని ఉపయోగించాలి. దీనికి బోధిచిత్త పద్ధతులు, కొన్ని తాంత్రిక పద్ధతులు సహాయపడతాయి. తాంత్రిక బోధనల ప్రకారం, మరణ సమయంలో, మూలకాల ఎనిమిది దశల విచ్ఛిన్నం ఉంటుంది - శరీరంలోని మూలకాల స్థూల స్థాయిలు కరిగిపోతాయి, ఆపై మిగతా సూక్ష్మ స్థాయిలు కూడా కరిగిపోతాయి. తాంత్రిక అభ్యాసకులు దీనిని వారి రోజువారీ ధ్యానంలో చేర్చాలి. ప్రతిరోజూ, నేను వివిధ మండల అభ్యాసాలలో - కనీసం ఐదుసార్లు - మరణం గురించి ధ్యానం చేస్తాను, కాబట్టి నేను ఇప్పటికీ బతికే ఉన్నాను! ఈ రోజు ఉదయం నేను మూడు మరణాలను చవిచూశాను.

కాబట్టి, మంచి పునర్జన్మకు గ్యారంటీని క్రియేట్ చేసే పద్ధతులు ఇవే. విశ్వాసం లేని వారికి, నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా, అశాశ్వత వాస్తవం గురించి రియలిస్టిక్ గా ఉండటం చాలా ముఖ్యం.

మరణిస్తున్న వారికి సహాయం ఎలా చెయ్యాలి

నిజంగా మరణిస్తున్న వ్యక్తులతో, చుట్టుపక్కల ఉన్న వాళ్లకు [ఎలా సహాయం చెయ్యాలో అని] కొంత జ్ఞానం ఉంటే మంచిది. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా, సృష్టికర్త దేవుణ్ణి నమ్మి చనిపోతున్న ప్రజలతో, మీరు వారికి దేవుడిని గుర్తు చేయవచ్చు. బౌద్ధమత ఆలోచన నుంచి కూడా భగవంతుడిపై ఏకముఖ విశ్వాసం వల్ల కొంతైనా ప్రయోజనం ఉంటుంది. నమ్మకం, మతం లేని వ్యక్తులతో, నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా రియలిస్టిక్ గా ఉండండి మరియు వారి మనస్సులను ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం.

చనిపోతున్న వ్యక్తి చుట్టూ ఏడుస్తున్న బంధువులను ఉండటం వారికి ప్రశాంతమైన మనస్సును కలిగి ఉండటానికి హానికరం కావచ్చు - ఎక్కువ అనుబంధంతో. అలాగే బంధువులపై మితిమీరిన మమకారం వల్ల కోపాన్ని పెంచుకుని మరణాన్ని శత్రువుగా చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి, వారి మానసిక స్థితిని ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం. అదే ముఖ్యం.

బౌద్ధమత మందిరాలకు వెళ్లాలని చాలా సందర్భాల్లో నన్ను అడిగారు. ఆస్ట్రేలియాలో లాగానే, సన్యాసినులు చనిపోతున్న వ్యక్తులు మరియు తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నవారిని చూసుకోవడానికి పూర్తిగా అంకితమైన వారు ఉన్నారు. కరుణ అనే మన రోజువారీ అభ్యాసాన్ని ఆచరణలో పెట్టడానికి ఇది చాలా మంచి మార్గం. అది చాలా ముఖ్యమైనది.

సారాంశం

చావేమీ వింత కాదు. ఇది ప్రతిరోజూ, ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉంటుంది. మనం ఖచ్చితంగా చనిపోతామని అర్థం చేసుకోవడం అర్థవంతమైన జీవితాన్ని గడపడానికి మనల్ని ప్రోత్సహిస్తుంది. అది ఎప్పుడైనా రావచ్చని తెలుసుకున్నప్పుడు, చిన్న చిన్న విషయాలకు మనం గొడవపడటం మరియు వాదించడం చాలా తగ్గుతుంది. దీనికి బదులుగా, ఇతరులకు సాధ్యమైనంత వరకు సహాయం చెయ్యడం ద్వారా జీవితాన్ని బాగా ఉపయోగించుకోవడానికి మనం ప్రేరేపించబడతాము.

Top