ఆధునిక ప్రపంచంతో దలైలామా గారికి ఉన్న సంబంధం

ఇప్పుడు మనం ఆధునిక ప్రపంచంతో దలైలామా గారికి ఉన్న సంబంధాన్ని పరిశీలిద్దాం. ఆయన పాత్ర ఏదైనా ఉంది అంటే అది అర్థవంతంగా, వీలైనంత ఎక్కువ మందికి ప్రయోజనకరంగా ఉండాలి. ఇది కేవలం వినోదం లేదా ఉత్సాహానికి సంబంధించినది కాదు ఎందుకంటే అతను గొప్ప వ్యక్తి లాంటి మనిషి. దలైలామా గారు అంటే ఇదొక్కటే కాదు. ఇతరులకు ప్రయోజనం అందించడమే అతని ఏకైక జీవిత లక్ష్యం.

ఇతరులకు సేవ చెయ్యడం

ప్రపంచంలోని చాలామంది ఇతరులకు సంతోషాన్ని అందిస్తున్నట్టు చెప్తూ ఉంటారు కానీ, ఆయన గురించి అద్భుతమైన విషయం ఏమిటంటే - మనం సాధారణంగా ఆయనను ఇలాగే పిలుస్తాము - అతను పూర్తిగా, ఒక నిజమైన నిజాయితీపరుడు అని. ఇతరులు ఆయన దగ్గర ఉన్నప్పుడు, ఆయన చెప్పేది విన్నప్పుడు, అతను ఏమి చేస్తున్నాడో వాళ్ళు గ్రహించినప్పుడు ఇది కమ్యూనికేట్ చెయ్యబడుతుంది. అతను ఎప్పుడూ తన జీవితంతో ముందుకు సాగడానికి ప్రయత్నించే మూడు ప్రధాన లక్ష్యాల గురించి మాట్లాడుతారు. మొదటిది లౌకిక నైతికత, రెండవది మత సామరస్యం, మూడవది టిబెట్ మరియు అక్కడి ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోవడం, ఎందుకంటే అది అతనికి ఇచ్చిన రోల్.

నైతిక విలువలు

లౌకిక నైతికత మరియు మత సామరస్యం యొక్క విషయాలపై గురువు గారు ఎప్పుడూ మాట్లాడుతారు, మరియు దీనికి కారణం ప్రపంచానికి నైతికత చాలా అవసరం. ఇంత అవినీతి, మోసం, ప్రజల మధ్య సరైన సంబంధాలు లేకపోవడానికి కారణం నైతిక విలువలు లేకపోవడమే కారణం.

దలైలామా గారు చాలా విశ్వజనీనమైన, ఓపెన్ మైండ్ ని కలిగి ఉంటారు మరియు ఈ గ్రహం మీద ఉన్న 7 బిలియన్లకు పైగా ప్రజలకు ప్రయోజనం కలిగించే విషయాల గురించి ఎప్పుడూ మాట్లాడుతారు మరియు ఆలోచిస్తారు. ఇంతటి జనాభాలో, కొంతమంది ఏదో ఒక మతాన్ని నమ్ముతారు, మరియు నమ్మనివారు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరికీ ఆమోదయోగ్యమైన ఒక రకమైన నైతిక వ్యవస్థ - ఒక నైతిక ఆధారం కావాలి. దీనిని "లౌకిక నైతికత" అని పిలుస్తారు, దీని అర్థం ఇది ఏ మతానికి లేదా వ్యవస్థకు వ్యతిరేకం కాదు, కానీ ఇది అన్ని విశ్వాస వ్యవస్థలను, అలాగే విశ్వాసం లేనివాళ్ల అవసరాలను కూడా  గౌరవిస్తుంది. ఆయన దీన్ని "ప్రాథమిక మానవ విలువలు" అని పిలుస్తారు, కాబట్టి కొన్నిసార్లు అతని లక్ష్యం లౌకిక నీతి అని చెప్పడానికి బదులుగా, జీవశాస్త్రంపై ఆధారపడిన ప్రాథమిక మానవ విలువలను ప్రోత్సహించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పవచ్చు. అప్పుడే పుట్టిన బిడ్డ పట్ల తల్లికి ఉండే ఆప్యాయత మరియు సంరక్షణ మానవులకు మాత్రమే కాకుండా జంతువులకు కూడా ఉంటుంది: ఇతరులను జాగ్రత్తగా చూసుకోవడం. దలైలామా గారి జీవితంలోనే మనం దీన్ని చూస్తున్నాం, అందుకే ఆయన సందేశం మనల్ని అంతగా కదిలిస్తుంది.

