ధ్యానం చెయ్యడానికి ముందు మనం తెలుసుకోవాల్సిన విషయాలు

మన సామర్థ్యాలను తెలుసుకోవడం

మనం వీటన్నిటినీ సాధించగలనా అనే విషయం గురించి మనం ఎక్కువగా మాట్లాడలేదు. ఇది బుద్ధ-స్వభావం యొక్క చర్చలోకి వస్తుంది. ఇది ప్రాథమికంగా బుద్ధుడిగా రూపాంతరం చెందడానికి అనుమతించే మనందరికీ ఉన్న కారణాలను సూచిస్తుంది. ఇది ప్రధానంగా మనస్సు యొక్క లక్షణాలతో వ్యవహరిస్తుంది.

మనం విషయాలను అర్థం చేసుకోగలమా? మనం ఎప్పుడూ విషయాల గురించి తెలుసుకోగలమా? మనం కొంతసేపటి వరకు ఆ విషయాన్ని అర్ధం చేసుకోవచ్చు, అందుకని ఆ సమయం పెరిగే అవకాశం ఉందా? ధ్యానం మరియు పరిచయ పద్ధతుల ద్వారా మనం దీన్ని పెంచవచ్చు, కానీ చాలా ప్రాథమిక పదాలలో విజయం మన స్వంత ఆసక్తి మరియు ప్రేరణపై ఆధారపడి ఉంటుంది. ఇది మనకు ముఖ్యమైనది మరియు సంబంధించినదిగా ఉండాలి.

ఇది మీరు షాపింగ్ కు వెళ్లినప్పుడు మీ వద్ద ఎంత డబ్బు ఉందో తెలుసుకోవడం లాంటిది, ఎందుకంటే మీరు ఉన్న దాని కంటే ఎక్కువ ఖర్చు చెయ్యలేరు. మిగతా సమయాల్లో, మీరు ఇంట్లో ఉన్నప్పుడు, మీ జేబులో ఎంత డబ్బు ఉన్నా ఏం పర్లేదు. ఇది అసంబద్దమైనది మరియు పట్టించుకోని విషయం. అదే విధంగా, బోధనల గురించి మనం ఆలోచించినప్పుడు, అవి మనకు సంబంధించినవిగా ఉండాలి. అవి సంబంధించినవి అని భావించడానికి, మనం వాటి పనితీరును మరియు అవి ఎందుకు ముఖ్యమైనవో అర్థం చేసుకోవాలి. "కేరింగ్ యాటిట్యూడ్" అని పిలువబడే ఒక ప్రాథమిక మానసిక స్థితి అని మనం అనుకోవచ్చు, ఇక్కడ మనకు ఏమి జరుగుతుందో మరియు మనం ఏమి అనుభవిస్తామో అనే దాని గురించి ఆందోళన చెందుతాము.

మన గురించి మనం పట్టించుకోవడం

ఈ కేరింగ్ యాటిట్యూడ్ ఇతరుల మీద పెట్టినప్పుడు దాని పనితీరును మనం ఇంకా సులభంగా అర్థం చేసుకోవచ్చు. నేను ఇతరుల గురించి పట్టించుకోకపోతే, ఏమి చేస్తున్నానో లేదా ఏమి చెబుతున్నానో, వారికి నచ్చిందా లేదా అనేది అర్ధం కాదు. కానీ నేను వారిని ముఖ్యమైన వాళ్ళుగా భావిస్తే, నా ప్రవర్తన వారిని ఎలా ప్రభావితం చేస్తుందనే దాని గురించి నేను ఆందోళన చెందుతాను. మన గురించి మనం అదే శ్రద్ధను పెంపొందించుకోవాలి, నేను నా సమయాన్ని వృధా చేసి, నా విలువైన జీవితాన్ని సద్వినియోగం చేసుకోకపోతే, ఏదో ఒక సమయంలో ఈ భారీ నష్టం గురించి ఆలోచించి ఆ విచారంతో నేను చనిపోతాను అని.

