ధ్యానానికి కావాల్సిన మానసిక విషయాలు

విచక్షణ ధ్యానం

సాధారణంగా, ధ్యానంలో రెండు దశలు ఉన్నాయి: విచక్షణ ధ్యానం మరియు స్థిరీకరణ ధ్యానం. విచక్షణ ధ్యానంలో, మనల్ని పరిచయం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న మానసిక స్థితిని నిర్మించడానికి మనం ఆలోచనా ప్రక్రియలో చేసినట్లుగా ప్రోగ్రెసివ్‌ స్టెప్స్ లేదా రీజనింగ్ ద్వారా పనిచేస్తాము. కరుణ విషయంలో, మన బాధల గురించి ఆలోచించి వాటి నుంచి విముక్తి పొందాలనే సంకల్పాన్ని పెంపొందించుకుంటాము. అప్పుడు, దీనిని బేసిస్ గా తీసుకొని, మన చుట్టూ ఉన్న ఎక్కువ మంది జీవుల గుంపును ఊహించుకుంటూ ముందుగా మన మనస్సులను మరియు హృదయాలను ప్రతి ఒక్కరికి కోసం తెరుస్తాము, అనుబంధం, విరక్తి మరియు ఉదాసీనత లేకుండా ఉంటాము. అప్పుడు, ఈ జీవులన్నింటిపై దృష్టి కేంద్రీకరిస్తూ, మన పరస్పర సంబంధాన్ని మరియు వాటిపై మనం ఆధారపడడాన్ని గుర్తుతెచ్చుకుంటూ పనిచేస్తాము.

ఈ జీవులపై దృష్టి పెట్టేటప్పుడు, అవి అనుభవించే అన్ని బాధలను మనం గుర్తు చేసుకుంటాము. వాళ్ళు ఎప్పుడూ అసంతృప్తిగా మరియు నిరాశతో ఉంటారు, వాళ్లకు ఎప్పుడూ సరైన సంతృప్తి చెందని ఆనందం ఉంటుంది, వాళ్ళు సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తారు, కాని వారు తమను తాము సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించడం, వారి లుక్స్ గురించి ఆలోచించడం లేదా ఎక్కువ వస్తువులను కొనుక్కోవడం ఎప్పటికీ ఉపయోగపడవు అనేటటువంటి విషయాలు; ఇది వారికి ఇంకా సమస్యలను తెచ్చిపెడుతుంది. మనమందరం ఒకే పరిస్థితిలో ఉన్నామని, ఒకరి సహాయం మరొకరికి అవసరమని, అందరూ స్వార్థపరులైతే మనమందరం బాధపడాల్సి వస్తుందని గుర్తు చేసుకుంటాము.

ఈ విధంగా కరుణను అనుభూతి చెందుతాము, దీనితో మనమందరం సమానంగా, వారి బాధల నుంచి విముక్తి పొందాలనే కోరికతో ఈ భారీ సమూహంపై దృష్టి పెడతాము.  దీనికి తోడుగా, వారి సమస్యలను తొలగించడానికి మనం వ్యక్తిగతంగా సహాయం చేస్తాము.

విచక్షణ ధ్యానంతో, మనం ఈ జీవులపై జాలితో దృష్టి కేంద్రీకరిస్తూ ఉంటాము. కానీ అదే సమయంలో, మన కరుణ భావనను పెంపొందించడానికి మనం అనుభవించిన అన్ని విషయాలు మరియు పాయింట్లను మనం గ్రహించే మరియు గుర్తించే అర్థంలో చూస్తాము. అందుకోసం, మన కరుణా మయమైన మానసిక స్థితి స్థూల గుర్తింపుని మరియు సూక్ష్మ విచక్షణను కలిగి ఉంటుంది. మొదటి దానితో, కేవలం గమనించడం అనే అర్థంలో, మన దృష్టి యొక్క వస్తువు గురించి అత్యంత సాధారణ అంశాన్ని మనం గుర్తిస్తాము, అలా ఈ సందర్భంలో వారు బాధపడుతున్నారనే వాస్తవాన్ని మనం గుర్తిస్తాము. రెండవది, వారు అనుభవించే వివిధ రకాల బాధల పూర్తి వివరాలను మనం తెలుసుకుంటాము. ఈ రెండింటితో, వస్తువులకు సంబంధించిన ఈ అంశాలన్నింటినీ మనం గుర్తిస్తాము. కొంతవరకు వివరణాత్మకమైన, లోతైన అవగాహన లాగా  ఒక మానసిక స్థితిగా సంశ్లేషణ చెందుతాము. కానీ ప్రతి అంశాన్ని వదిలెయ్యకుండా మన మనస్సులో మౌఖికంగా వాటిని అర్థం చేసుకుంటాము. ఈ వివరాలను మనం గుర్తించడం, ఆలోచించడం బలహీనంగా మారితే, మనం అన్ని అంశాలను ఒక్కొక్కటిగా మళ్ళీ పరిశీలిస్తాం, ఆపై స్థూల గుర్తింపు మరియు సూక్ష్మ విచక్షణ మరియు ఏకాగ్రతతో నిండిన కరుణను మరోసారి సృష్టిస్తాము.

