జీవన విధానానికి బౌద్ధమత పద్ధతులు

బుద్ధుని బోధనలన్నీ మన జీవితంలోని కష్టాలను అధిగమించడానికి మనకు సహాయపడటానికి ఉద్దేశించినవి.

నాలుగు ఉత్తమమైన సత్యాలు

బుద్ధుడు బోధించిన మొదటి అంశం "నాలుగు ఉత్తమమైన సత్యాలు" అని పిలువబడుతుంది. దీని అర్థం ఏమిటంటే, బాగా గ్రహించిన మరియు రియాలిటీని అర్థం చేసుకోగలిగిన ఎవరైనా అర్థం చేసుకునే నాలుగు అసలైన నిజాలు. అవి:

  • మనమందరం ఎదుర్కొంటున్న అసలైన సమస్యలు.
  • వాటికి అసలు కారణాలు.
  • మనకు ఈ సమస్యలు ఇంకా రాకుండా ఉండటానికి వాటిని నిజంగా ఆపివేసే మార్గాలు.
  • అర్థం చేసుకునే విధానం, నటన మిగతావి మన సమస్యలన్నిటినీ ఆపివేసే విధానాలు.

మన నిజమైన సమస్యలు

బౌద్ధమతం మన సమస్యల గురించి చెప్పి వాటిని ఎలా ఎదుర్కోవాలో వివరణను ఇస్తుంది. బుద్ధుని బోధనలన్నీ మన జీవితంలోని కష్టాలను అధిగమించడానికి సహాయపడటానికి ఉద్దేశించినవి. ఈ విధానం చాలా హేతుబద్ధమైనది మరియు ఉదారతతో కూడి ఉంటుంది. మనకు ఎలాంటి సమస్యలు వచ్చినా అవన్నీ కారణాల వల్ల వస్తాయని చెప్పబడుతుంది. కాబట్టి మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులేమిటో తెలుసుకోవాలంటే మనం చాలా నిజాయితీగా, లోతుగా ఆలోచించాలి. మనలో చాలా మందికి, ఇది అంత సులభమైన ప్రాసెస్ కాదు. మన జీవితంలో కష్టమైన పరిస్థితులు ఏమిటో చూడటం నిజంగా చాలా బాధగా ఉంటుంది. చాలా మంది దీన్ని ఒప్పుకోరు. తమకు సమస్యలు ఉన్నాయని అంగీకరించడానికి వాళ్ళు ఇష్టపడరు - ఉదాహరణకు, ఒక చెడు సంబంధంలో ఉన్నప్పుడు వాళ్ళు అసంతృప్తిని అనుభవిస్తారు. కానీ దాన్ని 'నేను అసంతృప్తిగా ఉన్నాను' అనే స్థాయిలో వదిలెయ్యలేము. అసలు సమస్య ఏమిటో మనం లోతుగా పరిశీలించాలి.

మన సమస్యలకు అసలైన కారణాలు

ఇప్పుడు మనం మన సమస్యలకు అసలైన కారణాలను కనిపెట్టాలి. సమస్యలు ఎక్కడి నుంచో వాటికవే రావు. దానికి ఒక కారణం ఉండాలి, ఈ అసంతృప్తికరమైన పరిస్థితిని తీసుకురావడంలో అనేక స్థాయిల అంశాలు ఉంటాయి. ఉదాహరణకు, ఒక రిలేషన్షిప్ లో వ్యక్తిత్వ గొడవలు, ఆర్థిక సమస్యలు - సరిపడినంత డబ్బు ఉండకపోవడం మొదలైనవి - పిల్లలతో సమస్యలు లేదా ఇతర బంధువులతో సమస్యలు లాంటివి కూడా. సమస్యకు సహాయపడే అన్ని రకాల పరిస్థితులు ఉండవచ్చు. కానీ బుద్ధుడు మన సమస్యలకు బాగా లోతుగా వెళ్లి దాని అసలైన కారణాన్ని కనిపెట్టమని చెప్పాడు, మరియు మన సమస్యలకు లోతైన కారణం రియాలిటీ గురించి మన గందరగోళమే అని చెప్పాడు.

మనకు దుఃఖం, బాధ ఉంటుంది, మరియు అది ఒక రకమైన కారణం వల్ల వస్తుంది. ఉదాహరణకు, మనం చాలా ఇబ్బంది పెట్టే రీతిలో ప్రవర్తిస్తూ ఉండవచ్చు - ఉదాహరణకు, చాలా కోపంతో. కోపంగా ఉన్నప్పుడు ఎవరూ సంతోషంగా ఉండరు కదా? కాబట్టి, ఇక్కడ కోపం మన అసంతృప్తికి కారణమవుతోందని, ఆ కోపాన్ని ఎలాగైనా వదిలించుకోవాలని మనం గుర్తించాలి.

మనల్ని అసంతృప్తికి గురిచేసే సమస్య కూడా ఎప్పుడూ ఆందోళనను కలిగిస్తుంది. ఆందోళన అనేది చాలా అసహ్యకరమైన మానసిక స్థితి. ఎవరైతే ఆందోళనలో ఉంటారో వాళ్ళు సంతోషంగా లేరు, కదా? గొప్ప భారతీయ బౌద్ధమత గురువు శాంతిదేవుడు ఇలా చెప్పాడు, మీరు దాన్ని మార్చడానికి ఏదైనా చెయ్యగలిగే పరిస్థితిలో ఉంటే, ఆందోళన ఎందుకు పడాలి? వెంటనే దాన్ని మార్చండి. ఆందోళన పడడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. దాన్ని మార్చడానికి మీరు ఏమీ చెయ్యలేనప్పుడు, ఆందోళన పడడం ఎందుకు? అది కూడా ఏమీ ఉపయోగపడదు. కాబట్టి, ఆందోళన చెందడం యొక్క పనికిరాని విషయం గురించి మనకు గందరగోళం ఉంటుంది, కాబట్టి మనం ఆందోళన చెందుతూనే ఉంటాము. ఇక్కడ విషయం ఏమిటంటే ఆందోళన చెందడం వల్ల మనకు ఏ ప్రయోజనం ఉండదు.

అప్పుడు కూడా మనకు ఇంకొక స్థాయి సమస్య ఉంటుంది, ఇది ఎప్పుడూ సంతృప్తి భావన కలగని సమస్య. మనం సంతోషంగా ఉన్న సమయాలను అనుభవిస్తాము, కానీ దురదృష్టవశాత్తు, అవి శాశ్వతంగా ఉండవు మరియు మనం ఎప్పుడూ ఇంకా ఎక్కువ కావాలని కోరుకుంటాము. అది ఎప్పుడూ తృప్తి కలిగించదు. మనకు ఇష్టమైన ఆహారాన్ని ఒక్కసారి మాత్రమే తినడం వల్ల మనకు తృప్తి కలగదు కదా? మళ్లీ మళ్లీ దాన్ని తినాలనిపిస్తుంది. మరి ఒకేసారి అతిగా తింటే మొదట్లో ఉన్న ఆనందం కడుపునొప్పిగా మారుతుంది. కాబట్టి, ఈ రకమైన ఆనందం గురించి మనం కొంచెం ఇబ్బందులకు గురవుతాము. అది ఉన్నంత మాత్రాన దాన్ని ఆస్వాదించడం, అది ఎప్పటికీ తృప్తి పరచదని గ్రహించడం కంటే; ఆ ఆనందాన్ని కోల్పోయినప్పుడు, మనం చాలా బాధకు గురవుతాము.

ఇది ప్రియమైన స్నేహితుడు లేదా ప్రియమైన వ్యక్తితో ఉండటం లాంటిది, వాళ్ళు తర్వాత మనల్ని విడిచి వెళ్లిపోతారు. నిజానికి, వాళ్ళు ఏదో ఒక సమయంలో వెళ్లిపోతారు, కాబట్టి మనం వారితో ఉన్న ఆ కొంత సమయాన్ని ఆస్వాదించాలి. కొన్నిసార్లు మనం ఉపయోగించే చాలా అందమైన చిత్రం ఉంటుంది. మనం ఎంతగానో ప్రేమించేది మన జీవితంలోకి వచ్చినప్పుడు, అంటే మన కిటికీ దగ్గరకు వచ్చే ఒక  పక్షిలా ఉంటుంది. ఆ పక్షి మన కిటికీ దగ్గరకు వచ్చినప్పుడు, దాని స్నేహం యొక్క అందాన్ని మనం ఆస్వాదించవచ్చు, కాని కొద్ది సేపటి తర్వాత, ఆ పక్షి ఎగిరి వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఇది స్వతంత్రమైనది. మనం చాలా ప్రేమతో ఉంటే, బహుశా ఆ పక్షి తిరిగి రావచ్చు. కానీ మనం ఆ పక్షిని పట్టుకుని బోనులో పెడితే ఆ పక్షి చాలా బాధపడి చనిపోతుంది. అదే విధంగా, ఈ వ్యక్తులు ఈ అందమైన పక్షి లాగా మన జీవితంలోకి వస్తారు, మరియు వాళ్ళు మనతో ఉన్న సమయాన్ని సరిగ్గా ఆస్వాదించడం ఒక మంచి పని. వాళ్ళు ఏ కారణం చేతనైనా, ఎన్ని రోజులు వెళ్ళినా – ఇదే జరుగుతుంది. మనం దాని గురించి రిలాక్స్ గా, ప్రశాంతంగా ఉండి "నన్ను ఎప్పుడూ విడిచి పెట్టవద్దు. నువ్వు లేకుండా నేను బతకలేను" అనే డిమాండ్లు చెయ్యకుండా ఉంటే - అప్పుడు వాళ్ళు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. అలా అవ్వకపోతే మనం చేసిన డిమాండ్లు వాళ్ళను వెంబడిస్తాయి.

