బౌద్ధమతం అంటే ఏమిటో మరియు అది మన జీవితాలకు ఎలా ఉపయోగపడుతుందో అర్థం చేసుకోవాలనుకుంటే, బౌద్ధమత బోధనలలో మరియు ఆచరణలలో ఉపయోగించే ఒక సాంప్రదాయ పదం గురించి మనం తెలుసుకోవాలి: అదే ధర్మం. "ధర్మం" అనేది ఒక సంస్కృత పదం, దీని అర్థం "ఒక నివారణ చర్య". ఇది ఏమిటంటే మనకు సమస్యలు రాకుండా ఉండేందుకు చేసే ఒక పని. దీని అర్ధం మనకు అర్థమైతే, బుద్ధుడు బోధించిన ప్రతి విషయం యొక్క ఉద్దేశం మనకు తెలుస్తుంది.
నివారణ చర్యలు తీసుకోవడానికి ఆసక్తి కనబరచాలంటే జీవితంలో సమస్యలు ఉన్నాయో లేదా అని తెలుసుకోవాలి. నిజానికి దానికి చాలా ధైర్యం కావాల్సి ఉంటుంది. చాలా మంది తమను లేదా తమ జీవితాలను సీరియస్ గా తీసుకోరు. వాళ్లు రోజంతా ఎంతో కష్టపడి పనిచేసి, వచ్చిన అలసటను మర్చిపోవడం కోసం సాయంత్రం వేళల్లో ఎంజాయ్ చేస్తూ మిగతా పనులతో తమ దృష్టిని మరల్చుకుంటారు. వాళ్ళు నిజంగా వారి జీవితంలోని సమస్యలను అంతగా పట్టించుకోరు. వాళ్ళు తమ సమస్యలను చూసుకున్నా, వారి జీవితాలు మంచిగా లేవని అంగీకరించడానికి ఇష్టపడరు, ఎందుకంటే ఇలా అనుకోవడం వాళ్లకు చాలా నిరుత్సాహకరంగా అనిపిస్తుంది. మన జీవితం యొక్క నాణ్యతను నిజంగా పరిశీలించడానికి మరియు అది సరిగ్గా లేదని నిజాయితీగా ఒప్పుకోవటానికి ధైర్యం అవసరం.
అసంతృప్తికరమైన సందర్భాలు మరియు దాని కారణాలు
వాస్తవానికి, అసంతృప్తి చాలా స్థాయిలలో ఉంటుంది. "కొన్నిసార్లు నా మూడ్ బాగుండకపోవచ్చు, అప్పుడు నేను అనుకున్నవి సరిగ్గా జరగవు, అయినా పరవాలేదులే. అదే జీవితం అంటే.” ఒకవేళ మనం దానితో సంతృప్తి చెందితే, ఓకే. మనం ఆ పనిని ఇంకా బాగా చెయ్యగలం అని అనుకుంటే, అలా చేయడానికి మనం ఒక మార్గాన్ని వెతకొచ్చు. మన జీవిత నాణ్యతను మెరుగుపరచుకోవడానికి ముందు మనం మన సమస్యలు ఎక్కడ నుంచి వస్తున్నాయి అనేది గుర్తించాలి. చాలా మంది తమ సమస్యలకు కారణాల కోసం బయట వెతుకుతూ ఉంటారు. "నీ వల్ల మన రిలేషన్ షిప్ లో నాకు ఇబ్బందులు ఉన్నాయి! నువ్వు నేను కోరుకున్న విధంగా ఉండటం లేదు' అని అంటూ ఉంటారు. మన కష్టాలను రాజకీయ, ఆర్థిక పరిస్థితుల మీద కూడా వెయ్యవచ్చు. మనస్తత్వ శాస్త్రం యొక్క కొన్ని స్కూల్స్ ప్రకారం, మన బాల్యంలో బాధాకరమైన సంఘటనలు మన సమస్యలకు కారణమని చెప్తున్నాయి. మన అసంతృప్తిని ఇతరులపై నెట్టెయ్యడం చాలా సులభం. ఈ నిందను ఇతరులపై లేదా సామాజిక లేదా ఆర్థిక కారణాలపై వెయ్యడం వల్ల పరిష్కారం ఏమీ లభించదు. మనకు ఇలాంటి ఆలోచన ఉంటే, మనం దాని వల్ల కొంత ప్రయోజనాన్ని పొందవచ్చు. కానీ చాలా మంది ప్రజలు ఇలా చేసినా కూడా వాళ్ళ మానసిక సమస్యలు మరియు అసంతృప్తి నుంచి ఉపశమనం పొందలేకపోయారని చెప్పారు.
మిగతా వ్యక్తులు, సమాజం మొదలైన వాళ్ళ వల్ల మనకు సమస్యలు వచ్చినప్పటికీ, వాళ్ళు నిజమైన కారణాలు కాదని బౌద్ధమతం చెబుతుంది. మన కష్టాలకు అసలైన మూలాన్ని కనుక్కోవాలంటే ముందు మనలోపల వాటిని వెతకాలి. అన్నింటికీ మించి, మన జీవితంలో మనం దుఃఖంలో ఉంటే, అది మన పనుల యొక్క పర్యావసానమే. వివిధ వ్యక్తులు ఒకే పరిస్థితికి రకరకాలుగా స్పందిస్తారు. మనం కూడా మన కష్టాలకు ఏ రోజుకి ఆ రోజు వేరు వేరుగా స్పందిస్తాం. మన సమస్యలకు కారణాలు బయటి పరిస్థితులే అయితే, మనం ఎప్పుడూ ఒకే విధంగా ప్రతిస్పందించాలి, కానీ మనం అలా చెయ్యము. పనిలో బాగా ప్రదర్శించడం అనేది మనం ఎలా స్పందిస్తామో ప్రభావితం చేసే ఒక విషయం, కానీ ఇవి పైకి కనిపించే కారణాలు మాత్రమే. అవి అంత లోతుగా ప్రభావం చూపించవు.
మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ జీవితం పట్ల, మన పట్ల మరియు మన పరిస్థితుల పట్ల మన ఆలోచనా విధానం మనకు ఎలా సహాయం చేస్తుందో తెలుసుకుంటాము. ఉదాహరణకు, మన రోజు మంచిగా గడిస్తే, అప్పుడు మన గురించి మనం బాధ పడము; కానీ మనకు ఏ రోజైనా సరిగ్గా గడవకపోతే, మన మీద మనకే జాలి వేస్తుంది. జీవితం పట్ల మనకున్న ప్రాథమిక ఆలోచనా విధానం మనం జీవితాన్ని ఎలా అనుభవిస్తామో నిర్ణయిస్తుంది. ఇంకా బాగా పరిశీలిస్తే, మన ప్రవర్తన మనకు వచ్చే ఇబ్బందులపై ఆధారపడి ఉంటుందని తెలుస్తుంది.
అన్ని సమస్యలకు కారణం గందరగోళం
మనం గందరగోళాన్ని అర్ధం చేసుకుంటే, అది మన ప్రవర్తన, కారణం మరియు ప్రభావం గురించి ఉంటుంది. ఏం చేయాలో, ఏం చెప్పాలో, చివరికి ఏం జరుగుతుందో తెలియక మనం గందరగోళానికి గురవుతూ ఉంటాం. ఎలాంటి ఉద్యోగం చేయాలి, పెళ్లి చేసుకోవాలా వద్దా, పిల్లల్ని కనాలా వద్దా అనేటటువంటి విషయాల్లో చాలా గందరగోళానికి గురవుతుంటాం. మనం ఒక వ్యక్తితో రిలేషన్ షిప్ లోకి వెళ్తే దాని ఫలితం ఎలా ఉంటుంది? అనే విషయం మనకు తెలియదు. మన ఛాయిస్ ల నుంచి ఏమి జరుగుతుందనే దాని గురించి మన ఆలోచనలు నిజంగా ఊహలు లేదా భయం మరియు మతిస్థిమితంపై ఆధారపడి ఉంటాయి. ఒక వ్యక్తితో మంచి సంబంధం పెట్టుకుంటే, ఒక కల్పిత కథలో లాగా మనం ఎప్పటికీ సంతోషంగా జీవిస్తాము అని మనం అనుకోవచ్చు. లేదా వాళ్ళు మనల్ని విడిచిపెడతారేమోనని భయపడి, భావోద్వేగ దూరం పాటిస్తాం. ఒక పరిస్థితి వల్ల మనం ఇబ్బంది పడితే, అక్కడ అరిస్తే సరిపోతుందని అనుకుంటాము. మనం చేసే పనికి అవతలి వ్యక్తి ఎలా స్పందిస్తాడనే దానిపై మనకు చాలా అయోమయపు ఆలోచన ఉంటుంది. మనం అరుస్తూ, మన మనసులోని మాటలను చెప్తే మనకు మంచి అనుభూతి కలుగుతుందని, అంతా సవ్యంగా సాగుతుందని అనుకుంటాం కానీ అలా జరగదు. ఏం జరుగుతుందో మనకు తెలియాలి. మనం జ్యోతిషాన్ని బాగా చూస్తాము లేదా మార్పుల పుస్తకం ఐ చింగ్ ని కొని చదువుతాము. ఇలాంటి పనులు మనం ఎందుకు చేస్తున్నాం? ఎందుకంటే మన జీవితంలో ఏమి జరుగుతుందో దాన్ని మనం నియంత్రించాలని అనుకుంటున్నాము.
మనం మరియు మన పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు మరియు ప్రపంచం ఎలా ఉనికిలో ఉంది అనేదే అసలైన గందరగోళం అని బౌద్ధమతం చెబుతుంది. ఈ పూర్తి నియంత్రణ విషయంలో మనం గందరగోళంలో ఉన్నాం. మనకు ఏమి జరుగుతుందో దాన్ని పూర్తిగా మనమే నియంత్రించవచ్చని మనం అనుకుంటాము. ఉదాహరణకు, మన కంప్యూటర్ ను వేరెవ్వరిని ఉపయోగించడానికి అనుమతించకపోతే, అప్పుడు అది క్రాష్ అవ్వదు. దాని వల్ల, మనం ఆశించిన విధంగా పనులు జరగనప్పుడు మనం నిరాశ చెందుతాము. ఎప్పుడూ నియంత్రణలో ఉండటం అసలు సాధ్యం కాదు. అలా అసలు కుదరదు. వాస్తవం చాలా సంక్లిష్టమైనది. ప్రతీ దాన్ని చాలా విషయాలు ప్రభావితం చేస్తాయి. మనం పూర్తిగా అదుపు తప్పామనో లేదా బయటి వాళ్ల చేత ఆడించబడ్డామనో కాదు. ఏమి జరుగుతుందో దానికి మనం సహాయం చేస్తాము, కానీ జరిగేదాన్ని నిర్ణయించేది మనం కాదు.
మన గందరగోళం మరియు అభద్రతా భావం వల్ల, ఇది వినాశకరమైన ప్రవర్తన అని కూడా తెలియకుండా మనం తరచుగా గొడవలను సృష్టించేలా ప్రవర్తిస్తాము. ఎందుకంటే మనం ఇబ్బంది పెట్టే భావోద్వేగాలు, విధానాలు మరియు మన అలవాట్ల యొక్క ప్రభావానికి మనం లోనవుతాము. మనం ఇతరుల పట్ల వినాశకరంగా వ్యవహరించడమే కాదు; మనం ప్రధానంగా మనల్ని మనం పాడుచేసుకునే మార్గాల్లోనే వ్యవహరిస్తాము. మరో మాటలో చెప్పాలంటే, మనకు మనం ఎక్కువ సమస్యలను సృష్టించుకుంటాము. మనం తక్కువ సమస్యలు లేదా మనకు ఉన్న సమస్యల నుంచి విముక్తి పొందాలంటే, లేదా అంతకంటే ఎక్కువ, ఇతరులు వారి సమస్యల నుంచి బయటపడటానికి సహాయపడే సామర్థ్యాన్ని కోరుకుంటే, మన లిమిట్స్ ని మనం గుర్తిస్తాము.