స్థిరీకరణ ధ్యానం

మనం స్థిరమైన ధ్యానంతో విచక్షణ ధ్యానాన్ని అనుసరిస్తాము. ఇప్పుడు మనం అదే కరుణతో ఈ జీవుల సమూహంపై దృష్టి పెడతాము, కానీ ఈ సారి వారి బాధలను  అనుభవించే అవగాహనతో మరియు బుద్ధిపూర్వకతతో చూస్తాము.

అది ధ్యాన ప్రక్రియ; మీరు దేనినైనా ఎలా అన్వయించుకుని దానికి మిమ్మల్ని మీరు ఎలా అలవాటు చేసుకుంటారు అనేది. మీరు ఒక వస్తువుపై దృష్టి పెట్టే ఒక రకమైన ధ్యానం గురించి మనం మాట్లాడినా, లేదా మీరు మానసిక స్థితిలో ఉండే ఒక రకమైన ధ్యానం గురించి మాట్లాడినా లేదా ఈ రెండింటిని కలిపి ఒక రకమైన ధ్యానం గురించి మాట్లాడినా, ఇవన్నీ ఒకేలా ఉంటుంది.

విచక్షణ ధ్యానం నుంచి స్థిరీకరణ ధ్యానాన్ని వేరు చెయ్యడం

మీ మానసిక కార్యాచరణ యొక్క శక్తి పరంగా విచక్షణ ధ్యానానికి మరియు స్థిరీకరణ ధ్యానానికి మధ్య ఉన్న తేడాను దలైలామా గారు వివరించారు. ఈ రెండింటిని వేరు చెయ్యడానికి ఇది చాలా మంచి మార్గం. విచక్షణ ధ్యానంతో, మీ దృష్టి యొక్క శక్తి బయటకు వెళ్తుంది, అంటే అది బయట వాటి గురించి ఆలోచిస్తుంది అనమాట. స్థిరమైన ధ్యానంతో, మీ దృష్టి యొక్క శక్తి లోపలికి వెళ్తుంది, భావోద్వేగం లేదా అవగాహనను మునిగిపోనివ్వడంపై దృష్టి పెడుతుంది, వివేకవంతమైన ధ్యానం లోని ప్రధాన అంశాల యొక్క బుద్ధి పూర్వకత ఆధారంగా. విచక్షణ ధ్యానంలో లాగా శక్తి చెప్తూ వ్యాపించదు, కానీ సంకుచితంగా ఉంటూ ప్రధాన అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది.

కరుణతో ఒకరిని గుర్తించడం - ఒక రకంగా చెప్పాలంటే, శక్తి, దాని యొక్క అన్ని వివరాలతో బయటకు వస్తుంది - మరియు శక్తి ఎక్కువగా కేంద్రీకృతమైన ఆ కరుణను స్థిరీకరించడం మధ్య తేడాను గుర్తించగలగడం చాలా అధునాతనమైనది. మనస్సును శాంత పరచడం వల్ల కలిగే ప్రయోజనాలలో ఇది ఒకటి. మీ లోపల ఉన్న అన్ని శబ్దాలను (నిరంతరం మాట్లాడటం, కామెంట్ చెయ్యడం, మీ ఐపాడ్ లో ఎప్పుడూ మ్యూజిక్ ప్లే అవ్వడం) శాంత పరచడంలో మీరు కొంతవరకు విజయం సాధిస్తే, అప్పుడు మీరు మీ శక్తితో సున్నితంగా ఉండటం ప్రారంభించవచ్చు మరియు మీ మానసిక శక్తి ఎలా ఉంటుందో మీరే చెప్పగలరు.

