ఆలోచనలను శాంత పరుచుకోవడం

05:54
భావనాత్మక ఆలోచన అనేది అనివార్యమైనది. అది లేకుండా, మనం దుకాణంలోని వస్తువులను ఆపిల్ లేదా పియర్స్ అని వేరు చెయ్యలేము లేదా "దయచేసి షో కోసం నాకు రెండు టికెట్లను ఇవ్వండి" అనే వాక్యాన్ని కూడా మనం అర్థం చేసుకోలేము.

మనస్సును శాంతపరచడం

ఏకాగ్రతను పొందడానికి మన మనస్సులను శాంతపరచుకోవాలి, అలా, కొన్ని ధ్యాన సూచనలు వివరించినట్లుగా, మనం ఇంకా మంచి సహజమైన మానసిక స్థితికి చేరుకుంటాము. స్పష్టంగా చెప్పాలంటే, ఆఫ్ చేసిన రేడియో లాగా పూర్తిగా ఖాళీ, జాంబీ లాంటి మనస్సును కలిగి ఉండాలని మనం లక్ష్యంగా పెట్టుకోలేదు. అదే నిజమైతే, కేవలం నిద్రపోవడమే మంచిది! మన మానసిక స్థితులన్నిటినీ శాంతింపజేయడమే లక్ష్యం. కొన్ని భావోద్వేగాలు ఆందోళన చెందడం, లేదా భయపడటం లాంటివి బాగా కలవరపరుస్తాయి; వీటిని శాంతింపజేయడమే మన లక్ష్యం.

మన మనస్సులను నిశ్శబ్దపరచినప్పుడు, మనం సాధించే మానసిక స్థితి స్పష్టంగా మరియు అప్రమత్తంగా ఉంటుంది, ఇక్కడ మనం కొంత ప్రేమను మరియు అవగాహనను సృష్టించగలుగుతాము లేదా మనందరికీ ఉన్న సహజమైన, మానవ ఆప్యాయతను వ్యక్తీకరించగలుగుతాము. దీనికి లోతైన విశ్రాంతి అవసరం, శరీరంలోని కండరాలు మాత్రమే కాదు, మానసిక మరియు భావోద్వేగ బిగుతు కూడా అవసరం, ఇది మనస్సు యొక్క సహజమైన వెచ్చదనం మరియు స్పష్టతను లేదా ఏదైనా అనుభూతి చెందకుండా నిరోధించగలదు.

కొంతమంది ధ్యానాన్ని తప్పుగా మనం ఆలోచించడం మానేయాలి అని అర్థం చేసుకుంటారు. ఆలోచించకుండా ఉండడానికి బదులుగా, ధ్యానం భవిష్యత్తు గురించి దృష్టి మరల్చే ఆలోచనలు ("నేను భోజనానికి ఏమి తినబోతున్నాను?"), మరియు నెగెటివ్ ఆలోచనలను ("నిన్న నువ్వు నాతో చాలా నీచంగా ప్రవర్తించావు. నువ్వు చెడ్డ వాడివి!") పోగొట్టాలి. ఇవన్నీ మానసిక అలజడి, కలవరపెట్టే ఆలోచనల కోవలోకి వస్తాయి.