గందరగోళాన్ని వదిలించుకోవడం
మన సమస్యలకు కారణం గందరగోళం అని మనం గుర్తించగలిగాం. ఇది మరీ అంత కష్టమేమీ కాదు. "నేను నిజంగా గందరగోళంలో ఉన్నాను. నేను అంతా పాడు చేసాను." అని చెప్పే స్థితికి చాలా మంది వస్తారు." అప్పుడు ఏం చెయ్యాలి? మనం వెళ్లి ఈ కోర్సు లేదా ఆ రిట్రీట్ కోసం డబ్బులు ఖర్చు చేసే ముందు, మన గందరగోళాన్ని వదిలించుకోవడం సాధ్యమేనా కాదా అని ముందు మనం తెలుసుకోవాలి. గందరగోళం నుంచి బయటపడటం సాధ్యం కాకపోతే, మనం ఏమి చేయడానికి ప్రయత్నిస్తున్నాము? మన గందరగోళాన్ని వదిలించుకోవడం సాధ్యమేనని మనం అనుకుంటే, అది అంత స్థిరంగా ఏమీ ఉండదు. ఇది కేవలం ఊహ మాత్రమే.
స్వాతంత్రం అనేక విధాలుగా రావచ్చని మనం అనుకోవచ్చు. ఎవరొకరు మనల్ని రక్షిస్తారని మనం అనుకోవచ్చు. అది దేవుని లాగా ఉన్నతమైన, దేవుని లాగా ఉంటుంది, కాబట్టి మనం మళ్ళీ విశ్వాసులుగా మారుతాము. దీనికి బదులుగా, మనల్ని ఈ గందరగోళ౦ ను౦చి కాపాడడానికి ఒక ఆధ్యాత్మిక బోధకుడు, భాగస్వామి లేదా వేరొకరి కోసం వేచి ఉండొచ్చు. అటువంటి పరిస్థితులలో, అవతలి వ్యక్తిపై ఆధారపడటం మరియు ఏమీ తెలియనట్టు ప్రవర్తించడం సులభమే. మనల్ని రక్షించడానికి వేరే వాళ్ళ కోసం వెతకటానికి మనం చాలా ఆరాటపడుతుంటాము. గందరగోళానికి లోను కాని, తనదైన భావోద్వేగాలు, పద్ధతుల వల్ల మన అమాయకమైన పరాధీనతను సద్వినియోగం చేసుకునే వ్యక్తిని మనం ఎన్నుకోవచ్చు. ఇది ముందుకు సాగడానికి ఒక స్థిరమైన మార్గం కాదు. మన అయోమయాన్ని తొలగించడానికి మనం ఆధ్యాత్మిక గురువు లేదా సంబంధాల వైపు వెళ్లలేము. మన గందరగోళాన్ని మనమే క్లియర్ చేసుకోవాలి.
ఆధ్యాత్మిక గురువుతో లేదా భాగస్వామితో అనుబంధం మంచి పరిస్థితులను తెచ్చిపెట్టగలదు, కానీ ఆ సంబంధం సరైనది అయినప్పుడు మాత్రమే ఇలా కుదురుతుంది. ఇది సరిగ్గా ఉండకపోతే ఏమీ బాగోదు. ఇది మరింత గందరగోళానికి దారితీస్తుంది. ప్రారంభంలో, గురువు మరియు భాగస్వామి సరైన వాళ్ళు అని భావించి, మనం లోతైన తిరస్కరణ స్థితిలో ఉండవచ్చు, కాని చివరికి, మన అమాయకత్వం దేనికి పనికి రాకుండా పోతుంది. ఎదుటి వ్యక్తిలోని బలహీనతలను, అవతలి వ్యక్తి మనల్ని మన గందరగోళం నుంచి కాపాడలేడని భావించడం మొదలుపెడితే మనం ఇంకేమీ చేయలేము. మనం మోసపోయామని భావిస్తాం. మన విశ్వాసం మరియు నమ్మకాన్ని వమ్ము అవుతుంది. అదొక భయంకరమైన ఫీలింగ్! మొదటి నుంచి దానిని నివారించడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం. మనం నివారణ చర్యలు తీసుకోవటం చాలా అవసరం. ఏది కుదురుతుందో, ఏది కుదరదో మనమే అర్థం చేసుకోవాలి. ఒక ఆధ్యాత్మిక గురువు ఏమి చేయగలడు మరియు ఏమి చేయలేడు? ఏ ప్రమాదం జరగకుండా ఉండటానికి నివారణ చర్యలు తీసుకోవాలి.
మనం ఒక గందరగోళం లేని మానసిక స్థితిని పెంపొందించుకోవాలి. గందరగోళానికి వ్యతిరేకమైనది, అవగాహన. ఇది ఎలాంటి గందరగోళం రాకుండా చూసుకుంటుంది. బౌద్ధమతంలో మన పని మన ప్రవర్తన, ఇబ్బంది పెట్టే భావోద్వేగాలు మరియు మన బలవంతపు, న్యూరోటిక్ ప్రవర్తన పట్ల ఆత్మపరిశీలన మరియు శ్రద్ధను కలిగి ఉండటం అని చెప్తుంది. అంటే మనలో అంత మంచిగా లేని విషయాలను చూడటానికి సిద్ధంగా ఉండటం, అవే మనం తిరస్కరించే విషయాలు. మన సమస్యలకు కారణమయ్యే లేదా మన సమస్యల లక్షణాలుగా ఉన్న విషయాలను మనం గమనించినప్పుడు, వాటిని అధిగమించడానికి మనం సరైన ప్రత్యర్థులను ఉపయోగించాలి. ఇవన్నీ అధ్యయనం, ధ్యానం మీద ఆధారపడి ఉంటాయి. ఇబ్బంది పెట్టే భావోద్వేగాలు మరియు ప్రవర్తన ఎక్కడ నుంచి వచ్చాయో గుర్తించడం మనం నేర్చుకోవాలి.