మీ శక్తికి సున్నితంగా మారడం ప్రారంభించడానికి ఉత్తమ మార్గం మీ శక్తి అస్తవ్యస్తంగా ఉందా లేదా ప్రశాంతంగా ఉందా అనే దానిపై దృష్టి పెట్టడమే. ఉదాహరణకు, మీరు కోపం, భయం, ఆందోళన, దురాశ లేదా అహంకారం వంటి ఇబ్బందిపెట్టే భావోద్వేగాల యొక్క ప్రభావానికి గురవుతున్నారో లేదో గుర్తించే మార్గం ఏమిటంటే, మీ శక్తి ప్రశాంతంగా ఉండకపోవడమే. మీరు ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు, మీ కడుపులో ఇబ్బందిని మీరు గ్రహించగలిగితే, మీ శక్తి కొద్దిగా మారిపోయిందని మీరు గమనిస్తే, ఇది ఒక రకమైన ఇబ్బందికరమైన భావోద్వేగం అని సూచిస్తుంది. మీరు ఆ వ్యక్తిని ఆకట్టుకోవడానికి ప్రయత్నించవచ్చు, లేదా దేని కోసమైనా వాళ్లను ఒప్పించడానికి ప్రయత్నించవచ్చు, లేదా కొంత కోపంలో ఉండవచ్చు - వీటిలో ఏదో ఒకటి మీ మనస్సులో ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఏదో తప్పు ఉందని మీరు గుర్తించగలిగితే, మీ ఆలోచనా ప్రక్రియను మళ్ళీ ప్రారంభించడానికి - మీ మనస్సును ఒక విధంగా మళ్ళీ ప్రారంభించడానికి మరియు మీ పనుల వెనుక ఉన్న భావోద్వేగాన్ని మార్చడానికి మరియు ఆరోగ్యకరమైన వాటిని ఉంచడానికి మీకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఒకరితో పరస్పర సంభాషణలో, మీరు నిజంగా అక్కడ ఇబ్బందిపెట్టే భావోద్వేగాలను గుర్తించగలగాలి.

సమయం గడిచే కొద్దీ, ప్రాక్టీస్ తో, మీరు చివరికి ధ్యానం యొక్క బయటి శక్తిని మరియు ధ్యానాన్ని స్థిరీకరించే లోపలి శక్తిని వేరు చెయ్యగలుగుతారు.

ఏకాగ్రతను పొందడానికి అవసరమైన కారణాలు

ఏకాగ్రతను పొందడానికి అవసరమైన కారణాలు విచక్షణ మరియు స్థిరీకరించే ధ్యానాలు. శాంతిదేవుడు తన గ్రంథంలో, భోధిసత్వ ప్రవర్తనలో నిమగ్నం అయ్యి, నైతిక క్రమశిక్షణను పెంపొందించే సందర్భంలో వాటిని చర్చిస్తాడు. కాబట్టి ముందుగా మనం ఎలా ప్రవర్తిస్తాం, ఎలా మాట్లాడుతాం అనే స్థూల ప్రవర్తనలో ఈ పద్ధతులను అభివృద్ధి చేసుకోవాలి, ఆపై వాటిని మన మనస్సులకు అన్వయించుకోవాలి.

ఈ రెండు సందర్భాల్లో మనకు అవసరమైన మరియు ఉపయోగించే ప్రధాన మానసిక విషయం బుద్ధి పూర్వకత, ఇది మానసిక స్థితిని లేదా ప్రవర్తించే విధానానికి కావలసిన మానసిక జిగురు లాంటిది. ఇది "గుర్తుంచుకోవడం" అనే పదం లాంటిది. కానీ మన మెమరీ ఫైల్ నుంచి ఏదైనా తీసి దాన్ని గుర్తుంచుకోవడం గురించి మనం మాట్లాడటం లేదు. మనం ఏ వస్తువు మీద దృష్టి కేంద్రీకరిస్తామో, దానికి మనసు ఏ విధంగా కనెక్ట్ అవుతుందో అని మనం తెలుసుకోవాలి.

బుద్ధి పూర్వకతతో ధ్యానం చేసేటప్పుడు, మనం మన మానసిక శ్రద్ధను గమనిస్తూ ఉంటాం. సాధారణ అర్థంలో, మన మానసిక స్థితిని ఇబ్బంది పెట్టే భావోద్వేగాలు, మానసిక ఇబ్బందులు. సోంగ్ ఖాపా గారు డల్ నెస్ ప్రభావానికి లోనవుతోందో లేదో చూడటానికి ఇక్కడ స్థూల గుర్తింపు అనే మానసిక కారణాన్ని ఉపయోగిస్తాము అని వివరించారు. అతను సూక్ష్మ విచక్షణ కంటే స్థూల గుర్తింపును పేర్కొనడం చాలా ముఖ్యమైనది. సూక్ష్మ విచక్షణ అనేది వివరంగా తనిఖీ చేయడం గురించి ఉంటుంది, అలా మన దృష్టి ప్రధానంగా దేనిపై ఉండదు. ధ్యానంలో ఒక పెద్ద ప్రమాదం ఉంది, మనం ఇబ్బంది పడతాం మరియు వేరే వాటి గురించి ఆలోచించడం ప్రారంభిస్తామని అనిపిస్తుంది. ఇది ఒక పెద్ద సమస్యను సృష్టిస్తుంది. మరోవైపు, మీరు చాలా రిలాక్స్ గా మరియు అలసటగా ఉండటానికి ఇష్టపడరు; అది ఏమాత్రం ఉపయోగపడదు.

