ధర్మ బోధనలను వినడం

ధ్యానం ఏమి చేస్తుంది

ధ్యానం అనేది మన జీవితాలను మార్చడానికి మరియు మెరుగుపరచడానికి ఒక మంచి పద్ధతి. అది ఎలా? అవును, మన జీవితాలు అనేవి మన వ్యక్తిత్వాలు మరియు మూడ్స్ ద్వారా, మన జీవన మరియు ఆర్థిక పరిస్థితి, మనం సమయం గడిపే వ్యక్తులు మొదలైన వాటి వల్ల కూడా ప్రభావితమయ్యాయి. మనకు జీవితం గురించి ఏమైనా అనుభవం ఉంటే, పని, సంపద మరియు స్నేహితులు లాంటి బయటి విషయాలలో మార్పులు ఉన్నప్పటికీ, మన ఆలోచనలు మరియు మానసిక స్థితి ఒకేలా ఉంటే, మనకు ఎప్పుడూ ఒకే రకమైన సమస్యలు ఉంటాయని తెలుస్తుంది. మనకు ఎంతమంది స్నేహితులు ఉన్నా కానీ, మనం ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతాం. మనం నిజంగా ధనవంతులం అయినా కాకపోయినా మనకు కోపం, చిరాకు రావచ్చు. ఇవి కేవలం మన బయటి పరిస్థితులను మార్చుకున్నంత మాత్రాన మారిపోవు.

ధ్యానం ఇక్కడ మనకు సహాయపడుతుంది ఎందుకంటే మన జీవన నాణ్యతలో నిజమైన మార్పును తీసుకురావాలంటే మన మనస్సుపై మనం పని చెయ్యాలి. ఇది కేవలం మేధస్సు లక్షణాలను లేదా ఏకాగ్రతను పెంపొందించుకోవడం మరియు సోమరితనాన్ని అధిగమించడంపై మాత్రమే ఆధారపడి కాదు. మనం పని చేయడానికి ఇవి ముఖ్యమైన విషయాలు, కానీ మన భావోద్వేగ పరిస్థితి పరంగా మనం ఇంకా లోతుగా వెళ్ళాల్సి ఉంటుంది: మన ప్రాథమిక అభద్రత మరియు జీవితం గురించి ఉండే గందరగోళం గురించి కూడా ఆలోచించాలి.

బౌద్ధమత సందర్భంలో ధ్యానం

ఇప్పుడు, మనం బౌద్ధమతంలోనే కాదు, అనేక విభిన్న వ్యవస్థలలో కూడా ఈ ధ్యానాన్ని చూడవచ్చు. బౌద్ధమత సందర్భంలో, ధ్యానం అనేది ఒక రిపీట్ చేసే పద్ధతిని ఉపయోగించి సానుకూల మానసిక స్థితిని పొందడం అనే అర్థాన్ని కలిగి ఉంటుంది. ఇది అథ్లెటిక్ శిక్షణ లేదా ఒక సంగీత వాయిద్యాన్ని నేర్చుకోవడం లాంటిది. అక్కడ మనం విషయాలను పదే పదే రిపీట్ చెయ్యాలి, కానీ ధ్యానంలో, దాన్ని సృష్టించి ఒక సానుకూల మానసిక స్థితిని పొందాలి. మొదట్లో, ఇది బలవంతంగా మరియు కృత్రిమంగా అనిపించవచ్చు, కాని చేస్తున్న కొద్దీ అది మనలో సహజమైన భాగంగా మారుతుంది అని మనకు తెలుస్తుంది.

ఈ విధంగా జరిగినంత మాత్రాన దానిలో ఏదో తేడా ఉందని అర్థం కాదు. మనం ఒక కొత్త మానసిక స్థితిని పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తుంటే, అది సహజమైనది కాదని మనం అనుకోకూడదు. మనల్ని మనం మార్చుకునే ప్రయత్నం చేయకుండా సహజంగానే ఉండటమే మంచిదని చాలా మంది భావిస్తుంటారు. కానీ మనం ఒక సహజ స్థితిలో ఉంటే, మనం ఇప్పటికీ మన ప్యాంటులో కాల కృత్యాలు చేస్తూ ఉండేవాళ్లం. కానీ మన జీవితాలను మెరుగుపరచడానికి మనం వివిధ పద్ధతులలో శిక్షణను పొందాము. మన మనస్సుతో కూడా మనం అదే చేయగలం మరియు అలానే చెయ్యాలి.

