సెంజాబ్ సెర్కాంగ్ రింపోచే II గారి సందేశం

అలెక్స్ బెర్జిన్ నా పూర్వీకుడు అయిన సెంజాబ్ సెర్కాంగ్ రింపోచే గారికి దగ్గరి శిష్యుడు మరియు అనువాదకుడు. మేము ఈ జన్మలో కూడా మా సన్నిహిత ధర్మ సంబంధాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగించాము. బెర్జిన్ ఆర్కైవ్స్ లో అలెక్స్ అనువదించిన నా పూర్వీకుల బోధనలు చాలా ఉన్నాయి, అలాగే అలెక్స్ నేర్చుకున్నవి మరియు తను ఇచ్చిన అనేక స్పష్టమైన బోధనలు ఉన్నాయి. తన వెబ్ సైట్ తో ఇన్ని భాషల్లో ఇంత మందికి నా పూర్వీకుల సంప్రదాయాన్ని పరిచయం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.

ఈ పని ఇలాగే జరుగుతూ ఇంకా ఎదగాలని, రాబోయే తరాలకు ఈ వెబ్ సైట్ సరైన సమాచారాన్ని అందిస్తూ మంచి ప్రేరణగా నిలవాలని నేను ప్రార్థిస్తున్నాను. దీని నుంచి ప్రజలు నేర్చుకున్న అంతర్ దృష్టులతో వాళ్ళకు జ్ఞానోదయాన్ని అందించడానికి తొందరగా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను.

2008, నవంబర్ 22
సెంజాబ్ సెర్కాంగ్ తుల్కు

Top