మన జీవితంలోని సాధారణ విషయాల వైపు కూడా దీన్ని మనం మళ్లించవచ్చు. నేను నా పిల్లలను ఎలా పెంచుతాను మరియు నా పనిని ఎలా చేస్తాను అనే దాని గురించి నేను శ్రద్ధ తీసుకుంటాను; నేను నా మానసిక మరియు శారీరక సంక్షేమం యొక్క శ్రద్ధ తీసుకుంటాను అని. ఈ రకమైన ఆలోచనతోనే బోధనలు మనకు ముఖ్యమైనవిగా కనిపిస్తాయి. బోధనలను మనసులో ఉంచుకుని వాటిని గుర్తుంచుకోగలుగుతాం, అన్ని సమయాల్లో కాకపోయినా, ఎక్కువ సార్లు గుర్తుంచుకోగలుగుతాము. ధ్యానం అనేది బోధనలను పదే పదే పరిచయం చేసుకునే పద్ధతి, అలా అవి మన మనస్సులో సహజమైన భాగంగా మారి వాటిని గుర్తుంచుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చెయ్యాల్సిన అవసరం ఉండదు.

ఈ అంతర్దృష్టులను పొందగలమని మనం నమ్మితే, మనం దానిని చేయడానికి బాగా కష్టపడతాము. మనకు నమ్మకం లేకపోతే, అది ఎగరడానికి మన చేతులను ఊపడం లాంటిది. ప్రారంభంలో, విముక్తి లేదా జ్ఞానోదయం అంటే ఏమిటో కూడా మనకు తెలియదు, కానీ దీన్ని అర్థం చేసుకోవడానికి మరియు దాని కోసం కష్టపడడానికి మనకు దీర్ఘకాలిక లక్ష్యం ఉంటుంది, అయితే మరణం యొక్క అవగాహన మన జీవితాన్ని వృధా చేసుకోకూడదని ప్రేరేపించడానికి సహాయపడుతుంది.

కరుణ గురించి ధ్యానం

ఇప్పుడు మనం ఈ ప్రక్రియలో మూడవ దశ అయిన "ధ్యానం" గురించి తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ అంశాన్ని పరిచయం చేయడానికి గొప్ప టిబెటన్ బౌద్ధ గురువు సోంగ్ ఖాపా గారు చాలా ఉపయోగకరమైన సలహాను రాశారు. సూత్రం మరియు తంత్రంపై ఆచరణాత్మక సలహా లెటర్ లో, ధ్యానం చెయ్యడానికి "మనం సాధించడానికి ప్రయత్నిస్తున్న మానసిక స్థితికి కారణాలు ఏమిటో వాటిని గుర్తించాలి" అని రాశారు. కాబట్టి, మనం కరుణను పెంపొందించుకోవాలనుకుంటే, ఉదాహరణకు, దానికి కారణాలు ఏమిటో తెలుసుకోవాలి.

ఇది ఆధారపడటం యొక్క సూత్రం - ఇతరులు బాధల నుంచి విముక్తి పొందాలనే కోరికను పెంపొందించడానికి కారణాలు (బౌద్ధంలో కరుణ యొక్క నిర్వచనం) మరియు మనం వారితో పరస్పర సంబంధం కలిగి ఉన్నామని గుర్తించాలి. లేకపోతే, మనం వాటి గురించి అస్సలు పట్టించుకోము. కాబట్టి, మన మొత్తం ఉనికి ప్రతి ఒక్కరి కృషి మరియు దయపై ఎలా ఆధారపడి ఉందో మనం పరిగణనలోకి తీసుకోవాలి - మన ఆహారాన్ని ఉత్పత్తి చేసినవారు, మన రహదారులను నిర్మించినవారు మరియు మిగతా వాళ్ళు. మన జీవితాలను సుసాధ్యం చేయడానికి వారు చేసిన ప్రతి పనిని గుర్తుంచుకోవాలి; వాళ్లకు మన కృతజ్ఞత మరియు ప్రశంసలను అందించాలి. మన కృతజ్ఞతా భావం నిజాయితీగా, లోతుగా అనుభూతి చెందినప్పుడు, అది సహజంగానే హృదయాన్ని హత్తుకునే ప్రేమను కలిగిస్తుంది. మనం వాళ్లను ఎంతో ఇష్టపడి వాళ్లకు ఏదైనా చెడు జరిగితే మనం బాడ్ గా ఫీల్ అవుతాం. అది ప్రేమకు దారితీస్తుంది: వారు సంతోషంగా ఉండాలని మరియు సంతోషానికి కారణాలు ఉండాలని కోరుకుంటాం. కానీ వారు సంతోషంగా లేరని, అన్ని రకాల బాధలలో ఉన్నారని మనం చూసినప్పుడు, కరుణను పెంపొందించుకుంటాము. ఈ దశలన్నిటినీ సరైన క్రమంలో దాటడంపైనే మన కరుణ వికాసం ఆధారపడి ఉంటుంది.

