సరిగ్గా మాట్లాడటం, ప్రవర్తన మరియు జీవనోపాధి

సమీక్ష

నైతిక క్రమశిక్షణ, ఏకాగ్రత మరియు విచక్షణా అవగాహన అనే ఈ మూడు ఎప్పుడూ మన సమస్యలను మరియు మనం అనుభవించే బాధలను పోగొట్టడానికి మనకు సహాయపడతాయి. మన కష్టాలకు గల కారణాలను గుర్తించి, ఈ మూడింటిని అప్లై చేసి వాటిని తొలగించడమే మంచి పద్ధతి.

ఈ మూడు శిక్షణలు ఇతరులతో వ్యవహరించేటప్పుడు మన జీవితంలో పెంపొందించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

 • నైతిక క్రమశిక్షణ – మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తామో మరియు ఎలా మాట్లాడతామో గమనించుకోవడం చాలా ముఖ్యం. హానికరమైన లేదా వినాశకరమైన పనులు చెయ్యకుండా ఉండడానికి మనకు నైతిక క్రమశిక్షణ అవసరం.
 • ఏకాగ్రత – మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు ఏకాగ్రతతో ఉండాలి, అప్పుడు అక్కడ ఏమి జరుగుతుందో మరియు వారి అవసరాలు ఏమిటో మనకు తెలుస్తుంది. మన ఆలోచనలు ఎటు వైపో ఉండి, ఎప్పుడూ మనం మన ఫోన్లను చూస్తూ ఉంటే, అది ఇతరులతో సంభాషణలను కష్టంగా అయ్యేలా చేస్తుంది.
 • విచక్షణా అవగాహన – మనం అవతలి వ్యక్తి చెప్పేది బాగా వింటే, సరైన ప్రతిస్పందన ఏమిటో తెలుసుకోవటానికి మనం విచక్షణా అవగాహనను ఉపయోగించగలుగుతాము. ఇది మళ్ళీ ఇతరుల గురించి సరిగ్గా ఆలోచించడం, వ్యవహరించడం మరియు మాట్లాడటానికి దారితీస్తుంది.

మూడు శిక్షణలు కలిసి ఒక దాన్ని ఇంకొకటి బలపరుచుకుంటాయి, అందుకే మనం వాటన్నిటినీ ఒకేసారి అప్లై చెయ్యాల్సి ఉంటుంది. మనం వేరే వాళ్లతో లేనప్పుడు, ఈ మూడు శిక్షణలు మనకు బాగా ఉపయోగపడతాయి:

 • అవి మనల్ని విధ్వంసక రీతిలో వ్యవహరించకుండా ఆపుతాయి.
 • మన మనస్సులు కేంద్రీకృతమై ఉంటాయి, అలా మనం అనుకున్నది సాధించగలుగుతాము.
 • ఏది సరైనదో, ఏది సరైనది కాదో తెలుసుకోవడానికి మన ప్రాథమిక తెలివితేటలను ఉపయోగిస్తాం.

అవి మన జీవితంలో, వ్యక్తిగత పరిస్థితులకు మరియు సామాజిక సంభాషణలకు ఉపయోగించగల ప్రాథమిక సూత్రాలు.

ఎనిమిది రకాల మార్గాలు

మనం మూడు శిక్షణలలో శిక్షణ పొందినప్పుడు, దీన్ని "ఎనిమిది రకాల మార్గాలు" అని పిలుస్తారు. ఇందులో ఎనిమిది రకాల అభ్యాసాలు ఉంటాయి. మనం ఈ శిక్షణలను తీసుకుని మూడు అంశాలను అభివృద్ధి చేసుకుంటాము.

నైతిక క్రమశిక్షణలో మన శిక్షణ కోసం, మనకు మూడు విషయాలు ఉన్నాయి:

 • సరిగ్గా మాట్లాడటం - మన కమ్యూనికేషన్ విధానం
 • పనిలో సరైన సరిహద్దులు - మన ప్రవర్తన
 • సరైన జీవనోపాధి - మనం ఎలా జీవనం కొనసాగిస్తాము.

ఏకాగ్రతలో మన శిక్షణ కోసం, ఈ క్రింది మూడు విషయాలు ఉన్నాయి::

 • సరైన ప్రయత్నం – మన మనస్సును వినాశకరమైన ఆలోచనల నుంచి విముక్తి చేసి ధ్యానానికి అనుకూలమైన మానసిక స్థితిని అభివృద్ధి చేయడం
 • సరైన బుద్ధిపూర్వకత - మన దృష్టి యొక్క లక్ష్యం మరియు మన ప్రేరణను వదులుకోకుండా ఉండటం
 • సరైన ఏకాగ్రత - నిర్మాణాత్మకమైన వాటిపై దృష్టి పెట్టడం.

విచక్షణ అవగాహనలో మన శిక్షణ కోసం, ఈ క్రింది రెండు ఉన్నాయి:

 • సరైన ఆలోచనా విధానం – ఏది నిజమని, ఏది సరైనది, ఏది తప్పు, లేదా ఏది హానికరమైనది మరియు ఏది సహాయకారిగా ఉంటుంది అని మనం నమ్మే ఆలోచన.
 • సరైన ఉద్దేశం (సరైన ప్రేరణ కలిగించే ఆలోచన) - మన సరైన ఆలోచనా విధానం దారితీసే నిర్మాణాత్మక మానసిక స్థితి.

ఇంకా వివరంగా చెప్పాలంటే, ఎనిమిది అభ్యాసాలలో ప్రతి ఒక్క దానికి దాని వాడుకలో దాని తప్పు మార్గాలు ఉన్నాయి, దీనిని మనం వదిలేయాలని అనుకుంటున్నాము మరియు దానిని సరైన మార్గంలో చేయడానికి మనం ప్రయత్నిస్తాము.

మాట్లాడే విధానం

మనం ఇతరులతో ఎలా మాట్లాడతామో అదే మన మానసిక స్థితిని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇది ఇతరులు ఎలా భావిస్తారో మరియు ప్రతిస్పందనగా వారు మనల్ని ఎలా చూస్తారో అనేది ప్రభావితం చేస్తుంది. కాబట్టి, ఎలా మాట్లాడితే ఉపయోగంగా ఉంటుందో, మరియు ఏది హానికరంగా ఉంటుందో మనం తెలుసుకోవాలి.