అప్పుడు మనకు అప్రమత్తత అవసరం, ఇది ఒక అలారం వ్యవస్థ లాంటిది. మనం ధ్యానం అనే దాన్ని కోల్పోతున్నామని గుర్తించినప్పుడు, అప్రమత్తత అలారం మోగిస్తుంది - ఏదో సరిదిద్దాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు మనం శ్రద్ధతో దృష్టిని తిరిగి తెచ్చుకుంటాము.

సరిదిద్దుకోవాల్సిన లోపాలు

మనం వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్న రెండు లోపాలు రెండు ప్రధాన కేటగిరీల కిందకు వస్తాయి: "మనస్సు యొక్క కదలిక" మరియు "మానసిక నీరసం". అనుబంధం లేదా కోరిక కారణంగా మనం మానసికంగా సంచరించే చోటే మన మనస్సు వెళ్తుంది. ఇది మౌఖిక ఆలోచన లేదా మానసిక చలనచిత్రాల రూపాన్ని తీసుకోవచ్చు. చాలా సాంప్రదాయ గ్రంథాలు ఈ విచ్చిన్నతను లైంగిక అనుబంధంగా చూపిస్తాయి, బహుశా ఆ సమయంలో ప్రధాన ప్రేక్షకులు బ్రహ్మచారి సన్యాసులు మరియు సన్యాసినులు, లైంగిక అనుబంధాన్ని అధిగమించే సమస్య ప్రధానమైనది. కానీ అది ఆహారం లేదా సంగీతం లేదా వేరే వాటికి సంబంధించినది కావచ్చు. దీనికి విరుద్ధంగా, మానసిక ఇబ్బంది ఏదైనా ఇబ్బందికరమైన భావోద్వేగం, ఆలోచన, శబ్దం లేదా ఇంకేదైనా పని వల్ల కూడా సంభవించవచ్చు. మరింత సాధారణ పదంగా, మానసిక సంచారాన్ని "పరధ్యానం" అని కూడా పిలుస్తారు.

వస్తువు లేదా అనుభూతిపై మన దృష్టిని ఉంచడంతో వ్యవహరించే మనస్సు యొక్క అనేక స్థాయిలు ఉన్నాయి..

  • తక్కువ ఇబ్బందులు - మీరు ఒక విషయంపై పట్టును పూర్తిగా కోల్పోయి అన్ని రకాల విషయాల గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు. బుద్ధి పూర్వకత, మానసిక శక్తి చాలా బలహీనం అయ్యి మీరు ఆ విషయాన్ని పూర్తిగా మరచిపోతారు.
  • కొన్ని ఇబ్బందులు - మీరు ఆ విషయాన్ని పూర్తిగా విడిచిపెట్టరు, కానీ, అదే సమయంలో, మీరు వేరే దాని గురించి ఆలోచించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు.
  • చిన్నపాటి ఇబ్బందులు - మీకు ఆ విషయం గురించి ఏమీ అనిపించరు, కానీ దాన్ని విడిచిపెట్టి వేరొక దాని గురించి ఆలోచించడానికి ఒక రకమైన ఆలోచన ఉంటుంది. మానసిక శక్తి బాగా ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది.

మానసిక డల్ నెస్ అనేది వస్తువు యొక్క స్పష్టతతో వ్యవహరిస్తుంది, ఇది చూసే రూపం కావచ్చు లేదా కరుణ లాంటి మానసిక స్థితి యొక్క అనుభూతి కావచ్చు.