షెడ్యూల్

గురువు గారు అసలు మనం నమ్మలేని ఒక షెడ్యూల్ లో ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తారు, ప్రత్యేకించి ఇప్పుడు, 2013 లో, అతని వయస్సు 78 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా. అతను చాలా సుదీర్ఘమైన ప్రపంచ పర్యటనలను చేస్తారు, ఒక రోజు ఒక ప్రదేశంలో మాత్రమే ఉండకుండా. ఆయన షెడ్యూల్స్ చాలా కఠినంగా ఉంటాయి. ఒక సహాయకుడిగా, అనువాదకుడిగా ఇలా ఆయనతో ట్రావెల్ చేశాను కాబట్టి ఆ షెడ్యూల్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ప్రతిరోజూ అనేక ఉపన్యాసాలు ఉంటాయి, తర్వాత విలేకరుల సమావేశాలు మరియు వ్యక్తిగత ప్రైవేట్ సమావేశాలు కూడా ఉంటాయి. అతనికి తినడానికి కూడా సమయం ఉండదు. ప్రతిరోజూ ఉదయం 3.30 గంటలకు నిద్రలేచి టైమ్ జోన్ మార్పులతో సంబంధం లేకుండా సుమారు నాలుగు గంటల పాటు లోతైన ధ్యాన సాధనను చేస్తారు. అతని ఎనర్జీ చాలా బలంగా ఉంటుంది మరియు అతను ఎప్పుడూ హాస్యంతో నిండి ఉంటారు మరియు అతను కలుస్తున్న ప్రతి ఒక్కరి పట్ల శ్రద్ధతో ఉంటారు. అతను ఎవరిని కలిసినా, ఆ వ్యక్తిని చాలా బాగా పలకరిస్తారు: "ఇదిగో ఇంకొక వ్యక్తి, ఎంత అద్భుతం!"

ప్రేమ

బౌద్ధమతంలో, మీరు ఎవరినైనా కలిసినప్పుడు, అది మీ హృదయాన్ని ఉదారతతో నింపుతుంది, మీకు వారిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది మరియు వారి మంచి గురించి మీరు ఆలోచిస్తారు. దలైలామా గారు ఎవరితోనైనా మాట్లాడడం, గుంపులో నడవడం లేదా మరేదైనా పని చెయ్యడం, అతను ప్రజలను చూసే విధానం మరియు అతను చూసే ప్రతి వ్యక్తిపై తన పూర్తి శ్రద్ధను ఎలా చూపిస్తారో  మీరు చూడవచ్చు. అతను నిజంగా ఇతరుల సంతోషం మరియు అందరి ఆరోగ్యం పట్ల సమానంగా ఆసక్తి కలిగి ఉన్నాడని ఇది తెలియజేస్తుంది. అందువల్ల, మానవతా విలువలను, లౌకిక నైతికతను పెంపొందించే ఈ మంచి ఆలోచన ప్రతి ఒక్కరికీ బాగా ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన అర్థం చేసుకున్నారు. అతను సంకుచిత "బౌద్ధ" పద్ధతిలో మాత్రమే ఆలోచించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యావ్యవస్థల్లో లౌకిక స్థాయిలో కొన్ని రకాల బోధనలను ప్రవేశపెట్టడం గురించి కూడా ఆయన చాలా ఆందోళన చెందుతున్నారు, ఇది పిల్లలకు నిజాయితీగా మరియు దయతో ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలను మరియు ప్రపంచానికి చాలా ప్రయోజనకరమైన ఇతర ప్రాథమిక మానవ విలువలను బోధిస్తుంది.

మత సామరస్యం

మత సమూహాల మధ్య వివాదాల కారణంగా ప్రపంచంలో చాలా ఇబ్బందులు వస్తాయి. అపనమ్మకం ఉంటుంది, భయం ఉంటుంది, ఇవన్నీ సమస్యలకు దారితీస్తాయి. మత సామరస్యం పరంగా మనకు కావలసింది లౌకిక నైతికత మాత్రమే కాదు, ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడం అని ఆయన చెప్పారు. మనం దేనికి భయపడతామో మనకు తెలియదు, మరియు ఈ తెలియని సమూహాలు మరియు మతాలపై, మనం ఒక రకమైన ఫాంటసీని ప్రదర్శిస్తాము. అతను పాల్గొనే అనేక మతాంతర సంభాషణల్లో ప్రజలు చిరునవ్వులు చిందిస్తూ ఒకరికొకరు మంచిగా ఉంటారని, ఆ తర్వాత కొన్ని ప్రార్థనలు లేదా నిశ్శబ్ద ధ్యానం ఉంటుందని ఆయన చెప్పారు. అంతా బాగుంది కానీ అది అంత ఉత్పాదకంగా లేదు. "సరే, మనమందరం ఒకే విషయం గురించి మాట్లాడుతున్నాము, మనమందరం ఒక్కటే" అని చెప్పడం మరియు ఎప్పుడూ సారూప్యతలను ఎత్తిచూపడం ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడానికి సహాయపడదు.

ఈ సంవత్సరం జూన్ లో కొందరు సూఫీ గురువులతో సమావేశమై గురువు గారు సారూప్యతల గురించి మాత్రమే కాకుండా తేడాల గురించి తెలుసుకోవాలని ఉందని వారికి చెప్పారు. మన విభేదాల గురించి మనం సిగ్గుపడకూడదని, మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి చేసే ప్రయత్నాల్లో ప్రయోజనకరమైన మార్గాల్లో వాటి నుంచి చాలా నేర్చుకోవచ్చని ఆయన అన్నారు. అన్ని మతాలకు ఒకే లక్ష్యం ఉంటుందని, దాన్ని అనుసరించే వారికి సంతోషకరమైన జీవితాన్ని తీసుకురావడమే సరైనదని ఆయన చెప్పారు. దీన్ని సాధించడానికి, చాలా విభిన్న పద్ధతులు ఉన్నాయి, ఎందుకంటే ప్రజలు చాలా భిన్నంగా ఉంటారు.