కరుణ అనేది త్యాగం మీద కూడా ఆధారపడి ఉంటుంది, అంటే మన స్వంత బాధలను గుర్తించడం, వాటి నుంచి విముక్తి పొందాలని అనుకోవడం, ఆ తర్వాత మిగతా వాళ్లకు కూడా ఇలానే ఉన్నాయని గ్రహించడం. త్యాగం అంటే అదే – బాధల నుంచి విముక్తి పొందాలనే సంకల్పం. కరుణ, ఇతరుల బాధల పట్ల చూపిన అదే సంకల్పం, ముందు మన పట్ల అదే సంకల్పాన్ని కలిగి ఉండటంపై ఆధారపడి ఉంటుంది.

కాబట్టి మన ధ్యానంలో కరుణ యొక్క స్థితిని సృష్టించడానికి ప్రయత్నించాలనుకుంటే, ఈ ఆధారపడే పాయింట్ నిజంగా ముఖ్యమైనది. ఎందుకంటే, చివరికి, చాలా ప్రాక్టీస్ తో మనం దాన్ని తక్షణమే సృష్టించగలుగుతాము, ప్రారంభంలో మనల్ని మనం నిజాయితీగా అనుభూతి చెందే స్థాయికి వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు కరుణ కోసం ధ్యానం చెయ్యడానికి, అది ఆధారపడే దశలు లేదా కారణాలను తెలుసుకోవాలి.

మనం కూడా విషయాలను తెలుసుకోవాలి అని సోంగ్ ఖాపా గారు చెప్పారు, ఈ కరుణను పెంపొందించుకోవాలంటే, ప్రతి ఒక్కరూ అన్నింటి నుంచి విముక్తి పొందాలంటే, బాధ దేని నుంచి వస్తుందో తెలుసుకోవాలి. ఇది వారికి ఉద్యోగం లేదా తినడానికి మంచి వాటిని కనిపెట్టడం గురించి మాత్రమే కాదు – నియంత్రణ లేకుండా రిపీట్ అయ్యే పునర్జన్మ (సంసారం) యొక్క బాధల గురించి మరియు సంసార ఉనికిని సృష్టించే మరియు వాస్తవికత, అత్యంత ప్రాథమిక అజ్ఞానం మరియు గందరగోళం గురించి మనం తెలుసుకోవాలి. ప్రేమ, కరుణ గురించి ధ్యానించడానికి, మీరు అక్కడ కూర్చొని, "అయ్యో నేను అందరినీ ప్రేమిస్తున్నాను" అని అనుకుంటే సరిపోదు. అది చాలా అస్పష్టంగా ఉంటుంది - మనం సృష్టించాలనుకునే మానసిక స్థితులు చాలా నిర్దిష్టమైనవి. మనం పనిచేయడానికి ప్రయత్నిస్తున్న మానసిక స్థితిని చూపిస్తూ మనకు సహాయపడే అన్ని విషయాలను సోంగ్ ఖాపా గారు ప్రస్తావించారు.

