ఒక ఆధ్యాత్మిక గురువుతో కలిసి చదవడం

ఆధ్యాత్మిక విద్యార్థులు, ఆధ్యాత్మిక గురువులు అనేక స్థాయిలలో ఉంటారు. మంచి విద్యార్థులు వారు మరియు/లేదా వారి ఉపాధ్యాయులు వారి కంటే ఎక్కువ స్థాయి అర్హతలో ఉన్నారని భావించినప్పుడు లేదా వారు ఆ ఉపాధ్యాయుడిని ఒక థెరపిస్ట్ గా చూసినప్పుడు అసలైన గందరగోళం మొదలవుతుంది. నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకుని రియలిస్టిక్ గా అర్ధం చేసుకోవడం ద్వారా మనం ఏ స్థాయిలో ఉన్నామో తెలుసుకుని, ఒక ఆరోగ్యకరమైన విద్యార్థి-ఉపాధ్యాయ సంబంధాన్ని పెంపొందించుకోవాలి.

ఆధ్యాత్మిక విద్యార్థి-ఉపాధ్యాయ సంబంధం గురించి అనుభవపూర్వక నిజాలు

ఆధ్యాత్మిక విద్యార్థి-ఉపాధ్యాయ స౦బ౦ధ౦లో గందరగోళాన్ని పోగొట్టడానికి, మన౦ కొన్ని అనుభవపూర్వక నిజాలను గుర్తి౦చాలి:

  1. అందరు ఆధ్యాత్మిక సాధకులు ఆధ్యాత్మిక మార్గంలో దశల వారీగా ప్రోగ్రెస్ ను సాధిస్తారు.
  2. చాలా మంది అభ్యాసకులు తమ జీవితకాలంలో అనేక మంది ఉపాధ్యాయులతో కలిసి చదువుతారు మరియు ప్రతి ఒక్కరితో వేర్వేరు సంబంధాలను ఏర్పరచుకుంటారు.
  3. ప్రతి ఆధ్యాత్మిక గురువు ఒకే స్థాయికి ఎప్పుడూ చేరుకోలేరు.
  4. ఒక నిర్దిష్ట సాధకునికి, ఒక నిర్దిష్ట బోధకునికి మధ్య ఉండే సంబంధం ఒక్కొక్కరి ఆధ్యాత్మిక స్థాయిపై ఆధారపడి ఉంటుంది.
  5. ప్రజలు సాధారణంగా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగుతున్నప్పుడు వారి గురువులతో క్రమంగా లోతైన పద్ధతుల్లో సంబంధాన్ని కలిగి ఉంటారు.
  6. ఒకే ఉపాధ్యాయుడు ప్రతి సాధకుని ఆధ్యాత్మిక జీవితంలో వేర్వేరు పాత్రలను పోషిస్తాడు. కాబట్టి, ప్రతి సాధకుడు ఆ గురువుతో ఉన్న సంబంధం వేరుగా ఉంటుంది.

ఆధ్యాత్మిక గురువులు మరియు ఆధ్యాత్మిక సాధకుల స్థాయిలు

ఆధ్యాత్మిక గురువులు మరియు ఆధ్యాత్మిక సాధకులు అనేక స్థాయిలలో ఉంటారు. అవి ఈ విధంగా ఉన్నాయి:

  • విశ్వవిద్యాలయాలలో సమాచారాన్ని అందించే బౌద్ధమత గురువులు 
  • ధర్మాన్ని మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలో చూపించే ధర్మ బోధకులు 
  • తాయ్-చై లేదా యోగా ను బోధించడానికి సమానమైన పద్ధతులను బోధించే ధ్యాన శిక్షకులు 
  • ఆధ్యాత్మిక గురువులు విద్యార్థికి వారు ఇచ్చే ప్రతిజ్ఞల స్థాయిని బట్టి వేరు చెయ్యబడతారు: సాధారణ లేదా సన్యాసి ప్రతిజ్ఞలు, భోధిసత్వ ప్రతిజ్ఞలు లేదా తాంత్రిక ప్రతిజ్ఞలు.