  • తక్కువ డల్ నెస్ - మీ మనస్సు యొక్క "రూపాన్ని తయారుచేసే" పనితీరు చాలా బలహీనంగా ఉంటుంది. ఇది ఎటువంటి ఊహలకు లేదా అనుభూతికి దారితీయదు. ఇది "నీరసపు-మనస్సు" అని పిలువబడే రెండు ఇతర కారణాలతో ఉంటుంది. ఇది శరీరం మరియు మనస్సులో భారీ అనుభూతి లేదా నిద్రతో ఉంటుంది.
  • కొంత డల్ నెస్ - ఒక రూపం ఉంది, కానీ దానిపై పట్టు సరిగ్గా లేదు కాబట్టి దానికి పదును లేదు. మనం ఇక్కడ ఊహల యొక్క వివరాలపై పదునైన దృష్టి గురించి మాట్లాడటం లేదు, కానీ కరుణ లాంటి భావోద్వేగం కూడా దృష్టిని మార్చగలదు. ఇది చాలా అస్పష్టమైన భావన కావచ్చు, "ప్రేమ, శాంతి, నేను ప్రతి ఒక్కరినీ ప్రేమిస్తున్నాను" అని మీరు ఒక అనుభూతిని సృష్టిస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరూ బాధ నుంచి విముక్తి పొందాలనే కోరిక గురించి ఆలోచించడం లేదు. మనం సృష్టించాలనుకునే మానసిక స్థితి యొక్క ప్రతి వివరం, ప్రతి అంశం చాలా నిర్దిష్టమైనవని మనం గుర్తుంచుకోవాలి - అది అస్పష్టంగా ఉండకూడదు.
  • చిన్నపాటి డల్ నెస్ – మీ మనస్సు ఆ విషయం గురించి ఆలోచించినప్పుడు మీకు పదునైన దృష్టి ఉంటుంది, కానీ నిర్వహణ సరిగ్గా ఉండదు అందుకే అది తాజాగా, స్పష్టంగా లేదా సజీవంగా ఉండదు. ఇది ప్రతి క్షణం తాజాగా ఉండాలి, చాలా పాత మరియు కఠినమైనది కాకుండా.

మనం "వదిలి వేయబడ్డాం" అనే విషయంలో, అది పై లోపాలలో దేనినైనా సూచించవచ్చు, కాబట్టి వీటిలో అది ఏదో మనం గుర్తించగలగాలి. ముందుగా, మీరు ఆ విషయం లేదా అ ఆలోచనపై మీ మానసిక శక్తిని ఉంచుతారు. ఆ తర్వాత బుద్ధి పూర్వకతతో, మానసిక ఆలోచనతో, దాన్ని వదిలిపెట్టరు.

ఒక విజయవంతమైన ధ్యానానికి ఇది చాలా ముఖ్యమైన అంశం. దీని గురించి ఎక్కువగా ఆలోచించకుండా మాములుగానే పట్టించుకోండి. ఉదాహరణకు, మీరు డైట్ లో ఉన్నప్పుడు మరియు బేకరీ గుండా వెళ్తున్నప్పుడు అక్కడి కిటికీలో మంచి కేకులు ఉన్నప్పుడు, మీరు మీ డైట్ విషయాన్ని మైండ్ లో పెట్టుకోవాలి, అప్పుడు మీరు దుకాణంలోకి వెళ్లి ఆ చాక్లెట్ కేక్ ముక్కను కొనకుండా ఉంటారు. అక్కడ టేబుల్ దగ్గర ఉన్న ప్రతి ఒక్కరికి ఐస్ క్రీం ను వడ్డిస్తున్నారు మరియు మీరు మీ డైట్ గురించి ఆలోచించి, "నాకు వద్దు థాంక్స్, నేను డైట్ లో ఉన్నాను" అని చెప్తారు.

కాబట్టి, మనం తప్పుదారి పడుతున్నామో లేదో తెలుసుకోవడానికి గుర్తించడం అవసరం. "నా మానసిక స్థితి, మరియు ఆలోచనలో ఏదైనా లోపం ఉందా?. నా మనస్సులో ఏదైనా లోపం ఉందా, వాడు అనటానికి దారితీస్తుందా?" అని మనం ఏదైనా లోపాన్ని గుర్తిస్తే, అప్రమత్తత లోపలి అలారంను మోగిస్తుంది మరియు శ్రద్ధ మన దృష్టిని తిరిగి తెస్తుంది. అదే సమయంలో, మనం దాని గురించి ఒక మతిస్థిమితం లేని పోలీసుగా ఉండకూడదు, ఇక్కడ పోలీసు అయిన "నేను" మరియు ధ్యానం చేస్తున్న "నేను" మధ్య ఈ తేడా ఉంది. ఇటువంటి రెండు రకాల ధ్యానాన్ని నివారించడానికి, ఆత్మ యొక్క శూన్యత (శూన్యం) గురించి కొంత అవగాహనను కలిగి ఉండాలి. అప్పుడు ఈ అసాధ్యమైన రెండు రకాల మార్గంలో మనం పూర్తిగా మునిగిపోయి ఉండము.