జీవితంలో మన సాధారణ ఆనందం మరియు సంతోషాల స్వభావం గురించి మనం ఇబ్బందులకు గురైనప్పుడు, మనకు సమస్యలు ఉంటాయి. మనకు ఉన్న సంతోషకరమైన సమయాలను కూడా మనం ఆస్వాదించలేము, ఎందుకంటే మనం వాటిని కోల్పోతామని భయపడతాము. మనం ఒక గిన్నె ఆహారం ఉన్న కుక్కలా ఉంటాము - కుక్క ఆహారాన్ని తింటూనే ఎవరూ వచ్చి తినకుండా చుట్టూ చూస్తూ అరుస్తుంది. కొన్నిసార్లు మనం అలా ఉంటాం కదా, మన దగ్గర ఉన్న దాన్ని ఆస్వాదించడం, అది పూర్తయిన తర్వాత అయ్యో అది అయిపోయిందే అని అనుకోకుండా ఉంటాం. కానీ నిజానికి, ఇది అనుకున్నంత సులభం ఏమీ కాదు - బహుశా ఇది సింపుల్ గా అనిపించకపోవచ్చు - కానీ దీనికి శిక్షణ అవసరం, మరియు జీవితంలో విషయాలను మనం వేరే విధంగా చూడటానికి అలవాటు పడాలి.

మన సమస్యలకు అసలైన ముగింపు

మన సమస్యలను శాశ్వతంగా తొలగించడం సాధ్యమేనని, దానికోసం వాటి కారణాలను మనం వదిలించుకోవాలని బుద్ధుడు చెప్పాడు. ఇది చాలా హేతుబద్ధమైన, మరియు చాలా లాజికల్ విధానం. ఇంధనం లేకపోతే ఏ మంట రాదు. ఈ సమస్యల నుంచి బయటపడి ఇంక ఎప్పటికీ రాకుండా చెయ్యడం కుదురుతుందని బుద్ధుడు చెప్పాడు.

ఈ సమస్యల నుంచి తాత్కాలిక విముక్తితో సంతృప్తి చెందాలని మనం అనుకోవడం లేదు కదా? ఇది నిద్రపోవడం అని అనుకోవడం లాంటిది - మీరు నిద్రపోతున్నప్పుడు, మీకు కష్టమైన రిలేషన్షిప్ ల సమస్యలు ఉండవు. కాబట్టి ఇది పరిష్కారం కాదు, ఎందుకంటే మీరు మేల్కున్నప్పుడు అవి మళ్ళీ వచ్చేస్తాయి. ఎక్కడో హాలిడేకు వెళ్లినా తిరిగి ఇంటికి రావాల్సిందే, ఇంటికి వచ్చాక ఆ సమస్యలు అలాగే ఉంటాయి. కాబట్టి హాలిడే ఉత్తమ పరిష్కారం కాదు, లోతైన శాశ్వత పరిష్కారం కాదు.

అలాగే, బుద్ధుడు నోరు మూసుకుని మీ సమస్యలను తీసుకుని వాటితో జీవించమని చెప్పలేదు, ఎందుకంటే అది కూడా సరైన పరిష్కారం కాదు, కదా? ఎందుకంటే అప్పుడు మనం నిస్సహాయంగా భావిస్తాం - మనం ఏమీ చెయ్యలేము, కాబట్టి మనం వదిలేసి ఏమీ ప్రయత్నించము. మన సమస్యలను అధిగమించడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం. మనం పెద్దగా ప్రోగ్రెస్ సాధించకపోయినా, కనీసం మనం ప్రయత్నించామని సంతోషిస్తాం.

మన సమస్యలను ఆపేసే పద్ధతులు

ఈ సమస్యలకు నిజంగా ఆపేసి, వాటికి నిజమైన ముగింపును సాధించాలనుకుంటే, బుద్ధుడు బోధించిన నాలుగవ సత్యం అనేది ఒకటి ఉంటుంది. దీని లోతైన కారణాన్ని వదిలించుకోవడానికి మనం ఒక రకమైన పద్ధతిని అనుసరించాలి మరియు ఒక సరైన అవగాహనను పొందాలి, మన గందరగోళం గురించి. కానీ ఎప్పుడూ గుర్తుంచుకోలేకపోతే మంచి అవగాహన ఉన్నా కానీ అది సరిపోదు కాబట్టి మనం మంచి ఏకాగ్రతను పెంపొందించుకోవాలి. కానీ ఏకాగ్రత ఆ అవగాహనను గుర్తుంచుకోవడానికి మరియు అదే ఏకాగ్రతతో ఉండటానికి, మనకు సొంత క్రమశిక్షణ అవసరం. కాబట్టి, మన సమస్యలను నివారించడానికి మనం ఉపయోగించే సాధారణ బౌద్ధమత పద్ధతులు క్రమశిక్షణ, ఏకాగ్రత మరియు సరైన అవగాహనను అనుసరించడం (కొన్నిసార్లు దీన్ని "జ్ఞానం" అని పిలుస్తారు).

దీనికి తోడు, స్వార్థం మన సమస్యలకు అతి పెద్ద కారణం. మన స్వార్థం చాలా వరకు రియాలిటీ యొక్క కంగారుపై ఆధారపడి ఉంటుంది, ఎందుకంటే ఏదో ఒక విధంగా, ఈ ప్రపంచంలో మనం మాత్రమే ఉన్నామని మనం అనుకుంటాము. ఇతరులు ఉన్నారని మనం అంగీకరించినప్పటికీ, విశ్వంలో అత్యంత ముఖ్యమైనది, మన విశ్వానికి కేంద్రం మనమే అని అనుకుంటాం. ఆ అపోహ వల్ల, మనం ఇలా ఆలోచిస్తాము, "నాకు ఎప్పుడూ నా సెపరేట్ దారి ఉండాలి. నేను కోరుకున్నది ఎప్పుడూ నాకు దక్కాలి" అని అనుకుని అది మనకు దొరకకపోతే మనం బాధ పడతాము.

కానీ అది రియాలిటీ గురించి చాలా ఇబ్బందితో కూడిన ఆలోచనా విధానం ఎందుకంటే ఆ కోణంలో నా గురించి ప్రత్యేకమైనది ఏమీ ఉండదు. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు, ఎవరూ అసంతృప్తిగా ఉండాలని కోరుకోరు అనే అర్థంలో మనమందరం ఒక్కటే; ప్రతి ఒక్కరూ తాము కోరుకున్నది పొందాలని కోరుకుంటారు మరియు అలా జరగకూడదని ఎవరూ కోరుకోరు. ఎలాగోలా మనందరం కలిసే జీవించాలి, ఎందుకంటే మనం ఇప్పుడూ కలిసే జీవిస్తున్నాం. కాబట్టి, సమస్యలను అధిగమించే లేదా నివారించే మార్గాలకు మనం ప్రేమ మరియు కరుణ, ఇతరుల పట్ల శ్రద్ధ మరియు పరోపకారాన్ని జోడించాలి. ఇతరులు మనకు సహాయం చెయ్యాలని మనం కోరుకున్నట్లే, మనం కూడా వాళ్ళకు సహాయం చెయ్యాలని వాళ్ళూ కోరుకుంటారు.

ఇబ్బంది పెట్టే భావోద్వేగాలతో వ్యవహరించడం

నిజానికి, ప్రతి ఒక్కరూ సాధువులు లేదా బోధిసత్వులు కాదు, ఇది అసలైన నిజం. ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్థాయిలో ఇబ్బందికి గురవుతున్నారు. ఇలా ఇబ్బందులలో పడటం వల్ల, మనం దాని భావోద్వేగాల ప్రభావంతో ప్రవర్తిస్తాము. ఉదాహరణకు, నేను ఈ విశ్వానికి కేంద్రం అని మరియు నేను చాలా ముఖ్యమైన వాడిని అని అనుకుంటే, దానితో పాటు వచ్చే భావన అభద్రత భావం, కదా? మీరు గందరగోళంలో ఉన్నప్పుడు, అభద్రతా భావానికి లోనవుతారు అప్పుడు మీరు ఇలా అనుకుంటారు, "సరే, నేను చాలా ముఖ్యమైన వాడిగా ఉండాలి, కానీ ప్రజలు ఎప్పుడూ నన్ను అలా చూడటం లేదు" అని. కాబట్టి, అక్కడ అభద్రతా భావం ఉంటుంది.

మనం అభద్రతా భావంలో ఉన్నప్పుడు మనం ఉపయోగించగల స్ట్రాటజీలు ఏవి - మనల్ని మనం ఇంకా సురక్షితంగా భావించడానికి ఉపయోగపడే స్ట్రాటజీలు ఏవి? వాటిలో ఒకటి: "నేను నా చుట్టూ కావలసిన వస్తువులను పొందగలిగితే, అది నాకు ఒక సురక్షితమైన అనుభూతిని కలిగిస్తుంది. నాకు సరిపడా డబ్బు లేదా శ్రద్ధ లేదా ప్రేమ లభిస్తే, అది నాకు సంతోషాన్ని కలిగిస్తుంది." కానీ, ఇక్కడ చూస్తే, ఈ రకమైన ఆనందం యొక్క స్వభావంలో మనం ఎప్పుడూ సంతృప్తి చెందము మరియు ఇంకా కావాలని కోరుకుంటాము. 

దీని గురించి ఆలోచించండి. ఇది అర్ధవంతంగా ఉంటుంది. మన ప్రియమైన వ్యక్తి ఒక్కసారి "ఐ లవ్ యూ" అని చెప్పాలని మనం కోరుకుంటున్నామా? వాళ్ళు ఒకసారి చెబితే చాలు - మళ్ళీ మనతో అలా చెప్పనవసరం లేదు. దానితో మనం ఎప్పుడూ సురక్షితంగా ఉండము. మనం దాన్ని మళ్ళీ మళ్ళీ వినాలని కోరుకుంటాం, కదా? మనం "సరే, నువ్వు ఇక నాకు అలా చెప్పనవసరం లేదు" అని చెప్పే స్థితికి చేరుకోలేము. అది నాకు తెలుసు. కాబట్టి, మనం అత్యాశ గురించి మాట్లాడినప్పుడు, అది కేవలం వస్తువుల గురించి మరియు డబ్బు పట్ల అత్యాశ మాత్రమే కాదు, ప్రేమ కోసం కూడా. మనలో చాలా మంది ముఖ్యంగా శ్రద్ధ కోసం అత్యాశను కలిగి ఉంటారు. చిన్న పిల్లలలో మనం దీన్ని చూస్తుంటాం. కాబట్టి ఇది ఒక విధానం: మన చుట్టూ సరైన వస్తువులను మనం పొందగలిగితే, అది మనల్ని సురక్షితంగా ఉంచుతుంది. అలా ఎప్పటికీ జరగదు.