తప్పుగా మాట్లాడటం

తప్పుగా మాట్లాడటం అనేది అసంతృప్తి మరియు సమస్యలను తెచ్చిపెడుతుంది:

 • అబద్ధం చెప్పడం –  అబద్ధాలు ఆడడం మరియు ఇతరులను మోసం చేయడం. మనం అబద్ధాలు చెప్పే వ్యక్తిగా, ఇతరులను మోసం చేసే వ్యక్తిగా పేరు తెచ్చుకుంటే ఎవరూ మనల్ని నమ్మరు. మనం చెప్పేది ఎవరూ వినరు. ఇది అసంతృప్తి పరిస్థితిని సృష్టిస్తుంది.
 • వేరుచేసినట్టు మాట్లాడటం - మనుషుల గురించి వారి స్నేహితులకు లేదా భాగస్వాములకు చెడుగా చెప్పడం, వాళ్ళ సంబంధాలను నాశనం చేయడానికి ప్రయత్నించడం. ఇది మనం వెనక వాళ్ళ గురించి ఏమి చెబుతున్నామో అని ఆశ్చర్యపోయేలా చేస్తుంది మరియు మన స్వంత సంబంధాలను నాశనం చేస్తుంది.
 • కఠినంగా మాట్లాడటం - క్రూరంగా మాట్లాడటం, లేదా అరవడం మరియు ఇతరులను తిట్టడం. మనం మన మాటలతో ఇతరులను తిట్టినప్పుడు, వాళ్ళు కూడా మనతో ఇలా మాట్లాడటం మొదలుపెడతారు, మరియు వాళ్ళు సైకోలు కాకపోతే, వాళ్లను పద్దాక తిడుతున్న మనలాంటి వాళ్ళ చుట్టూ ఉండటానికి ఇష్టపడరు.
 • అర్ధం లేకుండా మాట్లాడటం - ఎప్పుడూ "బ్లాహ్ బ్లాహ్ బ్లాహ్" అని మాట్లాడటం. ఇతరులు మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడటం మరియు గొణగడం. దీని వల్ల మనల్ని ఎవరూ సీరియస్ గా తీసుకోరు, మనతో ఉండటం వాళ్లకు బాధగా అనిపిస్తుంది. మన సమయాన్ని, ఇతరుల సమయాన్ని కూడా మనం వృథా చేసేస్తాం.

సరిగ్గా మాట్లాడటం

ఈ పై నాలుగు రకాల తప్పు విధానాలకు దూరంగా ఉండటానికి మంచిగా మాట్లాడటమే మనకు సహాయపడుతుంది. క్రమశిక్షణ యొక్క మొదటి స్థాయి ఏమిటంటే, మనం ఏదైనా అబద్దం చెప్పాలని, ఎవరినైనా తిట్టాలని లేదా కబుర్లు చెప్పాలని అనిపించినప్పుడు, అది వినాశకరమైనదని మరియు అసంతృప్తిని కలిగిస్తుందని మనం గుర్తిస్తాము, కాబట్టి మనం ఆ పనిని చెయ్యకుండా ఉండటానికి బాగా ప్రయత్నిస్తాము.

ఇది అసలు సులభం కాదు, ఎందుకంటే మీరు ఏదైనా బలవంతంగా చెప్పడానికి ముందు, ఆ పనిని చేయాలని భావించే క్షణంలో బయటకు చెప్పుకోవాలి. ఇది ఒక కేక్ ముక్కను కోరుకోవడంలా ఉంటుంది. కొన్నిసార్లు మనకు రెండవ ముక్క తినే అవకాశం ఉంటుంది, కానీ మనం దానిని తీసుకునే ముందు, మనం ఇలా అనుకోవచ్చు, "నాకు అది కావాలని ఉన్నా కానీ, నేను అది తీసుకోను. నాకు ఈ కేక్ అవసరం లేదు. ఇది నన్ను ఇంకా లావుగా అయ్యేలా చేస్తుంది. నేను కొంత బరువు తగ్గాలి." అని క్రమశిక్షణతో మనం మాట్లాడేది ఇదే.

మనకు ఈ పనులు చేయాలని అనిపించినప్పుడు, పురాతన భారతీయ గురువు శాంతిదేవుడు ఒక చెక్క కట్టలా ఉండమని సలహా ఇస్తాడు. నాకు అరవాలని లేదా ఏదైనా చెడుగా చెప్పాలని అనిపిస్తుంది, కానీ అది నన్ను మరియు మీ ఇద్దరినీ ఇబ్బంది పెడుతుందని గ్రహించండి, కాబట్టి నేను ఆ పని చెయ్యను. నేను ఏమి చెయ్యకుండా అలాగే ఉండిపోతాను. నాకు ఏదో ఒక తెలివితక్కువ జోక్ చెప్పాలని లేదా సిల్లీ కామెంట్ చేయాలని అనిపిస్తుంది, కానీ ఇది కేవలం ఒక పనికిమాలిన పని అని గ్రహించి నేను ఏమీ మాట్లాడను. ఇది కూడా ఇలాంటి విషయమే.

క్రమశిక్షణ యొక్క రెండవ స్థాయి ఏమిటంటే, మీరు దానికి బదులుగా ఏదైనా మంచి పని చెయ్యడం - కాబట్టి, ఒక ప్రయోజనకరమైన రీతిలో మాట్లాడటం. అలా చేయడం వల్ల ఆనందం వస్తుందని, ప్రతి పరిస్థితిని మరింత సామరస్యంగా మారుస్తుందని గ్రహించడం ద్వారా ఇది తెలుస్తుంది. మనం చేయాల్సిందల్లా కారణం, ప్రభావం రీతిలో ఆలోచించడమే.

సరైన మాటలు మాట్లాడటం నిజానికి చాలా చైతన్యవంతమైన ప్రయత్నం మరియు దానికి బలమైన సంకల్పం అవసరం, సరైన సమయంలో, సరైన కొలతలలో అర్థవంతమైన మాటలే మాట్లాడాలి:

 • మనం ఎప్పుడూ వ్యక్తులను డిస్టర్బ్ చేస్తూ పద్దాక వాళ్లకు కాల్ లేదా టెక్స్ట్ చెయ్యకుండా ఉండేలా ప్రయత్నించాలి, ముఖ్యంగా నువ్వు బ్రేక్ ఫాస్ట్ చేసావా అని అడగడం లాంటి అనవసరమైన విషయాలు. అర్థం పర్థం లేని కబుర్లే ఇతరులకు ఇబ్బందులను కలిగిస్తాయి.
 • ఒక సరైన పని ఏమిటంటే, మనం ఇతరులతో ఎక్కువగా మాట్లాడినా కానీ లేదా కొన్ని విషయాల గురించి ఒప్పించడానికి అతిగా ప్రయత్నించము.