ధ్యానంలో శిక్షణ పొందిన నైపుణ్యాల యొక్క ఆచరణాత్మక అప్లికేషన్ 

బుద్ధి పూర్వకత మరియు ఏకాగ్రతతో ఒక విషయంపై ఏకాగ్రతతో ఉండే సామర్థ్యం మన జీవితంలో చాలా అవసరం. అందుకే మనం ధ్యానాన్ని ప్రాక్టీస్ చేస్తాం: మనం పెంపొందించుకునే ప్రయోజనకరమైన అలవాట్లను మన జీవితంలో అన్వయించుకోగలుగుతాం. ఉదాహరణకు, మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు లేదా వారు చెప్పేది వింటున్నప్పుడు, శ్రద్ధతో ఉండాలి, ఏకాగ్రతతో ఉండాలి, భోజనం గురించి ఆలోచించకూడదు లేదా లోపల "నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్లిపో" అని అనుకోకూడదు. కాబట్టి వ్యక్తిగత సంభాషణలు, మన పని, మన అధ్యయనం మొదలైనవి ఏకాగ్రతను అభ్యసించడానికి ఇవి సరైనవి.

నాలుగు సహకారులు

మన ధ్యానంలో ఏకాగ్రతను పొందడానికి పనిచేసేటప్పుడు మనకు అవసరమైన రెండు విషయాలు శక్తి ("పట్టుదల" అని పిలవబడుతుంది) మరియు సహనం. శక్తి బలమైనది, దాదాపు వీరోచిత ధైర్యం మరియు ఏదైనా పాజిటివ్ విషయాన్ని సాధించడానికి సహాయపడుతుంది; సహనం అనేది నిరుత్సాహ పడకుండా లేదా కోపగించుకోకుండా అన్ని కష్టాలను భరించగల సామర్థ్యం. శాంతిదేవుడు తన గ్రంథం భోధిసత్వ ప్రవర్తనలో నిమగ్నం కావడం గురించి మనలో శక్తిని పెంపొందించుకోవడానికి సహాయపడే ఆరు అంశాలను వివరించాడు. వాటిని నాలుగు సహకారులు మరియు రెండు శక్తులు అని పిలుస్తారు.

మొదటిది దృఢమైన విశ్వాసం లేదా దృఢమైన ఆకాంక్ష అని అంటారు. "ఆకాంక్ష" అనేది ఒక కోరికకు బలమైన పదం మరియు ఒక లక్ష్యాన్ని సాధించడం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు దానిని సాధించ లేకపోవడం వల్ల కలిగే నష్టాల గురించి గట్టిగా విశ్వసించడం అని అర్ధం. దానిని సాధించాలనే ఆకాంక్షను మార్చలేము లేదా తిప్పికొట్టలేము. మన బౌద్ధమత అభ్యాసంతో మనం సాధించాలనుకునే వివిధ మానసిక స్థితుల గురించి చదివినప్పుడు, ప్రజంటేషన్ ఎప్పుడూ దానిని సాధించడం వల్ల కలిగే ప్రయోజనాలను మరియు చేయకపోవడం యొక్క లోపాలను ఇస్తుంది. ఇవి నేర్చుకోవడానికి ముఖ్యమైనవి. శాంతిదేవుడు తన గ్రంథంలో ఈ పద్ధతిని అనుసరిస్తాడు, దీనిలో మొదటి అధ్యాయం బోధిచిత్త గురించి ఉంటుంది. ఈ మానసిక స్థితిని కలిగి ఉండటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనకు నమ్మకం కలుగుతుంది, అలా ఇది మనకు బలాన్ని ఇస్తుంది మరియు దాని కోసం పనిచేయడానికి మనకు సంతోషాన్ని ఇస్తుంది. మనం నిరుత్సాహానికి గురైనప్పుడల్లా మనం సాధించాలనుకున్న ప్రయోజనాలను గుర్తుచేసుకోవడం మంచిది.