అలాగే ఉపాధ్యాయులకు అనుగుణంగా విద్యార్థులు ఇలా ఉన్నారు:

  • సమాచారం పొందాలనుకునే బౌద్ధమత విద్యార్థులు
  • ధర్మాన్ని జీవితంలో ఎలా అన్వయించుకోవాలో తెలుసుకోవాలనుకునే ధర్మ విద్యార్థులు
  • మనస్సును రిలాక్స్ చేసుకోవడానికి లేదా శిక్షణ ఇవ్వడానికి పద్ధతులను నేర్చుకోవాలనుకునే ధ్యాన శిక్షణ పొందినవారు
  • వారి భవిష్యత్తు జీవితాలను మెరుగుపరుచుకోవాలని, మోక్షాన్ని పొందాలని లేదా జ్ఞానోదయం పొందాలని కోరుకునే శిష్యులు, ఈ లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడటానికి కొన్ని స్థాయి ప్రతిజ్ఞలు చెయ్యడానికి సిద్ధంగా ఉంటారు. శిష్యులు వారి జీవితాన్ని మెరుగుపరచాలని కోరుకున్నప్పటికీ, వారు దీన్ని ముక్తి మరియు జ్ఞానోదయ మార్గంలో ఒక మెట్టుగా చూస్తారు.

ప్రతి స్థాయికి దాని అర్హతలు ఉంటాయి. ఒక ఆధ్యాత్మిక సాధకుడిగా, మన స్వంత మరియు ఉపాధ్యాయ ఆలోచనలను పరిగణనలోకి తీసుకోవాలి - ఆసియా లేదా పాశ్చాత్య, సన్యాసి లేదా లే, విద్య స్థాయి, భావోద్వేగ మరియు నైతిక పరిపక్వత స్థాయి, నిబద్ధత స్థాయి మొదలైనవాటిని. అందుకని, నెమ్మదిగా మరియు జాగ్రత్తగా ముందుకు వెళ్లడం చాలా ముఖ్యం.

ఒక మంచి శిష్యుడు మరియు మంచి ఆధ్యాత్మిక గురువు యొక్క అర్హతలు

ఒక మంచి శిష్యుడిగా, మన౦ సిద్ధ౦గా లేని బంధానికి కట్టుబడి ఉ౦డకుండా మన౦ మన అభివృద్ధి స్థాయిని పరీక్షి౦చుకోవాలి. శిష్యుడికి ఉండవలసిన ప్రధాన లక్షణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

  1. తన స్వంత ముందస్తు ఆలోచనలతో మరియు అభిప్రాయాలతో ఆగిపోకుండా ఓపెన్ మైండెడ్ తో ఉండటం
  2. ఏది సరైనది, ఏది కాదు అనే తేడాను గుర్తించే కామన్ సెన్స్
  3. ధర్మం పట్ల బలమైన ఆసక్తి మరియు సరైన అర్హత కలిగిన గురువును కనిపెట్టడం
  4. ధర్మం పట్ల మరియు మంచి అర్హత కలిగిన ఉపాధ్యాయులను ప్రశంసలు చెయ్యడం మరియు గౌరవించడం
  5. మంచి శ్రద్ధ గల మనస్సు
  6. భావోద్వేగ పరిపక్వత మరియు స్థిరత్వం యొక్క ప్రాథమిక స్థాయి
  7. నైతిక బాధ్యత యొక్క ప్రాథమిక భావన.

ఉపాధ్యాయుడి స్థాయిని బట్టి, అతనికి లేదా ఆమెకు ఎక్కువ అర్హతలు అవసరం పడతాయి. సాధారణంగా, ప్రధానమైనవి ఇలా ఉన్నాయి:

  1. తన స్వంత ఆధ్యాత్మిక గురువులతో మంచి సంబంధం
  2. విద్యార్థికి ఉన్న ధర్మ జ్ఞానం కంటే ఎక్కువ
  3. ధ్యానంలో మరియు రోజువారీ జీవితంలో ఆ పద్ధతులను ఉపయోగించడంలో అనుభవం మరియు కొంత స్థాయి విజయం
  4. ధర్మాన్ని జీవితానికి అన్వయించుకోవడం వల్ల కలిగే ప్రయోజనకరమైన ఫలితాలకు స్ఫూర్తిదాయక ఉదాహరణగా నిలిచే సామర్థ్యం. దీని అర్థం:
  5. నైతిక సొంత క్రమశిక్షణ ఉండడం
  6. స్థూల భావోద్వేగ సమస్యల నుంచి స్వేచ్ఛ ఆధారంగా భావోద్వేగ పరిపక్వత మరియు స్థిరత్వం ఉండడం
  7. బోధనకు ప్రాథమిక ప్రేరణగా విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చాలనే చిత్తశుద్ధి ఉండడం
  8. బోధనలో సహనం ఉండడం
  9. వ్యామోహం లేకపోవడం (తనకు లేని లక్షణాలు ఉన్నట్లు నటించకుండా ఉండడం) మరియు కపటత్వం లేకపోవడం (జ్ఞానం మరియు అనుభవం లేకపోవడం లాంటి లోపాలను దాచకపోవడం).