తర్వాతి విధానం కోపం మరియు విరక్తి: "నన్ను బెదిరిస్తున్నట్లు నేను భావించే కొన్నిటిని నేను దూరం చేసుకోగలిగితే, అది నాకు మంచి అనుభూతిని ఇస్తుంది." కానీ మనం ఎప్పుడూ సురక్షితంగా ఉండము; మనం ఎప్పుడూ బెదిరింపులకు గురవుతూ ఉంటాము; మరియు ఎవరైనా మనకు నచ్చని పని చేస్తే మనం అప్రమత్తంగా ఉంటాము - ఆ తర్వాత మనం కోపంతో వాళ్ళను వెంబడిస్తాము. కొన్నిసార్లు అది మనల్నే దెబ్బ తియ్యవచ్చు. అవతలి వ్యక్తి మన గురించి సరైన శ్రద్ధ తీసుకోవడం లేదని, మనకు సరిపడా సమయం ఇవ్వడం లేదని, మనం ఆ వ్యక్తిపై అరిచే ఉదాహరణ గురించి నేను ఆలోచిస్తున్నాను. అప్పుడు మనకు కోపం వచ్చి ఇలా అరుస్తాము, "నువ్వు నా పైన ఇంకా ఎక్కువ శ్రద్ధను చూపించాలి! నువ్వు నాతో ఎక్కువ సమయం గడపాలి!" అని. దాని ఫలితం ఏమిటి? సాధారణంగా, వాళ్ళు ఇంకా దూరంగా వెళతారు. లేదా వాళ్ళు మనకు పెద్ద సహాయం చేసి ఇంకొన్ని రోజులు మనతో ఉంటారు, కానీ వాళ్ళు అలా చెయ్యడంలో సౌకర్యవంతంగా లేరని మీరు గమనించవచ్చు. ఒకరిపై కోప్పడడం వల్ల వాళ్ళు మనల్ని ఎక్కువగా ఇష్టపడతారని మనం ఎలా అనుకోగలం? ఇది అసలు అర్ధం లేనిది, కదా? మనల్ని ఇంకా సురక్షితంగా మార్చాలనే ఆశతో మనం చేసే అనేక పనులు మనల్ని ఇంకా దిగజార్చుతాయి.

మనం ఉపయోగించే ఇంకొక విధానం అడ్డు గోడలు కట్టడం. సమస్యను మనం ఏదో విధంగా పరిష్కరించలేకపోతే, అది అసలు ఉండదు లేదా దానంతట అదే పోతుంది అనే ఆలోచన అమాయకత్వంపై ఆధారపడి ఉంటుంది. "నేను దాని గురించి వినదల్చుకోవట్లేదు" – అనే ఈ రకమైన వైఖరితో మీరు అడ్డు గోడను కడతారు. కానీ ఆ అమాయకత్వపు స్థితి కూడా సరిగ్గా పని చెయ్యదు. మనం నిర్లక్ష్యం చేసినంత మాత్రాన, గుర్తించకుండా ఉండడం వల్ల ఆ సమస్య ఏమీ పోదు.

కాబట్టి, ఈ ఇబ్బంది పెట్టే భావోద్వేగాల ఆధారంగా, మనం అన్ని రకాల చెడు మార్గాల్లో ప్రవర్తిస్తాము. మనం అరుస్తాము. మనం ఎవరొకరిని కొడతాము. "పాపం, నా దగ్గర ఏమీ లేదు" అని అనుకుని ఒక దొంగతనం చేసి అది మీకు ఏదో విధంగా సహాయపడుతుందని అనుకోవచ్చు. ఇప్పుడు నేను చాలా సంవత్సరాలు భారతదేశంలో నివసించిన ఉదాహరణ గురించి ఆలోచిస్తున్నాను. భారతదేశం పురుగులకు ప్రతీక - అక్కడ మీరు ఊహించగల ప్రతి రకమైన పురుగులను చూడొచ్చు. మీరు వాటన్నిటిని చంపలేరు; మీరు వాటి మీద గెలిచే అవకాశం అస్సలు లేదు. వాటితో కలిసి జీవించడం నేర్చుకోవడమే ఏకైక పరిష్కారం. మీ గదిలో వివిధ దోమలు ఉండటం మీకు నచ్చకపోతే, మీరు ఒక దోమతెరలో పడుకోవచ్చు - అప్పుడు మీ చుట్టూ ఒక తెర ఉంటుంది అలా మీరు ఒక రక్షణ ప్రదేశంలో ఉంటారు. మీ గదిలోని అన్ని దోమలను వేటాడడం కంటే ఇది మంచి శాంతియుత పరిష్కారం, మరియు మీరు ఆ రాత్రంతా మేల్కొని ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే, చంపడానికి ఇంకా ఎక్కువ దోమలు వస్తూనే ఉంటాయి. తలుపు క్రింద ఎప్పుడూ చోటు ఉంటుంది, లేదా కిటికీలు సరిగ్గా మూసి ఉండవు - అందుకే ఎక్కువ దోమలు ఉంటాయి. కానీ వినాశకరమైన ప్రవర్తనకు ఆ ప్రేరణ తప్పనిసరిగా వస్తుంది: "నేను వాటిని వదిలించుకోవాలి!" అని.

వినాశకరమైన ప్రవర్తనలో చాలా రూపాలు ఉన్నాయి. అబద్ధాలు చెప్పడం, బూతులు తిట్టడం, వ్యభిచారం, అత్యాచారం - ఇవన్నీ ఉన్నాయి. మరియు మనం చెడుగా వ్యవహరించినప్పుడు, ప్రాథమికంగా అది అసంతృప్తిని సృష్టిస్తుంది - ఇతరులకు మాత్రమే కాదు, ముఖ్యంగా మనకు కూడా అసంతృప్తి కలిగిస్తుంది. మీరు దాని గురించి ఆలోచిస్తే, బౌద్ధమతం చంపకూడదని చాలా గట్టిగా మాట్లాడుతుంది, కదా? ఇప్పుడు, ఇక్కడ విషయం ఏమిటంటే, మీకు నచ్చని దాన్ని - అంటే ఉదాహరణకు దోమలు లాంటి వాటిని చంపే అలవాటు మీకు ఉంటే, అది మీ మొదటి, ఆటోమేటిక్ ప్రతిస్పందన అవుతుంది, కదా? ఇది కేవలం చంపడం గురించి మాత్రమే కాదు. మనకు నచ్చనిది ఏదైనా ఉంటే, మనం దాన్ని చాలా హింసాత్మకంగా చూస్తాము - అది మౌఖికమైనది కావచ్చు, శారీరకమైనది కావచ్చు, లేదా భావోద్వేగమైనది కూడా కావచ్చు.

ఒక్కోసారి మీరు వాటిని చంపాల్సిన అవసరం ఉండవచ్చు. ఉదాహరణకు, పంటలను తినే కీటకాల విషయంలో; వ్యాధి ఉన్న కీటకాలు మొదలైనవి ఉండవచ్చు. బౌద్ధమతం అంటే మతోన్మాదం కాదు. కానీ మీరు దాని గురించి అమాయకంగా ఉండకూడదు. దీన్ని కోపం, ద్వేషం లేకుండా పాటించడానికి ప్రయత్నించండి - "నేను ఈ మలేరియా దోమలను ద్వేషిస్తాను!" అని చెప్పి ఆ తర్వాత జరిగే నెగెటివ్ పరిణామాల గురించి మీరు ఏమీ తెలియనట్లు ఉండకూడదు. ఒక సాధారణ ఉదాహరణ: మన కూరగాయలు మరియు పండ్లపై పురుగుమందులను ఉపయోగిస్తే - మనం కూడా వాటిని తింటాము, అది వ్యాధిని కలిగించవచ్చు. కాబట్టి నెగెటివ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ విషయం ఏమిటంటే, మన అసలు జంపింగ్ పాయింట్ కు తిరిగి వస్తే, మన పద్ధతులు క్రమశిక్షణ, ఏకాగ్రత మరియు ప్రేమ మరియు కరుణతో పాటు సరైన అవగాహనను కలిగి ఉండాలి.

నైతిక సొంత-క్రమశిక్షణ

జీవితంలో సమస్యల నుంచి తప్పించుకోవడానికి ఈ నివారణ చర్యలను మనం ఎలా అప్లై చెయ్యాలి? మొదటి స్థాయి, ముందుగా మనం నైతిక సొంత-క్రమశిక్షణను అప్లై చెయ్యాలి, ఇది ఈ వినాశకరమైన పనులను నివారిస్తుంది. కోపం, దురాశ, మమకారం, అసూయ, అమాయకత్వం, అహంకారం మొదలైన ఇబ్బంది పెట్టే భావోద్వేగాల ప్రభావంతోనే వినాశకరంగా వ్యవహరించడం జరుగుతుంది. అంటే మనకు వినాశకరంగా వ్యవహరించాలని అనిపించినప్పుడు, "కాదు, నేను అలా వ్యవహరించాలని అనుకోవడం లేదు" అని చాలా స్పష్టంగా నిర్ణయించుకుంటాము.

మీరు చేసిన తప్పుకు నేను మిమ్మల్ని తిట్టాలని అనిపించినప్పుడు, అరిస్తే ఈ పరిస్థితి ఇంకా కష్టంగా మార్చుతుందని నాకు తెలుసు. నేను మిమ్మల్ని సరిదిద్దుకోమని చెప్పవచ్చు లేదా ఏదైనా తప్పు జరిగినప్పుడు దాన్ని నేరుగా ఎదుర్కోవాల్సి రావొచ్చు, కానీ అరవడం దాన్ని ఇంకా కష్టంగా మార్చుతుంది, కదా? ముఖ్యంగా మిమ్మల్ని చెడ్డ పేర్లతో పిలవడం మరియు తిట్టడం - అది ఖచ్చితంగా ఈ పరిస్థితికి సహాయపడదు. కాబట్టి నైతిక సొంత క్రమశిక్షణ అంటే మనం వినాశకరమైన రీతిలో వ్యవహరించడానికి ముందే దాన్ని తెలుసుకోవడం. అలా ప్రవర్తించాలనే ప్రేరణ మనకు ఉంటుంది, మరియు మనం "ఇది ఏమాత్రం సహాయపడదు" అనే వివక్షను చూపిస్తాము. అలా మన ప్రేరణను అమలు చెయ్యకుండా మనల్ని మనం నిరోధించుకుంటాము.

