ఆధ్యాత్మిక గురువుతో సంబంధాన్ని ప్రభావితం చేసే విషయాలు

పరిచయ సూచనలు

బౌద్ధమత సంప్రదాయాలు అన్ని ఈ మార్గంలో ఆధ్యాత్మిక గురువు యొక్క ప్రాముఖ్యతను చాలా ముఖ్యమైనదిగా చెప్తాయి. ఆధ్యాత్మిక గురువులు ఈ క్రింది వాటిని పాటించడం మాత్రమే కాదు:

  • సమాచారాన్ని అందించడం
  • ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం
  • విద్యార్థికి అర్ధం అయ్యిందో లేదో అని చెక్ చెయ్యడం
  • విద్యార్థి యొక్క మేధాశక్తి, భావోద్వేగ మరియు ధ్యాన వికాసాన్ని చెక్ చెయ్యడం.

వీటిని కూడా పాటించాలి:

  • ప్రతిజ్ఞలు మరియు అధికారాన్ని ఇవ్వడం
  • రోల్ మోడల్స్ గా ఉండడం
  • వాళ్ళ వ్యక్తిగత ఉదాహరణల నుంచి ప్రేరణను అందించండి
  • బుద్ధుని కాలం నాటి సంప్రదాయానికి లింకులుగా పని చెయ్యడం.

ఉపాధ్యాయులు మరియు విద్యార్థులలో అనేక విభిన్న స్థాయిలు ఉన్నాయి, అందువల్ల ఈ మార్గంలో సంబంధాన్ని కలిగి ఉండటానికి వేర్వేరు మార్గాలు ఉన్నాయి.

సాంస్కృతిక నేపథ్యం

ఆధ్యాత్మిక గురువుతో కలిసి చదువుకోవడానికి ఆధునిక పాశ్చాత్య సందర్భం అనేది సాంప్రదాయ ఆసియా సందర్భానికి పూర్తి వేరుగా ఉంటుంది.

సాంప్రదాయ ఆసియాలో, ధర్మ విద్యార్థులలో ఎక్కువ మంది:

  • ఆధ్యాత్మిక మార్గం పట్ల పూర్తిగా నిబద్ధత కలిగిన సన్యాసులు లేదా సన్యాసినులు ఉంటారు
  • ధర్మాన్ని అధ్యయనం చెయ్యడం, ఆచరించడం తప్ప ఇంక ఏ ముఖ్యమైన పని ఉండదు
  • చదువులేని పిల్లలుగా బౌద్ధమత చదువును ప్రారంభించిన వాళ్ళు ఉన్నారు
  • అలాగే, యుక్త వయస్సుల వాళ్ళు, గణితం, సాంఘిక శాస్త్రం మరియు సైన్స్ లాంటి "సాధారణ" సబ్జెక్టులలో కనీస విద్యను పొందిన వాళ్ళు ఉన్నారు
  • మహిళల పాత్రకు సంబంధించి సాంప్రదాయ ఆసియా సమాజాల విలువలను మరియు అధికార నిర్మాణాల ఆలోచనా విధానాలను అంగీకరించిన వారు - స్త్రీలు తక్కువ మరియు శ్రేణులు ప్రామాణికం అని.

ఆధునిక పాశ్చాత్య సందర్భంలో, ఎక్కువ మంది విద్యార్థులు:

  • వృత్తి పరమైన మరియు వ్యక్తిగత జీవితాలతో బిజీగా ఉన్న సాధారణ వ్యక్తులు.
  • ధర్మానికి కొంచెం సమయమే కేటాయించగలిగే వాళ్ళు
  • విద్యావంతులైన పెద్ద వాళ్ళు ధర్మాన్ని అధ్యయనం చెయ్యడం ప్రారంభించిన వాళ్ళు
  • లింగ సమానత్వం, ప్రజాస్వామిక సామాజిక నిర్మాణాన్ని డిమాండ్ చేస్తున్న వాళ్ళు.

