భారతదేశంలో భిక్షుని సన్యాసినుల ఆదేశం యొక్క స్థాపన

02:25

బుద్ధుడు తానే స్వయంగా మొదటి సారిగా "ఎహి భిక్కు (ఇక్కడకు రా, సన్యాసి)" అనే పదాలను ఉచ్ఛరించి సన్యాసులను నియమించాడు. ఈ విధంగా కొంత మంది సన్యాసులను నియమించిన తర్వాత, భిక్షువుల చేతనే స్వయంగా (సం. ఉపసంపాద, పాళీ: ఉపసంపాద) అనే సన్యాసాన్ని స్థాపించాడు.

అనేక సాంప్రదాయ కథల ప్రకారం, బుద్ధుడు మొదట్లో తన మేనత్త మహాప్రజపతి గౌతమి (పాళీ: మహాపజాపతి గౌతమి) ఆమెను సన్యాసిగా నియమించమని అభ్యర్థించినప్పుడు నిరాకరించాడు. అయినా కానీ, మహాప్రజాపతి ఐదు వందల మంది మహిళా అనుచరులతో కలిసి గుండు చేసుకుని, పసుపు రంగు దుస్తులను ధరించి, నిరాశ్రయులైన సన్యాసులుగా (సం. ప్రవ్రజిత, పాలి: పబ్బజ్జ) ఆయనను అనుసరించారు. రెండోసారి, మూడవ సారి కూడా చేరతానని ఆమె అడిగినప్పుడు కూడా అతను ఒప్పుకోలేదు, ఆమె తరపు నుంచి బుద్ధుని శిష్యుడైన ఆనందుడు ఈ విషయంలోకి వచ్చాడు.

ఆ తర్వాత, వాళ్ళ నాలుగవ అభ్యర్థనతో, బుద్ధుడు ఆమె మరియు అక్కడి సన్యాసినులు ఎనిమిది భారమైన ఆంక్షలను పాటించాలనే షరతులు (సం. గురుధర్మ, పాళీ: గరుధమ్మ) పెట్టి దానికి అంగీకరించాడు. సన్యాసి లేదా సన్యాసినుల ప్రతిజ్ఞలను ఎంతకాలం పాటించినప్పటికీ, సన్యాసినుల సీనియారిటీ స్థానం ఎప్పుడూ సన్యాసుల కంటే తక్కువగా ఉంటుంది. బుద్ధుడు తన కాలంలో భారతదేశ సాంస్కృతిక విలువలకు అనుగుణంగా, అక్కడి సమాజం తన మనుషుల పట్ల, తన బోధనల పట్ల అగౌరవంతో ఉండకుండా చెయ్యడానికి ఇటువంటి ఆంక్షలను విధించాడు. సన్యాసినులను రక్షించడానికి మరియు సాధారణ ప్రజల నుంచి వారి గౌరవాన్ని కాపాడడానికి కూడా అతను ఇలా చేశాడు. ప్రాచీన భారతదేశంలో, స్త్రీలు ముందుగా వారి తండ్రులు, తర్వాత వారి భర్తలు మరియు చివరికి వారి కుమారుల రక్షణ/పర్యవేక్షణలో ఉండేవారు. ఒంటరి మహిళలను వేశ్యలుగా అనుకునేవారు మరియు సన్యాసినులను కూడా ఇలాగే ఏ పురుషుడి రక్షణలో లేకుండా చూసి వాళ్ళను వేశ్యలు అని పిలిచే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. భిక్షుని సంఘాన్ని భిక్షు సంఘంతో కలపడం వల్ల సమాజం దృష్టిలో వారి హోదా గౌరవప్రదంగా మారింది.

