ధ్యానం యొక్క ప్రధాన లక్షణాలు

ధ్యానం అనేది బౌద్ధమతం మాత్రమే కాదు, ఇది అనేక సంప్రదాయాలలో కనిపిస్తుంది; ధ్యానం యొక్క అనేక అంశాలు అన్ని భారతీయ సంప్రదాయాలలో కనిపిస్తాయి, ఇక్కడ మన సంభాషణను బౌద్ధమతంలోని ధ్యానం చేసే విధానానికి పరిమితం చేసుకుందాం.

ధ్యానం అంటే ఏమిటి?

"ధ్యానం" అంటే మనల్ని మనం అలవాటు చేసుకోవడం అని అర్థం. దీనికి టిబెటన్ పదం, "గోమ్" అని ఉంది, ఇది ఒక ఉపయోగకరమైన అలవాటును నిర్మించడాన్ని సూచిస్తుంది. సంస్కృత మూలమైన "భావన" నిజానికి ఏదో ఒకటి జరగడానికి ఎక్కువ అర్థాన్ని ఇస్తుంది. మనకు ఒక రకమైన ప్రయోజనకరమైన మానసిక స్థితి లేదా ఆలోచన ఉంటుంది. అది జరగాలని మనం అనుకుంటాం. ఇంకో మాటలో చెప్పాలంటే, ఆ మానసిక స్థితి నిజానికి మన ఆలోచనా మరియు జీవన విధానాలలో పనిచేసేలా చేయాలనుకుంటున్నాము. ధ్యానం ఉపయోగించే సాంప్రదాయాన్ని బట్టి, ప్రయోజనకరమైన అలవాట్లు ఏమిటో మరియు వాటిని ఆచరణలో పెట్టడానికి కారణం మరియు లక్ష్యం ఏమిటో సూచనలు ఉంటాయి. అయితే, అన్ని భారతీయ సంప్రదాయాలలో, ఈ ప్రక్రియ మూడు విధాలుగా ఉంటుంది: ముందు వినడం, తర్వాత ఆలోచించడం మరియు చివరిగా ధ్యానం చెయ్యడం.

[దీన్ని చదవండి: ధ్యానం అంటే ఏమిటి?]

బోధనలను వినడం

దయతో ఉండటం అనే ఒక ప్రయోజనకరమైన అలవాటును మనం పెంపొందించుకోవాలని అనుకోండి. కరుణను పెంపొందించుకోవడానికి, లేదా ఇప్పటికే ఉన్న కరుణ భావనను పెంచడానికి, ముందు మనం ఈ విషయంపై కొన్ని బోధనలను వినాలి. ప్రాచీన భారతదేశంలో, బోధనలు ఏవీ రాయబడలేదు. అవన్నీ మౌఖికంగా చెప్పబడ్డాయి. అందుకని, ధ్యానం నేర్చుకునే ఎవరైనా ముందు ఆ బోధనలను వినాల్సి వస్తుంది. అందుకే ఈ మొదటి స్టెప్ ను "వినడం" అని అంటారు.

ఈ రోజుల్లో, నిజానికి, మనం వివిధ బోధనల గురించి చదవవచ్చు దీని వెనుక ఉన్న ఆలోచన చాలా సరైనది. ప్రాచీన కాలంలో, ప్రతిదీ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మరియు చదువుతున్నది సరిగ్గా గుర్తు ఉంటుందో లేదో అని నిర్ధారించుకోవాలి. ఈ బోధనలను చదివే వ్యక్తి దాన్ని సరిగ్గా గుర్తుంచుకోకపోవచ్చు. కొన్ని పొరపాట్లు జరిగితే ఇది నిజంగా ఒక సమస్యగా మారుతుంది.

వివక్షాపూరిత అవగాహన

కాబట్టి, బోధనలను వినేటప్పుడు, మన౦ "వినడ౦ నుంచి వచ్చే విచక్షణా జ్ఞానాన్ని" పె౦పొ౦ది౦చుకోవాలి. టిబెటన్ పదం "షెరాబ్" (షెస్-రబ్, Skt. ప్రజ్నా) "జ్ఞానం" అని ఇది అనువదించబడుతుంది. కాని "జ్ఞానం" అనే పదాన్ని ఉపయోగించడం చాలా అస్పష్టంగా ఉంటుంది; ఎందుకంటే దీనికి ఖచ్చితమైన అర్థం ఉండదు. ఎవరన్నా "జ్ఞానం" అనే పదాన్ని వింటే, ప్రతి వ్యక్తికి దాని అర్థం గురించి వేరే వేరే ఆలోచనలు ఉంటాయి, కాబట్టి "జ్ఞానం" అనే పదం "షెరాబ్" అనే పదాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడదు. అందుకే నేను "షెరాబ్" ను "వివక్షాపూరిత అవగాహన" అని అనువదించడానికి ఇష్టపడతాను.

విచక్షణాత్మక అవగాహన అనేది మనకు ఉండే మానసిక కారణాలపై ఆధారపడి ఉంటుంది, దీనిని నేను "ప్రత్యేకమైనవి" అని అనువదిస్తాను. చాలా మంది ఈ పదాన్ని "గుర్తింపు" అని అనువదిస్తారు, కాని "గుర్తింపు" కూడా సరైన పదం కాదు. “గుర్తింపు" అంటే ఆ వస్తువు మీకు ముందే తెలిసిపోయిందని, ఆ తర్వాత మళ్లీ దాన్ని గుర్తుపడతారని అర్థం; ఇది సరైనది కాదు. "ప్రత్యేకమైనవి" అంటే "దీనిని" ప్రతి దాని నుంచి వేరు చేసి "అన్నిటి లాగా కాదు" అని చెప్పడం. మనం "దీనిని" నుంచి "అన్నిటి లాగా కాదు" లేదా "దీనిని" నుంచి "అది" ని వేరు చెయ్యగలుగుతాము. ఎందుకంటే ప్రతి దానికి నిర్దిష్ట, వ్యక్తిగత లక్షణాలు లేదా నిర్వచించే గుర్తులు ఉంటాయి. అవి మనకు తెలిసినప్పుడే అర్ధం అవుతాయి. ఒక సాధారణ ఉదాహరణ ఏమిటంటే, చిన్న పిల్లలు "ఆకలి" మరియు "ఆకలి వేయకపోవడం" మధ్య తేడాను చూపించగలరు. చిన్న పిల్లలకు ఈ రెండు వేర్వేరు శారీరక అనుభూతులకు పదాలు అవసరం లేదు మరియు వాళ్ళు నిజంగా "ఆకలి" మరియు "ఆకలి లేదు" అనే భావనలను లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదేమైనా, ఆ రెండింటి మధ్య తేడాను వాళ్ళు గుర్తించగలరు ఎందుకంటే ఆ రెండింటిలో ప్రతి దానికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది, అంటే ఒక నిర్దిష్ట రకపు శారీరక అనుభూతి.

