బౌద్ధమతాన్ని మన జీవితాలలో ఇంటిగ్రేట్ చేసుకోవడం

14:18
ధర్మం అంటే ఒక నివారణ చర్య అని అర్థం. మనకు సమస్యలు రాకుండా ఉండేందుకు మనం చేసే ఒక పని.

జీవితంలోని సమస్యలను ఎదుర్కోవడానికే ధర్మం ఉంది

ధర్మ సాధనలో మనల్ని మనం నిమగ్నం చేసుకోవాలంటే ముందు మనం చేయాల్సిన మొదటి పని మన జీవితంలో మనకు ఉన్న వివిధ రకాల సమస్యలు లేదా ఇబ్బందులను గుర్తించడం. ఆ తర్వాత ఈ సమస్యల నుంచి బయటపడటానికి సహాయపడే ధర్మ అభ్యాసం చెయ్యడం.

ధర్మ సాధన అంటే కేవలం మంచి అనుభూతిని పొందడం, లేదా మంచి అభిరుచిని కలిగి ఉండటం లేదా ట్రెండీగా ఉండటం కాదు. ధర్మ సాధన మన సమస్యల నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. అంటే ధర్మాన్ని నిజంగా ఆచరించాలంటే, అది అంత సులభమైన ప్రక్రియ కాదని మనం గ్రహించాలి. మన జీవితాల్లోని ఇబ్బందులను, సమస్యల నుంచి పారిపోకుండా, వాటిని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్నామనే ఆలోచనతో ఉండాలి.

మన సమస్యలు అనేక రూపాల్లో ఉంటాయి. మనలో చాలా మందికి అవి తెలుసు - మనకు అభద్రతా భావం ఉంటుంది; ఇతరులతో మనకు ఇబ్బందులు ఉన్నాయి; మనం దూరమయ్యామని అనుకుంటూ ఉంటాం; మన భావోద్వేగాలు మరియు ఫీలింగ్స్ తో మనకు ఇబ్బందులు వస్తాయి – ఇవన్నీ మనందరికీ ఉండే సాధారణ సమస్యలే. మన కుటుంబాలతో మరియు మన తల్లిదండ్రులతో మనకు సమస్యలు వస్తాయి; వాళ్ళకు అనారోగ్యం వస్తుంది మరియు ముసలివాళ్లు  అవుతారు. మన స్వంత అనారోగ్యాలు మరియు వృద్ధాప్యాన్ని ఎదుర్కోవడంలో మనకు ఇబ్బందులు వస్తాయి. మనం యువకులం అయితే, మన జీవితాలతో మనం ఏమి చేయబోతున్నామో, ఎలా జీవించాలో, ఏ దిశలో వెళ్లాలో గుర్తించడంలో ఇబ్బందులు పడతాము. మనం ఇలాంటి వాటి గురించి ఆలోచించాలి.

Top