ఇప్పుడు, మీరు కోపాన్ని లోపల ఉంచుకోండి, అది మిమ్మల్ని తినేస్తుందని మనం ఇక్కడ చెప్పడం లేదు, మరియు అది పేలిపోయే వరకు మీరు దాన్ని పట్టుకుని ఉంచుతారు. అది సరైన పద్ధతి కాదు. మనం దాన్ని సరిగ్గా ఎదుర్కోలేకపోతే, అది లోపల పెరిగిపోతుంది - సరే, దాన్ని అవతలి వ్యక్తిపై చూపించవద్దు. గోడను కొట్టడం అనేది మీ చేతిని గాయపరచడంలా ఉంటుంది, కాబట్టి అది ఒక మూర్ఖపు పని. కాబట్టి, మీరు దాన్ని వేరే విధంగా చూపిస్తారు, కదా? మీ ఇంట్లో ఒక దిండును కొట్టండి లేదా నేలలను తడిపేయండి - కోపం మరియు నిరాశతో వ్యవహరించే ఆ రకమైన పద్ధతి, మరియు కఠినమైన ఇంటి పని చెయ్యడం లేదా ఎక్కువసేపు బయటకు వెళ్లడం లేదా జిమ్ లో బలమైన వ్యాయామం చెయ్యడం ఆ నిరాశాజనక కోపం యొక్క శక్తిని తగ్గించడానికి మీకు సహాయపడతాయి.

బుద్ధిపూర్వకత మరియు ఏకాగ్రత

ఈ విధమైన ప్రవర్తనకు మనం బాగా అలవాటు పడితే, చెడుగా ప్రవర్తించాలని అనిపించినప్పుడు అలా ఉండకుండా మనల్ని మనం నియంత్రించుకుంటే, అలాంటి సందర్భంలో మనం వాడేది "విచక్షణా అవగాహన" అని పిలువబడుతుంది. ఏది సహాయకారిగా ఉంటుందో, ఏది హానికరమో అని మనం విచక్షణను చూపిస్తాం, దాని ఆధారంగా మనం ప్రశాంతంగా ఉండగలం మరియు కోపాన్ని లోపల దాచుకోగలం. కాబట్టి, మనం ఇక్కడ వాడే ప్రధాన విషయం సాధారణంగా "బుద్ధిపూర్వకత" అని అనువదించబడుతుంది. అంటే "గుర్తుంచుకోవడం" అని అర్థం. క్రమశిక్షణను కలిగి ఉండడం - నేను ఏమి చేయాలనుకుంటున్నాను, నేను జీవితంలో ఎలా ఉండాలనుకుంటున్నాను, నా జీవితంలో నేను ఎలా ప్రవర్తించాలనుకుంటున్నాను - అనే దాన్ని అంటిపెట్టుకోవడం మరియు దాన్ని మర్చిపోకుండా ఉండటం మానసిక జిగురు లాంటిది. అదే బుద్ధిపూర్వకత. ఇది "చురుకుగా గుర్తుంచుకోవడం" అనే పదం లాంటిది.

కాబట్టి, మనం ఇంకా మెలకువగా ఉండటానికి ప్రయత్నిస్తాము. "బుద్ధుడు" అనే పదానికి నిజంగా "మేల్కొని ఉన్న వ్యక్తి" అని అర్థం. మనం అనుభవిస్తున్న ఈ భావోద్వేగాలు ఏమిటో, ఇలా ప్రవర్తించడానికి మన మనస్సులో బలవంతంగా వస్తున్న కోరికలు ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము, వాటికి బానిసలుగా అవ్వకుండా ఉండటానికి ప్రయత్నిస్తాము, కాని అవగాహనతో, మనం ఎలా వ్యవహరించాలో ఎంచుకోగలమని గ్రహిస్తాము. ఒకవేళ నేను చెడ్డ మూడ్ లో ఉంటే, దాన్ని మార్చవచ్చు; దాన్ని మార్చడానికి నేను ఏమైనా చెయ్యవచ్చు.

కొన్నిసార్లు చెడు మూడ్ లో ఉండటానికి పరిష్కారం చాలా సులభమైనది. సింపుల్ పద్ధతులలో ఒకటి "గోల చేసే బేబీని పడుకోబెట్టడం." చాలా సేపు నిద్ర లేచిన పిల్లాడిలా ఉన్నట్టు ఆ బేబీని చూసి ఇలా అనుకుంటాం - "వాహ్" - ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటుంది అని. మనం చెడు మూడ్ లో ఉన్నప్పుడు కూడా మనం అలానే ఉంటాము. కాబట్టి, మనం కాసేపు పడుకుని విశ్రాంతి తీసుకోవాలి. మనం లేచినప్పుడు ఇది సాధారణంగా చాలా బాగుంటుంది.

లేదా మీరు ఎవరితోనైనా గొడవ పడుతుంటే, మరియు అది చాలా తీవ్రమైన స్థితికి చేరుకుంటే - ఈ పరిస్థితిలో అవతలి వ్యక్తి ఇంక మీ మాటను వినడం లేదని మరియు మీరు అతని మాటలు వినడం లేదని మీకు తెలిసినప్పుడు ఆ గొడవను ముగించడం మంచిది - "మనిద్దరం ప్రశాంతంగా ఉన్నప్పుడు తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం" అని చెప్పొచ్చు. ఆ తర్వాత శాంత పడడానికి నడక వెళ్ళవచ్చు లేదా మిగతా పనులను చెయ్యవచ్చు.

ఇవి చాలా సింపుల్ పద్దతులు. బౌద్ధమతం దానికంటే చాలా లోతైన పద్ధతులను బోధిస్తుంది, కానీ ఇది ఒక ప్రారంభం మాత్రమే. మనం అప్లై చెయ్యగల పద్ధతులను వెంటనే అప్లై చెయ్యడం ప్రారంభించాలి. కానీ ఇక్కడ సూత్రం అనేది ముఖ్యమైన విషయం, ఆ సమస్యకు కారణమేమిటో చూడటం మరియు దాన్ని అధిగమించడానికి ఏదైనా చేయడమే సూత్రం. కేవలం ఆ సమస్యకు బలైపోకూడదు. ఒక రకంగా చెప్పాలంటే, మీ జీవితంలో ఏమి జరుగుతుందో దానిపై మీరే నియంత్రణను తీసుకోవాలి.

ఇప్పుడు, మన ప్రవర్తనలో ఏది సహాయకారిగా ఉంటుంది మరియు ఏది హానికరం అనే దానిపై దృష్టి పెట్టగలిగితే మరియు మనం ఎలా వ్యవహరించాలని అనుకుంటున్నామో గుర్తుంచుకోగలిగితే ఆ విధంగా వ్యవహరించకపోతే దాన్ని సరిదిద్దవచ్చు. మన శరీరంతో మనం ఎలా ప్రవర్తిస్తున్నామో ఎలా మాట్లాడుతున్నామో అని ఆలోచిస్తే అప్పుడు దాన్ని చెయ్యగల శక్తిని మనం అభివృద్ధి చేసుకుంటాము.

కాబట్టి, మనకు ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు, లేదా "పాపం నేను. నన్నెవరూ ప్రేమించరు" అని అనిపించినప్పుడు, "ఈ జాలి, ఆందోళన మొదలైనవి నాకు ఇష్టం లేదు, ఇది నాకు అసంతృప్తిని కలిగిస్తుంది" అని మనం అనుకుంటాము. మనం మన దృష్టిని ఇంకా సానుకూలమైన దాని వైపుకు తీసుకువెళతాము. కేవలం కూర్చొని ఆందోళన చెందడం కంటే మన శరీరంతో, మన మనస్సుతో మనం చెయ్యగలిగే పాజిటివ్ పనులను చెయ్యవచ్చు. మనం ఆందోళన చెందుతున్నప్పుడు ప్రతిదీ ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించడం కంటే మనం ఆలోచించగల వేరే అనేక పాజిటివ్ విషయాలు ఉంటాయి. ఎందుకంటే, మనం ఇక్కడ అభివృద్ధి చెయ్యడానికి ప్రయత్నిస్తున్నది ఏకాగ్రత, అలా అది మాయమైనప్పుడు తిరిగి మనం మన దృష్టిని తెచ్చుకోవచ్చు.

ఉదాహరణకు, మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు మరియు మన ఆలోచన ఎటో వెళ్ళిపోతునప్పుడు - దాని గురించి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఇది "వాళ్ళు మాట్లాడటం ఎప్పుడు ఆపేస్తారు?" లేదా "నేను భోజనానికి ఏమి చేయబోతున్నాను?" ఇది దాని గురించి కావచ్చు - మరియు మనం అవతలి వ్యక్తిని పట్టించుకోవడం మానేస్తాము, లేదా మన మనస్సులో ఏదో ఒకటి అనుకుంటాము: "వాళ్ళు చెప్పింది తెలివితక్కువది", అని మన దృష్టిని తిరిగి తెచ్చుకుని వాళ్ళు చెప్పేది వినడంపై దృష్టి పెడతాము.

ఇది ఏకాగ్రత యొక్క చాలా ఆచరణాత్మక ఉపయోగం, కానీ దీనికి క్రమశిక్షణ అవసరం; ముందుగా, మన శారీరక మరియు మౌఖిక ప్రవర్తనలో మనం ఆ క్రమశిక్షణను అభివృద్ధి చేసుకుంటాము. మీరు ఈ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకున్నప్పుడు, మీ దృష్టిని తిరిగి తీసుకువచ్చి ఏవైనా తేడాలను సరిదిద్దడానికి, మీరు దాన్ని అన్ని రకాల పరిస్థితులలో అప్లై చెయ్యవచ్చు. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉదాహరణకు, మీరు మీ శరీరాన్ని ఎలా పట్టి ఉంచుతున్నారో గుర్తుంచుకోవడం ప్రారంభిస్తారు. మీ భుజాలు ఉద్రిక్తంగా అయ్యి మీ దృష్టిని ఆకర్షిస్తుంటే, మీరు జాగ్రత్తగా ఉండి దాన్ని గమనించినట్లయితే, మీరు మీ భుజాలను వెనక్కి పెట్టి విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కేవలం శ్రద్ధ వహించడం, గుర్తుంచుకోవడం మరియు దాని గురించి ఏదైనా చెయ్యడం వరకే ఉంటుంది. లేదా మీరు చాలా ఉద్వేగానికి గురైనప్పుడు, మీరు దాన్ని గమనించి మారుస్తారు. మీ భుజాలను వెనక్కి పెట్టి ప్రశాంతంగా ఉంటారు, కానీ మీరు దాన్ని మీ శక్తి స్థాయిలో, భావోద్వేగ స్థాయిలోనే చేస్తారు.