వివక్షాపూరిత అవగాహన ఆ ప్రత్యేకతకు ఒక నిర్దిష్ట కారణాన్ని జోడిస్తుంది: "ఖచ్చితంగా అది ఇదే మరియు అది కాదు" అని. బోధనలు విన్నప్పుడు లేదా వాటి గురించి చదివినప్పుడు ఈ భరోసా మనకు అవసరం. తెలుసుకోవడానికి మనకు ఆత్మవిశ్వాసం అవసరం: "ఇది నిజమైన బోధన; ఇది తప్పు బోధన కాదు." "ఇది నిజమైన బోధన" అని తెలుసుకోవడం నిజానికి చాలా కష్టం, ఎందుకంటే గ్రంథాలను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. సాధారణంగా, మనం వాటిని వివరించే పుస్తకం లేదా ఆ ఉపాధ్యాయుడిపై ఆధారపడాలి. కానీ, ఆ ఉపాధ్యాయుడు విశ్వసనీయమైన, ప్రామాణికమైన ఉపాధ్యాయుడు అని మీకు ఎలా తెలుస్తుంది? ఎవరైనా బౌద్ధమతం గురించి బోధించవచ్చు, లేదా ప్రేమ మరియు కరుణ గురించి బోధించవచ్చు. బహుశా వారు బౌద్ధమతానికి విరుద్ధమైన సమాచారాన్ని ఇస్తూ ఉండవచ్చు. విచక్షణా అవగాహనను ఉపయోగించడం ద్వారా, మనం వినే లేదా చదివే బోధన సరిగ్గా అలాగే ఉంటుందని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి; ఇది ప్రామాణికమైన బోధన అని మనం నిర్ధారించుకోవాలి.

బోధన బౌద్ధ మతంగా ఉండాలంటే దానిలో కొన్ని అంశాలు ఉండాలి. రచయిత లేదా దానిని నేర్చుకున్న వ్యక్తి, మనం నమ్ముకోగల వ్యక్తిగా సరైన అర్హతను కలిగిన ఉపాధ్యాయుడు అయి ఉండాలి. దీన్ని తెలుసుకోవడానికి, మన౦ ఇతరులను ఇలా అడగాలి, ఉదాహరణకు: "ఈ వ్యక్తికి వాలిడ్ అయ్యే తన స్వంత గురువు ఉన్నాడా, మరియు వారిద్దరి మధ్య ఉన్న స౦బ౦ధ౦ ఎలాంటిది? అని. ఈ వ్యక్తి యొక్క గురువు కాలానుగుణంగా సరైన ఉపాధ్యాయుల వంశం నుంచి వచ్చాడా?" అనేవి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ప్రశ్నలు. మనం ఇదొక పుస్తకాన్ని తీసుకుని దానిని ఒక గొప్ప వ్యక్తి రాసినంత మాత్రాన, అది నమ్మదగిన సోర్స్ అని అనుకోకూడదు. ఒకరి బోధనను వినేటప్పుడు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది.

బోధనల కోసం వివక్షతను ఉపయోగించడం

అంతేకాకుండా, ప్రతి బౌద్ధమత బోధనకు ఒక సందర్భం ఉంటుంది, ఆ బోధనలు ఉద్భవించిన ఒక తాత్విక పాఠశాల. ఒక నిర్దిష్ట బోధన యొక్క సందర్భం ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే, వివిధ బౌద్ధమత వ్యవస్థలు ఒకే సాంకేతిక పదానికి వేర్వేరు వివరణలను కలిగి ఉన్నాయి, ఉదాహరణకు "కర్మ". అంతేకాక, ఒక నిర్దిష్ట వ్యవస్థలో కర్మపై ఈ బోధనలు ధర్మంలోని అనేక విషయాలను వివరిస్తాయి, ఉదాహరణకు, జ్ఞాన సిద్ధాంతం. బోధనలు ఏ వ్యవస్థ నుంచి వచ్చాయో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి, అలా మనం విన్న ఇతర బోధనలతో వాటిని పోల్చవచ్చు.

సాధారణ సంభాషణలో కూడా ఈ పదాలను ఉపయోగించే సందర్భాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఉదాహరణకు, మీరు "బోన్" అనే పదాన్ని వినే ఉంటారు. ఇది టిబెట్ లో బౌద్ధమత పూర్వ సంప్రదాయానికి పేరు. కానీ ఫ్రెంచ్ భాషలో "బోన్" అంటే "మంచి" అని అర్థం. కాబట్టి, మీకు భాషా సందర్భం తెలియకపోతే "బోన్" అనే పదం మీకు అర్ధం కాదు. ఆ వ్యక్తి బోన్ గురించి ఫ్రెంచ్ లో మాట్లాడుతున్నాడా లేదా టిబెటన్ లో మాట్లాడుతున్నాడా? ఆ పదం ఏ భాషలో ఉందో తెలియకుండా కేవలం ధ్వనిపై ఆధారపడటం మిమ్మల్ని తప్పు దోవ పట్టించడానికి కారణమవుతుంది.

బౌద్ధమత సాంకేతిక పదాలతో వ్యవహరించేటప్పుడు ఈ సందర్భాన్ని తెలుసుకోవడం ఇంకా ముఖ్యమైనది. ఉదాహరణకు, మీరు శూన్యత (శూన్యం) గురించి నేర్చుకోవచ్చు, ఇది ఒక భారతీయ బౌద్ధమత పాఠశాలలో ఒక విధంగా మరియు మరొక పాఠశాలలో వేరొక విధంగా వివరించబడింది. ఒక భారతీయ బౌద్ధమత తత్వశాస్త్ర పాఠశాలలో కూడా, శూన్యతను బౌద్ధమతంలోని వివిధ టిబెటన్ పాఠశాలలు చాలా రకాలుగా  వివరిస్తాయి.

ఒకే విషయానికి సంబంధించి అనేక వివరణలు ఉండటం బౌద్ధమతాన్ని అధ్యయనం చేసే పాశ్చాత్యులకు చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ ఆధునిక యుగంలో, ముఖ్యంగా ఇంటర్నెట్ తో, బౌద్ధమతం యొక్క వివిధ ఆసియా సంప్రదాయాలన్నీ మనకు అందుబాటులో ఉండటం చాలా గందరగోళాన్ని కలిగిస్తుంది. కానీ ఒక దేశం యొక్క బౌద్ధమత సంప్రదాయంలో కూడా - ఉదాహరణకు, టిబెట్ లో - అనేక వైవిధ్యాలు మరియు విభిన్న ఆలోచనా విధానాలు ఉన్నాయి.

ఆ విషయాన్ని నేను వివరిస్తాను. ఒక గురువుతో కలిసి కర్మ గురించి అధ్యయనం చేస్తున్నామని అనుకోండి. మనం ఏమి నేర్చుకుంటున్నామో అని అయోమయానికి గురి కాకుండా ఉండటానికి, ఉపాధ్యాయుడు వివరిస్తున్న విషయాన్ని మిగిలిన సరిగ్గా అర్ధం చేసుకోవాలి. ఉదాహరణకు, మనం బౌద్ధమత వ్యాఖ్యానం గురించి నేర్చుకుంటున్నాము, హిందూ భాష గురించి కాదని తెలుసుకోవాలి. బౌద్ధమత వివరణల నుంచి, మనం భారతీయ సంస్కృత సంప్రదాయానికి సంబంధించి దాన్ని అధ్యయనం చేస్తున్నాము, పాళీ థెరవాడ సంప్రదాయం నుంచి కాకుండా. భారతీయ సంస్కృతి సంప్రదాయాల నుంచి మనం వైభాషిక విధానాన్ని అధ్యయనం చేస్తున్నాం, అంతే కానీ చిత్తమాత్ర విధానాన్ని అధ్యయనం చెయ్యడం లేదు. ఇంకా, మనం వైభాషిక ప్రదర్శన యొక్క గెలుగ్ వివరణ గురించి నేర్చుకుంటున్నాము అంతే కానీ కాగ్యు వివరణ గురించి కాదు. మనం ఖచ్చితమైన సందర్భాన్ని తెలుసుకోవాలి, ఎందుకంటే కర్మ యొక్క విభిన్న వివరణలు తాత్విక సందర్భాన్ని బట్టి చాలా వేరుగా  ఉంటాయి. ఒక ధర్మ అంశానికి సంబంధించిన గెలుగ్ వివరణను కాగ్యు పద్ధతిలో చూడడానికి ప్రయత్నిస్తే, మనం చాలా గందరగోళానికి గురవుతాం. అన్ని అర్ధాలను కలిపి ఒక పెద్ద సూప్ లో వేసి చూడటానికి ప్రయత్నిస్తే, మనం ఇంకా గందరగోళానికి గురవుతాము.