మన సిటీలో అందుబాటులో ఉన్న ఉపాధ్యాయులకు ఏ స్థాయి అర్హత ఉంది, మనకు ఎంత సమయం మరియు నిబద్ధత ఉంది, మన ఆధ్యాత్మిక లక్ష్యాలు ఏమిటి (వాస్తవికంగా, ఆదర్శవంతంగా "సమస్త ప్రాణులకు ప్రయోజనం చేకూర్చడం" మాత్రమే కాదు), మొదలైన పరిస్థితుల వాస్తవికతకు అనుగుణంగా మనం ఉండాలి. ఆధ్యాత్మిక సంబంధానికి కట్టుబడి ఉండటానికి ముందు ఆ బోధకుని అర్హతలను పరిశీలిస్తే, గురువును దేవుడుగా లేదా చెడు వ్యక్తిగా మార్చే పరిస్థితులను నివారించవచ్చు. ఆధ్యాత్మిక గురువును ఒక దైవంగా చూసినప్పుడు, మన అమాయకత్వం మనల్ని దుర్వినియోగానికి గురిచేస్తుంది. 

ఆధ్యాత్మిక గురువు యొక్క శిష్యుడు కావడానికి మరియు థెరపిస్ట్ యొక్క క్లయింట్ కావడానికి మధ్య ఉన్న తేడాలు

ఆధ్యాత్మిక విద్యార్థి-ఉపాధ్యాయ సంబంధంలో గందరగోళానికి ప్రధాన కారణాలలో ఒకటి ఆధ్యాత్మిక గురువు థెరపిస్ట్ లా ఉండాలనే కోరిక. ఉదాహరణకు, జీవితాంతం భావోద్వేగ సంతోషాన్ని, మంచి సంబంధాలను పొందాలనుకునే వ్యక్తిని గమనించండి. అనేక విధాలుగా ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఆధ్యాత్మిక గురువు యొక్క శిష్యుడిగా మారడం అదే ప్రయోజనం కోసం థెరపిస్ట్ యొక్క క్లయింట్ గా మారడం లాంటిదే.

బౌద్ధమతం మరియు థెరపీ రెండూ:

  1. మన జీవితాల్లో బాధను గుర్తించి అంగీకరించడం మరియు దాన్ని తగ్గించాలని కోరుకోవడం నుంచి వచ్చినవే
  2. మన సమస్యలు, వాటి కారణాలను గుర్తించడానికి, అర్థం చేసుకోవడానికి ఎవరితోనైనా కలిసి పనిచేయాలి. అనేక రకాల థెరపీలు, నిజానికి, అవగాహన సొంత-పరివర్తనకు కీలకంగా పని చేస్తుందనే బౌద్ధమతంతో ఏకీభవిస్తాయి.
  3. మన సమస్యలకు కారణాలను లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రాధాన్యమిచ్చే ఆలోచనా విధానాలు, వీటిని అధిగమించడానికి ఆచరణాత్మక పద్ధతులపై పనిచేయడానికి ప్రాధాన్యత ఇచ్చే సంప్రదాయాలు మరియు రెండు విధానాల సమతుల్య కలయికను రికమండ్  చేసే వ్యవస్థలను స్వీకరించండి.
  4. సొంత-అభివృద్ధి ప్రాసెస్ లో ముఖ్యమైన భాగంగా గురువు లేదా చికిత్సకుడితో ఆరోగ్యకరమైన భావోద్వేగ సంబంధాన్ని స్థాపించాలని సూచించండి.
  5. చికిత్స యొక్క చాలా శాస్త్రీయ రూపాలు క్లయింట్ల ప్రవర్తన మరియు ఆలోచనా విధానాలను సవరించడానికి నైతిక మార్గదర్శకాలను ఉపయోగించకుండా ఉన్నప్పటికీ, కొన్ని పోస్ట్-క్లాసికల్ పాఠశాలలు బౌద్ధమతంలో మాదిరిగానే నైతిక సూత్రాలను సమర్థిస్తాయి. అటువంటి సూత్రాలలో కుటుంబ సభ్యులందరితో సమానంగా న్యాయంగా ఉండటం మరియు కోపం లాంటి చెడు ప్రేరణలను ప్రదర్శించకుండా ఉండటం జరుగుతుంది.