ఆర్థిక పరంగా, సాంప్రదాయ ఆసియా ఆధ్యాత్మిక గురువులకు సామాజిక సహాయాన్ని అందిస్తుంది. తమ విద్యార్థులు కాని వాళ్ళు కూడా వారికి నైవేద్యాలను సమర్పిస్తారు. ఆధునిక పాశ్చాత్య సందర్భంలో, ఆధ్యాత్మిక గురువులు వాళ్ళను వాళ్ళే పట్టించుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక, సంస్థాగత, పరిపాలనాపరమైన సమస్యలతో చాలా మంది ధర్మ కేంద్రాలను నడుపుతున్నారు.

ఈ విషయాలన్నీ విద్యార్థికి మరియు ఉపాధ్యాయులకు మధ్య ఉన్న సంబంధాలను ప్రభావితం చేస్తాయి. ఎ౦తోమ౦ది ఆధ్యాత్మిక సాధకులు ప్రయోజనాలను పొ౦దారు, కానీ చాలా అపార్థాలు, అనేక పొరపాట్లు, ఆధ్యాత్మిక గాయాలు కూడా అయ్యాయి.

ప్రమాదాలు

టిబెట్ సంప్రదాయం విషయంలో ,"గురు భక్తి" విషయంపై ఉన్న గ్రంధాలతో ప్రమాదాలు ఇంకా తీవ్రమవుతాయి. అటువంటి గ్రంథాలను చదివే వారు నిబద్ధతతో ప్రతిజ్ఞ చేసిన సన్యాసులు మరియు సన్యాసినుల కోసం వాళ్ళ తాంత్రిక అధికారం కోసం తయారు చెయ్యబడిన ఒక రివ్యూ అవసరం. బౌద్ధమతం గురించి ఏమీ తెలియని ప్రారంభకులకు ధర్మ కేంద్రంలోని ఈ సూచనలు ఉద్దేశించబడలేదు.

ఇక్కడ మనం రెండు ఎక్స్ట్రీమ్ లను అవాయిడ్ చెయ్యాలి:

  1. ఆధ్యాత్మిక గురువులను తొలగించి, అమాయకత్వానికి, దూషకులకు అనుమతి ఇవ్వడం.
  2. వాళ్ళను రాక్షసులుగా చిత్రీకరించడం, మానసిక అపవ్యవస్థ కోసం తలుపులు తెరిచి మరియు నిజమైన ప్రేరణ మరియు లోతైన ప్రయోజనాన్ని పొందడానికి తలుపులు మూసివేయడం.

సంప్రదాయేతర విశ్లేషణాత్మక పద్ధతి

ఈ సమస్యను నేను అనలైజ్ చేసాను మరియు ఆధ్యాత్మిక గురువుతో ఉండాల్సిన సంబంధాన్ని ఆరోగ్యంగా మార్చే మార్గాలను సూచించాను: ఒక ఆరోగ్యకరమైన సంబంధాన్ని నిర్మించుకోవడం (ఇథాకా: స్నో లయన్, 2000). ఇక్కడ, కుటుంబ మరియు సందర్భోచిత చికిత్స యొక్క వ్యవస్థాపకులలో ఒకరైన హంగేరియన్ మానసిక వైద్యుడు డాక్టర్. ఇవాన్ బోస్జోర్మెని-నాగి యొక్క పని నుంచి సూచించబడిన మరియు విస్తరించిన సమస్యను అనలైజ్ చెయ్యడానికి ఒక అదనపు సంప్రదాయేతర పద్ధతిని నేను చెప్పాలని అనుకుంటున్నాను.

ఒక సంబంధం యొక్క ఆరు కోణాలు

విద్యార్థి మరియు ఉపాధ్యాయుడి వైపుల నుంచి ఒక సంబంధాన్ని ఆరు అంశాలు లేదా కోణాల నుంచి విశ్లేషించవచ్చు. ఒక సంబంధంలో సమస్యలు ఉంటే, అవి ఎక్కడ ఉన్నాయో గుర్తించడానికి ఇది సహాయపడుతుంది, అలా ప్రతి ఒక్కరు ఆరోగ్యకరమైన బ్యాలెన్స్ ను పొందడానికి ఎడ్జెస్ట్ చేసుకోవడానికి మరియు అడాప్ట్ చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు.