నిజానికి, మనం వివక్షతను ఉపయోగించాలి. ఉదాహరణకు, నిజాయితీగా ఉండి, ఎవరైనా మురికి చొక్కా లేదా బట్టలు వేసుకుంటే, దాన్ని నిజాయితీగా వాళ్ళకు చెప్పడం వారిని బాధపెడుతుంది. అప్పుడు "అవునా, అది నిజంగా మురికిగా కనిపిస్తుంది" అని మీరు చెప్పకూడదు.  కొన్నిసార్లు మీరు జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇది ఎదుటి వ్యక్తిపై కూడా ఆధారపడి ఉంటుంది. నా సోదరి నన్ను చూడటానికి వచ్చింది, మేము కలిసి బయటకు వెళుతున్నాము మరియు ఆమె ఒక బ్లౌజ్ వేసుకుంది. అది కొంచెం సాగిపోయి సరిగ్గా లేదు, కానీ తను నా సోదరి, కాబట్టి అది బాలేదని నేను తనకు స్పష్టంగా చెప్పగలను. కానీ మీ కుటుంబం కాకుండా వేరే వాళ్లతో అలా చెప్పడం కష్టమే! మీరు మీ కొత్త గర్ల్ ఫ్రెండ్ తో, "నువ్వు వేసుకున్న బ్లౌజ్ అస్సలు బాలేదు. ఇంకేదైనా వేసుకో!" అని అస్సలు చెప్పలేరు. ఒకవేళ అది నిజం అయినా కానీ.

తిట్ల విషయానికొస్తే, కొన్నిసార్లు మీరు ఏదైనా బలమైన మాటలను అనాల్సిన అవసరం ఉంటుంది. మీ పిల్లవాడు అగ్గిపెట్టెలు లేదా లైటర్ తో ఆడుతుంటే, మీరు వాడిని గట్టిగా ఏదొకటి తిట్టాల్సి వస్తుంది. అది నిజంగా కఠినమైన తిట్టుగా ఏమీ పరిగణించబడదు ఎందుకంటే మీ ప్రేరణ అనేది కోపం కాదు. కాబట్టి, ప్రేరణ నిజంగా చాలా ముఖ్యమైనది.

తప్పుగా మాట్లాడటానికి మిగతా ఉదాహరణలు

మనం ఇతరులని మాత్రమే కాకుండా, మనల్ని కూడా తిట్టుకునేలా ఈ వినాశకరమైన మార్గాలను ఉపయోగించవచ్చు. ఈ వినాశకరమైన మార్గాల గురించి మనం ఇంకా విస్తృతంగా ఆలోచించవచ్చు.

అబద్ధం విషయానికి వస్తే మనకు ఇతరుల పట్ల ఉన్న ఫీలింగ్స్ మరియు ఉద్దేశాలు లేనివి ఉన్నట్లుగా చెప్పటం జరుగుతుంది. మనం వేరే వాళ్లతో చాలా మంచిగా ఉండవచ్చు, వాళ్లని మనం ప్రేమిస్తున్నామని చెప్పవచ్చు - దానిని నమ్మి వాళ్ళు మోసపోవచ్చు - మనకు కావలసిందల్లా వాళ్ల డబ్బు లేదా వేరే ఏమైనా కావొచ్చు. ఒకరకంగా చెప్పాలంటే ఇది మోసమే. నిజానికి, మనం ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి, "నేను నిజంగా నిన్ను ప్రేమించడం లేదు, నాకు నీ డబ్బు మాత్రమే కావాలి" అని చెప్పలేము, ఎందుకంటే అది బాగోదు. కానీ మన భావాలు, ఉద్దేశాల గురించి నిజాయితీగా ఉన్నామా లేదా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి.

వేరుచేసి మాట్లాడటం అనేది మనం చేసే చెడ్డ పనుల్లో ఒకటి, ఎందుకంటే అది మన స్నేహితులు మనల్ని విడిచిపెట్టి వెళ్లేలా చేస్తుంది. కొంతమంది ఎప్పుడూ కంప్లైంట్ చేస్తూనే ఉంటారు లేదా ఎప్పుడూ నెగెటివ్ గా మాట్లాడుతూనే ఉంటారు, ఇది మిగతా వాళ్ళందరిని వాళ్ళ నుంచి దూరం వెళ్లేలా చేస్తుంది. మనం అలా ఉంటే మనతో ఎవరు ఉండాలని కోరుకుంటారు? లేదా అవతలి వ్యక్తికి ఏమీ మాట్లాడనివ్వకుండా మనమే అంతా మాట్లాడుతూ ఉంటే - అది వాళ్లకు చికాకు అనిపించి దూరం వెళ్లిపోయేలా చేస్తుంది. అలాంటి వ్యక్తులు మనందరికీ తెలుసు, మరియు మనం వాళ్లని పద్దాక కలవాలనే కోరిక ఉండదు. ఇతరుల గురించి మంచిగా చెప్పడం, వీలైనంత పాజిటివ్ గా ఉండటం మనం నేర్చుకోవాలి.

ఇతరులనే కాదు మనల్ని కూడా మనం తిట్టుకొనేటప్పుడు తిట్లు అనేవి ఖచ్చితంగా వస్తాయి. మనం ఇతరులకు వాళ్ళు మూర్ఖులు లేదా భయంకరమైన వారు అని చెప్పినప్పుడు, అది అస్సలు బాగోదు. కాబట్టి, అలాగే మనల్ని మనం అనుకోవడం కూడా అస్సలు బాగోదు. ఇది ఖచ్చితంగా మనకు సంతోషాన్ని కలిగించదు, కాబట్టి మన గురించి మనం ఎలా ప్రవర్తిస్తామో మరియు మన మనస్సులో ఎలా మాట్లాడతామో అనేది మంచి ఆలోచనా విధానంతో ఉండాలి.

ఇక కబుర్లు చెప్పాలంటే మన వ్యక్తిగత విషయాల గురించి, మన సందేహాల గురించి, మన బాధల గురించి ఇతరులతో విచక్షణారహితంగా మాట్లాడకూడదు. కొన్ని విషయాలను అసలు ఎవరితో పంచుకోకూడదు. ఉదాహరణకు, ఎవరైనా వాళ్ళు గే అని లేదా క్యాన్సర్ ఉందని మీతో చెబితే, ఆ మాటని మీ దగ్గర దాచమని చెప్తే, మీరు అలాగే చెయ్యాలి. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడం సాధారణంగా చెడ్డ పని కిందకే వస్తుంది.