నా గురువులలో ఒకరైన గెషె గావాంగ్ ధార్గే గార పాశ్చాత్యుల గురించి చాలా తెలివైన మాటను ఎత్తి చూపారు. ఆయన ఇలా అన్నాడు: "మీ పాశ్చాత్యులు ఎప్పుడూ రెండు విషయాలను పోల్చడానికి ప్రయత్నిస్తారు, ఈ రెండూ అసలు మీకు ఏమీ అర్థం కావు. చివరికి, మీరు చాలా గందరగోళానికి గురయ్యి ఉంటారు." దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, వివిధ వ్యవస్థలను పోల్చినా కానీ మనకు ఒక వ్యవస్థ గురించి బాగా తెలిసి ఉండాలి. ఒక వ్యవస్థ గురించి మీకు బాగా తెలిసిన తర్వాత మాత్రమే మీరు వేరే వాటిని చూడవచ్చు మరియు వాటిలో తేడాలు ఏమిటో అర్థం చేసుకోవచ్చు, కానీ ఇలా చెయ్యక ముందు మీరు ఏమీ తెలుసుకోలేరు.

కాబట్టి, బౌద్ధమతంలోని కర్మ, శూన్యత లేదా ఇంకేదైనా అంశం గురించి ధ్యానం చెయ్యాలనుకుంటే, మనం వినికిడి నుండి విచక్షణా జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. దీని అర్థం ఖచ్చితంగా తెలుసుకోవాలి:

  • మాట్లాడిన మాటలు ఇవే, ఇంకేమీ కాదు.
  • వారితో మాట్లాడిన వ్యక్తి ఖచ్చితంగా దానికి సంబంధించిన వాడే, నమ్మకం లేని వ్యక్తి కాదు.
  • ఈ తాత్విక వ్యవస్థ నుంచి వివరణ వచ్చింది తప్ప ఇంకేమీ కాదు..

వినికిడి నుంచి వచ్చే విచక్షణా అవగాహన మనకు ఉంటే, ఇంక తర్వాతి స్టెప్ కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టే.

మనం విన్న దాని గురించి ఆలోచించడం

ఆలోచన నుంచి వచ్చే విచక్షణా అవగాహనను పొందడం తర్వాతి స్టెప్. "ఆలోచన" అంటే ఏమిటి? ఇక్కడ ఆలోచించడం అంటే ఏదో ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం. తర్వాత, ఒక విషయాన్ని "అర్థం చేసుకోవడం" అంటే ఏమిటి? టిబెటన్ పదం యొక్క నిర్వచనం సాధారణంగా "అర్థం చేసుకోండి" లేదా "గ్రహించడం" అని అనువదించబడుతుంది: "ఏదైనా ఖచ్చితమైన మరియు నిర్ణయాత్మక విషయం యొక్క సమాచారం."

యాదృచ్ఛికంగా, మెంటల్ యాక్టివిటీ మరియు మనస్సును వివరించడానికి ఉపయోగించే అనేక సంస్కృత మరియు టిబెటన్ పదాలకు మన పాశ్చాత్య భాషలలో మనం ఉపయోగించే పదాలతో పోలిస్తే అసలైన భాషలో చాలా వేరు వేరు అర్థాలు ఉన్నాయి. అందుకే అసలైన ఆసియా భాషలను అధ్యయనం చేసి, ఆసియా భాషా సందర్భంలో పదాల అర్థాలను అధ్యయనం చేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంటే డిక్షనరీ అనువాదాన్ని చదవడమే కాదు, భాషతో పనిచేయడం, డెఫినిషన్లను నేర్చుకోవడం మొదలైనవి. మీరు అలా చేస్తే, బౌద్ధమత బోధనలను అర్థం చేసుకోవడానికి మీకు చాలా శక్తివంతమైన విశ్లేషణ సాధనం లభిస్తుంది.

మాట్లాడిన పదాలను అర్ధం చేసుకోవడం

బోధనలు వినడానికి సంబంధించి "అర్థం చేసుకోండి" అనే పదాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఆ సందర్భంలో, "మీరు ఆ మాటలు చెప్పారని నేను అర్థం చేసుకున్నాను" లాంటి వాక్యాలలో ఇది కనిపిస్తుంది. ఆ వాక్యంలో "మీరు" అనే పదానికి ప్రాముఖ్యత ఉంటే, మీరు నిజంగా ఆ మాటలు చెప్పారని మాకు ఎటువంటి సందేహం లేదని అర్థం. మీరు అలా చెప్పలేదని లేదా వేరే వాళ్లు అన్నారని అనుకోము. మీరు చెప్పేది మేము విన్నాము మరియు మా వినికిడిలో తప్పు లేదని మాకు పూర్తి నమ్మకం ఉంటుంది.

"ఆ పదాలకు" ప్రాముఖ్యత ఇస్తే, "మీరు ఆ మాటలు చెప్పారని నేను అర్థం చేసుకున్నాను" అనే వేరే అర్ధం వస్తుంది: "నువ్వు చెప్పిన ఆ పదాలను నేను అర్థం చేసుకున్నాను. పదాలు మరియు మాటలలో దాగి ఉన్న అర్థాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు - ఇది వేరే పని, కానీ మీరు ఈ పదాన్ని మరియు ఈ మాటని మరియు ఈ వాక్యాన్ని చెప్పారని నేను సరిగ్గా అర్థం చేసుకున్నాను." చెప్పిన మాటలు కచ్చితంగా వినిపించుకునేలా మనం చూసుకోవాలి. మనం విన్న మాటల్నే ఇతరులు విన్నారో లేదో మనం ఇతరులను అడిగి చెక్ చేసుకోవచ్చు. ఏదైనా రికార్డింగ్ ఉంటే, మనం దాన్ని వినొచ్చు. స్పీకరు వాయిస్ మరియు రికార్డింగ్ స్పష్టంగా ఉంటే, మనం వాటిని సరిగ్గా విన్నామనే నమ్మకం ఉంటుంది. వారు అంత స్పష్టంగా చెప్పకపోతే, మనం కొంచెం సహాయం కోసం ఇతరులను అడుగవచ్చు, వాళ్లకు వినిపించిన దాన్ని మనకు వినిపించిన దానితో పోల్చవచ్చు. మనం బోధనల రికార్డింగులపై ఆధారపడుతున్నప్పుడు ఇది నిజానికి చాలా ముఖ్యమైనది. కాబట్టి, వినికిడి నుంచి వచ్చే విచక్షణా అవగాహనను ఉపయోగించి, పదాలను మనం సరిగ్గా అర్థం చేసుకున్నామని తెలుసుకోవచ్చు.