మనం మామూలుగానే ఉంటే అంతా సర్దుకు పోతుంది అనే ఆలోచనను మనం ఉపయోగించుకోకూడదు. ఎందుకంటే సహజంగా ఉండటం ఎప్పుడూ మంచి ఫలితాలను తెచ్చిపెట్టదు. ఒక బిడ్డ ఏడుస్తుంటే, నేను నా నిగ్రహాన్ని కోల్పోయి ఆ గోలను ఆపడానికి ఆ బిడ్డను కొట్టాలని సహజంగా అనిపిస్తుంది; అది నిజంగానే మంచి పనా, కాదు కాదా? అర్ధరాత్రి ఆ బిడ్డ అరవడం ప్రారంభించినప్పుడు సహజంగా వచ్చే మొదటి ఆలోచన కొట్టడమే అయినప్పటికీ, ఇలా చెయ్యటం మంచి పని  కాదని మనకు తెలుసు.

కాబట్టి, మనకు ధ్యానం అనేది ఉంది, ఇది బౌద్ధమతం యొక్క అధ్యయనం మరియు ఆచరణలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. అధ్యయనం మరియు ధ్యానం రెండు వేర్వేరు విషయాలు అని ప్రజలు ఎప్పుడూ తప్పుగా భావిస్తారు, కాని బౌద్ధమత బోధనలలో ఇది అస్సలు నిజమే కాదు.

ఉపయోగకరమైన అలవాట్లను పెంపొందించుకోవడం

ఉపయోగకరమైన అలవాట్లను పెంపొందించుకోవడానికి, అవి ఏమిటో అసలు మనం తెలుసుకోవాలి, కానీ ఇదే ఆఖరిది కాదు. దాన్ని మనలో ఒక భాగంగా చేసుకోవాలి, ఆ పనినే ధ్యానం చేస్తుంది. ఒక పదార్ధాన్ని మనం నోట్లో వేసుకుని, నమలకపోతే దాన్ని ఎలాగైతే జీర్ణించుకోలేమో, బోధనలను కూడా మన మనస్సులో ఉంచుకుని వాటి గురించి ఆలోచించకపోతే, ధ్యానం చేసి వాటిని జీర్ణించుకోలేము. ఆహారం లాగా, కేవలం నమిలేసి తర్వాత ఉమ్మి వేయడంలో అర్థం ఏమీ లేదు. దాని ప్రయోజనం పొందాలంటే ఆ ఆహారాన్ని మింగి జీర్ణించుకోవాలి.

మనం ధ్యానం చేయడం ఎలా ప్రారంభించాలి? మనం చూసినట్లుగా, ధ్యానం అనేది మూడు భాగాల ప్రక్రియలో చివరి దశ. హిందూ సంప్రదాయంలో ఉన్న ఉపనిషత్తుల మాదిరిగానే ఈ రకమైన విషయం అన్ని భారతీయ వ్యవస్థలలో కనిపిస్తుంది. బౌద్ధమతంలో మనం ఉపయోగించే చాలా పద్ధతులు ఇతర సాంప్రదాయ భారతీయ వ్యవస్థలతో సమానంగా షేర్ చేయబడ్డాయని చాలా మందికి తెలియదు. కానీ పద్ధతులు సాధారణమైనప్పటికీ, బౌద్ధమతానికి ప్రత్యేకమైనది దాని సందర్భం: మన లక్ష్యం ఏమిటి, వాస్తవికత గురించి మన అవగాహన ఏమిటి మరియు మన ప్రేరణ ఏమిటి అని.

వినడం, ఆలోచించడం లేదా అర్ధం చేసుకోవడం, ఆ తర్వాత ధ్యానం చేయడం అనే మూడు భాగాలు ఉంటాయి. మనం బౌద్ధమత సందర్భంలో ధ్యానాన్ని అభ్యసిస్తుంటే, అప్పుడు మనం ఈ బౌద్ధమత బోధనలను అర్ధం చేసుకోవడానికి దాన్ని ఉపయోగిస్తాము.