అయితే, ప్రశాంతమైన మనస్సును కలిగి ఉండటం ఒక సాధనం మాత్రమే; అదే అంతిమ లక్ష్యం కాదు. మనకు ప్రశాంతమైన, స్పష్టమైన మరియు మరింత ఓపెన్ మైండ్ ఉన్నప్పుడు, మనం దాన్ని నిర్మాణాత్మకంగా ఉపయోగించవచ్చు. మనం దీని రోజూ జీవితంలో ఉపయోగించవచ్చు మరియు ధ్యానంలో కూర్చొన్నప్పుడు మన జీవిత పరిస్థితిని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఇబ్బంది పెట్టే భావోద్వేగాలు మరియు బయటి ఆలోచనలు లేని మనస్సుతో, "నా జీవితంలో నేను ఏమి చేస్తున్నాను?" లాంటి ముఖ్యమైన విషయాల గురించి ఇంకా స్పష్టంగా ఆలోచించవచ్చు. ఈ ముఖ్యమైన సంబంధంలో ఏమి జరుగుతోంది? ఇది మంచిదా లేక చెడ్డదా?" అని మనం విశ్లేషణాత్మకంగా ఉండవచ్చు - దీన్నే ఆత్మపరిశీలన అంటారు. ఈ రకమైన సమస్యలను అర్థం చేసుకోవడానికి మరియు ఉత్పాదక మార్గంలో ఆత్మపరిశీలన చేసుకోవడానికి, మనకు స్పష్టత అవసరం. మనకు ప్రశాంతమైన, నిశ్శబ్దమైన మనస్సు అవసరం మరియు ధ్యానం మనల్ని ఈ స్థితికి తీసుకురాగల ఒక సాధనం.

మనస్సు యొక్క భావనాత్మక మరియు భావరహిత స్థితులు

అనేక ధ్యాన గ్రంథాలు మనల్ని భావనాత్మక ఆలోచనలను వదిలించుకోవాలని మరియు భావరహిత స్థితిలో ఉండాలని సూచిస్తున్నాయి. ఉండగా, ఈ సూచన అన్ని ధ్యానాలకు వర్తించదు. ఇది రియాలిటీపై దృష్టి పెట్టడానికి అధునాతన ధ్యానాన్ని ప్రత్యేకంగా సూచిస్తుంది. ఏదేమైనా, అన్ని రకాల ధ్యానాలను వదిలించుకోవాల్సిన భావన యొక్క ఒక రూపం ఉంది. కానీ ఆ ధ్యాన గ్రంథాలలో చర్చించబడిన భావన యొక్క వివిధ రూపాలను అర్థం చేసుకోవడానికి, బౌద్ధమతంలో "భావనాత్మకం" అంటే ఏమిటో మనం అర్థం చేసుకోవాలి.

భావనాత్మక ఆలోచన అనేది కేవలం మన బుర్రలోని గొంతుని మాత్రమే సూచించదు. 

భావాత్మకంగా ఉండటం అనేది మన మనస్సుల గుండా ప్రవహించే సాధారణ, రోజువారీ మౌఖిక ఆలోచనలను సూచిస్తుందని కొందరు అనుకుంటారు - "మన తలలలోని గొంతు" అని పిలుస్తారు - మరియు భావరహితంగా మారడం అంటే ఆ స్వరాన్ని నిశ్శబ్దపరచడం. మన తలలోని స్వరాన్ని నిశ్శబ్దపరచడం ఒక ప్రారంభం మాత్రమే - అది చాలా ముఖ్యమైన ప్రారంభం - కానీ అది మొదటి దశ మాత్రమే. స్పష్టమైన మరియు ప్రశాంతమైన మనస్సును కలిగి ఉండటానికి బయట ఇబ్బంది పెట్టే ఆలోచనల నుంచి మన మనస్సులను శాంత పరచడంలో ఇది ఒక భాగం. ఇతరులు ఏదైనా విషయాన్ని నిజంగా అర్థం చేసుకోవడానికి, మీరు దాన్ని భావరహితంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని మరియు ఆ భావనాత్మక ఆలోచన మరియు సరైన అవగాహన పరస్పరం ప్రత్యేకమైనవని భావిస్తారు. అది అలా కూడా కాదు.