పదాల అర్థాన్ని తెలుసుకోవడం

ఇప్పుడు, ఆలోచన - అవగాహన పొందే మూడు భాగాల ప్రక్రియలో ఇది రెండవ దశ - అంటే పదాల అర్థాన్ని తెలుసుకోవడం ఖచ్చితంగా అవసరం. మనం ఏదైనా ఒక ప్రయోజనకరమైన దాన్ని అలవాటుగా చేసుకోవాలంటే, మనం పదాలను మాత్రమే కాదు, ఆ పదాల అర్థాన్ని కూడా తెలుసుకోవాలి. ఉదాహరణకు, కొంతమంది టిబెటన్ భాషలో మంత్రాలను చదువుతారు మరియు వాటి అర్థం ఏమిటో వాళ్లకు తెలియదు. ఆ పదాల అర్థమేమిటో మీకు కూడా తెలియనప్పుడు ఒక మంచి అలవాటును మీరు ఎలా పెంపొందించుకోగలరు?

చాలా మంది టిబెటన్ బౌద్ధమత గురువులు టిబెటన్ లో ప్రార్థనలు మరియు వివిధ పద్ధతులను చదవాలని రికమండ్ చేస్తున్నారని మీరు చూడొచ్చు. నిజానికి, శతాబ్దాల పురాతన ఆచారంలో పాల్గొనడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి: మీరు ఆ సంప్రదాయానికి చెందినవారని భావిస్తారు, మరియు వివిధ దేశాలు మరియు భాషా నేపథ్యాలకు చెందిన ప్రజలు ఒకే విషయాన్ని జపిస్తున్నారని మరియు చదువుతున్నారని తెలుసుకోవడం మంచిగా అనిపిస్తుంది. కానీ టిబెటన్ భాషలో చదవడం వల్ల టిబెటన్ యొక్క అర్థం తెలుసుకోలేకపోతే ఆ పదాలు ఏమి చెబుతున్నాయి దాని ఉపయోగం ఏమిటో మనకు అర్ధం కాదు. కాబట్టి, మనం ఆ అర్థాన్ని తెలుసుకోవాలి, మరియు ఆ అర్థం ఖచ్చితమైనదిగా మరియు నిర్ణయాత్మకంగా ఉండాలి. అంటే దాని అర్థం కోసం విచక్షణాత్మక అవగాహనను ఉపయోగించడం. పదాల అర్థం ఏమిటో తెలుసుకోవడానికి, విశ్లేషణ మరియు లాజికల్ ప్రక్రియ ద్వారా మనం ఇలా చేస్తాము. 

బోధన యొక్క పదాల అర్థం ఏమిటో తెలుసుకోవడం

నిర్ణయాత్మకమైన అవగాహనను పొందడం గురించి ఆ పాయింట్ చాలా కష్టమైన అంశాన్ని తెస్తుంది: మనం నిజంగా ఒకదానిపై ఎలా నమ్మకం పెట్టుకోగలము? స్పష్టంగా తెలియని, ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేని విషయాన్ని నమ్మాలంటే లాజిక్ మీద ఆధారపడాలి. కానీ కొంతమంది, లాజికల్ వాదన ఎదురైనప్పుడు, వాళ్ళు ఆ లాజిక్ ఏమి రుజువు చేస్తుందో ఇప్పటికీ నమ్మరు. కొన్ని సందర్భాల్లో, వాళ్ళు ముగింపును నమ్మడానికి ఇష్టపడరు, ఇది లాజిక్ తో ఉన్నా కానీ. మనం అలా ఉంటే ధర్మ అధ్యయనానికి మనకు ఎన్నో ఆటంకాలు ఏర్పడతాయి.

కానీ, లాజిక్ యొక్క నిర్ధారణలను మనం అంగీకరిస్తున్నామని ఇప్పుడు అనుకుందాం. విశ్లేషణ మరియు లాజికల్ ప్రక్రియకు ఉదాహరణగా అశాశ్వతాన్ని తీసుకుందాం. కారణాలు మరియు పరిస్థితులపై ఆధారపడి సృష్టించబడినది ఏదైనా చివరికి అంతమవ్వాల్సిందే అని మనం నిరూపించాలనుకుని అర్థం చేసుకోవాలనుకుంటున్నాము. మనం కంప్యూటర్ గురించి, కారు గురించి, మన శరీరం గురించి లేదా వ్యక్తిగత సంబంధం గురించి మాట్లాడుతున్నా, అది కారణాలు మరియు పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.

మీరు ఏదైనా కొని చివరికి పాడయిపోయిన దాని ఉదాహరణలను చూడవచ్చు; అది ఎలాగంటే, మీరు కొన్న కొత్త కారు పాడయిపోవడం, పెరిగిన పువ్వు లేదా పండు కుళ్లిపోవడం లాంటివి. ఈ నిబంధనకు మినహాయింపులు ఏమీ లేవు. ఎప్పుడూ పాడవ్వని మరియు శాశ్వతంగా ఉండిపోయే వస్తువుల లాంటి ఉదాహరణలు లేవు. అది సృష్టించబడితే - అంటే ఇది ఇంతకు ముందు అసలు లేకపోతే - అప్పుడు అది పాడవుతుంది. ఎందుకని? కొత్తగా వచ్చేది కారణాలు, పరిస్థితులపై ఆధారపడి మాత్రమే ఉంటుంది. కానీ ఏదైనా తయారైతే వెంటనే దాని ప్రారంభ స్థితికి సహాయపడే కారణాలు మరియు పరిస్థితులు మారతాయి. అవి కూడా ఇతర కారణాలపై ఆధారపడి ఉన్నాయి కాబట్టి అవి మారాయి. ఆ కారణం వల్ల, ప్రతి క్షణం ఆ వస్తువు తయారవుతూనే ఉండటానికి ఇంక అది లేదు. మరో మాటలో చెప్పాలంటే, ఏదైనా జరగడానికి కారణాలు మరియు పరిస్థితులు లేనప్పుడు, దాని మీద ఆధార పడినవన్నీ పాడయిపోతాయి. ఇది మొదట్లో ఉద్భవించిన స్థితిలో దాని ఉనికిని కొనసాగించడానికి సహాయం చేసినవి లేనందుకు ఇది అలా పాడవుతుంది. దాని స్థితి మారుతుంది ఎందుకంటే ఇది ఇతర కారణాలు మరియు పరిస్థితుల వల్ల ప్రభావితమవుతుంది.

మరో ఉదాహరణ వ్యక్తిగత సంబంధాలు. ఒకరితో సంబంధం అనేక కారణాలు మరియు పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, నేను ఒక వయస్సులో ఉన్నాను, అవతలి వ్యక్తి వేరొక వయస్సులో ఉన్నాడు, నా జీవితంలో ఒకటి జరుగుతోంది, అవతలి వ్యక్తి జీవితంలో వేరేది జరుగుతోంది, ఇలాగే సమాజంలో అందరికి వేరుగా జరుగుతూ ఉంటుంది. ఈ విషయాలన్నీ మనిద్దరం కలుసుకోవడానికి, ఒక సంబంధాన్ని పెంపొందించుకోవడానికి సహాయపడ్డాయి. కానీ ఆ పరిస్థితులు ఎక్కువ రోజులు ఉండవు. అవి ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. మన వయస్సు పెరిగే కొద్దీ మన జీవితాల్లో రకరకాల సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. మనం చాలా కాలం కలిసి ఉన్నా కానీ మనలో ఒకరు వేరొకరి కంటే ముందే చనిపోతారు. కారణాలు మరియు పరిస్థితులపై ఆధారపడటం వల్ల, మన మధ్య ఉన్న సంబంధం ఎప్పుడూ మారుతూనే ఉంటుంది, శాశ్వతంగా ఉండిపోదు. ఇది ముగింపు కానప్పటికీ, మనం లాజిక్ వల్ల ఒకరినొకరు చేరుకున్నాము, మనం ఈ నిజాన్ని అంగీకరించాలని అనుకోవడం లేదు.