ఆయన ఇలా అంటారు, "మనమ౦దర౦ మన అనుచరులకు ప్రేమ, దయ లాంటివి పె౦పొ౦ది౦చుకోవడ౦ నేర్పి౦చడానికి ప్రయత్నిస్తుంటే, మనం ఏ పద్ధతిని ఉపయోగిస్తాం? ఇది మేము మీ నుంచి నేర్చుకోగల విషయం, తేడాలను చూడటం మరియు వాటి కొత్తదనాన్ని నేర్చుకోవడానికి అవకాశాలుగా గౌరవించడం. ప్రతి మతానికి చెందిన అత్యంత తీవ్రమైన అభ్యాసకుల సమావేశాలు నిర్వహించడం మంచిది, పెద్ద బహిరంగ ప్రేక్షకుల కోసం కాకుండా, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి, అలా మనం తీవ్రమైన అభ్యాసక స్థాయిలో మాట్లాడుకోవచ్చు. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

శాస్త్రం

టిబెట్ ప్రజల పట్ల మరియు బౌద్ధమతం యొక్క టిబెటన్ సంప్రదాయాల పట్ల ఒక నిర్దిష్ట బాధ్యతతో ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూర్చడమే గురువు గారి ప్రాధమిక నిబద్ధత అయినప్పటికీ, ఇవి అతని ప్రత్యేక ఆందోళనలు కావు. చిన్న వయసు నుంచే సైన్స్, మెకానిక్స్, పనులు ఎలా పనిచేస్తాయనే దానిపై మంచి ఆసక్తిని కనబరిచారు. 1980వ దశకం ప్రారంభం నుంచి శాస్త్రవేత్తలతో సమావేశాలు నిర్వహిస్తున్న వారి నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారు.

ఉదాహరణకు, విశ్వం యొక్క వర్ణన, విశ్వం ఎలా ప్రారంభమైంది మొదలైనవాటిలో మనకు కనిపించే వాటికి విరుద్ధమైన దాన్ని శాస్త్రవేత్తలు సరిగ్గా నిరూపించగలిగితే, దాన్ని బౌద్ధమత బోధనల నుంచి తొలగించడం సరైనదేనని ఆయన అన్నారు. మెదడు ఎలా పనిచేస్తుందో, వివిధ రసాయన పదార్థాలు మొదలైన వాటిపై పాశ్చాత్య శాస్త్రీయ అవగాహన బౌద్ధమత అవగాహనకు గొప్ప అనుబంధంగా ఉంటుంది.

అదే విధంగా, బౌద్ధ శాస్త్రం, బౌద్ధ జ్ఞానం మరియు బౌద్ధ తత్వశాస్త్రం యొక్క వర్గాల నుంచి వచ్చిన శాస్త్రవేత్తలతో పంచుకోగల గొప్ప జ్ఞానాన్ని బౌద్ధమతం కలిగి ఉంది. ఉదాహరణకు, బౌద్ధమతం భావోద్వేగాల యొక్క చాలా వివరణాత్మక విషయాలను అందిస్తుంది - భావోద్వేగాల యొక్క పూర్తి అంతర్గత ప్రపంచం ఎలా పనిచేస్తుంది, ఈ భావోద్వేగాలతో ఎలా వ్యవహరించాలి మరియు మొదలైనవి. బౌద్ధమత విశ్లేషణ చాలా శాస్త్రీయంగా వ్యవస్థీకృత వివరణను అందిస్తుంది. పాశ్చాత్య శాస్త్రవేత్తలకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మఠాలలో, గురువు గారు సన్యాసులు మరియు సన్యాసినులకు పాఠ్యాంశాలలో సైన్స్ ని చేర్చి దాని అధ్యయనాన్ని మొదలుపెట్టారు. సైన్స్ కు సంబంధించిన వివిధ పాఠ్యపుస్తకాలు ఆంగ్లం నుంచి టిబెటన్ లోకి అనువదించబడ్డాయి. ఈ విధాలుగా, అతను ఒక ప్రధాన ప్రపంచ మతానికి నాయకుడైన వ్యక్తి కోసం నమ్మశక్యం కాని ఓపెన్ మైండెడ్ వ్యక్తి.