పోలికలు ఉన్నప్పటికీ, బౌద్ధ గురువు యొక్క శిష్యుడు కావడానికి మరియు థెరపిస్ట్ యొక్క క్లయింట్ కావడానికి మధ్య కనీసం ఐదు ముఖ్యమైన తేడాలు ఉన్నాయి:

(1) ఒక వ్యక్తి సంబంధాన్ని ఏర్పరచుకునే భావోద్వేగ దశ. మంచి క్లయింట్ లు సాధారణంగా మానసికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు థెరపిస్ట్ ని సంప్రదిస్తారు. వారు మానసికంగా దెబ్బతిని ఉండవచ్చు మరియు చికిత్సలో భాగంగా వాళ్లకు మందులు అవసరం పడవచ్చు. దీనికి విరుద్ధంగా, మంచి శిష్యులు తమ ఆధ్యాత్మిక మార్గాల్లో మొదటి మెట్టుగా గురువులతో సంబంధాన్ని ఏర్పరచుకోరు. అంతకు ముందే వారు బుద్ధుని బోధనలను అధ్యయనం చేసి తమపై తాము పని చేసుకోవడం ప్రారంభిస్తారు. అలా వారు తగినంత భావోద్వేగ పరిపక్వత మరియు స్థిరత్వ స్థాయికి చేరుకుంటారు, అలా వారు స్థాపించిన శిష్యుడు-గురువు సంబంధం ఈ బౌద్ధమత అర్థంలో సరిగ్గా ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే, బౌద్ధమత శిష్యులు ఇప్పటికే న్యూరోటిక్ ఆలోచన మరియు ప్రవర్తన నుంచి స్వేచ్ఛగా ఉండాలి.

సంబంధంలో ఒకరు ఆశించే పరస్పర చర్య. మంచి క్లయింట్లు ఎక్కువగా ఎవరైనా తమ మాట వినడాన్ని ఇష్టపడతారు. అందుకని, థెరపిస్ట్ గ్రూప్ థెరపీలో ఉన్నా కానీ, వాటిపై మరియు వారి వ్యక్తిగత సమస్యలపై దృష్టి పెట్టాలని కోరుకుంటారు. మరోవైపు, శిష్యులు సాధారణంగా తమ గురువులతో వ్యక్తిగత సమస్యలను పంచుకోరు మరియు వ్యక్తిగత శ్రద్ధను కూడా ఆశించరు. వ్యక్తిగత సలహాల కోసం గురువును సంప్రదించినా కానీ వారు రోజూ వెళ్లరు. సంబంధంలో బోధనలు వినడంపైనే దృష్టి పెడతారు. బౌద్ధమత శిష్యులు ప్రధానంగా ప్రతి ఒక్కరూ ఎదుర్కునే సాధారణ సమస్యలను అధిగమించడానికి వారి గురువుల నుంచి మంచి పద్ధతులను నేర్చుకుంటారు. వారు అప్పుడు తమ పరిస్థితులకు ఆ పద్ధతులను ఉపయోగించడానికి వ్యక్తిగత బాధ్యతను తీసుకుంటారు.

(3) పని సంబంధం నుంచి ఆశించే ఫలితాలు. థెరపీ అనేది మన జీవితంలోని సమస్యలను అంగీకరించి వాటితో జీవించడం నేర్చుకోవడం లేదా వాటిని తగ్గించడం లాంటిది, అలా అవి భరించదగినవిగా మారతాయి. ఈ జన్మలో భావోద్వేగ శ్రేయస్సును లక్ష్యంగా పెట్టుకుని మనం ఒక బౌద్ధమత ఆధ్యాత్మిక గురువును సంప్రదిస్తే, మన సమస్యలు కూడా తగ్గిపోవాలని మనం ఆశించవచ్చు. జీవితం కష్టంగా ఉన్నప్పటికీ - బుద్ధుడు బోధించిన జీవితపు మొదటి సత్యం (ఉత్తమమైన సత్యం) - మనం దానిని తక్కువ కష్టంలా చూడవచ్చు.