ఇంకొక ఉదాహరణలో, మనం ఒక కంప్యూటర్ ను కొంటాము, అది బాగానే ఉండాలని ఎప్పుడూ పాడవ్వకూడదని అనుకుంటాము, కానీ అలాగే జరుగుతుంది. అలా ఎందుకు క్రాష్ అయ్యింది? అది తయారు చెయ్యబడింది కాబట్టి క్రాష్ అయ్యింది. అది క్రాష్ అయ్యినా లేదా పాడయిపోయిన - అది దాని చివరి పరిస్థితి మాత్రమే. అది విరిగిపోవడానికి అసలు కారణం దాన్ని తయారు చెయ్యడమే. "ఈ వ్యక్తి మరణానికి కారణం ఏమిటి? వారి మరణానికి కారణం వారి పుట్టుక" అని చెప్పినట్టు. ఒక జోక్ ఉంది: "జీవితానికి అర్ధం ఏమిటో మీకు తెలుసా? ఇది 100% మరణాల రేటుతో లైంగికంగా సంక్రమించే వ్యాధి" అని. దురదృష్టవశాత్తూ, ఇదే నిజం! అశాశ్వతాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం వంటి ఒక అంశం గురించి ఆలోచిస్తున్నప్పుడు మనం లాజిక్ ని ఉపయోగించినప్పటికీ, తరచుగా చాలా ప్రతిఘటన ఉంటుంది. కొన్నిసార్లు మనకు ప్రెజెంట్ చేసిన సమాచారాన్ని నమ్మడానికి ఇష్టపడము. అశాశ్వతమే జీవిత సత్యం అని మనం అంగీకరించడానికి ఇష్టపడము. ఆ విషయాన్ని లోతుగా అధ్యయనం చెయ్యాలంటే లాజిక్ ను బాగా పరిశీలించాలి.

అప్పుడు, ఆలోచనా ప్రక్రియతో, మనం ఒక "అవగాహనకు" చేరుకుంటాము - దీన్నే "ఆలోచన నుండి వచ్చే విచక్షణాత్మక అవగాహన" అని పిలుస్తారు. మనం ఆ పదాల అర్థాన్ని సరిగ్గా అర్థం చేసుకుని ఉంటాము. మరో మాటలో చెప్పాలంటే, మనం లాజిక్ నుంచి వెళ్ళాము మరియు దాని అర్థం ఏమిటో పక్కన పెట్టేసాము. "అశాశ్వత అంటే నా కంప్యూటర్ పగిలిపోతుందని కాదు. దీని అర్ధం అది కచ్చితంగా ఏదో ఒక సమయంలో పగిలిపోతుందని" అని. కాబట్టి, "సృష్టించబడినవన్నీ విరిగిపోతాయి" అనే నిజాన్ని మనం నమ్మినా నమ్మకపోయినా, కనీసం అశాశ్వత అంటే ఏమిటో మనం సరిగ్గా అర్థం చేసుకుంటాము.

మన౦ విన్న బోధనలు నిజమని మరియు మనకు సహాయపడతాయని నమ్మడ౦

ఆ తర్వాత, మనం విన్న పదాల అర్థం ఏమిటో అని తెలుసుకోవడమే కాకుండా, అది నిజం అని కూడా మనం నమ్మాలి. అశాశ్వతం యొక్క మన ఉదాహరణలో: ఈ పదం యొక్క అర్థాన్ని మనం తెలుసుకోవచ్చు, కానీ ఇది నిజంగా సరైనదా కాదా అని మనం నమ్ముతున్నామా? మనం నిజంగా నమ్ముతున్నామా? మనం అశాశ్వతం గురించి ఆలోచిస్తూ ఉంటే, ఈ రూల్ ని మనం ఖచ్చితంగా తీసిపారెయ్యలేము, అప్పుడు అశాశ్వతం అనేది ఒక ప్రాథమిక నియమం అని మనం నిజంగా నమ్ముతాము. ఆలోచనా విధానం ఇలా ఉండవచ్చు: "నేను ఖచ్చితంగా చనిపోతాను. పుట్టిన వాళ్లంతా చనిపోతారు. పుట్టి చావని వ్యక్తి ఎవరూ లేరు. అందువల్ల, నేను చనిపోనని నమ్మడానికి ఏదైనా కారణం ఉందా? లేదు, అస్సలు లేదు."

ఏదో ఒక సమయంలో మనం చనిపోతామని నమ్మితే ఈ జీవితాన్ని సాధ్యమైనంత అర్థవంతంగా మార్చుకునే ప్రయత్నం చేస్తాం. ఎవరైనా మరణానికి దగ్గరగా వెళ్లి వస్తే, అప్పుడు వాళ్ళు ఇలా అనుకుంటారు, "హే, నేను ఇంకా బతికే ఉన్నాను, మరియు నేను నా మిగిలిన జీవితాన్ని సాధ్యమైనంత అర్థవంతంగా గడపాలనుకుంటున్నాను." కానీ మన మరణాన్ని నమ్మడానికి మరియు మన మిగిలిన సమయాన్ని ఉపయోగించుకోవాలనే నమ్మకాన్ని ఏర్పరచుకోవడానికి మరణానికి దగ్గరగా ఉన్న అనుభవం కోసం మనం వేచి ఉండాల్సిన అవసరం లేదు.

కాబట్టి, ఆలోచించడం ద్వారా, మనం దాని అర్థాన్ని సరిగ్గా మరియు ఖచ్చితంగా అర్థం చేసుకుంటాము. తర్వాత, ఇది నిజం అని మనం నమ్ముతాము. మూడవది, దీన్ని నిజంగా గ్రహించడం మరియు నా జీవితంలో దీనిని ఒక భాగంగా చెయ్యడం నాకు ఉపయోగపడుతుందని నమ్మడం.

ఇవన్నీ - అర్థాన్ని తెలుసుకోవడం, అది నిజం అని నమ్మడం మరియు అది సహాయపడుతుందని నిర్ధారించుకోవడం అనే ఆలోచన నుండి వచ్చే వివక్ష అవగాహనను అభివృద్ధి చేయడంలో భాగమే. ఇది చాలా ముఖ్యమైన ప్రక్రియ మరియు దీనికి చాలా సమయం పడుతుంది. నిశ్శబ్దంగా కూర్చొని మనం విన్న, చదివిన బోధనల గురించి మనం లోతుగా ఆలోచించాలి. అలా చెయ్యకుండా, మనం అశాశ్వతను ధ్యానించడానికి ప్రయత్నిస్తే, ఉదాహరణకు, మనకు ఏమి చెయ్యాలో తెలియక అక్కడే కూర్చొని ఉండిపోవాల్సి వస్తుంది. మనం అప్పుడు ఒక నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోతాము - దీనినే మనం "స్పేస్ అవుట్" అని పిలుస్తాము - మరియు దాన్ని ధ్యానంగా భావిస్తాము. అది ధ్యానం కాదు. అలాంటప్పుడు, ధ్యానం అంటే ఏమిటి?