సరిగ్గా మాట్లాడటం అంటే సరైన సమయంలో, సరైన పరిస్థితులకు తగ్గట్టుగా మాట్లాడటం. మనం కొన్నిసార్లు అధికారికంగా, కొన్నిసార్లు అనధికారికంగా మాట్లాడాల్సి ఉంటుంది. ప్రజలకు సౌకర్యం కలిగించేలా మనం మాట్లాడాల్సి ఉంటుంది. మీరు పిల్లలకి ఏదైనా వివరించినప్పుడు, వాళ్ళు అర్థం చేసుకునేలా దాన్ని వివరించాలి, కానీ ఇది పెద్దలు మరియు ఇతర సంస్కృతులకు చెందిన వాళ్లకు కూడా వర్తిస్తుంది.

చేసే పనికి సరిహద్దులు (ప్రవర్తన)

ఎనిమిది రకాల మార్గాలలో రెండవది చేసే పనికి ఉండే సరిహద్దులు గురించి ఉంటుంది. మనం సరిహద్దుల గురించి మాట్లాడేటప్పుడు, మనం ఒక లిమిట్ గురించి మాట్లాడుతున్నాము, "నేను ఇలాగే వ్యవహరిస్తాను, కానీ దానికి మించి వెళ్ళను" అని.

తప్పు ప్రవర్తన

సరిహద్దులను దాటి మాట్లాడటం మూడు రకాల చెడు ప్రవర్తనను సూచిస్తుంది:

 • ప్రాణం తీయడం - ఏదైనా ఒక జీవిని చంపడం
 • మనకు కాని దాన్ని తీసుకోవడం - మనకు చెందనిదాన్ని తీసుకోవడం, లేదా దొంగతనం చేయడం
 • అనుచిత లైంగిక ప్రవర్తనకు పాల్పడటం.

చంపడం

సింపుల్ గా చెప్పాలంటే ఇది వేరొకరి ప్రాణాలు తీస్తున్నట్లే. ఇది కేవలం మనుషులనే కాదు, కానీ అన్ని రకాల జంతువులు, చేపలు, కీటకాలు మొదలైన వాటిని కూడా సూచిస్తుంది.

మనలో చాలా మందికి, జంతువుల వేట మరియు చేపలు పట్టడం మానేయడం అంత పెద్ద కష్టమైన పనేమీ కాదు అని నేను అనుకుంటున్నాను. కొంత మందికి, కీటకాలను చంపడమే కష్టంగా అనిపిస్తుంది. "ఈ ఈగ పూర్వజన్మలో నా తల్లి" అని అనుకుంటూ గతం, భవిష్యత్ జీవితాల జోలికి పోకుండా ఇలా చెయ్యడానికి అనేక మార్గాలు ఉంటాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనకు చిరాకు కలిగించే దానిని ముందే మన ప్రతిస్పందనగా చంపాలని అనుకోము. ఇది మనకు నచ్చని దాన్ని హింసాత్మక మార్గంలో చంపాలనుకునే అలవాటును పెంచుతుంది. అలా ఈ అలవాటు మీ ముఖం చుట్టూ తిరిగే ఈగ నుంచి మొదలయ్యి ఎక్కడికో వెళుతుంది. దీనికి బదులుగా, చికాకు కలిగించే వాళ్లతో వ్యవహరించడానికి మనం కొన్ని శాంతియుత పద్ధతులను కనుగొనడానికి  ప్రయత్నించాలి. కాబట్టి, ఈగలు లేదా దోమలు మన గోడ పైకి వచ్చినప్పుడు వాటిని ఒక గాజులో కానీ ఒక కాగితంలో కానీ పట్టి బయట విడిచిపెట్టాలి. అనేక సందర్భాల్లో, మనకు నచ్చని దానితో వ్యవహరించడానికి మనం చాలా శాంతియుతమైన, అహింసాయుతమైన మార్గాలను కనిపెట్టవచ్చు.

మీరు భారతదేశంలో నివసిస్తుంటే, నాలాగే, మీరు కీటకాలతో జీవించడం నేర్చుకుంటారు. భారతదేశంలో కీటకాలను వదిలించుకునే మార్గం అస్సలు ఏదీ లేదు. ట్రావెల్ ఏజెంట్ల కోసం ఒక యాడ్ ప్రచారం నాకు గుర్తుకు వస్తుంది: అందులో "మీకు కీటకాలు నచ్చితే, మీరు భారతదేశాన్ని ప్రేమిస్తారు!" అని ఉంటుంది. నేను మొదటిసారి భారతదేశానికి వచ్చినప్పుడు, నా ఆలోచన ఎలా ఉండేదంటే, నాకు అస్సలు కీటకాలంటే ఇష్టం ఉండేది కాదు, కానీ నేను సైన్స్ ఫిక్షన్ ను బాగా ఇష్టపడతాను. నేను సుదూర గ్రహానికి వెళ్తే, అక్కడ జీవరాశులు ఇలాంటి కీటకాల ఆకారంలో ఉంటే, నేను వాటిని కలిసినప్పుడు వాటిని చంపడమే నా పని అయ్యి ఉంటే అది ఎంత భయంకరంగా ఉంటుందో అని ఊహించుకుంటాను! మిమ్మల్ని మీరు ఆ కీటకం స్థానంలో ఉంచుకుంటే - అవి కేవలం వాటి జీవితాన్ని అవి గడుపుతున్నాయి అని తెలుస్తుంది - అప్పుడు మీరు వాటిని గౌరవించడం ప్రారంభిస్తారు.

సహజంగా, హానికరమైన కీటకాలు కూడా ఉన్నాయి, హానికరమైన మనుషులు ఉన్నట్లే, వాటి గురించి మనం తగినట్టు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కానీ మనం మనుషుల గొడవల గురించి మాట్లాడుతున్నా లేదా చీమలు లేదా బొద్దింకలతో నిండిన ఇంటి గురించి మాట్లాడుతున్నా ముందు  శాంతియుత పద్ధతిని ప్రయత్నించడం మంచిది.

కానీ మిడతలు మీ పంటలను తినే సందర్భాన్ని పరిగణనలోకి తీసుకోండి. అప్పుడు ఏదొకటి చెయ్యాల్సి వస్తుంది. ఒక ఉదాహరణ బుద్ధుని పూర్వ జన్మ, అందులో అతను ఒక నౌకకు నావికుడిగా పని చేశాడు. ఓడలో ఉన్న ప్రతి ఒక్కరినీ చంపాలని ఒకడు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సామూహిక హత్యను శాంతియుత మార్గంలో నిరోధించడానికి మార్గం లేదని బుద్ధుడు గ్రహించాడు. దానిని నివారించడానికి ఏకైక పరిష్కారం ఈ హంతకుడిని స్వయంగా చంపడమే అని అనిపించింది. కాబట్టి, బుద్ధుడు వాడిని చంపేశాడు, కానీ కరుణ యొక్క ప్రేరణతో - ప్రయాణీకుల ప్రాణాలను కాపాడటానికి అలాంటి నెగెటివ్ పని చేయాల్సి వచ్చింది. కానీ బుద్ధుడు కూడా తాను ఎవరినో చంపానని, ప్రేరణతో సంబంధం లేకుండా అది ఒక విధ్వంసకర పని అని అంగీకరించాడు. కాబట్టి అతను "ఇతరులను రక్షించడానికి దీని నుండి వచ్చే కర్మ పర్యవసానాలను స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను" అని చెప్పాడు.