ఏదేమైనా, మన జీవితాలను మానసికంగా తక్కువ కష్టంతో చూడడం, సాంప్రదాయిక బౌద్ధమత మార్గానికి చేరుకోవడానికి ఒక ప్రాథమిక దశ మాత్రమే. ఆధ్యాత్మిక గురువుల శిష్యులు కనీసం అనుకూలమైన పునర్జన్మలు, మోక్షం మరియు జ్ఞానోదయం యొక్క గొప్ప లక్ష్యాల వైపు దృష్టి పెడతారు. అంతేకాక, బౌద్ధమత శిష్యులకు బౌద్ధమతంలో వివరించిన విధంగా పునర్జన్మ గురించి మేధోపరమైన అవగాహన ఉంటుంది మరియు కనీసం దాని ఉనికిని తాత్కాలికంగా అంగీకరించాలి. థెరపీ క్లయింట్లు వారి తక్షణ పరిస్థితులను మెరుగుపరచడానికి మించి పునర్జన్మ గురించి లేదా లక్ష్యాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.

(4) సొంత-పరివర్తనకు నిబద్ధత స్థాయి. థెరపిస్ట్ లకు క్లయింట్లు గంటకు కొంత డబ్బులను చెల్లిస్తారు కాని ఆలోచనా విధానం మరియు ప్రవర్తనలో జీవితకాల మార్పుకు కట్టుబడి ఉండరు. మరోవైపు, బౌద్ధమత శిష్యులు బోధనల కోసం డబ్బులను చెల్లించినా లేదా చెల్లించకపోయినా వారి జీవితంలో ఆ దిశలను అధికారికంగా అన్వయించుకుంటారు. సురక్షితమైన దిశను (ఆశ్రయాన్ని) తీసుకోవడంలో, శిష్యులు పూర్తిగా ప్రయాణించి, అలా బోధించిన సొంత-అభివృద్ధి గమనానికి తమను తాము అంకితం చేసుకుంటారు మరియు అత్యంత సాకారమైన ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తారు.

అంతేకాక, బౌద్ధమత శిష్యులు తమ జీవితంలో నైతికతకు, మంచి పనులు చెయ్యడానికి, మంచిగా మాట్లాడటానికి మరియు ఆలోచించడానికి కట్టుబడి ఉంటారు. వాళ్ళు సాధ్యమైనంత వరకు, చెడు పనులను నివారించడానికి మరియు వాటికి బదులుగా నిర్మాణాత్మకమైన పనులలో పాల్గొనడానికి ప్రయత్నిస్తారు. శిష్యులు నియంత్రణలో లేని పునర్జన్మ యొక్క రిపీట్ అయ్యే సమస్యల నుంచి విముక్తిని మనస్ఫూర్తిగా కోరుకున్నప్పుడు, వారు అధికారికంగా లేదా సన్యాస ప్రతిజ్ఞలు చేయడం ద్వారా మంచి బలమైన నిబద్ధతను కలిగి ఉంటారు. సొంత అభివృద్ధి యొక్క ఈ దశలో శిష్యులు సహజంగా వినాశకరమైన లేదా నిర్దిష్ట ప్రయోజనాల కోసం కొంతమంది ప్రజలు బుద్ధుడు సిఫార్సు చేసిన కొన్ని ప్రవర్తనల నుంచి ఎప్పుడూ దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తారు. అనుబంధాన్ని తగ్గించడానికి సన్యాసులు సాధారణ దుస్తులను విడిచిపెట్టి వాటికి బదులుగా రోబ్ లను ధరించడం రెండవదానికి ఒక ఉదాహరణ. పరిపూర్ణ ముక్తి కోరికను పెంపొందించుకోవడానికి ముందే శిష్యులు ఎప్పుడూ సాధారణ లేదా సన్యాస ప్రతిజ్ఞలను చేస్తారు.

మరోవైపు, థెరపిస్ట్ క్లయింట్ల చికిత్సలో కొన్ని విధాన నియమాలను అనుసరించడానికి అంగీకరిస్తారు, అంటే యాభై నిమిషాల అపాయింట్‌మెంట్ల షెడ్యూల్ ను పాటించడం. అయినా కానీ, ఈ నియమాలు చికిత్స సమయంలో మాత్రమే వర్తిస్తాయి. అవి చికిత్స చోటు బయట వర్తించవు, సహజంగా విధ్వంసక ప్రవర్తనకు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు.