మూడు రకాల ధ్యానాలు

బోధనలను వినడం ద్వారా మరియు వాటి గురించి ఆలోచించడం ద్వారా, ఈ రెండింటితో సంబంధం ఉన్న వివక్షాపూరిత అవగాహనను మనం ఎలా అభివృద్ధి చేస్తామో, ధ్యానం మనకు "ధ్యానం నుండి ఉత్పన్నమయ్యే విచక్షణాత్మక అవగాహనను” అందిస్తుంది. ఈ అవగాహనతో, మనం అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రయోజనకరమైన మానసిక స్థితిని పూర్తి ఏకాగ్రతతో సృష్టించగలుగుతాము మరియు దానిని నిర్ణయాత్మకంగా మరియు ఖచ్చితంగా అన్ని ఇతర మానసిక స్థితుల నుంచి వేరు చెయ్యగలుగుతాము. ఈ విచక్షణా జ్ఞానాన్ని పొందడానికి, మనం కోరుకున్న మానసిక స్థితిని పదే పదే సృష్టించే అలవాటులో పడతాము. మనం దీన్ని చెయ్యడానికి అనేక రకాల ధ్యానాలు ఉన్నాయి, కానీ మూడు అత్యంత సాధారణ రకాలను మాత్రమే మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక వస్తువుపై దృష్టి పెట్టడం

ధ్యానంలోని మొదటి రకం ఒక వస్తువుపై దృష్టి పెట్టడం. మనం ఏ వస్తువుపైనైనా దృష్టి పెట్టి ఆ వస్తువుపై ఏకాగ్రతను అభివృద్ధి చెయ్యడానికి ప్రయత్నిస్తాము. అది లోపలికి మరియు బయటకు వెళ్ళే శ్వాస యొక్క అనుభూతిపై దృష్టి పెట్టడం అవ్వొచ్చు లేదా ఊహించుకున్న బుద్ధుడిపై దృష్టి పెట్టడం అవ్వొచ్చు లేదా మనస్సు యొక్క స్వభావంపై దృష్టి పెట్టడం అవ్వొచ్చు. అయినా ఇప్పటికీ ఒకే వస్తువుపై దృష్టి ఉంటుంది. టిబెటన్ బౌద్ధమతంలో ఏకాగ్రతను పెంపొందించడానికి ఈ మూడు సర్వసాధారణంగా ఉపయోగించే వస్తువులు.

ఈ రకమైన ధ్యానం యొక్క ఒక ముఖ్యమైన వైవిధ్యం ఏమిటంటే, ఏకాగ్రతతో ఒక వస్తువుపై దృష్టి పెట్టి దాని గురించి ఆలోచించేటప్పుడు, దాన్ని సరైన మార్గంలో గుర్తించడానికి ప్రయత్నించండి, ఉదాహరణకు అశాశ్వతాన్ని. ఈ విచక్షణతో ఈ వస్తువుపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా, అది వాస్తవానికి అశాశ్వతం అని మనకు అర్థం అవుతుంది. ఏదో ఒక దానితో దగ్గరయ్యిన భావనను అధిగమించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

ఇంకొక ఉదాహరణను చూద్దాం: మీకు ఎవరితోనైనా మంచి స్నేహం లేదా సంబంధం ఉంటే, అతను మనకు కాల్ చెయ్యకుండా లేదా మనల్ని కలవకుండా ఉంటే, అప్పుడు మీరు చాలా బాధ పడతారు. ఈ ఉదాహరణలో, మీరు ఈ నిజాన్ని అర్థం చేసుకుని పూర్తిగా నమ్మాలి: "నా స్నేహితుడి జీవితంలో ఉన్న వ్యక్తి నేను మాత్రమే కాదు. అతని జీవితంలో నేను కాకుండా చాలా మంది ఉన్నారు. అందుకని, అతను తన సమయాన్ని నాకే ప్రత్యేకంగా కేటాయిస్తాడు మరియు ఇంకెవరిని పట్టించుకోడు అని అనుకోవడం అసలు సరైన ఆలోచన కాదు అని. ఇక్కడ మీరు అసాధ్యమైన దాని యొక్క ఊహాజనిత అంచనాలను సవాలు చేస్తున్నారు, అంటే: "నా స్నేహితుడి జీవితంలో ఉన్న వ్యక్తిని నేను మాత్రమే" అని. కాబట్టి, మీ స్నేహితుడు మీతో సరిగ్గా ఉండనప్పుడు మీరు బాధపడితే, మీరు అతని గురించి విచక్షణతో ఆలోచించడానికి ప్రయత్నిస్తారు: "అతనికి తన జీవితంలో నేను కాకుండా వేరే వ్యక్తులు మరియు విషయాలు జరుగుతున్నాయి" అని.

కాబట్టి, మనం ధ్యానం గురించి మాట్లాడుతున్నప్పుడు, ఒక రకమైన మార్మిక, మాయా ప్రక్రియ లాంటి దాని గురించి మాట్లాడటం లేదు; మనం ఫాంటసీ దేశంలోకి వెళ్ళడం లేదు. దానికి బదులుగా, ధ్యానం మన జీవితంలోని బాధలు, ఇబ్బందులు మరియు సమస్యలను ఎదుర్కోవటానికి మంచి పద్ధతులను ఇస్తుందని అనుకుంటాము.

కాబట్టి, ధ్యానంలోని మొదటి రకం, ఒక నిర్దిష్ట మార్గంలో, కేవలం ఏకాగ్రతతో లేదా అవగాహనతో కూడిన విచక్షణతో ఒక వస్తువుపై దృష్టి పెట్టడం, మన స్నేహితుడిపై దృష్టి పెట్టినట్లు.

ఒక మానసిక స్థితిని సృష్టించడం

ధ్యానంలోని రెండవ రకం ఒక మానసిక స్థితిని సృష్టించడం. ఉదాహరణకు, ప్రేమ లేదా కరుణను సృష్టించడానికి మరియు దానిని అనుభవించడంపై దృష్టి పెట్టడానికి చేసేది. ఈ ప్రేమ లేదా కరుణను మనం లక్ష్యంగా చేసుకున్నట్లు కాదు; దానికి బదులుగా, ఇక్కడ ఒక భావోద్వేగం లేదా అనుభూతిని పెంపొందించుకోవడం.

ఒక స్ఫూర్తిని పెంపొందించుకోవడం

ధ్యానంలోని మూడవ రకం ఒక ఆశయానికి సంబంధించిన లక్ష్యాన్ని చేరుకోవాలనే ఆకాంక్షతో దానిపై దృష్టి పెట్టడం; ఉదాహరణకు, "నేను దానిని సాధించబోతున్నాను" అనే ఆకాంక్షతో, ఇప్పటివరకు లేని మన స్వంత వ్యక్తిగత జ్ఞానోదయంపై దృష్టి పెట్టడం. దీన్నే "బోధిచిత్త ధ్యానం" అని అంటారు. మనం బోధిచిత్తపై ధ్యానం చేస్తున్నప్పుడు, కొన్నిసార్లు "మేలుకొలుపు మనస్సు" అని ఇది అనువదించబడినప్పుడు, మనం దృష్టి పెట్టేది సాధారణంగా జ్ఞానోదయం లేదా బుద్ధుని జ్ఞానోదయంపై ఉండదు, మన స్వంత వ్యక్తిగత జ్ఞానోదయంపై దృష్టి పెడతాము. మనకు జ్ఞానోదయం ఇంకా కాలేదు, కానీ అలా జరగవచ్చు - అది జరుగుతుందని మనం నమ్ముతాము - మన బుద్ధ-స్వభావపు సామర్థ్యం మరియు చాలా కష్టంతో ఇలా సాధ్యపడుతుంది. కాబట్టి, ఈ మూడవ రకపు ధ్యానంతో, మనం భవిష్యత్తు లక్ష్యాన్ని సాధించాలని అనుకుంటాము.