కాబట్టి, పంటలను రక్షించడానికి మిడతలను చంపడం అవసరం పడితే – వాటి భయంతో పంటలను అమ్మి డబ్బులు సంపాదించడం కన్నా - కరుణతో దాని పర్యవసానాన్ని ఎదుర్కోవాలనే నిర్ణయం తక్కువగా ఉంటుంది. ఏదేమైనా, బుద్ధుడి లాగా, ఇది ఒక నెగెటివ్ పని అని అంగీకరించి దాని నుంచి ఏం జరిగినా దానికి సిద్ధంగా ఉండాలి.

దొంగతనం చెయ్యడం

చాలా మంది ప్రజలు తమ ఆస్తుల కంటే వారి జీవితాలతో ఎక్కువ అనుబంధాన్ని కలిగి ఉంటారు, కానీ, మీరు ఒకరి ఆస్తులను దొంగిలిస్తే, అది ఇద్దరికి చాలా బాధను కలిగిస్తుంది. ముఖ్యంగా ఆ దొంగకు "నేను పట్టుబడతానా?" అనే టెన్షన్ ని కలిగిస్తుంది.

ఇప్పుడు, మనం చెయ్యాల్సింది ఏమిటంటే, మనకు సమస్యలు రాకుండా చూసుకోవడమే. సహజంగా, మీరు ఒక చేపను లేదా ఒక కీటకాన్ని చంపితే, అది వాటికి సమస్య అవుతుంది. కానీ మనకు కూడా ఒక సమస్య ఉంటుంది, ఎందుకంటే వాటిని చంపాలని మనం అర్ధరాత్రి కూడా మేలుకుని ఉండి వెతుకుతాము. ఇది ఒక అశాంతితో కూడిన మానసిక స్థితి. వీటిని ఎదుర్కోవడానికి మనం సాధారణంగా శాంతియుత పద్ధతులను ఉపయోగిస్తే, మన మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది.

దొంగతనం విషయంలోనూ అంతే. ఎక్కడ దొంగతనం చేయాలి, పట్టుబడతామా లేదా అని కంగారు ఉంటుంది. ఇది చాలా బలమైన కోరికపై ఆధారపడి ఉంటుంది, ఇక్కడ మీరు ఏదొక పని చెయ్యడానికి కావల్సినంత ఓపికతో ఉండలేరు, కాబట్టి మీరు దానిని వేరే వాళ్ళ నుంచి దొంగిలిస్తారు.

వ్యతిరేక ప్రేరణలతో చంపడం మరియు దొంగతనం చేయడానికి కూడా ఉదాహరణలు ఉన్నాయి:

 • మీరు నిజంగా ఒక జంతువు లేదా చేపను తినాలని అనుకున్నప్పుడు మీరు మమకారం మరియు దురాశతో వాటిని చంపవచ్చు. తినడానికి ఏమీ లేకపోతే అది ఒక విషయం, కానీ వేరేవి ఉన్నా కానీ ఇలా చెయ్యడం అనేది ఆలోచించాల్సిన విషయం.
 • మీరు ఎవరినైనా బాధ పెట్టాలనుకుని ఆ కోపంలో దొంగతనం చేయవచ్చు. అప్పుడు వారికి సంబంధించిన వాటిని తీసుకుంటారు.

అనుచిత లైంగిక ప్రవర్తన

ఇది చాలా కష్టమైన టాపిక్ ఎందుకంటే, మనలో చాలా మందికి, మన లైంగిక ప్రవర్తన వెనుక బలమైన ప్రేరణతో కూడిన కోరికలు ఉంటాయి. బౌద్ధమతం దీనిని ఎలా నివారించాలో ఈ క్రింది ప్రాథమిక గైడ్ లైన్స్ లో వివరిస్తుంది, అవి:

 • మన లైంగిక ప్రవర్తన, రేప్ మరియు ఇతరులను ఇబ్బంది పెట్టడం లాంటి హానికరమైన పనులు చెయ్యడం.
 • ఇష్టం లేనప్పుడు కూడా సెక్స్ చేయమని ఇతర వ్యక్తులను, మరియు మన భాగస్వామిని ఒత్తిడి చెయ్యడం.
 • వేరొకరి భాగస్వామితో సెక్స్ చేయడం, లేదా మనకు భాగస్వామి ఉన్నా కానీ వేరొకరితో సెక్స్ చేయడం. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ, అది ఎప్పుడూ ఇబ్బందులకు దారితీస్తుంది.

అనుచిత లైంగిక ప్రవర్తనకు అనేక ఇతర అంశాలు ఉన్నాయి, కానీ దాని వెనుక ఉన్న ఆలోచన మనం జంతువులలాగా ప్రవర్తిస్తాము అని కాదు. ఒక జంతువు చుట్టుపక్కల ఎవరితో సంబంధం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేరే జంతువుతో కలుస్తుంది. అవి పూర్తిగా కోరిక మరియు కామ నియంత్రణలో ఉంటాయి - దీనిని మనం నివారించాలని అనుకుంటున్నాము.

కాబట్టి, మనం చెయ్యాలనుకున్నది ఏమిటంటే, కొన్ని హద్దులను సెట్ చేసుకుని వాటిలో మన లైంగిక ప్రవర్తనను పరిమితం చేయాలని నిశ్చయించుకోవాలి. మనం పెట్టుకున్న ఆ లిమిట్స్ ఎంత తరచుగా, లైంగిక పనులు, మరియు లైంగిక భంగిమల గురించి వ్యవహరిస్తుంది. మనం మన లైంగిక జీవితాన్ని ఎలా ఉంచుకోవాలో కొన్ని మార్గదర్శకాలను ఏర్పాటు చేయడమే దీని ఉద్దేశం. ఏ సమయంలోనైనా, ఏ ప్రదేశంలోనైనా, ఎవరితోనైనా, ఒక జంతువు లాగా మనకు అనిపించిన ప్రతి పని చెయ్యకూడదు. నైతిక క్రమశిక్షణలో ఇది నిజంగా చాలా ముఖ్యమైనది. క్రమశిక్షణ అంటే మనం పెట్టుకున్న హద్దులు దాటకుండా ఉండటమే. ఎందుకంటే అంతకు మించి వెళ్తే కేవలం కామమే ఉంటుంది. కామం లెక్క లేనన్ని సమస్యలకు కారణం అవుతుంది.

