అనేక ధ్యాన అభ్యాసాలలో ఊహించుకోవడం ఉంటుంది. "ఊహించుకోవడం" అనేది కొంచెం తప్పు దోవ పట్టించే అనువాదం కావచ్చు, ఎందుకంటే ఇందులో మనం మన కళ్లను ఉపయోగించడం లేదు. మనం మన ఊహా శక్తిని ఉపయోగిస్తున్నాం, కాబట్టి ఇది కేవలం దృశ్యమే కాదు, శబ్దాలు, వాసనలు, అభిరుచులు మరియు శారీరక అనుభూతులను కూడా కలిగి ఉంటుంది. మనం వివిధ పదార్ధాలను మానసికంగా సమర్పించినప్పుడు, వాటిని ఆస్వాదించడం ద్వారా లభించే ఇంద్రియ ఆనందాన్ని ఊహించుకుంటాము. ఇక్కడ, మనం టూ డైమెన్షనల్ చిత్రాలను విజువలైజ్ చేయడం లేదు; ఒక చిత్రం, విగ్రహం లేదా ఒక కార్టూన్ బొమ్మ కాకుండా కాంతితో తయారైన సజీవ, త్రీ డైమెన్షనల్ చిత్రాలను ఊహించుకోవాలి.
బుద్ధునిపై దృష్టి పెట్టడం
మహాయాన సంప్రదాయంలో ఏకాగ్రత సాధన చేసేటప్పుడు, చాలా మంది ఉపాధ్యాయులు శ్వాసపై దృష్టి పెట్టాలని సలహా ఇస్తారు, ఎందుకంటే ఇది సులభమైన మార్గం. అయితే, ఈ సంప్రదాయంలో సర్వసాధారణమైన ఆచారం ఏమిటంటే, ఒక చిన్న బుద్ధుడిని ఊహించుకుని ఏకాగ్రతను పొందడం. మనం ఒక ఆపిల్ వైపు చూస్తూ ఏకాగ్రతను పొందవచ్చు, కానీ నిజానికి, ఆపిల్ వైపు చూడటం వల్ల ప్రయోజనం ఏమిటి? మనం బుద్ధునిపై దృష్టి పెడితే ఏకాగ్రతను పెంపొందించుకోవడంతో పాటు, బుద్ధుని లక్షణాల గురించి కూడా తెలుసుకొని, బుద్ధుడు సూచించిన సురక్షితమైన దిశను (ఆశ్రయం) మన జీవితంలో పొందుతాము. అలా బోధిచిత్తతో మనమే బుద్ధులుగా మారడం లాంటివి చేయవచ్చు.
అంతేకాక, పరిపూర్ణ ఏకాగ్రతను సాధించడం మానసిక చైతన్యం ద్వారా వస్తుందని, ఇంద్రియ చైతన్యాల ద్వారా కాదని ప్రాచీన భారతీయ గురువు ‘అసంగ’ గారు చెప్పారు. ఎందుకంటే ఆ ఏకాగ్రతను మన మనస్సులతో ప్రేమను, కరుణను, శూన్యతను అర్థం చేసుకోవడానికి ఉపయోగించబోతున్నాము. మనం సృష్టించాలనుకుంటున్న మానసిక స్థితిలో ఏకాగ్రతను పొందడానికి, బుద్ధ విగ్రహాన్ని దృశ్యమానం చేయడం మన మానసిక చైతన్యానికి శిక్షణ ఇవ్వడానికి ఒక సాధనం. అందువల్ల, ముఖ్యంగా టిబెటన్ గెలుగ్ సంప్రదాయంలో, పరిపూర్ణ ఏకాగ్రతను పొందడానికి బుద్ధుడిని దృశ్యమానం చేయడంపై మనం ఎప్పుడూ ప్రాధాన్యతను చూపిస్తాము.