ఈ ధర్మ పద్ధతులను మీరు జీవితంలో ఎలా అప్లై చేసుకుంటారనేదే దాని పూర్తి రహస్యం. వాటిని గుర్తుంచుకుని అలా చెయ్యడానికి సరైన క్రమశిక్షణ మీకు ఉండాలి. మీరు మంచిగా ఉండాలని లేదా మీ గురువును సంతోషపెట్టాలని లేదా అలాంటివి కావాలని మీరు అలా చెయ్యరు. మీరు సమస్యలను - కష్టాలను నివారించాలని కోరుకుంటారు కాబట్టి దీన్ని చేస్తారు - ఎందుకంటే మీరు దాని గురించి ఏమీ చెయ్యకపోతే, మిమ్మల్ని మీరు బాధ పెట్టుకుంటారని మీకు తెలుసు, మరియు అది మంచి విషయం కాదు, కదా? కాబట్టి, మన సొంత-క్రమశిక్షణను ఏకాగ్రత పరంగా మానసికంగా అప్లై చెయ్యాలి - మన భావాలతో వ్యవహరించే విషయంలో కూడా. మన భావాలతో వ్యవహరించడం చాలా సున్నితమైనది, మరియు ఇది చాలా కష్టం. కానీ నేను చెప్పినట్లుగా, మీరు మితిమీరిన ఉద్వేగానికి లోనైతే, మీరు ప్రశాంతంగా ఉండవచ్చు.

సరైన అవగాహన

ఏకాగ్రత సాధనాన్ని మీరు కొంత స్థాయి వరకు అభివృద్ధి చేసుకున్న తర్వాత, మీరు ఏమి జరుగుతుందో సరైన అవగాహనపై దృష్టి పెట్టగలగాలి. రియాలిటీ గురించి మనకు అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి - మనం ఎలా ఉనికిలో ఉన్నాము, ఇతరులు ఎలా ఉన్నారు, అసలు ప్రపంచం ఎలా ఉంది అనే దాని గురించి - మరియు ఆ ఇబ్బందుల కారణాలు, నిజం కాని దాని గురించి మనకు అన్ని రకాల అంచనాలు ఉన్నాయి, కదా? మనం ఇలా ప్రొజెక్ట్ చెయ్యగలం: "నేను మంచివాడిని కాదు. నేను ఓడిపోయాను" అని. లేదా ఇలా ప్రొజెక్ట్ చెయ్యవచ్చు: "నేను ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన వ్యక్తిని." లేదంటే ఇలా ప్రొజెక్ట్ చెయ్యవచ్చు: "అయ్యో, నన్ను ఎవరూ ప్రేమించరు" అని. కానీ మన జీవితంలో ప్రతి ఒక్కరినీ అనలైజ్ చేస్తే, మా అమ్మ నన్ను ఎప్పుడూ ప్రేమించలేదు, నా కుక్క నన్ను ఎప్పుడూ ప్రేమించలేదు - ఎవరూ నన్ను కంటిన్యూగా ప్రేమించలేదు. ఇది అస్సలు జరిగే పని కాదు.

కాబట్టి, మనం ఈ ఫాంటసీలను ప్రొజెక్ట్ చేస్తున్నాము మరియు అవి నిజమని నమ్ముతున్నాము; అదే ఒక భయంకరమైన విషయం. మనం ఆలస్యంగా రాగలమని, లేదా అపాయింట్మెంట్ కోసం రాకుండా ఉండవచ్చని మనం నమ్ముతున్నాము, మరియు అది ముఖ్యం కాదు: "మీకు ఫీలింగ్స్ అనేవి ఏమీ లేవు," కదా? ఆ తర్వాత మనం ఇతరులను అస్సలు పట్టించుకోము. కానీ మనకు ఫీలింగ్స్ ఉన్నట్లే అందరికీ ఫీలింగ్స్ ఉంటాయి. ఎవరూ పట్టించుకోకుండా ఉండాలని అనుకోరు. అపాయింట్మెంట్ ఉంటే, అవతలి వ్యక్తి కాల్ చెయ్యకపోయినా లేదా ఆలస్యంగా వచ్చినా ఎవరూ ఇష్టపడరు. అది ఎవరికి నచ్చదు. కాబట్టి, మనం చేయాల్సిందల్లా, ఈ ఊహలను తగ్గించడానికి మన ఏకాగ్రతను ఉపయోగించడం మరియు ఇతరులను బాధపెట్టకుండా మన అసంబద్ధ ప్రవర్తనను మార్చుకోవడం. ఎందుకంటే ఇది మన సమస్యలకు లోతైన కారణం: "నేను విశ్వానికి కేంద్రం. నాకు ఎప్పుడూ నా దారే ఉండాలి. నేను చాలా ముఖ్యమైన వాడిని" అని అనుకుంటాము. అది ఫాంటసీకి ఒక ప్రొజెక్షన్. ఎవరూ ఇక్కడ అంత ముఖ్యం కాదు. కానీ మన ఊహ నిజమని నమ్మి మనం స్వార్థపరులం అవుతాము. కాబట్టి, మనం స్వార్థాన్ని జయించాలనుకుని, ఆ ఊహను పోగొట్టుకుని, దాన్ని ప్రొజెక్ట్ చెయ్యడం మానెయ్యాలి. నేను విశ్వానికి కేంద్రంగా ఉన్నాను మరియు నేను మాత్రమే ఉన్నాను (ఎందుకంటే నేను కళ్ళు మూసుకున్నప్పుడు నా తలలో ఈ గొంతు వినిపిస్తుంది, మరియు నాకు ఇంకెవరూ కనపడరు, కాబట్టి ఉన్నది నేను ఒక్కడినే అన్నట్లు అనిపిస్తుంది) అనేది ఒక భ్రమ అని మనం గుర్తుంచుకోవాలి మరియు దాన్ని నమ్మకుండా ఉండటానికి ప్రయత్నించాలి.

ఆ అవగాహనతో ఉండటమే మన సమస్యలకు నిజమైన ముగింపుని సాధించడానికి నిజమైన మార్గం అని బుద్ధుడు చెప్పాడు. మనకు దాని గురించి సరైన అవగాహన ఉంటే, అప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉండేవి కావు. మనకు ఇంకేమీ ఇబ్బందులు లేకపోతే, కోపం వచ్చేది కాదు; మనకు మమకారం, దురాశ మొదలైనవి ఉండేవి కావు. ఈ ఇబ్బంది పెట్టే భావోద్వేగాలు ఏమీ లేకపోతే, మనం విధ్వంసకరంగా వ్యవహరించలేము. మనం వినాశకరంగా వ్యవహరించకపోతే ఇతరులకు అన్ని రకాల సమస్యలను తెచ్చిపెట్టే వాళ్ళము కాదు. మన జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలో చెప్పే ప్రాథమిక బౌద్ధమత పద్ధతి అదే.

మనకు సంతోషకరమైన సంబంధాలు ఉండాలనుకుంటే, మనం ఈ క్రింది వాటిని గుర్తించాలి:

  • నేను ఒక మనిషిని. నువ్వు ఒక మనిషివి. మనందరికీ ఒకే రకమైన ఫీలింగ్స్ ఉంటాయి.
  • ప్రతి ఒక్కరికీ బలమైన విషయాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికీ బలహీనమైన విషయాలు ఉంటాయి. అవి నాకు కూడా ఉన్నాయి, మీకూ ఉంటాయి.
  • తెల్లని గుర్రంపై రాజకుమారుడు లేదా రాజకుమారి చార్మింగ్ లాగా ఎవరూ ఉండరు.

మీ కథల్లో ఆ బొమ్మ ఉంటుందా? మనం ఎప్పుడూ ఒక మంచి భాగస్వామి కోసం ఎదురు చూస్తాము, అదే తెల్ల గుర్రంపై వచ్చే రాజు కోసం, కానీ అది ఒక కథ మాత్రమే. ఇది నిజం కాదు, కానీ మనం దాన్ని ఊహించుకుంటాము. ఆ కల్పిత కథను నమ్మడం వల్ల, ఈ వ్యక్తి యువరాజు లేదా యువరాణి కాబోతున్నాడని మనం అనుకుంటాము, మరియు అలా జరగనప్పుడు మనం వారిపై కోపం తెచ్చుకుంటాము మరియు కొన్నిసార్లు మనం వాళ్ళను తిరస్కరిస్తాము. ఆ తర్వాత మనం కలుసుకునే తర్వాతి సంభావ్య భాగస్వామికి అతను లేదా ఆమె యువరాజు లేదా యువరాణి అని ఊహించుకుంటాము. కానీ మనం ఎప్పుడూ యువరాజు లేదా యువరాణిని కనిపెట్టలేము, ఎందుకంటే అలాంటిది అసలు ఏమీ లేదు. 

కాబట్టి, మనం ఆరోగ్యకరమైన సంబంధాలను కలిగి ఉండాలనుకుంటే, రియాలిటీను అంగీకరించాలి. ఆ రియాలిటీ ఏమిటంటే, నేను చెప్పినట్లుగా, ప్రతి ఒక్కరికీ మంచి విషయాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికీ బలహీనమైన విషయాలు ఉన్నాయి, మరియు మనం ఏదో ఒక విధంగా అందరితో కలిసి జీవించడం నేర్చుకోవాలి మరియు ఎవరూ విశ్వానికి సెంటర్ కాదు. అప్పుడు ఏ మతంలోనైనా, ఏ మానవతా తత్త్వంలోనైనా మీకు కనిపించే సాధారణ బోధనలు దయ, శ్రద్ధ, ప్రేమ మొదలైనవి, సహనం, ఉదారత, క్షమించడం కూడా ఇందులో ఉంటాయి. ప్రతి మతం మరియు ప్రతి మానవతా తత్వశాస్త్రం వీటినే బోధిస్తాయి, అలాగే బౌద్ధమతం కూడా.