మత్తు పదార్ధాలు తీసుకోవడం

మత్తు పదార్ధాలను తీసుకోవడం ఈ విధ్వంసక పనుల్లో చేర్చబడలేదు, కానీ వాటిని విడిచిపెట్టడం చాలా మంచిది.

మనం ఏకాగ్రతను, క్రమశిక్షణను పెంపొందించుకోవాలని ఆనుకుంటున్నాము. మనం మందు తాగినప్పుడు క్రమశిక్షణను కోల్పోతాము, అవునా కాదా? మనం సైకెడెలిక్ డ్రగ్స్ లేదా గంజాయిని తీసుకుంటాము. అప్పుడు మనం మన ఏకాగ్రతను కోల్పోతాము. మన మనసులు క్షీణించి, ఊహలతో నిండిపోతాయి. మనం వివిధ మత్తు పదార్ధాలు లేదా ఆల్కహాల్ యొక్క ప్రభావాలను చూసినప్పుడు మరియు మన వ్యక్తిగత అభివృద్ధిలో ఆశయాలతో పోల్చి చూస్తే, ఇవి తీసుకోవడం మంచి పని కాదని మనం తెలుసుకుంటాం. ఇది తాగినప్పుడే కాకుండా తాగేసిన తర్వాత కూడా - హ్యాంగోవర్ లాగా ఇబ్బందులను సృష్టిస్తుంది! కాబట్టి, మన ఉపయోగానికి కొన్ని రకాల లిమిట్స్ ని సెట్ చేసుకోవడం చాలా మంచిది, మరియు వాటిని పూర్తిగా మానెయ్యడం ఇంకా మంచిది.

పని చెయ్యటానికి సరైన సరిహద్దులు (సరైన ప్రవర్తన)

క్రమశిక్షణ యొక్క ఒక అంశం ఏమిటంటే చెడు ప్రవర్తనకు దూరంగా ఉండటం. మరొక అంశం సరైన పనులను చెయ్యడం, దీనిని "సరైన ప్రవర్తన" అని కూడా అంటారు.

అందువల్ల, ఇతరుల ప్రాణాలను తీసుకోవడానికి బదులుగా, మీరు జీవితాన్ని కాపాడుకోవటానికి బాగా ప్రయత్నిస్తారు. దీనిని బాగా ఉపయోగించడం అంటే పర్యావరణాన్ని నాశనం చెయ్యడం అని కాదు, జంతువులు మరియు చేపలు స్వేచ్ఛగా జీవించడానికి వాటికి వీలుగా జాగ్రత్త పడడం. మీకు పందులు ఉంటే వాటిని పెంచుతూ ఉంటారు, అవి లావు పెరిగాక వాటిని మీరు తినాలని కాదు, అవి బతకాలని అలా చేస్తారు - అదే వాటి జీవితం. మీ కుక్కకు ఆహారం పెట్టడం కూడా దాని జీవితాన్ని కాపాడటానికి సహాయపడే ఒక మార్గం! అనారోగ్యంతో ఉన్నవారిని జాగ్రత్తగా చూసుకోవడం లేదా గాయపడిన వారికి సహాయం చేయడం కూడా ఇందులో ఒక భాగమే.

మీ గదిలోకి వచ్చే ఒక ఈగ లేదా తేనెటీగ గురించి ఆలోచించండి. అది నిజంగా అక్కడికి రావటానికి ఇష్టపడదు. అది బయటకు వెళ్లిపోవాలని అనుకుంటుంది. కానీ దానికి ఎలా వెళ్లాలో తెలియదు. కాబట్టి మీ గదిలో ఎగురుతూ ఒక చిన్న తప్పు చేసినందుకు మీరు దానిని చంపితే ఎలా? కిటికీ తెరవడం లేదా "షూ" అని దాన్ని బయటకు తోలడంతో మీరు దానికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇది ఒక జీవితాన్ని కాపాడటానికి సహాయపడుతుంది. తేనెటీగ కూడా బతకాలనే అనుకుంటుంది! ఒక పక్షి పొరపాటున మీ గదిలోకి వస్తే, మీరు దానిని కాల్చడానికి తుపాకీని బయటకు తీయరుగా? కానీ తేనెటీగ మరియు పక్షి మధ్య తేడా దాని సైజు, రూపం మరియు అది చేసే శబ్దాన్ని బట్టి ఉంటుంది. ఈగలు మీ గదిలోకి రావడం మీకు ఇష్టం లేకపోతే - మీ కిటికీని తెరవకుండా కర్టెన్స్ వేసుకుని ఉంచుకోండి!

దొంగతనం చెయ్యకుండా ఉండడానికి, సరైన పని ఇతరుల వస్తువులను సరిగ్గా చూసుకోవడం. ఎవరైనా మీకు ఒక వస్తువును ఇస్తే, దానిని పాడు చెయ్యకుండా ఉండటానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. ఇతరులకు మంచి వస్తువులు ఉండేలా మీరు సహాయపడటానికి ప్రయత్నిస్తారు.

అనుచిత లైంగిక ప్రవర్తన, అంటే ఇతరులతో సెక్స్ మాత్రమే కాదు, మీతో కూడా మీరు పాడు పనులు చేసుకోకూడదు. లైంగికంగా మనం దయ మరియు సున్నితంగా ఉండాలి, వీధిలో కుక్కలా ప్రవర్తించకూడదు.

సరైన మరియు తప్పు ప్రవర్తన యొక్క మిగతా ఉదాహరణలు

ఈ విషయాన్ని ఇంకా పరిశీలిస్తే, ఈ మూడు రకాల ప్రవర్తనతో ముడిపడి ఉన్న అనేక ఇతర అంశాలు ఉన్నాయి.