ఆ ఆరు అంశాలు:

  1. ప్రతి ఒక్కరికి సంబంధించిన నిజాలు మరియు ఆ సంబంధం యొక్క సెట్టింగ్ కు సంబంధించిన విషయాలు
  2. ప్రతి ఒక్కరి సంబంధం యొక్క లక్ష్యం మరియు దాన్ని ప్రభావితం చేసే మానసిక అంశాలు
  3. సంబంధంలో ప్రతి ఒక్కరు తనని లేదా ఇంకొకరిని నిర్వచించే పాత్ర, అలా ప్రతి ఒక్కరికి ఉన్న అంచనాలు మరియు ప్రతి ఒక్కరూ అతని లేదా ఆమె గురించి ఎలా భావిస్తారు అని
  4. సంబంధం పట్ల ప్రతి ఒక్కరికి ఉన్న నిబద్ధత స్థాయి మరియు నిమగ్నత, మరియు దీన్ని ప్రభావితం చేసే మానసిక అంశాలు
  5. ప్రతి ఒక్కరికి ఉండే ఇతర మానసిక అంశాలు
  6. అసలు సంబంధం ఎలా పనిచేస్తుంది, మరియు ప్రతి ఒక్కరిపై దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేటటు వంటివి.

ప్రతి ఒక్కరికి సంబంధించిన నిజాలు మరియు ఆ సంబంధం యొక్క సెట్టింగ్ కు సంబంధించి విషయాలు

సంబంధాన్ని ప్రభావితం చేసే ప్రతి ఒక్కరి గురించి ఉన్న నిజాలు:

  • లింగం మరియు వయస్సు
  • మూల సంస్కృతి - ఆసియా లేదా పాశ్చాత్య
  • పంచుకున్న భాష లేదా అనువాదకుడి అవసరం ఉండటం - వ్యక్తిగత సంభాషణల కోసం మరియు/లేదా బోధనల కోసం
  • సన్యాసం లేదా లే(Lay)
  • ధర్మం మరియు ప్రాపంచిక విద్య
  • భావోద్వేగ మరియు నైతిక మెచ్యూరిటీ పరంగా ఆధ్యాత్మిక గురువు లేదా విద్యార్థి కావడానికి అర్హతలు
  • ప్రతి ఒక్కరు వేరొకరి కోసం ఇవ్వగలిగే సమయం
  • ఇతర విద్యార్థుల సంఖ్య
  • ఉపాధ్యాయుడు రెసిడెంట్ కావడం లేదా అప్పుడప్పుడు మాత్రమే సందర్శించడం.

సెట్టింగ్ దీనిలో ఉండవచ్చు:

  • ఒక పశ్చిమ ధర్మ కేంద్రం - ఒక నగర కేంద్రం లేదా నివాస కేంద్రం
  • ఒక ధర్మ కేంద్రం, స్వతంత్ర కేంద్రం లేదా అది ఒక పెద్ద ధర్మ సంస్థలో భాగమైతే
  • ఒక మఠం - ఆసియాలో లేదా పాశ్చాత్య దేశాలలో.

ప్రతి ఒక్కరి సంబంధం యొక్క లక్ష్యం మరియు దాన్ని ప్రభావితం చేసే మానసిక అంశాలు

ఏదైనా సంబంధంలో ఉన్న ఇద్దరికి, ఆ సంబంధం యొక్క లక్ష్యం దాదాపు ఎప్పుడూ కలిసిపోయే ఉంటుంది. విద్యార్థి-ఉపాధ్యాయ సంబంధాలు ఇందులో మినహాయింపేమీ కాదు.

విద్యార్థి ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గరకు ఈ క్రింది వాటి కోసం వెళ్లొచ్చు:

