పరిచయం
ఆరు దూరదృష్టి ఆలోచనలలో (పరిపూర్ణతలు) రెండవది నైతిక సొంత-క్రమశిక్షణ. ఇది సంగీత వాయిద్యాన్ని నేర్చుకోవడానికి లేదా ఆటలలో రాణించడానికి అవసరమైన క్రమశిక్షణ కాదు, ఇది మన నైతిక ప్రవర్తనతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఇది ఇతరులను పోలీసింగ్ చేయడం, మీ కుక్కకు శిక్షణ ఇవ్వడం లేదా సైన్యంలోని వ్యక్తులను నియంత్రించడంతో సంబంధం ఉండదు. మనం మన స్వంత క్రమశిక్షణ గురించి మాత్రమే మాట్లాడుతున్నాము, వీటిలో మనకు మూడు రకాలు ఉన్నాయి.
విధ్వంసక పనులకు దూరంగా ఉండటం
నైతిక సొంత-క్రమశిక్షణ యొక్క మొదటి రకం వినాశకరమైన పనులకు చెయ్యకుండా ఉండటం, మనం ఎలా ప్రవర్తిస్తాము, మాట్లాడతాము మరియు ఆలోచిస్తాము అని. అంటే సాధారణంగా చంపడం, దొంగతనం చేయడం, అబద్ధం చెప్పడం లాంటి పది రకాల వినాశకర పనులకు దూరంగా ఉంటాం, మన ఆధ్యాత్మిక వికాసానికి ఆటంకం కలిగించే ప్రవర్తనను నివారించాలని ప్రతిజ్ఞలు చేస్తే, అప్పుడు మనం ఈ ప్రతిజ్ఞలను పాటిస్తాము.
కొన్ని విధ్వంసక ప్రవర్తనలను నివారించడం గురించి మనం మాట్లాడినప్పుడు, రెండు రకాలు ఉన్నాయి. ఒకటి చంపడం మరియు దొంగిలించడం లాంటి సహజంగా వినాశకరమైన ప్రవర్తన, ఇది సులభంగా అర్థం చేసుకోవచ్చు. అప్పుడు తమకు తాము వినాశనం కలిగించని ప్రవర్తనలు ఉండవచ్చు, కాని బుద్ధుడు కొంతమంది వ్యక్తులకు లేదా కొన్ని సమయాల్లో నివారించడం మంచిదని చెప్పాడు. ఉదాహరణకు, సన్యాసులు మరియు సన్యాసినులు రాత్రిపూట తినకుండా ఉండటానికి ఉద్దేశించబడ్డారు, కానీ ఇది అందరికీ వర్తించదు. రాత్రిపూట, ఉదయం పూట నిర్మలమైన మనస్సుతో ధ్యానం చెయ్యాలంటే రాత్రిపూట తినకపోవడమే మంచిదనే నియమం వల్ల ఇది వచ్చింది. సన్యాసిగా లేదా సన్యాసినిగా పొడవాటి జుట్టును ఉంచుకోవద్దని సలహా ఇవ్వడం ఇంకొక ఉదాహరణ, ఎందుకంటే అలా చెయ్యడం వల్ల ఒకరి స్వంత అందంపై ఇష్టం పెరుగుతుంది అలా ప్రతిరోజూ దాన్ని స్టైల్ చెయ్యడం కూడా సమయం వృధానే! సహజంగా, ఈ సలహా అందరికీ కాదు, సన్యాసులు మరియు సన్యాసినులకు మాత్రమే.
నిర్మాణాత్మక పనులలో నిమగ్నం కావడం
రెండవ రకమైన నైతిక సొంత-క్రమశిక్షణ పాజిటివ్, నిర్మాణాత్మక పనులలో పాల్గొనడం, ఇది జ్ఞానోదయాన్ని సాధించడానికి అవసరమైన పాజిటివ్ శక్తిని నిర్మిస్తుంది. దీని అర్థం బోధనలకు వెళ్ళడానికి మరియు అధ్యయనం చెయ్యడానికి, ధర్మాన్ని ధ్యానించడానికి మరియు సాష్టాంగ నమస్కారాలు, నైవేద్యాలు మొదలైన మన గోండ్రో తంత్ర సాధనను (అధునాతన తంత్ర అభ్యాసానికి ప్రాథమికాంశాలు) పూర్తి చెయ్యడానికి క్రమశిక్షణను కలిగి ఉండటం.