ఆ తర్వాత స్థిరత్వం లేదా ఆత్మవిశ్వాసం. "స్థిరత్వం" అంటే సాధనలో స్థిరంగా మరియు పట్టుదలతో ఉండటం. ఇది మనం కోరుకున్న లక్ష్యాన్ని సాధించగలమా లేదా అని పరిశీలించడం మరియు మనం అలాగే ఉన్నామని నమ్మడం. ఆత్మవిశ్వాసం ఉంటే పురోగతి ఉన్నా లేకపోయినా మనల్ని మనం స్థిరంగా ఉంచుకుంటాం. కొన్ని రోజులు గొప్పగా, మరికొన్ని రోజులు భయంకరంగా గడుస్తాయి. కొన్ని రోజులు మనం వెళ్ళడానికి కష్టపడతాము, మరికొన్ని రోజులు మనం ప్రాక్టీస్ చెయ్యడానికి అస్సలు ఇష్టపడము. కానీ మనకు ప్రయోజనాల గురించి తెలిస్తే, పట్టుదల ఉంటే, అది కవచం లాగా ఉపయోగపడుతుంది, అప్పుడు మనం ఇలా ఆలోచిస్తాము, "ఏం పర్వాలేదు. అది ఎలా ఉన్నా నేను పట్టించుకోను, నేను ప్రతిరోజూ ఒకేలా ఉంటాను. చివరికి నా లక్ష్యాన్ని పొందడం సాధ్యమేనని నాకు తెలుసు."

మనం దీర్ఘకాలికంగా ప్రోగ్రెస్ ను సాధిస్తున్నప్పుడు, ఎక్కువ ఏకాగ్రత వహించే ధోరణిని మనం క్రమంగా చూస్తాము మరియు తర్వాతి సపోర్ట్ ను అభివృద్ధి చేసుకుంటాము, ఇదే ఆనందం. మనం కేవలం కొద్దిపాటి ప్రోగ్రెస్ తో సంతృప్తి చెందలేము, కాబట్టి ఆత్మ సంతృప్తి భావనతో ముందుకు సాగడంలో సంతోషాన్ని పొందుతాము. ఫలితం ఏమిటంటే, మనం సంతోషంగా ఉంటాము. మన మనస్సులు తక్కువ దృష్టిని కోల్పోయి, తక్కువ ఇబ్బంది పడడం వల్ల, ఖచ్చితంగా, మనం సంతోషంగా ఉంటాము. ఇది చూసి, మనం ఇంకా ముందుకు సాగిపోయి ఎక్కువ ప్రోగ్రెస్ ని సాధిస్తాం.

నాలుగవ సపోర్ట్ విశ్రాంతి, అంటే మనం అలసిపోయినప్పుడు విరామం తీసుకోవడం. ఇది బద్దకం వల్ల కాదు, మనల్ని మనం రిఫ్రెష్ చేసుకోవడానికి ఇలా చేస్తాము. ఎక్కువగా కష్టపడి ఏదీ సాధించకుండా ఓడిపోవడం కన్నా మనల్ని ఇంకేదీ బాధపెట్టదు. చాలా కష్ట పడటం నిజంగా శరీరంలోని శక్తిని ఇబ్బంది పెడుతుంది - బెలూన్ పేలిపోయే స్థాయికి నొక్కడం లాగా ఉంటుంది. మనల్ని మనం జడ్జ్ చేసుకోగలగాలి మరియు మనకు ఎప్పుడు విశ్రాంతి అవసరమో తెలుసుకోగలగాలి. దాని గురించి మనం అపరాధ భావన చెందకూడదు! మనల్ని రిలాక్స్ చేసేదాన్ని ఎంచుకోవడం మంచిది కానీ మన భావోద్వేగాలను పెంచుకోకూడదు. సహజంగా, ప్రతి ఒక్కరికి ఇది వేరుగా ఉంటుంది. ఇవి శక్తికి నాలుగు సపోర్ట్ లు.

రెండు శక్తులు

ఇప్పుడు రెండు శక్తుల గురించి తెలుసుకుందాం. మొదటిది సహజమైన అంగీకారం, అంటే మన లక్ష్యాలను చేరుకోవడానికి మనం ఏమి ఆచరించాలో మరియు మనం వేటిని వదిలేయాలో అని తెలుసుకోవడం. మన పరిస్థితి యొక్క వాస్తవికతను చూస్తాము మరియు మనల్ని ఇబ్బంది పెట్టే భావోద్వేగాలను వదిలించుకోవడంలో ఉన్న కష్టాలను  స్వీకరిస్తాము. మొదట్లో మనం రియలిస్టిక్ గా ఉండాలి అప్పుడే తర్వాత ఎంత కష్టపడతామో అది చూసి ఆశ్చర్యపోకుండా ఉంటాము!