ఇతర సంప్రదాయాలను చేరుకోవడం

గురువు గారు ఇస్లామిక్ ప్రపంచాన్ని చేరుకోవాలని అనుకున్నారు, అందువల్ల ఆయన నా బౌద్ధమత ఆర్కైవ్స్ లో ప్రాథమిక బౌద్ధ బోధనలు మరియు ప్రాథమిక మానవ విలువలు, నైతికత మొదలైన వాటి యొక్క సాధారణ సందేశాన్ని అరబిక్ మరియు ఇతర ప్రధాన ఇస్లామిక్ భాషలలోకి అనువదించమని ప్రోత్సహిస్తున్నారు. ఇది కొనసాగుతోంది. గత కొన్నేళ్లుగా ఇస్లాంను ఇంత రాక్షసంగా చిత్రీకరిస్తున్నారని, ఇది చాలా దురదృష్టకరమని చెప్పారు. వాటిని ముప్పుగా చూడకుండా ప్రపంచంలో చేర్చడం చాలా ముఖ్యం. బౌద్ధమత విశ్వాసాలకు సంబంధించిన స్పష్టమైన వివరణలను కూడా వారికి అందించాలి, వాటిని మార్చడానికి లేదా అలాంటి వాటిని మార్చడానికి కాదు, వారు మనతో చేయగలిగిన విధంగా ప్రాథమిక సమాచారాన్ని పంచుకోవడానికి మాత్రమే. మళ్ళీ, అవగాహన మరియు స్నేహాన్ని పెంపొందించడానికి విద్య ముఖ్యమైన మార్గం.

బౌద్ధమతంలోనే టిబెట్, చైనా, జపాన్ తదితర దేశాల్లో ఆచరించే మహాయాన సంప్రదాయం, ఆగ్నేయాసియాలో ఆచరించే థెరవాడ  సంప్రదాయాలు ఉన్నాయి. దురదృష్టవశాత్తు, బహుశా చాలా మందికి ఆశ్చర్యకరంగా, రెండు వైపులా ఒకరి గురించి మరొకరికి చాలా తక్కువ జ్ఞానం ఉంది. అతను ఒక అమెరికన్ బౌద్ధ సన్యాసిని చాలా వివరంగా పోల్చడానికి నియమించి స్పాన్సర్ చేశాడు. ప్రతి అభ్యాసానికి, మహాయాన వెర్షన్ అంటే ఏమిటి, మరియు థెరవాడ వెర్షన్ ఏమిటి? అని ఉన్నాయి. ఈ ముఖ్యమైన జ్ఞానాన్ని పంచుకోవడానికి ఇది ఆగ్నేయాసియా భాషల్లోకి అనువదించబడుతుంది.

మహిళల నియామకం

టిబెట్ లో పూర్తిగా నియమిత సన్యాసులు ఉన్నప్పటికీ, సన్యాసినుల వంశం భారతదేశం నుంచి హిమాలయాలను దాటలేకపోయింది. ఇది వివిధ కారణాల వల్ల జరిగింది, ప్రధానంగా భౌగోళికమైనవి; ప్రాచీన కాలంలో భారతీయ సన్యాసినుల సమూహం మొత్తం టిబెట్ కు కాలినడకన ప్రయాణించడం చాలా కష్టం. అందువల్ల, ఆ వంశం అక్కడే ఆగిపోయింది, ఎందుకంటే దాన్ని అక్కడికి విస్తరించడానికి పూర్తిగా నియమించబడిన పది మంది సన్యాసినుల సమూహం అవసరం.

టిబెటన్ సంప్రదాయంలో పూర్తిగా సన్యాసినులుగా మారాలనుకునే మహిళలు ఈ వంశాన్ని పునఃప్రారంభించడం ఎలా సాధ్యమో చూడటానికి దలైలామా గారు అధ్యయనాలు మరియు ప్రాజెక్టులను స్పాన్సర్ చేస్తున్నారు.

"నేను ఒక సాధారణ సన్యాసిని"

ఆయన ఎలాంటి అహంకారం, కోపం లేకుండా ఎంత నిరాడంబరంగా ఉంటారనేదే ఆయన పరిశుద్ధుని అత్యంత ప్రియమైన లక్షణాల్లో ఒకటి. అతను ఒక సాధారణ సన్యాసినని, అందరి లాగే సాధారణ మనిషినని ఎప్పుడూ చెబుతుంటారు. ''నేను ఎవరినైనా కలిసినప్పుడల్లా వారిని మరో మనిషిగా భావిస్తాను. మా సంభాషణ రెండు మనుషుల మధ్య ఉంటుంది, దలైలామా మరియు ఒక సామాన్య మనిషి మధ్య కాదు. కొంతమంది విదేశీయులకు టిబెటన్ వాళ్లకూ కాదు. ఈ ద్వితీయ భేదాలు నేవీ ఏమీ లేవు. ఈ ప్రాధమిక స్థాయిలో: మనమందరం మనుషులం."

ఆయన ఒక విధమైన దేవుడు, రాజు, లేదా ప్రత్యేక శక్తి అని ప్రజలకు ఉన్న ఏ విధమైన కల్పననైనా అతను వెంటనే తొలగించాలని అనుకున్నారు. చాలా మంది, పదుల సంఖ్యలో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పుడు అతను పూర్తిగా ఇంట్లో ఉన్నట్టే రిలాక్స్ అవుతారు. దురద వస్తే మామూలు మనిషి లాగే గోకుకుంటాడు. అతను ఏమాత్రం సొంత స్పృహలో ఉండరు మరియు ఎవరి కోసం షో చెయ్యడానికి చూడరు. ఆయన ఏదైనా దేశ అధ్యక్షుడిని కలవడానికి వెళ్తే, ఆయన రబ్బరు చెప్పులు ధరించే వెళ్తారు. ఎవరినీ ఆకట్టుకునే ప్రయత్నం ఆయన చెయ్యరు.