మళ్ళీ, నైతిక సొంత-క్రమశిక్షణ అనేది వాస్తవ ప్రవర్తన కన్నా అది ఒక మానసిక స్థితి. ఇది మన మనస్సుల నుంచి వచ్చే క్రమశిక్షణ మరియు మనం ప్రవర్తించే విధానాన్ని రూపొందిస్తుంది - మనం పాజిటివ్ విషయాలలో నిమగ్నమయ్యి విధ్వంసకరమైన మరియు అనుచిత ప్రవర్తనకు దూరంగా ఉండేలా చూసుకుంటాము. ఈ క్రమశిక్షణ లేకుండా, మనం పూర్తిగా నియంత్రణను కోల్పోతాము మరియు ఇబ్బంది పెట్టే భావోద్వేగాల ప్రభావానికి సులభంగా గురవుతాము.
నైతిక సొంత-క్రమశిక్షణ వివక్ష మరియు వివక్ష అవగాహనపై ఆధారపడి ఉంటుంది. వినాశకరంగా వ్యవహరించకుండా ఉండటానికి, వినాశకరంగా వ్యవహరించడం వల్ల కలిగే నష్టాల గురించి మనం వివక్ష చూపిస్తాము మరియు నిర్ణయాత్మకంగా ఉంటాము. పాజిటివ్ ప్రవర్తనలో పాల్గొనడం ద్వారా, ధ్యానం చేయడం, ప్రాథమిక అభ్యాసాలు చెయ్యడం మరియు మొదలైన వాటి యొక్క ప్రయోజనాలను మనం వేరు చేస్తాము. విచక్షణతో, మనం స్వయంచాలకంగా ఎలా వ్యవహరించాలో తెలుసు మరియు దానిపై నమ్మకం కలిగి ఉంటాము.
ఇతరులకు ప్రయోజనం చేకూర్చేలా పనిచెయ్యడం
నైతిక సొంత-క్రమశిక్షణ యొక్క మూడవ రకం నిజానికి ప్రయోజనం పొందడానికి మరియు ఇతరులకు సహాయం చెయ్యడానికి పనిచేయడం. ఇక్కడ, ఇతరులకు సహాయం చెయ్యడం మరియు వారికి సహాయం చెయ్యకపోవడం అనే వివక్ష మనకు ఉంటుంది, ఎందుకంటే మనకు అలా అనిపించదు లేదా మనం ప్రత్యేకంగా ఒకరిని ఇష్టపడము.
ఇతరులకు సహాయ౦ చెయ్యడ౦లో అనేక కోణాలు ఇమిడి ఉన్నాయి, కానీ సాధారణంగా చెప్పాలంటే, "మన పాజిటివ్ ప్రభావ౦లో ఇతరులను కూడగట్టే నాలుగు మార్గాలు" అని పిలువబడే దానిలో నిమగ్నమయ్యే క్రమశిక్షణ మనకు ఉ౦టుంది. మరో మాటలో చెప్పాలంటే, ఇతరులు మన పట్ల ఎక్కువ అవగాహనను కలిగించే విధంగా మనం వ్యవహరిస్తాము, అలా మనం వారికి ఎక్కువ, లోతైన విషయాలను బోధించగలుగుతాము.
ఇందులో నాలుగు మార్గాలు ఉన్నాయి:
- ఉదారంగా ఉండటం
- ఆహ్లాదకరమైన రీతిలో మాట్లాడటం
- వారి లక్ష్యాలను చేరుకోవడానికి ఇతరులను ప్రేరేపించడం
- ఈ లక్ష్యాలకు అనుగుణంగా ఉండటం.
ఆరు దూరదృష్టి ఆలోచనపై బోధనలు 11 రకాల వ్యక్తుల లిస్ట్ ను సూచిస్తాయి, ముఖ్యంగా సహాయపడటానికి మరియు ప్రయోజనం పొందడానికి మనం కష్టపడాలి. మనం దీనిని కేవలం ఒక లిస్ట్ లాగా కాకుండా, అటువంటి వ్యక్తులను చూసినప్పుడు వాళ్లను మర్చిపోకుండా వారికి సహాయం చెయ్యడానికి చాలా నిర్దిష్టమైన సూచనగా భావించాలి.
- బాధ పడుతున్నవారు
- తమను తాము ఎలా సహాయం చేసుకోవాలో తెలియక అయోమయంలో ఉన్నవారు
- మనకు సహాయం చేసిన వారు
- భయంతో నిండి ఉన్న వారు
- మానసిక క్షోభకు గురైన వారు
- నిరుపేదలు, అవసరాలు ఉన్నవారు
- మనతో అనుబంధం ఉన్నవారు
- వారి కోరికలకు అనుగుణంగా మనం సహాయం చెయ్యగలిగిన వారు
- నీతివంతమైన జీవితాన్ని గడిపేవారు
- వినాశకర జీవితాలు గడిపేవారు
- మనకున్న అసాధారణ సామర్థ్యాలను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్నవారు.