  • సమాచారాన్ని పొంది నిజాలను తెలుసుకోవడానికి 
  • ధ్యానం నేర్చుకోవడానికి 
  • అతడి లేదా ఆమె వ్యక్తిత్వాన్ని మార్చుకోవడానికి
  • జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి
  • భవిష్యత్తును మెరుగుపరుచుకోవడానికి
  • నియంత్రణలో లేని రిపీట్ అయ్యే పునర్జన్మ (సంసారం) నుంచి విముక్తి పొందడానికి
  • ఇతరులందరూ ఒకే విధమైన ముక్తి మరియు జ్ఞానోదయాన్ని పొందడంలో సహాయపడడం కోసం జ్ఞానోదయాన్ని పొందడానికి
  • విశ్రాంతి తీసుకోవడం నేర్చుకోవడానికి
  • ఒకే ఆలోచన ఉండే విద్యార్థులతో సామాజిక పరిచయాలను ఏర్పరచుకోవడానికి
  • ఎక్సోటికా యాక్సెస్ ను పొందడానికి
  • ఏదైనా శారీరక లేదా భావోద్వేగ సమస్యకు అద్భుత నివారణను కనిపెట్టడానికి 
  • "ధర్మ-జంకీ" లాంటి వినోదాత్మక ఆకర్షణీయ గురువు నుంచి "ధర్మ-పరిష్కారాన్ని" పొందడానికి.

ఇంకా, ఆ విద్యార్థి ఈ క్రింది వాటి కోసం కూడా ఉపాధ్యాయుడి దగ్గరకు వెళ్లొచ్చు:

  • బౌద్ధమత మార్గంలో గైడెన్స్ మరియు ప్రేరణ కోసం
  • చికిత్స కోసం
  • పశు పోషణ గైడెన్స్ కోసం
  • తల్లిదండ్రుల ప్రత్యామ్నాయంగా
  • ఆమోదం కోసం
  • జీవితంలో ఏం చెయ్యాలో తెలుసుకోవడం కోసం.

ఆధ్యాత్మిక గురువు వాళ్ళ కోసం ఇలా చెయ్యవచ్చు:

  • నిజాలను చెప్పడం
  • మౌఖిక ప్రసారాన్ని చేస్తూ ధర్మాన్ని పరిరక్షించడం
  • విద్యార్థుల వ్యక్తిత్వాలను మెరుగుపరచడం
  • విద్యార్థుల భవిష్యత్తు జీవితాలకు ఉపయోగపడేలా విత్తనాలు నాటడం
  • మెరుగైన పునర్జన్మను, విముక్తిని మరియు జ్ఞానోదయాన్ని పొందడానికి విద్యార్థులకు సహాయపడడం
  • ధర్మ కేంద్రం లేదా కేంద్రాల ధర్మ సామ్రాజ్యాన్ని నిర్మించడం
  • అతని లేదా ఆమెను తన వంశంలోకి మారేలా చెయ్యడం
  • భారతదేశంలో ఒక మఠానికి సహాయం చెయ్యడానికి లేదా టిబెట్ లోని ఒక మఠాన్ని పునర్నిర్మించడానికి నిధులు సేకరించడం
  • శరణార్థులకు ఒక సురక్షితమైన స్థావరాన్ని వెతికి పెట్టడం
  • జీవనోపాధిని అందించడం లేదా ధనవంతులుగా అవ్వడం
  • ఇతరులను నియంత్రించడం ద్వారా శక్తిని పొందడం
  • లైంగిక ప్రయోజనాలు పొందడం.

ఇద్దరినీ ప్రభావితం చేసే నెగెటివ్ మానసిక అంశాలు:

  • ఏకాంతం
  • విసుగు
  • బాధ
  • అభద్రతాభావం
  • ట్రెండీగా ఉండాలనే కోరిక
  • గ్రూప్ ఒత్తిడి.

ప్రతి ఒక్కరూ అతనిని లేదా ఆమెను మరియు ఇంకొకరిని సంబంధంలో నిర్వచించే రోల్ మరియు దానితో ప్రతి ఒక్కరికీ ఉన్న అంచనాలు మరియు ప్రతి ఒక్కరూ అతని గురించి లేదా తన గురించి ఎలా భావిస్తారు అని.

ఆధ్యాత్మిక గురువు తనను తాను ఇలా అనుకోవచ్చు, లేదా ఆ విద్యార్థి గురువును ఇలా చూడవచ్చు:

  • బౌద్ధమతం గురించి సమాచారం ఇస్తున్న ఒక బౌద్ధమత గురువుగా
  • ధర్మాన్ని జీవితానికి ఎలా అప్లై చెయ్యాలో చెప్తున్నా ఒక ధర్మ బోధకుడిగా
  • ఒక ధ్యాన లేదా ఆచార శిక్షకుడిగా
  • ప్రతిజ్ఞలు చేయించే ఒక ఆధ్యాత్మిక గురువుగా
  • తాంత్రిక సాధికారతను ప్రసాదించే ఒక తాంత్రిక గురువుగా.