హాస్యం

ఇతరులు తప్పించుకోలేని విషయాలను ఆయన హాస్యాస్పదంగా చెప్పిన తీరు చాలా అద్భుతం. ఒకసారి అతను ఉపన్యాసం ఇచ్చాడు మరియు అతను కూర్చున్న సీటు చాలా అసౌకర్యంగా ఉంది. చివరికి ఆర్గనైజింగ్ ప్యానెల్ కు, ప్రేక్షకులకు కూడా అన్ని ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని, వచ్చేసారి మంచి సీట్ ఉంటే బాగుంటుందని ఆయన చెప్పారు! ఎవరూ కొప్పడకుండా, ప్రేమగా ఆయన అలా అనడంతో అందరూ నవ్వుకున్నారు. అదే విధంగా ఆయన ప్రజలను కూడా తిట్టగలరు.

వాక్లావ్ హావెల్ తో ఒక విజిట్

చెక్ రిపబ్లిక్ ఇప్పటికీ చెకోస్లోవేకియాగా ఉన్నప్పుడు ఆ దేశ తొలి అధ్యక్షుడు వాక్లావ్ హావెల్ ఆయనను ఆహ్వానించినప్పుడు నేను ఆయనతోనే ఉన్నాను. ఆహ్వానించిన మొదటి వ్యక్తి రాక్ స్టార్ ఫ్రాంక్ జప్పా కాగా, రెండో వ్యక్తి గురువు గారు. తనకు, మంత్రివర్గానికి ధ్యానం ఎలా చెయ్యాలో నేర్పించాలని హావెల్ కోరాడు. అతను "మాకు అనుభవం లేదు, ప్రభుత్వాన్ని ఎలా నడపాలో మాకు తెలియదు. మేమందరం ఒత్తిడికి గురవుతాము మరియు మేము నిద్రపోలేము. దయచేసి ఎలా ప్రశాంతంగా ఉండాలో మీరు మాకు నేర్పగలరా? లేకపోతే కొత్త దేశ ప్రభుత్వాన్ని నడపలేం" అని కోరాడు.

వాక్లావ్ హావెల్ చాలా ఉదారతను కలిగిన వ్యక్తి, మరియు అతను ప్రాగ్ బయట ఉన్న ఒక పెద్ద కోట అయిన సమ్మర్ ప్యాలెస్ కు వెళ్ళమని ఆయన మరియు మంత్రులందరినీ ఆహ్వానించాడు. నిజానికి ఆయన ఎప్పుడూ అక్కడికి వెళ్లలేదు. అది చాలా పెద్దది మరియు అందరూ హాళ్ల గుండా నడుస్తూ తప్పిపోయారు. దలైలామా గారిని ఉద్దేశించి "ఇది కమ్యూనిస్టు నాయకుల ఇల్లు" అని చెప్పారు. దలైలామా గారితో మాట్లాడటానికి మీరు ఉపయోగించే సాధారణ భాష అది కాదు, కానీ అతను చాలా ఉదారతను కలిగిన వ్యక్తి. అప్పుడు దలైలామా గారితో సహా అందరూ ఒక పెద్ద గదిలో నేలపై కూర్చున్నారు. హావెల్ మరియు అతని మంత్రులు అందరూ సూట్లు ధరించారు, మరియు గురువు గారు వారు శాంతిని అనుభవించడానికి ప్రాథమిక శ్వాస మరియు శక్తి ధ్యానాలను బోధించారు.

ఇప్పుడు, సాధారణంగా, ఆయన తన సన్యాసి ప్రతిజ్ఞలను చాలా ఖచ్చితంగా పాటిస్తారు కాబట్టి, గురువు గారు రాత్రిపూట ఏమీ తినరు. కానీ అతను సరళంగా ఉంటారు, మరియు అధ్యక్షుడు హావెల్ ఏమో ప్యాలెస్ లో విందును సిద్ధం చేశాడు. ఆ చర్చ ఆంగ్లంలో జరిగింది మరియు చైన్ స్మోకర్ అయిన హావెల్ ను దలైలామా గారు ఎలా తిట్టాడనేది ఇక్కడ గమనించదగినది. గురువు గారి పక్కనే ఉంది అతను స్మోక్ చేస్తున్నాడు. అతను ఒక దేశ అధ్యక్షుడైనప్పటికీ, "మీరు చాలా ఎక్కువగా స్మోక్ చేస్తారు. ఇది మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది మరియు మీకు క్యాన్సర్ ను ఇస్తుంది, కాబట్టి మీరు దీన్ని తగ్గించాలి!" అని చాలా దయతో చెప్పారు. హావెల్ కు తర్వాత నిజంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చింది. అవతలి వ్యక్తికి ఏది ప్రయోజనకరమో, అతని గురించి వారు ఏమనుకుంటారో అని కాదు, గురువు గారి ప్రధాన చింతన ఎలా ఉంటుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే.