ఉదాహరణకు, చంపకుండా ఉండడం అంటే, ఇతరులతో కఠినమైన రీతిలో ప్రవర్తించకుండా ఉండడం. వేరే వాళ్లను కొట్టకుండా ఉండటమే దీని అర్ధం కాదు, వాళ్లతో ఎక్కువగా పని చేయించుకోకుండా లేదా వాళ్లను కష్టపెట్టకుండా ఉండడం. దీన్ని మనం కూడా అప్లై చేసుకోవచ్చు - అతిగా పనిచేసి మనల్ని మనం పాడు చేసుకోకూడదు, లేదా ఏది పడితే అది తింటూ తక్కువగా నిద్రపోకూడదు. మనం తరచుగా మన ప్రవర్తనను ఇతరులతో పోల్చుకుని ఆలోచిస్తాము. కానీ దాన్ని మనకు కూడా అప్లై చేసుకోవడం చాలా ముఖ్యం.

ఇక దొంగతనం విషయానికొస్తే, ఇతరుల వస్తువులను తీసుకోవడమే కాదు, వాళ్లను అడగకుండా వాళ్ళ వస్తువులను వాడేసుకోవడం, ఒకరి ఫోన్ తీసుకొని ఖరీదైన కాల్ చేయడం, లేదా అనుమతి లేకుండానే ఆహారాన్ని వారి ఫ్రిజ్ లో పెట్టడం లాంటివి. డబ్బులు కట్టకుండా సినిమాకి వెళ్లడం, లేదా - ప్రజలు ఇష్టపడని మాట – అదే మీ టాక్స్ లను చెల్లించకపోవడం! ఇది నిజంగా దొంగతనమే. "సరే, నేను టాక్స్ లను కట్టాలని అనుకోవడం లేదు, ఎందుకంటే ఆ డబ్బులు యుద్ధాల నిధులు సమకూర్చడానికి మరియు ఆయుధాలను కొనడానికి ఉపయోగించబడతాయి" అని మనం వాదించవచ్చు. కానీ రియాలిటీ ఏమిటంటే, ఇది రోడ్లు వేయడానికి మరియు ఆసుపత్రులు, పాఠశాలలు మొదలైన వాటిని కట్టడానికి కూడా ఉపయోగించబడుతుంది. ఇవి మీకు కావాలనుకుంటే మీరు టాక్స్ ని కట్టాల్సి ఉంటుంది.

లైసెన్స్ లేని లేదా పైరేటెడ్ సాఫ్ట్ వేర్ లు, వీడియోలు డౌన్ లోడ్ చేయడాన్ని ఏమనాలి? ఇది కూడా దొంగతనం చేసినట్టేనా? "డబ్బు చెల్లించకుండా దీన్ని డౌన్లోడ్ చేయవద్దు" అని స్పష్టంగా చెబితే, అప్పుడు అవును. అది దొంగతనమే. కానీ అన్నిటికి హద్దులను నిర్ణయించుకోవాలి. పర్యవసానాల గురించి ఆలోచించకుండా, ఏదైనా చేసేలా ఉండే వెసులుబాటు ఉంటుంది. దొంగతనం విషయానికొస్తే, "నేను బ్యాంకును దోచుకోవడం లేదు లేదా దుకాణం నుంచి దొంగతనం చేయడం లేదు, కానీ డబ్బు చెల్లించకుండా డౌన్లోడ్ చేసుకుంటున్నాను? నేను అలా చెయ్యకుండా అస్సలు ఉండలేను" అని మనం చెప్తాము. కనీసం ఇది ఒక రకమైన సరిహద్దును సృష్టిస్తుంది, కానీ డబ్బులు కట్టకుండా డౌన్లోడ్ చేయడం దొంగతనమే. మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మరియు డబ్బులు లేనప్పుడు వాటిని డౌన్లోడ్ చేసుకోవడానికి చాలా తేడా ఉంటుంది. మీరు కట్టగలిగినప్పుడు ఇది చాలా సీరియస్ విషయం, అలా కట్టలేనప్పుడు ఇది చీప్ గా మరియు అసహ్యంగా ఉంటుంది. ఈ పనికి మనం కొంచెం దూరంగా ఉండాల్సి ఉంటుంది.

దొంగతనం చేసే సమయంలో మనల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు - చిన్న చిన్న వస్తువుల మీద మన డబ్బులను వృథా చేయడం మానుకోవచ్చు. ఉదాహరణకు, గాంబ్లింగ్ అనేది మన స్వంత ఆస్తులను దుర్వినియోగం చేసుకోవడానికి దారితీస్తుంది. మనం నిజంగా ఆ ఖర్చు భరించగలం అన్నప్పుడు వెనకడుగు వెయ్యకూడదు. సరైన ఆహారం తినడానికి మరియు కొనడానికి మీకు డబ్బులు ఉన్నా కానీ మీరు పీనాసి వాళ్ల లాగా చౌకై వాటిని కొంటూ, నాణ్యత లేని  ఆహారాన్ని తింటున్నారు.

అనుచిత లైంగిక ప్రవర్తన విషయానికి వస్తే, ఇది ఇతరులపై లేదా వారి భాగస్వాములపై విరుచుకు పడటమే కాకుండా, మన స్వంత శారీరక లేదా భావోద్వేగ ఆరోగ్యానికి హాని కలిగించే లైంగిక పనులను చెయ్యకుండా ఆపివేస్తుంది. ఉదాహరణకు, మీకు చాలా నచ్చిన వ్యక్తిని మీరు కలుస్తారు, ఒక వైపు, మీరు వారితో సెక్స్ చేయాలనుకుంటారు. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే, వారికి అన్ని రకాల భావోద్వేగ సమస్యలు మరియు ఇతర ఇబ్బందులు ఉంటాయి. అప్పుడు మీరు వారితో సంబంధాన్ని పెట్టుకుంటే, మీకే సమస్యలు వస్తాయని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి, మీ స్వంత వ్యక్తిగత ఆరోగ్యం కోసం, అలాంటి పని చెయ్యకండి. ఎవరో అందంగా ఉన్నారని మన కామంతో వాళ్లకు దగ్గరవ్వకూడదు!

