అహింస మరియు ఆధ్యాత్మిక విలువలు

ఈ రోజు మన ఆధునిక ప్రపంచంలో అహింస మరియు ఆధ్యాత్మిక విలువల గురించి మాట్లాడమని నన్ను అడగటం జరిగింది. నాకు తెలిసినంత వరకు వైద్యం మరియు ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్ళాలని అనుకుంటున్న మీలాంటి విద్యార్థులకు ఈ విషయాలు చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే, ఇతరులకు సహాయం చేసే మీ పనిలో భాగంగా, అహింసాత్మక రీతిలో ఈ పనులను చెయ్యడం ఖచ్చితంగా మీ వైపుల నుంచి చాలా ముఖ్యమని నేను అనుకుంటున్నాను. సహాయం చెయ్యడం అంటే హింసకు వ్యతిరేకం అని చెప్పాలి. మీకు కొన్ని ఆధ్యాత్మిక విలువలు ఉంటే అది మీ పనిని ఇంకా అర్థవంతం చెయ్యడానికి సహాయపడుతుంది, ఇది డబ్బు సంపాదించడం కోసమే కాదు, ప్రజలకు అర్థవంతమైన మార్గంలో సహాయం చెయ్యడానికి మీ పనిలో మీకు ఉన్న అవకాశాన్ని అభినందించడానికి మీకు సహాయపడుతుంది.

అన్ని మతాలు చెప్పినట్లుగానే అహింస గురించి బౌద్ధమతం చాలా చెప్తుంది, మరియు వివిధ సిస్టమ్ లు ఈ అహింస అంటే ఏమిటో అనేక రకాలుగా చెప్తాయి. మనం దీన్ని ఒక నిర్దిష్ట రకమైన పనిగా, హింసాత్మక పనిగా అనుకుంటాము మరియు అహింస అంటే ఆ రకమైన ప్రవర్తనకు దూరంగా ఉండటం అని ఆలోచిస్తాము. కానీ బౌద్ధమతం దాన్ని మనస్సు వైపు నుంచి, మరియు మన మానసిక స్థితి నుంచి ఎక్కువగా చూస్తుంది. ఇలా ఎందుకంటే, మనం నిజంగా ఒక రకమైన హింసాత్మక ప్రవర్తనను అమలు చేస్తున్నామో లేదో కానీ, అదంతా హింసాత్మక మానసిక స్థితి నుంచి వస్తుంది, కదా? కాబట్టి ఎవరినైనా బాధపెట్టకుండా ఉండటం, మీ మనస్సులో వారికి హాని కలిగించడానికి హింసాత్మక ఆలోచనలు ఉన్నప్పుడు - ఇది ఖచ్చితంగా పని చెయ్యదు. కాబట్టి, ఆ హింసాత్మక మానసిక స్థితిని అర్థం చేసుకోవడం మరియు దాన్ని అధిగమించే పద్ధతులను నేర్చుకోవడం చాలా అవసరం.

Top