బోధనలను వినడం

మొదటి భాగాన్ని "వినడం" అని ఎందుకు పిలుస్తాము? ముందుగా, బుద్ధుని కాలంలో, బోధనలు ఏవీ రాసి లేవు , కాబట్టి వాటిని నేర్చుకోగల ఏకైక మార్గం ఎవరైనా వాటిని చెప్తూ వివరించడమే. ఈ రోజుల్లో, మనం అన్ని బోధనలను చదవగలము, కాబట్టి వాటిని వినడం వల్ల ఏదైనా ప్రయోజనం ఉందా? ఉంది, దానివల్ల ప్రయోజనం ఏమిటంటే, విద్యార్థులు అర్థం చేసుకోవాలనే కోరిక ఉన్న ఉపాధ్యాయుడితో మనకు ఒక ప్రత్యక్ష సంబంధాన్ని కుదుర్చుకునేలా చేస్తుంది. వాళ్ళు విషయాలను వివిధ మార్గాల్లో వివరించగలరు మరియు మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, పుస్తకాన్ని కాకుండా డైరెక్ట్ గా వాళ్లనే అడగగలరు.

వినడం వల్ల కలిగే నష్టం ఏమిటంటే, మీరు ఒకవేళ సరిగ్గా వినకపోతే, మీరు ఒక పేజీని వెనక్కి తిప్పినట్టు రీవైండ్ చేసుకోలేరు. మీరు ఒక పెద్ద గ్రూప్ లో ఉంటే, మీరు వినని విషయం గురించి మళ్ళీ అడగడం ఇబ్బందికరంగా అనిపించవచ్చు. ఒకవేళ మీరు వెనుక కూర్చొని ఉంటే ఆ పాఠాన్ని సరిగ్గా వినలేకపోవచ్చు. ఆ రూమ్ చాలా వేడిగా ఉండి మీకు నిద్ర పట్టవచ్చు. కాబట్టి, నష్టాలు కూడా ఉన్నాయి. కానీ మీరు ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉందని దీని అర్థం, ఇది బౌద్ధమత బోధనలలో పెంపొందించాల్సిన ఒక లక్షణం. బౌద్ధమతాన్ని నేర్చుకోవడం మరియు ఆచరించడం అనేది ఒక పాసివ్ పద్ధతి కాదు.

ఒక ఉపాధ్యాయుడికి సూచనలు నిజానికి మీకు అన్నీ సులభంగా ఉండకూడదని, మీరు విషయాలను మొదటిసారి చాలా స్పష్టంగా వివరించకూడదని ఉంటుంది. నాలాంటి కొంత మందికి, అది కష్టమే ఎందుకంటే నాకు అన్నీ చాలా క్లియర్ గా ఉండాలి. నేను నా గురువు సెర్కాంగ్ రింపోచే గారికి అనువాదకుడిగా ఉన్నప్పుడు బోధనను ఎలా చెయ్యాలి అని నేను అడిగినప్పుడు, అతను ఇలా చెప్పారు, "ముందు దేనినీ స్పష్టంగా వివరించవద్దు, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్లలో ఎవరు నిజంగా నేర్చుకోవడానికి వచ్చారో మరియు ఎవరు వేరే పని మీద వచ్చారో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు నన్ను ఎక్కువ అడుగుతారు. విద్యార్థులు ఇంకా నేర్చుకోవాలనే వారి స్వంత బలమైన కోరికను పెంపొందించుకోవడమే చాలా ముఖ్యం.”

ఒక విద్యార్థిగా, ఒక ఉపాధ్యాయుడు స్పష్టంగా చెప్పట్లేదని మీరు తిరిగి వెళ్లడానికి ఇష్టపడరని కంప్లైంట్ చేసి, ఆ ఉపాధ్యాయుడి నాణ్యత ఏమిటో మీరు పరిశీలించాలి. టీచర్ కు నిజంగా అర్హత లేదా మరియు స్పష్టంగా ఎలా వివరించాలో తెలియదా? అని. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. మీ పట్టుదల, ఓర్పును పెంపొందించుకునేలా ప్రోత్సహించడానికి ఆ ఉపాధ్యాయుడు కావాలనే అన్నీ చెప్పడం లేదా? అని. వినడం యొక్క మొత్తం ఉద్దేశ్యం రెండవ దశ గురించే, అంటే బోధనల గురించి ఆలోచించడం. ఉపాధ్యాయుడు వెంటనే సమాధానం ఇవ్వకపోతే ఇది ఇంకా సహాయపడుతుంది, ఎందుకంటే ఇది మొదట దాని గురించి ఆలోచించే సమయం ఇస్తుంది, ఆ బోధనలను మీరే పరిశీలించుకునే ఆలోచనను పెంపొందిస్తుంది.