ధ్యానం
ధ్యానం అంటే వివిధ ఇబ్బందులను నియంత్రణలో పెట్టి సాధన చేయడం. అలా మనం వాటిని ఎలా నిర్వహించుకోవాలో మనకు తెలుస్తుంది. తర్వాత మన జీవితంలో వాటిని అనుసరించవచ్చు. ఉదాహరణకు, మిగతా వాళ్ళు మనకు నచ్చినట్టుగా ఉండకపోతే వారిపై మనకు కోపం వస్తే, ధ్యానంలో మనం ఈ పరిస్థితుల గురించి ఆలోచించి దాన్ని వేరే కోణంలో చూడటానికి ప్రయత్నిస్తాము. అవతలి వ్యక్తి అనేక కారణాల వల్ల ఒప్పుకోనట్టుగా ప్రవర్తిస్తున్నాడు. అతను లేదా ఆమె మనల్ని ప్రేమించడం లేదు కాబట్టి ద్వేషంతో ఉండాల్సిన అవసరం లేదు. ధ్యానంలో, మనం అటువంటి ఆలోచనా విధానాల గురించి ఆలోచించడానికి ప్రయత్నిస్తాము: "నా ఫ్రెండ్ నాకు కాల్ చెయ్యలేదు కాబట్టి అతను లేదా ఆమె నన్ను ప్రేమించటం లేదు.” అని అనుకుంటాము.
ఈ రకమైన పరిస్థితిని ప్రశాంతంగా, అర్థం చేసుకుని, ఓపికగా ఎదుర్కోవడం ప్రాక్టీస్ చేయగలిగితే, అప్పుడు ఆ వ్యక్తి వారం రోజుల వరకు మనకు ఫోన్ చేయకపోయినా మనం అంతగా బాధ పడము. మనం బాధ పడటం మొదలుపెట్టినప్పుడు, ఈ వ్యక్తి బాగా బిజీగా ఉండి ఉంటాడని మరియు వాళ్ళ జీవితంలో మనం చాలా ముఖ్యమైన వ్యక్తి అని అనుకోవడం అహంకారపూరితమని మనం గుర్తు చేసుకుంటాము. ఇది మన మానసిక క్షోభాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
బౌద్ధమత అభ్యాసం అనేది ఒక నిరంతర పని
బౌద్ధమత అభ్యాసం ఒక హాబీ కాదు. ఇది మనం ఒక ఆటగానో, విశ్రాంతి కోసమో చేసే పని కాదు. బౌద్ధమత అభ్యాసం అనేది ఒక నిరంతర పని. మన జీవితంలో ప్రతి దాని పట్ల మన ఆలోచనా విధానానికి అనుగుణంగా పనిచేయడమే దీని అర్ధం. ఉదాహరణకు, మనం అన్ని జీవుల పట్ల ప్రేమను పెంపొందించుకుని, అలాగే మన కుటుంబాల సభ్యులతో కూడా ప్రేమతో ఉండాలి. చాలా మంది తమ గదుల్లో కూర్చొని ప్రేమ కోసం తపస్సు చేస్తారు, కాని వారి తల్లిదండ్రులు లేదా వారి భాగస్వాములతో కలిసి అలా ఉండలేరు. ఇది చాలా బాధాకరం.
విపరీతమైన వాటిని పట్టించుకోకపోవడం
బౌద్ధమత బోధనలను ఇంట్లో మరియు పనిలో ఉండే మన నిజ జీవిత పరిస్థితులకు అన్వయించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, మనం విపరీతమైన వాటిని పట్టించుకోకూడదు. ఒక వైపు ఏమో పూర్తి నిందను ఇతరులపై మోపటం, ఇంకొక వైపు ఏమో ఆ పూర్తి నిందను మన మీదే వేసుకోవడం. జీవితంలో చాలా సంక్లిష్టంగా ఉంటుంది. రెండు వైపుల వాళ్ళు సహాయం చేస్తారు: ఇతరులు సహాయం చేస్తారు; మనం కూడా సహాయం చేస్తాం. ఇతరులు వారి ప్రవర్తన మరియు ఆలోచనా విధానాలను మార్చుకునేలా మనం చెయ్యవచ్చు, కానీ ఇది అంత సులభం కాదని మనందరికీ తెలుసు - ప్రత్యేకించి మనం సొంత-నీతి, పవిత్ర మార్గంలో వచ్చి ఒకరినొకరు పాపి అని నిందించుకున్నప్పుడు. మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నించడం చాలా సులభం. ఇతరులు మనతో సరిగ్గా ప్రవర్తిస్తే మనం వారికి సలహాలు ఇవ్వగలం, కానీ ఎక్కువ శాతం పని మనమే చెయ్యాల్సి ఉంటుంది.
మనపై మనం పనిచేసుకునేటప్పుడు, మనం వేరొక కారణాల గురించి వెతకాలి: మన భావాలలో పూర్తిగా నిమగ్నమై ఉండటం లేదా వాటి గురించి అస్సలు తెలుసుకోలేకపోవడం జరుగుతుంది. మొదటిది ఏమో నార్సిసిస్టిక్ నిమగ్నత. మనం ఏమీ అనుకుంటున్నామో దాని గురించే మనం ఆలోచిస్తాం. వేరే వాళ్లు ఏమనుకుంటున్నారో మనం పట్టించుకోము. ఎదుటి వాళ్లు ఏమనుకుంటున్నారనే దాని కంటే మనం ఏమనుకుంటున్నామనేదే చాలా ముఖ్యమని భావిస్తూ ఉంటాం. మరోవైపు, మన భావోద్వేగాలతో మనం పూర్తిగా సంబంధం లేకుండా ఉండిపోవచ్చు లేదా మన భావోద్వేగాలను నోవోకైన్ టాబ్లెట్ తో తగ్గించినట్లుగా మనం ఫీల్ అవ్వొచ్చు. ఇలాంటి విపరీతమైన సందర్భాలను తప్పించుకోవటానికి సరైన బ్యాలన్స్ అవసరం. అది అంత సులభం కాదు.