భావానికి సంబంధించిన సంక్లిష్టతలను తొలగించడానికి, మనం మొదట మన ఆలోచనలలోని ఒక దాన్ని అర్థం చేసుకోవడానికి మరియు వేరే దాన్ని అర్థం చేసుకోవడానికి వేరుగా చూడాలి. మన ఆలోచనల్లో దేనినైనా అర్థం చేసుకోకుండానే మౌఖికంగా చెప్పగలం. ఉదాహరణకు, బయటి దేశపు భాషలో ప్రార్థనను మన౦ లోలోపల చదవవచ్చు, దాని అర్థమేమిటో అర్థ౦ చేసుకోకుండానే. అదే విధంగా, మనం ఏ విషయాన్ని అయినా మానసికంగా మాటల్లో వివరించకుండా అర్ధం చేసుకోవచ్చు, ఉదాహరణకు ప్రేమలో ఉన్నట్లు మనం ఎలా అనుభూతి చెందుతామో అని.

అయితే, ధ్యానంలో భావనాత్మక మరియు భావరహిత స్థాయిలు అనే సమస్య ఏదో అర్థం చేసుకోవడం లేదా అర్థం చేసుకోకపోవడం అని కాదు. ధ్యానంలో, అలాగే జీవితంలో, మనం ఎప్పుడూ అవగాహనను కొనసాగించాలి, అది భావనాత్మకమైనదా లేదా భావరహితమైనదా, మరియు మనం దాన్ని మానసికంగా మౌఖికంగా అర్థం చేసుకున్నామా లేదా అని. కొన్నిసార్లు మౌఖికంగా చెప్పడం సహాయపడుతుంది; కొన్నిసార్లు ఇది అస్సలు ఉపయోగపడదు లేదా దాని అవసరం కూడా ఉండదు. ఉదాహరణకు, మీ బూట్లు కట్టుకోవడం: మీ బూట్లు ఎలా కట్టుకోవాలి మీరు అర్థం చేసుకుంటారు. మీరు లేస్ లను కట్టేటప్పుడు నిజంగా ఏమి చేస్తారో బయటకు చెప్పాల్సిన అవసరం ఉందా? లేదు కాదు. నిజానికి, మనలో చాలా మందికి మన బూట్లు ఎలా కట్టుకుంటామో మాటల్లో చెప్పడం చాలా కష్టమని నేను అనుకుంటున్నాను. అయినప్పటికీ, మనకు ఒక అవగాహన ఉంటుంది. ఆ అవగాహన లేకపోతే జీవితంలో మనం ఏమీ చేయలేం కదా? కనీసం తలుపు కూడా తెరవలేం.

అనేక కోణాల నుంచి, మౌఖికీకరణ నిజంగా సహాయపడుతుంది; ఇతరులతో కమ్యూనికేట్ చేయడానికి మనకు మౌఖికీకరణ అవసరం. అయితే, మన ఆలోచనలో మౌఖికత పూర్తిగా అవసరం లేదు; మౌఖికీకరణ తటస్థంగా ఉంటుంది, అంటే ఇది సహాయకరమైన లేదా వినాశకరమైన మార్గంలో ఉపయోగించబడుతుంది. నిజానికి, మౌఖికీకరణను కలిగి ఉన్న కొన్ని ఉపయోగకరమైన ధ్యానాలు ఉన్నాయి. ఉదాహరణకు, మానసికంగా మంత్రాలను రిపీట్ చెయ్యడం అనేది మౌఖికీకరణ యొక్క ఒక రూపం, ఇది మనస్సులో ఒక నిర్దిష్ట రకమైన లయ లేదా ప్రకంపనలను సృష్టిస్తుంది మరియు నిర్వహిస్తుంది. ఆ మంత్రం యొక్క క్రమమైన లయ చాలా సహాయకారిగా ఉంటుంది; ఇది ఒక నిర్దిష్ట మానసిక స్థితిపై దృష్టి పెట్టడానికి మనకు సహాయపడుతుంది. ఉదాహరణకు, కరుణ మరియు ప్రేమను ఉత్పత్తి చేసేటప్పుడు, మీరు ఓం మణి పద్మే హమ్ లాంటి మంత్రాన్ని చదువుతున్నట్లయితే, ఆ ప్రేమ స్థితిపై దృష్టి పెట్టడం కొంచెం సులభం, అయినప్పటికీ మీరు మానసికంగా ఏమీ చెప్పకుండా ప్రేమ స్థితిలో కేంద్రీకరించవచ్చు. కాబట్టి, మౌఖికీకరణే సమస్య ఏమీ కాదు. మరోవైపు, పనికిరాని మాటలతో కబుర్లు చెబుతున్నప్పుడు మన మనస్సులను మనం ఖచ్చితంగా శాంతపరచుకోవాలి.