(5) ఉపాధ్యాయుడు లేదా థెరపిస్ట్ పట్ల వైఖరి. శిష్యులు తమ ఆధ్యాత్మిక గురువులను తాము సాధించడానికి కృషి చేసే వాటికి సజీవ ఉదాహరణలుగా చూస్తారు. మార్గదర్శకుల యొక్క మంచి లక్షణాలను సరిగ్గా గుర్తించే ఆధారంగా వారు వారిని ఈ విధంగా భావిస్తారు మరియు వారు జ్ఞానోదయం కోసం వారి గ్రేడెడ్ మార్గంలో ఈ ఆలోచనను కొనసాగించుకుని బలపరుచుకుంటారు. దీనికి విరుద్ధంగా, క్లయింట్లు తమ థెరపిస్ట్ లను భావోద్వేగ ఆరోగ్యానికి నమూనాలుగా భావించవచ్చు, కాని థెరపిస్ట్ ల మంచి లక్షణాల గురించి వారికి సరైన అవగాహన అవసరం పడదు. థెరపిస్ట్ లా మారడం ఈ సంబంధం యొక్క లక్ష్యం కాదు. చికిత్స సమయంలో, థెరపిస్ట్ లు తమ క్లయింట్లతో తమ ఆలోచనలకు మించి వ్యవహరిస్తారు.

"శిష్యుడు" అనే పదాన్ని చెడుగా ఉపయోగించడం

కొన్నిసార్లు, ప్రజలు తమను తాము ఆధ్యాత్మిక గురువుల శిష్యులు అని పిలుచుకుంటారు, అయినా కానీ వారు, గురువు లేదా శిష్యుడు ఈ రెండు పదాల యొక్క సరైన అర్థానికి న్యాయం చెయ్యలేకపోతారు. వారి అమాయకత్వం ఎప్పుడూ అవాస్తవిక అంచనాలు, అపార్థాలు, మనోభావాలను దెబ్బ తియ్యడం మరియు దుర్వినియోగానికి దారితీస్తుంది. ఈ సందర్భంలో దుర్వినియోగానికి గురికావడం అంటే లైంగికంగా, భావోద్వేగపరంగా లేదా ఆర్థికంగా దోపిడీకి గురికావడం లేదా అధికారికంగా మోస పోవడమే. ఇప్పుడు పాశ్చాత్య దేశాలలో కనిపించే మూడు సాధారణ రకాల సూడో-శిష్యులను పరిశీలిద్దాం, వారు ముఖ్యంగా ఆధ్యాత్మిక గురువులతో సమస్యలకు గురవుతారు. 

(1) కొందరు తమ ఊహలను నెరవేర్చుకోవడానికి ధర్మ కేంద్రాలకు వస్తూ ఉంటారు. వారు "మిస్టీరియస్ ఈస్ట్" గురించి లేదా సూపర్ స్టార్ గురువుల గురించి కొంత చదివి లేదా విని అన్య దేశ లేదా మార్మిక అనుభవాన్ని పొంది వారి జీవితాలను మార్చుకోవాలని కోరుకుంటారు. వారు ఆధ్యాత్మిక గురువులను కలుసుకుని వెంటనే తమను తాము శిష్యులుగా ప్రకటించుకుంటారు, ప్రత్యేకించి గురువులు ఆసియన్లుగా, రోబ్ లను ధరించి ఉంటే. వాళ్ళు రోబ్ లను ధరించినా, ధరించకపోయినా, ఆసియా బిరుదులు లేదా పేర్లను కలిగి ఉన్న పాశ్చాత్య ఉపాధ్యాయులతో ఇలాంటి పనులు చేస్తారు.

క్షుద్రత్వాల అన్వేషణ తరచుగా ఆధ్యాత్మిక గురువులతో అటువంటి సాధకులు ఏర్పరచుకునే సంబంధాలను ఏర్పరచుకునేలా చేస్తుంది. సరైన అర్హత కలిగిన గురువుల శిష్యులుగా వారు తమను తాము చెప్పుకున్నప్పటికీ, వారి ఊహల్లో తప్ప నిజంగా ఏమీ జరగడం లేదని తెలుసుకున్నప్పుడు ఈ గురువులను వదిలేస్తారు. అ౦తేకాక, అవాస్తవిక ఆలోచనలు, "తక్షణ శిష్యుల" అధిక కోరికలు వారి విమర్శనాత్మక సామర్థ్యాలను దాచి పెడతాయి. అటువంటి వ్యక్తులు ముఖ్యంగా ఒక మంచి పని చెయ్యడంలో తెలివైన ఆధ్యాత్మిక మోసగాళ్లచే మోసపోతారు.