పనిలో మన సంబంధాలకు ఈ సూత్రాలే అప్లై అవుతాయి. ఆఫీసులో మీతో కలిసి పనిచేసే వ్యక్తుల పట్ల మీరు దయగా ఉంటే (లేదా మీరు ఇతరులను నియమించుకుంటే, మీరు మీ ఉద్యోగుల పట్ల దయతో ఉంటారు), వ్యాపారం అంతా బాగా సాఫీగా సాగుతుంది. మీరు స్టోరులో పనిచేస్తుంటే మరియు మీరు కస్టమర్ లతో దయతో మరియు మంచితనంతో ఉంటే, పూర్తి వాతావరణం బాగా ఆహ్లాదకరంగా ఉంటుంది, కదా? ఒకరి వ్యవహారాలలో నిజాయితీగా ఉంటే - ఇతరులను మోసం చెయ్యకుండా ఉంటే - అన్ని పనులు చాలా బాగా జరుగుతాయి. దీని అర్థం మనం లాభం పొందడానికి మరియు జీవించడానికి ప్రయత్నించడం లేదని కాదు, కానీ దాని గురించి అత్యాశ పడకూడదు అని అర్ధం.

ఇతరులు మనల్ని మోసం చేసినప్పుడు బౌద్ధమత ఆలోచనా విధానం నుంచి చూస్తే, వీళ్ళు చెడ్డ వ్యక్తులు అని మనం చెప్పలేము; వాళ్ళు అయోమయంలో ఉన్నారని మనం చెప్తాము. వాళ్ళు అయోమయానికి గురవుతున్నారు. ఈ విధంగా వ్యవహరించడం వల్ల తమకు ఇంకా సమస్యలు వస్తాయని వాళ్ళు అర్థం చేసుకోరు: వాళ్ళను ఎవరూ ఇష్టపడరు. అందువల్ల, వాళ్ళు ద్వేషానికి సంబంధించకుండా కరుణకు సంబంధించిన వాళ్ళగా ఉంటారు. మనం వారిని కరుణకు సంబంధించిన వాళ్ళుగా భావించి, వాళ్ళతో సహనాన్ని కలిగి ఉంటే, వాళ్ళు మనల్ని మోసం చేసినప్పుడు మనం మానసికంగా బాధపడము, ఆ తర్వాత మనం మళ్ళీ మోసపోకుండా ఉండటానికి మిగతా వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నిస్తాము. కానీ ప్రజల నుంచి మీరు ఏమి ఆశిస్తున్నారు? ఇప్పుడు చాలా మంది అలానే ఉంటారు. అదే రియాలిటీ. అందరూ నిజాయితీపరులే అన్నది అంచనా. అందరూ నిజాయితీపరులు కాదు! అందరూ నిజాయితీగా ఉంటే బాగుంటుంది కానీ అందరూ అలా ఉండరు. మనం అయినా నిజాయితీగా ఉండటానికి ప్రయత్నించాలి. 

బౌద్ధేతరులు ఈ పద్ధతులను ఉపయోగించవచ్చా?

ఇప్పుడు, ఈ పద్ధతులను అప్లై చెయ్యడానికి ధ్యానం మరియు ఆచారాలు లాంటి  కఠినమైన బౌద్ధమత ఆధ్యాత్మిక మార్గాలను అనుసరించాలా? అలా ఏమీ కాదు. వీటన్నిటినీ అప్లై చెయ్యడానికి మనం కఠినమైన, ప్రామాణికమైన ఆధ్యాత్మిక మార్గాలను అనుసరించాల్సిన అవసరం లేదు. దలైలామా గారు ఎప్పుడూ లౌకిక నైతికత మరియు మానవ విలువల గురించి మాట్లాడతారు - దయగా ఉండటం, అన్నీ తెలుసుకుని ఉండటం, అమాయకంగా ఉండకపోవడం, ఊహలను ప్రొజెక్ట్ చెయ్యకపోవడం మొదలైనవి. ఇవి ఎవరైనా పాటించగల సాధారణ మార్గదర్శకాలు.

మనం ధ్యానం గురించి మాట్లాడేటప్పుడు, కూర్చొని అలా ఆలోచించడానికి ప్రయత్నించి మన దృష్టి తిరిగి తెచ్చుకుని దాన్ని పరిచయం చేసుకోవడానికి ఒక పద్ధతి గురించి మాట్లాడుతున్నాము. సరే, మీరు ధ్యానంలో కూర్చొని బుద్ధుడు లేదా మీ శ్వాసపై దృష్టి పెట్టేటప్పుడు అలా చెయ్యవచ్చు, కానీ మీరు ఒక పుస్తకం చదువుతున్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు లేదా ఇంకేదైనా చేస్తున్నప్పుడు కూడా మీరు అలా చెయ్యవచ్చు. మీరు వంట చేసేటప్పుడు, వంటపై దృష్టి పెట్టండి, మరియు మీ మనస్సులో ఏవైనా పిచ్చి ఆలోచనలు వచ్చినప్పుడు, దాన్ని తిరిగి వంటలోకి తీసుకురండి. ఇది అధికారిక బౌద్ధమత ధ్యాన అభ్యాసం కానవసరం లేదు. ఏ బౌద్ధమత ఆచారం లేదా అధికారిక బౌద్ధమత నేపథ్యాన్ని కలిగి ఉండవలసిన అవసరం లేకుండా, ఈ ప్రయోజనకరమైన ఆలోచనా విధానాలతో మనల్ని మనం పరిచయం చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి.

కాబట్టి, సమస్యలను నివారించడంలో సహాయపడటానికి మనం ధర్మాన్ని - నివారణ చర్యలను - ఉపయోగించే విధానం ఇదే. మీకు ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?

ప్రశ్నలు

లోపల మరియు బయట ఏమి జరుగుతుందో తెలుసుకోవడం

సమస్యలను నివారించడానికి, మనం ఎప్పుడూ ఏకాగ్రతను కలిగి ఉండాలా?

ఒక రకంగా చెప్పాలంటే, అవును. కానీ అదే మొత్తం కాదు. ఉదాహరణకు, మనం ఎవరినైనా అరవడం మరియు కొట్టడంపై చాలా దృష్టి పెట్టవచ్చు, కాబట్టి అది పూర్తి విషయం కాదు. లోపల ఏమి జరుగుతుందో మనం తెలుసుకోవాలి - మన ఆలోచనలు, మన ఫీలింగ్స్ మొదలైనవి - అదే సమయంలో మన చుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకుని అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా ఇంటికి మన కుటుంబ సభ్యుడు, లేదా ప్రియమైన వ్యక్తి లేదా ఇంకెవరైనా వచ్చినప్పుడు వాళ్ళు చాలా అలసిపోయినట్లు మీకు కనిపిస్తారు. ఆ విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాలి. ఒక ముఖ్యమైన విషయం గురించి వాళ్లతో మాట్లాడటానికి ఇది సమయం కాదు - వాళ్ళు అలసిపోయారు. కాబట్టి, మీరు ఎప్పుడూ అప్రమత్తంగా, ఏకాగ్రతతో, మీ చుట్టూ ఏమి జరుగుతుందో దానిపై దృష్టి పెట్టాలని అనుకుంటారు. నా పరిస్థితి కాకుండా ఇతరుల పరిస్థితి ఏమిటి? అని ఆలోచిస్తారు.

మన గురించి మాత్రమే తెలుసుకోవడం, ఇతరుల గురించి తెలుసుకోకపోవడం అనే స్థాయికి మనం వెళ్లము. లేదా ఇంకొక తీవ్ర స్థాయికి వెళ్తే అది మనపై కాకుండా ఇతరులపై మాత్రమే దృష్టి పెడుతుంది. అది కూడా నివారించాల్సిన ఒక తీవ్ర స్థాయి. చాలా మందికి "నో" అని చెప్పలేని సిండ్రోమ్ ఉంటుంది, కాబట్టి వాళ్ళు ఎప్పుడూ ఇతరుల కోసం, వారి కుటుంబం కోసం లేదా ఇంకెవరి కోసమో పనులు చేస్తారు, మరియు బాగా అలసిపోతారు, అన్నిటినీ ఆపేసి కోపగించుకుంటారు. మనం ఎలా భావిస్తున్నామో కూడా శ్రద్ధ వహించడం మరియు మన స్వంత అవసరాలను కూడా చూసుకోవడం చాలా ముఖ్యం. విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చినప్పుడు, మనం విశ్రాంతి తీసుకుంటాం. మనం ఏదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు, "కాదు, నన్ను క్షమించండి; నేను ఇది చెయ్యలేను. ఇది మరీ ఎక్కువ పని. నేను చెయ్యలేను" అని చెప్పాల్సి వచ్చినప్పుడు "కాదు" అని చెప్పాలి. ఆదర్శవంతంగా మనం "కాదు" అని చెప్పినప్పుడు, వాళ్ళకు వేరే ఏదొక సహాయం చెయ్యాలి. మీరు కొన్ని సూచనలు ఇస్తారు: "వేరే వ్యక్తి మీకు సహాయం చెయ్యగలడు" అని.

సంక్షిప్తంగా చెప్పాలంటే, బయట మరియు లోపల జరుగుతున్న ప్రతి దాన్ని తెలుసుకుని, ఆ తర్వాత సరైన అవగాహన, ప్రేమ మరియు కరుణను అప్లై చెయ్యాలి.

కోపంతో వ్యవహరించడం

కోపం లేదా ఇతర విధ్వంసక భావోద్వేగాలతో వ్యవహరించే పద్ధతి గురించి మీరు మాట్లాడారు, కాని బౌద్ధమతం చాలా లోతైన పద్ధతులను కలిగి ఉందని మీరు చూపారు. వీటిని ఎక్కడ వెతకాలో కనీసం ఒక హింట్ ను అయినా ఇవ్వగలరా?