మన జీవితంలో మూడు రకాల ధ్యానాలు

ఈ ధ్యానంలోని ఈ మూడు రకాల వల్ల మన రోజువారీ జీవితంలో కావాలనుకుంటున్న ఉపయోగకరమైన అలవాట్లను మనం అభివృద్ధి చేసుకోవాలని అనుకుంటున్నాము. ధ్యానం అనేది మన జీవితాలతో సంబంధం లేని ఒక రకమైన పద్ధతిగా ఉండకపోవడం చాలా ముఖ్యం. ధ్యానం అనేది ఒక రకంగా తప్పించుకునేది కాదు; ఇది ఒక ఆట కాదు; హాబీ కూడా కాదు. ఇది మన జీవితంలోకి తీసుకురావాలనుకునే మరియు ప్రతిరోజూ ఉపయోగించాలనుకునే లక్షణాలను అభివృద్ధి చేసుకోవడానికి సహాయపడే ఒక పద్ధతి.

ఇప్పుడు చెప్పిన ఈ ఉదాహరణలను ఉపయోగించి ఈ మూడు పద్ధతులను మనం ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. మనం ఒక వస్తువుపై దృష్టి పెట్టి మొదటి రకపు ధ్యానాన్ని మొదలుపెట్టినప్పుడు, మన మనస్సులను శాంతపరచుకుని ఏకాగ్రత సామర్థ్యాన్ని పెంచడం నేర్చుకుంటాము. మన పని మీదే కాకుండా పక్కన వాళ్లతో మాట్లాడేటప్పుడు కూడా మనం ఇదే నేర్చుకుంటాం. మనం ఆ వ్యక్తి మీద, అతను చెప్పేదాని మీద దృష్టి పెట్టాలే తప్ప, మన మనస్సులో వేరే విషయాల గురించి అస్సలు ఆలోచించకూడదు. "ఓహ్, అది నిజంగా తెలివితక్కువ పని" లేదా "అతను నోరు మూసుకుంటే బాగుంటుంది" అని అతను చెప్పిన మాటలను జడ్జ్ చెయ్యకుండా, ఎటువంటి కామెంట్లు చెయ్యకుండా వినాల్సి ఉంటుంది. మన మనసులో ఉండే ఆలోచనలన్నిటినీ శాంత పరచుకోవాలి. విచక్షణతో మన ఏకాగ్రతను ఈ వ్యక్తిపై మరియు ఇతని మాటలపై ఉంచవచ్చు: "నువ్వు కూడా నాలాగే ఒక మనిషివి, మరియు నీకు ఫీలింగ్స్ ఉంటాయి; నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను నిన్ను ఎలా పట్టించుకోవాలని అనుకుంటావో, నేను మాట్లాడేటప్పుడు కూడా అలాగే అనుకుంటాను." అనేదే ఏకాగ్రత ధ్యానం నుంచి మనం శిక్షణ తీసుకునేది.

మనం జీవితంలో మనకున్న ప్రేమను, కరుణను పెంపొందించుకునే మానసిక స్థితిని సృష్టించడానికి రెండవ రకపు ధ్యానాన్ని మనం ఉపయోగించవచ్చు. మనం ఎక్కడ ఉన్నా, ఎవరితో ఉన్నా ప్రేమను పెంపొందించడానికే పనిచేస్తాం - అందరూ సంతోషంగా ఉండాలనే ఒక కోరికతో. ఇక్కడ ప్రేమ నిజంగా ప్రతి ఒక్కరి పట్ల చూపిస్తుంది: బస్సులో ప్రతి ఒక్కరితో, సబ్ వేలో ప్రతి ఒక్కరితో, ట్రాఫిక్లో ప్రతి ఒక్కరితో, దుకాణంలో ప్రతి ఒక్కరితో, అన్ని జంతువులతో మరియు కీటకాలతో - అందరితో. అంటే అందరిపై గౌరవం పెంచుకోవడం. అందరూ సమానమే, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకోవడం మరియు బాధలో ఉండకూడదని అనుకోవడం. ఈగతో సహా సంతోషం పొందడానికి ప్రతి ఒక్కరికి సమాన హక్కు ఉంది!

చివరగా, మన జీవితానికి కావలసిన ఆకాంక్షను అభివృద్ధి చేసుకోవడానికి మనం ధ్యానాన్ని ఉపయోగిస్తాము: "నేను ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నాను. నా తప్పులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాను. నేను మంచి లక్షణాలను పెంపొందించుకోవడానికి కష్టపడుతున్నాను, మరియు నేను విముక్తి మరియు జ్ఞానోదయం పొందడం కోసం కృషి చేస్తున్నాను" అని. ఈ ఆకాంక్ష మన జీవితం మొత్తం ఉంటుంది, మనం కుషన్ మీద కూర్చున్న కొంత సమయం మాత్రమే కాకుండా.

ఒక ప్రయోజనకరమైన మానసిక స్థితిని అభివృద్ధి చేయడంపై సోంగ్ ఖాపా గారి సలహా

ధ్యానం గురించి మనం నిజంగా తెలుసుకోవాల్సిన విషయాలను గొప్ప టిబెటన్ గురువు సోంగ్ ఖాపా గారు చాలా బాగా వివరించారు; మరో మాటలో చెప్పాలంటే, ధ్యానానికి పునాదిగా ఒక ప్రయోజనకరమైన మానసిక స్థితిని ఎలా అభివృద్ధి చేసుకోవాలి అని వారు వివరించారు.

మీరు దేనిపై దృష్టి పెడుతున్నారో తెలుసుకోండి

ముందుగా మనం దేనిపై దృష్టి పెడుతున్నామో తెలుసుకోవాలి. కరుణను ఒక ఉదాహరణగా తీసుకుందాం. కరుణపై దృష్టి పెడుతున్నప్పుడు, ఇతరుల బాధల గురించి పట్టించుకుంటాము. ఇది బోధిచిత్త నుంచి చాలా వేరుగా ఉంటుంది, దీనిలో మనం ఇంకా జరగని మన స్వంత జ్ఞానోదయంపై దృష్టి పెడుతున్నాము. కొంతమంది తాము బోధిచిత్త గురించి ధ్యానం చేస్తున్నామని అనుకుంటారు, నిజానికి వారు కరుణ కోసమే ధ్యానం చేస్తున్నారు; కరుణ అనేది బోధిచిత్తకు పునాది, కానీ కరుణ మరియు బోధిచిత్త అనేవి వేరుగా ఉంటాయి.

దానిలో ఉండే అన్ని విషయాలను తెలుసుకోండి

దృష్టి యొక్క ఖచ్చితమైన విషయాన్ని తెలుసుకున్న తర్వాత - ఈ సందర్భంలో, కరుణ యొక్క కేంద్రంగా ఇతరుల బాధ - ఆ తర్వాత మనం ఆ వస్తువు యొక్క అన్ని అంశాలను తెలుసుకోవాలి. అలా మనం  ప్రతి ఒక్కరూ అనుభవించే వివిధ బాధల రకాలను తెలుసుకుంటాము: దుఃఖం, మన సాధారణ ఆనందం, కర్మ యొక్క బలవంతపు నియంత్రణలో ఉండటం మరియు నియంత్రణలో లేని రిపీట్ అయ్యే పునర్జన్మ యొక్క బాధ. కేవలం కొందరు తమ ఉద్యోగాలను కోల్పోవడం వల్ల పడే బాధలు, కష్టాల లాంటి ఒక పరిమిత రకపు బాధలపై మాత్రమే మనం దృష్టి పెట్టడం లేదు. గొప్ప కరుణతో, జంతువులతో సహా ప్రతి ఒక్కరూ విశ్వవ్యాప్తంగా అనుభవించే బాధలపై మనం దృష్టి పెడతాము.