మనం ఇతరులతో ఉన్నప్పుడు మన గురించే ఆలోచిస్తూ ఉంటే, అది ఒక ఊహను సృష్టిస్తుంది - అదే మనం మరియు మనం ఏమి అనుభూతి చెందుతున్నాము లేదా చేస్తున్నాము అని - కాబట్టి మనం నిజంగా ఒకరితో సంబంధాన్ని కలిగి ఉండటం లేదు. నిజమైన కళ అనేది సహజమైన మరియు చిత్తశుద్ధితో వ్యవహరించడంలా ఉంటుంది, కానీ మన దృష్టి యొక్క కొంత భాగం మన ప్రేరణ మరియు ఆలోచనా విధానంపై ఆధారపడి ఉంటుంది. అయితే ఎదుటి వ్యక్తితో కలిసి వికృతంగా వ్యవహరించకుండా మనం ఇలా చేయడానికి ప్రయత్నించాలి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మన ప్రేరణను మరియు భావాలను చెక్ చేసుకోవాలి. ఇది కొన్నిసార్లు ఆ వ్యక్తికి దీని గురించి చెప్పడానికి బాగా సహాయపడుతుంది. అయితే, ఆ వ్యక్తికి మనం చెప్పాలని అనిపించడం చాలా ఆసక్తిని కనబరుస్తుంది. మిగతా వాళ్ళకు మనం ఏం అనుకుంటున్నామో అస్సలు సంబంధం ఉండదు. వాళ్ళు తెలుసుకోవాలని అనుకోవడం కేవలం మన ఆసక్తే. మనం స్వార్థంగా ప్రవర్తిస్తున్నామని గమనించినప్పుడు, మనం ఆ పనిని ఆపేయొచ్చు. దానిని బయటకు చెప్పాల్సిన అవసరం లేదు.
మరో రెండు విషయాలు ఏమిటంటే, మనందరం చెడ్డ వాళ్ళమే లేదా మనందరం మంచి వాళ్ళమే. మన కష్టాలకు, సమస్యలకు, మన భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తే మనం చెడ్డవాళ్లమనే భావన కలుగుతుంది. అది చాలా సులభంగా అపరాధానికి దారి తీస్తుంది. "నేను ప్రాక్టీస్ చేయాలి. అలా చెయ్యకపోతే నేను ఒక చెడ్డవాడిని." అని ప్రాక్టీస్ చెయ్యడం చాలా సులభమైనది.
మన పాజిటివ్ సైడ్ లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న మరో వైపుని కూడా మనం నివారించాలి. “మనం పర్ఫెక్ట్ గా ఉన్నాం. మనం బుద్ధులం. ప్రతీదీ అద్భుతంగా ఉంటుంది.” అని అనుకోవడం చాలా ప్రమాదకరం, ఎందుకంటే ఇది మనం దేనినీ వదులుకోవాల్సిన అవసరం లేదని సూచిస్తుంది; మనం ఎటువంటి నెగెటివ్ వాటిని వదులుకోవాల్సిన అవసరం లేదని సూచిస్తుంది. మనం చేయాల్సిందల్లా మన ప్రాథమిక మంచి లక్షణాలను తెలుసుకోవడమే. "నేను చాలా మంచి వాడిని. నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను. నేను ఎలాంటి నెగెటివ్ ప్రవర్తనను ఆపాల్సిన అవసరం లేదు. నేను ఇప్పటికే బుద్ధుడిని అయ్యాను!" అనే బ్యాలన్స్ మనకు కావాలి. మనల్ని మనం చాలా తక్కువగా భావిస్తే, మనం అన్ని లోపాలను మర్చిపోయి బుద్ధులుగా మారే మన సామర్థ్యాన్ని గుర్తుచేసుకోవాలి. మనకు కొంచెం విసుగు అనిపిస్తే, మన నెగెటివ్ సైడ్ ల గురించి ఆలోచించాలి.
బాధ్యత తీసుకోవడం
ప్రాథమికంగా, మన అభివృద్ధి కోసం మరియు మన సమస్యలను తొలగించుకోడానికి మనమే బాధ్యత తీసుకోవాలి. అవును, మనకు సహాయం అవసరం. దీన్ని చెయ్యడమే అంత సులువైన పని కాదు. ఆధ్యాత్మిక గురువుల నుంచి కానీ లేదా మన ఆధ్యాత్మిక సమాజం నుంచి కానీ మనం సహాయం పొందవచ్చు. వీళ్ళు ఒకే రకమైన ఆలోచనలను కలిగి ఉంటారు మరియు వాళ్ళ మీద వాళ్ళు పని చేసుకుంటారు, అంతే కాకుండా వాళ్ళ సమస్యలకు ఎవరినీ నిందించరు. అందుకే ఒకే రకమైన ఆలోచనలను పంచుకోవడం చాలా ముఖ్యం, ముఖ్యంగా తలెత్తే సమస్యలకు ఎవరినీ నిందించకుండా ఉండటం. ఆ భాగస్వాములు ఇద్దరూ ఒకరినొకరు నిందించుకుంటే, ఇది అస్సలు పనిచేయదు. ఒక భాగస్వామి తనపై తాను పనిచేస్తూ, ఇంకొకరు నిందలు వేస్తుంటే అప్పుడు అది కూడా పనిచేయదు. మనం ఇప్పటికే అవతలి వ్యక్తి ఆరోపిస్తున్న సంబంధంలో ఉంటే, ఏమి సహాయం అందిస్తున్నామో అని చూసుకుంటూ ఉంటే, అప్పుడు దీని అర్థం మనం ఈ సంబంధాన్ని విడగొట్టేయాలని కాదు, కానీ ఇది చాలా కష్టమైన పని అని అర్ధం. ఈ అనుబంధంలో మనం ఒక మిగిలిపోయిన వ్యక్తిగా కాకుండా ఉండటానికి ప్రయత్నించాలి: "నేను వీటన్నిటినీ భరిస్తున్నాను! ఇది చాలా కష్టంగా ఉంది!" అనే విషయం చాలా భయంకరంగా ఉంటుంది.