టిబెట్ లోని సాక్య, నైంగ్మా మరియు కాగ్యు సంప్రదాయాల విషయం ఏమిటి? ఇక్కడ శ్వాసపై దృష్టి పెట్టమని లేదా బుద్ధుని చిత్రలేఖనం లేదా బొమ్మను కళ్లతో చూడమని మనకు సలహా ఇవ్వబడుతుంది. ఇది అసంగ సలహాకు విరుద్ధమా? అంటే కాదు. మనస్సు వస్తువులను ఎలా గుర్తిస్తుందో చూసినప్పుడు, కంటికి రంగు ఆకారాల గురించి మాత్రమే తెలుసు, మరియు ఒక్క క్షణంలో మాత్రమే అది తెలుస్తుందని ఈ మూడు విషయాలు చెబుతున్నాయి. అదే విధంగా, చెవి కూడా ఒక్క క్షణం శబ్దాల గురించి మాత్రమే తెలుసుకుంటుంది. భావాత్మక జ్ఞానం అప్పుడు వాటన్నిటినీ కలిపి "కామన్-సెన్స్ ఆబ్జెక్ట్" అని పిలుస్తుంది. ఉదాహరణకు, ఆపిల్ ఎరుపు గోళాకార ఆకారం మాత్రమే కాదు. ఇది కేవలం రుచి లేదా వాసన మాత్రమే కాదు. ఇది మీ చేతిలోని శారీరక అనుభూతి లేదా మీరు దానిని కొరికినప్పుడు వచ్చే శబ్దం ఉంటుంది. ఇది ఒక క్షణం మాత్రమే కనపడి, ఆ తర్వాత, ఇది పూర్తిగా వేరే వస్తువులా ఉండదు; ఇది ఎంత సేపయినా అలానే ఉంటుంది. ఆ ఆపిల్ చివరికి కుళ్లిపోయి పడిపోతుంది, కానీ కొన్ని రోజుల పాటు ఉండే ఆపిల్ ఉంటుంది. మీరు ఆ ఆపిల్ ను చూసినప్పుడు, నిజంగా ఒక మానసిక నిర్మాణాన్ని చూస్తారు.
ఈ జ్ఞానం యొక్క వివరణ ప్రకారం, మనం ఒక ఆపిల్ లేదా శ్వాసపై దృష్టి పెట్టినప్పుడు, అది ఒక భావనాత్మక వస్తువు. ఈ భావనాత్మక వస్తువులు మానసిక చైతన్యంపై దృష్టి పెడతాయి. భావాత్మకంగా, రంగు ఆకారాలు మరియు వాసనలు మరియు వరుస క్షణాలను ఒక వస్తువులో ఉంచుతాము. సాధారణ జ్ఞానంతో, దానిని మనం "ఆపిల్" లేదా ఇంకేమని అయినా పిలవచ్చు. కాబట్టి, మానసిక చైతన్యం ద్వారా ఏకాగ్రతను పెంపొందించుకోవాలన్న అసంగ వాదనను కూడా ఈ పాఠశాలలు గౌరవిస్తున్నాయి.
అసలైన ప్రాక్టీస్
ఏకాగ్రతను పొందడానికి బుద్ధుని బొమ్మను చూస్తే, ఆ బుద్ధుడు మన బొటనవేలు పరిమాణంలో ఉండాలి మరియు మన ముందు ఒక చేతి పొడవు దూరంలో ఉండాలి. మన కళ్ళు కిందకు చూస్తాయి, నిజానికి ఆ వస్తువును చూడవు, ఎందుకంటే అది మన కళ్ల ద్వారా సృష్టించబడదు. మనం కిందకు చూస్తూ బుద్ధుడు కాస్త పైన, నుదుటి స్థాయిలో ఉంటాడు.
ఇది అంత కష్టమేమీ కాదు. నేల వైపు చూడండి, ఆ తర్వాత మీ బొటనవేలును నుదుటి దగ్గర మీ ముందు ఉంచండి. మీ బొటనవేలు అక్కడ ఉందని మీకు అనిపిస్తుంది. మీరు దానిని చూడకుండా మీ బొటనవేలుపై దృష్టి పెట్టండి. అప్పుడు మీరు మీ చేతిని కిందకు ఉంచినట్లయితే, మీ బొటనవేలు ఉన్న ప్రదేశంపై మీరు ఇంకా దృష్టి పెట్టవచ్చు. సులువుగా!