కొంచెం లోతుగా ఆలోచిస్తే, మనం ఒకరిపై కోపంగా ఉన్నప్పుడు కోపాన్ని ఎదుర్కోవటానికి మనం సహనాన్ని పెంపొందించుకోవడం లాంటిది ఇది. ఇప్పుడు, మనం ఆ సహనాన్ని ఎలా పెంపొందించుకోవాలి? దానికి అనేక పద్ధతులు ఉన్నాయి, కానీ ఒక పద్ధతిని, ఉదాహరణకు, "లక్ష్యం లాంటి సహనం" అని ఒకటి ఉంటుంది: "లక్ష్యాన్ని పెట్టుకోకపోతే, ఎవరూ దాన్ని ఛేదించలేరు" అని. ఉదాహరణకు, నా కోసం ఏదైనా చెయ్యమని నేను మిమ్మల్ని అడుగుతాను, మరియు మీరు దాన్ని సరిగ్గా చెయ్యరు. అప్పుడు మీ మీద నాకు కోపం వస్తుంది. లేదా అస్సలు మీరు ఆ పనిని చెయ్యలేరు. అయితే, ఇది ఎవరి తప్పు? ఇది నా తప్పు ఎందుకంటే నేనే చాలా సోమరిపోతుగా ఉన్నాను మరియు నేను మిమ్మల్ని చెయ్యమని అడిగాను. కాబట్టి, నేను ఇంకేమి ఆశించగలను? నువ్వు ఎవరినైనా ఏదైనా చెయ్యమని అడిగినప్పుడు, నువ్వు ఏమి ఆశిస్తావు? మీరు ఒక రెండు సంవత్సరాల చిన్నారిని ఒక కప్పు టీ తీసుకురమ్మని అడిగారని అనుకోండి మరియు ఆ చిన్నారి దాన్ని పడేసింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు. కాబట్టి, మన కోసం ఏదైనా చెయ్యమని ఎవరినైనా అడిగినప్పుడు మనం ఏమి ఆశిస్తాము? అనే దాని గురించి ఆలోచించాలి.

కాబట్టి, నా సోమరితనమే ఆ సమస్యకు కారణమని నేను గ్రహించాను. మీకు అవతలి వ్యక్తి మీద కోపం రాదు. నా కోసం ఏదైనా చెయ్యమని నేను మిమ్మల్ని అడిగినప్పుడు, దాన్ని నేనే స్వయంగా చెయ్యడానికి చాలా సోమరిపోతుగా ఉన్నాను - చాలా సోమరితనంతో లేదా నాకు సమయం లేకుండా ఉండడం వల్ల, కారణం ఏదైనా కానీ. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే, నేను వేరొకరిని ఆ పని చెయ్యమని అడుగుతుంటే, వారు దాన్ని సరిగ్గా చేస్తారని నేను ఆశించకూడదు - లేదా నేను ఆ పని చేసే విధానం కూడా చివరికి సరైనది కాకపోవచ్చు. నేను కూడా తప్పులు చేస్తాను. నేను స్వయంగా తప్పు చేస్తే, నాపై నేను కోపగించుకోడానికి ఏ కారణం ఉండదు. "నేను సరైన వాడిని కాదు - ఎవరూ సరైన వాళ్ళు కాదు - కాబట్టి నేను తప్పులు చేస్తాను." కాబట్టి, మీరు రియాలిటీని అంగీకరిస్తారు. "నేను ఒక మనిషిని. మనుషులు తప్పులు చేస్తారు: నేను తప్పులు చేశాను." నేను దాన్ని సరిదిద్దుకోగలిగితే, మంచిది. నా మీద నాకు కోపం రాదు. నా మీద కోపం తెచ్చుకోవడంలో ఏ అర్థం లేదు. నాకు వీలైతే దాన్ని సరిదిద్దుకుంటాను. అలా చెయ్యలేకపోతే, వదిలేస్తాను – అలాంటి పరిస్థితుల్లో మీరు కూడా దాన్ని వదిలేసి మళ్ళీ భవిష్యత్తులో అలాంటి తప్పు  రిపీట్ చెయ్యకుండా ఉండటానికి ప్రయత్నించండి.

కోపాన్ని ఎదుర్కోవడంలో బాగా లోతైన స్థాయి మన రియాలిటీను అర్థం చేసుకోవడం. ఇప్పుడు నేను చాలా సరళమైన స్థాయిలో మాట్లాడుతున్నాను. "నేను విశ్వానికి కేంద్రం కాదు. నేను ఎప్పుడూ నా మార్గాన్ని ఎందుకు కలిగి ఉండాలి? ఎందుకు? నేనెప్పుడూ నా దారిలోనే ఉండాలి, ఇంకెవరికీ వాళ్ళ దారి ఉండకూడదు అనే దానిలో ఉండే ప్రత్యేకత ఏమిటి?" ఇటువంటి ఆలోచనలతో, విశ్వంలో "నేను" అనే అత్యంత ముఖ్యమైన విషయాన్ని ఈ దృఢమైన ఆలోచనతో మీరు పునర్నిర్మించడం ప్రారంభిస్తారు. దృఢమైన "నేను" అని. అప్పుడు మీరు ఇంకా ఎక్కువగా పునర్నిర్మించవచ్చు. ఇక్కడ "నేను" అనే ఇంత దృఢమైనది అని, నేను ఎప్పుడూ నా మార్గాన్ని కలిగి ఉండాలని మీకు అనిపించినప్పుడు, మీకు ఆ మార్గం దొరక్కపోతే మీకు కోపం వస్తుంది, కదా?

మనం ఎలా ఉన్నామో, ప్రతి ఒక్కరూ ఎలా ఉన్నారో బౌద్ధమతం చాలా చెబుతుంది. మనం ఈ ఉనికిలో ఉన్నాం, కానీ మనం ఊహించుకునే ఈ అసాధ్యమైన మార్గాల్లో మనం లేము, ఉదాహరణకు ఒక చిన్న "నేను" అనేది నా తలలో ఉండి మాట్లాడుతున్నట్లుగా మరియు అదే నా తలలో ఆ గొంతుకి రచయిత. లోపల ఒక చిన్న "నేను" మాట్లాడుతున్నట్టు ఉంటుంది, "ఇప్పుడేం చెయ్యాలి? ఓహ్, నేను అది చేస్తాను" అని చెప్పి, మీ శరీరాన్ని ఒక యంత్రంలా కదిలిస్తారు. కానీ అది ఒక భ్రమ. మనలో ఒక చిన్న "నేను" ని మీరు కనిపెట్టలేరు, కదా? అయినప్పటికీ, నేను ఉన్నాను - నేను మాట్లాడతాను; నేను పనులు చేస్తాను. కాబట్టి, ఈ అంచనాలపై మన నమ్మకాన్ని వదులుకోవాలి, ఎందుకంటే అది రియాలిటీకి అనుగుణంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఒక గొంతు వినిపిస్తుంది, కాబట్టి లోపల ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది.

కాబట్టి, "మనస్తత్వశాస్త్రం" అని పిలువబడే ఈ పూర్తి విషయంలో బౌద్ధమతం చాలా విషయాలను అందిస్తుంది.

మన శరీరాలతో పని చెయ్యడం

నా దగ్గర రెండు ప్రశ్నలు ఉన్నాయి. మొదటి ప్రశ్న: శరీరంతో పని చెయ్యడం గురించి కొంచెం వివరించగలరా. మన శరీరాన్ని రిలాక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉందని మీరు చెప్పారు, కానీ మనం ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. రెండవ ప్రశ్న: ఈ అంచనాలన్నింటికీ మూలం ఏమిటి? ఉదాహరణకు, ఈ వ్యక్తి మన తలల లోపల మాట్లాడుతున్నాడు అలా ఎందుకు జరుగుతుంది?

శారీరక ఆరోగ్యం కోసం మనం అప్లై చేసుకునే అనేక విభాగాలు ఉన్నాయి. ఉదాహరణకు, టిబెటన్ సంప్రదాయంలో మీరు కనిపెట్టిన బౌద్ధ వైద్యం ఉంది, ఇది శరీరంలోని శక్తులను బ్యాలెన్స్ చెయ్యడంలో బాగా సహాయపడుతుంది. సాధారణంగా మన శక్తి మరియు మన ఆరోగ్యం, మన ఆహారం మరియు మన ప్రవర్తన ద్వారా చాలా ప్రభావితమవుతాయి - చలిలో బయటకు వెళ్ళడం మరియు మీరు సరైన వెచ్చని దుస్తులు ధరించకపోవడం లాంటివి, దీని వల్ల మీరు అనారోగ్యానికి గురవుతారు. అలాంటి ప్రవర్తన గురించే మనం మాట్లాడుతున్నాము. లేదా ఎక్కువగా పని చెయ్యడం లాంటి ప్రవర్తన కూడా మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది.

అలాగే మన శరీర స్థితిపై అవగాహన పెంచుకోవడానికి మనం ప్రయత్నిస్తాం. మీరు లోలోపల ఎంత నిశ్శబ్దంగా ఉంటే,  మీ మనస్సు యొక్క స్థితి గురించి మాత్రమే కాకుండా మీ శరీరంలోని శక్తి స్థితి గురించి కూడా అంతే అప్రమత్తంగా ఉంటారు. మీ శక్తి చాలా తక్కువగా ఉందని మీరు గమనించినప్పుడు, ఉదాహరణకు - మీ పల్స్ చాలా వేగంగా ఉండటం మరియు మిగతా వాటిని మీరు అనుభూతి చెందుతారు - మీరు చెయ్యగలిగే చాలా బేసిక్ పనులు ఉన్నాయి, మీ డైట్ ని సరిదిద్దుకోవడం కూడా. ఉదాహరణకు, మనం కాఫీ మరియు స్ట్రాంగ్ టీ తాగడం మానెయ్యవచ్చు మరియు కొవ్వు ఉండే ఆహారం - జున్ను లేదా అటువంటి మన శక్తిని తూకం వేసే బరువైన ఆహారాన్ని తీసుకోవచ్చు. మరియు వెచ్చగా ఉండవచ్చు; గాలిలో లేదా అది ఉన్న చోట ఉండకూడదు. అది మీ ఎనర్జీని ఇంకా దెబ్బతీస్తుంది. ఒక ప్రశాంతమైన స్థితిలో ఉండండి. కాబట్టి, అక్కడ ఆ స్థాయి ప్రాక్టీస్ ఉంటుంది.