బోధనలను పరిశీలించడం

ఆ బోధనలను పరిశీలించి అవి మీకు అర్థవంతంగా ఉన్నాయో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారో తెలుసుకోండి, ఆ తర్వాత మీ ఆలోచనలపై ఫీడ్ బ్యాక్ ను పొందండి. పెద్ద గ్రూప్ లో ఇలా చెయ్యడం కష్టమే మరియు మీరు మీ ఉపాధ్యాయుడిని సంవత్సరానికి ఒకసారి మాత్రమే కలిస్తే కూడా చాలా కష్టమే. ఇక్కడ నేను ఏది అనువైనదో దాని గురించి మాట్లాడుతున్నాను. గురువులు ఎప్పుడూ ఉండరు, అనేక బౌద్ధమత కేంద్రాలలో రీడింగ్ మరియు ఆడియో మెటీరియల్స్ పై ఆధారపడాల్సి ఉంటుంది. దీని నుంచి మనం ఇంకా చాలా నేర్చుకోవచ్చు. మనం వాటిని ఒక నవలగా లేదా టాయిలెట్ లో చదివేవాటిలా చూడము; మీరు వాటిని ఒక గౌరవప్రదమైన మానసిక స్థితిలో చదువుతారు. వాటిని నెమ్మదిగా చదివి అందులోని పాయింట్ల గురించి ఆలోచిస్తారు. మీరు ఏ ఉపాధ్యాయుడు లేకుండా సెంటర్ లో ఉంటే, మీరు పాయింట్‌లను కలిసి చదివి చర్చించుకోవచ్చు. కొంత మందికి ఎక్కువ అవగాహన ఉండి వేరే వాళ్లకు చెప్తూ ఉంటారు. మనం "నిరాశ్రయ అభ్యాసకులు" అని పిలువబడితే, మనలో ఏ బౌద్ధమత కేంద్రానికి వెళ్ళని వాళ్ళు లేదా మనకు దగ్గరగా ఉన్న వాళ్లలో ఇంట్లో ఉన్న వాళ్ళగా అనిపించకపోతే, మనకు సరైన ఆన్‌లైన్ బౌద్ధ చర్చా బృందంలో చేరవచ్చు.

ఇతరులతో ఈ రకమైన సంభాషణ చాలా సహాయపడుతుంది, లేకపోతే బోధనలను నేర్చుకోవడం చాలా మేధోపరమైనదిగా, వాస్తవ జీవితాన్ని సూచించకుండా ఉంటుంది. ఈ విషయంలో మనం ఎక్కువ సీరియస్ గా ఉండకూడదు. అలాగని మనం నిశబ్ధంగా కూర్చొని, ఎప్పుడూ నవ్వకుండా ఉండకూడదు, దీని అర్ధం మనం ధర్మం గురించి లోతుగా ఆలోచించాలని. ఎవరైనా సరదాగా ఏదైనా చెప్పినా లేదా ఏదైనా తప్పు చేసినా కానీ మనం నవ్వవచ్చు.

కొంతమంది వెస్ట్రన్ వాళ్లకు, ఇలా చెయ్యడం చాలా కష్టం, ఒకే సమయంలో విశ్రాంతిగా మరియు సీరియస్ గా ఉండటం. ఇది మీరు బోధనలను మీ జీవితంలో ఎలా అన్వయించుకుంటారో అనే దానిని సూచిస్తుంది. అన్నింటికీ మించి, దాని ప్రాథమిక ఉద్దేశం మిమ్మల్ని సంతోషంగా ఉంచడం. మనం సైన్యంలో ఉన్న వాళ్ళలా ఫార్మల్ గా ఉంటే, అది అసలు సంతోషకరమైన మానసిక స్థితి కాదు. మనం పరిపూర్ణంగా ఉండలేమని, తప్పు చేసి శిక్షను అనుభవిస్తూ ఇంకేదో అవుతుందని భయపడతాం. అది బౌద్ధమతం కాదు!