కొన్ని సంప్రదాయాల ప్రకారం, ఆ ఎనిమిది గరుధమ్మలను స్వీకరించడం ముందుగా సన్యాసాన్ని తీసుకోవడాన్ని సూచించింది. మిగతా సంప్రదాయాల ప్రకారం, బుద్ధుడు ఆనందుని నాయకత్వంలో మహాప్రజాపతి మరియు అతని ఐదు వందల మంది మహిళా అనుచరుల ప్రారంభ సన్యాస స్వీకార కార్యక్రమాన్ని పది భిక్షువులకు అప్పగించాడని చెప్పబడుతుంది. ఈ రెండింటిలో, భిక్షుణిలను మార్చడానికి మొట్టమొదటి ప్రామాణిక పద్ధతి పది భిక్షువుల సమూహం ద్వారానే జరిగింది. ఈ పద్ధతిని సాధారణంగా "ఏక భిక్షు సంఘ సన్యాసం" అని పిలుస్తారు. ఈ సన్యాస విధానంలో అభ్యర్థులు పూర్తి ప్రమాణాలను పాటించకుండా అడ్డుకునే వారికి ఎదురయ్యే అడ్డంకులకు (సం. అంతరాయికధర్మ, పాళీ: అంతరాయికధమ్మ) సంబంధించిన ప్రశ్నలను అడగడం ఉంటుంది. భిక్షు సన్యాస విధానంలో అభ్యర్థులను సాధారణంగా అడిగే ప్రశ్నలతో పాటు, స్త్రీగా తన శరీర నిర్మాణ వ్యవస్థకు సంబంధించిన ఇంకొన్ని ప్రశ్నలు ఇందులో ఉంటాయి.

కొందరు భిక్షుని అభ్యర్థులు సన్యాసులకు ఇలాంటి వ్యక్తిగత ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసినప్పుడు, బుద్ధుడు "ద్వంద్వ సంఘ సమన్వయాన్ని" స్థాపించాడు. ఇక్కడ భిక్షుని సంఘం ముందు అభ్యర్థి భిక్షునిగా మారడానికి తగిన అర్హతను కలిగి ఉందో లేదో అనే దాని గురించి ప్రశ్నలను అడుగుతారు. అదే రోజు భిక్షుని సంఘం భిక్షు సంఘంతో కలిసి ఒక జాయింట్ అసెంబ్లీని ఏర్పాటు చేస్తుంది. భిక్షు సంఘం సన్యాసాన్ని అందించే పనిని వ్యవహరిస్తుండగా, భిక్షుని సంఘం ఒక సాక్షిగా పనిచేస్తుంది.

ముందుగా, సన్యాస సమాజం యొక్క ప్రతిజ్ఞలలో "సహజంగా ఆమోదయోగ్యం కాని పనులను" మాత్రమే నివారించడం జరిగింది - ప్రతి ఒక్కరికీ వినాశకరమైన శారీరక మరియు మౌఖిక విషయాలను నివారించడం. సన్యాసం తీసుకున్న వ్యక్తులకు, దీనిలో బ్రహ్మచర్య ప్రతిజ్ఞ కూడా ఉంది. కాలం గడుస్తున్న కొద్దీ, బుద్ధుడు "నిషేధించబడిన అవాంఛనీయ పనులకు" సంబంధించి అదనపు ప్రతిజ్ఞలను ఇందులో కలిపాడు - ఇవి సహజంగా వినాశకరంగా లేని శారీరక మరియు మౌఖిక పనులు, కానీ బౌద్ధమత సన్యాస సమాజం మరియు బుద్ధుని బోధనల పట్ల సమాజం అగౌరవపరచకుండా ఉండటానికి నియమిత వ్యక్తులకు మాత్రమే ఇవి నిషేధించబడ్డాయి. అటువంటి నిషేధాలను అమలు చేసే అధికారం బుద్ధుడికి మాత్రమే ఉంది. సన్యాసినులు సన్యాసుల కంటే ఎక్కువ అదనపు ప్రతిజ్ఞలను పొందారు, ఎందుకంటే సన్యాసి లేదా సన్యాసినుల అనుచిత ప్రవర్తనతో కూడిన ఒక ప్రత్యేక సంఘటన తర్వాత మాత్రమే ఈ ప్రతి అదనపు ప్రతిజ్ఞ స్థాపించబడింది. సన్యాసినుల ప్రతిజ్ఞలలో సన్యాసులతో సంభాషించడంలో సన్యాసినుల అనుచిత ప్రవర్తన ఆధారంగా స్థాపించబడినవి కూడా ఉన్నాయి, అయితే ఈ సన్యాసుల ప్రతిజ్ఞలు తిరిగి వర్తించే షరతులను కలిగి ఉండవు.

Top