తెలివితేటలు మరియు జ్ఞాపకశక్తి

నేను కలిసిన వారిలో అత్యంత తెలివైన వ్యక్తి గురువు గారే. ఆయనకు ఫోటోగ్రాఫిక్ మెమరీ ఉంది. అతను బోధించేటప్పుడు, అన్ని విభిన్న సంప్రదాయాలకు చెందిన ప్రతి ఒక్కరి బౌద్ధమత బోధనల యొక్క అతిపెద్ద నిధిపై అతనికి ప్రావీణ్యం ఉంది. అతను ఏ టెక్స్ట్ నుంచైనా చెప్పగలరు. టిబెటన్లు తమ శిక్షణలో తాము చదివిన వివిధ ప్రధాన గ్రంథాలన్నింటినీ గుర్తుంచుకుంటారు, బహుశా 1000 పేజీలు లేదా ఇంకేదైనా కావచ్చు, కానీ దలైలామా గారు జ్ఞాపకం చేసుకున్న వ్యాఖ్యానాలన్నీ అస్సలు నమ్మశక్యం కానివి. అతను బోధిస్తున్నప్పుడు, అతను ఒక పాఠం నుంచి ఒక చిన్న భాగాన్ని చెప్పి ఆ తర్వాత వేరే పాఠం నుంచి ఒక భాగాన్ని చెప్తారు; అలా చెప్పడం చాలా కష్టం. అతని జ్ఞాపకశక్తి ఇలా పనిచేస్తుంది, మరియు ఇది గొప్ప తెలివితేటలకు చిహ్నం: మీరు వస్తువులను కలిపి ఉంచవచ్చు మరియు నమూనాలను చూడటానికి ఇవన్నీ ఎలా సరిపోతాయో చూడవచ్చు. ఐన్ స్టీన్ లాంటి వారు e=mc2ను ఎలా గుర్తిస్తారు? అన్ని రకాల వస్తువులను కలిపి నమూనాను కనిపెట్టగలగడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. టిబెటన్ కార్పస్ గురించి తనకున్న అపారమైన పరిజ్ఞానంతో ఆయన ఈ పనిని చెయ్యగలరు.

ఆయన ఫోటోగ్రాఫిక్ మెమరీ కేవలం గ్రంథాలకే కాదు, మనుషులకు కూడా ఉపయోగపడుతుందని చాలా సార్లు నా ముందు నిరూపితమైంది. టిబెట్ కు చెందిన ఒక ముసలి సన్యాసి ధర్మశాలను సందర్శించినప్పుడు నేను అక్కడ ఉన్నాను, గురువు గారు అతనిని చూడగానే, "అయ్యో! నువ్వు నాకు గుర్తున్నావు. ముప్పై ఏళ్ళ క్రితం ఇండియాకి వెళ్తుండగా మేము మీ మఠం దగ్గర ఆగాము, అక్కడ ఏదో వేడుక జరిగింది. మీరు నైవేద్యాలతో కూడిన ఒక ప్లేట్ ను పట్టుకోవాల్సి వచ్చింది మరియు అది చాలా బరువుగా ఉందని నాకు గుర్తుంది మరియు ఆ పూర్తి సమయం మీరు దానిని పట్టుకోవడానికి చాలా కష్టపడ్డారు. మీకు గుర్తుందా?" అని అన్నారు. ఇది చాలా నమ్మశక్యం కానీ విషయం. నా ప్రధాన గురువు సెర్కాంగ్ రింపోచే గారు, గురువు గారి ప్రధాన గురువులలో ఒకరు, మరియు అతను చిన్నతనంలో, తనకు ఒకసారి మాత్రమే ఏదో ఒకటి బోధించవలసి వచ్చిందని చెప్పారు. అది వెంటనే ఆయనకు అర్థమై గుర్తుకు వచ్చింది.

సాధించిన విజయాలు

గురువు గారు మన కాలపు మహోన్నత వ్యక్తులలో ఒకరు, మరియు అతని ఔచిత్యం ఏమిటి? అది ఇదే: మనిషిగా ఏం సాధించవచ్చో చూడండి. నిజానికి, తనను తాను అభివృద్ధి చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని, కానీ మనమందరం దీన్ని కూడా చెయ్యగలమని ఆయన చెప్పారు. సమస్యలను ఆయన డీల్ చేసే విధానం చూడండి. ఈ భూమి మీద ఉన్న ఒక బిలియన్ మందికి పైగా ప్రజలకు ఒక శత్రువుగా పరిగణించబడతారని ఊహించుకోండి. కానీ అది నిజం కాదని, తన తలపై కొమ్ములు లేవని చెప్పి గురువు గారు నవ్వుతారు. కానీ సన్యాసుల దుస్తుల్లో ఉన్నవాళ్లు దెయ్యాలుగా పరిగణించబడడాన్ని మీరు ఎలా ఎదుర్కుంటారు?

ఆయన ఎప్పుడూ ఒత్తిడికి గురికారు. దాన్ని తానెప్పుడూ అనుభవించలేదని, ఈ విషయం అర్థం చేసుకోవడం చాలా కష్టమని చెప్పారు. తక్కువ ఆత్మగౌరవం లేదా సొంత ద్వేషం ఉన్న వ్యక్తుల ఆలోచన గురించి తాను ఎప్పుడూ వినలేదని లేదా ఆలోచించలేదని అతను అంగీకరించినప్పుడు ఈ విషయం నాకు గుర్తుంది. అతను దాన్ని ఎప్పుడూ ఎదుర్కోలేదు లేదా స్వయంగా అనుభవించలేదు.