తలకిందుల కుండీ, మురికి కుండీ, పగిలిన కుండీ

మనం వినడం గురించి మళ్ళీ తెలుసుకుందాం. కుండీలా ఉండకుండా బోధనలను ఎలా వినాలనే దానిపై మనకు సలహాలు వస్తాయి. ముందు, మనం తలకిందులైన కుండీలా ఉండకూడదు, ఎందుకంటే అప్పుడు ఏదీ లోపలికి వెళ్ళదు; మనం ఒక ఓపెన్ మైండ్ ని కలిగి ఉండాలి. పగుళ్లు ఉన్న కుండీలా కూడా ఉండకూడదు, అప్పుడు అందులోకి వెళ్లిన ప్రతిదీ లీక్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. చివరిగా, మనం ఒక మురికి కుండీలా కూడా ఉండకూడదు, అక్కడ మనకు అనేక అనుమానాలు ఉంటాయి, బోధనలు పూర్తి గందరగోళంగా ఉంటాయి.

మీరు బౌద్ధమత బోధనలను విన్నప్పుడు, మీరు వాటిని ఇతర వ్యవస్థలతో పోల్చడం మానుకోవాలి. "హిందూమతంలో, మరియు టావోయిజంలో అలా చెప్తుంది" అని మీరు అనుకోవచ్చు. నా గురువులలో ఒకరు ఇలా చెప్పేవారు, "మీరు రెండింటిని పోల్చడానికి ప్రయత్నిస్తే, ఏదీ మీకు నిజంగా అర్థం కాదు, దానికి అసలు అర్ధం ఏమీ ఉండదు. మీకు అయోమయం మాత్రమే మిగులుతుంది." మీకు ఆ రెండింటి గురించి పూర్తి అవగాహన ఉంటే, అప్పుడు మీరు ఒక విలువైన పోలికను చెయ్యవచ్చు. అసలు బౌద్ధమత బోధనలు మీకు అర్థం కాకపోతే, ముందుగా మీరు "ఇది ఇలా ఉందా లేదా అలా ఉందా" అనే ఆలోచనలను పక్కనపెట్టి, కేవలం బోధనలను మాత్రమే వినండి. లేకపోతే, మీరు మీ ముందస్తు అభిప్రాయాలలో ఉండిపోతారు, ఇది తప్పు మాత్రమే కాదు, అసంబద్ధంగా కూడా ఉంటుంది.

పగుళ్లు ఉన్న కుండీలా ఉండకూడదని సలహా ఇచ్చినప్పుడు, అది మనం నేర్చుకున్నదాన్ని గుర్తుంచుకోకుండా ఉండడాన్ని సూచిస్తుంది. చాలా మందికి నోట్స్ తీసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది, కానీ మీరు వాటిని తర్వాత చూడటమే మంచిది. ఏదేమైనా, మనకు మంచి జ్ఞాపకశక్తి లేకపోతే, అవసరమైన వాటిని నోట్ చేసుకోవడం మంచిది.

పాశ్చాత్య దేశాల వాళ్ళ ఆలోచనా విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది, ఇక్కడ మనకు పరీక్ష ఉంటే తప్ప, మనం సాధారణంగా దేనిని నేర్చుకునే ప్రయత్నం చెయ్యము. పరీక్షలో పాస్ అవ్వడం కోసం మనం చదువుతాం, మనం మోసం చేసే ఛాన్స్ ఉంటే, ఎందుకు చెయ్యము? అవును, అది ఇక్కడ పని చెయ్యదు. పరీక్ష లేదా మంచి గ్రేడ్ లేదా ఉపాధ్యాయుడి అప్రూవల్ ఉండదు. అసలు విషయం ఏమిటంటే, మనల్ని మనం మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాము, మరియు బుద్ధుడు మనకు ఏమి బోధించినా - అతనిపై మనకు నిజంగా విశ్వాసం ఉంటే - అది ఇతరుల ప్రయోజనం కోసమే అని తెలుసుకోవాలి. ఇతరులతో ఎలాంటి పోటీ లేదు, బోధనలను మనకు నచ్చినట్టుగా మాత్రమే ఆలోచించాలి. "ఆ వ్యక్తికి కోపం ఉంది, నాకు లేదు" అని మనం అనుకోము. ధర్మాని మనమే ఎదుర్కోవాలి, బయటి వాళ్లు కాదు.