ప్రేరణను పొందడం
బౌద్ధ మార్గం అంత సులభమైనది కాదు. ఇది జీవితం యొక్క వికృతతతో వ్యవహరిస్తుంది. ముందుకు వెళ్ళడానికి మనకు ఒక రకమైన బలం అవసరం; మనకు ఒక స్థిరమైన ప్రేరణ అవసరం. మన ప్రేరణకు కారణం మంచి విషయాల గురించి అద్భుతమైన కథలను చెప్పే ఉపాధ్యాయులు అయితే - అప్పుడు అది ఒక స్థిరమైన ప్రేరణగా ఉండదు. ఇది ఖచ్చితంగా చాలా ఉత్తేజ కరంగా ఉండాలి. కానీ ఇది మనల్ని ఎలా ప్రభావితం చేస్తుందో పరిశీలించాలి. చాలా మందిలో, అద్భుతాల ద్వారా మోక్షాన్ని కోరుకునే ఫాంటసీ ప్రపంచాన్ని ఇది సృష్టిస్తుంది. ఏదో ఒక మహా మాంత్రికుడు తన అద్భుత శక్తులతో మనల్ని కాపాడబోతున్నాడని, లేదా ఈ అద్భుతాలను మనమే అభివృద్ధి చేసుకోగలుగుతామని మనం ఊహించుకుంటూ ఉంటాం. ఈ అద్భుతమైన కథల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి మన విశ్వాసాన్ని ప్రేరేపించవచ్చు, మరియు సహాయకారిగా ఉండవచ్చు, కానీ ఇది ప్రేరణకు ఒక స్థిరమైన ఆధారం కాదు. మనకు ఒక స్థిరమైన ఆధారం అవసరం.
దీనికి సరైన ఉదాహరణ బుద్ధుడే. బుద్ధుడు అద్భుతమైన కథలను చెప్పి ప్రజలను "ప్రేరేపించడానికి" లేదా వారిని ఆకట్టుకోవడానికి ప్రయత్నించలేదు. అన్ని చోట్లా తిరుగుతూ ప్రజలకు అలాంటి విషయాలను చెప్పలేదు. బుద్ధుడు ఉపయోగించిన సంబంధం, బౌద్ధ బోధనలు అంతటా రిపీట్ చెయ్యబడింది, బుద్ధుడు ఒక సూర్యుడితో సమానం. సూర్యుడు ప్రజలను వేడిగా ఉంచడానికి ప్రయత్నించడు. సహజంగా, సూర్యుడు అలానే వేడిగా ఉంటాడు కాబట్టి, ప్రతి ఒక్కరికి వెచ్చదనం కలుగుతుంది. ఒక అద్భుతమైన కథను వింటూ తలపై విగ్రహంతో తాకడం లేదా మెడలో ఎర్రటి తీగను కట్టుకోవడం ద్వారా మనం ప్రేరణను పొందినా, అది ఎక్కువ రోజులు ఉండదు. ఒక వ్యక్తిగా ఉపాధ్యాయుడు సహజంగానే ప్రేరణను కలిగించే వ్యక్తి - అతని లేదా ఆమె స్వభావం, బౌద్ధమత బోధనలను ఆచరించడం నుంచి వచ్చింది. ఇదే మనకు ప్రేరణను ఇస్తుంది. మనల్ని ఎంటర్ టైన్ చేయడానికి ఆ వ్యక్తి చేసే పనులు కాదు. ఇది ఒక అద్భుతమైన కథ లాగా ఉత్తేజకరమైనది కాకపోవచ్చు, కానీ ఇది మనకు మంచి ప్రేరణను ఇస్తుంది.
జీవితంలో మన స్వంత స్వభావం నుంచే ప్రేరణను పొందవచ్చు - అద్భుత శక్తులను పొందడం నుంచి కాకుండా, మనం ఎలా మారుతూ ఉంటామో అని. బోధనలు ఎప్పుడూ మన స్వంత సానుకూల చర్యలలో ఆనందాన్ని తెచ్చిపెడతాయి. ప్రోగ్రెస్ అనేది ఎప్పుడూ పెరుగుతూనే ఉండదని మనం గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఇది ప్రతిరోజూ మెరుగుపడటమే కాదు. ఈ జీవితం యొక్క లక్షణాలలో ఒక విషయం ఏమిటంటే, నియంత్రణలో లేని మళ్ళీ వచ్చే సమస్యల నుంచి పూర్తిగా విముక్తి పొందే వరకు మన మనోభావాలు మారుతూ ఉంటాయి. ఇది నమ్మశక్యం కాని ఒక అధునాతన పరిస్థితి. మనం కొన్నిసార్లు సంతోషంగా ఉంటాం, కొన్నిసార్లు విచారంగా ఉంటామని అనుకోవాలి. మనం కొన్నిసార్లు సానుకూల మార్గాల్లో వ్యవహరించగలుగుతాము మరియు ఇతర సమయాల్లో మన న్యూరోటిక్ అలవాట్లు మించిపోతాయి. అవి పద్దాక మారుతూ ఉంటాయి. సాధారణంగా అద్భుతాలు జరగవు.
జీవితంలోని ఎనిమిది తాత్కాలిక విషయాలలో అసౌకర్యాన్ని నివారించడంపై బోధనలు సరిగ్గా జరిగితే సంతోష పడతాం అలా జరగకపోతే ఇబ్బంది పడతాం. అదే జీవితం అంటే. మనం స్వల్పకాలిక ప్రభావాలను కాకుండా దీర్ఘకాలిక ప్రభావాలను గురించి ఆలోచించాలి. ఉదాహరణకు పోయిన ఐదేళ్ల క్రితంతో పోలిస్తే వచ్చే ఐదేళ్లు కోసం కష్టపడుతూ ఉంటే ఎంతో కొంత పురోగతి ఉంటుంది. మనం కొన్నిసార్లు బాధ పాడినప్పుడు, ప్రశాంతమైన, స్పష్టమైన మనస్సులు మరియు హృదయాలతో పరిస్థితులను నిర్వహించగలుగుతున్నామని కనిపెడితే, అది మనం కొంత పురోగతి సాధించామని సూచిస్తుంది. ఇది చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఇది నాటకీయమైనది కాదు, కానీ అలానే ఉండాలని మనం కోరుకుంటున్నాము. మనం ఇలాంటి నాటకీయ ప్రదర్శనల కోసం ఉత్తేజాన్ని ప్రదర్శిస్తాము. ఇది ఒక స్థిరమైన ప్రేరణ.