టిబెటన్ సాంప్రదాయం శారీరక వ్యాయామాలకు లేదా శరీరంలోని అలాంటి పనులకు ప్రాధాన్యతను ఇవ్వదు, ఉదాహరణకు, చైనీస్ లేదా జపనీస్ బౌద్ధమత సంప్రదాయాలలో ఉండే మార్షల్ ఆర్ట్స్. కానీ ఖచ్చితంగా, వివిధ రకాల మార్షల్ ఆర్ట్స్ - తైజీ, క్విగాంగ్, ఈ రకమైనవి - చాలా సహాయపడతాయి. మీ కదలికను గుర్తుంచుకోవడం ద్వారా ఏకాగ్రతను పెంపొందించే పద్ధతులు కూడా ఇవే. టిబెటన్లు చేసే శారీరక వ్యాయామాలు చాలా సూక్ష్మమైనవి, శక్తి వ్యవస్థలతో వేరుగా పని చెయ్యడంతో సంబంధాన్ని కలిగి ఉంటాయి, మార్షల్ ఆర్ట్స్ పద్ధతిలో కాకుండా. ఇది కొంచెం వేరేగా ఉంటుంది, యోగా లాగా ఉంటుంది. కాబట్టి మీరు శరీరంతో అలానే పనిచేస్తారు.

మన తలలోని గొంతుకి అసలైన కారణం

మన తలలోని గొంతుకి అసలైన కారణం విషయానికొస్తే, ఇది మనస్సు యొక్క స్వభావాన్ని కలిగి ఉంటుంది మరియు కొంచెం కష్టంగా మారుతుంది. బౌద్ధమతంలో మనసు గురించి మాట్లాడేటప్పుడు ఏదో ఒక విషయం గురించి మాట్లాడటం లేదు. మనం మానసిక కార్యాచరణ గురించి మాట్లాడుతున్నాము, మరియు ఆ మానసిక కార్యాచరణ ఆలోచన మనం చూడటం, భావోద్వేగాలను అనుభవించడంతో ముడిపడి ఉంటుంది. ఇది చాలా పెద్దది. ఆ యాక్టివిటీలో ఏం జరుగుతుందంటే ఏదో ఒక రకమైన మెంటల్ హోలోగ్రామ్ పుట్టుకొస్తుంది. ఉదాహరణకు, మనం ఏదైనా చూసినప్పుడు, దాని కాంతి రెటీనాను తాకుతుంది, అప్పుడు న్యూరాన్లలో విద్యుత్ ప్రేరణలు మరియు రసాయన ప్రతి చర్యలను ప్రేరేపిస్తుంది మరియు దాని ఫలితంగా అది ఎలా కనిపిస్తుందని దాని గురించి ఒక రకమైన మానసిక హోలోగ్రామ్ ఏర్పడుతుంది. కానీ అది ఒక మెంటల్ హోలోగ్రామ్. ఇది ఈ కెమికల్స్ మరియు విద్యుత్ ప్రేరణల నుంచి వస్తుంది.

కానీ హోలోగ్రామ్లు కేవలం చూసే విధంగా మాత్రమే ఉండవు. ఈ మానసిక హోలోగ్రామ్లు పదాల లాగా శబ్దాలు కూడా అవ్వవచ్చు. ఒక్క క్షణంలో పూర్తి వాక్యాన్ని మనం వినలేము - మీరు దాని యొక్క చిన్న చిన్న పదాలను, ఒక్కొక్క క్షణంలో వింటారు - అయినప్పటికీ పూర్తి వాక్యం యొక్క ఈ మానసిక హోలోగ్రామ్ ఉంటుంది మరియు దాని అర్థం ఏమిటో మీరు తెలుసుకుంటారు. అదే విధంగా, భావోద్వేగాల రూపంలో, ఆలోచనల రూపంలో మరియు మౌఖిక రూపంలో మానసిక హోలోగ్రామ్లు కూడా ఉన్నాయి – అదే ఈ గొంతు. ఈ విషయాలు వాటికవే వస్తాయి. ఇందులో కొంత అవగాహన ఉంటుంది. కాబట్టి చూడటం, ఆలోచించడం లేదా అనుభూతి చెందడం అంటే అదే. ఆ మానసిక కార్యాచరణ దానికి భిన్నమైన ఒక "నేను" అనేది లేకుండా సాగిపోతుంది, అతను దాన్ని చూస్తున్నాడు లేదా దాన్ని నియంత్రిస్తాడు మరియు అది జరిగేలా చేస్తున్నాడు అన్నట్టుగా. ఇది ఇలానే జరుగుతుంది. కాబట్టి, ఆ మానసిక హోలోగ్రామ్ లో ఒక భాగం "నేను" - "ఆ గొంతు నేనే" అని ఉంటుంది. దీన్ని ఎవరు ఆలోచిస్తున్నారు? నేనే ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తున్నది మీరు కాదు - నేనే ఆలోచిస్తున్నాను. కానీ ఇది ఈ హోలోగ్రామ్ ల పూర్తి ప్రక్రియలో ఒక భాగం మాత్రమే.

మన తలలో ఈ గొంతుకి మూలం ఏమిటి? ఇది మానసిక కార్యాచరణ యొక్క లక్షణాలలో ఒకటి. అన్ని మానసిక పనులు ఎలా పనిచేస్తాయనేది ముఖ్యం కాదు. ఆ గొంతు ఎప్పుడూ వినిపిస్తూ ఉండదు, వానపాము గొంతుతో ఆలోచిస్తోందా లేదా అని నాకు అనుమానం. వానపాముకు ఖచ్చితంగా మెదడు ఉంటుంది, మనస్సు ఉంటుంది, విషయాలు చూస్తుంది, మరియు పనులు చేస్తుంది.

మనం దాని గురించి ఆలోచిస్తే ఇది చాలా ఆసక్తికరంగా మారుతుంది. గొంతు యొక్క ధ్వని యొక్క హోలోగ్రామ్ అనేది కమ్యూనికేషన్ యొక్క ఒక రూపం, కదా? ఇది ఒక రకమైన భావన, ఇది ఒక ఆలోచనను పదాల మానసిక ధ్వని రూపంలో వ్యక్తపరుస్తుంది లేదా కమ్యూనికేట్ చేస్తుంది. ఇక్కడ ఆసక్తికరమైన ప్రశ్న ఏమిటంటే: పుట్టుకతోనే చెవిటి మరియు మూగ మరియు ధ్వని భావన పూర్తిగా లేని ఎవరైనా - వారి తలలో గొంతు ఉంటుందా, లేదా వారు సైన్ లాంగ్వేజ్ లో ఆలోచిస్తున్నారా? అని. దానికి నేనెప్పుడూ సమాధానం కనిపెట్టలేదు.

కాబట్టి అది వాయిస్ అయినా, అది సైన్ లాంగ్వేజ్ అయినా, ఏదైనా కానీ - లేదా పురుగు ఎలా ఆలోచిస్తుందో - దాని వెనుక ఒక ప్రత్యేకమైన "నేను" ఉందని, అది మాట్లాడుతుందని, కంట్రోల్ బోర్డు దగ్గర కూర్చొని, కళ్ళ నుంచి సమాచారం స్క్రీన్ పై వస్తోందని, దానికి ఈ మైక్రోఫోన్ ఉందని, దానితో మాట్లాడుతుందని, ఆ తర్వాత చేతులు మరియు కాళ్ళు కదిలేలా బటన్ నొక్కుతుందని అనిపిస్తుంది. ఇది పూర్తిగా ఒక భ్రమ మాత్రమే. కానీ కంట్రోల్ బోర్డు దగ్గర కూర్చున్న ఆ "నేను" రకం "అయ్యో, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు?" మరియు "నేను ఇప్పుడు ఏమి చేయాలి?" అనే దాని ప్రతిబింబం. కంట్రోల్ బోర్డు దగ్గర ఉన్న ఈ "నేను" గురించి మనం ఆందోళన చెందుతున్నాము.

ఈ "నేను" అనేది ఒక భ్రమ అని మనం గ్రహించినప్పుడు, ఏ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మనం మాట్లాడుతాం, పనిచేస్తాం. నిజమే, అది నేనే: నేను మాట్లాడుతున్నాను, నేను పని చేస్తున్నాను. జనాలకు అది నచ్చకపోతే, సరే. అయితే ఏమిటి? బుద్ధుడే అందరినీ మెప్పించలేకపోయాడు. బుద్ధుడిని అందరూ ఇష్టపడలేదు, కాబట్టి నేను ఏమి ఆశించగలను? మనం అవగాహన, ప్రేమ మరియు కరుణను ఉపయోగించుకుని దాని నుంచి ప్రవర్తిస్తాము. అంతే. "వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు?" అని ఆలోచించి బాధపడకండి. అది మనం అనుకున్నంత సులువు కాదు.

ఇతరులు కోపంగా ఉన్నప్పుడు మనల్ని మనం నియంత్రించుకోవడం

ఎదుటి వ్యక్తి మనపై కోపంతో ఉన్నప్పుడు, మనల్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి?

వాళ్ళు చిన్న పిల్లల్లా ఉంటారని మనం చూస్తుంటాం. "పడుకునే సమయం ఇది" అని మనం చెప్పినప్పుడు రెండేళ్ల వయసు ఉన్న పిల్లవాడు మనపై కోప్పడి "నాకు నువ్వంటే ఇష్టం లేదు. నువ్వు మంచి వాడివి కాదు" అని చెప్పి పెద్దగా అల్లరి చేస్తే మనకు కోపం వస్తుందా? సరే, కొంత మందికి కోపం వస్తుంది; కానీ అక్కడ ఉంది కేవలం రెండు సంవత్సరాల పిల్లవాడు మాత్రమే, మీరు ఇంకేమి ఆశిస్తున్నారు? మీరు ఆ పిల్లవాడిని శాంతపరచడానికి ప్రయత్నిస్తారు. ఆ రెండేళ్ల పిల్లవాడితో ఎలా సౌమ్యంగా ఉండాలో అలా ఉండండి. దీన్ని ఆలోచించండి: అలాంటి రెండేళ్ల పిల్లాడితో మీరు ఎలా వ్యవహరిస్తారు? సాధారణంగా రెండేళ్ల వయసు ఉన్న పిల్లలు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నప్పుడు వారిని ఎత్తుకుని ఆప్యాయంగా చూసుకుంటే వాళ్ళు ప్రశాంతంగా అవుతారు, కదా? వాళ్ళను తిడితే వాళ్ళు ఇంకా ఏడుస్తారు. కాబట్టి, ప్రజలు కూడా అలాగే ఉంటారు - పెద్ద పిల్లల లాగా.

Top