అనేక థెరవాడ బౌద్ధమత ఆచారాలలో, కళ్లను మూసి ఉంచాలని చెప్పబడింది, కాని మహాయాన గ్రంథాలలో, కళ్ళు తెరిచి ఉంచాలని చెప్పబడింది. కొన్ని నిర్దిష్ట ధ్యాన అభ్యాసాలు ఉన్నాయి, ఇక్కడ కళ్ళు తెరిచి లేదా మూసి ఉంచబడతాయి. కాని సాధారణంగా మహాయానంలో, కళ్ళు తెరిచి ఉంటాయి, మూసి వేసి ఉండవు. మీరు కళ్లను పూర్తిగా తెరిచి ఉంచాలని అనుకోరు ఎందుకంటే అప్పుడు డిస్ట్రాక్ట్ అవ్వడం సులభం అవుతుంది. కాబట్టి, మనం క్రిందికి, ముక్కు చివర వైపు చూస్తాము. దీని అర్థం మనం కళ్లను క్రాస్ గా ఉంచుతామని కాదు, మనం ముక్కు చివరలో నేలను చూస్తాము. వదులుగా దృష్టి పెడతాము, చాలా తీవ్రంగా కాకుండా: మనం నేలపై పడిపోయిన మన కాంటాక్ట్ లెన్స్ కోసం చూడము.
కళ్లు మూసుకుని ధ్యానం చెయ్యడం వల్ల కలిగే నష్టాలు కూడా ఉన్నాయి. ప్రశాంతంగా ఉండటానికి, ప్రేమ మరియు కరుణను పెంపొందించడానికి మన కళ్లను పూర్తిగా మూసి ఉంచడం అలవాటు చేసుకుంటే, రోజూ ఆలా చెయ్యడం కష్టం అవుతుంది. మీరు వ్యక్తులతో సంభాషిస్తున్నప్పుడు ఒక్కసారిగా కళ్ళు మూసుకుని మానసిక స్థితిని సృష్టించడానికి ప్రయత్నించలేరు - ఇది కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు. మహాయానలో, మనం చేసేది మిగతా జీవులందరికి సహాయపడుతుంది, కాబట్టి కళ్లు కొద్దిగా తెరిచి ఉంచుతాం. మనం వాటిని మూసివెయ్యాలని అనుకోము. దలైలామా గారు చెప్పినట్లుగా కళ్ళు మూసుకుని ధ్యానం చెయ్యడంలో ఒక చిన్న సమస్య ఏమిటంటే, కనురెప్పలు కొద్దిగా రెపరెపలాడతాయి మరియు మీరు ఆ తిరుగుతూ ఉండే ఎర్రటి మచ్చలను చూస్తారు, ఇది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.
ఊహించుకోవడం యొక్క రెండు అంశాలు
మనం ఊహించుకున్నప్పుడు, రెండు ముఖ్యమైన అంశాల గురించి జాగ్రత్త వహించాలి. ఒకటి కనిపించడం, దీనిని తరచుగా "స్పష్టత" అని అనువదిస్తారు, కానీ ఇది గొప్ప పదం కాదు, ఎందుకంటే ఇది దేనినో కేంద్రీకరించడాన్ని సూచిస్తుంది. ఈ సమయంలో ఇది దీని గురించి కాదు, మన ఊహతో ఏదైనా కనిపించేలా చేయడం గురించి ఉంటుంది. రెండవ అంశం "గర్వం", ఇక్కడ మనం ఊహించుకున్నది నిజంగా ఉందని అనుభూతి చెందేలా ఉంటుంది.
మొదట్లో ఈ గర్వం, ఈ భావన చాలా ముఖ్యమని సోంగ్ ఖాపా గారు వివరించారు. మన ఊహ ఫోకస్ లో ఉండటం గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, కానీ నిజంగా మన ముందు ఒక బుద్ధుడు ఉన్నాడని మనం అనుభూతి చెందగలిగితే, అది చాలా మంచిది. మనకు కావలసిందల్లా ఏదో ఒక రూపం, కేవలం ఒక పసుపు రంగు కాంతి అయినా ఓకే. ఆ తర్వాత "అక్కడ ఒక నిజమైన బుద్ధుడు ఉన్నాడు" అని అనుకుందాం. మన ఏకాగ్రత పెరిగే కొద్దీ వివరాలు ఆటోమేటిక్ గా తెలుస్తాయి.