భావత్మక ఆలోచన అంటే విషయాలను మెంటల్ బాక్సులుగా వర్గీకరించడం.

భావజాల సమస్య మౌఖికీకరణ లేదా అవగాహనకు సంబంధించిన సమస్య కాకపోతే, అసలు సమస్య ఏమిటి? భావాత్మక మనస్సు అంటే ఏమిటి మరియు ధ్యాన సూచన దాని నుంచి మనల్ని మనం వదిలించుకోవాలని చెప్పినప్పుడు ఆ అర్థం ఏమిటి? ఈ సూచన ధ్యానం యొక్క అన్ని దశలు మరియు స్థాయిలకు, అలాగే రోజువారీ జీవితానికి సంబంధించినదా? ఈ విషయాలను స్పష్టం చేయడం ముఖ్యం.

భావనాత్మక మనస్సు అంటే "మంచి" లేదా "చెడు", "నలుపు" లేదా "తెలుపు", "కుక్క" లేదా "పిల్లి" లాంటి వాటిని తెలుసుకోవడం ద్వారా వర్గాల పరంగా ఆలోచించడం.

ఇప్పుడు, ఖచ్చితంగా, మనం షాపింగ్ కు వెళ్ళినప్పుడు, ఆపిల్ మరియు నారింజ లేదా పండని పండు మరియు పండిన పండు మధ్య తేడాను గుర్తించగలగాలి. ఇలాంటి రోజువారీ సందర్భాల్లో కేటగిరీల్లో ఆలోచించడం పెద్ద సమస్యేమీ కాదు. కానీ ఇతర రకాల కేటగిరీలు సమస్యగా ఉన్నాయి. దీనినే మనం " ముందస్తు అభిప్రాయం" అని పిలుస్తాము.

ముందస్తు అభిప్రాయానికి ఒక ఉదాహరణ: "నువ్వు ఎప్పుడూ నాతో సరిగ్గా ఉండవని నేను అనుకుంటున్నాను. నువ్వు చాలా భయంకరమైన వ్యక్తివి, ఎందుకంటే గతంలో నువ్వు ఇలాంటి పనులు చేసావు, ఇప్పుడు నేను అనుకుంటున్నాను, ఏది ఏమైనా, నువ్వు భయంకరమైన వ్యక్తిగానే ఉండిపోతావని నేను అనుకుంటున్నాను." ఈ వ్యక్తి భయంకరమైన వాడని మరియు మన పట్ల భయంకరంగా ఉంటాడని మనం ముందే నిర్ణయించాము - ఇది ముందస్తు అభిప్రాయం. మన ఆలోచనల్లో, మనం ఆ వ్యక్తిని "భయంకరమైన వ్యక్తి" అనే వర్గంలో లేదా పెట్టెలో ఉంచాము. అలాగే, మనం అలా ఆలోచిస్తే, "అతను నీచుడు" అనే ఆలోచనను మనం ఎవరికైనా చూపిస్తాము; అతను నా పట్ల ఎప్పుడూ భయంకరంగా ఉంటాడు" అని అనుకుని అప్పుడు మనకు మరియు ఆ వ్యక్తికి మధ్య పెద్ద గ్యాప్ వస్తుంది. అతనితో మన౦ ఎలా స౦బ౦ధాన్ని కలిగి ఉన్నామో మన ముందస్తు అభిప్రాయం ప్రభావిత౦ చేస్తు౦ది. కాబట్టి, ముందస్తు అభిప్రాయం అనేది మనం వర్గీకరించే మానసిక స్థితి; మనం వస్తువులను వాటి మానసిక పెట్టెలలో ఉంచుతాము.