మెడిసిన్ తో పోలిక

బోధనలను ఎలా వినాలనే దాని గురించి మరొక సూచన ఏమిటంటే, మనల్ని మనం ఒక రోగిగా, బుద్ధుడు మరియు గురువులను వైద్యులుగా, బుద్ధుని బోధనలను ఒక ఔషధంగా భావించాలి. మంచి అవగాహన కలిగిన వ్యక్తులను మనకు సహాయం చేసే నర్సుల లాగా చూడవచ్చు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, "నాకు సమస్యలు ఉన్నాయి" అనే గుర్తింపుతో మనం ఈ బౌద్ధమత సాధనలోకి ప్రవేశిస్తాము. మనకు ఒక జబ్బు ఉంది, అది స్వార్థం లేదా కోపం కావచ్చు, లేదా అది ఏదైనా కావచ్చు, మరియు మనం దాని నుంచి నయం కావాలని కోరుకుంటాము. బుద్ధుడు సర్వోన్నత వైద్యుడు మరియు నేను ఈ అద్భుతమైన మందును పొందబోతున్నాను మరియు దాన్ని మర్చిపోకుండా, సూచనల ప్రకారం తీసుకుంటాను. నేను ఒక్క రోజు కూడా మిస్ చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను, మరియు నేను ఖచ్చితంగా అన్ని బాటిల్స్ ని ఒకేసారి తీసుకోను. బౌద్ధమత సాధన అనేది యాంటీబయాటిక్స్ తీసుకోవడం లాంటిదే! మీరు దానిని ఒక నిర్దిష్ట సమయంలో, కొంత అమౌంట్ లోనే తీసుకోవాలి. మీరు సగంలో ఆపేస్తే లేదా కొన్ని రోజులు చేయకుండా మానేస్తే అంత ప్రయోజనం ఉండదు. బౌద్ధమతాన్ని వైద్య రీతిగా చూడటంలో ఇది ఒక సూచన.

ఇంకొక సూచన ఏమిటంటే, మనం బోధనలు వింటున్నప్పుడు, మనం ఒక స్వచ్ఛమైన దేశంలో ఉన్నామని మరియు గురువు బుద్ధుడు అని మరియు మనం మంచి బోధనలను పొందుతున్నామని ఊహించుకోవాలి. దీని అర్థం ఉపాధ్యాయుడు నిజంగా బుద్ధుడు అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు, కానీ వారి పట్ల మరియు బోధనల పట్ల మనకు గౌరవం ఉండాలి. మనం ఏదో సీరియస్ పనిని చేస్తున్నాము, దీని అర్థం మనం ఒక దుఃఖంతో ఉండే ముఖంతో కూర్చోవాల్సిన అవసరం లేదు, కానీ మనం ఆ వేడి రూమ్ ని మర్చిపోయి ఓపెన్ మైండ్ తో మనకు నేర్పుతున్న దానిపై దృష్టి పెట్టవచ్చు.

ఓపెన్ మైండ్ తో ఉండడం

మనం బంగారం కొంటున్నట్టుగా ఆ బోధనలను పరిశీలించాలని బుద్ధుడు చాలా గట్టిగా చెప్పాడు. ఆయనపై నమ్మకం ఉంచుకుని దీన్ని నమ్మాలి. ఇలా చేయాలంటే మనకు ఒక ఓపెన్ మైండ్ కావాలి, అలాగే బుద్ధుడు సరదా కోసం అలాంటి వాటిని ఊరికే బోధించడు అని మనకు తెలిసి ఉండాలి. అలాంటి మనస్సుతో, బోధనల అర్థాన్ని మనం పరిశీలించి వాటి అర్థం ఏమిటో తెలుసుకోవచ్చు. అప్పుడు మనకు ఏది నిజమో, ఏది ప్రయోజనకరమో తెలుసుకుని దాన్ని స్వీకరించవచ్చు. గతం, భవిష్యత్ కు సంబంధించి నేను ఒక ఉదాహరణను చెప్తాను.