మన మనస్సు దానితో ఎలా సంబంధాన్ని కలిగి ఉందో తెలుసుకోండి

తర్వాత, మన మనస్సు ఆ వస్తువుతో ఎలా సంబంధాన్ని కలిగి ఉందో తెలుసుకోవాలి. కరుణతో, మన మనస్సు ఇతరుల బాధలన్నింటిపై దృష్టి పెట్టి అవి పోవాలని మరియు ఎప్పటికీ తిరిగి రాకూడదని అనుకుంటుంది. ఇది "అయ్యో ఎంత భయంకరమైనది" అనే ఆలోచన లాగా ఉండదు. కానీ, ఈ ఆలోచన బోధిచిత్తకు చాలా వేరుగా ఉంటుంది. బోధిచిత్తతో, మనం ఇంకా పొందని జ్ఞానోదయంపై దృష్టి పెడుతున్నాము, మరియు మనం దానితో సంబంధాన్ని కలిగి ఉన్నాము: "నేను దానిని సాధించబోతున్నాను మరియు ఆ సాధన ద్వారా ఇతరులకు ప్రయోజనం కలుగుతుంది" అని. ఇతరుల బాధల పట్ల జాలితో మన౦ ఏమి అనుకుంటామో అనే దానికి ఇది చాలా వేరుగా ఉ౦టు౦ది.

దీనిని అభివృద్ధి చెయ్యడానికి ఏది సహాయపడుతుందో తెలుసుకోండి

అప్పుడు ఈ మానసిక స్థితిని పెంపొందించుకోవడానికి మనకు ఏది సహాయపడుతుందో తెలుసుకోవాలి. మన ఉదాహరణలో, మన స్వంత బాధ పట్ల ఒకే ఉద్దేశాన్ని లేదా భావాన్ని కలిగి ఉండడ౦ ద్వారా కరుణకు సహాయం కలుగుతుంది. దీన్నే "స్వేచ్ఛగా ఉండాలనే సంకల్పం" అని పిలుస్తారు, సాధారణంగా దీన్ని "త్యాగం" అని అంటారు. ఇది మన స్వంత బాధపై దృష్టి పెడుతుంది మరియు ఆ బాధ నుంచి మరియు దాని కారణాల నుంచి విముక్తి పొందాలని అనుకుంటుంది. బాధ యొక్క కారణాల నుంచి విముక్తి పొందాలని కోరుకోవడం అంటే కోపం వచ్చి బాధకు గురిచేసే ప్రవర్తనను విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండటం. మన౦ బాధల ను౦చి విముక్తులమనే దృఢ సంకల్పాన్ని నిజంగా పె౦పొ౦ది౦చుకోగలిగితే, ఆ ఆలోచనను, ఆ కోరికను మన౦ మన మీదే ఉన్న తీవ్రతతో ఇతరుల వైపు మళ్ళి౦చడానికి అది సహాయ౦ చేస్తు౦ది.

దీన్ని అభివృద్ధి చెయ్యడానికి ఏది అడ్డుకుంటుందో తెలుసుకోండి

ఈ మానసిక స్థితి అభివృద్ధికి ఏది ఆటంకం కలిగిస్తుందో కూడా మనం తెలుసుకోవాలి. ఇతరులను సీరియస్ గా తీసుకోకపోవడం, వారి బాధలను అర్ధం చేసుకోకపోవడం కరుణ అభివృద్ధికి అడ్డు పడుతుంది. దాన్ని ఎదుర్కోవాలంటే మనం ఇలా ఆలోచించాలి, "ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఎవరూ అసంతృప్తిగా ఉండాలని అనుకోరు. బాధల నుంచి విముక్తి పొందాలనే కోరికలో ఎవరూ వేరుగా ఉండరు. మనమంతా ఒక్కటే. నాకు ఫీలింగ్స్ ఉన్నట్లే అందరికీ ఫీలింగ్స్ ఉంటాయి. నా బాధ నన్ను ఎంత బాధిస్తుందో బాధ పడుతున్న ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుంది. నేను నా బాధల నుంచి విముక్తి పొందాలని కోరుకున్నట్లే, వాళ్ళు కూడా వాళ్ల బాధల నుంచి విముక్తి పొందాలని కోరుకుంటారు" అని. ఈ విధంగా, మనం ఇతరుల పట్ల సున్నితత్వాన్ని మరియు గౌరవాన్ని పెంపొందించుకుంటాము. మనకు ఆ సున్నితత్వం, గౌరవం లేకపోతే, మన చిత్తశుద్ధి గల కరుణ అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది.

దాని యొక్క ఉపయోగాన్ని తెలుసుకోండి

ఒకసారి మనం ఈ మానసిక స్థితిని పెంపొందించుకుంటే, దానితో మనం ఏమి చెయ్యాలో అని సోంగ్ ఖాపా గారు చెప్పారు. మరో మాటలో చెప్పాలంటే, దాని ఉపయోగం ఏమిటి. నేను కరుణను పెంపొందించుకుంటాను, ఆ తర్వాత ఏమిటి? సరే, ఇతరులతో వ్యవహరించడానికి ఇది నాకు సహాయం చేస్తుంది; వారి ప్రయోజనం కోసం పనిచేయడానికి ఇది నాకు సహాయపడుతుంది; మరియు ఇది నిజంగా నన్ను ప్రేరేపించి జ్ఞానోదయం యొక్క అంతిమ లక్ష్యాన్ని సాధించడానికి నన్ను ప్రేరేపిస్తుంది, అలా నేను ఇతరులకు బాగా సహాయం చెయ్యగలను. ఇప్పుడు వారికి సహాయం చెయ్యడానికి నన్ను ఆపేది నా అడ్డంకులు అని నేను అర్థం చేసుకున్నాను, కాబట్టి నేను నా అడ్డంకులను అధిగమించాలని అనుకుంటున్నాను."

ఇది దేన్ని ఎలిమినేట్ చేస్తుందో తెలుసుకోండి

మనం తెలుసుకోవాల్సిన తర్వాతి విషయం ఏమిటంటే: ఈ మానసిక స్థితి దేనిని తొలగిస్తుంది లేదా వదిలించుకుంటుంది అని. నేను ఇతరులను పట్టించుకోకుండా ఉంచుకునే హృదయాన్ని ఈ కరుణ తొలగిస్తుంది. ఇతరులకు సహాయం చెయ్యకూడదనే బద్దకాన్ని నాపై పని చేసుకోవడానికి ఆపే బద్దకాన్ని కూడా వదిలించుకోవడానికి ఇది నాకు సహాయపడుతుంది. ఇలాంటి ఫీలింగ్స్ ని తొలగించి నేను ఇతరులకు ఇంకా సహాయం చెయ్యగలను. కరుణను పెంపొందించుకోవడానికి మరియు ధ్యానించడానికి ఈ విషయాలన్నీ మనకు తెలిస్తే, మనం ఈ ధ్యానాన్ని సరిగ్గా చేసుకుని చాలా నమ్మకంగా ఉండవచ్చు. మనం ఏమి చేస్తున్నామో మరియు ఎందుకు చేస్తున్నామో ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ ధ్యానంలో పాల్గొనడానికి మనం సరిగ్గా సిద్ధంగా ఉన్నాము. కాకపోతే, ఇది ఈత రాకపోయినా లోతైన స్విమ్మింగ్ పూల్ లో దూకడం లాంటిది. "అలాగే, కూర్చొని ధ్యానం చెయ్యండి" అని చెప్పి, ఏమి చెయ్యాలో మనకు తెలియకపోతే, మనం అనుకున్న ఫలితం వచ్చే అవకాశాలు చాలా బాగుంటాయి.

Top