దలైలామా గారు ఎప్పుడు చెప్పినట్లుగా, "బౌద్ధమతం సులభం మరియు తొందరగా అర్ధం అయిపోతుంది అని చెప్పుకునే ఏ బౌద్ధ గురువు లేదా వ్యక్తి అయినా - ఆ వ్యక్తిని మరియు అతని ప్రేరణను అనుమానించండి, ఎందుకంటే అది అంత సులభంగా అర్ధం అయిపోయేది కాదు. భావోద్వేగాలను ఇబ్బంది పెట్టడం మనకు ఎంత అలవాటైందంటే, వాటిని వదిలించుకోవడానికి మాత్రలు వేసుకున్నంత సులువుగా ఏ మార్గం లేదు.” నా గురువులలో ఒకరైన గెషె ఎన్గావాంగ్ ధార్గే గారు ఎప్పుడూ ఇలా చెప్పేవారు, "బౌద్ధమతంలో సులభమైన మరియు వేగవంతమైన మార్గాలకు ఆకర్షితులైన వారు ఎవరైనా, అది ప్రాథమికంగా బద్ధకం వల్లే అయి ఉంటుంది. కష్ట పడాల్సిన అవసరం వాళ్లకు ఉండదు" అని.

రెండవ శక్తి నియంత్రణలోకి తీసుకోవడం, అంటే మనం సాధించాలనుకునే దాన్ని నియంత్రించడం మరియు అన్వయించుకోవడం. మన బద్దకం లేదా మరే ఇతర ఇబ్బందికరమైన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోనివ్వకుండా, లక్ష్యాన్ని సాధించాలనే మన ఆకాంక్షను నియంత్రిస్తుంది. "ఒక చిన్న పిల్లాడిలా ఉండటం మానెయ్యండి. కలిసి చేద్దాం!" అని మనకు మనమే చెప్పుకుందాం.

అలసట లేదా బద్ధకం?

అలసట మరియు బద్ధకం మధ్య తేడాను మనం ఎలా గుర్తించగలమని ఎవరైనా ఆశ్చర్యపోవచ్చు. ముందు అసలు చిన్న చిన్న విషయాల నుంచి దృష్టి పోయినప్పుడు వివిధ రకాల బద్ధకం ఉంటుంది. మనకు ధ్యానం లేదా అధ్యయనాలు లేదా ఇంకేదైనా చెయ్యడానికి చాలా బద్దకం ఉంటుంది. దానికి బదులుగా టీవీ ప్రోగ్రామ్ లేదా ఇంటర్నెట్ సర్ఫింగ్ నుంచి దృష్టి పోగొట్టుకుంటాము. అప్పుడు విషయాలను వాయిదా వేయవచ్చని అనుకునే వరకు బద్ధకం ఉంటుంది. అప్పుడు మీరు "నేను అస్సలు ఇది చెయ్యలేను" అనే సాకులు చెప్పే ఒక రకమైన బద్దకంతో ఉంటారు.

మనం అలసిపోయినప్పుడు, మనకు ఇంకా అది చెయ్యడానికి కోరిక ఉంటుంది: "నేను నిజంగా చేయాలనుకుంటున్నాను, కానీ నేను ఇప్పుడు నిద్రపోతున్నాను కాబట్టి కొద్ది సేపు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత చేస్తాను" అని అంటాం. ఇది సాకులు చెప్పడం లేదా పట్టించుకోకపోవడం కాదు. ఇది బద్దకం, ఈ బద్ధకమే ఏ పనిని చేయనివ్వకుండా ఆపుతుంది.

సారాంశం

ధ్యానం అనేది సులభమైనది కాదు, మరియు ఈ శక్తిని సాధించటానికి చిన్న చిన్న మార్గాలు ఉన్నాయని ఎవరైనా చెప్తే వాళ్లను మనం నమ్మకూడదు, సాధారణంగా చెప్పాలంటే, అసలు ఇలా ఎప్పుడూ జరగదు.

మన ధ్యానం ఒక చురుకైన ప్రక్రియగా ఉండాలి, డల్ గా లేదా విసుగు కలిగించేలా ఉండకూడదు, ఇక్కడ మనం విన్న మరియు ఆలోచించిన బోధనలను లోతుగా అర్థం చేసుకుంటాము. ఇలా మనం ప్రతి రోజు, ప్రతి సంవత్సరం చెయ్యగలిగితే, బోధనలు పాతుకుపోతాయనడంలో సందేహం ఉండదు మరియు సమస్యలు లేదా నెగెటివ్ భావోద్వేగాలు వచ్చినప్పుడు, చివరికి వాటిని అప్రయత్నంగా ఎదుర్కోగలుగుతాము.

Top