నేను ఒక సాధారణ పాశ్చాత్య శైలిలో పెరిగాను మరియు నేను ముందు బౌద్ధమతాన్ని అధ్యయనం చేయడం ప్రారంభించినప్పుడు గతం మరియు భవిష్యత్తుపై ఎలాంటి ఖచ్చితమైన నమ్మకం ఉండేది కాదు. పాశ్చాత్య దేశాల్లో చాలా మంది ఆలోచనా విధానానికి ఇది వేరుగా ఉంటుంది. వారి మరణానంతర జీవితం గురించి ఆలోచిస్తే, అది ఎక్కువగా క్రైస్తవ స్వర్గం లేదా నరక-శైలి ప్రదేశం అయి ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరినీ పూర్వజన్మలో నా తల్లిగా భావించడం ఈ బోధనల్లో ఉంటుంది, కాబట్టి మీరు వాటిని కిటికీ నుండి విసిరివేయలేరు.

మొదట్లో నేను దీన్ని సంప్రదించిన విధానం ఏమిటంటే, "సరే, పునర్జన్మ యొక్క ఈ ఆలోచన సరైనదే అని నేను అనుకుంటాను, ఇప్పుడు నాకు అర్థం కాకపోయినా. నేను దాని గురించి సాకులు చెప్పి దాచిపెట్టలేను, కానీ దానిని అర్థం చేసుకోవడానికి కొంత సమయం తీసుకుంటాను." సమయం గడిచే కొద్దీ, పునర్జన్మ ఆధారంగా ఉన్న ప్రతిదీ వాస్తవానికి ప్రయోజనకరంగా మరియు సరైనదని నేను గమనించాను, కాబట్టి పునర్జన్మ అనేది కూడా నిజం అయి ఉండొచ్చు.

పునర్జన్మ అంటే ఏమిటో బుద్ధుని బోధనలు ఏమిటో కూడా మీకు తెలియనప్పుడు, మీరు పునర్జన్మను అర్థం చేసుకోలేరని తర్వాత  గ్రహిస్తారు. మీరు ఆ లోతైన స్థాయికి చేరుకోవాలి, అక్కడి నుంచి, నరకం మరియు భూత ప్రపంచాలు మొదలైనవి అర్థవంతంగా కనిపిస్తాయి. మనసు స్వభావాన్ని మనం అర్థం చేసుకోకపోతే అవేవీ అర్థం కావు. కాబట్టి, బోధనలలో కొన్నిటిని మనం వెంటనే తిరస్కరించకూడదు, ఎందుకంటే మనకు అది అర్థం అయి ఉండదు లేదా చాలా వింతగా అనిపించవచ్చు. ఓపెన్ మైండ్ ను కలిగి ఉండటం, విచక్షణా జ్ఞానాన్ని కలిగి ఉండటం అంటే ఇదే. "అవును, బుద్ధుడు బోధించింది ఇదే. బుద్ధుడు పునర్జన్మ గురించి బోధించాడు. నన్ను క్షమించండి, మీకు అది నచ్చక పోవచ్చు, కానీ అది అంతే ఉంటుంది. నేను బౌద్ధమతంలోకి ఇంకా లోతుగా వెళ్లాలనుకుంటే నేను దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది."

సారాంశం

బౌద్ధమత గ్రంధాలలో మనకు లభించే సలహాలు బౌద్ధమతాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు మాత్రమే కాదు, మన రోజువారీ జీవితాలకు కూడా ఉపయోగపడతాయి. మురికి లేదా పగిలిన కుండీలా ఉండటం ఎప్పటికి మంచిది కాదు! బౌద్ధమతాన్ని మన జీవితాల్లో అన్వయించుకోవడం అనేది ఒక చురుకైన ప్రక్రియ, ఇది వినడంతోనే ప్రారంభమవుతుంది. మనం ఇలా చేస్తే, ఆ బోధనలను పరిశీలించవచ్చు, ఎలాగైతే ఒక వజ్రపు ఉంగరం కొనేటప్పుడు మనకు ఏమీ తెలియకపోయినా ఒక ఓపెన్ మైండ్ తో ఎలా ఉంటామో అలా అనమాట.

Top