ఆచరణాత్మకంగా ఉండటం
మనం చాలా ఆచరణాత్మకంగా మరియు మంచిగా ఉండాలి. ఉదాహరణకు, మనం శుద్ధి అభ్యాసాలు చేసేటప్పుడు, దానిని ఏదో ఒక బయట వ్యక్తిగా, ఒక గొప్ప సాధువుగా, మన పాపాలను క్షమించే వ్యక్తిగా భావించకపోవడం చాలా ముఖ్యం. బౌద్ధమతంలో మనల్ని రక్షించి, మంచిగా ఆశీర్వదించే సాధువులు లేరు. ఇది ఆ ప్రక్రియ అస్సలు కాదు. మన మనస్సులు సహజంగానే స్వచ్ఛంగా ఉంటాయనే విషయమే మనల్ని పరిశుద్ధుడిగా చేస్తుంది. వాళ్లు సహజంగా ఇబ్బందులతో నిండి ఉండరు; మనం ఇబ్బందులను తొలగించుకోవచ్చు. మన స్వంత ప్రయత్నాల ద్వారా మనస్సు యొక్క సహజ స్వచ్ఛతను గుర్తించడం ద్వారానే మనం అవమానం, ప్రతికూల సామర్థ్యాలను వదిలించుకోవచ్చు. అలా ఈ శుద్ధి ప్రక్రియ మంచిగా జరుగుతుంది.
అలాగే, ఈ అభ్యాసాలన్నింటినీ చేయడంలో మరియు బౌద్ధమత బోధనలను మన రోజువారీ జీవితంలో అన్వయించడంలో మనం ఏ స్థాయిలో ఉన్నామో గుర్తించాలి. మనం ఇప్పుడున్న దాని కంటే ఉన్నత స్థాయిలో ఉన్నామని భావించడం చాలా ముఖ్యం.
కాథలిక్ నేపథ్యం నుంచి బౌద్ధమతాన్ని అనుసరించడం
ఉదాహరణకు, బౌద్ధమతం పట్ల ఆసక్తి చూపే కొంతమంది కాథలిక్ నేపథ్యం నుంచి వచ్చి ఉండొచ్చు. అలాంటప్పుడు మనం బౌద్ధమతం గురించి తెలుసుకుని అధ్యయనం చేయడం మొదలుపెడితే, మనం కాథలిజం వదిలేసి బౌద్ధమతంలోకి మారాలని భావించాల్సిన అవసరం లేదు. అయితే, ఈ రెండు పద్ధతులను కలపకపోవడం చాలా ముఖ్యం. మనం చర్చిలో కూర్చొనే ముందు దీపానికి మూడు సార్లు సాష్టాంగ నమస్కారం చెయ్యము. అలాగే, మనం ఒక బౌద్ధమత అభ్యాసం చేసేటప్పుడు, మనం ఆ వర్జిన్ మేరీని ఉహించుకోము, బుద్ధుడిని ఊహించుకుంటాము. మనం ఒక్కొక్కటి విడివిడిగా ప్రాక్టీస్ చేస్తాం. మనం చర్చికి వెళ్ళినప్పుడు, మనం చర్చికి మాత్రమే వెళ్తాము; మనం ఒక బౌద్ధమత ధ్యానం చేస్తున్నప్పుడు, మనం ఆ ధ్యానం మాత్రమే చేస్తాము.
ప్రేమకు ప్రాధాన్యత ఇవ్వడం, ఇతరులకు సహాయం చేయడం వంటి అనేక సాధారణ లక్షణాలు ఉన్నాయి. ప్రాథమిక స్థాయిలో ఎలాంటి విభేదాలు ఉండవు. మనం ప్రేమను, డబ్బులు ధర్మం చెయ్యడాన్ని, ఇతరులకు సహాయం చెయ్యడాన్ని ఆచరిస్తే, మనం ఒక మంచి కాథలిక్ మరియు మంచి బౌద్ధులం అవుతాము. అయితే, చివరికి, మన౦ ఒక దాన్ని ఎంచుకోవాల్సి ఉ౦టు౦ది, కానీ అది అద్భుతమైన ఆధ్యాత్మిక పురోగతిని సాధి౦చడానికి మన౦ బాగా కష్టపడటానికి సిద్ధ౦గా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. మనం ఒక బిల్డింగ్ యొక్క పై అంతస్తుకు వెళ్తుంటే, మనం ఒకేసారి రెండు వైపుల ఉన్న మెట్లను ఒకేసారి ఎక్కలేము. మనం కేవలం లాబీలోనే పనిచేస్తే అప్పుడు పర్వాలేదు. దాని గురించి మనం ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు. మనం ఈ రెండింటి నుంచి ప్రయోజనాన్ని పొందవచ్చు.
తప్పుడు విశ్వసనీయతను నివారించడం
బౌద్ధమతాన్ని మన జీవితాలకు అన్వయించుకొనేటప్పుడు, మన స్థానిక మతాలను చెడ్డవిగా లేదా తక్కువగా చూడకుండా జాగ్రత్త పడాలి. అది ఒక పెద్ద తప్పు. అప్పుడు మన౦ మతోన్మాది బౌద్దులుగా, మతోన్మాది కాథలిక్ వ్యతిరేకులుగా మారవచ్చు. ఉదాహరణకు కమ్యూనిజం, ప్రజాస్వామ్యంతో కూడా ప్రజలు ఇలా చేస్తారు. తప్పుడు విధేయత అని పిలువబడే ఒక మానసిక పద్ధతి ఆక్రమిస్తుంది. మన కుటుంబాలు, మన పద్ధతులు మొదలైన వాటికి కట్టుబడి ఉండాలని ఉంటుంది, కాబట్టి మనం దానిని తిరస్కరించినా కానీ కాథలిక్ మతానికి కట్టుబడి ఉండాలనుకుంటున్నాము. మన పద్ధతులకు నమ్మక ద్రోహులుగా ఉండి, వాటిని సరిగ్గా అనుసరించకుండా తిరస్కరిస్తే, మనం పూర్తిగా చెడ్డ వాళ్లమని అనుకోవాల్సి వస్తుంది. ఇది చాలా అసౌకర్యంగా ఉన్నందుకు, మనకు తెలియకుండానే మన పద్ధతులలో నమ్మకంగా ఉండగలిగే దాన్ని కనిపెట్టాల్సిన అవసరం ఉందని భావిస్తాము.