ఎక్కువగా కష్ట పడకండి
అభ్యాసకులుగా మనం చేసే అతి పెద్ద తప్పు ఏంటంటే మనం ఊహించుకునేది ఎలా ఉండాలి, ఎలాంటి నగలు, దుస్తులు, కళ్లు ఏ రంగులో ఉండాలి అనే మిగతా వివరాలు. ఇది మనం అస్సలు ప్రాక్టీస్ చేయలేని విధంగా మనల్ని ఉత్తేజపరుస్తుంది. అనేక బొమ్మలను ఊహించడానికి ప్రయత్నించినప్పుడు ఇది ఇంకా అధ్వాన్నంగా మారుతుంది. టెక్ట్స్ కూడా సహాయపడవు, ఎందుకంటే అవి అన్ని సూక్ష్మ వివరాలను ఇస్తాయి, ఇవి మనం మొదటి నుంచి వాటన్నిటినీ ఊహించగలమనే భావనను కలిగిస్తాయి. అనేక అంకెల సంక్లిష్ట అమరిక యొక్క అన్ని వివరాలను విజువలైజ్ చేయగలగడం నమ్మలేని విధంగా అభివృద్ధి చెందింది. చివరికి, మనం మంచి నైపుణ్యాన్ని కలిగి ఉన్నప్పుడు, వాటన్నిటినీ ఊహించుకోగలుగుతాము, కానీ ఇప్పుడు మనం దాన్ని మర్చిపోవచ్చు. అన్ని వివరాలను తెలుసుకోవడానికి మనం చాలా కష్టపడితే, టిబిటెన్ భాషలో "లంగ్" అని పిలువబడే దానిని మనం నిజంగా పొందుతాము, ఇక్కడ మన శక్తి దెబ్బతింటుంది మరియు మనం నిరాశకు గురవుతాము.
ఊహలను నిర్మించుకోవడం
ఈ రెండు సంప్రదాయాలను ప్రస్తావిస్తూ సంక్లిష్టమైన ఊహల గురించి సోంగ్ ఖాపా గారు చాలా ఆచరణాత్మక సలహాలను అందించారు. ఒకటి మంచి వివరాలపై ఒక్కొక్కటిగా పనిచేయడం, ఇంకొకటి పూర్తి చిత్రాన్ని పొందే వరకు వాటిని జోడించడం. కొంతమంది ప్రత్యేక వ్యక్తులకు ఈ పద్ధతి సరిపోతుందని ఆయన చెప్పారు. మనలో చాలా మంది ముందు పూర్తి విషయం యొక్క అస్పష్టమైన చిత్రం లేదా భావనతో ప్రారంభించాలి, ఆ తర్వాత, ఆ ఫ్రేమ్ వర్క్ లో, కాలక్రమేణా వివరాలను నింపాలి.
వివరాలను జోడించే ఈ ప్రక్రియ చాలా ముఖ్యం, ఇక్కడ మీరు పదునైన దృష్టితో వివరాలను కలిగి ఉండవచ్చు, ఆ తర్వాత మొదటి దాన్ని కోల్పోకుండా మరొక దాన్ని జోడించవచ్చు. అప్పుడు మీరు పదునైన ఫోకస్ లో ఉండి మొదటి రెండింటిని కోల్పోకుండా మూడవ దాన్ని జోడించవచ్చు. మీరు ఇంకా ఏదైనా జోడించాలనుకుంటే మనం ఇప్పటికే మెయింటైన్ చేసిన వాటిపై దృష్టి కోల్పోకుండా ఉండటం చాలా ముఖ్యం.