నైతిక సొంత క్రమశిక్షణపై శాంతిదేవుడు మాటలు
శాంతిదేవుడు తన భోధిసత్వ ప్రవర్తన అనే గ్రంథంలో రెండు అధ్యాయాలలో నైతిక సొంత క్రమశిక్షణ గురించి చర్చిస్తాడు. "శ్రద్ధగల వైఖరి" అని పిలువబడే మొదటి అధ్యాయం నైతిక సొంత-క్రమశిక్షణకు ఆధారం, ఇక్కడ మన ప్రవర్తన యొక్క ప్రభావం గురించి శ్రద్ధ వహిస్తాము మరియు ఇబ్బంది పెట్టే భావోద్వేగాల ప్రభావానికి గురి కాకుండా జాగ్రత్త పడతాము. ఎదుటి వారికి కూడా భావోద్వేగాలు ఉంటాయని, విధ్వంసకరంగా ప్రవర్తిస్తే వారిని బాధపెడతామని మనం దీన్ని సీరియస్ గా తీసుకుంటాం. భవిష్యత్తులో మన ప్రవర్తన వల్ల కలిగే పర్యవసానాల గురించి ఆందోళన చెందుతాం. ఇవన్నీ నైతిక సొంత క్రమశిక్షణకు పునాదిని సృష్టిస్తాయి. ఇతరులను లేదా మన భవిష్యత్తును బాధపెట్టడం గురించి మనం నిజంగా పట్టించుకోకపోతే, అప్పుడు మనం నైతికంగా వ్యవహరించాల్సిన అవసరం ఉండదు.
అనేక భాషల్లో, ఈ శ్రద్ధగల వైఖరి అనువదించడానికి చాలా కష్టమైన పదం. ఇది శ్రద్ధగా ఉండటం మరియు దానితో మనం ఎలా ప్రవర్తిస్తామనే దాని గురించి జాగ్రత్తగా ఉండటం గురించి కూడా ఉంటుంది, కానీ ఇది మన మరియు ఇతరులపై మన ప్రవర్తన యొక్క ప్రభావాన్ని తీవ్రంగా పరిగణించడం ద్వారా దాని నుంచి ఏమి జరుగుతుందో కూడా సూచిస్తుంది.
శాంతిదేవుడు ఈ విషయంలో చెప్పిన రెండవ అధ్యాయం బుద్ధిపూర్వకత మరియు అప్రమత్తత గురించి వివరిస్తుంది. బుద్ధిపూర్వకత అనేది క్రమశిక్షణపై మానసిక పట్టును ఉంచే మానసిక స్థితి, ఇబ్బంది కలిగించే భావోద్వేగాలకు లొంగదు. మనం డైట్ లో ఉన్నప్పుడు బేకరీని దాటి మనకు ఇష్టమైన కేక్ ను చూసినప్పుడు క్రమశిక్షణకు అతుక్కుపోయే మానసిక జిగురు ఇది, కానీ మనం ఎలాగోలా దాన్ని ఆపుకోగలుగుతాము. "నా అత్యాశ, మమకారం ప్రభావంతో నేను ఆ కేక్ కొనను" అని మన డైట్ ని మర్చిపోము. ఇది బుద్ధిపూర్వకత వల్ల వస్తుంది మరియు నైతిక క్రమశిక్షణకు ఇది చాలా ముఖ్యం. మనం ఆహారం నుంచి ఎప్పుడు ద్రుష్టి మరల్చడం ప్రారంభించామో జాగ్రత్తగా గమనిస్తూ, "సరే, బహుశా ఒక చిన్న కేక్ ముక్క కావచ్చు!" అని చెబుతాము. మన అప్రమత్తత అంతర్గత హెచ్చరికను మోగిస్తుంది, అలా మనం దూరంగా ఉంటాము మరియు మన సొంత నియంత్రణకు తిరిగి వస్తాము. ఈ విషయాలను మనం గమనించాలి. బుద్ధిపూర్వకత మరియు అప్రమత్తత నైతిక క్రమశిక్షణకు మద్దతు ఇస్తాయి. అవి మన క్రమశిక్షణను కాపాడుకోగల సాధనాలు, మరియు తర్వాత ఏకాగ్రతను పెంపొందించడానికి మనం వీటిని ఉపయోగించవచ్చు.