(2) ఇతరులు భావోద్వేగ లేదా శారీరక నొప్పిని పోగొట్టుకోవడం కోసం ఈ కేంద్రాలకు రావచ్చు. వారు వివిధ రకాల చికిత్సలను ప్రయత్నించి వాటివల్ల ఏ ప్రయోజనం పొంది ఉండకపోవచ్చు. ఇప్పుడు, వాళ్ళు ఒక మాంత్రికుడు / వైద్యుడి నుంచి అద్భుత చికిత్సను కోరుకుంటారు. వారు తమకు ఆశీర్వాదం ఇచ్చే, ప్రత్యేక ప్రార్థన లేదా మంత్రాన్ని చదివి చెప్పే లేదా చెయ్యాలిన శక్తివంతమైన అభ్యాసాలను ఇచ్చే - లక్ష సాష్టాంగ నమస్కారాలు చేయడం లాంటివి చేస్తారు. ఇక్కడ ఎవరైతే వారి సమస్యలను పరిష్కరిస్తారో, అలాంటి వాళ్లకు వీళ్ళు శిష్యులుగా ప్రకటించుకుంటారు. వారు ముఖ్యంగా దైవ అన్వేషణలో ఉన్న ప్రజలను ఆకర్షించే ఒక రకమైన గురువుల వైపు మొగ్గు చూపుతారు. అద్భుత సాధకుల "ఫిక్స్-ఇట్" మనస్తత్వం ఎప్పుడూ నిరాశకు దారితీస్తుంది, అర్హత కలిగిన మార్గదర్శకుల సలహాలను అనుసరించడం వల్ల అద్భుత నివారణలు జరగవు. "ఫిక్స్-ఇట్" మనస్తత్వం ఆధ్యాత్మిక శక్తుల నుంచి కూడా చెడుని ఆకర్షిస్తుంది.

(3) ఇంకొందరు, ముఖ్యంగా నిరాశా నిస్పృహలకు లోనైన నిరుద్యోగ యువకులు అస్తిత్వ సాధికారతను పొందాలనే ఆశతో మత సంబంధమైన ధర్మ కేంద్రాలకు వస్తారు. ఆకర్షణీయమైన మెగాలోమానియాకులు "ఆధ్యాత్మిక ఫాసిస్టు" మార్గాలను ఉపయోగించి వారిని ఆకర్షిస్తారు. తమ వర్గాలకు సంపూర్ణ విధేయత చూపిస్తే తమ శిష్యులకు ఎక్కువ బలం వస్తుందని వాగ్దానం చేస్తారు. వారు తమ శత్రువులను, ముఖ్యంగా భయపడే, అపవిత్ర బౌద్ధ సంప్రదాయాలను అనుసరించే వారిని ఓడించే భీకర సంరక్షకుల నాటకీయ వర్ణనలతో శిష్యులను బాగా ఆకర్షిస్తారు. తమ ఉద్యమ పెద్ద వాళ్ళ మానవాతీత శక్తుల గొప్ప కథలతో, తమను ఆధ్యాత్మిక అర్హత స్థానాలకు తీసుకెళ్లే శిష్యుల కలలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు. ఈ వాగ్దానాలకు ప్రతిస్పందిస్తూ, అటువంటి వ్యక్తులు త్వరగా తమను తాము శిష్యులుగా ప్రకటించుకుంటారు మరియు నిరంకుశ గురువులు ఇచ్చే సూచనలు లేదా ఆదేశాలను గుడ్డిగా పాటిస్తారు. చివరికి ఫలితాలు చాలా ఘోరంగా ఉంటాయి.

సారాంశం

క్లుప్తంగా చెప్పాలంటే, బౌద్ధమత కేంద్రంలో బోధించే ప్రతి ఒక్కరూ ప్రామాణిక ఆధ్యాత్మిక గురువులు కానట్లే, ఆ కేంద్రంలో చదివే ప్రతి ఒక్కరూ ప్రామాణిక ఆధ్యాత్మిక శిష్యులు కాదు. గురువు, శిష్యుడు అనే రెండు పదాలను మనం సరిగ్గా వాడాలి. దీనికి ఆధ్యాత్మిక నిజాయితీ, దురుద్దేశం ఉండకపోవడం చాలా అవసరం.

Top