మనం ఒక బుద్ధుడిని ఊహించుకుంటూ ఉంటే, కళ్లతో ప్రారంభించమని సోంగ్ ఖాపా గారు మనకు సలహా ఇస్తారు. శరీరం యొక్క సాధారణ రూపం స్పష్టంగా ఉంటే, మనం దాన్నే పట్టుకుని ఉండాలని అతను చెబుతారు. సాధారణ రూపం అస్పష్టంగా ఉన్నప్పటికీ కొన్ని భాగాలు స్పష్టంగా ఉంటే, ఏ అంశాలు స్పష్టంగా ఉన్నాయో వాటిపై మన దృష్టిని పెడతాము. ఈ కొన్ని భాగాలు కూడా పోతే, అప్పుడు మనం మొత్తం రూపాన్ని మరోసారి సృష్టించాలి.
అవగాహనను విస్తరించడానికి ఊహించడం ఒక సాధనం
ఈ సంక్లిష్ట ఊహల వల్ల ప్రయోజనం ఏమిటి? వీటి వల్ల మానసిక అథ్లెటిక్ నైపుణ్యాలను పెంపొందించుకోవడమే కాదు, ఊహలలో ఒలింపిక్ గోల్డ్ మెడల్ ను కూడా సాధిస్తాం. ఈ వివరాలన్నీ ఒకేసారి అనేక విషయాలపై మన మనస్సులో అవగాహనను పెంపొందించడానికి తోడ్పడతాయి. ప్రతిదీ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ పాయింట్ కాదు, కానీ ప్రతి వివరాలు దేనికి ప్రాతినిధ్యం వహిస్తాయి అనేది ముఖ్యం.
బుద్ధుడు అవ్వడానికి దారితీసే వివిధ కారణాలను పరిశీలి౦చ౦డి: వాటిలో ప్రధానమైనవి 32 ఉన్నాయి. ఈ 32 విభిన్న అభ్యాసాలపై మన మనస్సును ఒకేలా ఉంచడం చాలా కష్టం. మనం ఈ 32 ను బుద్ధుని శరీరం యొక్క 32 అద్భుతమైన సంకేతాల రూపంలో సూచిస్తే, వెంట్రుకలు గడియారం వైపు ఉంచడం లాగా, వాటన్నిటినీ ఒకేచోట కలిపి ఉంచడం సులభం, అదే మనం లక్ష్యంగా పెట్టుకున్నాము. మనం ఒక్కొక్కరిని ఒక్కొక్కటిగా జనరేట్ చెయ్యలేకపోతే, వాటన్నిటినీ కలిపి ఎలా నెట్ వర్క్ చెయ్యగలం? మనం అన్ని జీవులకు సహాయపడాలని లక్ష్యంగా పెట్టుకున్నాము, అంటే ఒకే సమయంలో అందరి గురించి ఆలోచించడం. దీని కోసం మన మనస్సును విస్తరింపజేయటానికి నెమ్మదిగా మన అవగాహనను పెంచుకోవాలి. ఈ సంక్లిష్టమైన ఊహలు ఇలా చెయ్యడానికి మనకు సహాయపడతాయి.
సారాంశం
మనం నిజంగా దేని గురించైనా ఉత్సాహంగా ఉంటే అది బద్దకం అని కాదు, కానీ మనకు బ్రేక్ దొరికే వరకు దానిని వాయిదా వేస్తాము; మనకు ఎప్పుడు విశ్రాంతి అవసరమో తెలుసుకోవడం చాలా ముఖ్యం, అలా మనం దాన్ని వదులుకోకుండా ఉంటాము. బోధనలను నేర్చుకోవడం, వాటిని పరిశీలించడం, ఆపై వాటిని ధ్యానించడం వల్ల కలిగే ప్రయోజనాలను మనం నిజంగా తెలుసుకున్నప్పుడు, పట్టుదల మరియు ఆనందం సహాయంతో శక్తి దానికదే వస్తుంది. దీనికి అదనంగా, బౌద్ధమత ఊహ పద్ధతులు మన ఏకాగ్రత మరియు అవగాహనను ఊహించని స్థాయికి తీసుకెళ్లడానికి ఒక గొప్ప మార్గం. దీనికి కీలకమైనది ఏమిటంటే, మనం దానిని దశలవారీగా పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది అలాగే కొనసాగితే, మన కోసం మరియు ఇతరులందరికీ సహాయం చెయ్యడానికి చాలా ప్రయోజనకరమైన మానసిక స్థితిని మనం సాధించగలుగుతాము.