చివరిగా, శాంతిదేవుడు బుద్ధిపూర్వకతను అభివృద్ధి చెయ్యడానికి మరియు నిర్వహించడానికి మనకు సహాయపడే మూడు అంశాలను చెప్పాడు:
- ఆధ్యాత్మిక గురువుల సాంగత్యంలో ఉండండి. మనం అలా చెయ్యలేకపోతే, మనం వారి సమక్షంలో ఉన్నామని అనుకోవచ్చు. మనం వారి సన్నిధిలో ఉంటే, వారిపట్ల మనకున్న గౌరవంతో తెలివితక్కువగా, వినాశకరంగా ప్రవర్తించేవాళ్లం కాదు. "నేను ఇలా ప్రవర్తిస్తానా లేక మా గురువుగారి సమక్షంలో ఈ విషయాలు చెబుతానా?" అని అనుకోవడం మంచిది. అలా చెయ్యకపోతే శాంతిదేవుడు "కలప కట్టెలా ఉండు" అని సలహా ఇస్తాడు. అలా చెయ్యొద్దు. ఇది మనల్ని జాగ్రత్తగా ఉంచడానికి సహాయపడుతుంది - స్పష్టంగా, మనం మన ఉపాధ్యాయుడితో కలిసి భోజనం చేస్తుంటే, మనం మన ముఖాలను కేక్ తో నింపుకోము లేదా ఎవరిపైనా అరవము.
- మన గురువు సలహాలు మరియు సూచనలను పాటించండి. మనల్ని జాగ్రత్తగా ఉంచడానికి వారు చెప్పిన దాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నించడం అదే మనకు సహాయపడుతుంది.
- జాగ్రత్తగా ఉండకపోవడం వల్ల కలిగే పర్యవసానాల గురించి భయపడండి. ఇది మనం భయపడుతున్నామని కాదు, కానీ సొంత-గౌరవం మరియు సొంత-విలువ యొక్క భావన ఆధారంగా బుద్ధిపూర్వకంగా లేకపోవడం యొక్క ప్రభావాలను అనుభవించడానికి మనం ఇష్టపడము. కోపం, దురాశ మొదలైన వాటి ప్రభావంతో వ్యవహరించడం ద్వారా మనం దిగజారిపోకూడదని మన గురించి మనం పాజిటివ్ గా ఆలోచిస్తాం.
పై వాటితో చేతులు కలిపి మన౦ ఆధ్యాత్మిక బోధకులపట్ల విస్మయాన్ని పె౦పొ౦ది౦చుకోవాలి. "విస్మయం" అనేది కష్టమైన పదం. మన ఆధ్యాత్మిక గురువులకు మనం అస్సలు భయపడుతున్నామని దీని అర్థం కాదు - వారు మమ్మల్ని తిట్టబోతున్నట్లు. మన ఆధ్యాత్మిక గురువులను, బౌద్ధమతాన్ని మనం ఎంతగా గౌరవిస్తామో, మన నెగెటివ్ ప్రవర్తన వారిని చెడుగా ప్రతిబింబిస్తే అది మనకు భయంకరంగా ఉంటుందని విస్మయం సూచిస్తుంది. మన కారణంగా ప్రజలు "అయ్యో, ఈ గురువు శిష్యులు ఇలా ప్రవర్తిస్తున్నారా?" లేదా "మీరు బౌద్దులు కావాలా? అని అనుకుంటే ఎంత భయంకరంగా ఉంటుందో అని మనం భయపడుతున్నాము! కానీ మీరు తాగి గొడవపడుతూ, కోపంగా రగిలిపోతూనే ఉన్నారు." అని విస్మయం మరియు గౌరవంతో, మనం మన బుద్ధిని అలా ఉంచుతాము మరియు నైతిక క్రమశిక్షణకు అనుగుణంగా వ్యవహరిస్తాము.
సారాంశం
మన జీవితంలో పురోగతి సాధించడంలో క్రమశిక్షణ చాలా ముఖ్యమైన విషయం అనే నిజాన్ని మనమందరం తెలుసుకున్నాము. అక్షరాలు నేర్చుకోవడం, పరీక్షలకు చదవడం లేదా బరువు తగ్గడానికి ప్రయత్నించడం - క్రమశిక్షణ లేకుండా, ఎక్కడికైనా వెళ్ళడం కష్టం.
బౌద్ధమత అభ్యాసం విషయంలో కూడా ఇంతే, ఆ మార్గంలో పురోగతిని సాధించడానికి మన ప్రవర్తన పరంగా మనకు క్రమశిక్షణ అవసరం. మన గురించి మరియు ఇతరుల గురించి మనం శ్రద్ధ వహిస్తే, నైతిక సొంత-క్రమశిక్షణ అనేది ఒక సుదూర ఆలోచన ఏమీ కాదు, కానీ అది ఒక సహజమైన, సాధారణ జ్ఞాన విషయంలా ఉంటుంది. నిర్మాణాత్మక ప్రవర్తనను జాగ్రత్తగా పెంపొందించుకోవడంలో మరియు ఇతరులకు హాని కలిగించకుండా ఉండటానికి మన వంతు కృషి చెయ్యడంలో, మనం ఇప్పుడు సంతోషకరమైన రేపటికి ఆధారాన్ని మరియు కారణాలను సృష్టిస్తాము.