అతను ఆశావాదిగా ఉంటాడు కాని అదే సమయంలో పరిస్థితుల రియాలిటీతో వ్యవహరిస్తాడు. ఇప్పుడున్న పరిస్థితుల గురి౦చి ఆయన ఇలా అంటారు: "లోక సమస్యలు మానవజాతిచే సృష్టి౦చబడ్డాయి, వాటిని మానవజాతి నిర్మూలి౦చగలదు." ప్రాథమిక మానవీయ విలువలను పెంపొందించడం, పిల్లల విద్యలో నైతికతను తీసుకురావడం, వివిధ సంస్కృతులు, మతాల మధ్య మత సామరస్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నించడం ద్వారా వాటి నిర్మూలనకు సహాయపడతాయని ఆయన ప్రయత్నిస్తున్నారు. పూర్తి వినయాన్ని, ఉదారత దృక్పథాన్ని కొనసాగిస్తూనే పూర్తి ప్రపంచ శ్రేయస్సు కోసం చురుకుగా పనిచేస్తున్నారు. ఇది అంత ఆకర్షణీయమైనది. దానికి తోడు అతని హాస్యం మరియు నమ్మశక్యం కాని శక్తికి యాడ్ అవుతుంది, మరియు ఇది నమ్మశక్యం కానిది.

ఆయన కార్యదర్శులు, సలహాదారులు ఆయనకు విశ్రాంతి అవసరమని, అంత ప్రయాణాలు చేయొద్దని ఎప్పుడూ చెబుతుంటారు. అతను ప్రయాణించేటప్పుడు, ప్రతి నిమిషం రోజు డజన్ల కొద్దీ సమావేశాలు, ప్రతిరోజూ విమాన ప్రయాణాలతో నిండి ఉంటుంది. కానీ ఆయన ఎప్పుడూ "వద్దు. ఇది చెయ్యడానికి నాకు శక్తి ఉన్నప్పటికీ, నేను ఇలా ప్రయాణిస్తాను, ఎందుకంటే ఇది ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటుంది" అని చెప్తారు.

అసలైన విషయం ఏమిటంటే ఆయన మనకు ఆశను అందిస్తారు. ఆయన చాలా నిజాయితీగా ఉంటారు మరియు చాలా కష్టపడి పనిచేస్తారు. ఆయన మానవజాతి అభివృద్ధి గురి౦చి మాట్లాడుతున్నప్పుడు, ఆయన వాస్తవికమైన, సాధి౦చదగిన పదాల్లో మాట్లాడుతారు: విద్య, పరస్పర అవగాహన, నైతిక విలువలు. ఇవి అద్భుత పద్ధతులు కావు; అవి మనం చెయ్యగలిగే పనులే. ఆయన మన దేశానికి లేదా మన నగరానికి వచ్చినప్పుడు, దలైలామా గారిని వ్యక్తిగతంగా కలుసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన మరియు విలువైన అవకాశం.

ప్రశ్నలు మరియు సమాధానాలు

గురువు గారు తన ఆధ్యాత్మిక కర్తవ్యాలన్నిటినీ, అలాగే శరణార్థుల జీవితాలను వ్యవస్థీకరించడం లాంటి ఆచరణాత్మక విషయాలను ఎలా మేనేజ్ చెయ్యగలరు?

ఆయన చాలా అధ్యయనం మరియు ధ్యాన సాధనలో నిమగ్నం కావడమే కాకుండా బహిష్కరణకు గురైన టిబెటన్ సమాజం కోసం సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్‌కు అధిపతిగా కూడా ఉన్నారు. ధైర్యంగా, తెలివిగా, ఎంతో దూరదృష్టితో ఆ పదవిని వదులుకుని సిక్యాంగ్ అని పిలువబడే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధిపతిని నియమించారు. కానీ అంతకు ముందు చాలా సంవత్సరాలు, అతను శరణార్థులను స్థిరపరచడానికి, ప్రవాసంలో వివిధ సంస్థలను పునఃప్రారంభించడానికి అన్ని ప్రయత్నాలను చేశారు. "ఓహ్, ఇది చాలా ఎక్కువ, నేను చేయలేను, ఇది అసాధ్యం" అని ఆలోచించకుండా, చాలా వాస్తవికంగా ఉండటం అతని ప్రధాన వ్యూహం. తన అద్భుతమైన తెలివితేటలు మరియు జ్ఞాపకశక్తితో, అతను తన క్రింద ఉన్న వివిధ ప్రాజెక్టులన్నింటినీ ట్రాక్ చెయ్యగలరు మరియు విషయాలను అందరికీ ఎలా అప్పగించాలో తెలుసు. ఏది అవసరమో అదే చేస్తారు. అది అతనికి పెద్ద విషయమేమీ కాదు.