విద్యార్థి తనను తాను ఇలా అనుకోవచ్చు, లేదా ఆధ్యాత్మిక గురువు విద్యార్థిని ఇలా చూడవచ్చు:

  • సమాచారం పొందుతున్న ఒక బౌద్ధమత విద్యార్థిగా
  • ధర్మాన్ని జీవితానికి ఎలా అప్లై చెయ్యాలో నేర్చుకుంటున్న ఒక ధర్మ శిష్యుడిగా
  • ధ్యానం లేదా ఆచార శిక్షణ పొందుతున్న వాడిగా
  • గురువు దగ్గర ప్రతిజ్ఞలు మాత్రమే తీసుకున్న ఒక శిష్యుడిగా
  • గురువు వ్యక్తిగతంగా మార్గనిర్దేశం చేసే ఒక శిష్యుడిగా.

ఈ కోణం యొక్క మరొక వైపు ఏమిటంటే, ఈ సంబంధం వల్ల ప్రతి ఒక్కరూ తమ గురించి ఎలా భావిస్తారు అని.

విద్యార్థి తనను లేదా ఆమెను ఇలా అనుకోవచ్చు:

  • రక్షింపబడి
  • ఒకరికి చెందిన
  • సంపూర్ణంగా
  • నెరవేర్చబడిన
  • ఒక సేవకుడు
  • ఒక కల్ట్ యొక్క సభ్యుడు.

ఆధ్యాత్మిక గురువు తనను లేదా ఆమెను ఇలా అనుకోవచ్చు:

  • ఒక గురువు
  • ఒక వినయపూర్వక అభ్యాసకుడు
  • ఒక రక్షకుడు
  • ఒక పాస్టర్
  • ఒక సైకాలజిస్ట్
  • ధర్మ కేంద్రాల లేదా ధర్మ సామ్రాజ్యం యొక్క నిర్వాహకుడు
  • ఒక మఠానికి ఆర్థిక సహాయకారి.

సంబంధం గురించి ప్రతి ఒక్కరి నిబద్ధత స్థాయి మరియు నిమగ్నత, మరియు దీన్ని ప్రభావితం చేసే మానసిక అంశాలు 

విద్యార్థి ఇలా ఉండవచ్చు:

  • సెట్ చేసిన ఫీజు చెల్లించడం, దాన విరాళాలు ఇవ్వడం లేదా ఉపాధ్యాయుడికి ఏమీ చెల్లించకుండా లేదా ఇవ్వకుండా చదవడం
  • బౌద్ధమతం, గురువు మరియు/లేదా ఒక వంశం పట్ల యాదృచ్ఛికంగా నిమగ్నం కావడం లేదా లోతుగా కట్టుబడి ఉండటం
  • ఉపాధ్యాయుడితో ప్రతిజ్ఞలు తీసుకోవాలనుకోవడం లేదా అలా అనుకోకపోవడం
  • టీచర్ కు సహాయపడటానికి బాధ్యతను తీసుకోవడం
  • రుణపడి ఉన్నట్లు అనిపించడం
  • బాధ్యతగా భావించడం
  • అతడు లేదా ఆమె విశ్వసనీయంగా ఉండాలని భావించడం - దీనిలో గ్రూప్ ఒత్తిడి ముఖ్యమైనది.
  • తాను ఏదైనా తప్పు చేస్తే నరకానికి వెళ్తానని భావించడం.

ఆధ్యాత్మిక గురువు ఇలా చెయ్యవచ్చు:

  • విద్యార్థులకు నైతికంగా మార్గనిర్దేశం చేసే బాధ్యతను తీసుకోవడం.
  • విద్యార్థుల జీవితాలకు సహాయం చేస్తూ వారికి ఏమి చెయ్యాలో చెప్పడం
  • అతని లేదా ఆమె ఉపాధ్యాయులు బోధించడానికి అతడిని లేదా ఆమెను పంపితే ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడం
  • అతడు లేదా ఆమె కేవలం ఒక పని మాత్రమే చేస్తున్నట్లుగా చూడడం.