అప్పుడు, ఈ మానసిక స్థితిని అభివృద్ధి చెయ్యడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనం దేనిపై దృష్టి పెడుతున్నామో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మన మనస్సులలో ఏం ఉండాలి? కరుణతో, మనం ఇతర జీవులు మరియు వారి బాధలపై దృష్టి పెడుతున్నాము. ఇక్కడ కేవలం కరుణ మాత్రమే కాదు, "గొప్ప కరుణ" ఉంటుంది. ఇది అందరి పట్ల సమానంగా దిశానిర్దేశం చేయబడుతుంది. ఇది చాలా జీవులకు - నిజంగా ప్రతి ఒక్కరికి సంబంధించింది. "నేను విశ్వంలోని ప్రతి కీటకానికి సహాయం చేయబోతున్నాను" అని అనుకోవడం నమ్మశక్యం కాని ఒక పెద్ద ఆలోచన. మనం ఇక్కడ ప్రతి వ్యక్తి యొక్క మానసిక వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాము. వాళ్ళు ఎప్పుడూ కీటకాలు అని దీని అర్థం కాదు - ఈ జన్మలో ఒక కీటకం ఉందని గ్రహించి మనం ఆ జీవిని విముక్తి చెయ్యబోతున్నాము, దాన్ని చివరి జన్మలో నా తల్లిలాగా అనుకుంటూ కాపాడాలి. చివరి జన్మలో పురుగు అయి ఉన్న మా అమ్మను ఈ జన్మలో విముక్తుల్ని చేస్తాను అని.

ప్రతి జీవిని విజువలైజ్ చేయడం అంత సులభం కాదు, కానీ మహాయాన బౌద్ధమత అభ్యాసంలో మనం అభ్యాసం చేస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్న జీవులను ఊహించడానికి ప్రయత్నిస్తాము మరియు వారి అన్ని బాధలను తగ్గించడానికి చూస్తాము. అనేక మహాయాన సూత్రాలలో, ఇది చుట్టుపక్కల ఉన్న కోట్లాది జీవులను వివరిస్తుంది, ఇది పరిధి యొక్క ఆలోచనను పెంచుతుంది.

ప్రతి ఒక్కరి పట్ల ఈ విధమైన విశ్వవ్యాప్త కరుణను కలిగి ఉండటం నిజంగా నమ్మశక్యం కాని విషయం. దానికి ఆధారం సమతౌల్యం. ఇక్కడ మన మనస్సులను ఇతరులందరి కోసం తెరుస్తాము. కరుణపై సరైన ధ్యానం చెయ్యాలంటే ఇవన్నీ మనం తెలుసుకోవాలి.

అంతే కాకుండా, మనం దృష్టి పెట్టే విషయానికి మనస్సు ఎలా సంబంధాన్ని కలిగి ఉందో తెలుసుకోవాలి. మనం కరుణ కోసం ధ్యానం చేస్తూ, వారు బాధల నుంచి విముక్తి పొందాలని మరియు వారి బాధలకు కారణాలన్నీ నాశనం కావాలని మనం కోరుకుంటాము. వారికి సహాయం చెయ్యడానికి వేరే వాళ్ళు ముందుకు వస్తారని, లేదా ఆ బాధ దానికదే పోయిందని కాదు, దాన్ని అధిగమించడానికి మనమే వారికి సహాయపడటానికి ప్రయత్నిస్తాము.