మన పద్ధతుల యొక్క కొన్ని తక్కువ ప్రయోజనకరమైన అంశాలకు నమ్మకంగా ఉండాలనే ధోరణి మనకు తెలియకుండానే వచ్చేస్తుంది. ఉదాహరణకు, మన౦ కాథలిక్ మతాన్ని తిరస్కరి౦చవచ్చు, కానీ మన౦ బౌద్ధమత౦లోని నరక౦ గురి౦చి ఒక రకమైన భయాన్ని పెంచుకుంటాం. నా స్నేహితురాలైన ఒక ఆమె కాథలిక్, ఆమె బౌద్ధమతంలోకి మారింది, ఆ తర్వాత ఆమె ఇలా అనుకున్నది, "నేను కాథలిక్ మతాన్ని విడిచిపెట్టాను, కాబట్టి ఇప్పుడు నేను కాథలిక్ నరకానికి వెళ్తాను; కానీ నేను బౌద్ధ మతాన్ని విడిచిపెట్టి కాథలిక్ మతంలోకి వెళితే, నేను బౌద్ధమత నరకానికి వెళ్తాను!" అని అంది. ఇది వినటానికి చాలా తమాషాగా అనిపించినా, ఇది నిజంగా ఆమెకు పెద్ద సమస్యగా మారింది.
మనకు తెలియకుండానే కాథలిక్ మతం నుంచి కొన్ని పద్ధతులు మన బౌద్ధమత ఆచరణలోకి తెచ్చుకుంటాము. అత్యంత సాధారణమైనవి అపరాధ భావం, అద్భుతాల కోసం వేచి చూడటం మరియు ఇతరులు మనల్ని కాపాడుతారని కోరుకోవడం. మనం ప్రాక్టీస్ చేయకపోతే, ప్రాక్టీస్ చేయాలని అనుకుంటాము. మనం అలా చెయ్యకపోతే, దోషులుగా భావిస్తాము. ఈ ఆలోచనలు అసలు మనకు ఏమాత్రం ఉపయోగపడవు. మన పద్ధతులను పరిశీలించి పాజిటివ్ అంశాలను గుర్తించాలి. అలా మనం నెగెటివ్ లక్షణాలకు కాకుండా పాజిటివ్ లక్షణాలకు కట్టుబడి ఉండగలం. "నేను అపరాధాన్ని, అద్భుతమైన అన్వేషణను వారసత్వంగా పొందాను" అని అనుకునే బదులు, "ప్రేమ, దాతృత్వం మరియు లేనివాళ్లకు సహాయం చేసే కాథలిక్ సంప్రదాయాన్ని పొందాను" అని మనం అనుకోవచ్చు.
మన కుటుంబాల విషయంలోనూ అలాగే చేయవచ్చు. మన౦ వాటిని తిరస్కరి౦చవచ్చు, ఆ తర్వాత వారి నెగెటివ్ సంప్రదాయాలను అంతగా పట్టించుకునే బదులు వారి పాజిటివ్ సంప్రదాయాలను పట్టించుకుని నమ్మక౦గా ఉ౦డవచ్చు. ఉదాహరణకు, వాళ్ళు మనకు ఇచ్చిన కాథలిక్ పద్ధతులకు మన౦ ఎ౦తో కృతజ్ఞులమని ఒప్పుకుంటే, అప్పుడు మన గత౦ గురి౦చి ఆలోచించకుండా, మన ప్రోగ్రెస్ కి అసలు హాని కలిగించే నెగెటివ్ భావాలు లేకుండా మన స్వ౦త మార్గాల్లో మనం వెళ్లిపోవచ్చు.
దీని యొక్క మానసిక ప్రామాణికతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం. మన గతం గురించి - మన కుటుంబాలు, మన మతాలను లేదా మిగతా వాటి గురించి నెగెటివ్ గా ఆలోచిస్తే, మన పట్ల మనకే నెగెటివ్ గా అనిపిస్తుంది. మరోవైపు, మన పద్ధతులు మరియు మన గతంలోని పాజిటివ్ విషయాలను మనం గుర్తించగలిగితే, మన పట్ల మనకే మంచి అభిప్రాయం ఉంటుంది. అది మన ఆధ్యాత్మిక మార్గాల్లో ఎక్కువ స్థిరంగా ఉండటానికి సహాయపడుతుంది.
సారాంశం
మనం మెల్లగా, దశల వారీగా ముందుకు వెళ్ళాలి. మనం చాలా అధునాతన బోధనల గురించి విన్నప్పుడు లేదా చదివినప్పుడు, "మీరు ఒక బోధనను విన్న వెంటనే, దానిని ఆచరణలో పెట్టండి" అని గతంలోని గొప్ప గురువులు చెప్పినప్పటికీ, అది మనకు చాలా అధునాతనమైనదా లేదా అది ఇప్పుడు ఆచరణలో పెట్టగలిగేదా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. అది అంత అధునాతనమైతే, దాన్ని ఆచరణలో పెట్టడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవడానికి తీసుకోవాల్సిన పనులను గ్రహించి, ఆ తర్వాత వాటిని అనుసరించాలి. వివరంగా చెప్పాలంటే, నా గురువులలో ఒకరైన గెషె గావాంగ్ ధార్గే చెప్పినట్లుగా, "మనం ఫాంటసీ పద్ధతులను ఆచరిస్తే, మనకు ఊహాజనిత ఫలితాలు దక్కుతాయని; మనం ప్రాక్టికల్ పద్ధతులను పాటిస్తే మనకు ప్రాక్టికల్ ఫలితాలు వస్తాయని చెప్తూ ఉంటారు."