భావరహితంగా ఉండడం

భావరహిత యొక్క అనేక స్థాయిలు ఉన్నాయి, కానీ ఒక స్థాయి ఏమిటంటే, ఒక పరిస్థితి తలెత్తినప్పుడు దానితో బహిరంగంగా ఉండటం. ఇప్పుడు, దాని అర్థం అన్ని భావనాత్మక అవగాహనను వదులుకోవాలని కాదు. ఉదాహరణకు, ఒక కుక్క చాలా మందిని కరిచిందంటే, దాన్ని "కరిచే కుక్క" అని ఆలోచించడం వల్ల, మనం ఆ కుక్క చుట్టూ జాగ్రత్తగా ఉంటాము. ఆ జంతువు చుట్టూ మనకు కొంత సహేతుకమైన జాగ్రత్త ఉంటుంది, కానీ "ఆ కుక్క ఖచ్చితంగా నన్ను కరుస్తుంది, కాబట్టి నేను దాని దగ్గరకు వెళ్ళడానికి కూడా ప్రయత్నించను" అనే ముందస్తు భావన మనకు ఉండదు. మనకు తలెత్తే పరిస్థితిని అంగీకరించడం మధ్య ఇక్కడ ఒక సున్నితమైన సమతుల్యత ఉంటుంది, అదే సమయంలో ఆ పరిస్థితిని పూర్తిగా అనుభవించకుండా నిరోధించే ముందస్తు భావనలు ఉండవు.

అన్ని ధ్యానాలలోనూ అవసరమయ్యే భావరహిత స్థాయి ముందస్తు ఆలోచనలు లేని మనస్సు.

అత్యంత సాధారణ సూచనలలో ఒకటి ఎటువంటి అంచనాలు లేకుండా మరియు ఎటువంటి బాధ లేకుండా ధ్యానం చెయ్యడం. మీ ధ్యాన సెషన్ అద్భుతంగా జరుగుతుందనే ఆశ, మీ కాళ్లు నొప్పిస్తాయనే ఆందోళన లేదా "నేను విజయవంతం కాలేను" అనే ఆలోచనలు ఉండవచ్చు. ఆశ మరియు ఆందోళన యొక్క ఆ ఆలోచనలు మీరు మానసికంగా మౌఖికంగా చెప్పినా చేయకపోయినా అవి ముందస్తు అభిప్రాయాలే. అటువంటి ఆలోచనలు మీ తర్వాతి ధ్యాన సెషన్ కు మానసిక పెట్టె లేదా "అద్భుతమైన అనుభవం" లేదా "బాధాకరమైన అనుభవం" వర్గానికి సరిపోతాయి. ధ్యానం యొక్క భావరహిత విధానం ఏమిటంటే, ఏమి జరిగినా దాన్ని అంగీకరించి ఆ పరిస్థితిపై తీర్పు ఇవ్వకుండా ధ్యాన సూచనల ప్రకారం వ్యవహరించడం.

సారాంశం

వివిధ రకాల భావనాత్మక ఆలోచనలను అర్థం చేసుకోకుండా, అవన్నీ ధ్యానానికి మరియు జీవితానికి కూడా హానికరం అని మనం పొరపాటుగా అనుకోవచ్చు. చాలా ధ్యానాలలో, మన మనస్సులోని గొంతుని శాంతపరచాలి మరియు అన్ని ముందస్తు ఆలోచనలను వదిలెయ్యాలి. కానీ, అత్యంత అధునాతన అభ్యాసకులు మినహా, ధ్యానం లో మరియు బయట దేనినైనా అర్థం చేసుకోవడానికి, దాన్ని మాటలలో పెట్టినా, చేయకపోయినా, దాన్ని మానసిక వర్గంలో ఉంచడం అవసరం.

Top