ఏది ప్రయోజనకరంగా ఉంటుందో మరియు ఏది హానికరమైనదో మనం తెలుసుకోవాలి మరియు కరుణను పెంపొందించుకోవడానికి సహాయపడాలి అని సోంగ్ ఖాపా గారు చెప్పారు. కరుణను పెంపొందించుకోవడం మనకు సహాయపడటమే కాదు, ప్రజలు వారి బాధల నుంచి విముక్తి పొందడం నిజంగా సాధ్యమేనని నమ్మడం చాలా అవసరం. అది సాధ్యమని మనం అనుకోకపోతే, మనం దానిని ఎలా కోరుకోగలము మరియు ఎలా పని చెయ్యగలము? నా బాధల నుంచి నేను విముక్తి పొందగలనని, ఇతరులు వారి బాధలను అధిగమించడానికి నేను సహాయపడగలనని నమ్మకమే దీనికి ఆధారం. దానికోసం, మనకు ఉన్న సామర్థ్యం ఏమిటి, బుద్ధుడు ఏమి చెయ్యగలడు అనే వాస్తవిక అవగాహనను కలిగి ఉండాలి. కాబట్టి మన కరుణను హాని కలిగించేది స్వయంకృషి, స్వార్థం మాత్రమే కాదు, నిరుత్సాహం మరియు ఆత్మవిశ్వాసం లేకపోవడం కూడా. అన్నిటి కన్నా, బాధను ఒకరి పాదంకు గుచ్చుకున్న ముళ్ల లాగా తీసెయ్యలేమని బుద్ధుడు చెప్పాడు. బుద్ధుడు కూడా దారి చూపించగలడు, కాని ఇతరులు కష్టపడి పని చెయ్యాల్సి ఉంటుంది. బుద్ధుడిని మనం అధిగమించగలమని ఎలా అనుకోగలం?

వివరంగా చెప్పాలంటే, కరుణ లాంటి ఒక నిర్దిష్ట మానసిక స్థితిని సృష్టించడం యొక్క ప్రత్యేకత మనకు తెలియకపోతే, మనం ఏమీ చెయ్యలేము. ఈ విధంగా ధ్యానం అసలు ఎంత ఖచ్చితమైనది మరియు అధునాతనమైనదో గుర్తించడం ప్రారంభించవచ్చు; మనం దానిని "మనస్సు యొక్క శాస్త్రం" అని కూడా పిలుస్తాము.

మధ్యలోని ధ్యాన సెషన్లు 

ధ్యానం మధ్యలో ఉండే సెషన్ల సమయం కూడా చాలా ముఖ్యమైనదని సోంగ్ ఖాపా గారు చెప్పారు. ధ్యానానికి సంబంధించిన వివిధ లేఖన గ్రంథాలను చదవమని ఆయన సలహా ఇచ్చారు. ఒక వైపు, మనం నిజంగా చేస్తున్నది బుద్ధుడు బోధించినదే అనే మన నమ్మకాన్ని కంఫర్మ్ చేసుకోవాలి, మరోవైపు, గొప్ప గురువులు ఏమి సాధించారో తెలుసుకుని మంచి ప్రేరణను పొందాలి. వీటన్నిటి కన్నా, శుద్ధి పద్ధతుల ద్వారా మన పాజిటివ్ శక్తిని పెంపొందించుకోవాలని, నెగెటివ్ శక్తుల నుంచి మనల్ని మనం దూరం చేసుకోవాల్సిన అవసరం ఉందని సోంగ్ ఖాపా గారు చెప్పారు.

నేను "మెరిట్" అనే పదానికి బదులుగా "సానుకూల శక్తి" అనే పదాన్ని ఉపయోగిస్తాను, ఇది తప్పు ఆలోచనను ఇస్తుందని నేను అనుకుంటున్నాను. మెరిట్ అంటే పాయింట్లు సేకరిస్తున్నట్లే అనిపిస్తుంది, మీరు వందకు చేరుకుంటే అప్పుడు మీరు గెలుస్తారు. మనం చేస్తున్నది నిజానికి పాజిటివ్ శక్తిని నిర్మించి మీకు సెల్ఫోన్ చేసే పనుల లాంటివి చెయ్యడానికి తగినంత శక్తిని పొందుతారు. కాబట్టి, మన మనస్సుతో, మానసిక అడ్డంకులను అధిగమించడంలో సహాయపడటానికి మనం శుద్ధి పద్ధతులను కూడా ఉపయోగించాలి. ఇక్కడ మీరు ఏమీ అర్థం చేసుకోలేరని అనుకుంటారు. భావోద్వేగ అడ్డంకులు కూడా ఉండొచ్చు. పాజిటివ్ శక్తిని నిర్మించడం మరియు వివిధ శుద్ధి పద్ధతులను పాటించడం వల్ల ఈ అడ్డంకులను అధిగమించవచ్చు, అలా మనం అంతర్దృష్టిని మరియు అవగాహనను పొందవచ్చు.