ఈ కోణాన్ని ప్రభావితం చేసే నెగెటివ్ మానసిక అంశాలు:

  • నిబద్ధత పట్ల భయం
  • అధికార భయం, బహుశా దుర్వినియోగం యొక్క కారణం అవ్వొచ్చు
  • ఉపయోగకరంగా ఉండటం లేదా ప్రేమించబడడం
  • శ్రద్ధ అవసరం
  • ఇతరులను నియంత్రించాల్సిన అవసరం
  • తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం.

ప్రతి ఒక్కరికి ఉండే ఇతర మానసిక అంశాలు

ఇందులో వీళ్ళిద్దరూ ఇలా ఉండొచ్చు:

  • ఇంట్రావర్ట్ లేదా ఎక్స్ట్రావర్ట్ 
  • మేధోపరమైన, భావోద్వేగ లేదా భక్తితో
  • వెచ్చని లేదా చల్లగా
  • ప్రశాంతంగా లేదా చెడుగా
  • సమయం మరియు శ్రద్ధ కోసం అత్యాశతో
  • ఇతర విద్యార్థులు లేదా ఇతర ఉపాధ్యాయుల పట్ల అసూయతో
  • తక్కువ ఆత్మగౌరవం లేదా అహంకారంతో నిండి ఉండడం.

సంబంధం ఎలా పనిచేస్తుంది మరియు ప్రతి ఒక్కరిపై ఉండే దాని ప్రభావం

విద్యార్థి మరియు ఉపాధ్యాయుడు కలిసి ఇలా ఉంటారా:

  • ఒక మంచి లేదా చెడు జట్టుగా
  • ఇద్దరూ ఒకరిలోని అత్యుత్తమ సామర్థ్యాలను వెలికి తీసే లేదా ఒకరి సామర్ధ్యాలకు ఇంకొకరు ఆటంకం కలిగించే ఒక జట్టుగా
  • వేరే అంచనాల కారణంగా ఒకరి సమయాన్ని ఇంకొకరు వృధా చేసే జట్టుగా
  • ఒక శ్రేణి నిర్మాణాన్ని మెయింటైన్ చేసే ఒక జట్టులో విద్యార్థి దోపిడీకి గురవుతాడని, నియంత్రించబడుతున్నాడని మరియు అలా తక్కువగా (తక్కువ ఆత్మగౌరవాన్ని బలపరుస్తుంది) భావించే ఉపాధ్యాయుడు తనను తాను అధికారంలో ఉన్నట్టు మరియు ఉన్నతుడిగా భావించడం - ఒక వైపు అల అనుకునే దానికి మరొక వైపు అనుభూతి చెందే దానికి అనుగుణంగా ఉండకపోవచ్చని అనుకోవడం.
  • ఒకరు లేదా ఇద్దరూ ప్రేరణ పొందినట్లు లేదా అలసిపోయినట్లు అనుకునే ఒక జట్టుగా.

సారాంశం

మనం ఈ విద్యార్థి-ఉపాధ్యాయ సంబంధాన్ని మొత్తం ఆరు కోణాలు, మరియు వాటి ప్రతి ఒక్క అంశం ఆధారంగా ఎవాల్యూయేట్ చెయ్యాలి. ఈ అంశాలు ఒకదానికొకటి సరిపోలకపోతే, రెండు వైపులా వాళ్ళు వాటిని సమన్వయం చెయ్యడానికి మరియు అడ్జస్ట్ చేసుకోవడానికి లేదా సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నించాలి. సాంస్కృతిక విభేదాలు లేదా భావోద్వేగ విషయాల వల్ల సమస్యా పరిష్కారానికి ఈ విధానాన్ని ఒక వైపు వాళ్ళు అంగీకరించకపోతే, మరొక వైపు వాళ్ళు సర్దుబాట్లు చెయ్యాలి లేదా ఆ సంబంధానికి దూరంగా ఉండాలి.

Top