మనం పెట్టుకున్న హద్దులు దాటితే అప్పుడు మనం ఏం చెయ్యాలి

అనుకున్నట్టుగానే, ఎప్పటికప్పుడు, మన ప్రవర్తనకు మనం పెట్టుకున్న హద్దులను దాటుతాము, కాబట్టి బౌద్ధమతం అటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి ఈ క్రింది వాటిని సూచిస్తుంది:

 • మీరు చేసిన పనిని గుర్తించండి. మీతో మీరు నిజాయితీగా ఉండండి.
 • మీరు ఆ పని చెయ్యకపోతే బాగుండేది అని అనుకుంటే, మీరు చేసిన పనికి పశ్చాత్తాపపడండి. ఇది అపరాధం నుంచి వేరేగా ఉంటుంది, ఇక్కడ మీరు ప్రాథమికంగా మిమ్మల్ని భయంకరమైన వ్యక్తిగా భావిస్తారు మరియు ఆ ఆలోచనను విడిచిపెట్టరు.
 • ఆ పనిని మళ్ళీ చెయ్యకుండా ఉండేలా ప్రయత్నిస్తామని గట్టిగా నిర్ణయం తీసుకోండి.
 • మీరు పెట్టుకున్న హద్దులు దాటడానికి ఇష్టపడరని, మీ ప్రేరణను పునరుద్ఘాటించండి. ఎందుకంటే ఇది అసంతృప్తికి దారితీస్తుంది మరియు సమస్యలను సృష్టిస్తుంది.
 • ఒక ప్రత్యర్థిని వాడండి. ఉదాహరణకు, మీరు ఎవరినైనా తిడితే, మీరు నిజాయితీగా అతనికి క్షమాపణ చెప్పి, మీరు బాడ్ మూడ్ లో ఉన్నారని లేదా ఇంకొక కారణం వల్ల అలా చేశానని వివరించవచ్చు.

జీవనోపాధి

ఇది మనం ఎలా జీవనోపాధిని పొందుతున్నాం అని సూచిస్తుంది, కొన్ని మార్గాలు నైతికమైనవి మరియు కొన్ని అనైతికమైనవి.

తప్పుడు జీవనోపాధి

ఇది హానికరమైన పరిశ్రమ నుంచి లేదా మనకు మరియు ఇతరులకు హాని కలిగించే విధంగా డబ్బు సంపాదించకుండా ఉండటానికి సంబంధించినది. ఉదాహరణకు, ఇందులో ఇవి ఉన్నాయి:

 • ఆయుధాల తయారీ లేదా లావాదేవీలు.
 • జంతువులను చంపడం, వేటాడటం, చేపలు పట్టడం మరియు కీటకాలను చంపడం.
 • మద్యం లేదా మాదకద్రవ్యాల తయారీ, అమ్మకం లేదా ఉపయోగించడం.
 • జూదం, కెసినోను నిర్వహించడం.
 • అశ్లీల చిత్రాలను తియ్యడం మరియు పంపిణీ చేయడం. 

ఈ రకమైన జీవనోపాధి ఇతరులకు హాని కలిగిస్తుంది లేదా అశ్లీలత లాగా, కామం మరియు కోరికలను పెంచుతుంది. మనం ఒక సాధారణ ఉద్యోగంలో ఉన్నా కానీ, నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యం:

 • క్లయింట్స్ నుంచి ఎక్కువ డబ్బులు ఛార్జ్ చేయడం, వారి నుంచి ఎంత డబ్బు కుదిరితే అంత తీసుకోవడానికి ప్రయత్నించడం.
 • మోసం చేయడం, మీ స్వంత ఉపయోగం కోసం వ్యాపారం లోని డబ్బులు తీసేసుకోవడం.
 • ఇతరుల నుంచి డబ్బు లాక్కోవడానికి వారిని బెదిరించడం.
 • లంచగొండితనం
 • ఇతరులను దోపిడీ చేయడం.
 • తప్పుడు ప్రకటనలు చేయడం.
 • ఎక్కువ డబ్బు సంపాదించడం కోసం ఆహారం లేదా ఉత్పత్తులను కల్తీ చేసి అమ్మడం.

బ్రతకడానికి ఎన్నో మార్గాలున్నాయి! ఈ రకమైన జీవనోపాధిని నివారించడానికి మనం నైతిక క్రమశిక్షణను అలవరచుకోవాలి.

సరైన జీవనోపాధి

నిజాయితీగా మరియు సమాజానికి ఉపయోగపడేలా మన జీవితాన్ని గడపాలని మనం లక్ష్యంగా పెట్టుకోవాలి:

 • మందులు
 • సామాజిక సేవ
 • న్యాయమైన వాణిజ్యం
 • ఇతరులకు ఉపయోగపడే ఉత్పత్తులు మరియు సేవలను తయారు చేయడం లేదా సరైన విధంగా విక్రయించడం.

సమాజం ఆరోగ్యవంతంగా సాగటానికి మరియు ఇతరులకు సహాయపడేది ఏదైనా గొప్పగా ఉండటానికి, మనం ఈ క్రింది వాటిని చేయాలి:

 • ఇతరులను మోసం చెయ్యకూడదు, లేదా వారి నుంచి అధిక డబ్బులను వసూలు చెయ్యకూడదు. 
 • మంచి ధరను సెట్ చేయండి, అలా మనం లాభాన్ని పొందగలం, కానీ ఈ పని సరిగ్గానే చెయ్యాలి. 
 • మన కింద పని వాళ్లకు మంచి జీతాన్ని ఇవ్వాలి, అలా మనం వారిని దోపిడీ చెయ్యకుండా ఉంటాము.

ఇలాంటి ప్రశ్నల్లో ఎప్పుడూ వచ్చే ఒక విషయం అవసరానికి సంబంధించినదిగా ఉంటుంది. ఒకసారి నేను ఆస్ట్రేలియాలోని ఒక టిబెటన్ టీచర్ కోసం అనువదించాను, అక్కడ గొర్రెలు చాలా ఉన్నాయి, అప్పుడు ఒకతను నన్ను, "నేను ఉంటున్న పట్టణంలో, మాకున్న ఒకే ఒక పని గొర్రెలను పెంచడం, వాటిని తర్వాత మేము ఉన్ని మరియు మాంసం కోసం ఉపయోగిస్తాము. నేను ఇంకేమి చెయ్యాలి? నేను వేరే సిటీకి వెళ్లి వేరే పని వెతుక్కోవడానికి ప్రయత్నించలేను” అని అడిగాడు. అప్పుడు ఆ టిబెటన్ లామా గారు ఇలా అన్నారు, "మీ పనిలో నిజాయితీగా ఉండటం మరియు ఇతరులను మోసం చెయ్యకుండా ఉండటం, మరియు  గొర్రెలను బాగా చూసుకోవడం, వాటిని బాగా పోషించండి చెయ్యండి.“ అలా, దయ మరియు నిజాయితీగా ఉండటంపై ముఖ్యంగా దృష్టి పెట్టండి.

సారాంశం

మనం ఈ ఎనిమిది రకాల మార్గాల నుంచి పొందిన సలహాలను చూసినప్పుడు, వీటిని మనల్ని నిర్బంధించే ఒక రకమైన నిబంధనలుగా కాకుండా, నెగెటివ్ పనుల నుంచి మనల్ని విముక్తి చేసే విషయాలుగా మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే ఇవి మనకు మరియు ఇతరులకు హాని కలిగించగలవు.

Top