ఆచరణాత్మక స్థాయిలో దీని అర్థం ఏమిటి? ఆచరణాత్మక స్థాయిలో దీని అర్థం: మనం ఏదైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, మన పనిలో అయినా, దానిని అర్థం చేసుకోలేనప్పుడు, మనం ఒక బ్రేక్ తీసుకుంటాము. మనం వెళ్లి ఏదో ఒక విధంగా ఇతరులకు సహాయం చెయ్యడానికి ప్రయత్నిస్తాము. అలా చేయడం ద్వారా, సాధారణంగా మీరు తిరిగి వచ్చినప్పుడు, మీ మనస్సు మరింత పాజిటివ్ గా, ఉత్తేజమైన స్థితిలో ఉంటుంది మరియు నిరాశ కన్నా సొంత-విలువ లాంటి ఉన్నత భావనతో, కొంచెం మెరుగ్గా అర్థం చేసుకోగలుగుతాము. కాబట్టి, మనం ఎవరయినా కానీ, ఇతరులకు ప్రయోజనకరంగా ఉండే ఏదో ఒక పనిలో మనం నిమగ్నమై ఉండాలి. అది మన పిల్లలతో ఎక్కువ సమయం గడపడం అయినా, ఒంటరిగా ఉన్న అనారోగ్యంతో ఉన్న బంధువులలో పెద్దవాళ్లను చూడటానికి వెళ్ళడం అయినా సరే. ఏదైనా పాజిటివ్ గా చేయడం చాలా ముఖ్యం. మనం చేయగలిగే అనేక ఆచార పద్ధతులు ఉన్నప్పటికీ, నిజ జీవిత అభ్యాసం చాలా బలంగా ఉండాలి.

మన ప్రోగ్రెస్ ని చెక్ చేసుకోవాలి

మనలో చాలా మందికి మన పురోగతిని చెక్ చెయ్యగల వ్యక్తిగత ఉపాధ్యాయులు లేరు, కానీ లోజాంగ్ లేదా మైండ్-ట్రైనింగ్ బోధనలు ఎప్పుడూ మనకు మనమే ఉత్తమమైన సాక్షులమని చెబుతాయి. మనం బాగా ఏకాగ్రత చెయ్యగలుగుతున్నామా లేదా, మనకు చాలా మానసిక ఇబ్బందులు ఉన్నాయా లేదా అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి - దీన్ని మీ కోసం ఇంకెవరూ అంచనా వెయ్యలేరు! అన్ని బోధనలు మరియు అభ్యాసాలు మన స్వంత భావోద్వేగ స్థితులను మెరుగుపరచడానికి మరియు మన కోసమే పని చేసుకోవడానికి ఉద్దేశించినవి. కాబట్టి, మనం ఇంకా నిజంగా కోపంగా ఉన్నామా, లేదా  అని తెలుసుకోవడానికి మనమే ఉత్తమమైన జడ్జ్.

మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, జీవితం ఒడిదుడుకులతో ఉంటుంది, కాబట్టి ప్రోగ్రెస్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇది ప్రతిరోజూ ఒకేలా ఉండదు. మనం ఒక ముక్తి జీవి అయ్యేంత వరకు, ఈ జీవితం అలానే ఉంటుంది. మనం ఎక్కువ సేపు ప్రాక్టీస్ చేసినా కానీ, మామూలుగా కోపం రాకపోయినా ఎప్పుడో ఒకసారి కోపం వస్తుంది. కానీ దీని వల్ల నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు. ఒక వైపు మనల్ని మనం మెరుగుపరచుకోవడానికి కష్టపడాలి, అంతే కానీ మనల్ని మనం శిక్షించుకోకూడదు, మరియు ఏదైనా తప్పు చేసినప్పుడు అపరాధ భావనకు లోనవ్వకూడదు. దలైలామా గారు మాట్లాడుతూ మనం సాధించిన ప్రోగ్రెస్ ను అంచనా వేసేటప్పుడు కేవలం వారం రోజులు కాకుండా ఐదేళ్ల కాలాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ఐదేళ్ల కిందటి పరిస్థితులను ఇప్పటితో పోల్చితే మనం ఎలా డీల్ చేశామో గమనిస్తే మనం సాధించిన ప్రోగ్రెస్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది.

సారాంశం

ధ్యానం చెయ్యడానికి ప్రత్యేక ప్రదేశం అవసరం లేదు, మామూలుగా నిశ్శబ్దం మరియు పరిశుభ్రంగా ఉన్న చోట, ఇది అందుబాటులో లేకపోయినా సరే. నా స్నేహితురాలు తన తల్లితో కలిసి ఒక చిన్న అపార్ట్ మెంట్ లో ఉంటుంది. అక్కడ ఒక గది మాత్రమే ఉంది, మరియు అక్కడ తన తల్లి యొక్క టీవీ మరియు రేడియో ఉన్నాయి. తను ధ్యానం చెయ్యడానికి ప్రయత్నిస్తే తన తల్లి బాధపడుతూ ఉండేది. టాయిలెట్ మీద మాత్రమే ధ్యానం చెయ్యడానికి అవకాశం ఉండేది. అక్కడే తను ప్రతిరోజూ ప్రాక్టీస్ చేసేది, తనకు అది బాగానే అనిపించేది. మీకు కొవ్వొత్తులు లేదా ధూపం లేదా వేరే ఏ వస్తువులు అవసరం లేదు - అవి కేవలం "వస్తువులు" మాత్రమే. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ధ్యానం మనం ఎప్పుడైనా, ఎక్కడైనా చేయవచ్చు. మనం సబ్ వేలో లేదా బస్సులో ఉన్నప్పుడు కొన్ని మానసిక స్థితులను అభివృద్ధి చేయడం కూడా సులభం కావచ్చు. మనం సహనాన్ని పెంపొందించుకోవాలని అనుకున్నప్పుడు, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, దుఃఖాన్ని కోరుకోకూడదని అనుకున్నప్పుడు, రద్దీగా ఉండే బస్సు కంటే, మన గదిలో ఒంటరిగా కూర్చొని ప్రజల గురించి ఆలోచించటానికి మంచి ప్రదేశం ఇంకేం ఉంటుంది?

ధ్యానం ప్రాక్టీస్ లో ముఖ్యమైనది ఏమిటంటే, మనం దాన్ని ప్రతిరోజూ తప్పకుండా చేస్తాము. మీరు బ్రష్ చెయ్యడం లేదా టాయిలెట్ కు వెళ్లడం మర్చిపోరు, కాబట్టి మీరు ధ్యానం చెయ్యడం కూడా మర్చిపోకూడదు. రోజుకు కేవలం ఐదు నిమిషాలు అయినా సరే, దానిని మన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. మనం ఎవరు అయినా కానీ, మనమందరం ఉదయాన్నే ఐదు నిమిషాల ముందే నిద్ర లేచి ధ్యానాన్ని అలవాటు చేసుకోవచ్చు. ఇది అంత పరీక్షగా ఉండాల్సిన పని లేదు, దీనికి బదులుగా, ఇది చాలా స్థిరత్వాన్ని జోడిస్తుంది - ఆ రోజు ఎంత చికాకుగా ఉన్నప్పటికీ, కంటిన్యుటినీ అందించే ఈ సమయం మీకు ఎప్పుడూ ఉంటుంది.

Top