ఎన్నో వైవిధ్య భరితమైన పనులు చెయ్యడానికి శిక్షణ ఇవ్వడానికి కాలచక్ర వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుందని నేను అప్పుడప్పుడు సగం జోక్ చేస్తాను. కాలచక్ర మండలిలో, మీరు 722 బొమ్మలను విజువలైజ్ చెయ్యాలి, మరియు అలా చెయ్యగల అతికొద్ది మందిలో అతను ఒకరు కావచ్చు. ఇంత సంక్లిష్టమైన పద్ధతిలో ఈ అభ్యాస విధానం ద్వారా తన గురించి ఆలోచించడం, ఒక కొత్త పని లేదా సమస్య వచ్చినప్పుడు, అది చాలా చిన్న విషయం. మీరు దేనికీ భయపడరు, మీరు దేని నుంచి పెద్ద సీన్ చెయ్యరు.

జీవితం సంక్లిష్టమైనది మరియు కొంతమంది జీవితాలు ఇతరులకన్నా కష్టంగా ఉంటాయి. కానీ దాని గురించి భయపడే బదులు, దాన్ని మనం ఎందుకు స్వీకరించకూడదు? ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది! నా వెబ్‌సైట్ లాగా, 21 భాషలతో పనిచెయ్యడం - ఇది పెద్ద విషయం కాదు, మేము దీన్ని చెయ్యగలము. అవసరం అయితే ఇంకా ఎక్కువ జోడించగలం, అలా ఎందుకు చెయ్యకూడదు? దలైలామా గారు డీల్ చేసే విషయాలతో పోలిస్తే ఇది ఒక చిన్న ప్రాజెక్టు. కానీ ఇది కొత్త అవకాశాలను అందిస్తుంది. "పాపం నేను" లాంటి కంప్లయింట్లు ఏమీ ఉండవు. మా అమ్మ చెప్పినట్లు "ధైర్యంగా ముందుకి సాగిపో" అని. అన్నీ చేసెయ్యడమే!

దలైలామా గారు సాధారణ మానవుడు అని నొక్కి చెప్పినప్పటికీ, ఆయనను గురువు గారు అని ఎందుకు పిలుస్తారో మీరు వివరించగలరా?

దలైలామా గారు తనని తాను గురువు అని చెప్పుకోరు. ఎలా మొదలైందో నాకు కూడా తెలియదు. బహుశా అది ఏదో క్రైస్తవ టైటిల్ నుంచి తీసుకోబడి ఉండవచ్చు, మరియు అది ఆంగ్లంలో చిక్కుకుపోయింది. ప్రజలు దాన్ని రాజుని పిలిచే "గురువు గారు" లాంటి గౌరవ వ్యక్తీకరణగా ఉపయోగిస్తారు. టిబెటన్ భాషలో, మీ ఆధ్యాత్మిక గురువును సూచించడానికి అనేక గౌరవాలు ఉపయోగించబడతాయి, మరియు దలైలామా గారి కోసం ప్రత్యేకమైనవి ఉన్నాయి, కాని ఏదీ "గురువు గారు" అని అనువదించబడలేదు. ఇది ప్రజలు అవలంబించిన ఒక సాధారణ సంప్రదాయంగా మారింది, మరియు ప్రజలు తనను అలా పిలవకుండా ఉండలేరు. కానీ ప్రజలు తనను ఏదో దేవుడిలా ఆరాధించాలని అతను ఎప్పుడూ కోరుకోరు.

మీకు టిబెటన్ భాష తెలుసు కాబట్టి, మీరు ఆంగ్లంలో బాగా సరిపోయేదిగా ఏదైనా చెప్పగలరా?

ఆయన కోసం ఉపయోగించిన ప్రధాన టైటిల్ "కుందున్", అంటే "పరమాత్మ ఉనికి" అని. సరే, ఇతర భాషలలోకి అనువదించడం కష్టం, కానీ ఆయన అత్యంత అభివృద్ధి చెందిన జీవుల యొక్క అన్ని మంచి లక్షణాలను అవతరిస్తారు మరియు ప్రాతినిధ్యం వహిస్తారు. మీరు బాగా గ్రహించిన వ్యక్తి సమక్షంలో ఉన్నారు. నేను దీన్ని చెప్పడానికి ప్రయత్నించాను, కానీ ఎవరూ దానికి ఆసక్తి చూపలేదు!

సారాంశం

కొందరు ఆయనను తమ ఆధ్యాత్మిక నాయకుడిగా భావిస్తే, మరికొందరు సూపర్ స్టార్ గా చూస్తారు. ఆయనను "గొర్రె చర్మంలో ఉన్న తోడేలు" లాగా చూసే వాళ్ళు కూడా ఉన్నారు. లౌకిక నైతికత, మత సామరస్యాన్ని పెంపొందించడం ద్వారా దలైలామా గారు ఇతరుల ప్రయోజనాల కోసం, ప్రపంచ శాంతి కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారన్నది నిజం. ప్రేమ, కరుణ మరియు జ్ఞానానికి ప్రతిరూపంగా, ఆయన మనల్ని ప్రేరేపించడానికి పనిచేస్తారు, మనుషులమైన మనం ఏమి సాధించగలమో చూపిస్తారు.

Top